ITAT
-
షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే
ముంబై: షిర్డీ సాయి బాబా ట్రస్టుకు హుండీ కానుకల రూపంలో వస్తున్న నగదుకు ఆదాయపు పన్ను మినహాయింపు సబబేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతేడాది అక్టోబరు 25న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఇచ్చిన తీర్పును సమర్థించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు (షిర్డీ) ఒక ధార్మిక సంస్థ అని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని ముంబై ఐటీ కమిషనర్ (మినహాయింపులు) వాదించారు. హుండీ రూపంలో గుర్తుతెలియని భక్తులు సమర్పిస్తున్న కానుకలు.. మొత్తం విరాళాల్లో ఐదు శాతాన్ని దాటుతున్నాయి కాబట్టి.. పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. 2015–16, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో హుండీ కానుకల రూపంలో షిర్డీ ట్రస్టుకు రూ.400 కోట్లు అందాయని, అందులో కేవలం రూ. 2.3 కోట్లు మాత్రమే మతపరమైన కార్యక్రమాలకు వెచ్చించారని ఐటీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. అధికభాగం నిధులను విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు మళ్లించారని పేర్కొన్నారు. జస్టిస్ జి.ఎస్.కులకర్ణి, జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్‌లు ఈ వాదనతో విభేదించారు. షిర్డీ ట్రస్టు మతపరమైన, చారిటబుల్ ట్రస్టు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోరడం చట్టబద్ధంగా న్యాయమని, సబబని తీర్పునిచ్చారు. -
అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తమ పారీ్టకి సంబంధించిన రూ.210 కోట్ల నిధులను స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది. కిందటి సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ సమరి్పంచిన ఐటీ రిటర్నుల్లో లోపాలు ఉన్నాయంటూ ఐటీ శాఖ ఆ పారీ్టకి రూ.210 కోట్ల జరిమానా విధించించిన సంగతి తెలిసిందే. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించాలంటూ కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది. వేర్వేరు బ్యాంకుల్లోని తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా రూ.65 కోట్లను ఐటీ శాఖ విత్‌డ్రా చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. రూ.205 కోట్లను స్తంభింపజేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాలపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసింది.పిటిషన్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ శుక్రవారం తీర్పు వెలువరించింది. -
Income Tax Department: కాంగ్రెస్ ఖాతాల స్తంభన
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మోదీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేయడం కలకలం సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసులో ఐటీ రిటర్నుల్లో రూ.210 కోట్ల వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటి రికవరీ కోసం ఆయా ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు వార్తలొచ్చాయి. పార్టీ ప్రధాన ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కాంగ్రెస్ వేగంగా స్పందించింది. వెంటనే ఐటీ, ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ)ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఆయా ఖాతాల్లో మొత్తంగా రూ.115 కోట్లు అలాగే నిల్వ ఉంచి మిగతాది మాత్రమే విత్‌డ్రా, ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని సూచించింది. వెంటనే ఆయా ఖాతాలను డీ ఫ్రీజ్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో సంబంధిత ఖాతాలన్నీ పునరుద్ధరించబడ్డాయి. ట్రిబ్యునల్ ఈ అంశంపై బుధవారం మరోసారి వాదనలు విననుంది. ఫ్రీజ్ చేసిన ఖాతాల్లో యూత్ కాంగ్రెస్ ఖాతాలూ ఉన్నాయి. ఖాతాల స్తంభనపై మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘‘ 2018–19 ఆర్థికంలో ఐటీ రిటర్నులను కాస్త ఆలస్యంగా సమరి్పంచాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ జీతభత్యాలను పారీ్టకి విరాళాల రూపంలో ఇచ్చారు. అలాంటి కొన్ని మొత్తాలు ఐటీ రిటర్నుల్లో ప్రతిబింబించలేదు. అంతమాత్రానికే ప్రధానమైన తొమ్మిది ఖాతాలను స్తంభింపజేస్తారా?’ అని కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనిపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ మాట్లాడారు. ‘‘ ఖాతాల్లో ఉన్న మొత్తంలో రూ.115 కోట్లే అత్యంత ఎక్కువైనది. సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి మిగతా డబ్బు అస్సలు సరిపోదు. రాబోయే లోక్‌సభ ఎన్నికల వేళ ఇలా ఖాతాలను ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో పార్టీ భాగస్వామి కావడం చాలా కష్టం’’ అని మాకెన్ అన్నారు. భయపడకండి మోదీ జీ: రాహుల్ ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘ భయపడకండి మోదీ జీ! కాంగ్రెస్ ప్రజాశక్తికి కాంగ్రెస్ చిరునామా. నియంతృత్వం ముందు మోకరిల్లేది లేదు’’ అన్నారు. అధికార దాహంతో లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. మోదీ మూడోసారి పగ్గాలు చేపట్టాక ఇలాంటి ఆరోపణలకు కాంగ్రెస్ చాలా సమయం దొరుకుతుందంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎద్దేవాచేశారు. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తెచ్చాం
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం పన్ను సంస్కరణలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం పేర్కొన్నారు. పన్ను వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా వ్యక్తిగత హాజరు అవసరం లేకుండా డిజిటల్ మార్గంలో వాటి పరిష్కారం, అలాగే పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు కేంద్రం సాధించిన విజయాలని అన్నారు. పన్నుల విభాగం ‘టెర్రరిజం నుంచి ట్రాన్స్పరెన్సీ’కి మారినట్లు మోదీ అభివర్ణించారు. కోల్‌కతాల్లో ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆఫీస్–కమ్–రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► పన్ను చెల్లింపుదారు–వసూలుదారు మధ్య విశ్వాస రాహిత్యాన్ని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నించింది. పన్ను నిబంధనలు, నిర్వహణా వ్యవహారాలను సులభతరం చేసింది. ► కార్పొరేట్ పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి కేంద్రం తగ్గించింది. సత్వర వృద్ధి, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం సృష్టి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల కంపెనీలు ఉపాధి అవకాశాలను సృష్టించగలుగుతాయి. కొత్త తయారీ సంస్థలకు పన్నులు 15% వరకూ తగ్గించాలన్న నిర్ణయం స్వావలంబన దిశగా దేశాన్ని నడిపిస్తుంది. ► వివాదాస్పద పన్ను మొత్తం అధికంగా ఉంటేనే అప్పీల్స్‌కు వెళ్లాలన్న సూచనలను కేంద్రం చేస్తోంది. ఐటీఏటీ అలాగే సుప్రీంకోర్టుల్లో పన్నుల శాఖ అప్పీల్ ఫైల్ చేయడానికి కనీస వివాదాస్పద పన్ను మొత్తాలను వరుసగా రూ.50 లక్షలు, రూ.2 కోట్లకు పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ► డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును తొలగించింది.ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగాలన్నదే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఇక రిఫండ్స్ సత్వరం జరిగేలా చూస్తోంది. కేవలం కొద్ది వారాల్లోనే రిఫండ్స్ జరుగుతున్నాయి. మొత్తం పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సరళతను తీసుకువచ్చింది. ► గత ప్రభుత్వాల కాలంలో పన్నుల వ్యవస్థ అంటే భయంకలిగే పరిస్థితి ఉండేది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులూ వచ్చేవి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు దారుడు మధ్య ‘దోపిడీదారు–దోపిడీకి గురయ్యేవాడు’ తరహా పరిస్థితిని తొలగించడానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దగా ప్రయత్నం జరగలేదు. అయితే ఈ వ్యవస్థను మనం పూర్తిగా తొలగించగలిగాం. వ్యవస్థను పారదర్శకతలోకి నడిపించాము. ఇప్పుడు పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తోంది. ► నియమ నిబంధనలను సంస్కరించి సరళతరం చేయడంతోపాటు, సాంకేతికత వినియోగంలో ముందడుగు మంచి ఫలితాలను అందిస్తోంది. ► పన్ను పాలనా యంత్రాంగం ధోరణి పూర్తిగా పాదర్శకతలోకి మార్చాలన్న ప్రధాన ధ్యేయంతో కేంద్రం పనిచేస్తోంది. ► రూ.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు దిగువ మధ్య తరగతి యువతకు ఎంతో ప్రయోజనం కల్పిస్తోంది. ► కేంద్రం తీసుకున్న పలు పన్ను సంబంధ నిర్ణయాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరం అవుతోంది. పలు సంస్థలకు న్యాయపరమైన అవరోధాలు ఎదురుకావడం లేదు. ► పన్ను వసూళ్ల విషయంలో సామాన్యుడు ఎటువంటి వేధింపులకూ గురికాకూడదన్న విషయాన్ని పన్నుల అధికారులు గుర్తుంచుకోవాలి. అలాగే వసూలయిన పన్ను మొత్తాలు పూర్తిగా వినియోమవుతున్నాయన్న అభిప్రాయాన్ని పన్ను చెల్లింపుదారుడు కలిగి ఉండేలా చర్యలు ఉండాలి. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలు క్రోడీకరించిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. పన్ను చెల్లింపుదారుడు–వసూలు అధి కారి మధ్య పరస్పన విశ్వాసం, పారద్శకతను పెంపొందించడంలో ఇది కీలకం. సంపద సృష్టి కర్తలు ఎప్పుడూ గౌరవం పొందాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. వారి సమస్యల పరిష్కారం ఆర్థిక పురోగతికీ దోహదపడుతుంది. ► ఇప్పుడు 99.75% ఆదాయప పన్ను రిటర్న్స్ అవరోధం లేకుండా ఆమోదం పొందుతున్నాయి. తన పన్ను చెల్లింపుదారులపట్ల ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. కేవలం 0.25% కేసుల్లో మాత్రమే పరిశీలన జరుగుతోంది. ► పలు పన్ను విభాగాల్లో క్లిష్టతను జీఎస్టీ తగ్గించింది. పలు రంగాల్లో పన్ను రేట్లను తగ్గించడానికి ఈ విధానం దోహదపడింది. -
మీటూ: మాజీ ప్రపంచ సుందరికి భారీ ఊరట
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌కు భారీ ఊరట లభించింది. కోకా కోలా కంపెనీ నుంచి పరిహారంగా లభించిన మొత్తంపై పన్ను చెల్లింపుపై ఇన్‌కం టాక్స్ అప్పెల్లా ట్రిబ్యునల్ (ఐటీఏటి) ఉపశమనం కల్పించింది. నష్టపరిహారంగా వచ్చిన ఆదాయంగా చూడలేమని దీనిపై పన్నుచెల్లించాల్సిన అవసరంలేదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుస్మితా సేన్‌కు లైంగిక వేధింపుల కేసులో నష్టపరిహారంగా వచ్చిన రూ.95లక్షలు ఆదాయం కిందికి రాదని వెల్లడించింది. కాబట్టి పన్నుకట్టనక్కలేదంటూ ఆమెపై విధించిన రూ. 35 లక్షల జరిమానాను కొట్టి వేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28ప్రకారం , 2(24) పరిహారాన్ని ఆదాయంగా పేర్కొనలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోకా కోలా ఇండియా ఉద్యోగిపై లైంగిక ఆరోపణ కేసులో 2003-04లో, సుస్మితా సేన్‌క కంపెనీ రూ. 1.45 కోట్లు చెల్లించింది. ఇందులో 50లక్షల రూపాయల ఆదాయపన్ను కింద మినహాయించి రూ. 95 లక్షల నష్టపరిహారాన్ని సుస్మితా అందుకున్నారు. అయితే దీన్ని సుస్మితా సేన్ ఐటీ ఫైలింగ్‌లో ప్రకటించలేదంటూ ఆదాయన పన్నుశాఖ పెనాల్టీ విధించింది. -
ఐటీ కోర్టు అప్పీల్‌కు ‘వివాద బకాయి’ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అనవసర, కాలయాపన వ్యాజ్యాలకు చెక్ చెప్పే దిశలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) మరో తాజా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం... ఇకపై ఆదాయపు పన్ను శాఖ ఏదైనా కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)లో అప్పీల్‌కు వెళ్లాలంటే.. లిటిగేషన్లో ఉన్న మొత్తం రూ. 10 లక్షల పైబడిన సొమ్ము విషయంలో పన్ను బకాయికి సంబంధించినదై ఉండాలి. ఇంతక్రితం ఈ సొమ్ము రూ.4 లక్షలుగా ఉండేది. హైకోర్టులో కేసు దాఖలుకు ఇంతక్రితం తరహాలో రూ. 10 లక్షలు కాకుండా రూ. 20 లక్షల పైబడి ఉండాలి. సుప్రీంకోర్టుకు సంబంధించిన పరిధి రూ. 25 లక్షలుకాగా... ఈ మొత్తంలో ఎటువంటి మార్పూ చేయలేదు. పన్ను బకాయిల విషయంలో పన్ను చెల్లింపుదారుడు ఐటీ అసెస్మెంట్ ఉత్తర్వుపై కమిషనర్ ఆఫ్ ఐటీ (అప్పీల్స్), ఐటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే కేవలం ‘సొమ్ము పరిమితి’ అంశం విషయంలో అయితే మాత్రమే అప్పీల్ చేయరాదని, ఇతర మెరిట్స్ సానుకూలంగా ఉంటే... దీనికి అనుగుణంగా అప్పీల్ నిర్ణయం తీసుకోవచ్చని కూడా సీబీడీటీ తన అధికారిక సూచనల్లో వివరణ ఇచ్చింది.