car stolen
-
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.गर्लफ्रेंड को घूमने के लिए तीन स्टूडेंट ने लूट ली वेन्यू कारमामले में तीन आरोपियों को पुलिस ने किया गिरफ्तारपुलिस ने लूटी हुई गाड़ी को भी कर लिया है बरामद @noidapolice @CP_Noida #Greaternoida pic.twitter.com/4hT8TjjpFt— PRIYA RANA (@priyarana3101) October 11, 2024సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరీ!
న్యూఢిల్లీ: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు చోరికి గురైంది. ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారు దొంగిలించినట్లు సమాచారం. మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వివరాలు.. టయోటా ఫార్చునర్ కారును డ్రైవర్ జోగిందర్ సర్వీసింగ్‌కు ఇచ్చి తీసుకొచ్చారు. నడ్డా నివాసానికి వెళ్తుండగా మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచాడు. భోజనం చేసి వచ్చే సరికి ఇంటి ముందు ఆపిన కారు కనిపించలేదు. దుండగులు కారును అపహరించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్. రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కారుకోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. కారును గురుగ్రామ్ వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన కారు హిమాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉంది. ఆరు రోజులైనా ఇప్పటి వరకూ కారు ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘కంగన’కు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కారు చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. సైదాబాద్ ఇంట్లో కారును దుండగులు దొంగిలించారు. ఇన్నోవా కార్ కీస్ వెతికి కారుతో పరారయ్యారు. సైదాబాద్ పీఎస్‌లో చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ గతంలో ప్రవీణ్.. పోలీసులను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణగా గన్మెన్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కోరారు. తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలంటూ ప్రవీణ్ విన్నవించారు. చదవండి: వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
2016 టి20 ప్రపంచకప్ హీరోకు వింత అనుభవం..
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్కు వింత అనుభవం ఎదురైంది. గాయం కారణంగా జట్టుకు ఆరు నెలలపాటు దూరమైన బ్రాత్‌వైట్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి డొమొస్టిక్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ బర్మింగ్హమ్ డిస్ట్రిక్ట్ ప్రీమియర్ లీగ్‌లో నోల్ అండ్ డోరిడ్జ్ సీసీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రాత్వైట్కు నిరాశే ఎదురైంది. లీమింగ్టన్ సీసీతో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ తొలి బంతికే ఔటయ్యాడు. భారీషాట్‌కు యత్నించి క్యాచ్ ఇచ్చి గోల్డెన్‌డక్ అయ్యాడు.ఆ తర్వాత బౌలింగ్‌లోనూ బ్రాత్‌వైట్ పెద్దగా రాణించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా నిరాశజనక ప్రదర్శనతో రోజును ముగించే పనిలో ఉన్న బ్రాత్వైట్కు మరొక బిగ్‌షాక్ తగిలింది. తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా ఎవరో దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్రాత్‌వైట్ ట్విటర్లో తెగ బాధపడిపోయాడు. ''నిన్నటి రోజు నాకు పీడకల లాంటిది.. ఆరు నెలల తర్వాత మ్యాచ్ ఆడాను.. డకౌట్ అయ్యాడు.. బౌలింగ్ వేశాను.. అందులోనూ నిరాశే ఎదురైంది.. ఇక రోజు చివరలో నా కారును ఎవరో దొంగతనం చేశారు.. ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. ఇన్ని చెత్త విషయాల మధ్య ఒక మంచి విషయం ఏంటో చెప్పనా.. మరుసటిరోజు తెల్లవారుజామునే సూర్యుడు మెరుస్తూ నాకు వెల్కమ్ చెప్పాడు.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కాగా బ్రాత్‌వైట్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది 2016 టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బ్రాత్‌వైట్ నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్ రెండోసారి టి20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బ్రాత్‌వైట్ విండీస్ తరపున 3 టెస్టులు, 44 వన్డేలు, 41 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు' Wasim Jaffer: 'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే What a day yesterday - First time bowling in a game after injury for six months 💩 - First ball duck from a long hop 😫 - Car stolen 🤬 But you know what , woke up this morning , Sun is shining and giving thanks 🙏🏾 — Carlos Brathwaite (@CRBrathwaite26) April 17, 2022 Carlos Braithwaite Golden Duck for Knowle & Dorridge today 😳 pic.twitter.com/92P8fIcpSm — Will (@Will27375624) April 16, 2022 -
హైదరాబాద్: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి..
సాక్షి, అడ్డగుట్ట: తను చూసిన ఒక సినిమా తరహాలో కారును దొంగిలించి తన ఫ్రెండ్స్‌తో జల్సాలు చేస్తున్న ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన మేరకు.. ఈస్ట్‌మారేడుపల్లిలోని సెయింట్ జాన్స్ చర్చి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్మెంట్లో పార్క్ చేసి ఉన్న కారును ఈ నెల 9న అమీర్‌పేట్‌కు చెందిన రిత్విక్(25) అనే బిటెక్ విద్యార్థి దొంగిలించాడు. యజమాని డాక్టర్ పద్మావతి తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, వెహికిల్ చెకింగ్‌లో భాగంగా శుక్రవారం మహేంద్రాహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న రిత్విక్‌ను పోలీసులు పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిత్విక్‌ను స్టేషన్‌కు తరలించి విచారించారు. అయితే ‘గాన్ ఇన్ సిక్స్టీ సెకన్స్’ సినిమా చూసి అందులో చేసిన విధంగా కారు దొంగిలించి స్నేహితులతో జల్సాలు చేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీంతో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో..
ఒరెగాన్ : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి లాండ్ క్రూజర్ కారులో న్యూబెర్గ్ రహదారిపై వేగంగా వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అదే రోడ్డుపై ఎదురుగా ఒక యువతి ఎస్యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకొని ఆగిపోయాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎస్యూవీ కారు నడిపిన యువతి కూడా ఒక దొంగేనని తెలియడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత ఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని న్యూబెర్గ్ సిటీలో గత ఆదివారం (జూలై 5న) చోటు చేసుకుంది.(లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా.. ) తాజాగా ఈ ఘటనను న్యూబెర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్ బుధవారం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఇదిగో మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని వార్త మీకొకటి చూపిస్తున్నాం... చదవండి అంటూ పేర్కొంది. అసలు విషయానికి వస్తే.. న్యూబెర్గ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కు జూలై 5న లాండ్ క్రూయిజ్ కారు దొంగతనానికి గురైందని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే 27 ఏళ్ల రాండీ లీ కూపర్ దకారు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవాలని బయలుదేరారు. తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలుసుకున్న రాండీ కారును వేగంగా పోనిచ్చాడు. ఇంతలో మరో ఎండ్ నుంచి క్రిస్టిన్ నికోల్ బేగ్ అనే 25 ఏళ్ల యువతి ఎస్యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా 25 నికోల్ బేగ్ మత్తులో ఉండడంతో కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. అయితే ఆమె నడిపిన ఎస్యూవీ కారు కూడా చోరికి గురైనట్లు తెలిసింది. బేగ్‌ను ఈ విషయమై విచారించగా తాను కూడా ఒక దొంగనని, మత్తు పదార్థాలకు బానిసయి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు ఒకరిని పట్టుకోవడానికి వస్తే అదనంగా మరో దొంగ దొరకడం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో'.. 'నిజంగా ఇలాంటి వార్తను మాత్రం ఎప్పుడు చదవలేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (లవ్ యూ మామా: ఫ్లాయిడ్ చివరి క్షణాలు) -
మూత్రానికి ఆగితే బీఎండబ్ల్యూ కారు మాయం
నోయిడా : బీఎండబ్ల్యూ కారులో వెళుతున్న వ్యక్తి మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన ఆగిన క్రమంలో కొందరు దుండగులు కారుతో పరారైన ఘటన ఆదివారం నోయిడాలో వెలుగుచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెక్టార్ 90లో శనివారం రాత్రి పార్టీకి హాజరై తిరిగివస్తున్న షేర్ మార్కెట్ బ్రోకర్ రిషబ్ అరోరా మార్గమధ్యలో మూత్రం పోసేందుకు కారును ఆపారు. ఇదే అదనుగా కొందరు దుండగులు లగ్జరీ కారుతో ఉడాయించారు. ఈ కారు అరోరా బావమరిదిదని, ఈ వాహనంపై రూ 40 లక్షల రుణం పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. బీఎండబ్ల్యూ కారు చోరీకి గురైందని తెలిసిన వెంటనే తమ బృందంతో పోలీసు అధికారులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కారు యజమానికి తెలిసిన వారే ముందస్తు ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడి ఉంటారని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందని సీనియర్ పోలీస్ అధికారి హరీష్ చందర్ అన్నారు. బీఎండబ్ల్యూ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే వాహనం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాగా బీఎండబ్ల్యూను నడిపిన స్టాక్ బ్రోకర్ అరోరా ఆ సమయంలో తాగిఉన్నాడని తెలిసింది. అరోరాపై డ్రంకెన్ డ్రైవింగ్ కింద చర్యలు చేపడతారా అని ప్రశ్నించగా, బీఎండబ్ల్యూను రికవర్ చేసి, నిందితులను శిక్షించడానికే ముందుగా తాము ప్రాధాన్యత ఇస్తామని, నగరంలో వేరొకరి కారును ఈ తరహాలో తస్కరించడం సీరియస్ అంశమని పోలీస్ అధికారి చందర్ స్పష్టం చేశారు. అరోరా తన బావమరిది కారును ఆరేడు రోజుల నుంచి వాడుతున్నట్టు తెలిసిందని అన్నారు. ఇక బైక్‌పై వచ్చిన నిందితులు తనపై తుపాకీ గురిపెట్టి బెదిరించారని అరోరా చెబుతున్నా ఆయన తాగిఉండటంతో ఆ విషయం నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. చదవండి : ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ.. -
యువన్ శంకర్‌రాజా కారు చోరీ
పెరంబూరు:సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాకు చెందిన ఖరీదైన కారు అపహరణకు గురైంది. వివరాల్లోకెళితే ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా కొడుకు, యువ సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్థానిక ఎతిరాజ్ రోడ్డులోని ఇంట్లో నివశిస్తున్నారు.ఆయన వద్ద నవాజ్‌ఖాన్ అనే వ్యక్తి కారు డైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో డ్రైవర్ నవాజ్‌ఖాన్ కారును బయటకు తీసుకెళ్లి అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. యువన్‌శంకర్‌రాజా కూడా ఇంటి వద్ద లేకపోవడంతో కారు దొంగిలించబడిందన్న సందేహంతో ఆయన తరఫున ఎంగ్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి పరిస్థితిలో మంగళవారం వేకువజామున డ్రైవర్ నవాజ్‌ఖాన్ కారుతో యువన్‌శంకర్‌రాజా ఇంటికి తిరిగి వచ్చాడు. అతను కారును ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎందుకు తీసుకెళ్లాడు. అన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కారు లభించడంతో యువన్‌శంకర్‌రాజా ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. -
చోరీ కేసులో కారు లభ్యం
ఓజిలి : ప్రకాశం జిల్లాలో చోరీకి గురైన స్విఫ్ట్‌కారు రాచపాళెం జాతీయ రహదారి పక్కన పోలీసులు మంగళవారం రాత్రి గుర్తించారు. ఒంగోలు పట్టణంలోని స్వాతి కల్యాణ మండలం సమీపంలో వి.దానారావుకు చెందిన కారు ఈనెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రకాశం నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు వెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాచపాళెం సమీపంలోకి వచ్చే సరికి కారు ఫ్యాన్బెల్టు తెగిపోవడంతో కారు రహదారికి పక్కన కాలువలోకి దుసుకెళ్లింది. ఎస్సై సాంబశిరావు రాత్రి రోడ్డు తనిఖీలు చేస్తుండగా కారు రోడ్డు పక్కకు వెళ్లడంతో అనుమానం వచ్చి చూసే సరికి దుండగులు కారును వదిలి పరారయ్యారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కారు ఎడమ వైపు అద్దం పగలకొట్టి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో అదేరోజు మరో కారు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీకు గురైన కారుపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌టీమ్ సిబ్బంది సేకరించారు. నెల్లూరులో 8, ప్రకాశంలో 8 స్విఫ్ట్ కారులు గతంలో చోరీకి గురయ్యాయని సీఐ అక్కేశ్వర్రావు తెలిపారు. చోరీకి గురైన కారును ఆయన పరిశీలించారు. బూదనం టోల్‌ప్లాజా వద్ద కారుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. -
ప్రతి 15 నిమిషాలకో కారు చోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కార్ల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రతి 15 నిమిషాలకో కారుని దొంగతనం చేయడమే, ఎత్తుకెళ్లడమో జరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో ప్రతిరోజు 100 వాహనాలను చోరులు ఎత్తుకుపోయినట్టు కేసులు నమోదయ్యాయి. 2011లో నమోదైన వాహన చోరీ కేసుల కంటే రెండింతలు ఇప్పటికే ఈ ఏడాది నమోదయ్యాయి. దొంగతనానికి గురైన వాహనాల్లో కేవలం 13 శాతం రికవరీ అవుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. వాహనాలు పెరిగిపోవడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో దొంగతనాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో ఎక్కువగా వాహనాల చోరీ కేసులు నమోదవుతున్నాయి. తూర్పు ఢిల్లీలో జూలైలో 517, అవుటర్ డిస్ట్రిక్ట్ లో 492, పశ్చిమ ఢిల్లీలో 478 వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. ఎస్ యూవీలతో పోలిస్తే చిన్నకార్లే ఎక్కువగా దొంగతనాలకు గురవుతున్నాయి. ఎస్ యూవీల్లో రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఉంటడంతో వాటిని ఎత్తుకెళ్లడం కష్టం. రాత్రి సమయాల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని, మాస్టర్ కీస్, బ్రేక్ లాక్ లతో దొంగతనాలకు పాల్పడుతున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కార్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల రికవరీ 70 శాతంగా ఉంది. -
ITBP ఐజీ కారు అపహరణ
-
రామంతపూర్‌లో భారీ చోరీ
హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఇక్కడి శ్రీనివాసపురంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి దాదాపు 25 తులాల బంగారం, నాలుగు కేజీల వెండి, ఓ కారు, భూమి పత్రాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇంటి తాళాలను పగులగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా తీసుకెళ్లారు. దొంగిలించిన సొత్తు మొత్తాన్ని అదే కారులో వేసుకుని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని బుచ్చిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు.