
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటించామన్న ఎస్‌ఈసీ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయని ఈసీ ప్రకటించింది. బీజేపీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించింది. స్థానిక ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment