తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన పతనంతిట్టా జిల్లాలోని కిజవళ్లూర్ వద్ద శనివారం జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కారును బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
దీంతో కారు దూరంగా ఎగిరిపడి రోడ్డు పక్కన ఆగిపోగా.. కారును తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్‌ను ఎడమ వైపు తిప్పగా.. రోడ్డుకు ఆనుకొని ఉన్న చర్చి గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చర్చి ఆర్చి కుప్పకూలింది. అదే విధంగా పలువురికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షపు డ్రైవింగ్‌యే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
#WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR
— ANI (@ANI) March 11, 2023
Comments
Please login to add a commentAdd a comment