న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే.
ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment