Mayor election
-
బీజేపీ దొంగిలిస్తే.. మేం తిరిగి గెలిచాం: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్‌ను చండీగఢ్ మేయర్‌గా ప్రకటించింది. సుప్రీం కోర్టు మంగళవారం వెల్లడించిన తీర్పును ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విటర్ ) వేదికగా సుప్రీం కోర్టు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇటువంటి కఠిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు’అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్షాల ‘ఇండియా ఇండియా’తొలి విజయమని అన్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నిరంకుశత్వంతో దొడ్డిదారిలో గెలుపొందాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. Thank you SC for saving democracy in these difficult times! #ChandigarhMayorPolls — Arvind Kejriwal (@ArvindKejriwal) February 20, 2024 ఎన్నికల్లో ముందు బీజేపీ దొంగమార్గంలో గెలిచింది.. కానీ మేము మళ్లీ గెలిచి మేయర్ స్థానాన్ని నిలబెట్టుకున్నాం. ఇది ఇండియా కూటమికి అతిపెద్ద విజయం. బీజేపీని ఓడించలేమనేవారు.. తెలుసుకోవాలి ఓడిస్తామని. ఇండియా కూటమి భాగస్వామ్య నేతలకు ధన్యవాదాలు. ఇది చండీగడ్ ప్రజల విజయం’అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్‌ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
Maldives: మహమ్మద్ ముయిజ్జుకు ఊహించని షాక్!
మాలె: ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా మాల్దీవులకు సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా హైలైట్ అవుతోంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు మరో షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. వివరాల ప్రకారం.. మాల్దీవుల్లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు బిగ్ షాక్ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీఎన్సీ ఘోర ఓటమి చవిచూసింది. భారత్ అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో, అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో అధికార పార్టీ ఓడిపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. Congratulations 👏👏👏@adamazim , New Mayor @MaleCitymv@MDPSecretariat @MDPmediaTeam @MDPYouth pic.twitter.com/5RNIACr3Ci — Ahmed Sarah - Thimarafushi (@SarahThimara) January 13, 2024 ఇక, మాలె మేయర్‌గా ఎండీపీకి చెందిన ఆదమ్ అజీమ్ ఎన్నికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగేంత వరకు ఆ పదవిలో ముయిజ్జు కొనసాగారు. అజీమ్ గెలుపును మాల్దీవుల మీడియా భారీ ఘన విజయంగా అభివర్ణించింది. ఎండీపీకి ప్రస్తుతం భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. కాగా, మేయర్ గెలుపు ఎండీపీకి రాజకీయంగా కలిసొస్తుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. చైనా పర్యటన అనంతరం అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పరోక్షంగా భారత్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాల్దీవులను విమర్శించే హక్కు ఏ దేశానికి లేదన్నారు. ‘మాది చిన్న దేశమే కావచ్చు. కానీ అది మీకు మమ్మల్ని అవమానించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్!
ఎన్నికలు జరిగి మూడు నెలలవుతున్నా మేయర్ సంగతి తేలక అయోమయంలో పడిన ఢిల్లీ ఓటర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మంచి కబురందించింది. ఢిల్లీ కార్పొరేషన్ తొలి సమావేశానికీ, మేయర్ ఎన్నికకూ 24 గంటల్లో ప్రకటన విడుదల చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి గనుక, పౌరుల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని నింపటం అవసరం గనుక స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. పంచాయతీల మొదలుకొని నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వరకూ ఎన్నికలు నిర్వహించేది అందుకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తావనకొచ్చే అంశాలు, వాటి అవసరాలు వేరు గనుక ఆ ఎన్నికల స్వరూపమే భిన్నంగా ఉంటుంది. కనుక రాష్ట్రాన్ని పాలించే పార్టీ కాకుండా మరో పార్టీ స్థానిక సంస్థల్లో పాగా వేయొచ్చు. దీన్ని వమ్ము చేసి, బలాబలాలను తారుమారు చేయటానికి అధికారపక్షం తమ ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ఆ సంస్థల్లో సభ్యులుగా చేర్చే ధోరణి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగింది అదే. అక్కడ మూడు పురపాలక సంస్థలనూ విలీనం చేసి ఒకే కార్పొరేషన్‌గా మార్చాక జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. పదిహేనేళ్లుగా మూడు పురపాలక సంఘాల ద్వారా ఆ నగరాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన బీజేపీ ఓటమి చవిచూసింది. 250 స్థానాలుండే కార్పొరేషన్లో ఆప్‌కు 134 వచ్చాయి. బీజేపీ బలం 104. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. బీజేపీకి మద్దతుగా 15 మంది కేంద్రమంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వీధుల్లో నెల్లాళ్లపాటు అలుపెరగకుండా ప్రచారం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటినుంచి కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ చేయనిదంటూ లేదు. మొదట ఆప్ సభ్యులను లోబరుచుకునేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నగరపాలక సంస్థ తొలి సమావేశంలోనే తమ నామినేటెడ్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించే ఎత్తుగడకు దిగింది. ఇందుకు అనుగుణంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులిచ్చారు. కానీ 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ముందు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక పూర్తయ్యాకే నామినేటెడ్ సభ్యుల ప్రమాణస్వీకారం ఉండాలి. ఈ నిబంధనలు తొలి సమావేశానికి మాత్రమే వర్తిస్తాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అప్రజాస్వామిక ఉత్తర్వులు పాటించబోమంటూ ఆప్... వాటిని తలదాల్చాల్సిందేనని బీజేపీ వాగ్యుద్ధాలకు దిగటంతో గత నెల 6న, ఆ తర్వాత 24న జరిగిన సమావేశాలు రసాభాసగా ముగిశాయి. ఫిబ్రవరి 6న సైతం ఇదే పునరావృతమైంది. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆప్ మాటే నెగ్గినట్టయింది. దేశవ్యాప్తంగా తిరుగులేని మెజారిటీ సాధించి కేంద్రంలో రెండో దఫా పరిపాలన సాగిస్తూ కూడా ఢిల్లీ కోసం అర్రులు చాచటం బీజేపీ మానుకోలేదు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండు దఫాలు అధికారం అందుకున్న ఆప్ మొన్నటి నగర పాలక ఎన్నికల్లో సైతం విజయం సాధించటం సహజంగానే బీజేపీకి కంటగింపుగా ఉంది. రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా నచ్చని ప్రభుత్వాలను నియంత్రిస్తున్నట్టే, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో ఆప్ సర్కార్‌కు చికాకులు తీసుకురావటం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగటం తరచు కనబడుతూనే ఉంది. ఢిల్లీ మహానగరంలోనే కేంద్ర ప్రభుత్వ అధికార పీఠానికి సంబంధించిన సమస్త యంత్రాంగమూ ఉంటుంది గనుక అక్కడి అసెంబ్లీ, అక్కడి నగర పాలక సంస్థ కూడా తన అధీనంలోనే ఉండాలని బీజేపీ కోరుకోవటంలో విపరీతమేమీ లేదు. ఉన్న అధికారాన్ని పదిలపరుచుకోవటానికి, దాన్ని మరింత విస్తృత పరుచుకోవటానికి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకీ హక్కుంటుంది. అయితే అదంతా నిబంధనలకు అనుగుణంగా జరగాలి. అడ్డదారుల్లో అధికారాన్ని అందుకోవాలని ఎవరూ తాపత్రయపడకూడదు. 2014 ఎన్నికల తర్వాత తనకొచ్చిన బలంతో సరిపెట్టుకోక వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చేర్చుకున్న చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్‌లో జనం ఏ గతి పట్టించారో కళ్లముందుంది. నిజానికి ఢిల్లీలో కొత్తగా నామినేట్ అయ్యే పదిమందితో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఆప్‌ను అధిగమించటం ఇప్పటికప్పుడు బీజేపీకి అసాధ్యం. అయితే ఈ చర్యవల్ల ఇద్దరి బలాబలాల్లోని వ్యత్యాసం తగ్గిపోతుంది. అనంతరకాలంలో సభ్యులను ప్రలోభపెట్టడం ద్వారా దాన్ని మరింత పెంచుకుని అధికారం దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి అన్ని పార్టీలూ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటం నేర్చుకుంటే దాదాపు మూడు నెలలపాటు ఎన్నికైన పాలకవర్గం లేకుండా ఢిల్లీ నగర పాలక సంస్థ అనాథగా మిగిలేది కాదు. అందరికీ సహజంగా తెలియాల్సిన నిబంధనల గురించి సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సిన అగత్యం ఏర్పడేది కాదు. పెండింగ్ కేసుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయటం పార్టీలకు తగునా? అన్ని పార్టీలూ ఆలోచించాలి. ఇకనుంచైనా తన విధులు తాను నిర్వర్తించే వెసులుబాటు ఢిల్లీ నగర పాలక సంస్థకు కలుగుతుందని ఆశించాలి. -
ఫిబ్రవరి 16న ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈసారైనా జరిగేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఫిబ్రవరి 16న జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం ఈ సెషన్ నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. బీజేపీ, ఆప్ కార్పొరేటర్ల మధ్య రసాబాస జరగవడం వల్ల మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఫిబ్రవరి 16న(గురువారం) అయినా ఈ ఎన్నిక జరుగుతుందో లేదో చూడాలి. మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని డిస్పెన్సేషన్ ద్వారా ఢిల్లీలోని పవర్ డిస్కమ్‌ల బోర్డులకు నియమించిన ఆప్ నేత జాస్మిన్ షాతో సహా ప్రభుత్వ నామినీలను సీనియర్ అధికారులతో భర్తీ చేశారు ఎల్జీ వీకే సక్సెనా. శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ చర్యను ఆప్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసేందుకు ఎల్జీకి ఎలాంటి అధికారాలు లేవని పేర్కొంది. చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఊహించని ట్విస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఇవాళ. ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడడం, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆప్ రగిలిపోతోంది. ఈ క్రమంలో.. నిర్ణీత సమయంలోపు ఎన్నిక నిర్వహించేలా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లకు ఓటింగ్ అర్హత లేదని.. అది చట్టవిరుద్ధమని.. కాబట్టి, వాళ్లను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించాలని పిటిషన్లో కోరింది ఆప్. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కిందటి నెలలోనే జరగ్గా.. ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వచ్చాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఎంసీడీకి కిందటి నెల(డిసెంబర్లో) ఎన్నిక జరిగింది. ఫలితాల్లో ఆప్ 134, బీజేపీ 104 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ మరీ ఘోరంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. దీంతో పదిహేనేళ్ల తర్వాత మేయర్ పీఠానికి బీజేపీ దూరమైనట్లు కనిపించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకోవడంతో మెజారిటీ ఉన్నందునా ఆప్ నుంచి షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా, ఆప్ అభ్యర్థే డిప్యూటీ మేయర్ కావడం ఖాయమని తొలుత అంతా భావించారు. అయితే బీజేపీ మాత్రం బరిలోకి దిగి పెద్ద ట్విస్టే ఇచ్చింది. జనవరి 6వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. కార్పొరేటర్ల రసాభాసతో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి.. 24వ తేదీన ఎన్నిక నిర్వహించాలని యత్నించగా మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తదుపరి తేదీకి హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం విషయంలోనూ ఆప్, బీజేపీల నడుమ పెద్ద విమర్శల పర్వమే కొనసాగింది. కార్పొరేటర్లలో సీనియర్ అయిన ముఖేష్ గోయల్ పేరును ఆప్ ప్రతిపాదించినప్పటికీ.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం బీజేపీ అభ్యర్థి సత్య శర్మను ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమించడం విశేషం. దీంతో ‘కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అయిన ఎల్జీ.. బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ’ ఆప్ మండిపింది. ఈసారి మేయర్ పదవిని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎంసీడీ పరిధిలోని మూడు డివిజన్లు.. కిందటి ఏడాది ఢిల్లీ మున్సిపల్ విభాగం పరిధిలోకి వచ్చాయి. అందుకే భారీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కీలకంగా భావిస్తున్నాయి ఇరు పార్టీలు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఏంది ఈ రచ్చ?
సాక్షి, న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ భవనం మరోసారి రణరంగాన్ని తలపించింది. మంగళవారం మేయర్ పదవి కోసం ఎన్నిక జరగాల్సి ఉండగా.. బీజేపీ-ఆప్ కౌన్సిలర్లు మరోసారి రచ్చ చేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో హౌజ్ గందరగోళంగా మారింది. ఈ తరుణంలో హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఫలితాలు వెలువడి నెల గడుస్తున్నా ఇంకా మేయర్‌ను ఎన్నుకోలేదు. జనవరి 6వ తేదీన మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆ టైంలో ‘ఎన్నికల్లో ఓడినా కూడా తమ అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టి మేయర్ పదవి దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంద’’ని ఆప్ ఆరోపించింది. ఈ మేరకు ఆప్-బీజేపీ పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళనం నెలకొని అప్పుడు ఎన్నిక వాయిదా పడింది. అయితే.. మంగళవారం ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు. మరోసారి అలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎంసీడీ భవనం వద్ద భారీ భద్రతను, హౌజ్‌లో మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. తొలుత లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన కౌన్సిలర్లతో హడావిడిగా ప్రమాణం చేయించారు ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆపై పదిహేను నిమిషాలు హౌజ్‌ను వాయిదా చేశారు. తిరిగి ప్రారంభమైన సమయంలో.. ‘మోదీ.. మోదీ’అంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు వ్యతిరేక నినాదాలతో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బీజేపీ కౌన్సిలర్లు. ఆపై నేరుగా ఆప్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్లి.. బిగ్గరగా నినాదాలు చేస్తూనే హౌజ్‌ను వాయిదా వేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను కోరారు. ఈ తరుణంలో.. ప్రతిగా ‘‘షేమ్.. షేమ్’’ నినాదాలతో హోరెత్తించారు ఆప్ కౌన్సిలర్లు. గెలుపు కోసం నామినేటెడ్ కౌన్సిలర్లను ఓటింగ్‌లో పాల్గొనేలా చూస్తున్నారంటూ బీజేపీని ఎద్దేశా చేశారు. అదే సమయంలో నామినేటెడ్ మెంబర్లు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. ఒకానొక తరుణంలో ఇరు పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో హౌజ్‌ను నడపడం కష్టమంటూ వాయిదా వేశారు ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ. #DelhiMayoralPolls | Presiding officer Satya Sharma said house proceedings cannot be conducted amid sloganeering from both AAP and BJP councillors#DelhiMayorElection pic.twitter.com/qmR2wVSbXV — Hindustan Times (@htTweets) January 24, 2023 ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఎల్జీ నామినేట్ చేసే కౌన్సిలర్లతో పాటు ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది. ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. -
Delhi Mayor: మేయర్ ఎన్నిక వాయిదా!
ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్ కౌన్సిలర్లు ప్రమాణం చేసే సమయంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి చల్లారకపోవడంతో ఎన్నిక నిర్వహణ కాసేపు వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. పది మంది నామినేటెడ్ కౌన్సిలర్లను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఎనుకున్నారు. అయితే వాళ్లను తమతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నుకున్నారంటూ ఆప్ ఆరోపించింది. శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నికకు ముందు వాళ్లు ప్రమాణం చేస్తుండగా.. ఆప్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. దీంతో ఈ రసాభాస చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఓటమిపాలైనప్పటికీ.. మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. మరోవైపు బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. మరోవైపు డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీ పడుతున్నారు. #WATCH | Delhi: Huge ruckus at Civic Centre, before the commencement of voting for the Delhi Mayor elections, regarding swearing-in of nominated councillors. pic.twitter.com/BCz3HLC9qL — ANI (@ANI) January 6, 2023 బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు ముఖేష్ గోయల్ పేరును ఆప్ ప్రతిపాదించినప్పటికీ.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం బీజేపీ అభ్యర్థినే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమించడం విశేషం. ఈ పరిణామంపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఈ ఎన్నికలను ఎల్జీ ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఎల్జీ సక్సేనాపై మండిపడ్డారు. సాధారణంగా గెలిచిన అభ్యర్థుల్లో సీనియర్ని ప్రొటెం స్పీకర్ లేదంటే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎంపిక చేస్తారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు అందరిలోకెల్లా ముకేష్ గోయల్ సీనియర్. అందుకే ఆప్ ఆయన్ని హౌజ్ ఆఫ్ లీడర్‌గా నియమించుకుంది కూడా. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది. ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్ ఓటింగ్: సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్.. ఏదైనా జరగొచ్చు! -
బీజేపీ యూటర్న్.. ఎన్నికలో ఏదైనా జరగొచ్చు!
