గ్రేటర్ నోయిడా: నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రధాన రోడ్లపై ప్రత్యేక సైక్లింగ్ కారిడార్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గత నెలలో అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు, వివిధ టౌన్‌షిపుల అథారిటీలు స్పందించాయి. ఇందులో భాగంగా సమారు 15 కిమీటర్ల సైక్లింగ్ కారిడార్‌ను తన టౌన్‌షిప్‌లో నిర్మించడానికి యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ అథారిటీ(వైఈఐడీఏ) ముందుకొచ్చింది. ఈ మేరకు డిజైనర్లను ఆహ్వానించింది. 50 కి.మీటర్ల సైకిల్ కారిడార్ నిర్మాణానికి నోయిడా అధికారులు గతవారమే డిజైనర్లను నియమించారు. సైక్లింగ్ ట్రాక్‌లు, స్టాండ్‌లు, షెల్టర్ ఏర్పాటుపై అవసరమైన ప్రతిపాదనలను (ఆర్‌ఈపీ) రూపొందించి అందజేయాలని వైఈఐడీఏ బుధవారం కన్సల్టెంట్లలకు సూచించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అర్హతలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేస్తామని చెప్పింది.
సైక్లింగ్ ట్రాక్ 20 కి.మీటర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తొలి దశలో15 కి.మీటర్ల వైఈఐడీఏలోని ప్రధాన మార్గాల్లో సైక్లింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైఈఐడీఏ నూతన టౌన్‌షిప్ 50 చదరపు కిలోమీటర్లు విస్తరించి పట్టణీకరణ చెందింది. ఒకసారి అర్బనైజేషన్ పూర్తి అయితే, అది క్రమంగా 200 చదరపు కిలో మీటర్లు విస్తరిస్తుందని అధికారి తెలిపారు.తొలి దశలో 18-20 సెక్టార్లలోని రోడ్డు మార్గంలోని పాదచారులు, సైక్లిస్టులకు ఇబ్బంది కలగకుండా ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సైకిల్ ట్రాక్ 2.5 మీటర్ల పొడవు నిర్మస్తారు. దీనివల్ల రోడ్లపై, పాదచారులు, సైకిలిస్టులకు ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని సంబంధిత అధికారులు అన్నారు. రెండో దశలో రోడ్లపై గుర్తించిన ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను నిర్మిస్తారు. ఇది క్రమంగా అన్నిరోడ్లపై కూడా సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 14వ తేదీన సమావేశమై నిర్ణయిస్తామని చెప్పారు. 20వ తేదీన సాయంత్ర మూడు గంటలకు సాంకేతిక బిడ్‌లను ప్రారంభిస్తామని, కొన్నిరోజుల్లో ఆర్థిక పరమైన అంశాలను పూర్తిచేస్తామని చెప్పారు.
నగరంలో సైక్లింగ్ కారిడార్‌లు
Published Sat, Oct 4 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement