కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: వివిధ ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను గురువారం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తనిఖీ చేశారు. ముద్రణ ఎప్పటివరకు పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్, జెడ్పీ డెప్యూటీ సీఈవో సత్యవతి ఉన్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే నేరుగా తెలపండి : ఎన్నికల అధికారి ఉషారాణి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు భావిస్తే తమకు నేరుగా తెలపాలని ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వి.ఉషారాణి పేర్కొన్నారు. వి.ఉషారాణి సెల్ నంబర్ 81796 75804, సి.పార్థసారథి సెల్ నంబర్ 81790 24803 కు సమాచారం ఇవ్వొచ్చన్నారు.
29న జెడ్పీటీసీ అభ్యర్థులకు అవగాహన
జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్ అభ్యర్థులకు ఈ నెల 29న ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించనున్నట్లు రిటర్నింగ్ అధికారి విజయ్‌గోపాల్ తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు.
బ్యాలెట్ పేపర్ల ముద్రణ తనిఖీ
Published Fri, Mar 28 2014 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 7:55 PM
Advertisement
Advertisement