లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి.
భారత్‌లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్‌కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్‌లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్‌కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment