చైనా కంపెనీకి భారత రైల్వే చక్రాల కాంట్రాక్ట్‌ | Indian Railways Order For 39,000 Wheels For Lhb Coaches From Chinese Manufacturer Taiyuan | Sakshi
Sakshi News home page

చైనా కంపెనికీ ఇండియన్‌ రైల్వేస్‌ చక్రాల కాంట్రాక్ట్‌

Published Fri, Jul 22 2022 9:22 AM | Last Updated on Fri, Jul 22 2022 10:49 AM

Indian Railways Order For 39,000 Wheels For Lhb Coaches From Chinese Manufacturer Taiyuan  - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా భారత్‌.. చైనాతో వ్యాపార కార్యకలాపాల్ని పున:ప్రారంభించింది. ఇండియన్‌ రైల్వేలో ఎల్‌హెచ్‌బీ(Link-Hofmann-Busch) కోచెస్‌కు కావాల్సిన 39,000 వీల్స్‌ను చైనా నగరం తైయువాన్‌కు చెందిన ఓ సంస్థకు ప్రాజెక్ట్‌ను అప్పగించింది.  

సాధారణంగా ఇండియన్‌ రైల్వేకు కావాల్సిన ట్రైన్‌ విడి భాగాల్ని ఉక్రెయిన్‌ నుంచి కొనుగోలు చేస్తుంది. కానీ యుద్ధం కారణంగా అది కష్టతరంగా మారింది. ఈ తరుణంలో రైల్వే ఎల్‌హెబీ కోచ్‌ ఒక్కో చక్రంపై 1.68శాతం తక్కువకే కొనుగోలు చేసేలా కేంద్రం..చైనాకు ఈ ప్రాజెక్ట్‌ను ఇచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌ సభలో స్పందించారు. 

'సరిహద్దు వివాదం కారణంగా ఇండియన్‌ రైల్వే, డ్రాగన్‌ కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే అనేక ఆర్డర్‌లను రద్దు చేసింది. గతంలో రైల్వేకు సంబంధించిన విడిభాగాల్ని ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకోనే వాళ్లం. కానీ ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా అలా సాధ్యపడడం లేదని' అశ్విని వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌కు కావాల్సిన చక్రాల కొరత ఎక్కువగా ఉంది. ఆ కొరతను అధిగమించేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించాయి. ఇందులో భాగంగా హాంకాంగ్‌కు చెందిన ట్రైన్‌ చక్రాల తయారీ సంస్థ ఎం/ఎస్‌ టీజెడ్‌ (M/s TZ (Taizhong)కు, చైనాకు చెందిన  ఎం/ఎస్‌ తైయువాన్ హెవీ ఇండస్ట్రీస్(M/s Taiyuan)కు ఆర్డర్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లంటే..
లింక్‌ హోఫ్‌మన్‌ బుష్‌కు సంక్షిప్త పదమే ఎల్‌హెచ్‌బీ. ఈ ఎల్‌హెచ్‌బీ అనేది జర్మన్‌ టెక్నాలజీ తయారీదారు పేరు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల రైళ్లకు ఉపయోగించే కోచ్‌లను ఇటీవల కాలంలో ఈ ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో ఇండియాలోనే రైల్‌ కోచ్‌ ప్యాక్టరీ కపుర్తలా, ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ చెన్నై, మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ రాయ్‌బరేలిలలో తయారు చేస్తున్నారు. ఈ కోచ్‌లు మనదేశంలో సుమారుగా 2000 సంవత్సరం నుంచి వినియోగిస్తున్నారు. భారతీయ రైల్వే ప్రారంభంలో 24 ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంది.

ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం 
ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు తక్కువ బరువు ఉండడంతో గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటీకి ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160 కి.మీల వేగంతో ప్రయాణించే విధంగా నడుపుతున్నారు. ఇవే పాత కోచ్‌లైతే కేవలం గంటకు110 కి.మీ గరిష్ట వేగంతో మాత్రమే నడిచేవి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement