greater noida
-
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్‌లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్‌లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్‌వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం. -
Noida: బాంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి
లక్నో: గ్రేటర్ నోయిడాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా సెక్టార్-74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పదిహేను అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయని ఓ అధికారి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని చెప్పారు. అగ్ని ప్రమాదంలో పర్మీందర్ అనే ఎలక్ట్రీషియన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.‘బాంక్వెట్ హాల్ ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. తెల్లవారుజామున 3:30 గంటలకు, నోయిడా సెక్టార్ 74లోని లోటస్ గ్రాండియర్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న 15 నిమిషాల్లోనే 15 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోట్ల విలువైన బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది’ అని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.#WATCH | UP | Lotus Grandeur banquet hall located in Noida's sector 74 was gutted in a fire which broke out late last night. The banquet hall was currently under renovation. As per Police, one person died in the incident. pic.twitter.com/R4pEti1MdB— ANI (@ANI) October 30, 2024 -
భారీగా డ్రగ్స్ పట్టివేత.. తిహార్ జైలు వార్డెన్‌తో సహా నలుగురి అరెస్ట్
లక్నో:ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నోయిడాలోని మెక్సికన్ డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న మెథాంఫేటమిన్ తయారీ ల్యాబ్‌లో వందల కోట్ల విలువైన 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను తిహార్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త, ముంబై కెమిస్ట్ రహస్యంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌తోపాటు విదేశాలకు డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.ఈ ల్యాబ్‌లో దేశీయ వినియోగానికి, అంతర్జాతీయ ఎగుమతుల కోసం సింథటిక్ డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తయారీ చేపడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న సుమారు 95కిలోల మెథాంపేటమిన్(డ్రగ్స్), వివిధ రసాయనాలు, ఆధునాతన తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. మూడురోజల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.ఈ ఫ్యాక్టరీలో ముంబయికి చెందిన కెమిస్ట్ మాదక ద్రవ్యాలను తయారు చేయగా.. వాటి నాణ్యతను ఢిల్లీలో ఉండే మెక్సికన్ ముఠా సభ్యుడు పరీక్షించేవాడని ఎన్సీబీ తెలిపింది. ల్యాబ్‌లో పట్టుబడిన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను గతంలో కూడా ఒక ఎన్డీపీఎస్ కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఆ సమయంలో అతడిని తిహార్ జైల్లో ఉంచగా.. అక్కడ వార్డెన్‌తో పరిచయం పెంచుకొని అతడిని కూడా ఈ మత్తు వ్యాపారంలోకి దించాడు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.गर्लफ्रेंड को घूमने के लिए तीन स्टूडेंट ने लूट ली वेन्यू कारमामले में तीन आरोपियों को पुलिस ने किया गिरफ्तारपुलिस ने लूटी हुई गाड़ी को भी कर लिया है बरामद @noidapolice @CP_Noida #Greaternoida pic.twitter.com/4hT8TjjpFt— PRIYA RANA (@priyarana3101) October 11, 2024సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది. -
కలుషిత ఆహారం.. 200 మంది విద్యార్థులు అనారోగ్యంపాలు!
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గల ఒక హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెసిడెన్సీ అండ్ లాయిడ్స్ హాస్టల్ విద్యార్థులు కలుషిత ఆహారం తిన్న కారణంగా అనారోగ్యం పాలయ్యారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా హాస్టల్లో తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకునిపై బాధిత విద్యార్థులు పోలీసుల ఎదుట తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 8వ తేదీ సాయంత్రం హాస్టల్లో ఆహారం తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని నాలెడ్జ్ పార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే బాధిత విద్యార్థులందరినీ సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. -
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
రాముడి పాటపాడి మరోసారి వార్తల్లోకి సీమా హైదర్
ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రఘుపూర్‌లో నివసిస్తున్న ఈ మహిళా.. తాజాగా శ్రీరాముని కీర్తన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ముస్లిం మహిళ అయిన సీమా.. హిందూ ఆరాధన చేయడం విశేషంగా నిలిచింది. సీమాతోపాటు ఆమె కుమారుడు కూడా హనుమాన్ చాలీసా పఠించడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. సచిన్-సీమా నివసించే రబూపురాలో ఇటీవల రాముడి భజన ఏర్పాటు చేశారు. రాముడి కీర్తనలు, హానుమాన్ పాటలు పాడారు. ఈ సందర్భంగా సీమా.. స్వాతి మిశ్రా పాడిన ‘రామ్ ఆయేంగే’ అనే పాటను ఆలపించారు. తలపై కాషాయ రంగు టోపి ధరించి ఆమె ఎంతో చక్కగా పాట పాడారు. ఆమెతోపాటు తన కుమారుడు కూడా హనుమాన్ చాలిసా పఠించాడు. ఆమె వెంట న్యాయవాది ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ వీడియోను ఆమెనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jist (@jist.news) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనుమతి లభించిన వెంటనే తన కుటుంబంతో కలిసి అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి రామదర్శనం కోసం వెళతానని తెలిపారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. భారత్ మహిళలను గౌరవించే దేశమని అన్నారు. తను ఇప్పుడు పూర్తిగా హిందూ మతంలోకి మారినట్లు తెలిపారు. ఆమె శ్రీకృష్ణుడు, శ్రీరాముడి భక్తురాలినని అన్నారు. కాగా.. ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌తో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అనంతరం సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలుస్తోంది. సీమాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టా ద్వారా తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. -
లిఫ్ట్‌లోకి కుక్క.. మహిళతో రిటైర్డ్ ఐఏఎస్ డిష్యుం డిష్యుం
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్మెట్లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్‌లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది. చెంపదెబ్బల వర్షం ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్‌లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida). First Retired IAS Officer beat 👊 a Women Then her Husband beat 👊 that IAS Officer Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO — Dr Jain (@DrJain21) October 31, 2023 పెరుగుతున్న గొడవలు పెంపుడు కుక్కులను లిఫ్ట్లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్మెంట్లు పెంపుడు కుక్కలను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది. -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకంఉది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద మారుతి వ్యాన్ అదుపుతప్పి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా అయిదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం 1 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమయంలో వ్యానులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమ్ అటవీ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు ఛత్తీస్‌గఢ్ పోలీస్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్.. నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టినట్లు బస్తర్ రేంజ్ ఐడీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసుల కదలికలను గుర్తించిన మావోయిస్టులు ఎదురు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏ రైఫిల్, 12 బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. -
లిఫ్టు కూలిన ఘటనలో 8కి చేరిన మృతులు
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కూలిన ఘటనలో క్షతగాత్రులైన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ ప్రాజెక్టులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శుక్రవారం ఉదయం 14వ ఫ్లోర్ నుంచి లిఫ్టు కూలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన అయిదుగురిలో నలుగురు శనివారం చనిపోయారు. మరొకరు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలస కార్మికులు. -
లిఫ్ట్ కుప్పకూలి నలుగురు కార్మికులు మృతి
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్టు కుప్పకూలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ సొసైటీలో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కార్మికులతో బయలుదేరి వెళ్తూ 14వ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా జారు కుంటూ వచ్చి వేగంగా నేలను ఢీకొట్టింది. దీంతో లిఫ్టులోని నలుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధి తులంతా యూపీ, బిహార్‌లకు చెందిన వలసకార్మికులని పోలీసులు తెలిపారు. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్‌టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్‌కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్‌లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్‌లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్‌కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్‌ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్‌లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
షాకింగ్ వీడియో.. వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు
దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది. హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు..
గ్రేటర్ నోయిడా: బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నోయిడాలో నిర్వహించిన "దివ్య దర్బార్"కు భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన మహిళను అక్కడి బౌన్సర్లు ఎత్తి అవతల పారేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అక్కడే ఉండి చోద్యం చూస్తోన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ నోయిడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి విశేష ఆదరణ ఉంది. ఆయన ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే భక్తులు అశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే నోయిడాలో నిర్వహించిన దివ్యదర్బార్ కార్యక్రమానికి కూడా సభాప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. సగం కార్యక్రమం పూర్తైనా అప్పటికింకా భక్తులు సభాస్థలికి వస్తుండడంతో వారిని ఇంటికి వెళ్లి లైవ్ లో కార్యక్రమాన్ని చూడవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ధీరేంద్ర కృష్ణ ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఒక మహిళ బ్యారికేడ్లు దాటుకుని స్టేజి వద్దకు దూసుకుని వెళ్లగా అక్కడ ఉన్న వాలంటీర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఎస్సై రామ శంకర్ వారిని వారించకుండా నిల్చుని చూస్తుండడం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో సదరు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నోయిడా పోలీసు శాఖ. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వాలంటీర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. धीरेंद्र शास्त्री के दरबार मे धीरेंद्र शास्त्री के बाउंसरों ने कूड़े की तरह लड़की को उठाकर बैरिकेडिंग के पार फेंका#GreaterNoida #BageshwarDhamSarkar #DhirendraKrishnaShastri #TIME8 pic.twitter.com/I71daxELpU — TIME8 (@TIME8News) July 13, 2023 ఇది కూడా చదవండి: సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. -
షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు.. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాలక్సీ ప్లాజా షాపింగ్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పలువురు భవనంపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు, ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే విషయం తెలియరాలేదు. అయితే కాంప్లెక్స్‌లో ఎలక్ట్రీకల్ షార్ట్ సర్కిట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్ కంప్లెక్స్‌లో నుంచి పొగ వెలువడటం, మూడో అంతస్తు కటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వేలాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాసేపటికి మంటలు, పొగలు పెరగడంతో అక్కడి నుంచి కిందకు దూకేయడం వీడియోలో కనిపిస్తుంది. చదవండి: Patna: లాఠీ ప్రయోగం.. బీజేపీ ఆందోళన ఉద్రిక్తం #GreaterNoida : ग्रेटर नोएडा वेस्ट के गैलेक्सी प्लाजा में लगी आग, लोग शीशा तोड़ कूदकर जान बचाते नज़र आए, सूचना मिलते ही फायर बिग्रेड मोके पर पहुँची।@noidapolice pic.twitter.com/wWxHqd4xpQ — YAGYESH KUMAR JOURNALIST (@Bunty_0143) July 13, 2023 -
కార్మికుడికి రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టమంటూ నోటీసులు..?
లక్నో: నిరుద్యోగి ఆయిన ఒక కార్మికుడి కంపెనీ టర్నోవర్ రూ.2. 5 కోట్లు దాటింది కానీ అతడు టాక్స్ కట్టడం లేదంటూ అతడికి నోటీసులు పంపించింది ఆదాయపు పన్ను శాఖ. రోజుకి రూ. 300 సంపాదించుకునే కూలీని, అంత మొత్తాన్ని ఎక్కడ నుండి తెచ్చి కట్టాలని వాపోతున్నాడు ఆ కార్మికుడు. బులంద్ షహర్ కు చెందిన 22 ఏళ్ల దేవేంద్ర కుమార్ కు చాలా కాలంగా ఉద్యోగం లేదు. ఏవో కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కానీ అక్కడ ఎక్కువకాలం స్థిరంగా లేడు. ప్రస్తుతానికైతే అతడు నరౌరాలో ఒక టౌన్ షిప్ ప్రాజెక్టులో దినవారీ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి రెండు వ్యాపారాలున్నాయని, వాటి నుంచి అతడు ఏడాదికి రూ.2.5 కోట్లు ఆదాయం పొందుతున్నాడని తెలుపుతూ జీఎస్టీ నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నిందితుడు దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నోయిడాలో నేనొక సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్యాకర్ గా పని చేసేవాడిని. అక్కడి కాంట్రాక్టర్లు నాకు జీతం ఇవ్వడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని కోరారు. మార్చి 13, 16న అల్లాగే ఏప్రిల్ 4న రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ నుండి, అలీగఢ్ ఆదాయపు పన్ను కార్యాలయం నుండి ఘజియాబాద్ లోని మా ఇంటికి నోటీసులు వచ్చాయి. జేకే ట్రేడర్స్ అనే నా కంపెనీ టర్నోవర్ రూ.136.60 లక్షలని, అలాగే సర్వశ్రీ జేకె ట్రేడర్స్ అనే నా మరో కంపెనీ టర్నోవర్ 116.24 లక్షలని రెండిటికీ కలిపి మొత్తం రూ.24. 61 లక్షలు టాక్స్ కట్టాల్సి ఉందని నోటీసుల్లో ఉంది. జీఎస్టీ నెంబర్ ఆధారంగా చూస్తే అది జితేందర్ సిసోడియా అనే వ్యక్తి పేరు మీద ఉందని.. మా పాత కంపెనీ యజమాని, జితేందర్ ఇద్దరూ కలిసి ఏదైనా మతలబు చేసి ఉంటారని ఆరోపించాడు. ఏమి చెయ్యాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించానని.. బులంద్ షహర్, నోయిడా, ఘజియాబాద్ తిరిగి తిరిగి చివరకు గౌతమ్ బుద్ధా జిల్లాలోని సెక్టార్-63 పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని ఇంతవరకు దానికే రూ.40000 ఖర్చు చేశానని భోరుమన్నాడు. ఇది కూడా చదవండి: పక్కా ఆధారాలున్నాయి.. ఇక జైలుకే.. -
బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న పబ్జీ ప్రేమకథ..
గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది. ఫస్ట్ హాఫ్.. భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది. ఇంటర్వెల్.. భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు. ప్రీ క్లైమాక్స్.. ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు. క్లైమాక్స్.. బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్. ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్‌లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్‌లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్‌లో పబ్జీ వంటి గేమ్‌లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్‌తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్‌లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్‌కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. ఇషితా కిషోర్ ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సైనిక కుటుంబ నేపథ్యం 26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్‌లో చేరాను’ అని ఇషితా తెలిపారు.. కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకొని సివిల్స్‌కు అర్హత సాధించారు. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే దేశానికి సేవ చేయాలని.. తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది. యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz — ANI (@ANI) May 23, 2023 మెరిసిన తెలుగు తేజం 2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. -
‘ఆమె నా జీవితాన్ని తలకిందులు చేసింది, అందుకే..’
సమస్యలు లేని మనిషంటూ ఉండడు. కానీ, అనుజ్ సింగ్ మాత్రం తన సమస్యలను మోయలేని భారంగా భావించాడు. చిన్నవయసు నుంచి కాలేజీ రోజుల దాకా ఎదురైన పరిస్థితులతో మానసికంగా కుంగిపోయాడతను. ఆ టైంలోనే స్నేహ చౌరాసియా పరిచయం అయ్యింది. ఆమె ప్రేమలో జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుందని ఫీలయ్యాడతను. కానీ, అది అతనికి ఎంతో కాలం దక్కలేదు. ఆఖరికి.. ఆ ప్రేమ వెనుక మోసం దాగుందని గుర్తించి మాజీ ప్రేయసిని చంపడంతోనూ పాటు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకున్నాడా యువకుడు. గురువారం(మే 18) గ్రేటర్ నోయిడా(యూపీ) పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతున్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్ కసితీరా పిస్టోల్‌తో కాల్చి చంపాడు. ఆపై హస్టల్ గదికి చేరుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అఘాయిత్యానికి పాల్పడే ముందు రికార్డ్ చేసినట్లు భావిస్తున్న ఓ వీడియోను అనుజ్ జీమెయిల్ అకౌంట్ నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అందులో స్నేహ చౌరాసియా తన జీవితాన్ని ఎలా మార్చేసింది, తన మనసును ఎంత క్షోభ పెట్టిందనేది 23 నిమిషాలపాటు మాట్లాడాడతను. వీడియోలో ఏముందంటే.. ‘‘నా పేరు అనుజ్. నేను ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరినీ బాధపెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు చవిచూశా. నేను అమ్మాయిలకు దూరంగా ఉండేవాడిని. నా గతంలో జరిగినవే అందుకు కారణం. నా సోదరిని ఆమె భర్త తగలబెట్టి చంపేశాడు. మా మామయ్య ఆయన భార్య వదిలేసి వెళ్లిపోయిందని గుండెపోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆడవాళ్ల వంక చూడకూడదని నిర్ణయించుకున్నా. కానీ.. ఆమె పరిచయం నాలో సంతోషాన్ని నింపింది.. నాలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకే ఆమె లవ్ ప్రపోజ్‌ను అంగీకరించా. ఇద్దరం ఏడాదిన్నరకాలం ఎంతో ఆనందంగా గడిపాం. హఠాత్తుగా ఒకరోజు తాను మానసికంగా కుమిలిపోయానని, కాబట్టి తనకు దూరంగా ఉండమని బ్రేకప్ చెప్పేసింది స్నేహ. అది నమ్మి ఆమె సంతోషం కోసం దూరంగా ఉన్నా. కానీ, కాలేజీలో పని చేసే ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తర్వాతే తెలిసింది. ఆమె వల్ల నా జీవితం తలకిందులు అయ్యింది. నాకు ఎంతో టైం లేదు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా. చేసిందానికి ఆమె ప్రతిఫలం అనుభవించాల్సిందే. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా.. స్నేహ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అనుజ్ ఆ వీడియోలో చెప్పాడు. హస్టల్ సీసీటీవీ ఫుటేజీలు, ఆమె సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను పరిశీలిస్తే.. స్నేహ అఫైర్ నిజమో కాదో తెలుస్తుందని చెప్పాడతను. ‘‘తన(స్నేహ) ప్రవర్తన మీద మొదటి నుంచి అనుమానాలు ఉండేవి. ఫోన్‌ను ఇచ్చేది కాదు. వాట్సాప్ ఛాటింగ్ నేను చూస్తానని ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. గట్టిగా అడిగితే.. నమ్మకం లేదా? అనేది. కానీ, ఒకానొక టైం వచ్చేసరికి విడిపోదామని చెప్పేసింది. బాధేసినా.. తను బాగుండాలని సరేనన్నా. కానీ, స్నేహ చేసిన మోసం నన్ను గుండెల్లోతుగా బాధించింది. అందుకే చంపాలని నిర్ణయించుకున్నా. స్నేహ తల్లిదండ్రులకు నా క్షమాపణలు.. మీ కన్నకూతురు బతకడానికి అర్హురాలు కాదు. మొన్న నన్ను.. ఇవాళో రేపో ఆ వ్యక్తిని, ఆపై మరొకరిని.. మోసం చేస్తుందని నా నమ్మకం. అలాంటి అమ్మాయికి బతికే హక్కు కూడా లేదు అంటూ వీడియోలో అనుజ్ మాట్లాడాడు. మధ్యాహ్నం 1గం.30ని. సమయంలో క్యాంపస్‌లోనే స్నేహ చౌరాసియాను నాటు తుపాకీతో కాల్చి చంపాడు అనుజ్ సింగ్. అయితే ఘటనకు ముందు వాళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు యూనివర్సిటీ డైనింగ్ హాల్ వద్ద ఇద్దరూ కౌగిలించుకుని కూడా కనిపించినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాతే తనతో తెచ్చిన పిస్టోల్‌ను బయటకు తీసి.. స్నేహను కసితీరా కాల్చి చంపాడు అనుజ్. ఆపై హస్టల్ గదికి వెళ్లి తనను తాను కాల్చుకుని అక్కడిక్కడే చనిపోయాడు. అది వీడియోగా వైరల్ అయ్యింది కూడా. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. ఇప్పటిదాకా స్నేహ తల్లిదండ్రులు ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అలాగే క్యాంప్‌లో విచారణ కోసం వెళ్లిన పోలీసులను.. స్నేహ స్నేహితురాళ్ల మౌనం సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో.. అనుజ్‌కు దేశీవాళీ తుపాకీ ఎలా వచ్చింది? దానిని క్యాంపస్‌లోకి ఎలా తీసుకొచ్చాడు అనే కోణాల్లో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు!
కొందరు విదేశీయులు అద్దెకు ఇంటిని తీసుకున్న అందులో ల్యాబరేటరీని ఏర్పరుచుకుని డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఈ దాడిలో నిందితులతో పాటు కోట్ల విలువైన మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సమాచారం మేరకు గ్రేటర్ నోయిడాలోని ఓ భవనంపై పోలీసులు దాడి చేశారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేశామని, అంతర్జాతీయ మార్కెట్లో రూ.200 కోట్ల విలువైన 46 కిలోల మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. తొమ్మిది మంది విదేశీయులు గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ తీటా 2లో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులుకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు సుమారు 100 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకులో మిథైల్ ఆల్కహాల్, హైపో ఫాస్ఫారిక్ యాసిడ్, హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్, అయోడిన్ క్రిస్టల్స్, అమ్మోనియా, ఎఫిడ్రిన్, అసిటోన్, సల్ఫర్, కాపర్ సాల్ట్ ఉన్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిని అనుదుమ్ ఇమ్మాన్యుయేల్, అజోకు ఉబాకా, డేనియల్ అజుహ్, లెవి ఉజోచుక్వ్, జాకబ్ ఎమెఫీలే, కోఫీ, చిడి ఇజియాగ్వా (ఎనిమిది మంది నైజీరియాకు చెందినవారు), డ్రామెమండ్ (సెనెగల్‌కు చెందినవారు)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రెండు మూడు రోజులకు ఒక పోలీసు మృతి.. ఐదేళ్లలో 821 మంది -
ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి
గ్రేటర్ నోయిడా: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో 2023 బుధవారం ప్రారంభమైంది. 2022లో జరగాల్సిన ఈ కార్యక్రమం కోవిడ్–19 కారణంగా వాయిదాపడింది. ఈసారి షోలో ఎలక్ట్రిక్ వాహనాలు హైలైట్. 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి ఎక్స్‌పోలో తళుక్కుమంటున్నాయి. వీటిలో మారుతీ 5 డోర్ జిమ్మీ, నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివల్, ఎంజీ ఎయిర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ అయానిక్–5 ఉన్నాయి. జనవరి 18 వరకు ప్రదర్శన ఉంటుంది. సుజుకీ ఈవీఎక్స్ 550 కిలోమీటర్లు వాహన తయారీ దిగ్గజం జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మధ్యస్థాయి ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ తొలిసారిగా అంతర్జాతీయంగా దర్శనమిచ్చింది. 2025లో ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టనుంది. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ వెల్లడించారు. మొత్తం 16 వాహనాలను మారుతీ ప్రదర్శిస్తోంది. వీటిలో వేగన్–ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్–సీఎన్జీ, గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్: అయానిక్–5 ఈవీ ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర తొలి 500 మంది కస్టమర్లకు రూ.44.95 లక్షలు. 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 217 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయానిక్–6 ఎలక్ట్రిక్ సెడాన్ సైతం కొలువుదీరింది. 53, 77 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఎంజీ: హెక్టర్, హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కొలువుదీరాయి. ఆల్ ఎలక్ట్రిక్ మిఫా 9 ఎంపీవీ తొలిసారిగా భారత్‌లో తళుక్కుమన్నది. దీనిలో 90 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. 440 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎంజీ–4 హ్యాచ్‌బ్యాక్, ఎంజీ 5 ఎలక్ట్రిక్ స్టేషన్ వేగన్ (ఎస్టేట్), ఈఎంజీ6 హైబ్రిడ్ సెడాన్ సైతం ప్రదర్శనలో ఉంది. బీవైడీ: సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. 2023 చివరి త్రైమాసికంలో రానుంది. లెక్సస్: ఎల్ఎం 300హెచ్ ఎంపీవీ (టయోటా వెల్ఫైర్) భారత్‌లో అడుగుపెట్టింది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రూపుదిద్దుకుంది. 150 హెచ్‌పీ, 2.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు ఉంది. కొత్త ఆర్ఎక్స్ ఎస్యూవీ భారత్‌లో ప్రవేశించింది. ఎల్ఎఫ్–30, ఎల్ఎఫ్–జడ్ ఈవీ కాన్సెప్ట్ మోడళ్లు ఉన్నాయి. టయోటా: ల్యాండ్ క్రూజ్ ఎల్సీ 300 ఎస్యూవీ కొత్త రూపులో చమక్కుమంటోంది. బీజడ్4ఎక్స్ భారత్‌లో అడుగుపెట్టింది. 71.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. టాటా: అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ హ్యారియర్ ఈవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 2024లో మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. 2025లో రంగ ప్రవేశం చేయనున్న సియర్రా ఈవీ కాన్సెప్ట్ సైతం మెరిసింది. చదవండి: ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా -
Crime News: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి..
క్రైమ్: దృశ్యం సినిమాలో రాంబాబు పాత్ర పెద్దగా చదువుకోదు. కేవలం.. తాను సంపాదించుకున్న సినిమా నాలెడ్జ్‌తోనే వరుణ్ మిస్సింగ్(మర్డర్) కేసు నుంచి కుటుంబాన్ని రక్షించుకుంటూ వస్తాడు. అయితే నిజజీవితంలోనూ సినిమాలు, టీవీ సీరియళ్లు.. నేరాలకు స్ఫూర్తిగా నిలవడం తరచూ చూస్తుంటాం. తాజాగా.. గ్రేటర్ నోయిడాలో బయటపడ్డ ఉదంతం విస్మయాన్ని కలిగిస్తోంది. పాయల్.. గ్రేటర్ నోయిడాకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని బధ్పురా గ్రామవాసి. తల్లిదండ్రుల గారాల బిడ్డగా పెరిగింది. పెళ్లీడూ వచ్చాక.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు ఆమె తల్లిదండ్రులు. అయితే తాను అజయ్‌ను ప్రేమించిన విషయాన్ని చెప్పడానికి ఆమె తటపటాయిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని కమ్మేసింది. వ్యాపారంలో నష్టాలు పూడ్చుకునేందుకు పాయల్ తండ్రి బోలెడంత అప్పులు చేశాడు. ఆ భారం కొండంత కావడంతో.. భరించలేకపోయాడు. భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన పాయల్‌కు.. అజయ్ ఆదరణ లభించింది. కానీ, కన్నవాళ్లు లేకపోవడంతో కుమిలిపోయింది పాయల్. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. ఇంట్లోనే పాయల్ నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త స్థానికంగా విషాదం నింపింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహానికి బంధువుల అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కూడా సూసైడ్ కేసుగా క్లోజ్ చేశారు. పాయల్ దూరమైందన్న బాధతో దేశాలు పట్టుకుపోయాడు అజయ్. కట్ చేస్తే.. అదే ఏరియాలో ఓ యువతి మిస్సింగ్ కంప్లయింట్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎంత వెతికినా ఆమె జాడను కనిపెట్టలేకపోయారు పోలీసులు. దీంతో గౌర్ సిటీ ఏరియాలో ఆమె పని చేసే మాల్ దగ్గర నుంచి విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. బధ్పురాకు చెందిన అజయ్, మిస్సింగ్ యువతికి మంచి స్నేహితుడని తేలింది. దీంతో.. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. పాయల్ కోసమే తాను అదంతా చేశానని, పాయల్ బతికే ఉందన్న షాకింగ్ విషయాన్ని బయటపెడ్డాడు. తండ్రి చేసిన అప్పుల నుంచి తప్పించుకునేందుకు మరో వ్యక్తిని చంపి.. తన ప్లేస్‌లో ఆ శవాన్ని ఉంచి.. చనిపోయినట్లు నాటకం ఆడినట్లు ఒప్పుకుందామె. తాను చూసిన ఓ టీవీ షో స్ఫూర్తితోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది పాయల్. ఇందుకోసం ముందుగా అజయ్.. పాయల్ ఫిజిక్‌తో సరిపోలిన మాల్లో పని చేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ఆమెను నమ్మించి..ఓరోజు పాయల్ ఇంటికి తీసుకొచ్చాడు. గొంతు కోసి, ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా వేడి నూనె, యాసిడ్ పోసి.. ఆపై బాడీకి నిప్పటించారు ఆ లవ్‌బర్డ్స్. ప్లాన్ ప్రకారం ముందుగా పాయల్, కొన్నిరోజుల గ్యాప్‌లో అజయ్.. ఇద్దరూ ఆ ఊరిని విడిచిపెట్టారు. బాధితురాలు కనిపించడం లేదన్న ఫిర్యాదుతో ఈ మొత్తం నేరం బయటపడింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. వాళ్ల నుంచి ఓ రివాల్వర్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బలవంతంగా కామాంధుల చెంతకు.. ఆపై.. -
ఎన్నారైను టెన్షన్ పెట్టిన నాలుగు గంటలు
ఢిల్లీ: ఏమరపాటులో చేసే పని.. ఒక్కోసారి తీవ్రపరిణామాలకు దారి తీస్తుంటుంది. తన కూతురి పెళ్లి కోసం నగలతో వచ్చిన ఓ ఎన్నారైకి అలాంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్లో టెన్షన్.. టెన్షన్‌గా గడిపాడు ఆ పెద్దయాన. నిఖిలేష్ సిన్హా(50).. లండన్ నుంచి తన కూతురి వివాహం కోసం వచ్చారు. గ్రేటర్ నోయిడాలో ఓ హోటల్లో బస చేసిన ఆయన.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఊరికి వెళ్లేందుకు లగేజీతో ఓ క్యాబ్ బుక్ చేసుకుని బయల్దేరారు. అయితే.. తీరా గమ్యస్థానం చేరుకున్నాక ఆయన ఓ బ్యాగ్‌ను క్యాబ్‌లోనే మరిచిపోయి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే ఆయన తలపట్టుకున్నారు. ఆ బ్యాగులో సుమారు కోటి రూపాయల విలువ చేసే నగలు ఉన్నాయట. దీంతో ఆలస్యం చేయకుండా ఆయన బిస్రాఖ్ పోలీసులను ఆశ్రయించాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆ క్యాబ్ నిర్వహణ కార్యాలయానికి వెళ్లి.. నాలుగు గంటల్లో ఆ క్యాబ్ ఉన్న లొకేషన్ గుర్తించారు. తీరా.. ఘజియాబాద్ లాల్ కౌన్ వద్ద క్యాబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఆ పెద్దాయన క్యాబ్‌లో బ్యాగ్ మరిచిపోయిన విషయం తనకు తెలియదని డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. దీంతో నేరుగా క్యాబ్, డ్రైవర్‌తో సహా స్టేషన్‌కి చేరుకున్న పోలీసులు.. నిఖిలేష్ ముందే ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసి నగలను అప్పగించారు. పోలీసుల త్వరగతిన స్పందన ఎన్నారై నిఖిలేష్ సంతోషం వ్యక్తం చేసి.. క్యాబ్ డ్రైవర్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు. అప్పటికి సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఇదీ చదవండి: మీరు దళితులు.. మీకు ఏం అమ్మం!