ఆ శిథిలాల కింద 58 మృతదేహాలు వెలికితీత
బీజింగ్: చైనాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో శిథిలాలకింద 58 మృతదేహాలు గుర్తించినట్లు చైనా అధికారులు బుధవారం వెల్లడించారు. వీరిలో 52 మందిని గుర్తించినట్లు చెప్పారు. చైనాలోని షెంజెన్ అనే ప్రాంతంలో ఒక్కసారి భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 77మంది కనిపించకుండా పోగా వారికోసం సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 18 రోజులపాటు ఈ సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి వాటికిందపడిన మొత్తం 58 మృతదేహాలను వెలికి తీశారు.