డెహ్రాడూన్: కొండచరియలు విరిగిపడి సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో)కు చెందిన నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఉత్తరాధిన భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అవన్నీ కొండ ప్రాంతాలైందువల్ల ఇప్పటికే పలు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో రహదారులను పర్యవేక్షించే వీరు మంగళవారం జోషిమఠ్-మలారీ రహదారిని సరిచేస్తుండగా ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగి మీదపడ్డాయి. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.