toy
-
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్‌నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్‌పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!
ఆటబొమ్మలతో ఆడుకోవడం పిల్లలందరికీ ఇష్టమైన వ్యాపకం. ప్రపంచంలోని ప్రతిచోటా పిల్లలందరూ ఆటబొమ్మలను ఇష్టపడతారు. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులనే ఆటబొమ్మలుగా మలచుకుని, వాటితో ఆటలాడుకుంటారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి రకరకాల రంగురంగుల ఆటబొమ్మలను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు. ఆటబొమ్మలపై పిల్లలకు ఉండే సహజ వ్యామోహం కొందరికి వ్యాపారావకాశం కూడా! పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటబొమ్మలను అమ్మే దుకాణాలు వెలిశాయి. వీటిలో అత్యంత పురాతనమైనది ‘హామ్లీస్’ టాయ్ స్టోర్. బ్రిటిష్ రాజధాని లండన్ నగరంలో ఉందిది. విలియమ్ హామ్లీ అనే ఆసామి 1760లో లండన్‌లోని హై హాల్‌బోర్న్ వీ«థిలో దీనిని నెలకొల్పాడు. తర్వాత కొద్దికాలానికే రీజెంట్ స్ట్రీట్‌కు దుకాణాన్ని తరలించాడు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదయిన ఆటబొమ్మల దుకాణంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కడం విశేషం. మొదట్లో ఇది ఒకే దుకాణంగా మొదలైనా, తర్వాతి కాలంలో శాఖోపశాఖలుగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా దీని శాఖలు ఉన్నాయి. తరతరాలుగా బ్రిటిష్ రాచకుటుంబానికి అభిమాన ఆటబొమ్మల దుకాణంగా ఉన్న ‘హామ్లీస్’ చేతులు మారి, ప్రస్తుతం రిలయన్స్ రీటెయిల్ కంపెనీ చేతిలోకి వచ్చింది.‘హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్’కు చెందిన వందశాతం వాటాలను రిలయన్స్ రీటెయిల్ కంపెనీ 2019లో సొంతం చేసుకుంది. రీజెంట్ స్ట్రీట్‌లోని ‘హామ్లీస్’ స్టోర్ 2010లో తన 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ‘హామ్లీస్’కు బ్రిటన్‌లో 11 శాఖలు, మిగిలిన దేశాల్లో 90 శాఖలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దుకాణంలో దొరకని ఆటబొమ్మలు అరుదు. (చదవండి: -
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మను ఎప్పుడైనా చూశారా!
ఆటబొమ్మల ఖరీదు ఎంత ఉంటుంది? పది రూపాయల నుంచి కొన్ని వందల రూపాయల్లో రకరకాల ఆటబొమ్మలు దొరుకుతాయి. మరీ ఖరీదైన ఆటబొమ్మలైనా సరే, కొన్ని వేల రూపాయలకు మించి ఉండవు.ఇది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మ. ఇది అలాంటిలాంటి ఆటబొమ్మ కాదు, టాయ్ రోబో! పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘గింజా తనాకా’, ఆటబొమ్మల తయారీ సంస్థ ‘బందాయి కంపెనీ’ కలసి ఈ టాయ్ రోబోను రూపొందించాయి. జపానీస్ సూపర్‌హిట్ కార్టూన్ సీరియల్ ‘గండామ్’లో కథానాయక పాత్ర పోషించిన రోబో నమూనాను అచ్చంగా పోలి ఉండేలా దీన్ని తీర్చిదిద్దాయి. ఈ రోబో ఎత్తు పదమూడు సెంటీమీటర్లు, బరువు 1.400 కిలోలు ఈ టాయ్ రోబో కూడా అసలు సిసలు రోబోల మాదిరిగా కొన్ని పనులు చేయగలదు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ఆటపాటలతో పిల్లలను అలరించగలదు. ఈ టాయ్ రోబో తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు 41,468 డాలర్లు (రూ.34.69 లక్షలు)ఇవి చదవండి: కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు! -
భారత్ ముందే కుప్పిగంతులా?.. విదేశీ గడ్డపై చైనాకు భారీ షాక్!
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న నాటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి భారత్.. చైనాకు తగిన గుణపాఠం చెబుతూ వస్తోంది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ ఆర్ధిక మూలాల్ని దెబ్బ కొట్టేలా యాప్స్‌పై నిషేధం, స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై నిఘూతో పాటు, ఆదేశానికి తరలి వెళ్లే పెట్టుబడుల్ని తనవైపు తిప్పుకునేలా చేసుకుంది భారత్. ఈ కార్యకలాపాలన్నీ సొంతం దేశం నుంచే చేస్తోంది. తాజాగా, విదేశీ గడ్డపై భారత్ తన ప్రతిభాపాటవాలతో చైనాను మరింత ఇరుకున పెట్టేలా అసామాన్య దేశంగా ఎదుగుతూ ప్రశంసలందుకుంటుంది. తాజాగా.. ప్రతి ఏడాది జర్మనీలో ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్ జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జర్మనీలోని నురేమ్బెర్గ్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు బొమ్మల ప్రదర్శన జరిగింది. ఈ టాయ్ ఫెయిర్‌కి ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా బొమ్మల తయారీ సంస్థలు పాల్గొన్నాయి. తయారు చేసిన బొమ్మల్ని ప్రదర్శనకు ఉంచాయి. ఈ బొమ్మల ప్రదర్శనకు భారత్, అమెరికా, యూరప్ దేశాలతో పాటు ప్రపంచంలోనే బొమ్మల తయారీలో అగ్రస్థానంలో ఉన్న చైనాకు చెందిన కంపెనీలు సైతం పాల్గొన్నాయి. అయితే, ఇక్కడే ప్రపంచ దేశాల ఎదుట చైనా పరువును భారత్ తీసేసింది. అన్నీ రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న భారత్ బొమ్మల తయారీ రంగంలో తమకు సాటిలేదని నిరూపించింది. ఆ బొమ్మల ప్రదర్శనలో పాల్గొన్న పదుల సంఖ్యలో దేశాలు అక్కడ ప్రదర్శనకు పెట్టే బొమ్మల్ని పరిశీలిస్తాయి. తమకు ఆ బొమ్మలు కావాలని భారీ మొత్తంలో కొనుగోలుకు పెట్టుబడులు పెడతాయి. గతంలో బొమ్మల ప్రదర్శనలో చైనా బొమ్మలకు ఓ ప్రత్యేకత. అందుకే పలు దేశాలు చైనా బొమ్మలు తమకు కావాలని, ఆ బొమ్మల్ని కొనుగోలు చేయడం, లేదంటే బొమ్మల తయారీ కంపెనీలతో భాగస్వామ్యంలో టాయ్‌లను తయారు చేసేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అంతర్జాతీయ టాయ్ ఫెయిర్‌లో భారతీయ సంస్థలు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి. దీంతో చైనాను కాదని భారత్ సంస్థలు తయారు చేసిన బొమ్మల్ని కొనుగోలు చేసేందుకు అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికా వరకు అందరూ భారత్ తయారు చేసిన బొమ్ములు కావాలని భారీ మొత్తంలో ఆర్డర్లు పెట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విచిత్రంగా వాటిల్లో చైనాలో స్థానికంగా బొమ్మల్ని అమ్మే సంస్థలు సైతం ఉండడం గమనార్హం. అవి సరిపోవన్నట్లు ఆరేళ్ల క్రితం భారత్‌కు తమకు అనువైన ప్రాంతం కాదని చైనాకు వెళ్లిన కంపెనీలు తిరిగి వెనక్కి వస్తున్నాయి. -
బాలికను కాటేసిన జింక బొమ్మ
కర్ణాటక: శివమొగ్గ నగరంలో డ్రైనేజీ కాలువపై నిలబడి ఉండగా స్లాబు కూలి వ్యక్తి మరణించిన సంఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ముద్దనకొప్పలో ఉన్న ట్రీ పార్క్‌లో సిమెంటు జింక బొమ్మపై కూర్చుని బాలిక ఆడుకుంటుండగా జింక విరిగిపడి బాలిక నిమిషాల్లోనే మరణించింది. వాకింగ్ వస్తే.. వివరాలు.. గాంధీ బజార్ రోడ్డులో బట్టల షాపు యజమాని అయిన హరీష్ అంబోరె, లక్ష్మీ దంపతుల కుమార్తె సమీక్ష (6), లక్ష్మీ, కూతురుతో కలిసి ఆదివారం సాయంత్రం పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చారు. ఈ సమయంలో సమీక్ష అక్కడ ఉన్న జింక బొమ్మపై కూర్చుంది. ఇంతలో ఆ బొమ్మ కూలిపోవడంతో కిందపడ్డ సమీక్ష తీవ్ర గాయాలపాలైంది. హఠాత్ పరిణామంతో లక్ష్మీ కేకలు వేస్తూ కూతురిని మెగ్గాన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె చేతుల్లో చిన్నారి కన్నుమూసింది. కలెక్టరేట్ ముందు నిరసన ఈ నేపథ్యంలో మంగళవారం భావసార క్షత్రియ మహాజన సమాజం నేతలు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. పార్కులో నాసిరకం నిర్మాణాలే ఈ ఘోరానికి కారణమని, అనేక బొమ్మలు శిథిలమైనట్లు తెలిపారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. చేయని తప్పుకి బాలిక చనిపోయిందని, ఆ కుటుంబానికి పరిహారం అందజేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు పాతిక ఎకరాల్లో ఉన్న పార్కును అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. -
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్‌గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్‌ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్‌లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
విందు కోసం హారన్ కొట్టు.. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం..
న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. ఇన్స్ట్రా గామ్‌లో హల్చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్. దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు. చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు -
జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
మీరెప్పుడూ చూడని గ్రేట్ ఖలీ రైడింగ్ వీడియో.. ఓ లుక్కేసుకోండి!
Khali Royal Enfield Riding: బాక్సింగ్ గురించి తెలిసినవారికి ప్రత్యేకంగా 'గ్రేట్ ఖలీ' (Great Khali) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెజ్లింగ్ అరేనాలో పాల్గొన్న భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచిన ఈయన రిటైర్ అయిన తరువాత ఇండియాకి తిరిగి వచ్చేసాడు. అప్పటి నుంచి కొన్ని టీవీ యాడ్స్‌లో నటించడం, 2015లో పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ స్కూల్ ప్రారంభించడం వంటివి చేసి కాలం గడుపుతున్నారు. ఇటీవల ఖలీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదలైన ఒక వీడియోలో ఖలీ 'రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్' నడపడం చూడవచ్చు. ఈ సంఘటన చూడటానికి బొమ్మ బైకుపై ఆజానుబాహుడున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. అత్యంత బరువైన బైకుల్లో ఒకటైన బుల్లెట్ ఖలీ ముందు చిన్న బైకుగా మారిపోయింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది దీనిని లైక్ చేశారు. కొంత మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఖలీ బైకుని రైడ్ చేస్తూ కనిపించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఇంటర్‌సెప్టర్ 650, బుల్లెట్, హీరో స్ప్లెండర్, బజాజ్ పల్సర్ వంటి వాటిని రైడ్ చేస్తూ కూడా కనిపించాడు. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. నిజానికి ఖలీ ఎత్తు 7 అడుగుల కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఏ బైకైనా అతని పరిణామంతో పోలిస్తే మరగుజ్జు మాదిరిగా కనిపిస్తుంది. బైకులు మాత్రమే కాకుండా ఆయన వద్ద టయోటా ఫార్చ్యూనర్, టయోటా గ్లాంజా వంటి కార్లను కలిగి ఉన్నప్పటికీ.. అతని పరిమాణానికి అనుకూలంగా కస్టమైజ్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Great Khali (@thegreatkhali) -
చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!
నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్. చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు. వీటన్నింటినీ నాటింగ్‌హామ్‌లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్లో ప్రసారమయ్యే ‘బార్గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ జార్జ్ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. -
బొమ్మ దొరికిందోచ్..!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం అరుదు. అలాంటి ఓ వస్తువును రైల్వే అధికారులు స్వయంగా ఇంటికే వచ్చి బాధితులకు అప్పగిస్తే..! పైగా, అది ఓ చిన్నారికి ఎంతో ఇష్టమైన బొమ్మ అయితే...! ఆ బొమ్మను తిరిగి పొందిన ఆ చిన్నారి ఆనందానికి అవధులు ఉంటాయా..? ఉండవనే చెప్పవచ్చు. సికింద్రాబాద్ నుంచి అగర్తలాకు (07030) వెళ్లే రైలులో ఈ నెల 4న ప్రయాణం చేస్తున్న భూసిన్ పట్నాయక్ అనే ప్రయాణికుడి ఎదురు సీట్లో ఉన్న ఓ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకొంది. దాని కోసం దిగాలుగా ఏడుస్తున్న ఆ చిన్నారికి ఎలాగైనా దానిని అందించాలనే ఉద్దేశంతో భూసిన్ రైల్వే మదద్ యాప్ ద్వారా 139 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చేరవేశారు. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారి వివరాలను సికింద్రాబాద్ రైల్వే కౌంటర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ సిబ్బంది ఆ బొమ్మ ఆచూకీ కోసం ఆరా తీసి, న్యూ జల్ఫాయ్‌గురి స్టేషన్ దగ్గర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా అలియాబరి స్టేషన్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు మోహిత్, నస్రీన్ బేగంలను కలిసి ఆ బొమ్మను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రికి, అధికారులు, సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. -
బొమ్మల కొలువుగా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మల్ కొయ్యబొమ్మలు వంటి హస్తకళాకృతులు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక పిల్లల ఆటవస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు లేవు. పిల్లల బొమ్మలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణను టాయ్స్‌హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నట్లు టీఎస్ఐఐసీ అంచనా. ఈ నేపథ్యంలో బొమ్మల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను మరింతగా ఉపయోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో బొమ్మల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వీలుగా ‘టాయ్స్ పార్క్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దండుమల్కాపూర్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు కార్యకలాపాలు ప్రారంభించింది. ఇతర పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం మరో రెండు వేల ఎకరాలను సేకరించి మౌలిక వసతులపై దృష్టి సారించింది. ఇక్కడే టాయ్స్ పార్కు కోసం డిమాండ్‌ను బట్టి 70 నుంచి 100 ఎకరాల వరకు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో బొమ్మల మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్కు తదితరాలను ఏర్పాటు చేస్తారు. ఏటా 10–15 శాతం పెరుగుదల పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం పంచే ఆట వస్తువులు, బొమ్మల తయారీ పరిశ్రమ దేశంలో శైశవ దశలో ఉంది. అయితే ఆటబొమ్మలకు ఏటా భారత్‌లో 10 నుంచి 15శాతం డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో చిన్నారులు ఉపయోగించే ఆట వస్తువులు, బొమ్మల్లో 80శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. వీటిలో ఎక్కువగా ప్లాస్టిక్, విషపూరిత రసాయనాలతో తయారైనవే ఉంటుండటంతో కొన్ని రకాల బొమ్మలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పెరుగుతున్న డిమాండ్‌ను దేశంలోని తయారీ యూనిట్లు తట్టుకోలేకపోతున్నాయి. గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో పిల్లల బొమ్మల వాణిజ్యం విలువ రూ.12వేల కోట్లు ఉన్నట్లు అంచనా. అన్ని వసతులు హైదరాబాద్‌లోనే పిల్లల ఆట వస్తువులు, బొమ్మల తయారీ యూనిట్లు స్థానికంగా లేకపోవడంతో ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ అవసరాలకు సరిపడా ఇక్కడే ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఉత్పత్తిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రానిక్ ఆట బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ పరిశ్రమకు హైదరాబాద్ హబ్‌గా మారేందుకు అవసరమైన అన్ని వసతులు దండుమల్కాపూర్‌లో అందుబాటులోకి వస్తాయి. – ఆకారం జనార్దన్ గుప్తా, అధ్యక్షుడు, టాయ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తయారీదారులను ఏకతాటిపైకి తెస్తున్నాం దండుమల్కాపూర్‌లో ఏర్పాటు చేసే టాయ్స్ పార్క్ ప్రత్యేకతలు, అందుబాటులో ఉండే మౌలిక వసతులు, బొమ్మల తయారీ, మార్కెటింగ్‌కు తెలంగాణలో ఉన్న అవకాశాలపై ప్రచార వీడియోను రూపొందిస్తున్నాం. ఇటీవల రాష్ట్రంలో బొమ్మల తయారీదారులు, పంపిణీదారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇక్కడి వసతులపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. బొమ్మల తయారీదారులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సాఫ్ట్, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కొయ్య బొమ్మల వంటి హస్తకళాకృతుల తయారీదారుల నుంచి యూనిట్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తీకరణ కోరుతున్నాం. –శ్రీహా రెడ్డి, నోడల్ ఆఫీసర్, తెలంగాణ టాయ్స్ విభాగం -
బొమ్మల పరిశ్రమ సామర్థ్యం పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు. యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్‌కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గణనీయంగా తగ్గిన దిగుమతులు దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్‌ను గుర్తు చేశారు. -
జొన్నలకు పులి కాపలా!
తుంగతుర్తి: కోతుల బెడద తీవ్రమవుతుండటంతో రైతులు విసిగిపోతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా వద్ద ఓ రైతు తాను పండించిన జొన్నలను ఆరుబయట ఆరబోసి కోతుల బెడద నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. కోతులు ఈ పులి బొమ్మను చూసి దరిదాపుల్లోకి రాకుండా పోతున్నాయని రైతు తెలిపాడు. -
సెక్స్‌డాల్‌తో 8 నెలల కాపురం..ఆపై విడాకులు!
కజకిస్థాన్: అతడొక మంచి బాడీబిల్డర్..అందగాడు. అతని కోసం అందమైన అమ్మాయిలు క్యూలో నిలుచుంటారు. కానీ అతను మాత్రం.. ఒక సెక్స్టాయ్ మీద మనసు పడ్డాడు. అంతేకాకుండా, దాన్ని పెళ్లి కూడా చేసుకున్నాడు. 8 నెలలకే విడాకులు కూడా ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కజకిస్థాన్‌కు చెందిన యూరి టోలోచ్కో ‘మార్గో ’ అనే సెక్స్‌టాయ్‌ను వివాహం చేసుకున్నాడు. దీన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. కొద్ది రోజుల తర్వాత నిజమైన భార్యభర్తల మాదిరిగానే మాఇద్దరికి పడట్లేదని మరొసారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. క్రిస్టమస్‌కి ముందు తన టాయ్ కిందపడి విరిగిపోయింది. అయితే, టాయ్‌ను బాగుచేయడానికి స్టోర్‌కి పంపానని తెలిపాడు. ఈ క్రమంలో టోలోచ్కో ‘లోలా’ అనే మరొక టాయ్‌తో ప్రేమలో పడ్డానని తెలిపాడు. లోలా చాలా నాజుకుగా, అచ్చం అమ్మాయిలాంటి శరీరాన్ని కల్గిఉందని తెలిపాడు. టోలోచ్కో 8 నెలల తర్వాత తన ‘మార్గోటాయ్’కు డైవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, టోలోచ్కో సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తన కొత్తటాయ్ను పరిచయం చేశాడు. దీనిపేరు ‘లోలా’ అని.. తొందర్లోనే ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని పోస్ట్ చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం..‘సెక్స్టాయ్తో పడక సుఖం మాత్రమే...కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది’.. ‘ఇదేం వింతరా బాబోయ్’ అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భర్తను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య! -
టచ్ చేసి చూస్తే మంచీచెడు చెప్పే బొమ్మ..?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపులకు పెద్దలే కాదు అభం శుభం తెలియని చిన్నారులూ గురవుతున్నారు. ఏమీ తెలియని వయసులో ప్రమాదాన్ని పసిగట్టలేని పిల్లలపై సొంత బంధువులు, సన్నిహితంగా మెలిగే ఇరుగుపొరుగువారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలను పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే నిలువరించగలం. ఈ దిశలో వినూత్నంగా ఆలోచించిన వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి భరద్వాజ్ మరో ఇద్దరి సహకారంతో ఓ ప్రత్యేకమైన బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను తాకినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే శబ్దాలతో అది స్పందిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కల్పించాలంటూ.. ట్విట్టర్ వేదికగా తన ఆలోచనలను బహిర్గతం చేయగా.. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు షీటీమ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తదితర ప్రభుత్వ విభాగాలు స్పందించాయి. తాకగానే స్పందించే ‘సంస్కార్’ భరద్వాజ్, వరంగల్‌కు చెందిన రూరల్ ఇన్నోవేటర్ యాకర గణేశ్ సహకారంతో ఈ బొమ్మ (టాయ్)ను తయారు చేశాడు. దీనికి ‘సంస్కార్’ అనే పేరు పెట్టారు. ఈ బొమ్మ తయారీకి కొన్ని రకాల సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించారు. ఈ బొమ్మను తాకినప్పుడు అది స్పందిస్తుంది. కొన్ని సందర్భాల్లో తాకేందుకు ప్రయత్నించే సమయంలోనే స్పందిస్తుంది. బొమ్మ వేర్వేరు భాగాలను తాకుతున్నప్పుడు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది స్పీకర్ ద్వారా శబ్దం వెలువడుతుంది. ఈ బొమ్మ తయారీతో పాటు పనిచేస్తు న్న తీరుపై వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలోని వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ ఎంకే కౌశిక్ వీడియో రూపొందించి ట్విట్టర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొందరు చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న వీడియోను కూడా జత చేశారు. దీనిపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ స్పందించారు. ఈ ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ.. సంస్కార్‌ను మరింత అభివృద్ధి పరచాల్సిందిగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేవేషన్ సెల్‌కు సూచించారు. దీంతో టీఎస్ఐసీ అధికారులు సంస్కార్ రూపకర్తలతో భేటీ కానున్నారు. ప్రత్యక్షంగా చూస్తే వేగంగా అవగాహన చిన్నారుల్లో లైంగిక వేధింపుల విషయమై థియరీ పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించాలనే ఆలోచన ఫలితమే ఈ ‘సంస్కార్’. ఇన్నోవేటర్ యాకర గణేశ్, నేను చర్చించుకుని ఈ బొమ్మను తయారు చేశాం. ఈ బొమ్మ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూస్తే పిల్లలకు వేగంగా అవగాహన కలుగుతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిద్వారా అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. - భరద్వాజ్ గుండు, యాకర గణేశ్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ స్కూళ్లలో ప్రయోగాత్మక అవగాహన సంస్కార్ బొమ్మను ముందుగా నాలుగైదు స్కూళ్లలోకి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని మరింత అభివృద్ధి చేస్తాం. భరద్వాజ్, గణేశ్ ఆలోచనను దీనికే పరిమితం చేయకుండా ప్రత్యేకంగా ఒక టాయ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. - ఎంకే కౌశిక్, వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ -
‘బేబీ యోధ’ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ముంబై : మన దేశంలో ఓ వస్తువు మార్కెట్లోకి విడుదలవకముందే దాన్ని పోలిన డూప్లికేట్ వచ్చేస్తుంది. బ్లాక్ మార్కెట్ పుణ్యమాని అసలు ఉత్పత్తిదారుడు ఢీలా పడిపోతాడు. కానీ, పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. అసలైన వస్తువుకే ప్రజలు పట్టం కడతారు. కోరుకున్న ఆ వస్తువు కోసం ఎన్ని నెలలైనా వేచి చూస్తారు. ‘బేబీ యోధ’ బొమ్మల విషయంలో ఇది మరోసారి వెల్లడైంది. డిస్నీ వారి విజయవంతమైన కార్యక్రమం ‘ద మండలోరిన్’ లోనిదే ఈ బేబీ యోధ క్యారెక్టర్. ‘ద మండలోరియన్’లోని యాబై ఏళ్ల వింతైన బేబీ యోధ బొమ్మలను గాక్మన్ క్రియేచర్స్( ఎట్సీ) అనే సంస్థ తయారు చేస్తోంది. టినీ మాస్టర్‌గా పిలుస్తున్న ఈ బొమ్మను నక్క బొచ్చు, పాలిమర్ మట్టి, పాస్టెల్స్తో తయారు చేస్తారు. ఐదు అంగుళాల పొడవు, గాజు అద్దాలున్న బేబీ యోధ వార్తల్లో నిలవడానికి కారణం దానికున్న విపరీతమైన క్రేజే. ఈ బొమ్మ ఖరీదు అక్షరాల రూ.21 వేలు కావడం ఒక విశేషమైతే. షిప్పింగ్ చార్జీల కోసం మరో 2500 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక ధర మాట అటుంచితే.. ఈ బొమ్మ మన చేతికి రావాలంటే 14 నుంచి 17 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు బుక్ చేసుకుంటే బేబీ యోధ మన చేతికి రావడానికి యేడాదిన్నర పడుతుంది. ఇక బేబీ యోధకు సంబంధించిన ఎమోజీని అందుబాటులోకి తేవాలని యూజర్లు యాపిల్ సంస్థకు విన్నవించడం మరో విశేషం. -
18 ఏళ్లుగా బొమ్మను వదలడం లేదు..!!
వాషింగ్టన్ : మానవ సంబంధాలు పలుచనవుతున్న పాశ్చాత్య సమాజంలో ఓ తండ్రీ కూతుళ్ల ప్రేమానుబంధం అందరికీ ముచ్చటగొల్పుతోంది. కూతురిపై అమితమైన ప్రేమ కురిపించే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? 18 ఏళ్ల క్రితం ఆమె చెప్పిన మాటను రోజూ గుర్తు చేసుకుంటున్నాడు. రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన కానుకను ఆ తండ్రి ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. ముద్దు ముద్దు మాటలతో తన కూతురు సమంత హోల్మ్స్ (20) ‘నేను లేనప్పుడు ఈ బొమ్మతో ఆడుకో డాడీ’ అంటూ తండ్రి పాట్ హోల్మ్స్కు ఇచ్చిన తాబేలు బొమ్మను అతను ప్రతి నిత్యం తన బ్యాగులో భద్రంగా దాచుకొని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్తున్నాడు. సినిమాలు, షికార్లు, విహార యాత్రలు..ఇలా ఎక్కడికెళ్లినా కూతురిచ్చిన ఆ బొమ్మను మాత్రం వదలడు. కొడుకు జాక్, కూతురు సమంతలు తనకు దేవుడిచ్చిన వరం అంటూ పొంగిపోతున్నాడు పాట్. ‘మానవ విలువలు దిగజారకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం అంటూ ఉండాలి. అప్పుడే జీవితంలోని మంచి, చెడులు.. కష్ట నష్టాల విలువ తెలుస్తుంది’ అంటున్నాడు పాట్ హోల్మ్స్. తండ్రి తనపై కురిపించే ప్రేమలో సమంత తడిసి ముద్దవుతోంది. ‘ప్రతి సందర్భంలోనూ మేమంతా కలిసే ఉంటాం. ఏ చిన్న పండగయినా, విశేషమయినా కుటుంబంతో కలిసే జరుపుకుంటాం. నెలలో 30 రోజులుంటే దాదాపు 28 రోజులు కుటుంబం అంతా కలిసి డిన్నర్ చేస్తాం’ అంటూ సమంత తల్లిదండ్రులు, సోదరుడితో తన అనుబంధాన్ని వెల్లడించింది. -
‘బొమ్మ’ బాంబు పేలి ఆరుగురి మృతి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో బొమ్మలాగా కనిపిం చే బాంబు పేలి ఆదివారం ఆరుగురు చిన్నారులు మరణించారు. అఫ్గానిస్తాన్ సరిహద్దులోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో ఓ గ్రామంలో పిల్లలు.. బాంబును బొమ్మ అనుకుని ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా మగపిల్లలే. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు వారే. వాయవ్య పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 1980ల్లో సోవియట్ దళాలు అఫ్గాన్‌లో తమ ఆక్రమణను వ్యతిరేకించిన వారిపైకి బొమ్మ బాంబులను విమానాల నుంచి జారవిడిచేవి. -
తలుపులు పగలగొట్టిన పోలీసులు షాక్..!
ఆమ్స్టర్డ్యామ్: డచ్ పోలీసులకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంట్లో మహిళ ఉరేసుకుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి మరీ ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే ఆ తరువాతే తెలిసింది వారికి అసలు విషయం. తూర్పు ఆమ్స్టర్డ్యామ్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు ఓ ఫ్లాట్‌లో మహిళ ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. కిటికీలోంచి స్పష్టంగా వేలాడుతూ కనిపిస్తున్న ఆ మహిళ కొన్ని గంటలుగా అలా కదలకుండా ఉండటంతో.. వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైతం ఇదే దృశ్యాన్ని చూసి మహిళ ఉరేసుకుందని భావించారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ స్పందించకపోవటంతో చివరికి తలుపులు పగలగొట్టి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఆ మహిళను దగ్గరగా పరిక్షించి చూస్తేగానీ తెలియలేదు.. అది గాలితో నింపిన ఒట్టి బొమ్మ అని. దీంతో పోలీసులు షాక్ తిన్నారు. ఈ అనుభవాన్నంతా మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అది బొమ్మ అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆమ్‌స్టర్‌డామ్‌లో సెక్స్ వర్క్‌కు చట్టబద్ధత ఉంది. అక్కడ సెక్స్ షాపుల్లో ఇలాంటి సెక్స్ టాయ్స్ విరివిగా లభిస్తాయి. అయితే బొమ్మకు ఎందుకు ఉరివేశారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. -
కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..
కన్న కొడుక్కి సంతోషాన్ని పంచేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. తమిళనాడులోని అత్తూరుకు చెందిన సగ్గు బియ్యం ఫ్యాక్టరీ యజమాని బాలాజీ(28)ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలాజీ తన స్నేహితుడితో కలిసి కుమారునికి బొమ్మ కొందామని సేలం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వాల్పడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇతని కారు, ఎదురుగా వస్తున్న మినీలారీ మీదికి దూసుకుపోయింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. -
మాటబొమ్మ
ప్రాణంలేని ఒక బొమ్మ లైవ్‌లో మాట్లాడుతుంది. బర్త్‌డే పార్టీలో అల్లరి చేస్తుంది. నీ పేరు ఏంటి అంటే నీ పేరు చెప్పు అని బడాయికి పోతుంది.. ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసే ఆ బుజ్జిగాడిని చూసి పిల్లలు సంబర పడిపోతుంటారు. కానీ అదంతా వెంట్రిలాక్విస్ట్ మాయ! పెదాలు కదలకుండా బొమ్మను ఆడిస్తూ నవ్వులు పూయించే ఆర్ట్ వెంట్రిలాక్విజం. శనివారం లామకాన్‌లో ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ సంతోష్ వర్క్‌షాప్ నిర్వహించారు. ..:: ఓ మధు ఒకప్పుడు గ్రీక్, లాటిన్ దేశాల్లో చెట్లూ, పుట్టలు మాట్లాడినట్టు చేసే బ్లాక్ మ్యాజిక్ రాను రాను ఒక ఆర్ట్ ఫాంగా మారిందని చెప్తారు. మన దేశంలో వెంట్రిలాక్విజంపై అవగాహన తక్కువ. మన దగ్గర వెంట్రిలాక్విజం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అమెరికాలో ప్రత్యేకంగా ఫలానా వాళ్లే వెంట్రిలాక్విజం చెయ్యటం అంటూ ఉండదు. మార్కెటింగ్, మతప్రచారం, టీచింగ్ ఇలా పలు రకాలుగా ఈ ఆర్ట్‌ని వాడుతుంటారు. కాగా, 90ల్లో టీవీ ప్రకటనల్లో లిజ్జత్ పాపడ్ అంటూ వచ్చిన బొమ్మ గుర్తుండే ఉంటుంది. అందరికీ పరిచయం వున్న ఈ ఆర్ట్‌కు ఆదరణ బాగానే ఉన్నా, నేర్చుకోవటం పట్ల ఆసక్తి లేదు. ఉపాధి మార్గం.. హైదరాబాద్‌లో ఈ ప్రదర్శనలకు ఎంతో స్కోప్ ఉన్నా... ఆర్టిస్టులు 20కి మించి లేరు. ఉన్నా.. తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రదర్శన ఇవ్వలేరు. ఇలా రెండు, మూడు భాషలు తెలిస్తే కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవచ్చు. మాములుగా పుట్టిన రోజులకు ఇచ్చే షోస్‌కి 2వేల వరకు వస్తే, కార్పొరేట్ ఈవెంట్స్ ద్వారా 10-12 వేల వరకు వచ్చే అవకాశం ఉంది. కొంచెం శ్రద్ధగా నేర్చుకుంటే వెంట్రిలాక్విజమ్‌ను 6 నెలల్లో ఒంటపట్టించుకోవచ్చు. ఈ థ్రిల్లింగ్ ఆర్ట్ గురించి అవగాహన కలిగించేందుకు బంజారాహిల్స్ లామకాన్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు వెంట్రిలాక్విస్ట్ సంతోష్. ఈ వర్క్‌షాప్‌లో పిల్లలు, పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొని బేసిక్స్ నేర్చుకున్నారు. కంపెనీ సెక్రటరీగా పనిచేస్తూ.. సాయంత్రం వేళల్లో వెంట్రిలాక్విజం ప్రదర్శనలు ఇస్తున్న సంతోష్‌కి ఈ ఆర్ట్‌తో ఉన్న అనుబంధం 15 ఏళ్లు. పవర్ఫుల్ ఆర్ట్... ‘షో స్టార్ట్ అయ్యాక నా ముందున్న ఆడియెన్స్‌ని ఎంటర్టెయిన్ చెయ్యటంలో కలిగే ఆనందం వెలకట్టలేనిది. నా ఉద్యోగానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా షోస్ ఇవ్వగలుగుతున్నాను. నాలాగే చాలామంది ఈ ఆర్ట్‌ని నేర్చుకుని ఎంటర్టెయిన్ చెయ్యవచ్చు. బర్త్‌డే పార్టీల్లో బొమ్మతో ప్రదర్శన ఇచ్చినప్పుడు పిల్లలు వచ్చి బొమ్మకు కేక్ తినిపిస్తుంటారు. అంతగా ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్న ఈ ఆర్ట్ చాలా పవర్ఫుల్ కూడా. వర్క్‌షాప్స్ ద్వారా అన్ని వర్గాల వారిని అట్రాక్ట్ చెయ్యాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకుంటే తెలుగు యూనివర్సిటీలో వెంట్రిలాక్విజం డిప్లొమా కోర్సు ఉంది’ అని చెబుతున్నారు సంతోష్! -
తోలుచిత్రాలు
కాలం ముందుకు కదులుతూనే ఉంటుంది. ఆ ప్రస్థానానికి తగినట్లు మనిషి మారుతుండాలి. ఆ మార్పు అభ్యుదయం దిశగా సాగాలి. వ్యక్తి అయినా, వృత్తి అయినా అభివృద్ధికి ఇదే కొలమానం. ఆ సూత్రాన్ని పట్టుకున్నారు తోలుబొమ్మల కళాకారుడు దళవాయి వెంకటరమణ. దేనికదే ప్రత్యేకం! తోలుబొమ్మ కళాకారుల్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... డిజైన్ని ట్రేస్ పేపర్ మీద వేయడం అనే ఆలోచనే ఉండదు. ఘట్టాన్ని ఊహించుకుని స్వయంగా బొమ్మ గీసుకుంటాం. దాంతో ఈ కళలో ఉన్న డిజైన్లు మరి దేనికీ నకలుగా ఉండవు. దేనికదే కొత్త రూపం. తోలు బొమ్మలను పారేయాల్సిందే తప్ప ఎన్నేళ్లయినా అవి పాడవవు. - వెంకట రమణ వాకా మంజులారెడ్డి అనంతపురం నిమ్మలకుంట గ్రామంలో ‘చిత్రకార’ కుటుంబంలో పుట్టిన రమణ... తాత ముత్తాతల నుంచి వారసత్వంగా అందివచ్చిన తోలుబొమ్మలాటను ఇష్టంగా నేర్చుకున్నారు. అందుకే... తాత ఖడేరావు దగ్గర నేర్చుకున్న పాటలు, తండ్రి గోవిందు నేర్పిన ములుకు పట్టడం (తోలు బొమ్మల తయారీలో నైపుణ్యం), నాయనమ్మ, అమ్మ దగ్గర నేర్చుకున్న రంగనాథ రామాయణం ఘట్టాల ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతున్నప్పటికీ ఆ వృత్తిని వదలడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అలాగని తోలుబొమ్మలాట దగ్గరే ఆగిపోతే కుటుంబం గడవదు. ఈ సంఘర్షణ నుంచి తనకు తాను ఓ కొత్త దారిని వేసుకున్నారు. తోలుబొమ్మలలో అందమైన ల్యాంప్షేడ్లు, వాల్ హ్యాంగింగ్, డోర్ ప్యానెల్ పార్టిషన్... ఇంకా ఇతర గృహాలంకరణ వస్తువులు రూపొందించారు! ఆ ప్రయోగం అతణ్ణి రాష్ట్రస్థాయి హస్తకళల పోటీలో విజేతను చేసింది. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలో 2008లో ప్రదర్శించిన ల్యాంప్‌షేడ్‌కి బహుమతి అందుకున్న వెంకటరమణ తాజాగా తన కళాప్రావీణ్యానికి గవర్నర్ నరసింహన్ నుంచి ప్రశంసలతోపాటు రాజ్‌భవన్‌కు ఆహ్వానమూ అందుకున్నారు. ఆట చూడకపోయినా... ‘‘తోలుబొమ్మలాట చూసే వాళ్లు లేరు కానీ తోలుబొమ్మను చూసేవాళ్లుంటారు’’ అంటారు వెంకటరమణ. ‘‘ఇది చిత్రకార ప్రధానమైన కళ. దీనిని చిత్రాలకే పరిమితం చేస్తూ కొనసాగిద్దామని ఇలాంటి ప్రయోగాలు చేశాను. నా ప్రయోగాలు విజయవంతమైన తర్వాత మధువని, కలంకారీ వంటి ఇతర చిత్రరీతులను కూడా తోలు మీద చిత్రిస్తున్నాను’’ అని చెప్పారాయన. ధర్మవరం రంగులు తోలుబొమ్మలకు పట్టుచీరలకు వేసే రంగులనే వెంకటరమణ వాడతారు. ‘‘మాకు ధర్మవరం పదికిలోమీటర్ల దూరం. రంగులన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ఆ రంగులు వేస్తే బొమ్మ అందంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది’’ అంటారు వెంకటరమణ. ఢిల్లీ ప్రగతి మైదాన్, హైదరాబాద్ శిల్పారామంలతో సహా ఇప్పటి వరకు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో ఆయన తన కళా కృతులను ప్రదర్శించారు. ‘‘ఆటను ప్రదర్శించడానికైతే కనీసంగా ఆరుగురు మనుషులుండాలి. చిత్రకార కుటుంబాల్లో అందరికీ ఈ కళలో ప్రవేశం ఉంటుంది. తోలుబొమ్మలాట చూడాలనే ఆసక్తి లేకపోయినా, అది ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకు చూపించాలని ఎవరైనా సరదా పడినా సరే ఆట ఆడడానికి తాము సిద్ధమే’’ అంటున్నారు వెంకటరమణ. ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి -
ఏది అందం..? ఏది వికారం..?
అతను ఓ చిత్రకారుడు. అత నికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడు పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివ రాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. - యామిజాల జగదీశ్