ఒరెగాన్ : పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి లాండ్ క్రూజర్ కారులో న్యూబెర్గ్ రహదారిపై వేగంగా వెళుతున్నాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత అదే రోడ్డుపై ఎదురుగా ఒక యువతి ఎస్‌యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకొని ఆగిపోయాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎస్‌యూవీ కారు నడిపిన యువతి కూడా ఒక దొంగేనని తెలియడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వింత ఘటన అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని న్యూబెర్గ్ సిటీలో గత ఆదివారం (జూలై 5న) చోటు చేసుకుంది.(లైవ్ వీడియోలో స్నానం చేస్తూ అడ్డంగా.. )
తాజాగా ఈ ఘటనను న్యూబెర్గ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ బుధవారం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఇదిగో మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడని వార్త మీకొకటి చూపిస్తున్నాం... చదవండి అంటూ పేర్కొంది. అసలు విషయానికి వస్తే.. న్యూబెర్గ్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు జూలై 5న లాండ్ క్రూయిజ్ కారు దొంగతనానికి గురైందని ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే 27 ఏళ్ల రాండీ లీ కూపర్ దకారు దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకోవాలని బయలుదేరారు. తనను పట్టుకోవడానికి వస్తున్నారని తెలుసుకున్న రాండీ కారును వేగంగా పోనిచ్చాడు. ఇంతలో మరో ఎండ్ నుంచి క్రిస్టిన్ నికోల్ బేగ్ అనే 25 ఏళ్ల యువతి ఎస్‌యూవీ కారులో వేగంగా వస్తోంది. చూస్తుండగానే రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. పోలీసులు అక్కడికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా 25 నికోల్ బేగ్ మత్తులో ఉండడంతో కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. అయితే ఆమె నడిపిన ఎస్‌యూవీ కారు కూడా చోరికి గురైనట్లు తెలిసింది. బేగ్‌ను ఈ విషయమై విచారించగా తాను కూడా ఒక దొంగనని, మత్తు పదార్థాలకు బానిసయి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు ఒకరిని పట్టుకోవడానికి వస్తే అదనంగా మరో దొంగ దొరకడం వారిని ఆశ్చర్యపరిచింది. వెంటనే వారిద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. 'ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో'.. 'నిజంగా ఇలాంటి వార్తను మాత్రం ఎప్పుడు చదవలేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. (లవ్ యూ మామా: ఫ్లాయిడ్ చివరి క్షణాలు)
Comments
Please login to add a commentAdd a comment