ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది.
ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే!
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment