Reliability
-
బ్యాలెట్ రావాలి: అఖిలేశ్
లక్నో: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం) లపై విశ్వసనీయత సడలుతున్నందున బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం డిమాండ్ చేశారు. ‘జర్మనీ వంటి దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నాయి. భారత్‌లో మాత్రం అధికార పెద్దలు స్వలాభం కోసం ఈవీఎంలను వాడుతున్నారు. వాటినెవరూ నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిచే వారు సైతం తమకు వాటిపై నమ్మకం లేదంటున్నారు’’ అని చెప్పారు. భారత సంతతికి చెందిన జర్మనీ ఎంపీ రాహుల్‌కుమార్ కాంబోజ్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘బ్యాలెట్ పేపర్లు వాడితే పోలింగ్‌లో తేడాలున్నట్లు అనుమానం వస్తే రీ కౌంటింగ్‌కు అవకాశముంటుంది. జర్మనీలో దీన్నే అనుసరిస్తున్నారు’’ అని తెలిపారు. -
మ్యాప్‌మైఇండియా ఆరోపణల్లో విశ్వసనీయత లేదు..
న్యూఢిల్లీ: మ్యాప్‌లను కాపీ చేశారంటూ మ్యాప్‌మైఇండియా తమపై చేస్తున్న ఆరోపణల్లో విశ్వసనీయత లేదని ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఆ కంపెనీ తమపై మ్యాప్‌ల కాపీయింగ్ ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము లీగల్ నోటీసు పంపినా మ్యాప్‌మైఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అగర్వాల్ పేర్కొన్నారు. సొంతంగా దేశీ నావిగేషన్ మ్యాప్ తయారు చేశామంటూ ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రకటించడం ఓ గిమ్మిక్కు అంటూ మ్యాప్‌మైఇండియా ఆరోపించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో సంబంధ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి మూడు రోజుల ముందు జూలై 23న మ్యాప్‌మైఇండియా ఆ సంస్థకు నోటీసులు పంపింది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 9న లిస్టయింది. ఈ నేపథ్యంలోనే అగర్వాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చాలాకాలంగా రైడ్ షేరింగ్ వ్యాపారంలో ఉన్నందున తమ దగ్గర మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా..టెక్నాలజీ బోలెడంత ఉందని, ఒక సంస్థను కూడా కొనుగోలు చేశామని అగర్వాల్ తెలిపారు. బహుశా మ్యాప్‌మైఇండియా కస్టమర్లు ఓలా మ్యాప్స్ వైపు మళ్లుతున్నారేమోనని, ఇది సమస్యగా మారడం వల్లే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు. -
Semicon India 2022: సెమికండక్టర్ల హబ్‌గా భారత్
బెంగళూరు: పారిశ్రామికవేత్తలు, తయారీదార్లకు కేంద్రం విధానపరంగా పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో ‘సెమికాన్ ఇండియా–2020’ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్లర్ల అవసరమన్నారు. మరిన్ని ప్రోత్సాహకాలు గత ప్రభుత్వాలు సెమికండక్టర్ల డిజైనింగ్ పరిశ్రమను ప్రోత్సాహించలేదని మోదీ ఆక్షేపించారు. ‘‘ఈ పరిశ్రలో దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారు. భారత్‌ను సెమికండక్టర్ హబ్‌గా మార్చడానికి ఆచరణ యోగ్యమైన సలహాలు, సూచనలివ్వండి. 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలుపుతున్నాం’’ అని తెలిపారు. 5జీ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సిక్కులపై ప్రధాని ప్రశంసలు న్యూఢిల్లీ: విదేశాలతో బంధాల బలోపేతానికి సిక్కు వర్గీయులు అనుసంధానంగా ఉన్నారంటూ మోదీ కొనియాడారు. ఇందుకు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. సిక్కు ప్రతినిధి బృందానికి శుక్రవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఎర్ర తలపాగా చుట్టుకొని ఆకర్షించారు. -
నగరాల్లో నిరంతర కరెంట్
సాక్షి, హైదరాబాద్: మెట్రోలు, పెద్ద నగరాల్లో ఇకపై విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంతరాయాలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి రానుంది. సరఫరాలో అంతరాయం కలిగితే డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గురువారం విద్యుత్ (వినియోగదారుల హక్కుల) నిబంధనల సవరణ ముసాయిదా–2021ను ప్రకటించింది. పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో డీజిల్ జనరేటింగ్ సెట్ల వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ముసాయిదాపై అక్టోబర్ 21లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని కోరింది. ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. తెరపైకి కొత్తగా విశ్వసనీయత చార్జీలు పెద్ద నగరాల్లో వినియోగదారులు డిస్కంలు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా నగరాలకు సంబంధించి..సగటు అంతరాయాల పునరావృతం సూచిక, సగటు అంతరాయాల వ్యవధి సూచికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రూపకల్పన చేయనుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం డిస్కంలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముంటే, అందుకు అవసరమైన పెట్టుబడిని వినియోగదారుల నుంచి ‘రిలయబిలిటీ (విశ్వసనీయత) చార్జీల’పేరుతో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించనుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైతే డిస్కంలకు ఈఆర్సీ జరిమానాలు విధించనుంది. ఐదేళ్లలో జనరేటర్లు మాయం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బ్యాకప్‌గా డీజిల్ జనరేటర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఈ ముసాయిదా అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోగా, లేదా రాష్ట్ర ఈఆర్సీ నిర్దేశించిన కాల వ్యవధిలోగా బ్యాటరీలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ వంటి కాలుష్య రహిత టెక్నాలజీకి మారాలి. సంబంధిత నగరంలో డిస్కంల విద్యుత్ సరఫరా విశ్వసనీయత ఆధారంగా ఈఆర్సీ ఈ గడువును నిర్దేశిస్తుంది. నిర్మాణ కార్యకలాపాలు, ఇతర తాత్కాలిక అవసరాలకు దర ఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేయాల్సి ఉండనుంది. -
విశ్వసనీయతపైనే రాజ్యాంగ వ్యవస్థల మనుగడ
- శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే ప్రజలు న్యాయ వ్యవస్థపైనే ఎక్కువ బాధ్యత ఉంచారు - న్యాయమూర్తులకు పదవీ విరమణ వరకూ నిత్యం కఠిన పరీక్షలు తప్పవు.. - జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఉద్ఘాటన - ముగిసిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం - ఇకపై మూడేళ్లకొకసారి నిర్వహణ - స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే సాక్షి, హైదరాబాద్: దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటుంటే న్యాయవ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విశ్వసనీయతతోనే ఈ పరీక్షల్లో నెగ్గడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విశ్వసనీయత సాయంతో న్యాయవ్యవస్థను కాపాడాలని న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ సైతం విశ్వసనీయతపైనే ఆధారపడి ఉందన్నారు. పరిస్థితులు ఏవైనా, ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనేఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మారియట్‌లో జరిగిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం ముగింపు కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. 2006లో జరిగిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సు దశాబ్దంగా మళ్లీ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థకు ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష ఉంటుందన్నారు. అందులో ప్రజాప్రతినిధులను ప్రజలు సామూహికంగా ఇంటికి పంపే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థలో మాత్రం ఇలాంటి పరీక్ష ఉండదన్నారు. న్యాయమూర్తులు పదవీ విరమణ వరకు విధుల్లో ఉంటారని, అప్పటివరకు కఠిన పరీక్ష ఎదుర్కొంటూనే ఉంటారన్నారు. విడాకులు, రుణ సంబంధ, ఆస్తి పంపక వివాద కేసులను కక్షిదారులు తమ యుక్త వయస్సులో దాఖలు చేస్తుంటే.. అవి తేలే సమయానికి వారు వృద్ధాప్యంలోకి వెళుతున్నారన్నారు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలని, అది వ్యవస్థాగత లోపమా? లేక మన లోపమా? అని గుర్తించాల్సినఅవసరం ఉందని చెప్పారు. అంతకుముందు జస్టిస్ బొసాలే మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడేళ్లకోసారి న్యాయాధికారుల సమావేశం, ఏటా జిల్లా జడ్జీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు తమ కలంతోనే మాట్లాడుతారని, వారికి కలమే బలమన్నారు. కేరళ న్యాయవ్యవస్థలో అవినీతి ఎంతమాత్రం లేదని, ఉభయ రాష్ట్రాల్లోనూ అవినీతిరహిత న్యాయవ్యవస్థ తయారు చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు. -
విశ్వసనీయత సరే.. తీరని ఆశల మాటేమిటి?
అవలోకనం బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. మరి ప్రధాని మోదీ మాటేమిటి? దశాబ్దాల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, విశ్వసనీయమైన భారత నేతగా నరేంద్ర మోదీ తన స్థానాన్ని దృఢపర్చుకున్న సంవత్సరం 2015. ఇందిరా గాంధీ హయాంలోనే కాదు.. జవహర్లాల్ నెహ్రూ కాలంలో కూడా ఇంత ప్రజాదరణను, ఇంత జనాకర్షణను పొందిన నేతను మనం చూడలేదు. మహత్తర మార్పును వాగ్దానం చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇంతవరకూ ఆ మార్పు జరగలేదు. నిజమే. మోదీ పాలనలో భారీ అవినీతి కుంభకోణాలపై చాలా తక్కువ కథనాలే వచ్చాయి. కానీ, మన్మోహన్ సింగ్ పాలన కంటే, అంతకు క్రితం పాలించిన వారికంటే మోదీ పాలనలో భారత్ ఏమైనా విభిన్నంగా ఉందా? అధికారం చేపట్టినప్పుడు మోదీ ప్రారంభించిన కీలకమైన పథకాలు పరిశీ లకులనే నివ్వెరపరిచాయి. స్వచ్ఛభారత్ అనేది మరుగుదొడ్లను నిర్మించడానికి సంబంధించి దశాబ్దాలుగా అమలులో ఉన్న పథకాలకు పేరు మార్పిడీయేనా? అయితే మంచిదే. కానీ ప్రధాని చీపురు చేపట్టి వీధులను ఊడ్చారు. అంటే స్వచ్ఛ భారత్ కేవలం పరిశుభ్రతకు సంబంధించిందీ, ఆరోగ్యంగా ఉండవలసిందిగా భారతీయులను ప్రోత్సహించేదీ మాత్రమేనా? అదే అయితే సామాజిక సంస్కరణ చేయడమే ప్రభుత్వ విధి అని చెప్పవచ్చా? కుటుంబ నియంత్రణను ప్రోత్సహిం చడం, మద్యనిషేధం అమలు, ఆడ శిశువుల హత్యలను నిరోధించడం వగైరా రూపాల్లో ప్రభుత్వం ఇప్పటికే సామాజిక సంస్కరణను చేపట్టిందని ఎవరైనా వాదించవచ్చు. కానీ వాటితో పోలిస్తే పరిశుభ్రత అనేది తగ్గు స్థాయికి సంబంధిం చింది. స్వచ్ఛ భారత్ ఉద్దేశం అర్థవంతమైనదే అయినప్పటికీ, పన్ను రాబడిపై ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. పైగా, పదేళ్ల మన్మోహన్ సింగ్ హయాంతో పోలిస్తే, సగటున ఆర్థిక వ్యవస్థ మందకొడి దిశగా వృద్ధి చెందుతోంది. ప్రభుత్వ చెల్లింపుల షీట్‌ను బలోపేతం చేయడానికి, పూర్తిగా పతనమైన ముడి చమురు ధరలను మోదీ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. లేకుంటే ఆర్థిక వ్యవస్థ నీరసించిపోయేది. తన వేగ వృద్ధి వల్ల కాకుండా చైనా వృద్ధి రేటు మందగిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ పేరు పొందుతోంది. మోదీ ప్రకటించిన భారీ పారిశ్రామిక విధానం మేక్ ఇన్ ఇండియా ఒక అద్భు తమైన లోగో. ఎంతో అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు కానీ ఇక్కడ కూడా ఈ విధానం ఉద్దేశం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. చివరికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌తోపాటు అనేకమంది నిపుణులు సైతం వస్తూత్పత్తి రంగాన్ని చైనా నుంచి భారత్‌కు ఆకర్షించవచ్చన్న భావాన్నే తోసిపుచ్చారు. ఇక ప్రతీకాత్మకతకు సంబం ధించి చూస్తే, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం (వల్లభ్ భాయ్ పటేల్‌ది) గుజరాత్లో నిర్మిస్తామని ప్రకటించారు. కానీ దాన్ని చైనీయులు నిర్మించబోతు న్నారని తర్వాత తెలిసింది. మొట్టమొదటి భారత బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం కోసం తేలికపాటి రుణాన్ని అందిస్తామని జపానీయులు ప్రతిపాదించారు కానీ, 99,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు వ్యయం గురించి నేను చదివిన ఏ ఆర్థికవేత్త కూడా ప్రస్తావించినట్లు లేదు. విదేశీ విధానానికి సంబంధించి, మోదీ రెండు కీలక అంశాలు పూర్తి చేశారు. అత్యంత భారీ జనాకర్షణ ద్వారా విదేశీ నగరాల్లోని ప్రవాస భారతీయులను ఆయన అద్భుతంగా సమీకరించారు. ఈ భారీ జన సమీకరణ ప్రయోజనం ఏమి టన్నది స్పష్టం కావడం లేదు. దీనికి సంబంధించిన పొందికయిన వివరణ బహుశా భవిష్యత్తులో రావచ్చు. ఇక పాకిస్తాన్ విషయంలో నా అంచనా ప్రకారం మోదీ ప్రభుత్వం గత 18 నెలల కాలంలో తన వైఖరిని కనీసం 9 సార్లు మార్చు కుంది. దౌత్య నిపుణులతో సహా ఏ ఒక్కరికీ పాకిస్తాన్ పట్ల భారత్ విధానం ఏమిటి లేక అసలు అలాంటి విధానం ఏమైనా ఉందా అనేది నిజంగానే తెలీటం లేదు. ఇప్పటికైతే మనం పాక్‌తో మళ్లీ చర్చిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంతకు ముందే ఎందుకు చర్చించలేకపోయాం? లేక వచ్చే నెలలో మనం చర్చలు కొనసాగించగలుగుతామా? అని ఎవరూ చెప్పలేరు. ఎన్నికల ప్రచార సమయంలో మోదీ చేసిన కొన్ని వాగ్దానాలు మృదువుగా చెప్పాలంటే అసత్యాలుగా పరిణమించాయి. ఉదాహరణకు, నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ఆయన ప్రకటించారు. మరో ఉదాహరణ.. అవినీతి ఆరోపణలకు గురైన ఎవరినైనా తాను కాపాడబోనని మోదీ తేల్చి చెప్పారు. తన వ్యవహారశైలిని అలా పక్కనబెడితే, మోదీ అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నారు. పైగా తిరుగులేని జనాకర్షణ ఉంది కూడా. ఆయన రేటింగులు 75 శాతం మార్కును చేరుకుంటున్నట్లు పోల్ సర్వేలు నిత్యం సూచిస్తున్నాయి. అంటే బీజేపీయేతర ఓటర్లనుంచే ఆయనకు మద్దతు అధికంగా వస్తోందని దీని అర్థం. (జాతీయ ఓటులో బీజేపీకి దక్కింది 32 శాతమే). ఆయన నిజంగానే శక్తివంతు డిగా, అర్థవంతమైన నేతగా, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందారు. తన ఈ ప్రజాదరణనే మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ, ఆ ఎన్నికల్లో తన శక్తిమేరా ఆయన కృషి చేశారు. ఎన్నికల ప్రచారం పొడవునా ఆయన ఉపయో గించిన కటువైన పదజాలం ఫలితంగా కేంద్రాన్ని పనిచేయనివ్వడంలో ప్రతిపక్షం ఎలాంటి ప్రోత్సాహాన్ని అందివ్వలేదు. ఈ విషయంలో మాత్రం సోనియాగాంధీ కుటుంబం సంవత్సరం మొత్తం మీద పేలవమైన పనితీరునే ప్రదర్శించింది. పరాభవం నుంచి కోలుకోవడానికి స్పష్టమైన వ్యూహం వారికి లేకుండాపోయింది. తాము రంగంలో ఇంకా ఉన్నా మని చూపించుకునేందుకు వారు పార్లమెంటును అడ్డుకోవడం వంటి ఎత్తు గడలను ఉపయోగించారు. ఒక ఎత్తుగడగా ఇది బాగున్నా, ప్రధాని దార్శనికతకు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించలేక ఇది అసంపూర్తిగానే మిగిలిపోయింది. బిహార్, గుజరాత్‌లలో ఆయన పార్టీ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తున్నప్పటికీ మోదీ మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నారు. వందకోట్లమందికి పైగా భారతీయులు ఆయనలో ఇంకా విశ్వాసాన్ని, ఆశను కలిగి ఉంటున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో ఉంటారని కశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత ముఫ్తీ మహమ్మద్ తేల్చి చెబుతున్నారు. ముఫ్తీ అభిప్రాయం నిజమే అయితే ప్రధానిగా 18 నెలల కాలం ఏమంత ముఖ్యమైనది కాదు. అయితే బరాక్ ఒబామా 2008లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ మాట్లాడుతూ, గతంలోని అధ్యక్షులు తీసుకొచ్చిన గొప్ప మార్పులు వారు అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే సంభవించాయని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వారు వ్యవస్థ చట్రంలో ఇరుక్కుపోయారని, ప్రతిఘటన కూడా చేయలేక, ఏ గొప్ప మార్పునైనా సరే తీసుకురాలేకపోయారని మర్దోక్ పేర్కొన్నారు. ఇది నిజమైతే, నవ్య భారత్‌ను రూపు దిద్దడానికి అసంపూర్ణమైన, చెదిరి పోయిన ఆవిష్కరణలను ప్రధాని మోదీ ప్రకటించడం కంటే తన ప్రజాదరణను, విశ్వసనీయతను ఉన్నత స్థాయిలో నిలుపుకోవడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: అకార్ పటేల్( aakar.patel@icloud.com) -
సన్మార్గ ప్రదాత... మహాప్రవక్త ముహమ్మద్ (స)
ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది. మానవజాతి సంస్కరణకు విశేష కృషి జరిపిన మహనీయుల్లో ముహమ్మద్ ప్రవక్త (స) అగ్రగణ్యులు. ఆయన మానవ సమాజాన్ని ఏదో ఒకకోణంలో మాత్రమే స్పృశించలేదు. మానవుడి పుట్టుక మొదలు మరణం వరకు జీవితంలోని సమస్త రంగాల సంస్కరణకు ఆయన ప్రయత్నించారు. ఎలాంటి అసమానతలూ, ఉచ్చనీచాలూ, భేదభావాలూ లేని ఉన్నత నైతిక, మానవీయ సమాజాన్ని ఆయన ఆవిష్కరించారు. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం నాటి అరబ్ సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కుతినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో, అలాంటి వాతావరణంలో జన్మించిన ముహమ్మద్ ప్రవక్త (స) తన ఇరవై మూడేళ్ల దైవ దౌత్యకాలంలో అంతటి ఆటవిక సమాజాన్ని అన్నివిధాలా సమూలంగా సంస్కరించారు. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి, దేవుని ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో, అన్ని విధాలా పతనమై పోయిన ఒక జాతిని కేవలం ఇరవైమూడేళ్ల కాలంలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తూ అరేబియా ద్వీపకల్పం విగ్రహారాధనను వదిలేసి, దేవుని ఏకత్వం వైపు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్ యుద్ధాలు అంతమై, జాతి సమైక్యమైంది. అవినీతి, అక్రమాలు, దోపిడి, సారాయి, జూదం, వడ్డీ, అంటరానితం, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరుకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవప్రసన్నత దుర్లభమన్న విశ్వాసం వేళ్లూనుకుంది. అన్నిరకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు, బలహీనవర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్సైక్లోపిడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు, ప్రారంభకాలపు మూలగ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హెచ్. హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులో రాసిన వందమంది మహాపురుషుల జాబితాలో ‘ముహమ్మద్’ ప్రవక్త (స)పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. థామస్ కార్లయిల్, తాను రాసిన ‘హీరోస్ అండ్ హీరో వర్షిప్’ గ్రంథంలో ముహమ్మద్ వ్రపక్తను ‘హీరో ఆఫ్ ది హీరోస్’ అని అభివర్ణించారు. అంతేకాదు, మహాత్మాగాంధీ మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స)ను గురించి తాను రాసిన ‘యంగ్ ఇండియా’లో ఇలా అన్నారు. ‘లక్షలాదిమంది మానవుల హృదయాలను నిర్ద్వంద్వంగా గెలుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకున్నాను. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, విశ్వసనీయత, వాగ్దానపాలన, మిత్రులు, సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని ధైర్యసాహసాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం అన్ని అవరోధాలనూ అధిగమించగలిగింది.’ అజ్ఞాన తిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతుల వెలుగులో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ ఆ మహనీయుని బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. వాటిని మనం ఆచరించగలిగితే నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు. - యండీ ఉస్మాన్‌ఖాన్