six killed
-
అమెరికాలో హెలికాప్టర్ కూలి... ఆరుగురి దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది. ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
ఆస్టిన్(అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. గతంలో జైలుకు వెళ్లొచి్చన 34 ఏళ్ల షేన్ జేమ్స్ అనే వ్యక్తి టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో నాలుగు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పోలీసులు అధికారులుసహా ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని కారులో వెంబడించి మరీ పోలీసులు అరెస్ట్‌చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడింటి దాకా ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. శాన్ ఆంటోనియో ప్రాంతంలో కాల్పులు జరిపాక 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరో చోటా ఇతను కాల్పులకు తెగబడ్డాడు. ఎందుకు కాల్పులు జరిపాడు? మృతులతో ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఈ ఏడాది ఇది 42వ కాల్పుల ఘటన. -
కూలిన చిన్న విమానం..10 మంది మృతి
కౌలాలంపూర్: మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్‌లో గురువారం చిన్న విమానం కూలిన ఘటనలో మొత్తం 10 మంది చనిపోయారు. లంగ్క్వావి నుంచి సుబంగ్ విమానాశ్రయం వైపు వస్తున్న ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా విమానం పల్టీలు కొడుతూ రహదారిపై కుప్పకూలింది. రహదారిపై వెళ్తున్న బైక్, కారుపై పడటంతో విమానంలోని 8 మందితోపాటు మరో ఇద్దరు చనిపోయారు. ఘటనకు కారణం తెలియాల్సి ఉంది. విమానం బ్లాక్‌బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్‌లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్‌లో ముగ్గురు... కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
ఇంగ్లండ్‌లో కాల్పుల మోత
లండన్: ఇంగ్లండ్‌లోని ప్లేమౌత్ నగరంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లేమౌత్‌లోని కేమాన్ అనే ప్రాంతంలో గురువారం సాయంత్రం దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు, జరిపి తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందారు. దుండగుడితో సహా మొత్తం ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశంలో గత పదేళ్లలో ఇదే అతి పెద్ద కాల్పుల ఘటన అని పేర్కొన్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి సైతం ఉందని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని జేక్ డెవీసన్(22)గా గుర్తించారు. -
ఫిలిప్పీన్స్‌ను కుదిపేస్తున్న ‘వామ్కో’
మనీలా: భారీ తుపాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతోంది. పది రోజుల క్రితం తీవ్రమైన గోని తుపానుతో ప్రభావితమైన క్వెజాన్, లుజాన్, రిజల్, మనీలా ప్రాంతంలోనే తాజాగా మరో తుపాను వామ్‌కోతో ప్రజలు వణికి పోతున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. సుమారు 2 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని సీఎన్ఎన్ తెలిపింది. కేవలం మూడు వారాల్లోనే ఫిలిప్పీన్స్‌పై ఐదు తుపాన్లు తీవ్ర ప్రభావం చూపాయి. గోని తుపాను కారణంగా నిరాశ్రయులైన 2.40 లక్షల మంది ఇప్పటికే తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నట్లు రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ తెలిపాయి. -
మహారాష్ట్ర కెమికల్ ఫాక్టరీలో ప్రమాదం
సాక్షి, ముంబై/పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్‌లోని కెమికల్ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్‌ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఆరుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండోర్ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్ అగర్వాల్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్‌తో పాటు పలువురు లిఫ్ట్ ఎక్కగా, ప్రమదవశాత్తూ లిఫ్ట్(ఎలివేటర్) తీగ తెగిపోవడంతో ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దాంతో వీరంతా కాంక్రీట్ గుంతలో పడిపోయారు. దుర్ఘటనలో పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పాలక్ (27), అల్లుడు పాల్కేశ్, మనవడు నవ్తో పాటు బంధువులు గౌరవ్, ఆర్యవీర్ ప్రాణాలు విడిచారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్ అగర్వాల్ భార్య నిధి అగర్వాల్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పునీత్ అగర్వాల్ దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. పాత్ ఇండియా సంస్థ ద్వారా వంతెనలు పర్యవేక్షణ, హైవే నిర్మాణాలు, టోల్ ఫ్లాజాల నిర్మాణాలతో పాటు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమైన రహదారి ప్రాజెక్ట్‌లను చేపట్టింది. -
ఘజియాబాద్‌లో హృదయ విదారక ఘటన
సాక్షి, ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. వారిలో ఓ చిన్నారి వయసు అయిదేళ్లు మాత్రమే. లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్‌లోని మౌలానా ఆజాద్ కాలనీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు వీరంతా ఒకే గదిలో ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. మృతులు పర్వీన్ (40), ఫాతిమా (12), సహిమా (10), రతియా (8), అబ్దుల్ అజీమ్ (8), అబ్దుల్ అహద్ (5) గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం
న్యూఢిల్లీ: భారత్‌లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఆందోళనలతో అట్టుడికింది. నిరసనల సందర్భంగా యూపీలో శుక్రవారం ఆరుగురు చనిపోయారు. పోలీసులు మాత్రం మృతుల సంఖ్యను ఐదుగా పేర్కొన్నారు. బిజ్నోర్‌లో ఇద్దరు, మీరట్, సంభాల్, ఫిరోజాబాద్‌లో ఒక్కరు చొప్పున చనిపోయారని డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. కాన్పూర్‌లోనూ ఒకరు చనిపోయినట్లు సమాచారం. పోలీసు కాల్పుల కారణంగా ఈ మరణాలు సంభవించాయా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆందోళనకారుల దాడుల్లో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఢిల్లీలోనూ ఆందోళనలు పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు దారి తీశాయి. ఇప్పటివరకు ఆందోళనలు జరగని ప్రాంతాల్లోనూ శుక్రవారం భారీ స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదుల ముందు వేలాదిగా నిరసన తెలిపారు. యూపీలో గోరఖ్‌పూర్ నుంచి బులంద్‌షహర్ వరకు దాదాపు అన్ని పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగాయి. ఢిల్లీలో జాతీయ పతాకం చేతపట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలనే నినాదాలతో నిరసనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, జామా మసీదు వద్ద భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని చోట్ల నిరసనకారులు తమది శాంతియుత నిరసన అని తెలిపేందుకు పోలీసులకు గులాబీ పూలను అందించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన మంగళూరు, ఒకరు చనిపోయిన లక్నో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో.. సీఏఏపై, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్నార్సీపై సలహాలు, సూచనలను స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఢిల్లీలో.. ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆందోళనకారులు కారును తగలబెట్టారు. ఢిల్లీగేట్ వద్ద రాళ్లు రువ్వడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. రోడ్లపై భారీగా బారికేడ్లను నిలిపినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసేసినప్పటికీ, నిషేధాజ్ఙలను ఉల్లంఘిస్తూ వేలాదిగా ఆందోళనకారులు నిరసన తెలిపారు. జామా మసీదు, ఇండియా గేట్, సెంట్రల్ పార్క్‌ల వద్ధ భారీ స్థాయిలో గుమికూడారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భారీ ర్యాలీకి నేతృత్వం వహించారు. పోలీసులు డ్రోన్లతో ఆందోళనలపై నిఘా పెట్టారు. హోంమంత్రి అమిత్ షా నివాసం దగ్గరలో నిరసన తెలుపుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళ కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భిన్నాభిప్రాయాన్ని పోలీసు బలంతో అణచేందుకు మోదీ సర్కారు పనిచేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ఆరోపించారు. జాతీయ గీతంతో.. బనశంకరి: పోలీసు అధికారి జాతీయ గీతాన్ని ఆలపించి ఆందోళనకారులను శాంతింపజేసిన ఘటన బెంగళూరులో జరిగింది. పౌరసత్వ సవరణ చట్టంపై అందోళనలు చేయడానికి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ గురువారం కొన్ని సంఘాల నాయకులు టౌన్‌హాల్ వద్ద ధర్నాకు దిగారు. అక్కడకు చేరుకున్న డీసీపీ చేతన్‌సింగ్‌రాథోడ్ మాట్లాడుతూ ‘నేను మీవాడిని అనుకుంటే నేను ఆలపించే జాతీయ గీతాన్ని ఆలకించాల’ని కోరారు. అనంతరం ఆయన జాతీయగీతం ఆలపించగా అందోళనకారులు గౌరవంగా లేచి నిల్చుని, ధర్నా విరమించారు. డీసీపీ చేతన్‌సింగ్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నేరవిభాగ ఐజీ హేమంత్ నింబాళ్కర్ ట్వీట్ చేశారు. మిత్రపక్షాల వేరు బాట జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని బిహార్‌లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్లో జేడీయూ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరో మిత్రపక్షం ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ తీరును తప్పుబట్టారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించే విషయంలో కేంద్రం విఫలౖ మెందన్నారు. ఎన్నార్సీపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు ఒరిస్సా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ సీఎంలు వ్యతిరేకత తెలిపిన విషయం తెలిసిందే. యూపీలో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గోరఖ్‌పూర్, సంభాల్, భదోహి, బహ్రెచ్, ఫరుఖాబాద్, బులంద్ షహర్, ఫిరోజ్‌బాద్‌లో మధ్యాహ్న ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు రోడ్లను నిర్బంధించారు. వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ యా ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లక్నో, అలహాబాద్, కాన్పూర్, అలీగఢ్ సహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ► మహారాష్ట్రలోని బీడ్, నాందేడ్, పర్బాని జిల్లాల్లో బస్సులను ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో ఎంఐఎం భారీ ర్యాలీ నిర్వహించింది. భారత్‌లో హిందువులే ఉండేలా మోదీ సర్కారు చట్టాలు తీసుకువస్తోందని ఆరోపించింది. ► కర్ణాటకలోని మంగళూరులో పోలీసుల కాల్పుల్లో గురువారం ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో కేరళలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ► అస్సాంలో ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినట్లు సీఎం శర్బానంద సోనోవాల్ తెలిపారు. మమత యూ టర్న్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని గురువారం డిమాండ్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట మార్చారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టం విషయంలో జోక్యం చేసుకుని, రద్దుకు చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమన్నారు. దేశవ్యాప్త ఎన్నార్సీ అమలు విషయంలోనూ వెనక్కు తగ్గాలని కోరారు. డీసీపీ చేతన్ -
అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు. -
14 ఏళ్లు.. 6 హత్యలు
కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్‌ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది. ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్‌ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా, సోఫియాన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ ఆర్మీ జవాను, ఓ పౌరుడు కూడా మరణించారు. పుల్వామాలో ముగ్గురు, సోపియాన్‌లోనూ మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా దెలిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఓ ఇంట్లోని వారందరినీ పోలీసులు బయటకు తరలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిపాయి సందీప్ వీరమరణం పొందగా, రయీస్ దార్ అనే పౌరుడు మరణించారు. అనంతరం భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని పుల్వామా జిల్లా కరీమాబాద్‌కు చెందిన నసీర్ పండిత్, సోఫియాన్‌కు చెందిన ఉమర్ మిర్, పాకిస్తాన్‌కు చెందిన ఖలీద్‌లుగా గుర్తించారు. వీరు ముగ్గురూ తీవ్రమైన నేరచరిత్ర గలవారని, పలు ఘటనల్లో వీరి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక సోఫియాన్‌లోని హ్యండ్యూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సిపాయి రోహిత్‌కు గాయాలయ్యాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల వివరాలు తెలియలేదు. -
బస్సును ఢీకొన్న కంటైనర్,ఆరుగురు మృతి
-
కూలిన ‘కసబ్’ బ్రిడ్జి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రద్దీగా ఉండగా కుప్పకూలిన వంతెన ముంబైలోని సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్ షిరాద్ ఖాన్(32), టి.సింగ్(35)గా గుర్తించారు. ఇంకొకరి వివరాలు తెల్సియాల్సి ఉంది. ముంబైలో ఇలాంటి ప్రమాదాలు కొత్తకాదు. 2017, సెప్టెంబర్ 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే పాదచారుల వంతెన కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. సీఎస్టీ మార్గంలో పాదచారుల బ్రిడ్జి కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ సందర్భంగా డీఎన్ రోడ్డు, జేజే ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించవద్దని వాహనదారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు సాగుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతులకు రూ.5 లక్షల పరిహారం.. ముంబై దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై బృహన్ ముంబై కార్పొరేషన్, రైల్వేశాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయన్నారు. కాపాడిన రెడ్ సిగ్నల్ కసబ్ బ్రిడ్జి దుర్ఘటనలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ భారీగా ప్రాణనష్టాన్ని నివారించింది. ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిపోవడానికి కొద్దినిమిషాల ముందు ఎరుపురంగు ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో సీఎస్టీ రైల్వేస్టేషన్ సమీపం నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. మరికాసేపట్లో సిగ్నల్ మారబోతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా బ్రిడ్జి కింద ఎవరూ లేకపోకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ విషయమై ఓ వాహనదారుడు మాట్లాడుతూ..‘రెడ్ సిగ్నల్ పడటంతో మేమంతా ఇళ్లకు వెళ్లేందుకు అసహనంగా ఎదురుచూస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగులోకి మారకముందే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఒకవేళ అప్పుడు వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. గురువారం ఉదయమే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారనీ, అంతలోనే రాకపోకలకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
పట్టాలు తప్పిన ‘సీమాంచల్’
సోన్పూర్(బిహార్): బిహార్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 29 మంది గాయాలపాలయ్యారు. బిహార్‌లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ‘నంబర్ 12487 జోగ్బనీ–ఆనంద్ విహార్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ కిషన్‌గంజ్ జిల్లా జోగ్బనీ నుంచి వస్తుండగా తెల్లవారు జామున 4 గంటల సమయంలో రైలు పట్టాల్లో పగుళ్ల కారణంగా సహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక జనరల్ బోగీ, ఒక ఏసీ కోచ్, మూడు స్లీపర్ కోచ్‌లతోపాటు మరో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి’ అని రైల్వే శాఖ పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 29 మంది క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని ముజఫర్‌పూర్, పట్నాలోని ఆస్పత్రులకు తరలించాం. మిగతా వారికి వైశాలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం’ అని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పని బోగీలకు మరికొన్నిటిని జత చేసి ఉదయం 10 గంటల సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఈస్ట్ జోన్ రైల్వే సేఫ్టీ కమిషనర్ లతీఫ్ ఖాన్‌ను రైల్వే శాఖ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. -
ముంబై ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి ముంబై: తూర్పు అంధేరిలోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా 141 మందికి గాయాలయ్యాయి. ఎంఐడీసీ సమీపంలో ఉన్న ఈఎస్ఐసీ ఆస్పత్రి భవనం చివరి నాలుగో అంతస్తులో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో రోగులు శ్వాసించేందుకు ఇబ్బంది పడ్డారు. అప్పటికే కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి పలువురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల సాయంతో రోగులను, వారి సంబంధీకులను, సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఆరుగురు మరణించారు. వీరిలో ఒక రోగి ప్రాణభయంతో పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోగా మరొకరు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. క్షతగాత్రులైన 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. -
చక్కెర ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లా కుళలి సమీపంలోని ఒక చక్కెర ఫ్యాక్టరీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేత, మాజీ మంత్రి మురుగేష్ నిరాణికి చెందిన ఈ ఫ్యాక్టరీలో వృథా నీటిని ఫిల్టర్ చేసే బాయిలర్ సేఫ్టీ వాల్వ్ మూసుకుపోవడంతో ఒత్తిడికి బాయిలర్ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. బాయిలర్ ఉన్న కట్టడం నామరూపాల్లేకుండా ధ్వంసమయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఒక ఇంజినీరు, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలిని ఉన్నతాధికారులు పరిశీలించి, సహాయక చర్యలు చేపట్టారు. -
ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం,ఆరుగురు మృతి
-
చెరువులో విద్యుత్ తీగ; 6 మంది మృతి
రూపొహి(అసోం): అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైరు చెరువులో తెగిపడటంతో 10 ఏళ్ల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నగాన్ జిల్లా ఉత్తర్ ఖాటూల్‌లో జరిగింది. గ్రామంలోని చెరువులో 11 కేవీ హైటెన్షన్ వైరు తెగిపడటం గుర్తించిన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. తీగలో విద్యుత్ ప్రసారం లేదని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు చేపలు పట్టడానికి చెరువులోకి దిగారు. కానీ అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాన్ని ధ్వంసం చేశారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరంతా కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం
సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా అచ్చరపాక్కం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు పక్కన ఆగివున్న కారును తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగం అధికంగా ఉండటంతో కారు ధ్వంసమైంది. దీంతో లోపల ఉన్నవారు నీటిలో నుంచి బయటకు రాలేకపోయారు. కారులో మొత్తం ఎనిమిది మంది ఉండగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పుదుకొట్టే జిల్లా వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కారును చెరువులో నుంచి బయటకు తీయించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద హైవేపై జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. జడ్చర్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరొకరు చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉదండాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం చెందిన విషయం విదితమే. కాగా, రహదారిపై అండర్ గ్రౌండ్ బిడ్జి నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, దీంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ జాతీయ రహదారిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. దీంతో హైవేపై ఎటు చూసినా కిలోమీటరు మేర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా ప్రమాద బాధితులంతా గంగాపూర్ గ్రామంలో పత్తి తీయటానికి వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని సమాచారం. మృతులను బాలమ్మ (66) లక్ష్మమ్మ (50) నాగమణి (30) రంగమ్మ (60)గా గుర్తించారు. మృతుల్లో ఆటో డ్రైవర్ సహా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది -
క్వెట్టాలో బాంబుపేలుడు, ఆరుగురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు మృతిచెందగా.. 8 మంది గాయపడ్డారు. క్వెట్టా-సిబ్బి రహదారి సరియల్ మిల్లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 35 మంది పోలీసులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఏ ఉగ్రసంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్వెట్టాలో భద్రతాబలగాలపై దాడులు ఇటీవలికాలంలో ఎక్కువయిపోయాయి. ఆగస్టు 13న మిలటరీ వాహనం లక్ష్యంగా ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. జూన్ 14న జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురి మృతి
సాక్షి, బెంగళూరు : వంటగ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు కూలిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని ఎజిపురా ప్రాంతంలో సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండంతస్థుల భవనంలో వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో.. ఆ ధాటికి భవనం కుప్పకూలింది. దీంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో నిండు గర్భిణీ సహా ఆరుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు శిథిలాల కింది నుంచి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించారు. శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను కళావతి(68), రవిచంద్రన్(30)లుగా గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడినవారిని రూ.50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారిని ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని కేజే జార్జి పేర్కొన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురి మృతి
-
లోయలో పడ్డ కారు: ఆరుగురి మృతి
-
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం కొవ్వలి వద్ద ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. వీరంతా కొవ్వలిలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కాల్వలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో డ్రైవర్‌తో సహా తొమ్మిదిమంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో ఓ చిన్నారి సహా అయిదుగురు మహిళలు ఉన్నారు. మృతులు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లపల్లి వాసులుగా గుర్తించారు. మృతుల వివరాలు... 1. చిన్నాల లక్ష్మి (60) 2. చిన్నాల కుమారి (55) 3. చిన్నాల పాన్యశ్రీ (2) 4. చిన్నాల సులోచన (60) 5. చిన్నాల విజయ (50) 6. చిన్నాల లక్ష్మీవల్లి దేవి (25) డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పడంతో వాహనం కాల్వలోకి దూసుకు వెళ్లినట్లు తెలిపారు. వాహనం కాల్వలోకి దూసుకు వెళ్లడంతో డ్రైవర్ వెంటనే బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి కాగా ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. pic.twitter.com/Xjq6wUuljn — YSR Congress Party (@YSRCParty) 14 September 2017 -
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
-
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
►క్రూజర్ వాహనాన్ని ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు ►మహారాష్ట్రకు చెందిన ఆరుగురు దుర్మరణం సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలిగొంది. కేఎస్ ఆర్టీసీ బస్సు... క్రూజర్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, దారపాళ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వివరాలు.. దారపాళ గ్రామానికి చెందిన 12 మంది వ్యక్తులు కేన్సర్ ఔషధం కోసం క్రూజర్ వాహనంలో గురువారం సాయంత్రం శివమొగ్గకు చేరుకున్నారు. అక్కడ ఔషధం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. బాగల్‌కోటే జిల్లా బీళగి తాలూకా, కూర్తి క్రాస్ వద్ద ఇవాళ ఉదయం విజయపుర నుంచి హుబ్లీ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు క్రూజర్‌ను అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న నాగేశమాళే, పాండురంగసాళుంకె, విజయాసిందతో పాటు మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు క్రూజర్ వాహనం నుజ్జు నుజ్జు కావడంతో కొన్ని మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. ప్రమాదం సమయంలో భారీ శబ్ధం రాగా ఏదో జరిగిందని భావించి చుట్టుపక్క గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను అతికష్టం మీద బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురితోపాటు మృతదేహాలను బీళగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది. -
‘బొమ్మ’ బాంబు పేలి ఆరుగురి మృతి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని ఓ గిరిజన ప్రాంతంలో బొమ్మలాగా కనిపిం చే బాంబు పేలి ఆదివారం ఆరుగురు చిన్నారులు మరణించారు. అఫ్గానిస్తాన్ సరిహద్దులోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో ఓ గ్రామంలో పిల్లలు.. బాంబును బొమ్మ అనుకుని ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా మగపిల్లలే. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు వారే. వాయవ్య పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 1980ల్లో సోవియట్ దళాలు అఫ్గాన్‌లో తమ ఆక్రమణను వ్యతిరేకించిన వారిపైకి బొమ్మ బాంబులను విమానాల నుంచి జారవిడిచేవి. -
లండన్ భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి
లండన్ : అగ్నిప్రమాదానికి గురైన గ్రెన్‌ఫెల్ టవర్ దుర్ఘటనలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా మంటలు అంతకంతకు ఎగసిపడుతున్నాయి. ఈ టవర్‌లో మొత్తం 120 ఫ్లాట్స్ ఉండగా...రెండో అంతస్తు నుంచి చివరి అంతస్తు వరకూ మంటలు వ్యాపించడంతో టవర్ పూర్తిగా అగ్నికీలలతో మూసుకుపోయింది. ఉదయం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో టవర్ చాలా వరకు దెబ్బతింది. మంటల ధాటికి భవనం కూలిపోయేలా కన్పిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే గనుక జరిగితే.. పెను ప్రమాదం తప్పదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను అదుపు చేయడానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది 40 ఫైర్ ఇంజన్లు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కొందరిని రక్షించగా...పై ఫ్లోర్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. ఓవైపు ఎగసిపడుతున్న మంటల కారణంగా సహాయకచర్యలకు సైతం ఆటంకంగా మారింది. టవర్ లోపలున్న వారైతే...ప్రాణాలు కాపాడుకునేందుకు బెడ్షీట్లను తాడులా కట్టుకొని కిందకు దూకేందుకు ప్రయత్నించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొబైల్, టార్చ్‌లైట్ సాయంతో ప్లాష్లైట్లు ఆన్‌చేసి తమను కాపాడాలని చేస్తున్న ఆర్తనాదాలు, హాహాకారాలతో టవర్ సమీపంలో భయానక పరిస్థితి నెలకొంది. మంటల ధాటికి అద్దాలు పగిలి పెద్దపెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయని, కొన్ని శిథిలాలు కూలిపోతున్నాయని స్థానికులు తెలిపారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో.. భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 అంబులెన్స్‌ల ద్వారా గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు. 1947లో ఈ టవర్‌ను నిర్మించగా, ఇటీవలే 10 మిలియన్ పౌండ్లతో మెరుగులు దిద్దారు. మరిన్ని వార్తలకు... లండన్‌లో భీకర అగ్నిప్రమాదం (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన
హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. -
ఫిరంగిపురం క్వారీ ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
గుంటూరు : ఫిరంగిపురం క్వారీ ఘటనపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాగా ఈ రోజు ఉదయం ఫిరంగిపురం కొండల్లో అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందినవారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ డిమాండ్ చేయగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. కాగా, క్వారీ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు... మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. -
బస్సు–వ్యాన్ ఢీకొని ఆరుగురి మృతి
తిరువణ్ణామలై: తిరువణ్ణామలై జిల్లాలో మినీ వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో మినీ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సెయ్యారుకు చెందిన ఒక కుటుంబ సభ్యులు కళశపాక్కం సమీపంలోని పయంకోయిల్ గ్రామంలో జరిగే నిశ్చితార్థ కార్యక్రమానికి 22 మందితో మినీ వ్యాన్‌లో బుధవారం ఉదయం బయల్దేరారు. పోలూరులో నిశ్చితార్థం ముగించుకొని మధ్యాహ్నం 3 గంటల సమయంలో మినీ వ్యాన్ బయల్దేరింది. మినీ వ్యాన్ ఆరణి రోడ్డులోని ఎట్టివాడి కూట్‌రోడ్డు వద్ద వెలుతున్న సమయంలో వేలూరు నుంచి తిరువణ్ణామలై వైపు ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్న ప్రవే టు బస్సు అతి వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో సెయ్యారుకు చెందిన మణి(55),సరోజ(48),తిరునావుక్కరసు(55), సెల్వరాజ్(60), తిమిరికి చెందిన కమల(70) అక్కడికక్కడే మృతి చెందారు. అదే విధంగా ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి, పోలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మరో మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో 11 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలాన్ని తిరువణ్ణామలై ఎస్పీ పొన్ని నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రమాదంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
నెత్తురోడిన హైవే..
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు.. కారుబోల్తా కొట్టడంతో మరొకరు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇంకొకరు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దుర్ఘటనలు మితిమీరిన వేగానికి తోడు నిర్లక్ష్యం.. నిద్రమత్తు.. కారణాలు ఏవైతేనేం రెప్పపాటులో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండగపూట రహదారులు నెత్తురోడాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందగా..మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. కట్టంగూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఆటోనగర్‌కు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు గురువారం అ«ర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాదు నుంచి 39 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వేకువజాము కావడంతో ప్రయాణికులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. రెప్పపాటులో.. విజయవాడకు బయలుదేరిన బస్సు మార్గమధ్యలో కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారుకు చేరుకోగానే ముందు వెళ్తున్న రెండు లారీల డ్రైవర్లు అకస్మాత్తుగా తమ వాహనాల బ్రేకులు వేశారు. అయితే వాటి వెనకే ఉన్న ఆర్టీసీ మితిమీరిన వేగంతో ఉండడంతో అదుపుతప్పి ముందు ఆగి ఉన్న లారీని రెప్పపాటులో బలంగా ఢీకొట్టింది. హాహాకారాలు.. ఆర్తనాదాలు.. నిద్రలో నుంచి తేరుకున్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.దీంతో అందులో ఉన్న ప్రయాణికులు రక్షించండి అంటూ చేసిన హాహాకారాలు.. ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. ప్రమాద శబ్దం విని.. లారీని వెనుక నుంచి బస్సు వేగంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్తులు ఘటన స్థలం వద్దకు పరుగున వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే లారీలో ఉన్న యాసిడ్ క్యాన్లు పగిలి లీకేజీ కావటంతో దర్గంధం వెలువడింది. ప్రయాణికులకు రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని కేతేపల్లి టోల్‌ప్లాజ్ నుంచి క్రేన్‌ను రప్పించి తాడు సహాయంతో 100 ఫీట్ల వెనకకు బస్సును లాగారు. అప్పటికే డ్రైవర్ వెనక సీట్లో ఇరుక్కుపోయిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన వెంబడి గణేష్(24) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ముగ్గురు.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యూజీవీడుకు చెందిన బస్సు డ్రైవర్ వై.సత్యనారాయణ, హైదరాబాదులోని కొండాపూర్‌కు చెందిన గోవిందరాజు సుశీల(50), కోదాడకు చెందిన బూక్యా సురేష్(23) కాసేపటికే మృతిచెందారు. కట్రోజు సురేష్, ఊదారపు రవికుమార్, యాండ్రపు పవన్‌కుమార్, గోవిందరాజు వెంకటేశ్వరావు, బీమారపు ప్రసాద్, శీలం మధుకర్, కామేశ్వర సాంబశివరావు, కర్నె నర్సింహ్మ, మేషబోయిన కాటంరాజు, షహద్లు చికిత్స పొందుతున్నారు. లారీ దగ్గరకు వెళ్లేందుకు భయపడిన స్థానికులు అకస్మాత్తుగా లారీని బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో లారీలో ఉన్న పార్సిల్ సామగ్రి చెల్లా చెదురయ్యాయి. అందులోని యాసిడ్ క్యాన్లు లీకయ్యాయి. దీంతో దగ్గరకు వెళితే కళ్లు మంటలు మండుతుండడంతో ఎవరూ దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. పోలీసులు నకిరేకల్ నుంచి ఫైరింజన్‌ను తెప్పించి వాటర్‌లో రోడ్డును శుభ్రం చేసి అక్కడి నుంచి లారీని తొలగించారు. ఫోరెన్సిక్ నిపుణులు లారీ సామగ్రిని పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, సీఐ విశ్వప్రసాద్‌లు పరిశీలించారు. నార్కట్‌పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, నల్లగొండ ఎస్ఐలు కూడా అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు చికిత్స పొందు తూ కామినేని ఆస్పత్రిలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని వారి బంధువులు, కుటుంబ సభ్యులు నకిరేకల్‌కు చేరుకున్నారు. తమ వారి మృతదేహాలపై పడి రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. దీంతో ఆస్పత్రి ఆవరణలో విషాదం అలుముకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. వలిగొండ : గుంటూరు జిల్లా కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కుల రామంజనేయులు (23) వృత్తిరీత్యా భవన నిర్మాణ కార్మికుడు. ఇతను జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని మొలుగు వద్ద పనిచేస్తున్నాడు. పండుగ నేపథ్యంతో స్వగ్రామానికి బైక్‌పై మిత్రుడు మందని ఆంటోనితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో వలిగొండలోని పెద్దమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో రామజంనేయు లు,ఆంటోనికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు భువనగిరి ఆస్పత్రికి తరలించగా రామంజనేయులు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు అదుపుతప్పడంతో.. కొండమల్లేపల్లి : ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన గాజుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి శివరాత్రి పండుగకు గాను సొంతూరుకు కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో మండల పరిధిలోని చెన్నారం గేటు వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ సంతోష్‌రెడ్డి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. -
భక్తులపైకి దూసుకెళ్లిన కారు ఆరుగురు మృతి
-
బేకరీలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి
పుణే: పుణేలోని కోండ్వాలో ఓ బేకరీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ‘బేకరీ అండ్ కేక్స్’ బేకరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బయటకు వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ప్రమాద సమయంలో బయటి నుంచి మూసివేసి ఉన్నట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. వారు బేకరీలో ఓ గదిలో నిద్రిస్తుండగా ప్రమాదం సంభవించడంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారని, ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 4.45 గంటలకు బేకరీలో మంటలు రేగడంతో అగ్ని మాపక యంత్రాలను హుటాహుటిన రప్పించారు. సిబ్బంది దుకాణం షట్టర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తుండగా యజమాని వచ్చి దాన్ని తెరిచారు. ప్రధాన షట్టర్ మూసివేసి ఉండటంతో బాధితులు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కోండ్వా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బస్సు కాలువలో పడి పది మంది మృతి సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లెహర్‌పూర్ బిశ్వా రోడ్డులోని శారదా కాలువలో ఓ ప్రైవేటు బస్సు పడిన దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. -
ఎయిర్పోర్ట్ వర్కర్లపై కాల్పులు
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్ ప్రావిన్స్‌లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వాహనంపై గుర్తు తెలియని దుండగుడు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలతో పాటు డ్రైవర్ మతి చెందాడు. మృతి చెందిన ఐదుగురు మహిళలను ఎయిర్ పోర్ట్ వర్కర్లుగా గుర్తించారు. ఎయిర్ పోర్టు ఉద్యోగుగులు విధులకు వెళ్తున్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుంది. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం తెలియరాలేదు. తాలిబాన్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు. -
ముంబైలో కారు బోల్తా ఆరుగురు మృతి
-
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
తిరువొత్తియూరు: రాష్ట్రంలో మంగళవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 నెలల పసికందుతో పాటు ఆరుగురు మృతి చెందారు. వ్యాన్ చెట్టును ఢీకొని ముగ్గురి మృతి: కోవై పాపంపట్టి సమీపం కోళ్లఫాం నుంచి బ్రాయిలర్ కోళ్లను ఎక్కించుకుని మంగళవారం రాత్రి వాల్పారైకు ఓ వ్యాన్ బయలుదేరింది. అన్నామలైకు చెందిన డ్రైవర్ ఆరుస్వామి (32). వ్యాన్ నడుపుతున్నాడు. వాల్పారైకు చెందిన శరవణన్ (29) కక్కన్రోడ్డుకు చెందిన లాలా (20) వ్యాన్‌లో ఉన్నారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ వ్యాన్ చన్రపాళయం వద్ద వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురు అదే స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న కినత్తుగౌడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఆటో బోల్తా: చిన్నారి మృతి :శీర్ఘాళి సమీపంలో కులైయారు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 10 నెలల పసికందు అదే స్థలంలో మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రజలు తెలిపారు. పోలీసులు ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. నక్కను బైకు ఢీకొని యువకుడి మృతి : ఉత్తుకోట, చెంగరై, తోటారెడ్డి కుప్పానికి చెందిన సెల్వం కుమారుడు మణి (21). ఇతను మంగళవారం రాత్రి ఊతుకోట నుంచి బైకులో ఇంటికి వస్తుండగా హఠాత్తుగా నక్క రోడ్డుపై అడ్డు రావడంతో బైకు నక్కను ఢీకొని మణి కింద పడి తీవ్ర గాయాలైంది. అదే సమయంలో నక్కకు గాయమై అడవిలోకి పారిపోయింది. ఆ మార్గంగా వచ్చిన ప్రజలు మణిని ఊతుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విద్యార్థి మృతి : మైలాపూర్ వీఎం రోడ్డులో ఉన్న ఇండియన్ బ్యాంక్ సమీపంలో బుధవారం ఉదయం బైకుపై వెళుతున్న విద్యార్థినిని ప్రభుత్వ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు చక్రం కింద పడిన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జంట పేలుళ్లు: 12మంది మృతి
పాకిస్థాన్ : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కోర్డు ఆవరణలో జరిగిన ఈ దాడిలో లాయర్లు, పోలీసులు ఎక్కువ సంఖ్యలో మరణించారు. కొద్ది రోజుల క్రితం లాయర్లను టార్గెట్ చేసుకుని పాక్ లోని ఓ ఆసుపత్రిలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
చౌడు మిద్దె కూలి ఆరుగురు మృతి
మైదుకూరు టౌన్: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చౌడు మిద్దె కూలిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల బంధువుల కథనం మేరకు.. ఉత్సలవరం గ్రామానికి చెందిన అంగంపల్లె చిన్న గుర్రప్ప, పెంచలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు, కుమారుడికి వివాహం కావడంతో కుమారుడు పక్కనే ఇంటిలో వేరుగా కాపురం ఉన్నాడు. అయితే చిన్నగుర్రప్ప దంపతులు, వారి పెద్ద కుమార్తె లలితలు ఒకే ఇంటిలో నివాసముంటున్నారు. లలితకు వివాహమైనప్పటికీ కుటుంబ తగాదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈమెకు యశ్వంత్ అనే కుమారుడు ఉన్నాడు. చిన్నకూతురైన హరిత బ్రహ్మంగారిమఠం మండలం పెద్దురాజుపల్లె గ్రామంలో వివాహం చేసుకోగా ఆమెకు నవనీత్, నిహారిక అనే పిల్లలు ఉన్నారు. చిన్న కుమార్తె హరిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సోమవారం సాయంత్రం పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం రావడంతో బాగా తడిచి ఉన్న పైకప్పు ఒక్కసారిగా ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్దం రావడంతో పక్కనే నివాసమున్న కొడుకు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసే సరికి చిన్నగుర్రప్ప(50), పెంచలమ్మ(44), హరిత(23), యశ్వంత్(6), నవనీత్(2) అక్కడికక్కడే మృతి చెంది ఉన్నారు. లలిత(27), నిహారిక (9నెలలు) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో వారిని ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందగా కేవలం 9నెలల నిహారిక మృత్యుంజయురాలుగా నిలిచింది. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
నిశీధిలో ఘోరం
నిశీధిలో నెత్తురోడిన రహదారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం పీఏపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో దుర్ఘటనలు పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని మార్గమధ్యలో మృత్యువు వెంటాడింది. మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు.. రెప్పపాటులో ఇద్దరిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన సింగిరెడ్డి భారతి రెడ్డి(62), వినయక్ శివరాంజురే(47) మృత్యువాత పడగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. - నార్కట్‌పల్లి నిబంధనలు అతిక్రమించి బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురిని మృత్యువు కబళించింది. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనేలోగానే కారు వారి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేసింది. మితిమీరిన వేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. పీఏపల్లి మండలం చిలకమర్రి స్టేజీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), నెహ్రూ (19),డప్పు శివ (20)తోపాటుత్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) మృత్యువాత పడ్డారు. - దేవరకొండ అతివేగం..అజాగ్రత్త.. నిర్లక్ష్యం..నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం...ఇవే ప్రమాదాలకు హేతువవుతాయి. పీఏపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో నాగార్జునసాగర్- హైదరాబాద్ రాష్ట్ర రహదారి, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఎల్లారెడ్డిగూడెం సమీపంలో మంగళ,బుధవారాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలకు ఇవే కారణాలని తెలుస్తోంది. రాత్రి వేళ, అందులోనూ నిద్రమత్తు కళ్లు మూసి తెరుచుకునేలోపలే ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో కొరవడిన అవగాహన లోపంతోనే జిల్లాలోని రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదని స్పష్టమవుతోంది. దేవరకొండ / నార్కట్‌పల్లి పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), త్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) బంధువులు. భాస్కర్ సోదరుడు సురేష్ హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ తమ బంధువైన లక్పతి వద్ద గతంలో నగదును అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పులో కొంత రుణం చెల్లిస్తానని సురేష్ చెప్పడంతో మంగళవారం లక్పతి, భాస్కర్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ సురేష్ వద్ద నగదు తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి బస్సులో వచ్చారు. చీకటి పడటం, తండాకు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారిని తీసుకెళ్లేందుకు వడ్త్య నెహ్రూ(19), డప్పు శివ(20)లు బైక్‌పై తండా నుంచి కొండమల్లేపల్లికి వచ్చారు. అనంతరం నలుగురు అదే బైక్‌పై 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేనావత్‌తండాకు బయల్దేరారు. అయితే కారణాలు స్పష్టంగా తెలియకున్నా పీఏపల్లి మండలం చిల్కమర్రి స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బుధవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు భాస్కర్, లక్పతిలకు వివాహం కాగా నెహ్రూ, శివలు అవివాహితులు. శివ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, భాస్కర్, నెహ్రూ, లక్పతిలు కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించేవారు. భాస్కర్, లక్పతిలకు మూడేళ్ల లోపు కుమారులున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు ఒకే నేనావత్ తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండా శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న బం దువులు బుధవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ చిల్కమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్త్య భాస్కర్, వడ్త్య నెహ్రూ, డప్పు శివ, లక్పతిల మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు బుధవారం సందర్శించా రు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను వారు పో లీసులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. ఆరని నెత్తుటి మరకలు చింతపల్లి : మితిమీరిన వేగానికి నిర్లక్ష్యం తోడవడంతో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై నెత్తుటి మరకల తడి ఆరడం లేదు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పుష్కర పనులు కొనసాగిస్తుండడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పవచ్చు. రెండు నెలల వ్యవధిలో ఈ రోడ్డుపై పదకొండు మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట ఈ రహదారిపై చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి. నిత్యం రద్దీగా.. ప్రతి రోజూ వందల సంఖ్యలో లారీలు, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలతో నాగార్జునసాగర్ - హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, నెల్లూరు, మాచర్ల, పొదిలి, ఒంగోలు, ప్రకాశం, దేవరకొండ, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా దర్శనమిస్తోంది. ప్రైవేట్వాహన చోదకులు రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వేగంగా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. రెండు నెలల కాలంగా ఈ రోడ్డుపై పుష్కర పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు జరుగుతున్న కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చింతపల్లి మండల పరిధిలోనే రెండు నెలల కాలంలో 8 ప్రమాదాలు జరుగగా 9 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. -
వరద ముంపులో పారిస్
జర్మనీ, ఫ్రాన్స్ వరదల్లో ఆరుగురు మృతి బెర్లిన్: జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు మరణించారు. లోయింగ్, సీన్ నదులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తున్నాయి. పారిస్, సెంట్రల్ ఫ్రాన్స్‌లో పాతిక వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. పలు వీధులు జలమయమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పాఠశాలలను మూసివేశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి కొందరు ఇళ్ల పైకప్పులు ఎక్కారు. రానున్న రోజుల్లో మరిన్ని వానలు కురిసే అవకాశం ఉంది. కాగా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండిలో పెనుగాలుల విధ్వంసానికి 36 మంది మరణించారు. -
కాశీలోనే అంత్యక్రియలు
కొవ్వూరు/నిడదవోలు : బీహార్‌లోని కై మూర్ జిల్లా మహన్య ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆరుగురు జిల్లా వాసులకు కాశీలోనే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దుర్ఘటనలో కొవ్వూరుకు చెందిన మాచవరపు సత్యనారాయణ (58),ఆయన తల్లి పద్మావతి(72), పెద కుమారుడు మాచవరపు పవన్ కుమార్ (23), నిడదవోలు పట్టణం రాయపేటకు చెందిన అత్తిలి శ్రీరామ్ (65), ఆయన భార్య సరస్వతీ దేవి(62), ఆయన సోదరి రుక్మిణీ (72) మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. వీరి మృతదేహాలకు మహన్య ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఉదయం పోస్టుమార్టం పూర్తిచేసిన అధికారులు సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబీకులు వారి మృతదేహాలను కాశీకి తీసుకెళ్లి రాత్రి అక్కడే అంత్యక్రియలు జరిపారు. ఇదే ప్రమాదంలో త్రీవంగా గాయపడిన సత్యనారాయణ భార్య లక్ష్మీ కళావతిని కాశీ నుంచి విమానంలో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు టికెట్ తీయగా, తీవ్రగాయాలతో ఉన్న ఆమెను విమానంలో తరలించేందుకు ఎయిర్ పోర్టు అధికారులు నిరాకరించడంతో వారణాసిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కాలు, పక్కటెముకలకు విరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కళావతికి అక్కడి వైద్యులు ఒక ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈమెకు మరో ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో వైద్యులు హైదరాబాద్ తీసుకువెళ్ల వచ్చునని సూచించినట్లు వివరించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఏస్... ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ తరలించాలని సూచించారు. దీంతో వారిని వరంగల్ తరలించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెంపో - లారీ ఢీ: ఆరుగురు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో ట్రావెల్స్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన వీరు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని స్వస్థలానికి టెంపోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులను సురేష్, పార్వతమ్మ, రమ్య, సుజ, గౌరమ్మ, టెంపో డ్రైవర్ కిరణ్‌లుగా గుర్తించామని చెప్పారు. మృతులంతా బెంగుళూరు నగరంలోని ఎలహంక, దినహరహళ్లిప్రాంతాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. -
చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురు మృతి
ముంబయి : మహారాష్ట్ర చంద్రాపూర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైనాలో అగ్నిప్రమాదం, ఆరుగురి మృతి
బీజింగ్ : చైనాలోని షాంగ్జీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఆరుమందికి పైగా మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడి అపార్ట్మెంట్ వద్ద స్థానికంగా పనిచేస్తున్న కొందరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. జ్ఞీ అనే ఇంటి పేరు ఉన్న ఓ వ్యక్తి నిన్న జరిగిన గొడవకు ప్రతీకారంగా అపార్ట్‌మెంట్‌కు నిప్పుపెట్టినట్లు వారు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని షాంగ్జీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వివరించారు. ప్రాథమికంగా దర్యాప్తు చేశామని ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. -
అయ్యో ఇస్మాయిల్..!
