గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి.. | Video: 3 Noida College Students Stole Car To Take Girlfriend For A Drive | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..

Oct 11 2024 6:26 PM | Updated on Oct 11 2024 6:44 PM

Video: 3 Noida College Students Stole Car To Take Girlfriend For A Drive

గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్‌ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర  అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు  తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్‌ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో వెలుగుచచూసింది.

ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ​్‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్‌ వేశారు. షోరూమ్‌ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్‌, అనికేత్‌ నగర్‌, దీపాంశు భాటీ కలిసి స్కెచ్‌ వేశారు.

సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్‌లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు  అడిగారు. వారు హెల్మెట్‌లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement