Ballot papers
-
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
EVMలపై వైఎస్ జగన్ కీలక ట్వీట్, ఏమన్నారంటే..
గుంటూరు, సాక్షి: ఏపీ ఎన్నికల ఆశ్చర్యకరమైన ఫలితాలపైనా ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ మరోవైపు తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలితాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ఏపీ ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఓ కీలక సందేశం ఉంచారు.‘‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. అలాగే ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తమ్మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి’’ అని అన్నారాయన.Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly. In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 20242024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్‌లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా... కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ... ఏనీథింగ్ క్యాన్ బీ హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు... దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీ-డాక్ వ్యవస్థాపకుడు శ్యామ్ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే.ఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. -
కర్నూలు ప్రెస్‌కు అరుదైన అవకాశం
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రం(రీజనల్ ప్రింటింగ్ ప్రెస్)కు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు సంబంధించిన సర్విస్ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలపై అతికించే బ్యాలెట్ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన ఇతర అన్ని రకాల పేపర్లను ఇక్కడే ముద్రిస్తున్నారు. విజయవాడలోని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ పనిచేయకపోవడంతో ఈ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల బ్యాలెట్ పేపర్లు, ఇతర పేపర్లను ముద్రించే బాధ్యతను కర్నూలు రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు. విజయవాడలో ప్రెస్ మూతబడటంతో... ప్రస్తుతం మన రాష్ట్రంలో కర్నూలు, విజయవాడలో మాత్రమే ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మె ల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల బ్యాలెట్లు, పేపర్లను ఈ ప్రెస్‌లలోనే ముద్రిస్తారు. గతంలో విజయవాడ ప్రింటింగ్ ప్రెస్‌లో కోస్తాంధ్రా, ఉత్తరాంధ్రలకు సంబంధించిన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల బ్యాలెట్ పేపర్లను ముద్రించేవారు. కర్నూలులోని ఎన్ఆర్పేటలో ఉన్న రీజనల్ ప్రింటింగ్ ప్రెస్‌లో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్, ఇతర పేపర్లను ముద్రించేవారు. అయితే, ఇటీవల విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ మూతపడటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కర్నూలులోనే ముద్రిస్తున్నారు. ఈ మేరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వా త 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు, వారి గుర్తులతో కూడిన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ముమ్మరంగా సాగుతోంది. సుమారు 150 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటలు పనిచేస్తూ సకాలంలో బ్యాలెట్లు, ఇతర పేపర్ల ముద్రణకు కృషి చేస్తున్నారు. -
సుప్రీంలో ట్రంప్‌కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్‌పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్‌పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్‌ను ఉపయోగించి ట్రంప్‌ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్‌ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్‌కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
బ్యాలెట్‌పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్‌ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్‌గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్‌ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్‌ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్‌కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్‌ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎం వాడరు!
ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు ఎన్నికల కోసం ఎన్నో సంస్కరణలు, మార్పులు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. ఇందులో ఈవీఎంల వాడకం అనేది టెక్నాలజీతో ముడిపడిన అంశం. ఎన్నికలొచ్చిన ప్రతీసారి చర్చనీయాంశంగా(రాజకీయ విమర్శలకు సైతం వేదిక) మారుతుంటుంది కూడా. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు ఈవీఎంలనే ఉపయోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి.. రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలు ఎందుకు వాడటం లేదు?. బ్యాలెట్ పేపర్ విధానంతోనే రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు జరుగుతుందసలు?.. ముందుగా ఈవీఎం టెక్నాలజీ సంగతి చూద్దాం. ఈవీఎంలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు.. దాని పక్కనే సంబంధిత బటన్ ఉంటుంది. ఓటర్లు నచ్చిన అభ్యర్థి బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే విషయాన్ని కౌంటింగ్ రోజున క్షణాల్లో చూపించేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చేసరికి... దీని పోలింగ్ విధానం అలగ్ ఉంటుంది. ఈవీఎంలు ఎంత మాత్రం సరిపోవు. ఎందుకంటే.. ఓటు వేసే వారికి కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలనే నిబంధన ఇక్కడ వర్తించదు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు తమ ఛాయిస్ ఆధారంగా ప్రిఫరెన్సియల్ ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. ప్రాధాన్యతల ఆధారంగా, వారి ఇష్టానుసారం ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటర్లు ఓటేయొచ్చు. చివరికి.. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడ్డాయనే ఆధారంగా విజేతను ప్రకటిస్తారు!. బ్యాలెట్ పేపర్లోని కాలమ్ 2 లో ఓటర్ ఇష్టాన్ని బట్టి ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. అందువల్లే రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. మరి ఈవీఎంలలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది కదా. ఈ కారణంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. -
MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత
సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్ఈసీ ఆదేశించింది. ఆ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్ బూత్‌లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్‌ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే.. ► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్ బూత్‌లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్‌లో రీపోలింగ్ నిర్వహిస్తారు. ► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశించారు. ► వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్ పరిధిలో రీపోలింగ్ జరుగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశముందని ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్‌ల్లోనూ రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్‌లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్‌లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
తుప్పల్లో, చెరువుల్లో బ్యాలెట్ పేపర్లు
బలిజిపేట (విజయనగరం): విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని నారన్నాయుడువలసలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కౌంటింగ్ సమయంలో అధికారులు డ్రామా నడిపించి శనివారం రాత్రి 11 గంటలకు టీడీపీ మద్దతు అభ్యర్థి తోముచిట్టి వెంకటరమణ 15 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. నారన్నాయుడువలస పంచాయతీలో ఉన్న 10 వార్డులకు ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల భవనాలున్నాయి. వాటిలో ఒకవైపు ఒక రూములో 3 వార్డులు, వంటగదిలో ఒక వార్డుకు, మరొకవైపు ఉండే భవనాలలో రెండు రూముల్లో 6 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అయిన తరువాత అన్ని పోలింగ్ బాక్సులను ఒకచోట చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా 4 వార్డుల పోలింగ్ బాక్సులను అక్కడే ఉంచి 5, 6, 7, 8, 9, 10 వార్డులకు చెందిన కౌంటింగ్‌ను వేరే భవనాలలో నిర్వహించారు. ఈ సమయంలో మొదటి 4 వార్డులకు చెందిన బాక్సుల వద్ద టీడీపీ మద్దతుదారులు ఓట్లు మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు తార్కాణంగా ఆదివారం ఉదయం పోలింగ్‌స్టేషన్‌కు వెనుకభాగంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు గుర్తులపై ముద్రలతో ఉండే బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పై భాగంలో ఉండే సీళ్ల తొలగింపులు చేసిన ఆధారాలు కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ సమీపంలో ఉండే చెరువులో బ్యాలెట్ పేపర్లు, రశీదులు దొరికాయి. ఆబోతుల ప్రసాదు అనే ఓటరు ఒక పర్యాయం ఓటువేసినా అతడి సంతకంతో వేరొక రశీదు రావడాన్ని చూపించారు. ఇదే విషయాన్ని ఆర్వో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా అన్ని బాక్సులు దగ్గర ఉంచి కౌంటింగ్ చేశామని, కౌంటింగ్ ఏజెంట్లకు అన్నీ తెలియజేశామన్నారు. బ్యాలెట్ పేపర్ల విషయం తెలియదని చెప్పారు. -
సర్పంచ్.. మలి పంచ్ నేడే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 29,304 కేంద్రాల్లో పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు.. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించామన్న ఎస్ఈసీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. స్థానిక ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. -
స్థానికంలోనూ 'నోటా'
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు చోటు ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలలోనూ ఇది ప్రత్యక్షం కానుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తరువాత ఈ నోటా గుర్తు ఉంటుంది. పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేయొచ్చు. ఇప్పటివరకు గత్యంతరం లేక ఎవరో ఒకరి వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు నోటా ఉండడంతో దానిని ఉపయోగించుకోవడం వల్ల తమకు ఇబ్బందేనని నాయకులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి జయాపజయాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకంటే ఎక్కువగా ♦ గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువ వచ్చాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు. నియోజకవర్గాల వారీగా నోటాకు పోలైన ఓట్లు ఇలా.. ♦ కొవ్వూరులో 2165, నిడదవోలులో 1693, ఆచంటలో 1453, పాలకొల్లులో 1170, నరసాపురంలో 1143, భీమవరంలో 1492, ఉండిలో 1885, తణుకులో 1885, ఉంగుటూరులో 2321, దెందులూరులో 2546, ఏలూరులో 1524, గోపాలపురంలో 3998, పోలవరంలో 6004, చింతలపూడిలో 3477 ఓట్లు నోటాకు పోలయ్యాయి. -
రెండు ఎంపీటీసీలకు రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎంపీటీసీ స్థానా ల్లో రీపోలింగ్ జరగనుంది. సోమవారం జరిగిన మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు కలసిపోవడంతో ఈ స్థానాల విష యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసు కుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండ లం అజీజ్‌నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అల్వాల్ ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న మూడో విడత ఎన్నికల్లో భాగంగా రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానంలో బ్యాలెట్‌పత్రాలు కలసిపోయినా, దీన్ని సకాలంలో గుర్తించడంతో సోమవారమే సరిచేసి ఎన్నికలు నిర్వహించారు. రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ఈ రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్లకు తప్పుడు బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికల నిర్వహణకు నోటి ఫికేషన్ జారీచేయాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ స్థానాల్లోని ఓటర్లకు ఈ నెల 14న నిర్వహించే రీపోలింగ్ సందర్భంగా ఎడమ చేతి నాలుగో వేలిపై సిరాచుక్క వేయాలని సూచించింది. కాగా, పరిషత్ ఎన్నికల్లో భాగంగా తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రూ.1.6 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే రూ.3.95 లక్షల నగదు, రూ.1.6 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 86 ఫిర్యాదులందాయి. మొత్తం 190 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటిపై చర్యలు చేపట్టినట్లు ఎస్ఈసీకి పోలీస్ శాఖ తెలిపింది. -
తప్పుల తడకగా బ్యాలెట్ పేపర్లు
చౌటుప్పల్/సంస్థాన్‌నారాయణపురం : మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లో ఉమ్మడి నల్లగొండజిల్లాలో పలుచోట్ల బ్యాలెట్ పేపర్లు తప్పుల తడకగా వచ్చాయి. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో 29వ పోలింగ్ బూత్‌లో అదే మండలం లోని నేలపట్ల గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. ఈ క్రమంలో 13మంది ఓటర్లు ఇవే బ్యాలెట్ పేపర్లతో ఓట్లు వేశారు. తర్వాత తప్పును కొందరు ఓటర్లు గుర్తించి అధికారులకు చెప్పడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో అధికారు లు స్పందించి బ్యాలెట్ పేపర్లను ఆ గ్రామానికి పంపించారు. అనంతరం ఆ 13 మందిని తిరిగి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని శేరిగూడెంలో 12వ పోలింగ్ కేంద్రానికి జనగామ ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇది గమనించని అధికారులు పోలింగ్ నిర్వహించారు. అప్పటికే 130 ఓట్లు పోలయ్యాయి. కంకణాలగూడెం ఎంపీటీసీ పరిధిలోని కొత్తగూడెంలో 13వ పోలింగ్ కేంద్రానికి కూడా జనగామ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఇక్కడ 6 బ్యాలెట్ పేపర్లు ఉపయోగించగా 2 బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటు వేశారు. నలుగురు ఓటర్లను ఓటు వేయకుండా అక్కడికే ఆపగా ఇద్దరు మాత్రం వాటిపైనే ఓటు వేశారు. అనంతరం ఆ ఇద్దరిని పిలిపించి సరైన బ్యాలెట్ పేప ర్లతో ఓటు వేయించారు. నల్లగొండ జిల్లా దేవరకొం డ మండల పరిధిలోని తెలుగుపల్లిలో కొన్ని బ్యాలెట్ పేపర్లలో కాంగ్రెస్ పార్టీ గుర్తు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసు కున్న అధికారులు బ్యాలెట్ పత్రాలను మార్పించడంతో సమస్య పరిష్కారమైంది. -
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న బ్యాలెట్ పేపర్
నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ–3 పరిధిలోని పోలింగ్ బూత్‌లో ఓ యువకుడు తాను ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన సంఘటన హల్చల్ చేస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను ఏ పార్టీకి ఓటు వేశాననే బ్యాలెట్ పేపర్‌ను వాట్సాప్‌లో పెట్టడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు
-
ఓటింగ్ యంత్రాలను రద్దు చేయాలని మాయవతి డిమాండ్
-
మమత చొరవ.. ఏకమైన విపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాలెట్ పేపర్ ఎన్నికల డిమాండ్ ఒక్కసారిగా పుంజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చొరవతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం హస్తినలో ఆమె పలు పార్టీల నేతలతో వరుస చర్చలు జరిపిన విషయం విదితమే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో ఆమె భేటీ అయి ఈ అంశంపై మంతనాలు సాగించారు. సుమారు 15 జాతీయ పార్టీలు.. ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లనే వాడాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీ ముందు తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, డీఎంకే, జేడీఎస్, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు శివసేన కూడా వీరికి జత కలిసినట్లు సమాచారం. (ఈవీఎంలకు వ్యతిరేకంగా ఐక్యత) ఈ మేరకు వచ్చే వారం ఆయా పార్టీ ప్రతినిధులంతా భేటీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముందు తమ డిమాండ్ ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారు. ఉత్తర ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ముందుండి చక్రం తిప్పటం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని మమతా బెనర్జీ యత్నిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. -
ఈవీఎంలకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)కు బదులు బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని, లేదంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు రసీదు వచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అవి తమ డిమాండ్‌ను సాధించేందుకు ఏకమవుతున్నాయి కూడా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం సాధించడానికి కారణం ఈవీఎంలను ట్యాంపర్ చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించడం, పాటిదార్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ దీనిపై పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల అంశం ముందుకు వచ్చింది. ఈ అంశంపై చర్చించేందుకు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకుడు జనేశ్వర్ మిశ్రా నివాసంలో జరిగిన సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మినహా అందరు హాజరు కావడం విశేషం. ఈవీఎంలకు వ్యతిరేకంగా మొట్టమొదట ఆందోళన నిర్వహించినదీ మాయావతియేనని, ఈ అంశంపై మున్ముందు జరిగే సమావేశాలకు ఆమె తప్పకుండా హాజరు అవతారని ఆమె పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరయ్యాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో దశల వారిగా ఓటుకు రసీదు వచ్చే యంత్రాలను ఉపయోగిస్తామని, అందులో భాగంగా ముందుగా ప్రతి నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ కేంద్రాల్లో వీటిని అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే అమలు చేయగలిగింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల అంశం డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినట్లయితే అన్నింటికీ ఓటు రసీదు వచ్చే పద్ధతి ఉండాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. -
719 ఓట్లు.. 727 బ్యాలెట్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం–2లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం చేపట్టి ఇంకాసేపట్లో ఫలితాలు వెల్లడిస్తారనంగా ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అర్హత లేని సభ్యులు ఓట్లు వేశారని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 719 మంది ఓటర్లు ఉండగా, 727 బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎన్నిక వివాదాస్పదమైంది. 11 మంది సభ్యులు బకాయిలు చెల్లించకపోవడంతో ఓటు వేసేందుకు వారిని అనర్హతగా గుర్తించాలని, వారి ఓట్లు ఎలా పడ్డాయంటూ ఓ వర్గం వాదనకు దిగి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా క్లబ్ చైర్మన్ పదవికి గుళ్ళపల్లి భవాని, టీ. శివరాజేంద్ర ప్యానల్స్ పోటీపడ్డాయి. -
ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లే వాడాలి
సిమ్లా: ఎన్నికల్లో ఈవీఎంల వాడటాన్ని నిషేధించాలంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ డిమాండ్ చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటాన్ని నిషేధించి, బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై వీరభద్ర సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలి జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలకు మొగ్గుచూపుతోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. -
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
బ్యాలెట్ పత్రాలు తనిఖీ చేసిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం తనిఖీ చేశారు. ఈ నెల 19న జరుగనున్న ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ 13వ తేదీన పూర్తయింది. అప్పటి నుంచి హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో వీటి పరిశీలన, తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం భన్వర్‌లాల్ వీటిని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, అడిషనల్ సీఈవో అనూప్‌సింగ్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌లు ఆయన వెంట ఉన్నారు. దాదాపు 20 టేబుళ్లను సందర్శించి భన్వర్‌లాల్ బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ఛాయాచిత్రాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కూలంకషంగా పరిశీలించాలని, ఏవిధమైన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు, అధికారులు చంద్రయ్య, శశికిరణాచారి, ప్రేమ్‌రాజ్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు, డీఆర్వోలు పాల్గొన్నారు.