
‘బొమ్మ’ బాంబు పేలి ఆరుగురి మృతి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో బొమ్మలాగా కనిపిం చే బాంబు పేలి ఆదివారం ఆరుగురు చిన్నారులు మరణించారు. అఫ్గానిస్తాన్ సరిహద్దులోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో ఓ గ్రామంలో పిల్లలు.. బాంబును బొమ్మ అనుకుని ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా మగపిల్లలే. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు వారే. వాయవ్య పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 1980ల్లో సోవియట్ దళాలు అఫ్గాన్లో తమ ఆక్రమణను వ్యతిరేకించిన వారిపైకి బొమ్మ బాంబులను విమానాల నుంచి జారవిడిచేవి.