కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు
బీజేపీ నుంచి రూ.4,617 కోట్లు వసూలు చేయాలన్న కాంగ్రెస్ ఐటీ విభాగం
బీజేపీ జేబు సంస్థగా మారిందంటూ నిప్పులు
న్యూఢిల్లీ: రూ.1,823.08 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను విభాగం నుంచి తాజాగా తమ పార్టీకి నోటీసులు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, అజయ్ మాకెన్ చెప్పారు. ఐటీ చట్టాలను అధికార బీజేపీ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఉల్లంఘలనకు గాను బీజేపీ నుంచి రూ.4,617.58 కోట్లు వసూలు చేయాలని ఐటీ అధికారులను డిమాండ్ చేశారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని, లోక్‌సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచి్చనవారి పేర్లు, చిరునామాలను ఫామ్ 24ఏలో పొందుపర్చి, ఎన్నికల సంఘానికి సమరి్పంచాల్సి ఉంటుందని అజయ్ మాకెన్ చెప్పారు. బీజేపీ మాత్రం ఇలాంటి వివరాలను ఏనాడూ సక్రమంగా సమరి్పంచలేదని విమర్శించారు. ఐటీ విభాగం బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇస్తోందని అన్నారు. ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం అని తేలి్చచెప్పారు. పాత ఐటీ రిటర్నులను మళ్లీ తెరవడం ఏమిటని ప్రశ్నించారు.
ఇది రాహుల్ గ్యారంటీ
ఐటీ డిపార్టుమెంట్ ఇచి్చన తాజా నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను దురి్వనియోగం చేస్తూ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వలువలు ఊడదీస్తున్నవారికి ప్రభుత్వం మారిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తాము తీసుకొనే చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా భయపడేలా ఉంటాయని, ఇది రాహుల్ గ్యారంటీ అని తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment