పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం.. ఓ మాజీ ఐఏఎస్ అధికారి, మహిళ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లోకి పెంపుడు కుక్కను తీసుకురావడంతో దాని మాజమాని, మరో నివాసితుడికి వాగ్వాదం జరిగింది. ఇరువురు విచక్షణ మరిచి తగువులాడుకున్నారు. ఏకంగా చెంప దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రధేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోవెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
వివరాలు.. నోయిడాలోని 108 సెక్టర్ పార్క్ లారేట్ సొసైటీలోని ఓ అపార్ట్‌మెట్‌లోని ఓ మహిళ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఆ కుక్కను ఇటీవల అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లోకి తీసుకెళ్లింది. అయితే ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అందుకు అంగీకరించలేదు. కుక్క విషయంతో రిటైర్డ్ అధికారి, మహిళ మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. లిఫ్ట్‌లో కుక్కను తీసుకొచ్చిన ఫోటోను తీస్తుండగా మహిళ అతని ఫోన్ లాక్కుంది. వెంటనే సదరు అధికారి కూడా మహిళ ఫోన్ లాక్కున్నాడు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసింది.
చెంపదెబ్బల వర్షం
ఈ గొడవలో వ్యక్తి మహిళను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కూడా వ్యక్తిని అడ్డుకొని దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక మహిళ తనపై జరిగిన దాడి విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన కూడా గొడవలోకి ప్రవేశించాడు. ఇతర నివాసితులు లిఫ్ట్‌లోకి రాకుండా మహిళ అడ్డుకోవడంతో ఆమె భర్త వ్యక్తిపై చెంపదెబ్బల వర్షం కురిపించాడు. చివరికి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకొని ఇద్దరిని వీడదీయడంతో గొడవ సద్దుమణిగింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇరువర్గాలు పోలీసులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ఆసుపత్రిలో బెడ్స్ కొరత.. మాజీ ఎంపీ కొడుకు కన్నుమూత
Fight Over taking a Dog 🐕 inside Lift (Obviously in Noida).
— Dr Jain (@DrJain21) October 31, 2023
First Retired IAS Officer beat 👊 a Women
Then her Husband beat 👊 that IAS Officer
Dog 🐕 Enjoyed Both 🤗😅#UttarPradesh #NationalUnityDay #SardarVallabhbhaiPatel #राष्ट्रीय_एकता #SardarPatelJayanti… pic.twitter.com/H1J18BEEVO
పెరుగుతున్న గొడవలు
పెంపుడు కుక్కులను లిఫ్ట్‌లలోకి తీసుకెళ్లవచ్చా అనే విషయంపై దేశవ్యాప్తంగా పెంపుడు జంతువుల యజమానులు, అపార్ట్‌మెంట్ నివాసితుల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలపై గొడవలు పెరుగుతున్నాయి. నోయిడాలోని అనేక అపార్ట్‌మెంట్‌లు పెంపుడు కుక్కలను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. అయితే వాటి మాజమానులు మాత్రం అలాంటి ఆదేశాలు చట్టబద్దమైనవి కావని వాదిస్తున్నారు.. గతేడాది సైతం అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల చిన్నారిని కరిచినందుకు పెంపుడు కుక్క మాజమానికి గ్రేటర్‌నోయిడా అడ్మినిస్ట్రేషన్ రూ. 10 వేల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment