న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది.
అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. సు
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ
నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం
చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్‌ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది.
ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్‌కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది.
ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment