హోంగార్డు ఉదారత, సోషల్‌ మీడియాలో ప్రశంసలు | Kerala Home Guard Comforts Baby After Family Meets With An Accident | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఉదారత, సోషల్‌ మీడియాలో ప్రశంసలు

Published Thu, Mar 11 2021 4:42 PM | Last Updated on Thu, Mar 11 2021 4:58 PM

Kerala Home Guard Comforts Baby After Family Meets With An Accident - Sakshi

ఇటీవల కేరళలో జరిగిన  ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం తీవ్ర గాయాలపాలైంది. దీంతో స్థానికులంత హుటాహుటిని వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ కుటుంబానికి చెందిన 7 నెలల చిన్నారిని అక్కడే వదిలేశారు. అమ్మ-నాన్న ఎవరూ కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించిన ఆ చిన్నారిని అక్కడే ఉన్న ఓ హోంగార్డు చేరదీసి లాలించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విధులు నిర్వహిస్తునే చిన్నారిని బుజ్జగిస్తున్న సదరు హోంగార్డుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సదరు హోంగార్డు హృదయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  ‘ఈ పోలీసుకు బిగ్‌ సెల్యూట్‌’, ‘లెజెండరీ’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

32 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బుధవారం కేరళ పోలీసులు ట్విటర్‌లో‌ షేర్‌ చేశారు. ఇందులో దీనికి ‘రామపురంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన వారంత తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం నుంచి 7 నెలల చిన్నారి బయటపడింది. దీంతో ఆ పాపను రోడ్డు మీదే వదలిలేశారు. ఇక కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడంతో చిన్నారి ఏడవడం ప్రారంభించింది. అక్కడే విధులు నిర్వహిస్తోన్న హోంగార్డు చిన్నారిని దగ్గరకు తీసుకుని లాలించాడు. పాప ఏడవకుండా భుజాన వేసుకుని ఆటుఇటూ తిరుగుతూ భుజ్జగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది గంటల తర్వాత పాపకు సంబంధించిన బంధువులు వచ్చి తీసుకుని వెళ్లారు’ అంటూ తమిళంలో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement