recovered
-
కోవిడ్-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్- కోవ్-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది. కోవిడ్-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో ఒక ఏడాది తర్వాత వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. -
కాంగ్రెస్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్లు రికవరీ చేసిన ఐటీ
న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్ల బకాయిలను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ మొత్తం రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి రూ. 65 కోట్లు రికవరీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను ఐటీ శాఖ రికవరీ చేసింది. రూ. 65 కోట్ల రికవరీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఐటీ శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచారణ ఫలితం కోసం వేచిచూడకుండానే బ్యాంకుల వద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డబ్బులో కొంత మొత్తాన్ని ఐటీ శాఖ బకాయిల కింద రికవరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలేవరకూ ఆదాయ పన్ను శాఖ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహరంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశించింది. చదవండి: పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్ -
డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి.. ఫోన్ సిగ్నల్స్ మాత్రం వారివే!
హైదరాబాద్: సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వీరి మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి బూడిద అయినట్లు తెలుస్తోంది. ఎముకలు, టీత్ పరీక్ష ద్వారానే ఈ బాడీస్‌ను గుర్తించే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గురువారం అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లోపల చిక్కుకున్న నలుగురిని సిబ్బంది కాపాడారు. అయితే వసీం, జునైద్, జహీర్ అనే ముగ్గురు మాత్రం షెటర్లు మూసేందుకు మంటల్లోనే లోపలికి వెళ్లారు. నిన్న రాత్రి వరకు వాళ్ల ఆచూకీ తెలియరాలేదు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇవి వారివేనా కాదా? అని నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు ఘటనా స్థలంలోనే గల్లంతైన యువకుల ఫోన్ సిగ్నల్స్ చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు. -
శ్రద్ధా కేసు: ఐదు కత్తులు స్వాధీనం, వెలుగులోకి మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు. ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
సెల్‌ఫోన్ రికవరీలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
నిత్య జీవితంలో సెల్‌ఫోన్ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్‌ఫోన్ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్ఫోన్లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్‌ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్‌ఫోన్ పోయిందంటూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే తొలిసారిగా.. సెల్‌ఫోన్ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెల్‌ఫోన్ వినియోగంలో ఉంటేనే.. సెల్‌ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్‌ఫోన్ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్ మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫార్మాట్లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలి. 10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు నా మొబైల్ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్‌ఫోన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది. – ఎన్ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల -
‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి అదృష్టం, మరోసారి దురదృష్టం వెంటాడడం సహజమే!. పదేళ్ల వయసున్న సహదేవ్ దిర్డో విషయంలో ఇలాంటిదే జరుగుతోంది. ఒక వైరల్ వీడియోతో సెన్సేషన్ అయిన ఈ గిరిజన కుర్రాడికి.. బాలీవుడ్లో పాప్ సాంగ్స్ చేసే అదృష్టం దక్కింది. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం చావు అంచుల దాకా తీసుకెళ్లింది. మరి ఇప్పుడో..? ‘జానే మేరీ జానేమన్ బచ్పన్ కా ప్యార్ మేరా భూల్ నహీ జానా రే’ అంటూ స్కూల్ యూనిఫామ్‌లో తరగతి గదిలో హుషారుగా పాట పాడిన సహదేవ్ దిర్డో.. ఏడాది తర్వాత(2021లో) కరోనా టైంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఆ రాష్ట్ర సీఎం, సెలబ్రిటీలంతా ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. లగ్జరీ కారుతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా అందింది ఆ కుర్రాడికి. సుక్మాలో అతని చిన్న ఇంటికి నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి ఏకంగా తన వైరల్ సాంగ్‌కు ర్యాప్ కట్టాడు సహదేవ్. ఆ దెబ్బతో అతని జీవితం మారిపోయిందని అంతా భావించారు. కానీ.. కిందటి నెలలో తన తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న క్రమంలో జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో బతకడం కష్టమని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు భావించారు. కానీ, ఆ పిలగాడి నసీబ్ మంచిగుంది. బతికి బట్టకట్టాడు. సహదేవ్‌కు బాద్షా వెన్నంటే ఉన్నాడు. ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆపై కోలుకున్న అతన్ని రాయ్‌పూర్‌లోని మంచి న్యూరోసర్జన్ దగ్గరికి తీసుకెళ్లి కోలుకునేలా చేశాడు ఈ బాలీవుడ్ ర్యాపర్. View this post on Instagram A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev) ఆ రూపంలో లక్ తన ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వయంగా ఓ వీడియో సందేశం పోస్ట్ చేశాడు సహదేవ్. అంతేకాదు తన క్షేమసమాచారాల కోసం ఆరా తీసిన వాళ్లకు, తాను కోలుకోవాలని ఆకాంక్షినవాళ్లకు కృతజ్ఞతలు సైతం తెలియజేశాడు. అంతేకాదు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీల ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అయిన ఎన్వోఎఫ్టీఈఎన్(nOFTEN) వెంచర్లో భాగం కానున్నట్లు ప్రకటించాడు. ఇది మన దేశంలో సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన మెటావర్స్ మార్కెట్‌ప్లేస్. ఈ ఎన్ఎఫ్టీలో ఒరిజనల్ సాంగ్‌కు చెందినదంతా ఉంటుంది. తద్వారా సహదేవ్‌కు కాసుల వర్షం కురవడంతో పాటు అమితాబ్లాంటి ప్రముఖుల సరసన నిలిచే అదృష్టం కలిగింది(ఎన్ఎఫ్టీ ద్వారా). ర్యాప్ సాంగ్ ఒరిజినల్ సాంగ్‌తోపాటు బిహైండ్ సీన్స్, షార్ట్ మూవీస్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి.. ఎన్వోఎఫ్టీఈఎన్లో మంచి ధర ఆఫర్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. మొదటి మార్గంగా ప్రాధాన్యత ప్రకారం వారి కళాకృతులను చేర్చుకోవడం, వారి డిజిటల్ భాగాన్ని వేలం వేయడానికి సులభమైన బిడ్డింగ్ విధానం ద్వారా వారి భాగానికి సరైన ధరను పొందడం. రెండో మార్గం క్రియేటర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్థిరమైన ధర పాయింట్‌ను జోడించడం ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసి డబ్బు సంపాదించవచ్చు, View this post on Instagram A post shared by nOFTEN NFT Marketplace (@noften_nft) ఇదిలా ఉంటే హెల్మెట్ ధరించనందువల్లే తాను గాయపడ్డానని, దయచేసి అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ స్థానిక మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వ్యాఖ్యానించాడు సహదేవ్. मेरी जिंदगी बदल दी 🙏🙏 नमस्कार दोस्तों अपने मुझे बहुत सारा प्यार दिया मैं इसके लिए आपका सदैव आभारी हूं। @Its_Badshah @Bollyhungama@bollywood_life@BollywoodBoyz@arrahman@bhupeshbaghel@Devendra_1925 धन्यवाद pic.twitter.com/3hIADmh18N — Sahdev Dirdo (@Sahdev_Dirdo) August 2, 2021 -
సంచలనం: గంగలో కొట్టుకొచ్చిన శిశువు, సర్కార్ స్పందన
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. అలనాటి కర్ణుడుని తలపిస్తూ ఓ పసిపాప చెక్కపెట్టెలో గంగా నదిలో తేలియాడిన ఘటన పలువురి ఆశ్చర్య పరిచింది. దీనిపై స్థానికులు ఆశా జ్యోతి కేంద్రానికి సమాచారం అందించారు. అనంతరం 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈఘటనపై స్పందించిన యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పాప బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్టు ఐఏఎన్ఎస్ వావార్తా సంస్థ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డకొట్టుకువచ్చిన సంచలన ఘటన బుధవారం చోటు చేసుకుంది. చంటిబిడ్డ ఏడుపులను స్థానికంగా పడవ నడిపే వ్యక్తి గమనించాడు. అతను అందించి సమాచారం ప్రకారం మహభారతంలో కుంతీదేవి కర్ణుడిని పెట్టెలో పెట్టి వదిలి ఘటనను తలుచుకుందో ఏమో కానీ ఆ తల్లి దుప్పట్లో చుట్టిన తన బిడ్డను చెక్కపెట్టెలో పెట్టి భద్రంగా గంగానదిలో విడిచిపెట్టింది. అంతేకాదు బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా చేర్చింది. అలాగే బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. ఇదంతా గంగమ్మ తనకు ఇచ్చిన వరమని నావికుడు మురిసిపోయాడు. ఈ బిడ్డనే తానే పెంచుకుంటానని చెప్పాడు. కానీ దీన్ని నిరాకరించిన పోలీసులు సంఘటన పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. A 22-day old baby girl was found abandoned in a wooden box floating in the Ganga river in Ghazipur district. Chief Minister #YogiAdityanath has announced that the #UttarPradesh government will take the full responsibility of the child and will ensure its proper upbringing. pic.twitter.com/1D5NxHmCfA — IANS Tweets (@ians_india) June 16, 2021 -
బ్లాక్ ఫంగస్ సోకిందేమోననే భయంతో..
అహ్మదాబాద్: కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడు బ్లాక్ ఫంగస్ సోకిందనే భయంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. అతను తన భార్యతో కలిసి అహ్మదాబాద్ పాల్ధి ప్రాంతంలోని అమన్ అపార్టుమెంటులో నివసిస్తున్నాడు. మే 27న అతని పుట్టినరోజు కాగా.. అదే రోజు తన శరీరంపై తెల్ల మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ను గుర్తించి ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి అనుకొని విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్లాక్ ఫంగస్ వల్లే తన శరీరంపై మచ్చలు వచ్చాయనే భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా నాలుగు నెలల ముందు కరోనా సోకగా ఒక నెలలో మహమ్మారి బారి నుంచి పటేల్ కోలుకున్నాడు. అయితే అతను మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నందున బ్లాక్ ఫంగస్ దాడి నుంచి తాను తప్పించుకోలేనని భయపడినట్టు స్ధానిక ఎస్ఐ జేఎం సోలంకి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చదవండి: పెళ్లి జరిగి 4 రోజులు.. భర్త ముందే మాజీ ప్రియుడు.. -
అనగనగా.. ఓ అపార్ట్మెంట్: కలిసి ముచ్చట్లు బంద్
ఖమ్మం అర్బన్: మొదటి దఫా కరోనా తీవ్రతతో అప్రమత్తమై.. ప్రస్తుత రెండోదశలో అంతా స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నామని ఖమ్మంలోని 10వ డివిజన్ చైతన్యనగర్లోని ఎస్కేటీ అపార్ట్‌మెంట్‌వాసులు ఉంటున్నారు. ఇక్కడి 25 కుటుంబాల వారు కలిసికట్టుగా ఉండి.. ఐక్యంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నామంటున్నారు. గతంలో మాదిరిగా ఇరుగు పొరుగు వారంతా కలిసి ముచ్చట్లు పెట్టుకునేందుకు ఇక్కడ అనుమతి లేదు. వాకింగ్‌ను నిలిపివేశారు. వీలుంటే ఎవరింట్లో వారే, వరండాల్లో చేసుకోవచ్చు. కోవిడ్ –19 అలర్ట్..పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించుకుని..జాగ్రత్తలు, సూచనలు, సందేశాలు పంపించుకుంటున్నారు. కోవిడ్ మొదట దశలో కొంతమంది కరోనా బారిన పడితే వారికి అండగా నిలిచారు. నిత్యం అపార్ట్మెంట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. హైపోక్లోరైట్ ద్రావణంతో శానిటైజేషన్ చేయిస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరొచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. మాస్క్ లేకుంటే లోనికి ప్రవేశం నిలిపివేశారు. బంధువుల రాకపోకలను కూడా గడిచిన 20 రోజుల నుంచి నిలిపివేశారు. రెండు ప్రవేశ ద్వారాలు ఉండగా ఒకదానాని పూర్తిగా మూసి వేశారు. ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే శానిటైజర్ ఏర్పాటు చేశారు. బాధ్యతగా ఆచరిస్తాం.. కరోనా విపత్కర పరిస్థితిలో నిబంధనలను అంతా బాధ్యతగా ఆచరిస్తాం. అందుకే సురక్షితంగా ఉన్నాం. ఒకరికొకరం అనేలా అందరం సహకరించుకుంటున్నాం. వాకింగ్, కారిడార్ ముచ్చట్లను తాత్కాలికంగా నిలిపివేశాం. అవగాహన కల్పించుకుంటున్నాం. - గుడిపుడి రామారావు, అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షుడు మాస్క్, శానిటైజర్ ఉండాలి.. క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. వెంట శానిటైజర్ డబ్బా ఉంచుకోవాల్సిందే. ఇక ఆవరణలో బ్లీచింగ్ చల్లిస్తున్నాం. హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నాం. మాస్క్ ఉంటేనే లోపలికి రావాలని ఫ్లెక్సీ కూడా గేటు వద్దనే పెట్టించాం. - జాస్తి ప్రసాద్, అసోసియేషన్ కార్యదర్శి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అపార్ట్మెంట్లోని అన్ని కుటుంబాలు నిత్యం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉన్నాం. వాచ్మెన్ కూడా భద్రంగా ఉండేలా చూస్తుంటాం. కరోనా కట్టడికి అవసరమైన అన్ని రకాల పనులు చేస్తుంటాం. అవగాహన కల్పించుకుంటున్నాం. - జర్పుల కుమారి, అపార్ట్మెంట్ నివాసి -
ఒకే వ్యక్తికి రెండు ఫంగస్‌లు..షాక్‌లో వైద్యులు
భోపాల్: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో ప్రత్యేకంగా భారత్‌ను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ ఇంకా వదలక ముందే.. బ్లాక్ ఫంగస్ అంటూ మరో మహమ్మారి గురించి చెప్పి శాస్త్రవేత్తలు బాంబు పెల్చారు. అలా చెప్పిన కొన్నిరోజల్లోనే ఒకే వ్యక్తికి బ్లాక్‌తో పాటు వైట్ ఫంగస్ ఉన్న కేసు ఒకటి వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ అరుదైన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటు చేసుకుంది. రెండు ఫంగస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే తాజాగా ఒకే వ్యక్తికి రెండు ఫంగస్‌లు సోకడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తిలో ఒక ఫంగస్‌ని గుర్తించిన వైద్యులు ఆశ్చర్యంగా ఒకే వ్యక్తిలో రెండు రకాల ఫంగస్‌ను గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ తోపాటు వైట్ ఫంగస్ ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దేశంలో ఈ తరహా కేసు ఇదే మొదటి సారి కావడం గమనార్హం.దీంతో వైద్యులు షాక్‌కు గురవుతున్నారు. అయితే.. ఆ తర్వాత భోపాల్‌లో కూడా ఇలాంటి కేసు ఒకటి నమోదైందని తెలుస్తోంది. ఈ ఫంగస్ అడ్డకట్టకు ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో స్టెరాయిడ్స్ వాడిన వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. బ్లాక్ ఆండ్ వైట్ ఫంగస్ లు ముప్పు ఎక్కువగా కరోనా నుంచి కోలుకునే క్రమంలో అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో వెలుగు చూస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అధికంగా స్టెరాయిడ్స్ వినియోగం వల్ల ఇమ్యూనిటీ పవర్ దెబ్బ తింటోందని దాంతోనే ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చదవండి: కరోనా బాధితులకు గ్యాంగ్రీన్ ముప్పు! -
Andhra Pradesh: కరోనాను జయించిన 90 ఏళ్ల బామ్మ
తాడికొండ: 90 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన పర్వతం లక్ష్మీదేవి(90)కి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమె అడవితక్కెళ్ళపాడులోని క్వారంటైన్ కేంద్రంలో చేరింది. 12 రోజుల క్వారంటైన్లో వైద్యుల సలహాలు, సూచనలను పాటించింది. ఇటీవల జరిపిన పరీక్షలో నెగిటివ్ రావడంతో శనివారం ఆమె ఇంటికి చేరుకుంది. చదవండి: వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన -
మహమ్మారిని జయించిన 25 రోజుల నవజాత శిశువు
-
కరోనాను జయించిన నవజాత శిశువు
భువనేశ్వర్: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత కారణంగా రోజూ వేలది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి భయంకరమైన మహమ్మారిపై ఓ నవజాత శిశువు వెంటిలేటర్‌పై 10 రోజుల పోరాడి విజయం సాధించాడు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. ఈ శిశువుకు చికిత్స చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. ప్రాణాంతక వైరస్‌తో మూడు వారాల పోరాటం తర్వాత కోలుకోగా. ఈనెల 12వ తేదీన ఆ శిశువుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. 10 రోజులు వెంటలేటర్‌పై పోరాటం ఛత్తీస్‌గఢ్‌లోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ ఇటీవల ఓ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన 15 రోజులకే జ్వరం రావడంతో అగర్వాల్ దంపతులు భువనేశ్వర్‌లోని జగన్నాథ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సమక్షంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ శిశువుకు పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువుకు చికిత్స చేసిన నియోనటాలజిస్ట్ డాక్టర్ అరిజిత్ మోహపాత్ర మాట్లాడుతూ.. నవజాత శిశువు కాబట్టి వెంటిలెటర్‌పై ఉంచామని, రెమ్డెసివిర్తో సహా ఇతర యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్‌డెసివిర్‌ను ఇంజెక్షన్ ఇచ్చాము. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకున్నట్లు తెలిపారు. పుట్టిన వెంటనే తమ చిన్నారికి వైరస్ సోకడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల్లో ఆ శిశువు కోలుకొని కరోనా పై విజయం సాధించడంతో ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి: బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు ) -
ధైర్యే సాహసే.. ఆరోగ్యం: కరోనా భయాన్ని జయించిన వృద్ధులు
వైద్యుల ఆత్మీయ స్పర్శే ప్రాణం నిలిపింది కరోనా సోకిందని తెలియగానే ఆందోళన చెందాను. కుటుంబసభ్యులు కూడా ఇబ్బందిపడ్డారు. కానీ, నేను మాత్రం మనోస్థైర్యం తో ఉన్నా. 90 ఏళ్లకు వచ్చాను. ఇప్పుడేదైతే అదే అవుతుందని భావించాను. ఈ నెల ఐదో తేదీన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)లో చేరాను. వైద్యసిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకున్నారు. వేళకు ఆహారం, మందులు ఇచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి చేరాను. వారి ఆతీ్మయస్పర్శే నాకు పునర్జన్మను ప్రసాదించింది. – మాణిక్యమ్మ(90), నేదునూరు, కందుకూరు మండలం, రంగారెడ్డి మానసిక ప్రశాంతతతో ఎదుర్కొన్నాను నా పేరు నాగమణి, నాకు 73 ఏళ్లు. జ్వరం, జలుబు ఉండటంతో ఏప్రిల్ 15న నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచి్చంది. తొలుత భయాందోళనకు గురైనా పాజిటివ్‌గా ఆలోచిస్తూ కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడటం, ఆవిరి పట్టడం, వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేశాను. బలవర్థకమైన ఆహారం తీసుకున్నాను. హోం క్వారంటైన్ అనంతరం టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచి్చంది. – నాగమణి, పార్శిగుట్ట భయపడలేదు నాకు పదిరోజుల క్రితం దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, ఆయాసం వంటి సమస్యలు మొదలయ్యాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంట్లో వాళ్లంతా ఆందోళన చెందినా నేను భయపడలేదు. తొలుత ఫీవర్ ఆస్పత్రిలో చేరాను. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మరునాడు కొత్తపేటలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం ఏ సమస్యా లేకపోవడంతో గురువారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. – సత్యనారాయణ(88), హస్తినాపురం వారంరోజుల్లోనే ఇంటికి వచ్చిన.. నేను కె.రాములమ్మ. నాకు 92 ఏళ్లు. మాది గౌతంనగర్ డివిజన్ ఇందిరానెహ్రూనగర్. 15 రోజుల క్రితం కరోనా సోకింది. కుటుంబసభ్యులు స్థానికంగా ఉండే అంగన్వాడీ టీచర్ సహాయంతో అంబులెన్స్‌లో కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. వారంపాటు చికిత్స తీసుకొని కరోనాను జయించి క్షేమంగా తిరిగి వచి్చన. నా రెండో కొడుకు స్వామిగౌడ్‌కు గత ఏడాది కరోనా సోకడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. – రాములమ్మ(92), గౌతంనగర్ ఏం చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు నా పేరు పడాల రాములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం. 17 రోజుల కింద కాళ్ల నొప్పులు, కొద్దిగా జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రోజూ మూడు పూటలా ఆవిరిపట్టాను. డాక్టర్ చెప్పినట్టు ఉదయం, సాయంత్రం గుడ్లు తిన్నా. ప్రభుత్వ దావకాండ్ల ఇచ్చిన మందులతోనే 14 రోజుల తర్వాత కరోనాను జయించాను. చాలామంది వచ్చి ఏ చేశావ్, ఏం తిన్నావని అడుగుతుండ్రు. ధైర్యంగా ఉంటే కరోనా చంపే రోగమేమీకాదు. – పడాల రాములు(80) భయమే ప్రాణాంతకం ‘మాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి. పక్షంరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాం. అక్కడ నాతోపాటు ఇద్దరు కొడుకులకు కరోనా అంటింది. అయినా భయపడలేదు. ఇంట్లోనే ఉంటూ డాక్టర్లు ఇచి్చన మాత్రలు వేసుకున్నాం. నాకు ఒకరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ బెడ్లు ఖాళీ లేవనడంతో ఇంటికి వచ్చి మందులు వాడిన. ధైర్యంగా ఉండి కరోనా నుంచి కోలుకున్నాను. భయమే ప్రాణాంతకం. అందుకే భయపడొద్దు. – విక్కుర్తి నర్సయ్య(96) గుండె ధైర్యం రక్షించింది నా పేరు బద్దం వెంకటరెడ్డి. మాది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(సి). జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో కురవిలో పరీక్ష చేయిస్తే కరోనా నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ ఆశ కార్యకర్త, ఏఎన్ఎంలు ఇచ్చిన మందులు వాడాను. ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే నా కొడుకు చెప్పిన సూచనలు పాటించాను. పౌష్టికాహారం తీసుకుంటూ రోజూ ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చునేవాడిని. ఈ సమయంలోనే సూర్యాపేటలో ఉండే నా కుమార్తె కన్నుమూసింది. నాకు కరోనా ఉండటంతో కుమార్తెను కడసారి చూడలేకపోయాను. ఈ బాధ ఉక్కిరిబిక్కిరి చేసినా గుండెధైర్యంతో ఉండి కోలుకున్నా. – బద్దం వెంకటరెడ్డి(78), కొత్తూరు(సి), మహబూబాబాద్ జిల్లా వందేళ్ల బామ్మ.. ఇంట్లోనే కోలుకుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ పేరు యాళ్ల సీతారామమ్మ. వయసు వందేళ్లు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఈమెకు గత నెల 20న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ.. సకాలంలో మందులు, సరైన ఆహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు పాటించడంతో ఆమె కరోనాను జయించారు. ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి 97 నుంచి 98 ఉంటోందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈమె ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు స్వయానా పెద్దమ్మ కావడం విశేషం. – సారవకోట (శ్రీకాకుళం జిల్లా) -
బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు
భోపాల్: భారత్‌లో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక భాగం ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరో పక్క కరోనా వచ్చిందనే భయంతోనే.. కొందరు ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనల ఉన్నాయి. కానీ ధైర్యం, నమ్మకం ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిరూపించింది ఓ మహిళ. ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్ జయించింది. అది కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి 14 రోజుల్లోనే తరిమేసింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నర్సు. కంగారు పడక.. కరోనాను జయించింది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలో నర్సుగా కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒక్క ఊపిరితిత్తితోనే బతుకుతున్న ప్రఫులిత్ పీటర్ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భయపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ.. కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. అలాగే ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు తన ధైర్యమే కరోనా మీద విజయం సాధించేలా చేసిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. ( చదవండి: విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్ మృతి ) -
110 ఏళ్ల తాత... కరోనాపై విజేత
సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారిలో ఇత నే అత్యధిక వయస్కుడని వైద్యులు పేర్కొంటు న్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ ప్రొ ఫెసర్ రాజారావు, నోడల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన రామానందతీర్థ(110) గత నెల 24న కరోన పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చేరా రు. చికిత్స అనంతరం బుధవారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కరోన నెగెటివ్ వచ్చింది. ఆధ్యాత్మికవేత్త అయిన రామానందతీర్థ కొన్నే ళ్లపాటు హిమాలయాల్లో గడిపి.. పదేళ్ల క్రితం నగరానికి తిరిగివచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం కీళ్ల సంబంధ సమస్యకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో ఆస్పత్రి గైనకాలజీ విభాగ హెచ్ఓడీ ప్రొఫెసర్ అనుపమ పరిచయ మయ్యారు. డిశ్చార్జీ అనంతరం రామానంద తీర్థకు ఆలయాల్లో ఆశ్రయం కల్పించి ఆర్థిక సాయం అందించేవారు. ఈ క్రమంలో కీసర ఆశ్రమంలో ఉంటున్న రామానందతీర్థకు కరో నా రావడంతో అనుపమ గాంధీలో చేర్చించా రు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. కాగా, గాంధీ ఆస్పత్రి వైద్యులు తనకు పునర్జన్మ ప్రసాదించారని రామానందతీర్థ పేర్కొన్నారు. ఆయన మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చదవండి: (లాక్డౌన్: జనమంతా ఇళ్లలోనే!) 90 ఏళ్ల వృద్ధురాలు కూడా... గాంధీ ఆస్పత్రిలోనే 90 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనాపై విజయం సాధించారు. పాజి టివ్ వచ్చిన ఐదు రోజుల్లోనే రికవరీ కావడం గమనార్హం. ముషీరాబాద్ బాకారం ప్రాంతానికి చెందిన పెంటమ్మ (90) కరోనాతో ఈనెల 7న గాంధీ ఆ స్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకోవడంతో ఆస్పత్రి అధికారులు బుధవారం డిశ్చార్జి చేశారు. -
కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు..
భోపాల్: దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి పేరేత్తగానే ప్రతిఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. కానీ ఒక శతాధిక వృద్ధుడు కరోనాను జయించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని బెతుల్‌కి చెందిన 103 ఏళ్ల బిర్దిచంద్ అనే వృద్ధుడు ఈనెల 5న కరోనా బారిన పడ్డాడు. కోవిడ్ లక్షణాలున్నప్పటికి బిర్దిచంద్ ఏమాత్రం భయపడలేదు. ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాజిటీవిటిగా ఉండటం వల్ల ఆయన వైరస్‌ను జయించాడని బిర్దిచంద్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా, చంద్ మాట్లాడుతూ.. ‘నేను అప్పట్లో.. స్వాతంత్రోద్యమంలో ఆంగ్లేయులతో పోరాడి విజయం సాధించినట్లే... ఇప్పుడు, కరోనాపై పోరాడి విజయం సాధించానని’ పేర్కొన్నాడు. అయితే, చింద్వారాకు చెందిన ఒక డాక్టర్ సలహా మేరకు మాత్రం కొన్ని మందులు వాడినట్లు చంద్ తెలిపాడు. కాగా ఆధార్ కార్డు ప్రకారం ఈయన 1917 నవంబరు 2 న జన్మించాడు. చదవండి: వామ్మో.. పొరుగు దేశంలో కొత్త రకం కరోనా -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సంచలన ఆధారాలు
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల వాహనం కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వాహన యజమాని థానేకు చెందిన ఆటో విడిభాగాల డీలర్ మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పదమరణంతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది. దీంతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. (అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) సచిన్ వాజే వాడుతున్న బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ కారును ఎన్ఐఏ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందులో 5లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషీన్, కొన్ని దుస్తులతోపాటు కీలక ఆధారాలను సీజ్ చేసింది. వాజే నడుపుతున్నాడని ఆరోపిస్తున్న ఈ బెంజ్‌కారులో అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో వాహనం లైసెన్స్ ప్లేట్‌ను కూడా సీజ్ చేయడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సచిన్‌వాజేను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్‌తో పాటు థానేలోని సచిన్ వాజే నివాసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ను కూడా కావాలని పారేసిన వాజే ల్యాప్‌టాప్‌లోని డేటాతోపాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా డిలీట్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. అలాగే సీసీటీవీలో పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజేనేనని ఎన్ఐఏ స్పష్టం చేసింది. చెక్ షర్ట్, కిరోసిన్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్‌తోనే పీపీఈ కిట్ తగుల బెట్టాడని ఆరోపిస్తోంది. ప్రస్తుతం సచిన్ వాజే వినియోగిస్తున్న బెంజ్ కారు అసలు యజమాని ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నామని ఎన్ఐఏ అధికారి అనిల్ శుక్లా తెలిపారు. (అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం) కాగా ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ నివాసం అంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనం కలకలం రేపింది. తన స్కార్పియో కనిపించడం లేదంటూ మన్సుఖ్ హిరేన్ ఫిబ్రవరి 17నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 5 న ముంబైకి సమీపంలోని కొలనులో హిరేన్ శవమై తేలాడు. దీంతో హిరేన్ భార్య విమల సచిన్వాజేపై ఫిర్యాదు చేసింది. మరోవైపు శివసేన ప్రభుత్వం వాజేను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వాజేపై మొదటినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే. -
కరోనా సోకితే 8 నెలలు సేఫ్?
సాక్షి, హైదరాబాద్ : ఒకసారి కరోనా బారిన పడ్డవారికి కనీసం 8 నెలలపాటు ఆ వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఎక్కువ కాలం రక్షణ లభించే అవకాశముందని తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని ఆస్ట్రేలియా లోని మొనాష్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మెమో వాన్ జెల్మ్ తెలిపారు. సైన్స్ ఇమ్యూనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. కరోనా బారినపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థకు చెం దిన మెమరీ బీ–సెల్స్‌ను గుర్తించారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్..!) ఈ కణాలు వ్యాధి, వైరస్ రెండింటినీ గుర్తుంచుకుంటాయి. ఒకవేళ మళ్లీ వైరస్ దాడి చేస్తే ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. పరిశోధనల్లో భాగంగా 25 మంది కరోనా సోకిన వారిని ఎంపిక చేశామని, వ్యాధికి గురైన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకు పరిశీలించామని వాన్ జెల్మ్ తెలిపారు. వైరస్ నిరోధానికి ఉపయోగపడే యాంటీబాడీలు 20వ రోజు నుంచి తగ్గిపోవడం మొదలైందని, కాకపోతే మెమరీ బీ– సెల్స్ చివరి రోజు వరకు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ మెమరీ సెల్స్ వైరస్ కొమ్ము, న్యూక్లియో ప్లాస్టిడ్ ప్రొటీన్ రెండింటినీ గుర్తించగలదన్నారు. (చదవండి: ముంబై, కర్ణాటకల్లో రాత్రి కర్ఫ్యూ) -
మనోధైర్యమే మందు: ఓల్డ్ ఈజ్ గోల్డ్!
వందేళ్లు, 90 ఏళ్లు దాటినా... కరోనాను జయించిన వారియర్స్ వీళ్లు. మనోధైర్యమే ఆయుధంగా కరోనాను ఎదుర్కొన్నారు. అదే అసలైన మందు అంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలున్నా... టెన్షన్ పడలేదు. ఆందోళన పడతారని కరోనా సోకిన విషయాన్ని పిల్లలకు కూడా చెప్పని నిబ్బరం ఉన్నవాళ్లు కొందరు. ప్రశాంతంగా ఉంటూ, డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకొని బయటపడ్డారు.. ఈయన పేరు శుభ్ కరణ్ అర్హ. 102 ఏళ్ల శుభ్‌కరణ్‌కు అక్టోబర్ 24వ తేదీన కరోనా సోకింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారిగా కీలక పదవుల్లో పనిచేసి రిటైరైన సీడీ అర్హ తండ్రి. శతాధికుడైన తండ్రికి కరోనా రావడంతో సీడీ అర్హ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుభ్‌కరణ్ అర్హకు షుగర్, బీపీ వంటివి లేవు. జ్వరం, తీవ్ర జలుబు ఉండటంతో హోం ఐసో లేషన్‌లోనే ఉంచి చికిత్స చేశారు. ఒకసారి శ్వాసకోశ సమస్య ఎదురైనా అంతటి వయస్సులోనూ ఆయన గట్టెక్కారు. నవంబర్ రెండో తేదీన పరీక్షిస్తే ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. 102 ఏళ్ల వయస్సులోనూ శుభ్‌కరణ్ అర్హ ప్రతిరోజూ ఉదయం ఒక కిలోమీటర్, సాయంత్రం ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తారు. శాకాహారి. మధ్యాహ్నం ఒక చపాతి, రాత్రి ఒక చపాతి తీసుకుంటారు. ఎక్కువగా పండ్లు, సలాడ్లు తింటారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రార్థనలు చేస్తారు. బీపీ, ఆస్తమా ఉంది... అయినా గట్టెక్కా ఆగస్టులో కరోనా వచి్చనట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కిమ్స్‌కు వెళ్లాను. చెస్ట్ స్కాన్ చేశారు. అక్కడ పది రోజులు ఉన్నాను. నాకు బీపీ, ఆస్తమా ఉంది. అయినా త్వరగా కరోనా నుంచి బయటపడ్డాను. కరోనా వచ్చింది ఏం చేస్తాం... అనుకున్నానే కానీ టెన్షన్ పడలేదు. నా పిల్లలకు కూడా చెప్పలేదు. ఏం చేస్తుందిలే అని ధైర్యంగా ఉన్నాను. డాక్టర్లు చెప్పినట్లుగా మందులు వేసుకున్నాను. అంతే కోలుకున్నాను. – జి.లలితకుమారి (90), హైదరాబాద్, సీఆర్‌ఫౌండేషన్ వృద్ధాశ్రమం బీపీ, షుగర్ ఉన్నా భయపడలేదు.. నాకు కూడా ఆగస్టులోనే కరోనా సోకింది. వైరస్ లోడ్ అంతగా లేదని డాక్టర్లు చెప్పారు. సమీపంలోని టిమ్స్‌లో జాయిన్ చేశారు. బీపీ, షుగర్ ఉన్నాయి. మందులు వేసుకున్నాను. ధైర్యంగా ఉన్నానంతే. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడలేదు. టిమ్స్‌లో వారం రోజులు ఉంచుకొని పంపించారు. – కాట్రగడ్డ అనసూయ (93),సీఆర్ ఫౌండేషన్,హైదరాబాద్ ప్లాస్మా ఎక్కించారు నాలుగు నెలల కిందట నాకు కరోనా వచ్చింది. వైరస్ నిర్ధారణకు ముందు జ్వరం వచి్చపోయేది. నాలుక పొక్కింది. పట్టించుకోలేదు. మందులు వాడాను. టెస్టు చేస్తే కరోనా అని తెలిసింది.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. షుగర్ ఉంది. టిమ్స్ ఆసుపత్రిలో ఉంచారు. ప్లాస్మా ఇచ్చారు. ఆరు రోజులు ఉన్నాను. టెన్షన్ పడలేదు. కరోనాకు ముందు రోజుకు 40 నిమిషాలు వాకింగ్ చేసేవాడిని. ఆసుపత్రి నుంచి వచ్చాక నీరసం ఉండేది. ఇప్పుడు బాగానే ఉన్నాను. – వెల్లంకి రామారావు (73), సీఆర్ ఫౌండేషన్ మనోధైర్యమే కారణం 90 ఏళ్లు... వందేళ్లు దాటిన వారు కూడా కరోనా నుంచి గట్టెక్కారంటే వారి మనోధైర్యమే ప్రధాన కారణం. పైగా త్వరగా వైరస్‌ను పసిగట్టడం, వెంటనే చికిత్స పొందడంతో వారంతా వైరస్‌ను జయించారు. ఆహారపు అలవాట్లు అత్యంత కీలకం. దాని కారణంగా రోగనిరోధక శక్తి బాగుంటుంది. దానికి తోడు మనోధైర్యం ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రధానంగాతోడ్పడుతుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, ఐసీయూ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్,సిటీ న్యూరో సెంటర్,హైదరాబాద్ -
కరోనా రోగికి వరం: ‘నిశ్శబ్దం’ సినిమా సూత్రం
సాక్షి, గాంధీ ఆస్పత్రి/హైదరాబాద్: అతడు బయటి వ్యక్తులతో మాట్లాడలేడు.. ఏ అవసరం ఉన్నా కుటుంబ సభ్యులు వివరిస్తారు.. కానీ అతడు కరోనా బారిన పడ్డాడు. మాటలు రాకపోవడంతో వైద్యులతో మాట్లాడలేడు. వైద్యులు చెప్పేది వినబడదు. సరిగ్గా చెప్పాలంటే ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలోని అనుష్కలా అన్నమాట. సినిమాలో అనుష్క టెక్నిక్‌నే వినియోగించి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. హైదరాబాద్ మణికొండకు చెందిన రామచంద్రన్(45) దివ్యాంగుడు. మాటలురావు.. వినబడదు. కరోనా పాజిటివ్ రావడంతో గతనెల 27వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. రోగి సహాయకులకు అనుమతి లేకపోవడంతో రామచంద్రన్ ఒక్కడే వార్డులో అడ్మిట్ అయ్యాడు. అతడు మాట్లాడలేక పోవడం, చెప్పినా వినిపించకపోవడంతో అతడు ఇబ్బందులు పడ్డాడు. అతడి బదిర భాష వైద్యులకు అర్థం కాలేదు. మనసుంటే మార్గం ఉంటుందని భావించిన వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను హావభావాలు, సంజ్ఞల ద్వారా వివరించారు. మరికొన్ని విషయాలను రోగి సెల్‌ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చాట్ ద్వారా చెప్పారు. దీంతో వైద్యులు, రోగి మధ్య కమ్యూనికేషన్ కొంతమేర మెరుగైంది. శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్లు, వార్డ్‌బాయ్స్‌ల వద్దకు వచ్చేసరికి కమ్యూనికేషన్ సమస్య మొదలైంది. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాటించిన చిట్కాను ఇక్కడ వినియోగించారు. బాధితుడు తన మొబైల్లో ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే, తెలుగులో బయటకు వినిపించే యాప్స్‌ను వినియోగించడంతో సమస్య పరిష్కారమైంది. రామచంద్రన్ పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, నోడల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ వినయ్‌శేఖర్‌తో పాటు వైద్యులు, సిబ్బందికి రామచంద్రన్, సోదరుడు రామానుజన్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనాను జయించిన కలెక్టర్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: కరోనా వైరస్ బారినపడిన కలెక్టర్ నారాయణభరత్‌గుప్త కోలుకున్నారు. ఈ నెల 17న ఆయనకు పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి తిరుపతి క్యాంప్ కార్యాలయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించారు. ఆదివారం మరోసారి పరీక్షించుకోగా నెగిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ నుంచి చిత్తూరు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జిల్లాలో మార్చి నుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరోనా కట్టడికి విశేష సేవలందించారు ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు. (ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు) -
24 గంటల్లో లక్షకు పైగా రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి రికవరీల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఏకంగా 1,01,468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 44,97,867కు చేరుకుంది. మరోవైపు కొత్త కేసుల సంఖ్య కూడా ఇటీవల వస్తున్న రోజూవారీ కేసులతో పోలిస్తే తగ్గాయి. మంగళవారం 75,809 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 55,62,663కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,053 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 88,935 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,861 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 17.54 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 80.86 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.60 శాతానికి పడిపోయిందని తెలిపింది. సెప్టెంబర్ 21 వరకు 6,53,25,779 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 9,33,185 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 344 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారతే బెటర్.. నాలుగు రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో భారత్ నుంచి 17.7 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే కోలుకున్న వారిలో 19.5 శాతం ఉన్నారని చెప్పారు. అమెరికా నుంచి 22.4 శాతం కేసులు ఉండగా, అక్కడ కోలుకున్న వారి శాతం 18.6గా ఉందని చెప్పారు. బ్రెజిల్‌తో పోల్చినప్పటికీ, భారత్ నుంచే రికవరీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వీకీ పాల్ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో ప్రజలంతా భౌతిక దూరం పాటించడం వంటివి మరచిపోరాదని చెప్పారు. -
కరోనా కిల్లర్ @103
హఫీజ్‌పేట్(హైదరాబాద్): భయపడకుండా, తగిన జాగ్రత్తలతో ఎదుర్కొంటే కోవిడ్‌ను సులభంగా జయించవచ్చని నిరూపించాడు మరో శతాధిక వృద్ధుడు. నగరంలోని కొండాపూర్‌లో ఉన్న సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో పరుచూరి రామస్వామి (103) ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన కోవిడ్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఆయన్ని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందించిన చికిత్సతో రామస్వామి కోలుకొని తిరిగి వృద్ధాశ్రమానికి క్షేమంగా చేరుకున్నారు. సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రామస్వామిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కోవిడ్ చికిత్సకు ప్రభుత్వాసుపత్రులే అ త్యుత్తమం. ఫౌండేషన్‌లో 26 మందికి కోవిడ్ సోకింది. వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
కరోనా వైరస్ : 75 శాతానికి చేరువైన రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మెరుగైన ఫలితాలు రాబడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య ఆదివారం నాటికి 22,80,566కు పెరగడంతో రికవరీ రేటు 75 శాతానికి చేరువైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా 1.86 శాతానికి తగ్గడం సానుకూల పరిణమామని తెలిపింది. వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య నిలకడగా పెరుగుతుండటంతో మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 23.24 శాతానికి పరిమితమైందని తెలిపింది. చదవండి : సినిమా షూటింగ్‌లకు అనుమతి గడిచిన 24 గంటల్లో 57,989 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 74.90 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు సమగ్ర చికిత్సా విధానాలతో కోవిడ్-19 రోగులు అత్యధిక సంఖ్యలో కోలుకోవడంతో పాటు, మరణాల రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కట్టడికి భారత్ దశలవారీగా, చురుకైన వ్యూహాలతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,239 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 30,44,940కి ఎగబాకింది. వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో 912 మంది మరణించారు. -
మళ్లీ బంగారం, వెండి తళతళ
వారాంతాన భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు నేటి ట్రేడింగ్‌లో రికవర్ అయ్యాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 199 పుంజుకుని రూ. 54,988కు చేరింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. సెప్టెంబర్ ఫ్యూచర్స్ వెండి కేజీ రూ. 910 ఎగసి రూ. 75,070 వద్ద వద్ద ట్రేడవుతోంది. గడిచిన శుక్రవారం తొలుత సరికొత్త గరిష్ట రికార్డులకు చేరిన బంగారం, వెండి ధరలు మిడ్‌సెషన్ నుంచీ పెరిగిన భారీ అమ్మకాలతో ఒక్కసారిగా డీలాపడిన సంగతి తెలిసిందే. పసిడి గరిష్టంగా రూ. 56,191ను తాకగా.. వెండి రూ. 77,949కు చేరింది. తద్వారా వారాంతాన ఇంట్రాడేలో బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్ చరిత్రలో సరికొత్త గరిష్టాలను సాధించాయి. కామెక్స్‌లోనూ ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 11 డాలర్లు(0.5 శాతం) బలపడి 2,039 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 6 డాలర్లు క్షీణించి 2,029 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. రికార్డ్ ర్యాలీని కొనసాగిస్తూ శుక్రవారం ఉదయం పసిడి 2,089 డాలర్ల వద్ద ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకున్న విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం వెండి సైతం 0.6 శాతం లాభపడి 28.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కరోనాను జయించిన 105 ఏళ్ల బామ్మ..
కరోనా పేరు చెబితే కుర్రాళ్లు సైతం వణికిపోయే పరిస్థితి. కానీ 105 ఏళ్ల వయస్సులోనూ ఓ బామ్మ..మహమ్మారిని విజయవంతంగా తిప్పికొట్టారు. వైద్యులు, నర్సుల సహకారంతో త్వరగానే కోలుకుని పెద్దాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనో నిబ్బరంతో ఉంటే కరోనా ఏమీ చేయదని చాటి చెప్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు పాతబస్తీలోని పెద్దపడఖానావీధికి చెందిన బి.మోహనమ్మ వయస్సు 105 ఏళ్లు. ఆమె భర్త మాధవస్వామి 1991లోనే మరణించారు. అప్పట్లో ఆయన బంగారు నగలు తయారు చేసే పనిలో ఉండేవారు. వీరికి ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కుమారుల్లో ఒకరు ఇటీవలే మరణించారు. మరొకరు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైరయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న మూడో కుమారుడు జయదాస్ నాయుడు వద్ద మోహనమ్మ ఉంటున్నారు. ఐదుగురు ఆడపిల్లల్లో పెద్ద కుమార్తెకు 82 ఏళ్లు, రెండో కుమార్తెకు 80 ఏళ్లు, మూడో కుమార్తెకు 70 ఏళ్ల వయస్సు. మిగిలిన ఇద్దరూ మరణించారు. ఇంత వయస్సులోనూ మోహనమ్మ తన పనులు తానే చేసుకుంటున్నారు. ప్రతిరోజూ యోగా, ధ్యానం, వాకింగ్ చేస్తారు. మితాహారం తీసుకుంటారు. ఇప్పటికీ కుమార్తెల ఊళ్లకు ఒక్కరే వెళ్లి వస్తుంటారు. ఆమె జీవితంలో ఎనిమిది మంది సంతానంతో పాటు 26 మంది మనవళ్లు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలను కూడా చూశారు. కరోనా ఏమీ చేయలేకపోయింది! కర్నూలు నగరంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి 60 ఏళ్లు దాటిన వారందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోహనమ్మకు కూడా పరీక్షలు చేయించగా.. కరోనా పాజిటివ్‌గా గత నెల 19న నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని ఎంఎం–4 వార్డులో ఉంచి చికిత్స చేశారు. ఆమెను వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. కరోనా నిర్ధారణ అయిన సమయంలోనూ ఆమెకు స్వల్ప జ్వరం మినహా ఇతరత్రా లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కొద్దిగా ఆయాసం రావడంతో ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. అంతకు మించి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఎదుర్కోకుండానే కోలుకున్నారు. ఆసుపత్రిలో ఆమెకు తోడుగా కుమారుడు జయదాస్ నాయుడు ఉన్నారు. మోహనమ్మను గత నెల 31న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యకర అలవాట్ల వల్లే జయించా గతంలో నేనెప్పుడూ ఇలాంటి రోగాన్ని చూడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి ప్లేగు వ్యాధి వచ్చిందని బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. నాకు బీపీ, షుగర్ ఉన్నా నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యకర అలవాట్ల వల్లే నేను కరోనాను జయించగలిగా. ఇప్పటికీ యోగా, ధ్యానం చేస్తుంటా. అవే నా ఆరోగ్య రహస్యాలు. – మోహనమ్మ -
అందరికీ కృతజ్ఞుడిని: విజయసాయి రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు పదిరోజుల నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఆయన శనివారం రోజున కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. (అన్‌లాక్ 3.0: స్పందనలో ఈ-పాస్‌లు) -
తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ : కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నేటి నుంచి తిరిగి విధులు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంత్రి నిత్యం ఆసుప్రతులను సందర్శించేవారని, ఆరోగ్య కార్యకర్తలతో సమావేశమయ్యారని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారని, దాదాపు నెల రోజుల తర్వాత విధుల్లో తిరిగి చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. జూన్ 17న ఆరోగ్యమంత్రి సత్యేంద్రకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. మొదట రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. 55 ఏళ్ల జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగపడింది. దీంతో జూన్ 26న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. — Arvind Kejriwal (@ArvindKejriwal) July 20, 2020 -
వయసు 106 : రెండు వైరస్‌లను దాటుకుని..
సాక్షి, న్యూఢిల్లీ : వందేళ్ల కిందట ప్రపంచాన్ని కబళించిన స్పానిష్ ఫ్లూను తట్టుకున్న వ్యక్తి తాజాగా కోవిడ్-19 బారినపడి 106 ఏళ్ల వయసులోనూ సులువుగా కోలుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కోవిడ్-19 కేంద్రంలో చికిత్స పొందుతూ 70 ఏళ్ల తన కుమారుడి కంటే ఆయన వేగంగా కోలుకున్నారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి తన భార్య, కమారుడు, మరో కుటుంబ సభ్యుడితో కలిసి ఆయన ఇటీవలే డిశ్చార్జి అయ్యారని వైద్యులు తెలిపారు. 1918లో ఇప్పటి కోవిడ్-19 తరహాలోనే ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ ప్రభావాన్ని ఆయన ఎదుర్కొన్నారని వైద్యులు చెప్పారు. ఈ తరహా కేసు ఢిల్లీలో ఇదే మొదటిది కావచ్చని వైద్యులు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం 1918లో వ్యాప్తి చెందిన స్పానిష్ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది మరణించారు. అయితే ఆయనకు స్పానిష్ ఫ్లూ సోకిందో లేదో తమకు తెలియదని, ఢిల్లీలో అప్పట్లో చాలా తక్కువ ఆస్పత్రులే ఉండేవని..అప్పటి రికార్డులు లభ్యం కానందున ఈ విషయం నిర్ధారించలేమని వైద్యులు చెబుతున్నారు. ఏమైనా 106 సంవత్సరాల శతాధిక వృద్ధుడు కరోనా వైరస్ నుంచి వేగంగా కోలుకోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహమ్మారి నుంచి బయటపడేందుకు ఆయన చూపిన సంకల్ప బలం అమోఘమని వైద్యులు కొనియాడారు. రెండు అత్యంత ప్రమాదకర వైరస్‌లను ఆయన దాటివచ్చారని గుర్తుచేశారు. చదవండి: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి -
కరోనా నుంచి కోలుకున్న మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే స్వల్ప అస్వస్థతతో ఉండటంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యగా మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోలుకొని ఇంటికి వెళ్లారు. అందరి ప్రార్థనలతో తాను త్వరగా కోలుకున్నానంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే 20 మందికి వైరస్ సోకింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విస్తృతంగా శానిటైజేషన్ పనులు ముమ్మరం చేశారు. అయితే ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20,903 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,25,439కి చేరింది. (20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి ) -
మహమ్మారితో 95 రోజులు పోరాడి..
లండన్ : కరోనా మహమ్మారితో 95 రోజుల పాటు పోరాడి ప్రాణాంతక వ్యాధిని జయించి తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌కు చెందిన కీత్ వాట్సన్ మూడునెలలకు పైగా వైరస్‌తో పోరాడి మహమ్మారిని ఓడించాడు. 41 రోజులు ఐసీయూలో గడిపిన వాట్సన్ 23 రోజుల పాటు కోమాలో ఉన్నారు. ఓ దశలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ఇక బతకరని వాట్సన్ కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందచేశారు. ధైర్యంతో తీవ్ర అనారోగ్యాన్ని అధిగమించిన వాట్సన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి పయనమయ్యారు. మూడు నెలలుపైగా చికిత్స అనంతరం వాట్సన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండగా వైద్య సిబ్బంది ఆయనను అభినందనల్లో ముంచెత్తారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరగా ఇంటివద్ద 100 మందికి పైగా స్నేహితులు, స్ధానికులు ఆయనను చప్పట్లతో స్వాగతించారు. దీర్ఘకాలం కరోనా మహమ్మారితో పోరాడి తాను ఇప్పటికీ సజీవంగా ఉన్న విషయం నమ్మలేకపోతున్నానని వాట్సన్ చెప్పుకొచ్చారు. చదవండి : ‘మహమ్మారికి భయపడితే ఆకలితో చస్తాం’ -
మొమోటా... పూర్తి ఫిట్‌గా
టోక్యో: ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా శుక్రవారం ప్రకటించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీ విజేతగా నిలిచిన అనంతరం స్వదేశానికి వెళ్లేందుకు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడంతో మొమోటా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా... మొమోటా సిబ్బందికీ గాయాలయ్యాయి. మొమోటా కంటికి గాయం కావడంతో ఫిబ్రవరిలో డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. ‘ఆడేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూడగలుగుతున్నా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గతంలో లాగే ఆడుతున్నట్లు అనిపిస్తోంది’ అని మొమోటా అన్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడమే తన తదుపరి లక్ష్యం అని మొమోటా పేర్కొన్నాడు. -
కరోనా వస్తే జీవితం అంతం కాదు
చెన్నై : కరోనా నుంచి 97 ఏళ్ల వృద్దుడు కోలుకున్న ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇదివరకే పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కరోనాను జయించి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైద్యులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది, చెప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలతో 97 ఏళ్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిని మే 30న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే అంతకుముందే రక్తపోటు, గుండె జబ్బు లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కానీ ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని డాక్టర్ విజయలక్ష్మీ బాలకృష్ణన్ అన్నారు. కరోనా వస్తే ప్రాణం పోతుంది అన్న అపోహ వద్దు. జీవితం ఎప్పుడూ మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. దాన్ని సద్వినియోగించుకొని యుద్ధంలో గెలవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. (పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ! ) దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 11,458 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం 14,723 యాక్టివ్ కేసులుండగా, రికవరీ రేటు 52 శాతంగా ఉంది. ఇక కరోనాతో ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అత్యధిక మొత్తంలో డబ్బు గుంజుతున్న నేపథ్యంలో తమిళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయవలసిన ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. అసింప్టమాటిక్ లేదా తేలికపాటి లక్షణాలు ఉంటే రోజుకు ఐదు వేల రూపాయల నుంచి కేసు తీవ్రతను బట్టి గరిష్టంగా 15,000 రూపాయల వరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా వీరికి కూడా ఆరోగ్య బీమా పథకం వర్తింపజేసింది. దీని ప్రకారం కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందితే ప్రభుత్వం నుంచి సహాయం అందించనుంది. (మరోసారి లాక్డౌన్ విధిస్తారా ?! ) -
కరోనా నుంచి కోలుకున్న పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్ శుక్రవారం తెలిపాడు. కోవిడ్–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఉమర్.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
కరోనాను జయించిన బామ్మ : బీర్‌తో సెలబ్రేషన్
వాషింగ్టన్ : చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ కరోనా కబళిస్తుంటే 103 ఏళ్ల బామ్మ మాత్రం మృత్యువు అంచుల దాకా వెళ్లి పూర్తిగా కోలుకుంది. కోలుకున్న శుభ సందర్భంగా ఆసుపత్రిలోనే చిల్డ్ బీర్స్‌తో సెలబ్రేట్ కూడా చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టెజ్నా మే నెలలో కరోనా బారిన పడింది. అందులోనూ వృద్ధురాలు కావడంతో అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో స్టెజ్నాపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో ఆమె చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా స్టెజ్నా కరోనా నుంచి కోలుకుంది. చావు వరకూ వెళ్లిన బామ్మ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. కోలుకున్న బామ్మ కూడా చిల్డ్ బీర్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు షెల్లీ గన్ సోషల మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దీంతో పలు పత్రికలు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రచురించాయి. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్ ) ఈ సందర్భంగా షెల్లీ మట్లాడుతూ, ‘మా బామ్మ తన జీవిత కాలంలో మా కోసం చాలా కష్టపడింది. ఈ వయసులో ఆమె కరోనాకు గురి కావడంతో మేం చాలా ఆందోళనకు గురయ్యాం. అంతేకాకుండా ఆమె పరిస్థితి కూడా విషమించడంతో ఆశలు వదులుకున్నాం. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేద్దాం అనుకున్నాం. కానీ బామ్మ కోవిడ్‌ను జయించింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని మేమే నమ్మలేకపోతున్నాం. అంటూ ఆనందం వ్యక్తం చేసింది'’ అంతేకాకుండా 103 ఏళ్ల వయసులోనూ కరోనా వైరస్‌ను తట్టుకుని కోలుకోవడంతో ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్పత్రి సిబ్బందే ఆమెకు చిల్డ్ బీర్ అందించారు. అది చూడగానే బామ్మ మరింత సంతోషంతో బీర్‌ను ఎంజాయ్ చేసింది అంటూ షెల్లీ పేర్కొంది. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం ) -
చిన్నారి ముందు తలవంచిన కరోనా
సాక్షి, చిత్తూరు: బుడిబుడి అడుగులతో ఒకచోట కుదురుగా ఉండని పసిప్రాయం. తల్లి, పెద్దమ్మకు కరోనా పాజిటివ్ రావడంతో 18 రోజులు ఐసోలేషన్ గదిలో ఉండాల్సి వచ్చింది. వైద్యులు తీసుకున్న జాగ్రత్తలతో పాటు శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి కారణంగా ఆ చిన్నారిని కరోనా వైరస్ ఏమీ చేయలేకపోయింది. వివరాల్లోకి వెళితే.. నగరికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనాలకు వెళ్లి వచ్చాడు. అధికారులు అతన్ని పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 5న తిరుపతిలోని కోవిడ్–19 ఆస్పత్రికి పంపించారు. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఏప్రిల్ 6వ తేదీన 20 మంది సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్ 7న అక్కడి వారిని పరీక్షించగా ఇద్దరు మహిళలకు పాజిటివ్ వచ్చింది. వారిని ఏప్రిల్ 8న చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకామెకు ఏడాదిన్నర వయస్సు బాబు ఉన్నాడు. (కేసుల తీవ్రత రెడ్జోన్లలోనే) కుటుంబ సభ్యులంతా క్వారంటైన్లో ఉండడంతో చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు బంధువులు ముందుకు రాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబు సంరక్షణ బాధ్యతలు అప్పగిద్దామంటే ఆమె ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి, పెద్దమ్మతో పాటు ఆ బాలుడు 18 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. చేరిన మొదటి రోజు ఒకసారి, డిశ్చార్జి అయ్యే నాలుగు రోజుల ముందు పరీక్షలు చేయగా బాలుడికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. (కొత్త కేసులు 81) బాలుడి సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతోనే ఇది సాధ్యమైందని తల్లి పేర్కొన్నారు. చిన్నారికి న్యూట్రీషియన్ బిస్కెట్లు ఇవ్వడం, బయటి నుంచి ఆవుపాలు తెచ్చివ్వడం వంటివి చేశారని వివరించారు. వీరు ఏప్రిల్ 25న చిత్తూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరు 14 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉంటారు. (ఒక్కరోజులో 1,975 కేసులు) -
ఏపీలో మరో ఇద్దరు కోలుకున్నారు
-
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అంతర్ జిల్లా దొంగ రాపాక గిరిబాబు అలియాస్ గిరి ప్రసాద్ అలియాస్ యాదగిరిని సీసీఎస్, టౌన్, తొర్రూరు పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన 30 తులాల బంగా రం, కేజీ 30 గ్రాముల వెండి ఆభరణాలు, ఆటో, రూ.80వేల నగదు (మొత్తం సొత్తు విలువ రూ. 10.50 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ వివరాలు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఎలా చేధించగలిగారో ప్రొజెక్టర్ ద్వారా చూపించి వివరించారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో పగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను సీసీ కెమెరాల్లో రికార్డయిన ఛాయా చిత్రాల ద్వారా గుర్తిం చామన్నారు. దీంతో మహబూబాబాద్ టౌన్ సీఐ షేక్ అబ్దుల్ జబ్బార్, సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్ జిల్లా దొంగ అయిన రాపాక గిరిబాబును తొర్రూరు నుంచి మహబూబాబాద్‌కు వస్తుండగా మూడుకోట్ల సెంటర్ వద్ద పట్టుకున్నారని తెలిపారు. మానుకోటలోని తొర్రూరు రోడ్లో గల వాటర్‌ట్యాంక్ వద్ద ఉంటూ పండ్ల వ్యాపారం చేసే రాపాక గిరిబాబును పోలీసులు విచారించగా మహబూబాబాద్, తొర్రూరు, ఖమ్మం, పాల్వంచ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నా రు. చోరీ ద్వారా సంపాదించిన బంగారు వస్తువులను దాచిపెట్టి వాటిని మహబూబాబాద్ పట్టణంలో రహస్యంగా అమ్మాలని వచ్చినట్లు, తాను చేసి న నేరాలన్నింటినీ అంగీకరించాడని తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై.. రాపాక గిరిబాబు 5వ తరగతి వరకు చదువుకుని ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోక చెడు అలావాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నాడు. మొదటగా నాలుగేళ్ల క్రితం ఖమ్మంలో ఆటో దొంగతనం కేసులో అరెస్టై జైలు జీవితం గడిపాడు. ఆ తరువాత కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మళ్లీ కొద్దిరోజులకు రెండోసారి పాల్వంచలో ఆటో దొంగతనానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి విడుదలై మహబూబాబాద్ గిరిబాబు అత్తగారి ఊరు కావడంతో ఇక్కడే ఉంటూ మధ్యాహ్నం పళ్ల వ్యాపారం చేస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. మానుకోటలో 7,తొర్రూరులో 3 దొంగతనాలు.. సుమారు 6 నెలల క్రితం మహబూబాబాద్‌లోని వెంకటేశ్వర బజార్లో ఓ ఇంటి ముందు తాళం వేసి ఉన్న ఆటోను దొంగిలించాడు. తరువాత సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గిరిబాబు దొంగతనం చేయడానికి అనుకూలమైన పనిముట్లను జనగామ నుంచి తయారు చేయించుకున్నాడు. దీంతో మహబూబాబాద్‌లోని కృష్ణకాలనీ, సిద్ధార్థనగర్, వెంకటేశ్వరబజార్, కంకరబోడ్ ప్రాంతాల్లో మొత్తం 7 దొంగతనాలు చేశాడు. అనంతరం తొర్రూరు పట్టణంలో మూడు దొంగతనాలు చేశాడు.అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందనలు..అంతర్ జిల్లా నేరస్తుడు రాపాక గిరిబాబును చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద నుంచి సొత్తు ను రికవరీ చేసిన మహబూబాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ ఎస్.ఏ జబ్బార్, తొర్రూరు సీఐ వి.చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, సీసీఎస్ ఏఎస్సై పి.వెంకటరమణ, పీసీ సీహెచ్ వేణుగోపాల్, అలాగే నేరస్తుడిని సీసీ కెమెరాల ద్వా రా గుర్తించిన ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, పీసీ లు నాగరాజు, సంతోష్‌కుమార్‌ను ఎస్పీ నంద్యా ల కోటిరెడ్డి అభినందించి రివార్డు అందజేశారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు నరేష్కుమార్, రాజారత్నం, సీఐలు జబ్బార్, చేరాలు, సీసీఎస్ ఎస్సై జి.స్వామిదాస్, ఏఎస్సై పి.వెంకటరమణ, ఐటీకోర్ సీఐ శ్యాంసుందర్, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, రమేష్‌బాబు, అశోక్, పీసీలు వేణుగోపా ల్, నాగరాజు, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
మొక్కులు ఫలించాయి..సూర్యకళ కోలుకుంటోంది
పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్: ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పది రోజులుగా భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిట్టినీడి సూర్యకళ నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి రావాలని ఈ ప్రాంత ప్రజలు దేవుళ్లను మొక్కారు. మనసున్న దాతలు సూర్యకళ వైద్యం కోసం ఆర్థిక సహాయం చేశారు. యువత విరాళాలు సేకరించి తమ వంతు సహాయం అందించారు. ఈనెల 1న భీమవరం వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో సోడా గ్యాస్ సిలిండర్ లీకై ఒక ఇంటి గోడను చీల్చుకుని లోపలికి దూసుకు వెళ్లిన సంఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రం గా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన సూర్యకళ ఇంటర్ పాసై డిగ్రీలో చేరేందుకు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కుమార్తె వైద్య కోసం తల్లిదండ్రులు వెంకట శివకుమార్, నాగలక్ష్మిలు తల్లడిల్లిపోయారు. ఈ సమయంలో మేమున్నామంటూ భీమవరం ప్రజలు ముందుకు వచ్చారు. వైద్యానికి పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం కావడంతో చాలా మంది సహాయపడుతున్నారు. ఈ సమయంలో భీమవరం హాస్పటల్స్ వైద్యుల కృషి చాల వరకూ ఫలించింది. ఆపరేషన్ అనంతరం సూర్యకళ కళ్లు తెరిచి అందరినీ గుర్తుపడుతోంది. నెమ్మదిగా మాట్లాడగలుగుతున్న ఆమెను చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషపడుతున్నారు. అయితే సూర్యకళ కాలుకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండటంతో హైదరాబా ద్‌కు పంపాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. సూర్యకళ సంపూర్ణ ఆరోగ్యవంతురాలై డిగ్రీలో చేరాలన్న కోరిక నెరవేరేందుకు మరికొంత ఆర్థిక సహాయం అవసరమవుతుంది. దాతలు స్పందిస్తే సూర్యకళ తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంక్ అకౌంట్ నెంబర్ వివరాలు. ఆంధ్రాబ్యాంక్ ఖాతా నంబర్ : 004610100038569, ఐఎఫ్ఎస్సీ కోడ్ ANDB 0000046. వివరాల కోసం సెల్ నెంబర్ 91777 33995, 77990 24033లో సంప్రదించాలని కోరుతున్నారు. స్నేహం కోసం.. స్పందించిన హృదయం తమ చిన్ననాటి స్నేహితురాలిని కాపాడుకునేం దుకు మిత్రులంతా ఒక్కటయ్యారు. ఆపన్న హస్తం అందించారు. లక్ష రూపాయలు విరాళం సేకరించారు. దాతలు స్పందిం చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యకళతో ఎస్ యూఎస్ హైస్కూ ల్లో చదువుకున్న మిత్రులు ఆమె ఆరోగ్యం కోసం తపిస్తున్నారు. అందరూ ఒక్కటిగా కలిసి విరాళాలు సేకరించి సూర్యకళ తల్లి నాగలక్ష్మికి గురువారం అందజేశారు. -
కి‘లేడీ’లు
బద్వేలు అర్బన్: మహిళలను ఏమార్చి చాకచక్యంగా చోరీలకు పాల్పడే ఇద్దరు మహిళలను గురువారం బద్వేలు పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.50 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రెడ్డప్ప నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 న అట్లూరు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యవారమ్మ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన బ్యాగులోని పర్సును తీసి డబ్బులు చెల్లించే క్రమంలో...అందులో నగలు ఉన్నట్లు గుర్తించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోగోల దానమ్మ, ఆత్మకూరు టౌన్ మేదర వీధికి చెందిన ఇరగాదిన్ల సరోజమ్మ లు అయ్యవారమ్మను అనుసరించారు. బస్టాండ్ సమీపంలోని పూల అంగళ్ల వద్ద పూలు కొనుగోలు చేసే సమయంలో ఆ ఇద్దరు మహిళలు తమ పైటను కట్టెల బ్యాగు పై వేసి ఎవరికీ అనుమానం రాకుండా అందులోని నగలతో ఉడాయించారు. ఇంతలో పూలకు డబ్బులు ఇచ్చేందుకు పర్సు చూసుకోగా పర్సు కనిపించక పోవడంతో వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టించిన సీసీ కెమెరా మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా అందులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించి సిద్దవటం రోడ్డులోని మరికొన్ని సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను పరిశీలించారు. వారు పోరుమామిళ్ల వైపు వెళ్ళినట్లు నిర్ధారించుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పోరుమామిళ్లలోని కొమరోలు–మైదుకూరు ప్రధాన రహదారి పై ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్బన్ ఎస్ఐ చలపతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్ఐ హేమాద్రి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిక్కారు..
కాకినాడ రూరల్: హత్యలు, దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను కాకినాడ క్రైం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ క్రైం డీఎస్పీ ఎ పల్లపురాజు బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చోరీ చేసిన 330 గ్రాముల బంగారం వస్తువులు, 1150 గ్రాముల వెండి వస్తువులు, రూ.15వేలు నగదు సొత్తును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్టు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మోటిపల్లివారి వీధి, తూర్పువీధికి చెందిన గొల్లపల్లి నాగమల్లేశ్వరరావు, ఏలూరు చాట్రపర్రు వాటర్‌ట్యాంక్ రోడ్డు, సరస్వతి స్కూల్ పక్కవీధికి చెందిన గోన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు వివిధ నేరాలతో సంబంధం ఉందన్నారు. వీరు కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జ్యోతుల మార్కెట్ ఎదురుగా ఉన్న సంగీత లాడ్జీలో 107 నంబర్‌గల రూమ్‌లో ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు సీసీఎస్ ఎస్సై ఎం.పాపరాజు, సుధాకర్ల ఆధ్వర్యంలో క్రైమ్‌పార్టీ సిబ్బంది మంగళవారం రాత్రి దాడి చేసి అరెస్టు చేసినట్టు పల్లపురాజు వివరించారు. గొల్లపల్లి మల్లేశ్వరరావు పాత నేరస్తుడని, ఇతడికి ఏలూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. వైజాగ్‌లో మూడు మర్డర్ ఫర్ గెయిన్స్ కేసులు, ఏలూరు, భీమడోలు, ఉండ్రాజవరంల్లో సుమారు 17 ఇళ్ల నేరాల కేసులు ఉన్నాయన్నారు. గొల్లపల్లి నాగమలేశ్వరరావు, గొన్నాబత్తుల కార్తీక్‌కుమార్‌లు రాత్రిసమయాల్లో ఇళ్ల తాళాలు బద్దలుగొట్టి దొంగతనాలు చేస్తారన్నారు. నాగమల్లేశ్వరరావు 2016 డిసెంబర్లో తణుకు సబ్‌జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి, 2016–18 మధ్య కాలంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కాకినాడ, ఏలూరు టౌన్, రూరల్, కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు ఏరియాలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు బద్దలు గొట్టి బంగారం, వెండి వస్తువులు, నగదు దొంగిలించారని డీఎస్పీ ఎ పల్లపురాజు వివరించారు. కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 96 గ్రాముల బంగారు వస్తువు దొంగిలించారన్నారు. బంగారం, వెండి, నగదుతో పాటు ఎల్సీడీ టీవీ, 80 సర్జికల్ బ్లేడ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ దాడుల్లో పాల్గొని ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు పాపరాజు, సుధాకర్, హెచ్‌సీ గోవిందు, పీసీలు చిన్న, శ్రీరాం, వర్మ, అజయ్, బాబులను డీఎస్పీ పల్లపురాజు అభినందించారు. -
25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కరీంనగర్: నగరంలోని భవానీనగర్‌ను పోలీసులు దిగ్బంధించారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు వేకువజామున గిద్దెపెరుమాండ్లస్వామి ఆలయం వెనుక బాగంలోని భవానీనగర్‌ను చుట్టుముట్టి ఇంటింటా సోదాలు నిర్వహించారు. సోదాల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన బియ్యంను గుర్తించి సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించారు. పాపడ్, ఖారా తయారు చేసే దుకాణాన్ని గుర్తించి నాణ్యతా ప్రమాణాలు లేవని దీనిపై విచారణకు పుడ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. పలువురు అనుమానితులను విచారించారు. అక్రమంగా మద్యం విక్రయించే మహిళను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్ళను సీజ్ చేశారు. -
2,240 ఫోన్లు కొట్టేశాడు..
చెన్నై:తమిళనాడులోని సంచలనాత్మక దొంగను పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి భారీ ఎత్తున మొబైల్స్, ఇతర పరికరాలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయపర్చింది. శనివారం ఉదయం ప్రవీణ్ నుంచి పోలీసులు వేల సంఖ్యలో కొట్టేసిన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే కత్తి చూపించి నగదు దోచుకున్నాడనే ఫిర్యాదు ఆధారంగా ప్రవీణ ఆచూకీకోం గాలిస్తున్న పోలీసులు పాలవక్కంలోని పాన్ బ్రోకర్ (వడ్డీ వ్యాపారి) హనుమాన్‌ని రామ్ ని అరెస్టు చేసి కూపీ లాగారు. ఈ విచారణ సందర్భంగా సంచలనాత్మక దొంగ ప్రవీణ్ కుమార్ ఆచూకీ తెలిసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు భారీ ఎత్తున మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ రోడ్, రాజీవ్ మహాత్మా గాంధీ సాలై ప్రాంతంలో ఒంటరిగా నడుస్తూ వ్యక్తులను కత్తితో బెదిరించి నుంచి నగదు , సెల్ ఫోన్లు దోచుకున్నట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇలా కొట్టేసిన ఫోన్లను వడ్డీ వ్యాపారికి విక్రయించేవాడని అంగీకరించాడన్నారు. ఇలా మొత్తం ఐదు కేసులు కుమార్ వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు అతగాడినుంచి దాదాపు 2,240 స్మార్ట్ ఫోన్లను,10టాబ్లెట్ లను, లాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. -
చోరీ కేసులో కారు లభ్యం
ఓజిలి : ప్రకాశం జిల్లాలో చోరీకి గురైన స్విఫ్ట్‌కారు రాచపాళెం జాతీయ రహదారి పక్కన పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించారు. ఒంగోలు పట్టణంలోని స్వాతి కల్యాణ మండలం సమీపంలో వి.దానారావుకు చెందిన కారు ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రకాశం నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు వెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాచపాళెం సమీపంలోకి వచ్చే సరికి కారు ఫ్యాన్బెల్టు తెగిపోవడంతో కారు రహదారికి పక్కన కాలువలోకి దుసుకెళ్లింది. ఎస్సై సాంబశిరావు రాత్రి రోడ్డు తనిఖీలు చేస్తుండగా కారు రోడ్డు పక్కకు వెళ్లడంతో అనుమానం వచ్చి చూసే సరికి దుండగులు కారును వదిలి పరారయ్యారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కారు ఎడమ వైపు అద్దం పగలకొట్టి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అదేరోజు మరో కారు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన కారుపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీమ్ సిబ్బంది సేకరించారు. నెల్లూరులో 8, ప్రకాశంలో 8 స్విఫ్ట్ కారులు గతంలో చోరీకి గురయ్యాయని సీఐ అక్కేశ్వర్రావు తెలిపారు. చోరీకి గురైన కారును ఆయన పరిశీలించారు. బూదనం టోల్‌ప్లాజా వద్ద కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. -
ముగ్గురి కిడ్నాప్.. దారుణ హత్య
తురా: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో డిప్లిపారా అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను గురువారం పోలీసులు గుర్తించారు. ఓ మైనర్ బాలుడితో సహా మరో ఇద్దరిని ఆగస్టు 27న కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసి చివరికి దారుణంగా హతమార్చారని జిల్లా పోలీస్ అధికారి ముఖేష్ సింగ్ వెల్లడించారు. సులైమాన్ షేక్(15), జితూ రిషి, బాల్సరంగ్ అనే ముగ్గురు వ్యక్తులను దుండగులు అపహరించారు. ముగ్గురిని విడిచిపెట్టాలంటే 30 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్‌కు గురైన వారి తల్లిదండ్రులు అంత డబ్బు లేదని చెప్పడంతో కిడ్నాపర్లు మూడు లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కిడ్నాప్‌కు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు సైతం చేయలేదని తెలుస్తోంది. మరో కేసు విషయంలో దాడులు నిర్వహించిన పోలీసులు కిడ్నాపర్ల ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలను గురువారం డిప్లిపారా అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఈ ఘటనలో కిడ్నాపర్ల ముఠాలోని మరికొందరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ముఖేష్ సింగ్ వెల్లడించారు. -
కంట్లో కారం చల్లి రూ. 35 లక్షల చోరీ
-
ఎన్కౌంటర్లో నలుగురు హతం
అసోం: అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఎన్ఎస్సిఎన్ -కె కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను, ఒక ఉల్పా ఉగ్రవాదిని సైన్యం మట్టు పెట్టింది. ఈ ఘటనలో ఎకే-56 ను రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
శ్రీనగర్‌లో చెలరేగిన అల్లర్లు...ఉద్రికత్త
-
శ్రీనగర్ లో చెలరేగిన అల్లర్లు...ఉద్రికత్త
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ పోలీస్ ప్రధాన కార్యాలయం దగ్గర గురువారం మళ్లీ ఉద్రిక్తత రాజుకుంది. అదృశ్యమైన యువకుడు ఒవైసిస్ బషీర్ మాలిక్ మృతదేహాన్ని స్థానిక రైల్వే బ్రిడ్జ్ దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి నిరసనగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకారులు ధర్నాకు దిగారు. యువకుని మృతదేహంతో ఆందోళనకు దిగి రహదారిని దిగ్బంధించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువును ప్రయోగించిని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాగా కనపించకుండాపోయిన యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై తేలడంతో వివాదం చెలరేగింది. అతని గొంతు కోసి హత్య చేశారనే అనుమానంతో కొంతమంది ఆందోళనకు దిగారు. దీంతో శ్రీనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. -
ఆ శిథిలాల కింద 58 మృతదేహాలు వెలికితీత
బీజింగ్: చైనాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో శిథిలాలకింద 58 మృతదేహాలు గుర్తించినట్లు చైనా అధికారులు బుధవారం వెల్లడించారు. వీరిలో 52 మందిని గుర్తించినట్లు చెప్పారు. చైనాలోని షెంజెన్ అనే ప్రాంతంలో ఒక్కసారి భారీ మొత్తంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 77మంది కనిపించకుండా పోగా వారికోసం సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 18 రోజులపాటు ఈ సహాయక చర్యలు చేపట్టి శిథిలాలు తొలగించి వాటికిందపడిన మొత్తం 58 మృతదేహాలను వెలికి తీశారు. -
శంషాబాద్‌లో కేజీన్నర బంగారం స్వాధీనం
-
పోలీసుల అదుపులో మాజీ సీఎం కుమారుడు
జెహ్నాబాద్: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ భారీ నగదుతో పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసులు జెహ్నాబాద్ ఏయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతని నుంచి దాదాపు రూ. 4.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ శాసనసభకు అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ దగ్గర దొరికిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణపనుల కోసం కుటుంబసభ్యుల నుంచి ఆ డబ్బు తీసుకెళుతున్నానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం సొంత పూచి కత్తు పై ప్రవీణ్ ను విడుదల చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేదు. జితన్ రాం మంఝీ జెహ్నాబాద్ జిల్లాలోని మక్దుంపుర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించారు. జెడీ(యూ) పార్టీ తరఫున శాసన సభకు 6 సార్లు ఎన్నికయ్యారు. మాంజీ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేసిన అనంతరం జేడీ(యూ) నుంచి బయటకు వచ్చి హిందుస్థానీ అవమ్ మోర్చా పార్టీ(హెచ్ఎమ్)ని స్థాపించారు. ప్రస్తుతం బిహార్‌కు జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో మంఝీ దగ్గరయ్యారు. -
14 ద్విచక్రవాహనాలు స్వాధీనం: నలుగురు అరెస్ట్
నెల్లూరు: గూడూరు పోలీసులు నలుగురు బైక్ దొంగలను అరెస్ట్‌చేసి వారి నుంచి 14 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి కొర్లగుంటకు చెందిన గుంజి ప్రకాశ్, కోటయ్య, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంకు చెందిన మునికన్నయ్య, గూడూరుకు చెందిన శ్రీనివాస కుమార్ ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలు చేసేవారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం గూడూరు పోలీసులు బుధవారం గూడూరులోని ఒక ఇంటిపై దాడిచేసి నలుగురు దొంగలను అరెస్ట్ చేయడంతో పాటు ఇంటిలో దాచిన 14 మోటార్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. -
యూరప్‌లో మాయమై అర్జెంటీనాలో తేలింది
బ్యూనస్ ఎయిర్స్: పద్దినెమిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం ఒకటి రోమ్‌లో చోరీకి గురై ఏడాది తర్వాత దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనాలో బయటపడింది. ఈ పుస్తకం సెయింట్ పీటర్ బాసిలికాకు చెందినది. 1748 సంవత్సరానికి చెందిన ఈ పుస్తకాన్ని రోమ్‌లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి కొందరు వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఆ లైబ్రరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడాది నుంచి దాని కోసం వెతుకుతున్నారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్‌లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ఆన్లైన్ వేలంలో రూ.2,31,000 పలుకుతోంది. -
200 పైగా నాటు బాంబులు స్వాధీనం
పారుయ్ సూరి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వందల సంఖ్యలో క్రూడ్(నాటు) బాంబులను స్వాధీనం చేసుకున్నఘటన తాజాగా వెలుగుచూసింది. బిర్బమ్ జిల్లాలోని పారుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 200 పైగా క్రూడ్ బాంబులను సోమవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రోజువారీ తనిఖీల్లో భాగంగా ఈ క్రూడ్ బాంబుల ఉదంతం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారికి ఏ ముఠాతో సంబంధాలు ఉన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామన్నారు. గతేడాది డిసెంబర్ లో ఇదే జిల్లాలో 70 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అదుపులో ఇద్దరు నిందితులు రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజి పరిధిలోని ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలో రెండు వాహనాలతోసహా 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు రేంజర్ రామ్‌సింగ్ తెలిపారు. ఆదివారం స్థానిక అటవీశాఖ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు రేంజర్ తెలిపిన వివరాల మేరకు.. మిట్టపల్లె బీటు సమీపంలోని నగిరి బావి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నిల్వ ఉంచి శనివారం రాత్రి ఏపి02 ఏజీ 9592 నెంబరుగల స్కార్పియోలో ఆళ్లగడ్డ వైపు అక్రమ రవాణా చేస్తున్నట్లు ఓ వ్యక్తి రహస్య సమాచారం అందించాడు. వెంటనే ఆర్ క్రిష్ణాపురం, ఆలమూరు, చాగలమర్రి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో అటవీ అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున అహోబిలం నుంచి ఆర్ క్రిష్ణాపురం వస్తున్న స్కార్పియోను ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో ఛేజింగ్ చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో ఆర్ క్రిష్ణాపురం గ్రామ సమీపంలోని దిబ్బల్లో స్కార్పియో ఇరుక్కుపోయింది. వాహనం డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. వాహనాన్ని పరిశీలించి చూడగా 11 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మోటర్ సైకిల్‌పై స్కార్పియోను ఫాలో అవుతున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరిలోఒకరు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సాయినాథ్, మరొకరు పట్టణ సమీపంలోని పర్లపాడుకు చెందిన సుధాకర్ అని ప్రాథమిక విచారణలో తేలింది. వాహనాలతో సహా ఎర్రచందనం దుంగలను రుద్రవరం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. పరారైన వారు వ్యక్తులు ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాలకు చెందిన లూథయ్య, రాజుగా గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి త్వరలో అదుపులోనికి తీసుకుంటామని రేంజర్ తెలిపారు. స్కార్పియో, మోటర్ సైకిల్‌తో సహా ఎర్రచందనం దుంగల విలువ * 8 లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు. ఈ దాడుల్లో ఆలమూరు సెక్షన్ అధికారి విజయలక్ష్మి, సిబ్బంది టి.రామకృష్ణ, పకృద్దీన్, పెద్దన్న, పలువురు ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
చర్లపల్లి జైల్లో సోదాలు :15 సెల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల గురువారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైలులోని బ్రహ్మపుత్ర, మంజీరా బ్లాకుల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఖైదీల వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జైలులోని ఖైదీ తనకు బెయిల్ కావాలంటూ నేరుగా న్యాయవాదికి ఫోన్ చేయడం ఆ విషయం ఓ ఛానళ్లలో ప్రసారం అయి హల్చల్ సృష్టించింది. దీంతో జైళ్లు శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అందులోభాగంగా జైలులోని పలువురు ఖైదీలను ఇప్పటికే వరంగల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అలాగే గురువారం ఉదయం ఉన్నతాధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. దీంతో ఖైదీల వద్ద నుంచి 15 సెల్ ఫోన్లు లభ్యమైనాయి. -
15 రోజులు..17 మృతదేహాలు
-
చైన్ స్నాచర్లు అరెస్ట్: 28 తులాల బంగారం స్వాధీనం
ప్రకాశం జిల్లా సంతమాగలూరులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో వారి వద్ద నుంచి 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.... పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో గతంలో వారు చోరి చేసిన వివరాలు పూసగుచ్చినట్లు వెల్లడించారు. పట్టబడిన చైన్ స్నాచర్లపై గుంటూరు, ప్రకాశం జిల్లాలలో 11 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా బీహార్ కైమూర్ జిల్లాలో వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే వాటిని అక్రమ మైనింగ్ కోసం తీసుకువెళ్తున్నట్లు తమ అదుపులోకి తీసుకున్న వ్యక్తి వెల్లడించారని జిల్లా ఎస్పీ రత్న మణి సంజీవ్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి దాదాపు 12 వేల డిటోనేటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.