భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న నాటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారత్.. చైనాకు తగిన గుణపాఠం చెబుతూ వస్తోంది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ ఆర్ధిక మూలాల్ని దెబ్బ కొట్టేలా యాప్స్‌పై నిషేధం, స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై నిఘూతో పాటు, ఆదేశానికి తరలి వెళ్లే పెట్టుబడుల్ని తనవైపు తిప్పుకునేలా చేసుకుంది భారత్. ఈ కార్యకలాపాలన్నీ సొంతం దేశం నుంచే చేస్తోంది. తాజాగా, విదేశీ గడ్డపై భారత్ తన ప్రతిభాపాటవాలతో చైనాను మరింత ఇరుకున పెట్టేలా అసామాన్య దేశంగా ఎదుగుతూ ప్రశంసలందుకుంటుంది. తాజాగా..
ప్రతి ఏడాది జర్మనీలో ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జర్మనీలోని నురేమ్బెర్గ్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు బొమ్మల ప్రదర్శన జరిగింది. ఈ టాయ్ ఫెయిర్‌కి ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా బొమ్మల తయారీ సంస్థలు పాల్గొన్నాయి. తయారు చేసిన బొమ్మల్ని ప్రదర్శనకు ఉంచాయి.
ఈ బొమ్మల ప్రదర్శనకు భారత్, అమెరికా, యూరప్ దేశాలతో పాటు ప్రపంచంలోనే బొమ్మల తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు చెందిన కంపెనీలు సైతం పాల్గొన్నాయి. అయితే, ఇక్కడే ప్రపంచ దేశాల ఎదుట చైనా పరువును భారత్ తీసేసింది. అన్నీ రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న భారత్ బొమ్మల తయారీ రంగంలో తమకు సాటిలేదని నిరూపించింది. ఆ బొమ్మల ప్రదర్శనలో పాల్గొన్న పదుల సంఖ్యలో దేశాలు అక్కడ ప్రదర్శనకు పెట్టే బొమ్మల్ని పరిశీలిస్తాయి. తమకు ఆ బొమ్మలు కావాలని భారీ మొత్తంలో కొనుగోలుకు పెట్టుబడులు పెడతాయి.
గతంలో బొమ్మల ప్రదర్శనలో చైనా బొమ్మలకు ఓ ప్రత్యేకత. అందుకే పలు దేశాలు చైనా బొమ్మలు తమకు కావాలని, ఆ బొమ్మల్ని కొనుగోలు చేయడం, లేదంటే బొమ్మల తయారీ కంపెనీలతో భాగస్వామ్యంలో టాయ్‌లను తయారు చేసేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
అంతర్జాతీయ టాయ్ ఫెయిర్‌లో భారతీయ సంస్థలు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి. దీంతో చైనాను కాదని భారత్ సంస్థలు తయారు చేసిన బొమ్మల్ని కొనుగోలు చేసేందుకు అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికా వరకు అందరూ భారత్ తయారు చేసిన బొమ్ములు కావాలని భారీ మొత్తంలో ఆర్డర్లు పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రంగా వాటిల్లో చైనాలో స్థానికంగా బొమ్మల్ని అమ్మే సంస్థలు సైతం ఉండడం గమనార్హం. అవి సరిపోవన్నట్లు ఆరేళ్ల క్రితం భారత్‌కు తమకు అనువైన ప్రాంతం కాదని చైనాకు వెళ్లిన కంపెనీలు తిరిగి వెనక్కి వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment