హైదరాబాద్: సమాజ్ వాది పార్టీ ఎస్సీ ఎస్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మదిరె నర్సింగ్ రావు నియమితులయ్యారు. లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్ వాది పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి వ్యాస్ జి గోండ్ చేతుల మీదుగా మదిరె నర్సింగ్ రావు నియామక పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా లక్నోలోని సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నగరానికి చెందిన సామాజికవేత్త, సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత దండు బోయిన నిత్య కళ్యాణ యాదవ్‌తో కలిసి నర్సింగ్ రావు సోమవారం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ పట్ల యువతను, మహిళలను రైతులను ఆకర్షించే విధంగా కృషి చేయాలని అఖిలేష్ యాదవ్ సూచించారు.
కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు సమాజ్వాది పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవిని తనకు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ జాతీయ అధ్యక్షుడు రాహుల్ నిగమ్ వసి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment