Landslide
-
మేఘాలయలో ఆకస్మిక వరదలు..10 మంది మృతి
షిల్లాంగ్:మేఘాలయలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా సౌత్‌గారో హిల్స్ జిల్లాలో వరదలు వచ్చాయి. కేవలం 24 గంటలపాటు కురిసిన వర్షాలకే వరదలు రావడంతో ప్రాణనష్టం జరిగింది.వరదల వల్ల సౌత్‌గారో హిల్స్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగిపడడంతో మొత్తం 10 మంది మరణించారు. ఒకే కుంటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమీక్ష నిర్వహించారు.ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు.ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: ఆహారంలో బల్లి..50 మందికి అస్వస్థత -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
వయనాడులో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
నెల రోజుల క్రితం కేరళలోని వయనాడులోని ముండక్కై, చురల్మల ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడి 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే మరోమారు పంచరిమట్టం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన అనంతరం అధికారులు ఈ ప్రాంతంలోని వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత జూలై నెలలో కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత ప్రాంతానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఘటన జరిగిన ప్రాంతాలను ప్రభుత్వం నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు తాజాగా మరోమారు కొండచరియలు విరిగిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
వయనాడ్ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు: మోదీ
కేరళలో ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్ విలయ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని మోదీ పరామర్శించారు. అనంతరం కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్రమంత్రి సురేష్ గోపి, ఇతర యవనాడ్ ఉన్నతాఅధికారులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. #WATCH | Kerala: Prime Minister Narendra Modi holds a review meeting with officials regarding the landslide-affected area in Wayanad.Governor Arif Mohammed Khan, CM Pinarayi Vijayan and Union Minister Suresh Gopi are also present.(Source: DD News) pic.twitter.com/Yv6c0sU36Y— ANI (@ANI) August 10, 2024ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వయనాడ్‌లో కొండచరియలు విగిరిపడినప్పటి నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విపత్తులో వందలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారని అన్నారు. ప్రకృతి విలయంలో వాళ్ల కలలన్నీ కల్లలైపోయాయని అన్నారు. ఈ దుఃఖ సమయంలో మీకు అండగా ఉంటామని బాధితులకు చెప్పినట్లు తెలిపారు. #WATCH | Kerala: Wayanad landslide: Prime Minister Narendra Modi says "I have been taking information about the landslide since the time I got to know about the incident. All the agencies of the Central Govt who could have helped in the disaster were mobilised immediately. This… pic.twitter.com/k1ZhFreScZ— ANI (@ANI) August 10, 2024 ‘ఈ రోజు నేను రిలీఫ్ క్యాంపులో బాధితులను స్వయంగా కలిశాను. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించాను. వారు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు. వయనాడ్ విలయంలో చిక్కకున్న వారికి అండగా నిలవాలి. అంతా కలిసి పనిచేస్తేనే బాధితులకు అ అండగా ఉండగలం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కలిసి పనిచేయాలి. ఆప్తులను కోల్పోయిన వారికి అండగా నిలుద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నష్టం అంచనాలు పంపిన వెంటనే ప్రకృతి విపత్తు సాయం అందిస్తాం#WATCH | Kerala | Wayanad landslide: Prime Minister Narendra Modi says "I had a conversation with CM Pinarayi Vijayan the morning when the incident took place and assured him that we will provide assistance and try to reach the spot as soon as possible. NDRF, SDRF, Army, Police,… pic.twitter.com/CaLZnnDbhO— ANI (@ANI) August 10, 2024సంఘటన జరిగిన రోజు ఉదయం నేను సిఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. మేము సహాయం అందజేస్తామని, వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాను. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. సైన్యం, పోలీసులు, వైద్యులు, ప్రతి ఒక్కరూ బాధితులకు వీలైనంత త్వరగా సహాయం చేయడానికి ప్రయత్నించారు. మృతుల కుటుంబీకులు ఒంటరిగా లేరని నేను హామీ ఇస్తున్నాను. వారికి మేము అండగా ఉన్నాం. కేరళ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం వారికి సాయం చేస్తోంది. ’ అని తెలిపారు. -
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.#WATCH | Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts. Governor Arif Mohammed Khan and Union Minister Suresh Gopi are also present. (Source: DD News) pic.twitter.com/rANSwzCcVz— ANI (@ANI) August 10, 2024 కేరళలో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ ప్రాంతంలో ప్రధాని మోదీ శనివారం(ఆగస్టు10) పర్యటిస్తున్నారు. పర్యటన కోసం కేరళలోని కన్నూర్ విమానాశ్రయానికి ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకున్నారు. ఇక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ వెళ్లి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించారు. Kerala: Prime Minister Narendra Modi arrives at Kannur Airport; received by Governor Arif Mohammed Khan and CM Pinarayi VijayanPM Modi will visit Wayanad to review relief and rehabilitation efforts(Pics source: CMO) pic.twitter.com/sfbP5lm0HU— ANI (@ANI) August 10, 2024 -
413కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఈ భారీ విపత్తుకు బలయినవారి సంఖ్య 413కి చేరింది. ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సివుంది. వారి కోసం 10వ రోజు(గురువారం)కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కేంద్ర అధికారుల బృందం నేతృత్వంలో రక్షణ ఏజెన్సీలకు చెందిన వెయ్యిమందికిపైగా సభ్యులు గురువారం తెల్లవారుజాము నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా వయనాడ్, మలప్పురం జిల్లాలోని చలియార్ నది గుండా వెళ్లే ప్రాంతాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నది నుండి మృతదేహాలను, శరీరభాగాలను వెలికితీసి తొలుత వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపి, అనంతరం వాటిని గుర్తిస్తున్నారు.ఆ తరువాత ఆ మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఆనంతరం ఆయా సమాధుల ముందు నంబర్ల రాసి, డీఎన్ ఏ రిపోర్టు ఆధారంగా బంధీకులకు అధికారులు తెలియజేస్తున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వందకుపైగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా, 10వేలమందికిపైగా బాధితులు వీటిలో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు మూడు దశల్లో పునరావాసం కల్పిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
వయనాడ్ విషాదం : ఇదో కన్నీటి వ్యథ!
కేరళ వయనాడ్ విషాద దృశ్యాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక విషాద కథనాలు, హృదయవిదారక అంశాలు ప్రకృతి సృష్టించిన ప్రకోపానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వయనాడులో విధ్వంసం తరువాత.. ఒక తల్లి కోతి తను కన్నపిల్లను కాపాడుతున్న విధానం కంటతడిపెట్టిస్తోంది. ఎంతైనా అమ్మ అమ్మే అంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో రెండు కోతి పిల్లలు బురదలో భయంతో వణుకుతూ బిక్కు బిక్కు మంటూ ఒకదాన్ని ఒకటి పట్టుకుని కూర్చుని ఉండటాన్ని చూడొచ్చు. దీనిని గమనించిన వ్యక్తి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. #KeralaDisaster #WayanadLandslide pic.twitter.com/pILH3hM8pq— Harish R.Menon (@27stories_) August 6, 2024కాగా కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయానికి దాదాపు 400 వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. -
వయనాడ్ విషాదానికి ఇదీ ఓ కారణమే..!
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తూంటారు.అంటే దేవుడి సొంత దేశం అని! మరి...దేవుడు తన సొంత దేశాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు?వయనాడ్‌లో అంత విలయం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దేవుడు కాదు.. మనిషే!ఎందుకంటే జూలై 30న కురిసిన కుంభవృష్టి... పల్లెలకు పల్లెలు కొట్టుకుపోవడం...మానవ చర్యల ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావమే మరి!!దేవుడి ప్రస్తావన ఎలాగూ తీసుకొచ్చాం కాబట్టి.. కాసేపు రామరాజ్యంలోకి వెళదాం. అప్పట్లో నెలకు రెండు వానలు ఎంచక్కా కురిసేవని, ఏటా బంగారు పంటలు పండేవని.. ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారని పురాణ గాధలు చెబుతాయి. అయితే ఇప్పుడు రాముడు లేడు కానీ.. ప్రకృతిని చెరబడుతున్న రావణాసులు మాత్రం ఎందరో. అభివృద్ది పేరుతో ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీయడం, విద్యుత్తు, తదితరాల కోసం పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వినయోగం పుణ్యమా అని ఇప్పుడు వాతావరణ మార్పులు మనల్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లో కురిసిన కుంభవృష్టి... ఢిల్లీ, ముబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాలను ముంచెత్తిన వరదలు అన్నీ ప్రకృతి ప్రకోపానికి మచ్చుతునకలే. మరో తాజా ఉదాహరణ వయనాడ్ విలయం!. ఇంతకీ జూలై 30 తేదీన వయనాడ్ ప్రాంతంలో ఏం జరిగింది? అప్పటివరకూ వర్షాభావాన్ని అనుభవిస్తున్న ఆ ప్రాంతం కేవలం ఒకే ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకు ఎక్కింది. మంచిదే కదా? అనుకునేరు. అతితక్కువ సమయంలో ఎక్కువ వానలు కురవడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మేఘాల నుంచి జారిపడే చినుకులను ఒడిసిపట్టేందుకు.. సురక్షితంగా సముద్రం వరకూ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు అంటే... నదులు, చెరువులు భూమ్మీద లేవు మరి! ఫలితంగానే ఆ విపరీతమైన కుంభవృష్టికి కొండ సైతం కుదేలైంది. మట్టి, బురద, రాళ్లు వేగంగా లోయ ప్రాంతంలోకి వచ్చేసి పల్లెలను మింగేశాయి.ఏటా నైరుతి రుతుపవనాల రాక కేరళతోనే మొదలవుతుంది మనకు తెలుసు. జూన్‌తో మొదలై సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవన కాలంలో వయనాడ్ ప్రాంతంలో సగటు వర్షపాతం 2,464.7 మిల్లీమీటర్లు (మి.మి). అయితే గత ఏడాది రుతు పవనాల వైఫల్యం కారణంగా ఇక్కడ 55 శాతం తక్కువ వర్షం నమోదైంది. అంతేకాదు... 128 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాభావ పరిస్థితులను కేరళ రాష్ట్రం మొత్తం ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలోనే ఉన్న వయనాడ్‌లో ఈ ఏడాది జూన్ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సుమారు సాధారణ వర్షపాతం (574.8 మి.మి) కంటే 42 శాతం తక్కువగా 244.4 మి.మి వర్షం మాత్రమే కురిసింది. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసినా అది సాధారణం కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. జూలై 29న నమోదైన తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సగటు వర్షపాతమైన 32.9 మిల్లీమీటర్లలో నాలుగో వంతు కంటే కొంచెం ఎక్కువ. కానీ జూలై 30న పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. సాధారణ 23.9 మిల్లీమీటర్ల స్థానంలో ఏకంగా 141.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. వయనాడ్ ప్రాంతంలోని వియత్రిలోనైతే ఇది పది రెట్లు ఎక్కువ. అలాగే మనటోడిలో 200 మి.మిలు, అంబాలవయ్యల్లో 140 మి.మి. కుపాడిలో 122 మి.మి.ల వర్షం కురిసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. అంటే.. నాలుగు నెలల్లో కురవాల్సిన వానలో ఒకే రోజు దాదాపుగా ఆరు నుంచి పది శాతం కురిసేసిందన్నమాట!. జూలై 10 నుంచి జూలై 30 వరకూ కురిసిన వాన కూడా సగటు వర్షపాతంలో 28 శాతం వరకూ ఉండటం గమనార్హం. కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం వేడెక్కుతోందని.. పరిస్థితిని అదుపు చేయకుంటే.. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయని శాస్త్రవేత్తలు ఏళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజమేనని మరోసారి రుజువైనట్లు వయనాడ్ ఉదంతం స్పష్టం చేస్తోంది. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి. -
‘సాహో సీత’.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
కేరళ వయనాడ్ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయ విధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే.. దేశంలోని సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోపై ప్రశంసల వర్షం కురిపించారు.మేజర్ సీతా అశోక్ షెల్కే ఫోటోను షేర్ చేస్తూ ఆమెను వయనాడ్ వండర్ఫుల్ ఉమెన్ అంటూ కొనియాడారు.మాకు డీసీ సూపర్ హీరోలు అవసరం లేదు. ఎందుకంటే మాకు నిజజీవితంలో మేజర్ సీతా అశోక్ షెల్కేలాంటి వారు ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. The WonderWoman of Wayanad. No need for DC Super Heroes. We have them in real life out here…💪🏽💪🏽💪🏽 pic.twitter.com/DWslH6nKln— anand mahindra (@anandmahindra) August 3, 2024 ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కో ఎవరు?భయంకరమైన విషాదాన్ని నింపిన వయనాడ్‌లో బాధితుల్ని రక్షించేందుకు రికార్డ్ సమయంలో తాత్కాలిక వంతెనల నిర్మాణం సీత ఆధ్వర్యంలోనే జరిగింది. వయనాడ్‌లో ముందక్కై, చురాల్‌మల్‌లను కలుపుతూ ప్రతికూల వాతావరణంలో తాత్కాలిక బ్రిడ్జి నిర్మాణం జులై 31 రాత్రి 9గంటలకు ప్రారంభించి.. మర్నాడు సాయంత్రం 5.30గంటలకల్లా వంతెన పూర్తి చేశారు. 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను త్వరగా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కొండచరియలు విరిగిపడి శిధిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం మరింత సులభమైంది. అందుకే దేశ ప్రజలు ఆర్మీ మేజర్ సీతా అశోక్ షెల్కోను అభినందనలతో ముంచెత్తుతున్నారు. If possible, don’t destroy this bridge once a more permanent structure is restored. It should serve as a symbol of our pride in our army and the sense of security we derive from our soldiers. https://t.co/ZwNJZR4xbw— anand mahindra (@anandmahindra) August 4, 2024 -
వయనాడ్ సహాయక చర్యల్లో మన్యం పులి.. రియల్ ‘హీరో’ అంటూ ప్రశంసలు (ఫొటోలు)
-
వయనాడ్ అప్డేట్స్: కర్నాటక ఆపన్న హస్తం
Updatesకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఐదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో గల్లంతైన వారిపై ఆచూకీ కోసి రెస్క్యూ బృందాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి మనుషుల జాడను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాలతో.. మృతుల సంఖ్య 358కి చేరుకుంది. ఇందులో 146 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 215 మృతదేహాలు వెలికి తీశామని, 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.Wayanad landslides: 215 bodies recovered, 206 people still missing, rescue ops in final stage, says Kerala CMRead @ANI Story | https://t.co/YFqTebrZCS#KeralaCM #WayanadLandslides #PinarayiVijayan pic.twitter.com/Rv27vnPr3C— ANI Digital (@ani_digital) August 3, 2024 వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అన్నారు. 100 ఇళ్లులు నిర్మిస్తాం: కర్ణాటక సీఎంవయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యఈ విషయం కేరళ సీఎం పినరయి విజయన్‌కు తెలిపినట్లు ఎక్స్‌లో పోస్ట్ In light of the tragic landslide in Wayanad, Karnataka stands in solidarity with Kerala. I have assured CM Shri @pinarayivijayan of our support and announced that Karnataka will construct 100 houses for the victims. Together, we will rebuild and restore hope.— Siddaramaiah (@siddaramaiah) August 3, 2024 కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు నేటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.సైన్యానికి సలాం వయనాడ్ విపత్తు నాటి నుంచి సహాయక చర్యల్లో భారత సైన్యం పోషిస్తున్న పాత్ర అమోఘం. తక్షణ వారధిల నిర్మాణం దగ్గరి నుంచి.. వరదల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించడానికి దాకా.. అంతటా సాహసం ప్రదర్శిస్తోంది. తాజాగా.. ఓ కుటుంబాన్ని రక్షించడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా.. సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీపోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు. Kerala. pic.twitter.com/f4T4Lam45I— Comrade Mahabali (@mallucomrade) August 2, 2024 ముఖ్యమంత్రి పినరయ విజయన్, ఆయన భార్య టీ. కమలా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. లక్షా 33 వేల విరాళం ప్రకటించారు. ఆరు జోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్‌లో డీప్ సెర్చ్ రాడార్లను పంపాలని కేంద్రానికి కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో నార్తర్న్ కమాండ్ నుంచి ఒక జేవర్ రాడార్, ఢిల్లీ, తిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుంచి నాలుగు రీకో రాడార్లను ఇవాళ వయనాడ్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించారు.వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. గతంలో ఆయనకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీలో కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. వాళ్ల సేవల్ని కొనియాడారు. కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అంతకు ముందు.. వయనాడ్ కొండచరియలు విరిగిన పడిన ప్రాంతాల్లో పునరావాసం కోసం రూ.3 కోట్లు విరాళం ఇచ్చారాయన. #WATCH | Actor and Honorary Lieutenant Colonel Mohanlal visited landslide-affected Punchiri Mattam village in Wayanad#Kerala pic.twitter.com/ckp2uAhyaE— ANI (@ANI) August 3, 2024 మలయాళ నటుడు మోహన్‌లాల్ వయనాడ్‌లోని కొండరియలు విరిగినపడిన ప్రాంతాన్ని సందర్శించారు. సహాయక, గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ సైనికులతో పరిశీలించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ప్రమాద తీవ్రతను వివరించారు. #WATCH | Kerala: Indian Army jawans construct a temporary bridge for the machinery to pass through, to facilitate search and rescue operation. Visuals from Punchirimattom, Wayanad. Search and rescue operation in landslide-affected areas in Wayanad, entered 5th day today. The… pic.twitter.com/FKrBiiI4qp— ANI (@ANI) August 3, 2024 ఇండియన్ ఆర్మీ జవాన్లు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించే యంత్రాలు తీసుకువెళ్లడానికి తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఇంకా 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.#WATCH | Kerala: Search and rescue operations in landslide-affected areas in Wayanad entered 5th day today. The death toll stands at 308.Drone visuals from Bailey Bridge, Chooralmala area of Wayanad. pic.twitter.com/OQ7GpKvwND— ANI (@ANI) August 3, 2024 దీంతో కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు.Wayanad landslides: Search operation enters Day 5, death toll at 308Read @ANI Story | https://t.co/94yPyDrseW#WayanadLandslides #Kerala #VeenaGeorge pic.twitter.com/c3PstYyb4z— ANI Digital (@ani_digital) August 3, 2024 -
కేరళలో ప్రకృతి విపత్తు : వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక
తిరువనంతపురం : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్ర గురువారం (ఆగస్ట్1) కేరళలో కొండచరియలు విరిగిపడిన వయనాడ్‌లో చూరల్మల ప్రాంతాన్ని సందర్శించారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన స్థానికుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాల కారణంగా మంగళవారం వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 256 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటంతో కేరళ జిల్లాలోని ముండక్కై, చూరల్మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.LoP Shri @RahulGandhi & AICC General Secretary Smt. @priyankagandhi ji visit the Chooralmala landslide site in Wayanad where devastating landslides have claimed many lives and left families devastated.📍 Kerala pic.twitter.com/EnPakO8tJC— Congress (@INCIndia) August 1, 2024కొండచరియలు విరిగిపడటంతో 200 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ సుమారు 1,000 మందిని రక్షించింది . 220 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వయనాడ్ వరదల నుంచి ప్రజల నుంచి భద్రతా బలగాలు చేస్తున్న సహాయక చర్యలు గురువారానికి మూడోరోజుకి చేరుకున్నాయి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (హెచ్ఎడిఆర్) ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం కనీసం 1,500 మంది ఆర్మీ సిబ్బందిని, ఫోరెన్సిక్ సర్జన్లను నియమించామని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.రానున్న రెండు రోజుల్లో వయనాడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
వయనాడ్ విపత్తుపై పొలిటికల్ వార్.. అమిత్ షాకు కేరళ సీఎం కౌంటర్
కేరళలో సంభవించిన ప్రకృతి వైపరిత్యంపై రాజకీయ రగడ రాజుకుంది. వయనాడ్‌లో వరద విలయంతో కొండచరియలు విరిగిపడి దాదాపు 200 మందికిపైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనపై కేరళ ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం నెలకొంది. విపత్తు గురించి తాము ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు తాజాగా కేరళ మఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. తమకు ఎలాంటి అలర్ట్‌ను జారీ చేయలేదంటూ తెలిపారు.బుధవారం తిరువనంతపురంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ. వాతావరణ మార్పులకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాలని సూచించారు. ‘మనం ఇప్పుడు చూస్తున్న విపరీతమైన వర్షాలు గతంలో కురిసేవా? వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలు మనకు అవసరం. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఇతరులపై నిందలు మోపడానికి ప్రయత్నించకండి. మీ బాధ్యతల నుంచి తప్పించుకోకండి. ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదు’ అని తెలిపారు.‘వయనాడ్‌లో 115-204 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసింది. విషాదం సంభవించే ముందు ఆ ప్రాంతంలో ఒక్కసారి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. కొండచరియలు విరిగిపడిన తర్వాత మాత్రమే ఉదయం 6 గంటలకు వారు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జులై 29న కేంద్ర వాతావరణశాఖ జూలై 30, 31 తేదీలకు గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. కానీ అప్పటికే భారీ వర్షం కురిసింది. కొండచరియలు విరిగిపడ్డాయి’ అని సీఎం పేర్కొన్నారు.అయితే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని అమిత్‌షా రాజ్యసభలో పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జులై 26న మరోసారి హెచ్చరించామని తెలిపారు. జూలై 23న కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున తొమ్మిది ఎన్డిఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపినట్లు చెప్రారు. కానీ సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.కాగా.. భారీ వర్షాలతో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
Wayanad Landslides: కేరళను ముందుగానే హెచ్చరించాం, కానీ: అమిత్ షా
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అతీతంగా కేరళ ప్రజలు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ అండగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాజ్యసభలో అమిత్‌షా మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం జులై 23నే హెచ్చరించిందని పేర్కొన్నారు.వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని పేర్కొన్నారు. అయితే సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారుఅయితే ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల దేశాలలో భారత్ ఒకటని అన్నారు. ఒకవేళ ఎన్డిఆర్ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉంటే కొండచరియలు విరిగిపడటంతో మరణాలను తగ్గించవచ్చని షా అన్నారు. వయనాడ్ దుర్ఘటనను ఎదుర్కొనేందుకు నరంద్ర మోదీ.. కేరళ ప్రభుత్వం, ప్రజలకు మద్దతుగా ఉన్నారని అన్నారు. మంగళవారం రాత్రి వాయనాడ్‌లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ పర్యటించారని, ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.కాగా కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 158 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
కన్నీటి సంద్రంలో కేరళ.. వెంటాడిన పాపం
-
కేరళ విలయంలో మనిషే విలన్..
-
వయనాడ్ విలయం: ప్రకృతి ప్రకోపం.. శిథిలాల కింద నుంచి ఫోన్లు.. వీడియోలు చూశారా?
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. సహాయక చర్యలు ముందుకు సాగుతున్నా కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వాళ్లు దేవుడ్ని తలుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. வயநாடு நிலச்சரிவு இயற்கை பேரிடரின் காட்சிகள். பலி எண்ணிக்கை 54 ஐ கடந்தது...உயிரிழப்புகள் உயரும் என அஞ்சப்படுகிறது. #WayanadLandslide#WayanadDisaster#Wayanad pic.twitter.com/AmTZjlHel7— Abdul Muthaleef (@MuthaleefAbdul) July 30, 2024శిథిలాల కింది నుంచే ఫోన్లు.. అర్ధరాత్రి చిమ్మచీకట్లో కొండచరియలు, బురద విరుచుకుపడటంతో వయనాడ్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. చాలామంది బాధితులు శిథిలాల కింద నుంచి ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడ్డారు. ‘‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’ అంటూ ఓ మహిళ ఫోన్ కాల్‌ను అక్కడి టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. ఇల్లు, అయినవాళ్లు కనిపించక రోదిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. बेहद दुःखद खबर केरल से 😔😢भीषण बारिश से लैंडस्लाइड,मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत।images says it all about the Wayanad landslide. #Wayanad#Wayanad #Landslide #WayanadLandslide #WayanadDisaster #WayanadLandslides pic.twitter.com/eLHoO5bDkF— Ashfak 🇮🇳 Hussain (@AshfakHMev) July 30, 2024 Devastating landslide in Wayanad, Kerala So awful,praying God 🙏 for the safety & Well -being of all affected people and keep the kith and kin safe.Let's Pray For Them 🙏🙏Credits To Respective Owner #WayanadLandslide #Kerala @praddy06 @ChennaiRains@RainStorm_TN pic.twitter.com/jlDUv6aWHx— Shahidarafi (@Shahidarafi51) July 30, 2024BAD NEWS केरल से😭भीषण बारिश से लैंडस्लाइड, मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत।#Wayanad#WayanadLandslide pic.twitter.com/rsqnolljcs— police wala (@COP_DineshKumar) July 30, 2024The death toll in the Wayanad landslides has risen to 8. Those dead also include three children. The first landslide was reported at nearly 2 am. Later, at nearly 4.10 am, the district was struck by another landslide. #WayanadLandslide #Wayanad #Kerala pic.twitter.com/TCAWfMdaCz— Vani Mehrotra (@vani_mehrotra) July 30, 2024 225 మంది భారత ఆర్మీ బృందం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. విపత్తు జరిగిన ప్రదేశంలో కీలకమైన వంతెన కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ ఘటనలో ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. చూరల్మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలు ధ్వంసం అయ్యాయి. సమీపంలోని గ్రామాల్లో అనేక ఇళ్లు ధ్వసం అయ్యాయి. భారీ వరదలతో అనేక భవనాలు నీటీలో మునిగి దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.മനുഷ്യർക്ക് വേണ്ടി മനുഷ്യർ 🫂#WayanadLandslide #WayanadDisaster pic.twitter.com/ERvONWTXAG— 5Zy (@5zy_dq) July 30, 2024 Beautiful Place is Now Being Scary Place #Wayanad Please Rescue the Peoples Safely !! #WayanadLandslidepic.twitter.com/vcIcHeQtLx— 𝐁𝐚𝐥𝐚𝐣𝐢_𝐏𝐚𝐥𝐚𝐧𝐢𝐑𝐚𝐣🇮🇳 (@Karunas_Balaji) July 30, 2024बेहद दुखद केरल के वायनाड में भीषण बारिश के बीच लैंडस्लाइड, मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत। 😢😢#kerla #WayanadLandslide pic.twitter.com/S60tluurNT— Jeetesh Kumar Meena (@jeeteshsaray) July 30, 2024#WayanadLandslide | The death toll in #Kerala reaches 36 Very sad to know this !! #Wayanad #Kerala#WayanadLandslide pic.twitter.com/1kIC4eTpa5— Anupama (@Anupamabbk) July 30, 2024केरल वायनाड में प्रक्रृति अपना रोद्र रूप दिखा रही है ,19 लोगो की मौत की खबर है हजारो लोग फसें हुए है हम सबको वायनाड के लिये प्रार्थना करनी चाहिए 😢#Kerala#WayanadLandslide pic.twitter.com/Nf433ANQX6— Jeetesh Kumar Meena (@jeeteshsaray) July 30, 2024 -
వయనాడ్ విపత్తు: స్పందించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతిచెందారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోదీ స్పందిచారు. ‘వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించింది. ఈ ఘటనలో గాయపడిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నా. బాధితులకు సహాయం చేయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడాను. ఆయన అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.PM Narendra Modi tweets, "Distressed the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured. Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Pinarayi Vijayan and also… pic.twitter.com/y12areB2mw— ANI (@ANI) July 30, 2024 అదే విధంగా వయనాడ్ విపత్తులో మరణించినవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.Prime Minister announced an ex-gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. pic.twitter.com/iDy1Kgaqv2— ANI (@ANI) July 30, 2024కేరళ సీఎంతో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీవాయనాడ్లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనపై మాజీ వయనాడ్ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ‘‘కొండచరియలు విరగినపడిన ఘటన తెలిసి చాలా బాధపడ్డాను. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని హామీ ఇచ్చారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని కోరాను. సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని వారికి విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తాను. సహాయక చర్యల్లో యూడీఎఫ్ కార్యకర్తలందరూ పాల్గొనాలని కోరుతున్నాను’’ అని ఎక్స్‌లో తెలిపారు.Wayanad landslide | Lok Sabha LoP and former MP from Wayanad, Rahul Gandhi tweets, "I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad...I have spoken to the Kerala Chief Minister and the Wayanad District Collector, who assured me that rescue operations are… pic.twitter.com/qqu7VLH4XN— ANI (@ANI) July 30, 2024 -
వయనాడ్ విపత్తు: సహాయక చర్యల్లో వైమానిక హెలికాప్టర్లు
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి, ఒక విదేశీయుడు ఉన్నారు. భారీ వర్షం మధ్యే సహయక చర్యలు కొనసాతున్నాయి. చీకటి, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం సహయాక చర్యల్లో పాల్గొనాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. Wayanad landslide | CM Pinarayi Vijayan has given directions to coordinate the rescue operations in Wayanad promptly following the devastating landslide. He announced that the entire government machinery is actively involved in the efforts, with Ministers overseeing and… pic.twitter.com/DWDXebBxmz— ANI (@ANI) July 30, 2024 250 మంది ఫైర్ అండ్ రెస్క్యూ, సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సభ్యులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.Wayanad landslide | 250 members of Fire and Rescue, Civil Defence, NDRF and Local Emergency Response Team are involved in the rescue operation in Wayanad Churalmala. An additional team of NDRF has been directed to reach the spot immediately: Kerala CMO— ANI (@ANI) July 30, 2024 శిథిలాల కింద వందలాది మంది చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారీ విరిగిన పడిన కొండచరియలు, భారీ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వయనాడ్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని నెటిజన్లు ప్రార్థనలు చేస్తున్నారు. വയനാട് രക്ഷാപ്രവർത്തനം.@airnewsalerts @airnews_tvm AIR VIDEOS: Arunvincent, PTC Wayanad pic.twitter.com/TcISMAzxjv— All India Radio News Trivandrum (@airnews_tvm) July 30, 2024BREAKING: 6 bodies found, hundreds feared trapped as two landslides hit Kerala’s #Wayanad last night and early this morning.Rescue on in extremely adverse, rainy conditions. pic.twitter.com/adJwZulmAh— Abhijit Majumder (@abhijitmajumder) July 30, 2024Pray For Wayanad 🙏🏻#Wayanad #WayanadLandSlide pic.twitter.com/ZEHB7nFJFq— நெல்லை செல்வின் (@selvinnellai87) July 30, 2024 -
వయనాడ్: ఊళ్లను ఊడ్చేసిన కొండచరియలు.. 70 మంది మృతి
తిరువంతనపురం: కేరళ వయనాడ్ జిల్లాలో ప్రకృతి విలయం.. పెను విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. మెప్పాడి రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సుమారు 1,200 శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానిక సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ మధ్యాహ్నాం ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 400 మందిని రక్షించి.. రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. ముందక్కై నుంచి ఎయిర్లిఫ్ట్ముందక్కై గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత క్యాంప్‌లకు తరలించనున్నట్లు ఎమ్మెల్యే సిద్ధిఖీ తెలిపారు. ‘‘ఎంత మంది ఆచూకీ లేకుండా పోయారు, ఎంత మంది చనిపోయారు అనేదానిపై ఇప్పుడే పూర్తి సమాచారం అందడం కష్టం. చాలా చోట్లకు కనెక్టివిటీ తెగిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అన్నారాయన. యుద్ధ ప్రతిపాదికన వంతెనలుకేరళ విలయం ధాటికి వయనాడ్‌లో వంతెనలు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకూ విఘాతం ఏర్పడుతోంది. దీంతో.. యుద్ధ ప్రతిపాదికన వంతెనలు పునరుద్ధరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. వాతావరణం అనుకూలించట్లేదని ఆమె చెప్పారు. వయనాడ్‌కు రాహుల్ గాంధీకాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్‌కు వెళ్లనున్నారు. కొండ చరియలు ప్రాంతాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచే ఆయన రెండుసార్లు ఎంపీగా నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం.. ఎక్స్ వేదికగా ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా.I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad. My heartfelt condolences go out to the bereaved families who have lost their loved ones. I hope those still trapped are brought to safety soon.I have spoken to the Kerala Chief Minister and the Wayanad…— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024 కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు బలమైన గాలులు తోడవ్వడం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడడం, చెట్లు కూలిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. వయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసర్‌గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నాలుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. అయితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక.. మెప్పాడి రీజియన్‌లోని మందకై ప్రాంతంలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 2గం. సమయంలో ఒకసారి, 4గం. సమయంలో మరోసారి, ఆపై అరగంటకు మరోసారి చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు చలియార్‌నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. బురద నీరు, బండరాళ్లు, కూలిన చెట్లు చుట్టుముట్టేయడంతో జనం చిక్కుకుపోయారు. ఘటన సమాచారం అందుకోగా.. ఎన్డీఆర్ఎఫ్, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, అలాగే సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకున్నాయి. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలిగాయి. దీంతో ఉదయం నుంచి సహాయక చర్యల్ని ఉధృతం చేశారు. మట్టి దిబ్బల కింద వందలాది మంది(1200 మంది అని ఒక అంచనా) చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వంతెనలు తెగిపోవడం, భారీ వర్షం పడుతుండడంతో సహయక చర్యలు కొనసాతున్నాయి. Hundreds Feared Trapped Following Massive Landslides in Kerala's #Wayanad#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/8yJIKixPP9— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Kerala's Wayanad Devastated by Landslides; Hundreds Feared Trapped#Kerala #Landslides #WayanadLandslide pic.twitter.com/cR67TWKzFi— TIMES NOW (@TimesNow) July 30, 2024 Video Credits: TIMES NOW Major Landslide in Wayanad. Many fear dead. One portion of Chooral hills and the township near Mepadi has collapsed. Very similar to the Puthumala landslide that occured in 2019. pic.twitter.com/nSfvuzlddq— Viju B (@floodandfury) July 29, 2024 ఎటు చూసినా విధ్వంసమే..మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు పదిహేనుకు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ముందక్కై, అట్టమల, నూల్పూజ, చురల్మల గ్రామాలు ఊడ్చిపెట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. గతంలో.. 2018లో సంభవించిన విపత్తులో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.రంగంలోకి హెలికాఫ్టర్లుసహాయక బృందాలు మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వాళ్లను వెలికి తీసి.. చికిత్స కోసం మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఇంకా చాలా మంది మట్టి చరియల కింద చిక్కుకున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఈ ప్రమాదంలో ప్రభావితం అయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే విపత్తుపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని రెవెన్యూ మంత్రి కె.రాజన్ అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎయిర్‌పోర్స్ మిగ్ 17 హెలికాఫ్టర్లు రంగంలోకి దించినట్లు తెలిపారాయన. BREAKING: 7 bodies found, hundreds feared trapped as two landslides hit Kerala’s Wayanad last night and early this morning…!#Wayanad #WayanadLandSlide pic.twitter.com/hTBGy52x0u— நெல்லை செல்வின் (@selvinnellai87) July 30, 2024 Landslide visuals are coming in from #Wayanad #keralarains pic.twitter.com/a5Y9APcvst— MasRainman (@MasRainman) July 30, 2024 తక్షణ చర్యలకు ఆదేశంఘటన గురించి తెలియగానే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రుల బృందాన్ని మెప్పాడికి వెళ్లాలని ఆదేశించారు. తక్షణ బృందాలతో సహా ఏజెన్సీలు అన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, ఆ సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో 9656938689, 8086010833 నెంబర్లతో కంట్రోల్ రూపం ఏర్పాటు చేసినట్లు, వైద్య బృందాలను అక్కడికి పంపించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. విపత్తుపై ఆరావయనాడ్ భారీ ప్రకృతి విపత్తుపై ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము తన సందేశం తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ.. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున అన్నివిధాలుగా సాయం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి సురేష్ గోపితోనూ ప్రధాని మాట్లాడారు. ఇంకోవైపు.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ మాట్లాడి బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని కోరినట్లు సమాచారం. వయనాడ్ కలెక్టర్, అధికారులతో ఫోన్లో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలని కోరారు.ఇక వయనాడ్ విపత్తు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రధాని కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు, అలాగే.. గాయపడ్డ వాళ్లకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎక్స్ ఖాతాలో పీఎంవో ట్వీట్ చేసింది. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది. Pained by the loss of lives in massive landslides in Wayanad, Kerala. My condolences to the bereaved families. I pray for the speedy recovery of the injured and for the success of rescue operations.— President of India (@rashtrapatibhvn) July 30, 2024The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the landslides in parts of Wayanad. The injured would be given Rs. 50,000. https://t.co/1RSsknTtvo— PMO India (@PMOIndia) July 30, 2024ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
కేదార్నాథ్ యాత్రలో విషాదం.. ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి నడక మార్గంలో నేటి ఉదయం (ఆదివారం) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండలపై నుంచి పడిన రాళ్ల కారణంగా ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ శిథిలాల నుంచి ముగ్గురు యాత్రికుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. కేదార్నాథ్ యాత్రా మార్గం సమీపంలో కొండపై నుండి పడుతున్న రాళ్ల కారణంగా కొందరు యాత్రికులు మృతిచెందారన్న వార్త చాలా బాధ కలిగిందని సీఎం పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు.జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7.30 గంటలకు కేదార్నాథ్ యాత్రా మార్గంలోని చిర్బాసా సమీపంలోని కొండపై నుండి పడిన భారీ రాళ్ల కారణంగా యాత్రికులు సమాధి అయినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఎన్డిఆర్ఎఫ్, డిడిఆర్, వైఎంఎఫ్ అడ్మినిస్ట్రేషన్ బృందంతో సహా యాత్రా మార్గంలోని భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసిందని, గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. -
Ankola Landslide: ఐదు రోజులుగా గాలింపు.. అర్జున్ ఆచూకీ దొరికేనా!
దేశ వ్యాప్తంగా వనలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో వరదలు ముంచెత్తున్నాయి భారీ వర్షాలతో అక్కడక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. భవనాలు కూలుతున్నాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సైతం వాటిల్లుతోంది. దీంతో పలు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.తాజాగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో నాలుగు రోజుల క్రితం అంకోలా తాలుకాలోని షిరూర్‌లో వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జూలై 16న 500 మీటర్ల ఎత్తు నుంచి ఓ కొండ షిరూర్ జాతీయ రహదారి మీద పడటంతో.. పక్కనే టీ దుకాణం వద్ద ఉన్న దాదాపు 10 మంది గల్లంతయ్యారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను గురువారం వెలికి తీయగా... మరో ముగ్గురి ఆచూకి తెలియాల్సి ఉంది.భారీ మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ అర్జున్ మూలడికుజియిల్ కూడా ఉన్నాడు. కన్నడిక్కల్కు చెందిన అర్జున్ (30) ట్రక్కులో కలపను ఎక్కించుకుని జగల్‌పేట నుంచి కోజికోడ్‌కు వెళ్లాడు. షిరూర్లోని ఓ హోటల్లో టీ తాగేందుకు ఆగి ప్రమాదానికి గురయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో అతనితోపాటు ట్రక్కు కనిపించకుండా పోయాయి.విషయం తెలుసుకున్న అర్జున్ కుటుంబం కేరళ సీఎం పినరయి విజయన్ను సంప్రదించడంతో ఆయన స్పందించి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. అర్జున్ను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అర్జున్ ఆచూకీ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ లాంటి వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసేందుకు కోజికోడ్ కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్‌ను నియమించారు.అర్జున్‌తోపాటు తప్పిపోయిన మరో ఇద్దరి కోసం గత అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారిపై ఉన్న మట్టిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం, ఇండియన్ నేవీ కృషి చేస్తున్నాయని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. అయితే ఎత్తైన భూఘాగం, భారీ వర్షాలు, పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి శనివారం ఉదయం తిరిగి ప్రారంభించారు.తాము చేరుకోలేని ప్రాంతాలలో శిథిలాల మధ్య, జాతీయ రహదారి పక్కనే ఉన్న నదిలో మృతదేహాలను వెతకడానికి హెలికాప్టర్‌తో సహాయం చేయమని కోస్ట్ గార్డ్‌కు లేఖ రాసినట్లు ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ లక్ష్మిప్రియా తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయం అసాధ్యంగా మారిందని చెప్పారు. కొన్ని రోజులుగా అర్జున్ ఆచూకీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అర్జున్ నడుపుతున్న లారీ జీపీఎస్ సిగ్నల్ చివరగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశం నుంచే అందుతుందని తెలిపారు.అర్జున్ కోసం ఆశగా..మరోవైపు అర్జున్ ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆయన భార్య కృష్ణప్రియ, తండ్రి ప్రేమన్, తల్లి షీలాతో పాటు బంధువులంతా ఆశగా ఎదురు చేస్తున్నారు. అధికారులు ఎలాగైనా తన తప్పుడిని కాపాడాలని, ఏదో అద్భుతం జరుగుతందనే నమ్మకం ఉందని అతడి సోదరి అంజు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అర్జున్ లాంగ్ ట్రిప్‌లకు వెళ్లిన ప్రతిసారీ మాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. నేను జూలై 16న చివరిసారి అతనితో మాట్లాడాను.మరుసటి రోజు నుండి అతనిని సంప్రదించలేకపోయాను.. శుక్రవారం ఉదయం డయల్ చేసినప్పుడు అర్జున్ రెండో మొబైల్ ఫోన్ రింగ్ అయింది’అని ఆయన భార్య కృష్ణప్రియ తెలిపారు.అయితే ప్రస్తుతం అర్జున్ కుటుంబం ప్రమాదంజరిగిన షిరూర్‌లో ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగడం లేదని ఆరోపించారు. పలు వాహనాలు బురదలో కూరుకుపోయినా అధికారులు కేవలం రెండు ఎర్త్ మూవర్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. కేరళ సీఎం, మంత్రులు, కేరళ-కర్ణాటక అధికారులు జోక్యం చేసుకోవడంతో నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెబుతున్నారు.కాగా కోజికోడ్‌లోని కినాస్సేరిలో అర్జున్ ఎనిమిదేళ్లుగాముక్కాంకు చెందిన ఓ వ్యాపారి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా అంతర్ రాష్ట్ర పర్యటనలకు వెళ్లేవాడు. అతను కలపను లోడ్ చేయడానికి క్రమం తప్పకుండా బెలగావికి వెళ్లేవాడు, రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేవాడు. అయిదుగురు సభ్యుల కుటుంబానికి అర్జున్ ఒక్కడే సంపాదకుడు. -
నేపాల్ బస్సు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల మృతి
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నారాయణఘాట్-ముగ్లింగ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా.. తాజాగా ఆ ఏడుగురు భారతీయులు మరణించినట్లు తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.రెండు బస్సుల్లో దాదాపు 65 మంది ప్రయాణికులు ఉండగా.. వారందరూ గల్లంతయ్యారు. వారిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బస్సు ప్రమాదం, భారతీయులు మృతి, కొండచరియలు, భారీ వర్షాలుఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. -
నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు
ఖట్మాండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింది. మడన్-ఆశ్రిత్ హైవేపై శుక్రవారం(జులై 12) తెల్లవారుజామున కొండ చరియలు విరిగి పడ్డాయి. హైవేపై ప్రయాణిస్తున్న రెండు బస్సులపై భారీ కొండ రాళ్లు పడ్డాయి. దీంతో బస్సులు నదిలో పడిపోయాయి. బస్సులు నదిలో పడిపోయి మొత్తం 65 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో ఏడుగురు భారతీయులున్నట్లు సమాచారం.గల్లంతైన వారి కోసం గాలింపు ఆపరేషన్ కొనసాగుతోందని, అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి పుష్ఫ కమాల్ ప్రచండ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. -
Badrinath Highway: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. ఉత్తరాఖండ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
బంగారం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా గనిపై కొండచరియలు విరిగిపడి 11 మంది కార్మికులు మృతి చెందారు. గోరంటా ప్రావిన్స్‌లోని రిమోట్‌బోన్ బొలాంగో జిల్లాలో ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 33 మంది స్థానిక కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి కార్మికులపై పడ్డాయని రెస్క్యూ బృందం ప్రతినిధులు తెలిపారు. 33 మంది కార్మికుల్లో కేవలం ఒక్కరినే రక్షించారు. ఇప్పటివరకు గనిలో నుంచి 11 మంది మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన 21 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో బంగారం కోసం అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. -
నేపాల్‌లో ప్రకృతి విపత్తులు.. 14 మంది మృతి
నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. గడచిన 24 గంటల్లో నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు, పిడుగుపాటు ఘటనల కారణంగా 14 మంది మృతిచెందారు.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం కొండచరియలు విరిగిపడటం వల్ల ఎనిమిది మంది, పిడుగుపాటు కారణంగా ఐదుగురు, వరదల కారణంగా ఒకరు మృతిచెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని ఎన్‌డీఆర్‌ఎంఎ అధికార ప్రతినిధి దిజన్ భట్టారాయ్ తెలిపారు.నేపాల్ హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో రుతుపవనాలు చురుకుగా మారినప్పటి నుండి అంటే గత 17 రోజుల్లో సంభవించిన పలు విపత్తుల కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలకు 33 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. -
అరుణాచల్‌లో భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
అరుణాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ఈటానగర్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ,పరిపాలన అధికారులు తెలిపారు.అరుణాచల్‌లోని హైవే-415పై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఇటానగర్తో పాటు పరిసర ప్రాంతాల్లోని అనేక చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. ఏడు చోట్ల సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు నదీ తీరాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులను సమాయత్తం చేస్తూ హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వరదల కారణంగా 37 మంది మృతిచెందగా, 10 జిల్లాల్లో 1.17 లక్షల మందికి పైగా జనం వరదల బారిన పడ్డారు. అధికారులు 134 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 17,661 మంది ఆశ్రయం పొందుతున్నారు. బరాక్‌లోని కరీంగంజ్‌లోని కుషియారా నది ప్రస్తుతం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని తెలుస్తోంది. -
ఇటానగర్‌లో క్లౌడ్‌బర్స్ట్.. విరిగిపడ్డ కొండచరియలు
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో ఆదివారం(జూన్23) కుండపోత వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. గత వారం రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఆదివారం తక్కువ సమయంలో కురిసిన ఎక్కువ వర్షం(క్లౌడ్ బర్స్ట్) ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 415పై కూడా వరద ప్రభావం పడింది. దీంతో ఇటానగర్లోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. కొండ చరియలు విరిగిపడే ఛాన్సున్న ప్రాంతాలకు, నదుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
దక్షిణ చైనాలో భారీ వరదలు.. 47 మంది మృతి
చైనాలోని దక్షిణ ప్రాంతం భారీ వరదలకు విలవిలలాడిపోతోంది. దీనికితోడు పలుచోట్లు కొండ చెరియలు విరిగిపడుతూ పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలకు వందలాది ఇళ్లు నీటమునగగా, కొండ చెరియలు విరిగిపడిన ఘటనల్లో పలు ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే లెక్కకుమించినంత మంది గాయపడివుంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.దక్షిణ చైనాలో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో బాధితులకు ప్రభుత్వం సాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
భారీ వర్షాలకు శ్రీలంక అతలాకుతలం.. 10 మంది మృతి
శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 10 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి. పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాజధాని కొలంబోతో పాటు రతన్‌పురా జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందారు. కొండచరియలు విరిడిపడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. పలు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు.ముంపు ప్రాంతాల నుంచి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ఘటనల్లో 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు. మే మధ్య నుంచి శ్రీలంకలో వాతావరణం ప్రతికూలంగా మారింది. -
పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: పపువా న్యూగినియాలో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించింది. ఈ విపత్తు కారణంగా 2000 మంది దాకా శిథిలాల కింద కూరుకుపోయారు. ఇంకొన్నివేల మంది నిరాశ్రయులయ్యారు.తాజా దీనిపై ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందించారు. ‘న్యూగినియాలో జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నా. కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రభావితమైన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా.గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గినియా దేశానికి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నా’అని ప్రధాని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు.. జనజీవనం అతలాకుతలం!
జమ్ము కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దీనికితోడు కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలియాయి. బారాముల్లా, కిష్త్వార్, రియాసి జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి.కిష్త్వార్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. దీని గురించి ప్రభుత్వ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రెస్క్యూ టీమ్ అప్రమత్తమయ్యిందన్నారు. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో నేడు (మంగళవారం) కశ్మీర్లో పాఠశాలలను మూసివేశారు.కశ్మీర్లో జరగాల్సిన ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వాయిదా పడింది. జమ్ము-శ్రీనగర్ హైవేలోని శిథిలాలు తొలగించే వరకు ఈ రహదారిపై ప్రయాణాలు సాగించవద్దని అధికారులు ప్రయాణికులకు సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో కిష్త్వార్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రియాసిలోని దోడా, రాంబన్, గులాబ్‌గఢ్‌లలో నదులు, వాగుల్లో నలుగురు కొట్టుకుపోగా, వారిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం తదితర ఘటనల్లో12 మంది చిన్నారులతో సహా 22 మంది గాయపడ్డారు. -
అరుణాచల్: కొట్టుకుపోయిన చైనా సరిహద్దు హైవే
ఈటానగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్ వ్యాలీ జిల్లాలోని జాతీయ రహదారి-33పై మున్లీ, అనిని ప్రాంతాల మధ్య భారీగా కొండచరియాలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడటంతో నేషనల్ హైవేపై కొంత భాగం కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. దీంతో చైనా బోర్డర్లోని దిబాంగ్ వ్యాలీ జిల్లాకు భారత్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిబాంగ్ వ్యాలీ వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 🚨🚨🚨Arunachal Pradesh hit by massive landslides. Highway linking China border washed away#ArunachalPradesh pic.twitter.com/96eiVRcPkI— Rosy (@rose_k01) April 25, 2024 దీంతో వేంటనే రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ సిబ్బంది హైవే మరమత్తులకు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అత్యవసర సేవలు, వస్తువులకు ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదని అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. హైవే పునరుద్ధరణ పనుల కోసం మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నేషనల్ హైవే-33 దిబాంగ్ వ్యాలీ జిల్లా ప్రజలకు, ఆర్మీకి చాలా కీలకం. -
Video: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే ఇళ్లు నేలమట్టం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్లో ఉన్న భారీ బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎస్ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇళ్లు కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: Several buildings collapsed due to landslides in Anni town of Kullu district. (Visuals confirmed by police) pic.twitter.com/MjkyuwoDuJ — ANI (@ANI) August 24, 2023 -
విషాదం.. కొండ చరియలు విరిగిపడి అయిదుగురు యాత్రికులు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. యాత్రికులు కేథార్‌నాథ్‌కు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఓ వ్యక్తి గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. రుద్రప్రయాగ జిల్లాలో ఛౌకీ ఫటాలోని టార్సిల్ ప్రాంతంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగష్టు 11 నుంచి ఆగష్టు 24 వరకు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. వర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారిపై వెళుతున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. కొండచరియలు విరిగిపడడంతో గుప్తకాశి-గౌరీకుండ్ గుండా కేదార్నాథ్ దామ్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. కొన్ని జిల్లాలో ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ జారీ అయిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు సూచనలు చేశారు. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం -
భయంకర దృశ్యాలు.. కొండచరియలు విరిగి కార్లపైకి దూసుకొచ్చి..
నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఆ దారిలో వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా దిమాపూర్ నుంచి కోహిమా మధ్యరోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డు మీదకు దూసుకురావడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో కొహిమా నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సంఘటన స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘పాకలా పహార్’ అని పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్రదేశంలో ఎక్కువగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం తరుచుగా జరుగుతుంటాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో విచారం వ్యక్తం చేశారు. Un desprendimiento de rocas en Nagaland, India, deja 2 muertos y 3 heridos tras aplastar un coche. 😳😳 pic.twitter.com/3cCqKT0y0k — Momentos Virales (@momentoviral) July 4, 2023 ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ.. ‘దిమాపూర్, కోహిమా మధ్యనున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు బండరాయి పడిపోవడంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. Oo god😭 #Nagaland pic.twitter.com/uzpnawW3Ej — Tradeholics (@Tradeholics) July 4, 2023 -
15 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. ప్రయాణికుల నరకం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురిసిన వర్షాలతో నదుల్లో వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. అటు భారీగా కురిసిన వర్షాలతో కొండ చరియలు రహదారులపై విరిగిపడ్డాయి. దీంతో మండి, కులును కలిపే జాతీయ రహదారిని బ్లాక్ చేశారు పోలీసులు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన కారణంగా మండీలోని చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నత్తనడకన కదులుతున్న వాహనాలతో పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది పర్యటకులు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు. ముందుకు వెళ్లలేక వెనకకు మళ్లలేక పిల్లలతో సహా కుటుంబాలతో కలిసి రోడ్లపైనే ఉన్నామని చెప్పారు. ఇదో పీడకలలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఎడతెరిపి లేని వర్షంతో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా రెండు జాతీయ రహదారులతోసహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని సీనియర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో వివిధ జిల్లాల్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. #WATCH | Heavy rainfall in Himachal Pradesh's Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam (Drone Visuals from Mandi) pic.twitter.com/tmpPZ8aUbM — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..? కొండ చరియలు విరిగిపడగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలకే రహదారిని మూసివేశారని పర్యటకులు తెలిపారు. రాత్రంతా రోడ్డుపైనే ఉన్నట్లు చెప్పారు. బస చేయడానికి హోటల్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పేర్కొన్నారు. దాదాపు 200 వందల కార్లపైనే వరుసగా ఉండిపోయాయని చెప్పారు. కొందరు బస్సుల్లో విహారయాత్రకు వచ్చి రాత్రంతా అందులోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విరిగిపడిన కొండ చరియలను రోడ్డుపై నుంచి ఎప్పుడు తొలగిస్తారో.. ఇంకా ఎంత సమయం వేచి ఉండాలో కూడా అధికారులు తెలపట్లేదని చెప్పారు. "The administration has said that there is a landslide ahead. I don't have much info, we have been here since 5 am," says a tourist from Scotland, who has been stranded in a traffic jam following a landslide on Chandigarh-Manali highway near 7 Mile pic.twitter.com/sWKeJpe5zq — ANI (@ANI) June 26, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
కొండచరియల బీభత్సం చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు..!
-
కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి
బటంగ్ కలి: మలేసియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. సెలంగోర్ రాష్ట్రం బటంగ్ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులున్న క్యాంప్ సైట్‌ను 100 అడుగుల ఎత్తైన రోడ్డు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి ఒక్కసారిగా ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి కాగా, 12 మంది జాడ తెలియకుండా పోయారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు మరణించారు. 51 మంది ఆచూకీ గల్లంతయ్యారు. క్యాంప్ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడినట్లు విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ నరోజమ్ ఖామిస్ తెలిపారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో క్యాంప్‌పై కొండచరియలు పడినట్లు చెప్పారు. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా సుమారు 21వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి: గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పైనుంచి దూకి భారత సంతతి బాలుడు ఆత్మహత్య -
Typhoon Talas: జపాన్‌లో 'తలస్' బీభత్సం.. ఇద్దరు మృతి
టోక్యో: సెంట్రల్ జపాన్‌లో తలస్ తుఫాను బీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. కొంచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కకెగావా నగరంలో ఒకరు తన ఇంటిపై కొండచరియలు విరిగిపడి చనిపోయాడు. దీని పక్క నగరం ఫుకురోయ్లో మరోవ్యక్తి వరదలో వాహనంలో చిక్కుకుని మరణించాడు. షిజువోకాలో మరో వ్యక్తి వరదలో వాహనం నడుపుతూ కొట్టుకుపోయి అదృశ్యమయ్యాడు. అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు రికార్డుస్థాయిలో 40సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. వరదల వల్ల అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,20,000 ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. 55వేల మంది ఇళ్లకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీరికి శుభ్రమైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జపాన్‌లో వేసవి కాలం, శరద్ రుతువులతో తరచూ తఫాన్లు వస్తుంటాయి. గతవారం కూడా నన్మదోల్ తుఫాన్ నైరుతి జపాన్ను అతలాకుతలం చేసింది. అప్పుడు సంభవించిన వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మరో 147మంది గాయపడ్డారు. చదవండి: బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్ -
షాకింగ్ వీడియో.. ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు!
డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని తర్సాలి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. దీంతో రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జాతీయ రహదారిపై పడిన శిథిలాలను తొలగించి వాహన రాకపోకలను త్వరలోనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు. ‘ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. హైవేను తిరిగి తెరుస్తున్నాం. శిథిలాలు తొలగించిన వెంటనే వాహనాలను అనుమతిస్తాం’ అని చెప్పారు. మరోవైపు.. కేదార్నాథ్ వెళ్లే భక్తులు.. రుద్రప్రయాగ్, తిల్వారా, అగస్త్యముని, గుప్తకాశి వంటి ప్రాంతాల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. #WATCH | Uttarakhand: NH-109 in the Rudraprayag district blocked yesterday after a sudden landslide led to the roll down of debris near Tarsali Village DM Mayur Dixit said, all travellers stopped at safe places. Once the debris is cleared, vehicular movement will be started. pic.twitter.com/tb4Sz61AsR — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 22, 2022 ఇదీ చదవండి: టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య -
అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం
స్వార్థంతో కూడిన ప్రపంచంలో బంధాలకు విలువ ఏమాత్రం?. అండగా ఉండాల్సిన వాళ్లే.. కష్టకాలంలో కానీవాళ్లుగా మారిపోతున్నారు. అలాంటిది మరణంలోనూ ఆ బంధం ఒక్కటిగా కనిపించడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కారణం.. అవి కల్లాకపటం ఎరుగని పసిహృదయాలు కాబట్టి. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో మంగళవారం వెలుగుచూసిన విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అయితే.. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అక్కడి దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అక్కాచెల్లెళ్లు అయిన ఆ పిల్లలు.. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. శ్రుతి(11), జననశ్రీ(6) అక్కాచెల్లెళ్లు. దక్షిణ కన్నడ జిల్లా సుబ్రమణ్యలోని కుసుమధారలో ఉంటోంది వీళ్ల కుటుంబం. సోమవారం సాయంత్రం సుబ్రమణ్యలో భారీ వర్షం కురిసింది. రాత్రి ఏడు గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇంటి వరండాలో కూర్చుని చదువుకుంటోంది శ్రుతి. భారీ శబ్దానికి భయంతో ఇంట్లోకి పరిగెత్తింది. అక్కను చూసి వెంటే చెల్లి జననశ్రీ కూడా లోపలికి వెళ్లింది. అయితే వంట గదిలో ఉన్న ఆ పిల్లల తల్లి.. ఆ శబ్దానికి బయటకు వచ్చేసింది. పిల్లలు కూడా బయటే ఉన్నారు కదా ఆ తల్లి పొరపడింది. సరిగ్గా అదే సమయంలో పైన ఉండే కొండచరియలు విరిగి.. ఆ ఇంటిపై పడ్డాయి. అంతే.. భారీ వృక్షం పడిపోవడం, దారులన్నీ నీటితో నిండిపోవడంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. దీంతో మరుసటి రోజే శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. నాలుగైదు గంటలు శ్రమించి.. చివరకు ఆ చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. భయంతో ఒకరినొకరు పట్టుకుని ఉంటారని భావిస్తున్నారు సిబ్బంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఉత్తర కన్నడ జిల్లా భక్తల్ తాలుకా ముట్టాలిలో కొండ చరియలు విరిగిపడిన మరో ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. తాజాగా శాసనమండలి ఎన్నికల్లో సైతం తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్.. సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతమైంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 27 శాసనమండలి స్థానాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ గెలుపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్లో స్పందించారు. ‘నేడు.. యూపీ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ భారి విజయం సాధించింది. ఈ భారీ విజయం.. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన గల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీ ప్రజలు ఉన్నారని మరోసారి స్పష్టమైంది’ అని యోగి పేర్కొన్నారు. आज उत्तर प्रदेश के स्थानीय प्राधिकारी विधान परिषद चुनावों में भाजपा की प्रचण्ड विजय ने पुनः स्पष्ट कर दिया है कि आदरणीय प्रधानमंत्री जी के कुशल मार्गदर्शन एवं नेतृत्व में प्रदेश की जनता राष्ट्रवाद, विकास एवं सुशासन के साथ है। — Yogi Adityanath (@myogiadityanath) April 12, 2022 -
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్‌పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్‌కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
కొండ చరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయి 14 మంది మృతి
Mudslide In Western Colombia: కొలంబియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన బురదలో కూరుకుపోయి 14 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం పశ్చిమ కొలంబియా పట్టణంలోని నివాస ప్రాంతంలోకి పెద్ద మొత్తంలో బురదనీరు చేరడంతో ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు. అంతేగాక పెరీరా మునిసిపాలిటీలోని రిసరాల్డాలో కొండ చరియాలు విరిగిపడటంతో ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. దీంతో పెరీరా మేయర్ కార్లోస్ మాయా ఈ ప్రాంతంలో కొండచరియాలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. (చదవండి: అయ్యో జగదీశ్ ! చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావే!!) -
విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్‌లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్‌లో జాడే మైనింగ్‌ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. (చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!) -
దువ్వూరు భూవివాద బాధితులకు అండగా ఏపీ సర్కార్
-
అయ్యో! పెద్దాయనకు ఎంత కష్టం వచ్చింది!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో రహదారులు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హృదయ విదారకమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం లేక ఓ పెద్దాయన అల్లాడి పోయాడు. చివరకు తన భుజాలమోసుకొని తీసుకుపోదామని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో 65 ఏళ్ల వృద్ధుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే నందూర్బార్ అటవీప్రాంతంలో ఉన్న చంద సాయిలి గ్రామంలో నివసిస్తున్న సిధాలిబాయి పద్వి (60) అనారోగ్యంతో బాధ పడుతోంది. ఈ క్రమంలో బుధవారం తీవ్ర కడుపు నొప్పి ఆమెను వేధించింది. దీంతో ఆమె భర్త ఆడ్ల్య పాడ్వి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. కానీ వర్షాల కారణంగా అది మూసి ఉంది. ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు మూతపడ్డాయి. ఇక వేరే మార్గం లేక కొండ మార్గంలో రాజధాని ముంబై నుండి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడానికి పాదరక్షలు లేకుండా తన భుజాలపై ఎత్తుకుని ఆమెను తీసుకెళుతున్నాడు. కానీ మధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. నిస్సహాయుడైన భర్త గుండె పగిలి రోదిస్తున్న తీరు స్థానికులను కదిలింది. సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోవడంతో వృద్ధుడి భుజాలపైనే ఆమె కన్నుమూసిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటన తర్వాత, జిల్లా పరిపాలన అధికారులు, స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కొండచరియల శిథిలాలను రోడ్డుపై నుండి తొలగించే చర్యలు చేపట్టారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు
సిమ్లా: ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంతో ఈ వ్యాఖ్యలు నిజం అని మరోసారి రుజువు అయ్యింది. కిన్నౌర్ జిల్లోని రెఖాంగ్ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పదిమంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు చిక్కుకోగా.. ఇప్పటికి కొందరిని రక్షించగా. మరో 20 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా కిన్నౌర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నిగుల్సారి ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ ఆర్టీసి బస్సు అక్కడ చిక్కుకుపోయింది. ఇప్పటికే బస్సు డ్రైవర్ని, కొందరిని రక్షించాం. సహాయక చర్యలు కొనసాగతున్నాయి’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కు కాల్ చేసి.. పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐటీబీపీ డీజీతో కూడా మాట్లాడారు. అలానే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జైరామ్ ఠాకూర్‌తో మాట్లాడారు. -
షాకింగ్ వీడియో: ఏకంగా జాతీయ రహదారి లోయలోకి పడిపోయింది..
-
షాకింగ్ వీడియో: ఏకంగా జాతీయ రహదారి లోయలోకి పడిపోయింది..
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఓ రోడ్డు కుప్పకూలింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవోంతా సాహిబ్, షిల్లై–హట్కోరీని అనుసంధానించే ఈ ఘాట్ రోడ్డుపై నహన్ పట్టణం సమీపంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారి 100 మీటర్ల పొడవునా దిగువకు జారిపోయింది. ప్రస్తుతం అక్కడ మట్టి, రాళ్లు తప్ప రోడ్డు ఆనవాళ్లే కనిపించడం లేదు. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపోయాయి. భీకర వర్షాలతోపాటు కొండ చరియలు విరిగిపడుతుండడంలో హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితీలో 200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. -
మహారాష్ట్రలో కొండచరియలు విరిగి 32 మంది మృతి
ముంబై: భారీ వర్షాలు మహారాష్ట్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు ముంచెత్తడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని కొండ చరియల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. మరో 30 మంది కొండ చరియల కింద చిక్కుకున్నట్లు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు కొండ చరియలు విరిగిపడటంతో ఆ మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ముంచెత్తిన బురద.. కన్నీళ్లలో ప్రజలు
ప్రకృతి బీభత్సం జపాన్‌తో కంటతడి పెట్టిస్తోంది. రాజధాని టోక్యోలో నివాస ప్రాంతాలను బురద ప్రవాహం తుడిచిపెట్టేసింది. రిసార్ట్ టౌన్ అతామీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురద ప్రవాహం ముంచెత్తడంతో జాడ లేకుండా పోయారు పదుల సంఖ్యలో జనాలు. ఇక తుపాన్.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టోక్యో: జపాన్‌లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. రిసార్ట్ టౌన్ అతామీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి పెద్ద ఎత్తున జారిన బురద ఇళ్లను ముంచెత్తింది. ఎన్నో ఇళ్లు, కార్లు నామరూపాల్లేకుండా పోయాయి. బురద ధాటికి ఇప్పటిదాకా ఇద్దరు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 20 మంది జాడ లేకుండా పోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటుచూసినా రోదనలే కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోయినవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనాకి వచ్చారు. పరిస్థితి చేజారిపోతుండడంతో.. ఆదివారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,000 మందికిపైగా సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. బురదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటిదాకా 19 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. కార్యక్రమాలపై జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. Japan floods: 20 people missing after landslide sweeps through Atami, a coastal city 65 miles southwest of Tokyo. #Shizuokapic.twitter.com/4pFl3Fa1dh — Ian Fraser (@Ian_Fraser) July 3, 2021 ఇక అతామీ పట్టణంలో 130 మంది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలను ఆపడం లేదని అన్నారు. బురద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భీకర తుపాను ‘ఎల్సా’ తుపాను హైతీ దక్షిణ తీర ప్రాంతాన్ని, డొమినికన్ రిపబ్లిక్ దేశాన్ని కుదిపేస్తోంది. పెనుగాలుల ధాటికి చెట్లు నేలకూలుతున్నాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. ఎల్సా తుపాను వల్ల ఇప్పటిదాకా ముగ్గురు మరణించారు. జమైకాలోని మాంటెగో బే నుంచి 175 మైళ్ల దూరంలో సముద్రంలో పుట్టిన ఎల్సా కరీబియన్ దీవులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా జియో ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు త్రిమూర్తిరాజు మాట్లాడుతూ.. ఓంకారం మలుపు, మౌనముని గుడి వద్ద కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపారు. ‘‘ఇంద్రకీలాద్రిపై కొండలు మట్టి, రాళ్లు కలిసి ఉన్నాయి. వర్షాలు ప్రభావంతో జారి పడుతున్నాయి. ప్రమాదాలను అరికట్టే విధంగా అలారం ఏర్పాటు, ఐరెన్ మెష్ మరింత పటిష్టం చేయాలి. వదులుగా ఉన్న కొండచరియలను తొలగించాలి’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై వారం రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడించారు. కాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ ఆవరణలో బుధవారం కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు.(చదవండి: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు) సీఎం జగన్ స్పందన అభినందనీయం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి నేడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి స్పందించడం అభినందనీయమన్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించడం మంచి నిర్ణయమని, ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. -
న్యూజిలాండ్ ఎన్నికల్లో జెసిండా ఘన విజయం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్(40)మరోసారి విజయ పతాకాన్ని ఎగుర వేశారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన కృషి, సమర్ధవంతమైన పాలన ఆమెకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. దేశంలోని ఏకసభ్య పార్లమెంటులో 120 స్థానాల్లో 64 స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది. పార్టీ. సగానికి పైగా సీట్లు గెలిస్తే, లేబర్ పార్టీ తొలి సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టించనుంది. దీంతో ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ నాయకుడు జుడిత్ కాలిన్స్ ఆర్డెర్న్‌ను అభినందించారు. విజయం అనంతరం ఆక్లాండ్‌లో తన మద్దతుదారులతో జెసిండా మాట్లాడారు. రాబోయే మూడేళ్ళలో తాను చేయవలసిన పని చాలా ఉందని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న సవాళ్లని ఆమె పేర్కొన్నారు. గతంకంటే మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, అయితే కరోనా సంక్షోభం నుంచి చాలా వేగంగా బయటపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. కోవిడ్-19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ సేకరణలాంటిదంటూ లేబర్ పార్టీ ఘన విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్డెర్న్ లేబర్ పార్టీ 49 శాతానికి పైగా ఓట్ షేర్ ను దక్కించుకుంది.1930 తరువాత ఇదే అతిపెద్ద ఓట్ షేర్ అని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ పార్టీ 27 శాతానికి పరిమితమైంది. జెసిండా ప్రజాదరణ, మానియాకు ఇది నిదర్శనమని పొలిటికల్ వెబ్సైట్ డెమోక్రసీ ప్రాజెక్ట్ విశ్లేషకుడు జెఫ్రీ మిల్లెర్ వ్యాఖ్యానించారు. ఆమె సూపర్ స్టార్ బ్రాండ్‌కు లభించిన వ్యక్తిగత విజయమని పేర్కొన్నారు. వెల్లింగ్టన్ విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ వ్యాఖ్యాత బ్రైస్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, 80 సంవత్సరాలలో న్యూజిలాండ్ ఎన్నికల చరిత్రలో ఇదే అతిపెద్ద విజయమని వ్యాఖ్యానించారు. -
కేరళ ప్రమాద స్థలంలో విదారక దృశ్యం
తిరువనంతపురం: ఇడిక్కి జిల్లా మూనూరు సమీపంలోని రాజమలైలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి తేయాకు తోటల్లో పని చేసే కార్మికులు శుక్రవారం జలసమాధి అయ్యారు. సుమారు 30 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సహాయక బృందాల గాలింపులో శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం 20, సోమవారం మరో 7 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 24 మంది కోసం అన్వేషణ సాగుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన నాటి నుంచి రెండు శునకాలు అదే ప్రాంతంలో తచ్చాడుతూ ఉన్నాయి. తమ యజమానులు కనిపించకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నాయి. పగలూ రాత్రి తేడా లేకుండా ప్రమాదం జరిగిన చోటే పస్తులుంటూ గడుపుతున్నాయి. వాటి మౌన రోదనను అర్థం చేసుకున్న సహాయ సిబ్బంది వాటికి ఆహారాన్ని ఇచ్చినప్పటికీ అవి తినడానికి నిరాకరించాయి. (తవ్వేకొద్దీ శవాలు..! ) గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది ఏదైనా శవాన్ని కనుగొని వాటిని బయటకు తీస్తే వెంటనే ఈ శునకాలు అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లి వాసన చూసి అవి తమ యజమాని కాదని నిరాశగా వెనక్కు వస్తున్నాయి. మృతదేహాన్ని వెలికి తీసిన ప్రతీసారి ఇదే తంతు జరుగుతోంది. ఇది చూసి కొంతమంది మనసు చలించిపోగా ఆ శునకాలను వారి ఇంటికి తీసికెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అవి అదే స్థలంలో శిలా విగ్రహంలా నిలబడుతూ రానని మొండికేశాయి. తమను పెంచిన వ్యక్తులు ఎప్పటికైనా తిరిగొస్తారేమో, ఎప్పటిలాగే వాటితో ఆడుకుంటారేమోనని దీనంగా ఎదురు చూస్తున్నాయి. ఈ దృశ్యం అక్కడి వారందరినీ కదిలించివేస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలను, గాయపడ్డ వారికి వైద్య సాయం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో వెల్లడించారు. (కేరళలో వర్షబీభత్సం) -
కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...
-
కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...
తిరువనంతపురం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రాష్టంలోని కొన్నిప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కొజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్టు జారీ చేసింది. అదే విధంగా మలప్పురం, ఇడుక్కి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇడుక్కి జిల్లాలో శుక్రవారం ఉదయం కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో తేయాకు తోట కార్మికులు నివసించే మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతంలో 70 నుంచి 80 మంది నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. (బిహార్‌లో వరద బీభత్సం: 21 మంది మృతి) వీరిలో కనీసం మూడు కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని, మరో 10 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఘటన ప్రాంతానికి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజమాలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రజలను రక్షించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్డిఆర్ఎఫ్) మొహరించామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పోలీసులు, అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. (రెడ్ అలర్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు) -
విషాదం : కళ్ల ముందే సముద్రంలోకి..
నార్వే : జూన్ 3న ఉత్తర నార్వేలో ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నది. అనేక ఇళ్లను సముద్రం తనలోకి లాగేసుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోను అల్టా నివాసి అయిన జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్లో షేర్ చేశాడు. 'అయ్యో ఎంత విషాదం.. చూస్తున్నంతసేపట్లో కొండచరియలతో పాటు అనేక ఇళ్లను సముద్రం తనలో కలిపేసుకుంది' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(పానీపూరి ప్రియులను కలవరపరిచే వంటకం) దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట్లో వాతావరణం అంతా కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తీరా కాసేపటికి అవన్నీ నీటిలో కలిసిపోయాయి. అసలు ఇదంతా నిజమా లేక గ్రాఫిక్సా అనే అనుమానం కలిగేలోపే జరగాల్సింది జరిగిపోయింది. అయితే ఇదంతా నిజమే.. ప్రస్తుతం ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 1.6 మిలియన్ మందికి పైగా వీక్షించారు.' ఇది నిజంగా భయానకం'.. ' 2020 మనకు ఏ మాత్రం కలిసిరావడం లేదు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (కోతి, కింగ్ కోబ్రాల ఒళ్లు గగుర్పొడిచే ఫైట్) -
కళ్ల ముందే సముద్రంలోకి..
-
ఇండోనేసియాలో భూకంపం
జకార్త: ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక దీవి లోంబోక్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో 14 మంది మృతి చెందారు. 160 మందికిపైగా గాయపడ్డారు. వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. మరో ద్వీపం బాలిలో కూడా స్వల్పంగా భూకంపం సంభవించింది. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ‘తూర్పు లోంబోక్ జిల్లాలోనే 10 మంది వరకు మృతి చెందారు. అందులో ఓ మలేసియన్ పర్యాటకుడు కూడా ఉన్నాడు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వివరాలు అందాల్సి ఉంది. కనీసం 162 మంది గాయపడ్డారు. అందులో 67 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు’అని డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన సమయంలో మౌంట్ రింజని నుంచి భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతంలో భవనాలు ఎక్కువ లేకపోవడం, మైదాన ప్రాంతం కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. -
రెడ్ అలర్డ్ : కేరళకు వరద ముప్పు
తిరువనంతపురం, కేరళ : కేరళకు వరద ముప్పు పొంచివుంది. ఈ మేరకు గురువారం ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఎస్డీఎమ్ఏ) ఆరు జిల్లాల్లో(కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వేయానాడ్, పాలక్కడ్) రెడ్ అలర్ట్, మూడు జిల్లాల(ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజా)కు ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. భారీ వరదల కారణంగా భూపాతాలు సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు ఎస్డీఎమ్ఏ హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి 18 తేదీల మధ్య 7 నుంచి 24 సెం.మీల వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జిల్లా విపత్తు నిర్వహణ సంస్థల సిబ్బందిని అలర్ట్ చేసినట్లు వివరించింది. కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ తీరాల్లో జాలర్లను సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరింది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ తీరాలపై భారీ అలలు, పెనుగాలులు విరుచుకుపడనున్నాయి. -
46 మంది దుర్మరణం
కొండ చరియలు విరిగిపడి లోయలోకి పడిపోయిన బస్సులు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సిమ్లా/నార్కట్‌పల్లి/బీబీనగర్ (భువనగిరి): భారీ వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌లో పెను ప్రమాదం జరిగింది. హిమాచల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులపై భారీ కొండచరియలు విరిగిపడటంతో 46 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. అదే సమయంలో జీపులో వెళ్తున్న తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు. మండి–పఠాన్‌కోట్ జాతీయ రహదారి కొత్పురి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 46 మృతదేహాలను వెలికితీయగా 23 మందిని గుర్తించారు. అందులో నల్లగొండ జిల్లాకు చెందిన దుబ్బాక కొండల్‌రెడ్డి (48), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొంతం రాజిరెడ్డి (52) ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఛిద్రమైన మృతదేహాలు ఘటనా స్థలాన్ని హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సందర్శించారు. చివరి మృతదేహం వెలికి తీసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మనాలీ–కత్రా వోల్వో బస్సులో 8 మంది ప్రయాణిస్తుండగా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. ఐదుగురిని కాపాడి మండి ఆసుపత్రికి తరలించారు. మనాలీ నుంచి చంబా వెళ్తున్న మరో బస్సులో 47 మంది ప్రయాణికులున్నట్లు వీరభద్ర సింగ్ వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. చాలా మృతదేహాలు ఛిద్రమవటంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని వీరభద్ర సింగ్ ప్రకటించారు. ఈ ఘటనతో రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. హిమాచల్‌లో గతంలోనూ రెండుసార్లు ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 1988లో సిమ్లా జిల్లా మతియానాలో కొండచరియలు పడి 45 మంది, 1994లో కులు జిల్లా లుగ్గార్ హతీలో 42 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ప్రధాని సంతాపం హిమాచల్ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతా పం తెలిపారు. ‘మండి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సాను భూతి. ప్రమాదంలో గాయపడిన వారు వెంట నే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు. టీ విరామం కోసం ఆపగా.. ఓ బస్సు మనాలి నుంచి కాత్రాకు, మరో బస్సు మనాలి నుంచి చంబాకు వెళుతున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి టీ విరామం కోసం కొత్పురి వద్ద ఆపారు. ఈ సమయంలో వీటిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో ఈ బస్సులు 800 మీటర్ల లోతునున్న లోయలో పడ్డాయి. చుట్టుపక్కన ఉన్న పలు వాహనాలు, ఇళ్లు కూడా ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఆఫీసు పనిపై వెళ్లి.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండ లం ఔరవాణికి చెందిన దుబ్బాక కొండల్‌రెడ్డి (48), యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లికి చెందిన కొంతం రాజిరెడ్డి (52).. హైదరాబాద్‌లోని సుశీ హైటెక్ కంపెనీలో మేనేజర్లు. ఆఫీసు పనిలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో వీరు ప్రయాణిస్తున్న జీపుపై కొండచరియలు పడ్డాయి. జీపు లోయలో పడిపోయింది. ఘటనలో కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి మృతి చెందారు. రాజిరెడ్డి మృతదేహా న్ని ఆదివారం ఎల్బీనగర్లోని ఆయన నివాసానికి తరలించారు. కొండల్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు మూడు రోజులు పడుతుందని కుటుంబీకులు చెప్పారు. -
విరిగి పడిన కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
- హిమాచల్‌లో ఘోరప్రమాదం.. మృతుల సంఖ్య 30పైనే! - కొనసాగుతున్న సహాయక చర్యలు.. 8 మృత దేహాల గుర్తింపు సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్యాసింజర్ బస్సులు 800 మీటర్ల లోతుగల లోయలో పడిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికీ 8 మంది మృత దేహాలు బయటకు తీసిన రెస్క్యూ టీం పలువురి క్షతగాత్రులను రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. మండి- పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మూడు వాహనాలపై ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లా పదార్ మండలం కొట్రూపి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మనాలి- కట్రా, మనాలి- చంబా రెండు ప్యాసింజర్ బస్సులు ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఒక్కో బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులన్నట్లు తెలుస్తోంది. బస్సులపై పూర్తిగా శిధిలాలు పేరుకుపోవడంతో క్షతగాత్రులను తీయడం ఇబ్బందిగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఇలా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవించడం హిమాచల్ ప్రదేశ్‌లో ఇది మూడో సారి. 1988 సిమ్లా జిల్లా ప్రమాదంలో 45 మంది మృతి చెందగా1994 కుల్లు జిల్లా ప్రమాదంలో 42 మంది మరణించారు. -
భూపాతం: 14 మంది మృతి?
పాపుంపరే: అరుణాచల్ ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. పాపుంపరే జిల్లా లాప్టాప్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో గ్రామానికి చెందిన 14 మంది జాడ తెలియకుండా పోయారు. ప్రస్తుతం సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అయితే, వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా పాపుంపరేలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చార్ధామ్ యాత్రికులంతా క్షేమం: సీఎం
-
చార్ధామ్ యాత్రీకులంతా క్షేమం: సీఎం
చార్ధామ్ యాత్రీల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లు: 0135-2559898 ,2552626, 2552627,2552628 గ్యాంగ్‌టక్: చార్ధామ్ యాత్రీకులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ శనివారం ప్రకటించారు. విష్ణుప్రయాగ వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆయన చెప్పారు. మీడియాతో వార్తలు వచ్చినట్లు 15000 మంది భక్తులు చిక్కుకుపోలేదని, 1800 మంది మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడ్డారని వివరించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యేందుకు శనివారం గ్యాంగ్‌టక్(సిక్కిం) వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రిషికేష్ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలోని విష్ణుప్రయాగ వద్ద కొండచరియలు విరిగిపడటంతో కొంతమంది భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే పలు మాధ్యమాల్లో చెప్పినట్లు అక్కడ 15వేల మంది లేరు. ప్రస్తుతం విపత్తు నిర్వహణ బృందాలు అక్కడ పరిస్థితిని చక్కబెట్టేపనిలో ఉన్నాయి. శిధిలాల తొలగింపు కూడా పూర్తికావచ్చింది. మరి కొద్ది గంటల్లోనే రహదారి అందుబాటులోకి వస్తుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏ ఒక్కరికీ ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరగలేదు’ అని సీఎం రావత్ చెప్పారు. హిమాచల్‌లో స్వల్ప భూకంపం ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడిన సమయంలోనే పొరుగు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో స్పల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం కూడా అక్కడి చంబా జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయింది. శుక్ర, శనివారాల్లో కనీసం ఐదు సార్లు భూమి కంపించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రకంపనల వల్ల ప్రాణ,ఆస్తినష్టాలు సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. (ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం!) -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం!
- విష్ణుప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు - నిలిచిన చార్ధామ్ యాత్ర.. చిక్కుకుపోయిన 15000మంది భక్తులు న్యూఢిల్లీ: భక్తులు, యాత్రీకులను గగుర్పాటుకు గురిచేసేలా భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో శుక్రవారం చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో నేటి సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందలల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించేపనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సిఉంది. నాలుగేళ్ల కిందట చార్ధామ్ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
చెత్తకుప్పలు మీద పడి 35 మంది మృతి
-
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
జమ్మూకశ్మీర్: కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన జమ్మూలోని కాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మాతా వైష్ణోదేశి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులతో పాటు వారిని తీసుకెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వీరంతా పాత మార్గం గుండా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కత్రా జిల్లా పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 10 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చైనాలో భారీ వర్షాలు.. 28 మంది మృతి
బీజింగ్: చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 28 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వాయువ్య చైనా గుయ్జోవ్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం పెద్ద కొండచరియ విరిగిపడి 20 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. మరో ఘటనలో మధ్య చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌లో ఉన్న వుహన్ గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి ఓ పరిశ్రమ గోడ కూలి 8 మంది మృతి చెందారని స్థానిక అధికారులు చెప్పారు. దఫాంగ్లోని పియాన్పో గ్రామంలో భారీ వర్షానికి కొండచరియ విరిగిపడి ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ చైనాలో జూన్ 27 నుంచి వర్షాలు, తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 34 మంది మృతిచెందారని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ వెల్లడించింది. నదులు ఉప్పొంగడం వల్ల రాత్రికి రాత్రి 12 వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించామని హుబై ప్రావిన్స్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 12 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 40 వేల మంది సహాయం కోసం వేచి చూస్తున్నారు. 3,600 ఇళ్లు కూలిపోయాయి. 19,900 హెక్టార్లలోని పంట నాశనమైంది’ అని చైనా ప్రభుత్వం వెల్లడించింది. -
10 మంది ప్రాణం తీసిన కొండ చరియలు
డెహ్రడూన్: కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతిచెందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లా ఛక్రతా ప్రాంతంలో చోటుచేసుకుంది. టియోని-హనోల్ ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై కొండ చరియలు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని జిల్లా అధికారి రవీంద్రనాథ్ రమణ్ తెలిపారు. గాలివానల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా పనిచేసేందుకు కూలీలు ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. -
విరిగిపడ్డ కొండ చరియలు: 17 మంది మృతి
ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా తవాంగ్ జిల్లా ఫామ్లా గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి తవాంగ్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు ఫోన్ చేసి... వివరాలు కనుకున్నారు. అయితే మృతులంతా భవన నిర్మాణ కార్మికులను తెలిసింది. వీరంతా ఫామ్లాలో హోటల్ నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను ప్రభుత్వాధికారులు వెల్లడించారు. -
పాక్‌లో ఆకస్మిక వర్షాలు: 71 మంది మృతి
ఉత్తర పాకిస్తాన్లో కురుస్తున్న ఆకస్మిక వర్షాలకు 71 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తాయి. వేలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసివేశారు. 'కోహిస్తాన్‌లో కొండచరియలు విరిగిపడడంతో 30 మంది అక్కడే చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి హెలికాప్టర్‌ను పంపినట్టు' విపత్తు నిర్వహణ అధికారి యూసుఫ్ జియా తెలిపారు. -
ఆ శిథిలాల కింద 58 మృతదేహాలు వెలికితీత
బీజింగ్: చైనాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో శిథిలాలకింద 58 మృతదేహాలు గుర్తించినట్లు చైనా అధికారులు బుధవారం వెల్లడించారు. వీరిలో 52 మందిని గుర్తించినట్లు చెప్పారు. చైనాలోని షెంజెన్ అనే ప్రాంతంలో ఒక్కసారి భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 77మంది కనిపించకుండా పోగా వారికోసం సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 18 రోజులపాటు ఈ సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి వాటికిందపడిన మొత్తం 58 మృతదేహాలను వెలికి తీశారు. -
శిథిలాల కింద ఓ మృతదేహం లభ్యం
బీజింగ్ : చైనా షెంజన్ పారిశ్రామిక వాడలో సోమవారం భారీగా కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు ఓ మృతదేహాన్నివెలికి తీసినట్లు ఉన్నతాదికారులు మంగళవారం వెల్లడించారు. 85 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. వారు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారిలో 32 మంది మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం భారీగా సిబ్బందిని రంగంలోకి దింపామన్నారు. -
వాహనాల్లోంచి దూకేసి ప్రాణాలు అరచేతపట్టుకొని
-
వాహనాల్లోంచి దూకేసి ప్రాణాలు అరచేతపట్టుకొని..
మనాలి: భారీ కొండల మధ్యన వేగంగా దూసుకెళుతున్న వాహనాలు.. రహదారి గుండా ఆహ్లాదాన్నిచ్చే వనాలు.. రోడ్డుపక్కన మెల్లగా శబ్దం చేస్తూ పారుతున్న నది. సడెన్‌గా ఓ కారు ఆగిపోయింది.. దాని వెనుక బస్సు, లారీ, బైక్ ఇలా కనుచూపమేరలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా ఎవరో బలంగా లాగేసినట్లుగా సడెన్‌గా నిలిచిపోయాయి. ఇరు పక్కల వాహనాలు డోర్లు గబాగబా తీసుకొని ప్రాణభయంతో అరుపులతో నిండిన పరుగులు.. ఇదంతా కూడా సోమవారం మధ్యాహ్నాం 2గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-చండిగఢ్ రోడ్డు మీద కనిపించిన దృశ్యం. అనూహ్యంగా భారీ మొత్తం కొండచరియలు విరిగిపడటం ప్రారంభంకావడంతో వాహనాల్లో ఉన్నవారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక్కసారి భారీ స్ధాయిలో మట్టిపెద్దపెద్ద బండరాళ్లు పెద్దపెద్ద చప్పుళ్లు చేస్తూ రహదారి మీద నుంచి నదిలోకి పడటంతో నదిలోని నీళ్లు ఎగిసి రోడ్డుమీదపడ్డాయి. దీంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, తజకిస్థాన్‌లో ఏర్పడిన భూకంపం మూలంగా ఈ ఘటన చోటుచేసుకుందా అని ఆలోచిస్తున్నారు. -
కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి
-
కొండ చరియలు విరిగిపడి 60 మంది మృతి
యంగూన్ : మయన్మార్‌లో విషాదం చోటు చేసుకుంది. కచిన్ జిల్లా పచ్చరాతి గనుల్లో శనివారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా శిథిలాల కింద చిక్కుకున్న ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పచ్చరాతి గనులు ఈ ప్రాంతంలో ఉన్న విషయం విదితమే. -
విరిగిపడుతున్న కొండచరియలు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం, నడకదారిన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పట్టనుంది. మరోపక్క, కుండపోత వర్షాల కారణంగా తిరుమలలో వర్షపు నీరు వరదలా పారుతుంది. తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆ రోడ్డులో అధికారులు అప్రమత్తత ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు దగ్గరుండి ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కొండ చరియల కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ వైపు వర్షం మరోవైపు కొండచరియల కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కొండ చరియలు విరిగి పడి 30 మంది మృతి
గ్వాటెమాలా సిటీ : భారీ వర్షాలు,ఈదురు గాలులతో గ్వాటెమాలా నగరం అతలాకుతలమైంది. నగర శివారు ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. దాంతో 30 మంది మరణించారు. మరో 600 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు గ్వాటెమాలా జాతీయ విపత్తు సహకార సంస్థ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. అయితే గల్లంతైన వారు సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు అని తెలిపారు. గురువారం రాత్రి నుంచి ఎడతేరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భారీ కొండ చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అయితే శిథిలాల కింద చిక్కిన 36 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారి పేర్కొన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. -
కొండచరియలు విరిగిపడి తల్లీకూతుళ్ల మృతి
రాంగియా: కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంలోని కంరూపా జిల్లా అమిన్ గావ్ ప్రాంతంలో మంగళవారం కొండచరియలు విరిపడి తల్లీకూతుళ్లు మృతిచెందారు. ప్రమాద స్థలానికి సమీపంలోనే ఎన్డీఆర్ఎఫ్ క్యాంపు ఉంది. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తల్లీ, చిన్నారిల మృతదేహాలను వెలికితీశారు. కాగా, చనిపోయిన మహిళపేరు సుమితా కక్లారీ అని, ఆమె కుమారుడిపేరు రశ్మీ అని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
విరిగిపడ్డ కొండచరియలు: 8మంది మృతి!
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మంగళవారం కుల్లూ జిల్లాలోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ప్రాంతంలో కొండచరియులు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న రక్షణ దళాలు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వాన -వరద!
-
కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ను కష్టాలు వీడటం లేదు. భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం.. భారీ వర్షాలు ఇలా గత రెండు, మూడు నెలలుగా ఏదో విధంగా అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. తాజాగా బంగ్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో లామా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారని, మరికొంతమంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానికంగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. -
విరిగిన కొండచరియలు: 21 మంది దుర్మరణం
ఇంఫాల్: మణిపూర్‌లో ప్రకృతి ప్రకోపానికి పెద్ద సంఖ్యలో జనం బలయ్యారు. ఖెంజోయ్ జిల్లాలో ఇండో- మయన్మార్ సరిహద్దును ఆనుకొని ఉన్నగ్రామంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో 21 మంది దుర్మరణం పాలుకాగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుండటమే కొండచరియలు విరిగిపడటానికి కారణంగా తెలుస్తున్నది. భారీ వర్షాలతో ఖెంజోయ్ జిల్లా అంతటా వాగులు, వరదలు పొంగిపొర్లుతుండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ ..క్షతగాత్రుల తరలింపు, శిథిలాల తొలిగింపులు నెమ్మదిగా సాగుతున్నాయి. వరదల కారణంగా పొరుగు ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోవడం కూడా ప్రతికూల ప్రభావిన్ని చూపుతోంది. ఇటు మహారాష్ట్రలోని ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ వేపైనా శనివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
అమరనాథ్‌లో చిక్కుకున్న 100 మంది తెలుగు వారు
మణుగూరు/రాజమండ్రి: తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మందికి పైగా భక్తులు అమర్ నాథ్ యాత్రలో చిక్కుకుపోయారు. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన ముగ్గురు అమర్నాథ్ యూత్రకు వెళ్లి మార్గమధ్యలో చిక్కుకున్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వీరంకి వెంకట్రావ్, అతని భార్య న్యాయవాది వీరంకి పద్మావతి, ఆమె సోదరుడు మురళీ ఈనెల 19న అమరనాథ్ యాత్రకు మణుగూరు నుంచి బయలు దేరారు. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు రైలు మార్గంలో వెళ్లిన వారు అక్కడ నుంచి హరికేష్ ట్రావెల్స్ ద్వారా ప్రయూణిస్తున్నారు. శ్రీనగర్ భాల్‌థార్ మధ్యన తోన్ మార్గంలో కొండచరియలు విరిగి పడటంతో వారు భాల్‌థార్‌లోనే ఉండిపోయూరు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన 100 మంది అక్కడ ఉన్నారని, రెండు రోజులుగా అక్కడి ప్రభుత్వ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పద్మావతి ఆదివారం రాత్రి సాక్షి’కి ఫోన్‌చేసి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమకు తీసుకెళ్లేప్రయత్నం చేయూలని కోరారు. -
పరోపకారం చేసేందుకు పోయి..
ముంబై: తనకు సంబంధించిన వారు కాకపోయినా ప్రాణాపాయ స్థితిలో ఉంటే జాలి పడి.. మానవతా దృక్పథంతో వారికి సాయం చేసేందుకు వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అదే దారిలో వేగంగా వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొంది. అయితే ఆయనకున్న మానవత్వం కారులోని వ్యక్తులకు లేకపోయింది. తమ కళ్లెదుటే.. తమ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడితే ఏమాత్రం కనికరంలేకుండా కారు ఆపకుండా వెళ్లిపోయారు. పరోపకారం చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ విషాదకర సంఘటన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగింది. ఆదివారం ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో అదోషీ టన్నల్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద బండరాళ్ల కింద చిక్కి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఖొపోలి గ్రామానికి చెందిన గణపత్ కుడ్పనె (32) అనే వ్యక్తి ఈ విషయం తెలుసుకుని బాధితులకు సాయం చేసేందుకు వెళ్లాడు. అదే దారిలో వెళ్తున్న కారు ఆయన్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. కాగా కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. ఖొపోలి పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్షతగాత్రులకు సాయం చేస్తూ...
ముంబై: ముంబై -పూనె ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు యువకులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతే, సహాయం చర్యల్లో పాలుపంచుకొంటూ మరోవ్యక్తి హిట్ అండ్ రన్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను తరలిస్తున్న క్రమంలో ఆ యువకుడ్ని అతి వేగంగా వచ్చిన కారు బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఖోపాలికి సమీపంలో 20 అడుగుల ఎత్తునుంచి బండరాళ్లు రహదారిపై దొర్లిపడ్డాయి. పెద్దపెద్ద రాళ్లు భారీగా విరుచుకుపడటంతో బైక్‌పై వెడుతున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుండగా గణపత్ పాండురంగ(25) ను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన గణపత్ని త్వరితగతిన ఆసుపత్రికి చేర్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఈ రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని ఎస్పీ సునీల సోనావాన్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు. కాగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే మృతునికి నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొంటామన్నారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలపై రాళ్ల వర్షం
పుణె: ప్రసిద్ధ ముంబై- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిపై వెళుతున్న వాహనాలపై పెద్ద పెద్ద బండరాళ్ల వాన కురిసింది. రహదారిలోని అదోషి టన్నెల్ వద్ద ఆదివారం మద్యాహ్నం కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా బండరాళ్లు కూలి ఓ కారు, మరో రెండు వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మరణించినట్లు తెలిసింది. చిత్రంలో కినిపిస్తున్న కారుపై పెద్ద బండరాళ్లు నేరుగా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రహదారిపై రాళ్లు గుట్టలా పేరుకుపోవడంతో ఇరువైపులా భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. యంత్రాలతో రాళ్లను తొలిగిస్తున్న పోలీసులు మరికొద్ది గంటల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తామని చెప్పారు. ముంబై- పుణె ఎక్స్ ప్రెస్ హైవేపై ఇలాంటివి ఐదారు టన్నెల్స్ ఉన్నాయి. దీంతో అధికారులు అన్నిచోట్ల ముందస్తు రక్షణచర్యలు చేపట్టారు. -
కొంప కూల్చేసింది.. రోడ్డు చిత్తడి చేసింది
డార్జిలింగ్: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఓ భారీ కొండచరియ వారి ఇంటిని నేలమట్టం చేసింది. దాని దాటికి ఇళ్లు నామరూపాల్లేకుండా పోయింది. దీనికితోడు ఆ ఇంటి పక్కనే ఉన్న ప్రధాన రహదారి కూడా ధ్వంసమైంది. డార్జిలింగ్ జిల్లాలోని కలింపాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిక్కింను కలింపాంగ్ ప్రాంతానికి కలిపే ఏకైక రహదారి ఇదే కావడంతో భారీ స్థాయిలో విరుచుకుపడిన కొండచరియల కారణంగా దాదాపు 300 మీటర్ల ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, నష్టం భారీ స్థాయిలో కనిపిస్తున్న ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
నేపాల్‌కు దెబ్బ మీద దెబ్బ..
నేపాల్: భూకంపం బారిన పడి దెబ్బతిన్న నేపాల్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాప్లే జంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా భూస్ధాపితమయ్యాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మరోసారి భూకంపం కూడా సంభవించిన విషయం తెలిసిందే. -
కొండచరియలు విరిగి 61 మంది మృతి
సల్గార్: కొలంబియాలో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 61 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. విపరీతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో ఈశాన్య కొలంబియాలోని సల్గార్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆ ప్రాంతవాసుల్లో అత్యధికులు గాఢనిద్రలో ఉన్నారు. వారి ఇళ్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో వాటికింద అనేకమంది జీవసమాధి అయ్యారని సల్గార్ మేయ ర్ ఓల్గా ఒసొరియో తెలిపారు. ఇళ్లు, వీధులు భారీ ఎత్తున బురద మట్టితో నిండిపోయినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. -
వరద ఉధృతికి 50 మంది పైగా మృతి
కొలంబియా: వాయువ్య కొలంబియాలోని ఆన్టీక్వీయా ప్రావిన్స్ లో వరద ఉధృతికి 50 మందికి పైగా మృతి చెందారిని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వరదల కారణంగా కనపడకుండా పోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధ్యక్షుడు జూవాన్ మానుల్ సాంటోస్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా లిబోరియానా నది ఉదృతంగా ప్రవహించడంతో మట్టి పెల్లలు విరిగి పడి ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను కాపాడటానికి రెస్య్కూటీం లు విరామంలేకుండా కృషి చేస్తున్నాయి. విపత్తు జరిగిన ప్రాంతాన్ని సాంటోస్ సందర్శించిన అనంతరం జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. -
విజయవాడ వద్ద విరిగిపడ్డ కొండ చరియ
-
కొండచరియలు పడి నలుగురి మృతి
డెహ్రాడూన్: కొండచరియలు విరిగిపడి సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో)కు చెందిన నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఉత్తరాధిన భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అవన్నీ కొండ ప్రాంతాలైందువల్ల ఇప్పటికే పలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రహదారులను పర్యవేక్షించే వీరు మంగళవారం జోషిమఠ్-మలారీ రహదారిని సరిచేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగి మీదపడ్డాయి. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. -
కొండచరియలు విరిగిపడి 98 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడి కనీసం 98 మంది మరణించారు. మరో 129 మంది ఆచూకీ కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని నేపాల్ ఉపప్రధాని, హోం శాఖ మంత్రి బామ్ దేవ్ గౌతమ్ చెప్పారు. సాయం కోసం భారత్‌ను అభ్యర్థించినట్టు తెలిపారు. నేపాల్‌లో సహాయక చర్యలకు కోసం భారత్ మూడు హెలీకాప్టర్లు, ఓ విమానం పంపాలని నిర్ణయించింది. -
కొండచరియలు విరిగి 200 ఇళ్లు నేలమట్టం!
నేపాల్: సింధుపల్‌చౌక్ జిల్లా మన్ఖా గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 200 ఇళ్లు నేలమట్టం కాగా, 200 మంది ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. ఖాట్మండ్ రాజధానికి 75 కిలోమీటర్ల దూరంలోని సింధుపల్ చౌక్ లోని మంఖా గ్రామంలో చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగి పడటంతో ఒకే రాత్రిలో కొండ మాయమైందని స్థానికులు తెలిపారు. విరిగిపడ్డ కొండ చరియలతో ఆగిన సుంఖోషి నది ప్రవాహం ఆగిపోయినట్టు సమాచారం. కొండ చరియలు విరిగిపడటంతో నది.. సరస్సు మాదిరిగా మారింది. ప్రవాహం పెరిగిన కారణంగా ఏ క్షణంలోనైనా నది అడ్డుగా పడివున్న కొండచరియలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. -
కొండచరియలు విరిగి...ఐదుగురు మృతి
-
పుణెలో విరిగిపడ్డ కొండచరియలు.. 17 మంది మృతి!
మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల అంబెగావ్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటికింద పడి దాదాపు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద దాదాపు 150 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కేంద్రం నుంచి వెంటనే విపత్తు నివారణ బృందాలను సంఘటన స్థలానికి తరలించారు. జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) కూడా ఇక్కడ సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. అయితే శిథిలాల కింద సరిగా ఎంతమంది ఉన్నారన్న విషయం, వారి పరిస్థితి ఏంటో కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పుణె పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటి ఫలితంగానే కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. -
పుణె సమీపంలో విరిగిపడ్డ కొండచరియలు
-
జ్యోతిర్లింగ క్షేత్రం.. కకావికలు!!
మహారాష్ట్రలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన భీమాశంకర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పుణెకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం మొత్తం కొండలతో నిండి ఉంటుంది. జ్యోతిర్లింగ క్షేత్రం కూడా భూమికంటే చాలా దిగువన ఉంటుంది. మెట్లమార్గం గుండా క్షేత్రానికి వెళ్లాలి. ఇది చాలా పవిత్ర క్షేత్రం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు నిరంతరం వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో గత కొంత కాలంగా భారీవర్షాలు కురుస్తుండటంతో బుధవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. మట్టి పెళ్లలు విరిగి కింద పడటంతో వాటి కింద పడి సుమారు 15 మంది వరకు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా శిథిలాల కింద సుమారు 50 నుంచి 100 మంది వరకు ఉంటారని అంటున్నారు. విషయం తెలియగానే గ్రామస్థులు, పోలీసులు, విపత్తు నివారణ అధికారులు, సైన్యం అంతా రంగంలోకి దిగి సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురవడంతో అంబెగావ్ ప్రధాన గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మట్టి కరిగిపోవడంతో పెద్దపెద్ద కొండరాళ్లు కింద పడ్డాయి. ఆ సమయానికి సుమారు 150 మంది వరకు గ్రామస్థులు ఇళ్లలో పడుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరెవరికీ ప్రమాదం గురించి తెలియకముందే మట్టి, శిథిలాల కింద కూరుకుపోయారు. మధ్యాహ్నానికి ఇద్దరిని మాత్రమే సజీవంగా కాపాడగలిగారు. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉండటంతో సహాయ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. -
సమాధిలా మారిన అఫ్ఘానిస్థాన్
అఫ్ఘానిస్థాన్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 2,100కు చేరింది. సంఘటన స్థలం మొత్తం ఓ భారీ సమాధిలా మారిపోవచ్చని అక్కడ సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీయడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఆర్గో జిల్లాలోని అరబ్ బరీక్ ప్రాంతంలోగల ఓ మారుమూల ప్రాంతంలో ఓ కొండ విరిగి పడటంతో ప్రమాదం సంభవించింది. అఫ్ఘాన్ రాజధాని 315 కిలోమీటర్ల ఈశాన్యంగా ఈ ప్రాంతం ఉంది. అక్కడ దాదాపు 700 కుటుంబాలకు చెందిన 4వేల మంది ఉంటున్నారని, గత కొద్దిరోజులుగా ఆప్ఘన్ ఈశాన్య ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా బురద, కొండరాళ్లు కదిలిపోయి ప్రవహించాయి. బదక్షన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి దిగువన ఉన్న గ్రామాలు నేలమట్టం అయ్యాయి.అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ద ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు.శుక్రవారం శెలవు దినం కావడంతో అంతా ఇంటిలోనే ఉండిపోయారని మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని వారు చెబుతున్నారు. మరో కొండ చరియ కూడా విరిగి పడొచ్చన్న భయం సహాయ కార్యకలాపాలకు అడ్డంగా మారింది. -
వాషింగ్టన్లో చరియలు విరిగి భారీ విధ్వంసం
వాషింగ్టన్ రాష్ట్రంలో జోరు వానకు కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. మరో 18 మంది గల్లంతయ్యారు. పలు గ్రామాల్లో 15 అడుగుల ఎత్తున బురదమట్టి పేరుకుపోయింది. కార్లు, ఇళ్లు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. సియాటిల్ కు 55 మైళ్ల దూరంలో ఉన్న స్టేట్ రూట్ నం. 530 కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కనీసం ఆరు ఇళ్లూ పూర్తిగా ధ్వంసమైపోయాయి. మొత్తం 2.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. మరో 18 మంది గల్లంతయ్యారని, గల్లంతైనవారికోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 'గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది' అని అధికారులు చెప్పారు. అయితే చాలా చోట్ల బురద భయంకరంగా ఉండటంతో సహాయకార్యాల్లో ఉన్న కార్యకర్తలు ఊబిలో కూరుకుని పోయారని, వారిని కాపాడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.