
కాగజ్‌నగర్ డివిజన్‌లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్‌లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.
పులి భయంతో.. జ్వరం!
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్‌పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
– ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
