చోరీ కేసులో కారు లభ్యం
చోరీ కేసులో కారు లభ్యం
Published Wed, Sep 14 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
ఓజిలి : ప్రకాశం జిల్లాలో చోరీకి గురైన స్విఫ్ట్‌కారు రాచపాళెం జాతీయ రహదారి పక్కన పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించారు. ఒంగోలు పట్టణంలోని స్వాతి కల్యాణ మండలం సమీపంలో వి.దానారావుకు చెందిన కారు ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రకాశం నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు వెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాచపాళెం సమీపంలోకి వచ్చే సరికి కారు ఫ్యాన్‌బెల్టు తెగిపోవడంతో కారు రహదారికి పక్కన కాలువలోకి దుసుకెళ్లింది. ఎస్సై సాంబశిరావు రాత్రి రోడ్డు తనిఖీలు చేస్తుండగా కారు రోడ్డు పక్కకు వెళ్లడంతో అనుమానం వచ్చి చూసే సరికి దుండగులు కారును వదిలి పరారయ్యారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కారు ఎడమ వైపు అద్దం పగలకొట్టి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అదేరోజు మరో కారు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన కారుపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీమ్ సిబ్బంది సేకరించారు. నెల్లూరులో 8, ప్రకాశంలో 8 స్విఫ్ట్ కారులు గతంలో చోరీకి గురయ్యాయని సీఐ అక్కేశ్వర్‌రావు తెలిపారు. చోరీకి గురైన కారును ఆయన పరిశీలించారు. బూదనం టోల్‌ప్లాజా వద్ద కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
Advertisement