త్రిసూర్: ఇసాక్ ఇస్మాయిల్‌కు ఇప్పుడు 39 ఏళ్లు. పొలంలేని, ఇల్లు నడవని పరిస్థితుల్లో కొన్నేళ్ల కిందట తల్లి, భార్య, పిల్లల్ని వదిలి, పొట్ టచేతపట్టుకుని పనికోసం గల్ఫ్ వెళ్లాడు... కష్టపడ్డాడు. తాను తిన్నా తినకున్నా ఇంటికి మాత్రం ఠంచనుగా డబ్బు పంపేవాడు. కుటుంబం కుదురుకుంది. ఇక సొంత ఊళ్లోనే బతకొచ్చనే నమ్మకంతో ఇంటిబాటపట్టాడు. ఇస్మాయిల్‌ను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబమంతా ఎయిర్ పోర్టుకు వెళ్లింది. ఆలింగనాల తర్వాత అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ఆనందభాష్పాలు ఆరిపోకముందే ఆ కుటుంబంలో నలుగురి ప్రాణాలు ఆవిరైపోయాయి. కేరళలోని త్రిసూర్ జిల్లా పుతుక్కాడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్మాయిల్ కుటుబంతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారి కారు, ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి లోతైన నీటిగుంటలో పడిపోయింది. ఈ ఘటనలో ఇస్మాయిల్ సహా అతని తల్లి హొవమ్మ(58), భార్య హఫ్సాత్ (32), కూతురు ఇర్ఫానా (3)లతోపాటు బావమరిది మన్సూర్(42), డ్రైవర్ కృష్ణప్రసాద్(36) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్నపోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని, ఇస్మాయిల్ కొడుకు హయాస్(10)ను మాత్రం కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడ్డ హయాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
దసరా పండుగ రోజు రెండు విషాదాలు
పట్నా: బిహార్ రోడ్డు ప్రమాదాలు దసరా పండుగ రోజు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు సంఘటనల్లో ఆరుగురు చనిపోగా మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న వాహనం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఒక బాలిక ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా చారాపట్టి గ్రామంనుంచి ముంగర్ లో జరగనున్న దసరా ఉత్సవాలను తిలకించేందకు వెళతుండగా జెహానాబాద్ జిల్లా ముంగర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కుటుంబ సంక్షేమ పథకం కింద ఇరవై వేల రూపాయలను చెల్లించనున్నట్టు జిల్లా ఉన్నతాధికారి ప్రకటించారు. క్షతగాత్రులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. మరో విషాదం సికారియా గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వ్యాన్ కారు ఢీకొన్న ప్రమాదం పన్నెండేళ్ల బాలుడు అక్కడిక్కడే ప్పాణాలు విడిచాడు.మరో పది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ తెలిపారు. -
రణరణంగా మారిన కాశ్మీర్
-
ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
కాబుల్: అఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగి పోయారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిపలువురు అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. లోఘార్ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం ఒంటినిండా బాంబులు ధరించుకున్న ఓ ఉగ్రవాది రద్దీగా ఉన్న ప్రాంతంలోకి వచ్చి ఒక్కసారిగా తనను తాను పేల్చి వేసుకున్నాడు. దీంతో ఆరుగురు ప్రాణాలుకోల్పోగా పలువురు గాయాలపాలయ్యారు. దాడి విషయంలో ఏ ఉగ్రవాద సంస్థ నోరు మెదపలేదు. -
ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురి మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఉల్సాలోని హన్వా కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే మంటల్లో కాలిబూడిదయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కెమికల్ ట్యాంక్‌లోకి దిగి మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా పేలుడు జరిగి ఉండొచ్చని అగ్రిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది కార్మికులు ఈ మంటల్లో చిక్కుకున్నారు, వారిలో ఎంతమంది బతికి ఉండే అవకాశముందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పేలుడుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లి వేడుక వద్ద ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
లాగోస్: పెళ్లి వేడుకే లక్ష్యంగా ఆత్మాహుతి జరిపిన దాడిలో ఆరుగురు మరణించగా...మరో ముప్పై మంది గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియా బొర్నో రాష్ట్రంలోని తాశన్ అల్డీ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి శనివారం మైదగురిలో వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నట్లు చెప్పారు. నైజిరీయాలోని బోకో హరామ్ తీవ్రవాదులు మైదగురి పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 2014లో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేసిన విషయం విదితమే. -
ఆరుగురిని తొక్కి చంపిన మదగజం
సితామర్హీ: బిహార్‌లో అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించిన ఓ మదపుటేనుగు బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని తొక్కి చంపింది. మరో నలుగురిని తీవ్రంగా గాయపర్చింది. సంఘటనపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి దుర్మరణం
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు వుండలం సీతారాంపేట వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి వుండలం గంగిరెడ్డి పాలేనికి చెందిన వూమిడి వెంకటేశ్వర్లు, ఆయున బంధువులు తిరుమలకు టవేరా వాహనంలో శుక్రవారం సాయుంత్రం బయులుదేరారు. డ్రైవర్ సహా 11మంది అందులో ఉన్నారు. శనివారం తెల్లవారుజావుున సీతారాంపేట వులుపు వద్దకు రాగానే వాహనాన్ని తమిళనాడులోని రాణిపేట నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళుతున్న కంటైనర్ ఢీకొంది. టవేరాలో ఉన్న ఆరుగురు మృతిచెందగా, అయిదురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం
-
కారు, లారీ ఢీ, ఆరుగురి దుర్మరణం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. సీతారాంపేట గ్రామం సమీపంలో కారు, లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డి పాలెంకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కారులో తిరుమల వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కోటేశ్వరమ్మ, తిరుపాలు, భార్గవి, వెంకటేశ్వర్లు, నాగరాజు, డ్రైవర్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటోను ఢీకొన్న లారీ
ఆరుగురి దుర్మరణం.. మెదక్ జిల్లా కంది శివారులో ఘటన సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్చెరు నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న ఆటోను కంది గ్రామ శివారులోని ఐఐటీ వద్ద లారీ వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన నిరూప(35), నవీన్‌కుమార్(28), సదాశివపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్(28), బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35) ఉన్నారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ రాజేష్(30), కందికి చెందిన శివకుమార్(28), సదాశివపేటకు చెందిన నిరీక్షణ్(26) ఉన్నారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ రాహుల్‌బొజ్జా, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న సందర్శించారు. సీఎం దిగ్భ్రాంతి: మెదక్ జిల్లా కంది ఐఐటీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు, ఆరుగురు మృతి
రాయగడ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవినాష్ శర్మతో పాటు, అసిస్టెంట్ కానిస్టేబుల్ సోను అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన బీఎస్ఎఫ్ జవాన్లను గుర్తించాల్సి ఉంది. కాగా గాయపడిన మరో ముగ్గురు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించినట్లు ఇంటిలిజెన్స్ వింగ్ ఐజీ తెలిపారు. -
వేరువేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుమంది మృతి చెందారు. .ప్రకాశం జిల్లా పామూరులో సాయిబాబా గుడి నిర్మాణ పనుల్లో ఉండగా పిల్లర్ కూలి శ్రీను అనే మేస్త్రి మృతి చెందాడు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాజీవ్ నగర్ లో్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. -
ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
తిరువంతనపురం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన గురువారం ఉదయం కేరళలో చోటు చేసుకుంది. ఓ కారు అతి వేగంగా దూసుకుని లారీలోకి చొచ్చుకుపోవడంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కోల్లాం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వార్కలా బీచ్ లో న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ఆ విద్యార్థులు పయనిస్తున్న కారు అతి వేగంగా లారీ క్రింది భాగంలోకి దూసుకుపోవడంతోనే ఈ ఘోరం సంభవించిదని లారీ డ్రైవర్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను బయటకు తీయడం కష్టతరంగా మారింది. -
లారీ బోల్తా,ఆరుగురు మృతి
-
రెండు రైళ్లు ఢీ: ఆరుగురు మృతి
-
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
భువనేశ్వర్ : ఒడిశా రాయగడ్ జిల్లా భాతాపుర సమీపంలో బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పుల్వానీ నుంచి బలిమెల తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవటం వల్లే చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
బస్సును ఢీకొన్న లారీ: ఆరుగురి మృతి
కల్పలమడుగు:మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. కోలార్ జిల్లాలోని కల్పలమడుగు వద్ద సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక బస్సును అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు బోల్తా : ఆరుగురు ప్రయాణికులు మృతి
చైనాలోని చాంగ్కింగ్ నగరంలో బస్సు బోల్తా పడి ఆరుగురు మరణించారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మొత్తం 53 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు టైర్ పేలింది. దాంతో బస్సు బోల్తా పడిందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రమాదం శనివారం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. -
ఖమ్మం జిల్లా ఇల్లెందు వద్ద కారు-లారీ ఢీ
-
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుండ్రత్తూరు వర్షానగర్‌కు చెందిన మాణిక్యం (50), కన్నన్ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు. వీరు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో పూందమల్లి నుంచి బైకులో కుండ్రత్తూర్కు బయలుదేరారు. వీరిని కొల్లాచ్చి వద్ద లారీ ఢీకొంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ వచ్చే లోపు మాణిక్యం మృతి చెందాడు. కన్నన్ను కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని చూసిన ప్రజలు ఆగ్రహం చెంది లారీని ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై ధర్నా చేశారు. లారీ డ్రైవర్ రాజేంద్రన్ (35)మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.చెట్టు నరుకుతూ కిందపడిన వ్యక్తి మృతిచెన్నై తిరువికానగర్ టీటీ తోటకు చెందిన మోహన్ ఇల్లు కట్టుకునేందుకు చెట్టును తొలగించాలని కీల్పాకంకు చెందిన కుమార్ (45)ను పిలిపించాడు. కుమార్ చెట్టుపైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. తిరువికా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా: నలుగురి మృతి కన్యాకుమారి జిల్లా మార్తాండం మాకోడుకు చెందిన బ్యాండు వాద్యం బృందం మదురై మేలూరులో జరిగే వివాహ కార్యక్రమానికి శనివారం కారులో బయలుదేరారు. పాళయం కోట్టై పెరుమాల్‌పురం వద్ద 25 అడుగుల వంతెనపై వెళుతుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. 12 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ మాకోడుకు చెందిన జాని భార్య చిత్ర (26) మృతి చెందింది. పుదుచ్చేరి విల్లియలూరుకు చెందిన శరవణన్ (41) ఆచార్య విద్యా సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో నిత్యానందన్ (35), బాలాజీ (37), మొదలియార్ పేటకు చెందిన సుధాకర్ (40) పని చేస్తున్నారు. శరవణన్ బంధువు ఒకరికి ఆదివారం ఉదయం నెల్లైలో వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరు కావడానికి శరవణన్, సుధాకర్, నిత్యానందన్, బాలాజీ పుదుచ్చేరి నుంచి నెల్లైకి కారులో బయలుదేరారు. కారును నిత్యానందన్ నడుపుతున్నాడు. కోవిల్పట్టి సమీపంలో అర్ధరాత్రి 11.50 గంటల సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారులో చిక్కుకున్న శరవణన్, నిత్యానందన్, బాలాజీ అక్కడికక్కడే మృతి చెందారు. సుధాకరన్ తీవ్రంగా గాయపడ్డాడు. కోవిల్పట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
-
డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు: ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరవక ముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా ధాను రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో బాంద్రా- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మూడు బోగీల్లోకి మంటలు వ్యాపించడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. S-2, S-3, S-4 బోగీల్లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో ఊపిరి ఆడక ఆరుగురు సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే మూడు బోగీలు దగ్ధమయ్యాయి. డెహ్రాడూన్ నుంచి రైలు ముంబైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ప్రయాణీకులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఓ బోగిలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు బోగిలకు త్వరితగతిన వ్యాపించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని అధికార ప్రతినిధి వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. డెహ్రాడూన్ నుంచి ముంబయి వెళ్తుండగా ఈ రోజు తెల్లవారుజామున 2.30 నిమిషాలకు ఆ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికార ప్రతినిధి వివరించారు. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 022-23011853, 022-23007388 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
రెండు బస్సులు ఢీ: ఆరుగురు ప్రయాణీకులు మృతి
బీహార్ శరన్ జిల్లాలోని మర్హ్రా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మర్హర్ సమీపంలో పాట్నా నుంచి చాప్రా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని జిల్ఆ ఎస్పీ భరణ్ కుమార్ సిన్హా వెల్లడించారు. మృతులను గుర్తించవలసి ఉందని తెలిపారు. అయితే గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని భరణ్ కుమార్ చెప్పారు. -
అసోంలో మిలిటెంట్ల దాడి, ఏడుగురు మృతి
గోల్పారా: దీపావళి సందర్భంగా తీవ్రవాదులు తెగబడ్డారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సామాన్యులపై రెచ్చిపోయారు. ఆర్మీ యూనిఫాంలో వచ్చి టీ షాపు ముందు సేద దీరుతున్న గిరిజనులపై కాల్పులకు తెగబడ్డారు. ఏడుగురు మరణించగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యేక మేఘాలయ కోసం పోరాడుతున్న "గరో నేషనల్ లిబరేషన్ ఆర్మీ "కి చెందిన తీవ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. స్థానిక కౌన్సిల్ ఎన్నికల పై ఏర్పడిన వివాదం కారణంగానే ఈ ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అధునాతన ఆయుధాలతో వారు కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న రబా హజోంగ్ గిరిజనులు, ఎన్నికలకు అనుకూలంగా ఉన్న ఇతర వర్గాల మధ్య అక్టోబర్ నుంచి అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 13, 25వ తేదీల్లో జరగనున్నాయి. జిల్లాలో రబా హజోంగ్ ఆధిపత్యం ఉంది. తమకు తాము పాలించుకునేందుకు స్వయం ప్రతిపత్తి కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.