
కేరళ వయనాడ్ విషాద దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక విషాద కథనాలు, హృదయవిదారక అంశాలు ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వయనాడులో విధ్వంసం తరువాత.. ఒక తల్లి కోతి తను కన్నపిల్లను కాపాడుతున్న విధానం కంటతడిపెట్టిస్తోంది. ఎంతైనా అమ్మ అమ్మే అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రెండు కోతి పిల్లలు బురదలో భయంతో వణుకుతూ బిక్కు బిక్కు మంటూ ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉండటాన్ని చూడొచ్చు. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
#KeralaDisaster #WayanadLandslide pic.twitter.com/pILH3hM8pq
— Harish R.Menon (@27stories_) August 6, 2024
కాగా కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు.