న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 65 కోట్ల బకాయిలను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ మొత్తం రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి రూ. 65 కోట్లు రికవరీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను ఐటీ శాఖ రికవరీ చేసింది.
రూ. 65 కోట్ల రికవరీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఐటీ శాఖ రికవరీ చర్యలపై ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచారణ ఫలితం కోసం వేచిచూడకుండానే బ్యాంకుల వద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డబ్బులో కొంత మొత్తాన్ని ఐటీ శాఖ బకాయిల కింద రికవరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలేవరకూ ఆదాయ పన్ను శాఖ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహరంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశించింది.
చదవండి: పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్
Comments
Please login to add a commentAdd a comment