కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి.. | Sago starch factory owner killed in mishap, friend injured | Sakshi
Sakshi News home page

కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..

Published Thu, Mar 31 2016 1:56 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి.. - Sakshi

కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..

కన్న కొడుక్కి సంతోషాన్ని పంచేందుకు వెళ్లిన  ఓ  తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. తమిళనాడులోని అత్తూరుకు చెందిన సగ్గు బియ్యం ఫ్యాక్టరీ యజమాని బాలాజీ(28)ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

బాలాజీ తన స్నేహితుడితో కలిసి కుమారునికి బొమ్మ కొందామని సేలం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వాల్పడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇతని కారు, ఎదురుగా వస్తున్న మినీలారీ మీదికి దూసుకుపోయింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement