ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం | Six students die in Kerala road accident | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం

Published Thu, Jan 1 2015 10:51 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Six students die in Kerala road accident

తిరువంతనపురం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందిన ఘటన గురువారం ఉదయం కేరళలో చోటు చేసుకుంది. ఓ కారు అతి వేగంగా దూసుకుని లారీలోకి చొచ్చుకుపోవడంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  కోల్లాం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వార్కలా బీచ్ లో న్యూఇయర్ వేడుకలకు హాజరైన టీకేఎమ్ కోలమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.

 

ఆ విద్యార్థులు పయనిస్తున్న కారు అతి వేగంగా లారీ క్రింది భాగంలోకి దూసుకుపోవడంతోనే ఈ ఘోరం సంభవించిదని లారీ డ్రైవర్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను బయటకు తీయడం కష్టతరంగా  మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement