డెహ్రడూన్: కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతిచెందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లా ఛక్రతా ప్రాంతంలో చోటుచేసుకుంది. టియోని-హనోల్ ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై కొండ చరియలు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు.
మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని జిల్లా అధికారి రవీంద్రనాథ్ రమణ్ తెలిపారు. గాలివానల కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా పనిచేసేందుకు కూలీలు ఇక్కడికి వచ్చారని వెల్లడించారు.
10 మంది ప్రాణం తీసిన కొండ చరియలు
Published Mon, May 23 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement
Advertisement