ఢిల్లీ: బీజేపీ యూటర్న్‌తో ఢిల్లీ మున్సిపల్ మేయర్ పదవికి పోటీ తప్పడం లేదు. ఓటమిని అంగీకరిస్తూనే.. విజయం దక్కించుకున్న ఆప్ అభ్యర్థే మేయర్ పదవి దక్కించుకోబోతున్నారని, తాము పోటీలో నిలవబోమని బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా ప్రకటించిన కొద్దిరోజులకే కమలం పార్టీ గేర్ మార్చింది. ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది బీజేపీ. షాలిమార్ బాగ్ బీజేపీ కౌన్సిలర్ రేఖా గుప్తాను మేయర్ అభ్యర్థిగా, రామ్ నగర్ కౌన్సిలర్ కమల్ బాగ్ది లను డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు ప్రకటించింది బీజేపీ. అలాగే ఎంసీడీలో కీలకంగా భావించే స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ప్రకటించింది. 250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఆప్ 134, బీజేపీ 104 సీట్లు దక్కించుకున్నాయి. పదిహేనేళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీకి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం దక్కింది. దీంతో ఎన్నికల హామీ ప్రకారం మహిళా కౌన్సిలర్ షెల్లీ ఒబేరాయ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది ఆప్. అలాగే.. ఆలె మొహమ్మద్ ఇక్బాల్‌ను డిప్యూటీ మేయర్‌గా నిలబెడుతున్నట్లు తెలిపింది. మెజార్టీ స్థానాల ఆధారంగా ఆప్ అభ్యర్థుల గెలుపు దాదాపుగా ఖాయమైనప్పటికీ.. స్టాండింగ్ కమిటీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్, ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ ఎన్నికకు వర్తించకపోవడంతో ఏదైనా జరగవచ్చని ఆశిస్తోంది. ఇంతకు ముందు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని బీజేపీ ప్రకటించుకుంది. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మీడియాకు తెలిపారు కూడా. ఈ నేపథ్యంలో.. ఆప్ అభ్యర్థుల గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుని అభ్యర్థులను బరిలోకి దింపింది బీజేపీ. మేయర్ పోస్ట్ నామినేషన్లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. ఢిల్లీ మేయర్‌ను మొత్తం 250 గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు(13 ఆప్, 1 బీజేపీ) మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేయర్ ఎన్నికలో మొత్తం 274 ఓట్లు ఉంటాయి. ఇప్పటికే ఆప్‌కు 150, బీజేపీకి 113 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ 9, ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది. -
ఏపీలో కొలువుదీరిన పాలకవర్గాలు.. నెల్లూరు మేయర్‌గా పొట్లూరి స్రవంతి
సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరి గిన నెల్లూరు నగరపాలక సంస్థ, 11 ముని సిపాలిటీలు, నగర పంచాయ తీల్లో పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. దర్శి మునిసిపాలిటీ మినహా మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్ సీపీ ఆయా పదవుల్ని గెల్చుకుంది. కొండపల్లి పురపాలకసంఘ సమావేశం వాయిదాపడింది. -
కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ సుధీర్ ప్రమాణం
కృష్ణా జిల్లా ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన రంగాపురం రాఘవేంద్ర ►జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా 32 ఏళ్ల రాఘవేంద్ర. ►వైస్ చైర్మన్లుగా తుమ్మల ప్రభాకర్, షేక్ హఫీజ్ ఉన్నిస ►చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను అభినందించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. పశ్చిమగోదావరి జిల్లా ►కొలువుదీరిన ఆకివీడు నగర పాలక సంస్థ తొలి పాలక వర్గం ►తొలి నగర పంచాయతీ చైర్ పర్సన్‌గా జామి హైమావతి ఎన్నిక ►వైస్ చైర్మన్లుగా పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్నాదేవిలను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులు ►ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన జేసీ హిమాన్షు శుక్లా తూర్పు గోదావరి జిల్లా ఇవాళ ఏజెన్సీ ఎటపాక ఎంపీపీ ఎన్నిక ►టాస్ పద్ధతిలో ఎంపిక నిర్వహించనున్న అధికారులు ►మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్సీపీ, టీడీపీ 4, సీపీఎం 1, సీపీఐ ఒకస్థానం గెలుచుకున్నారు. ►వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి సమాన స్థానాలు రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు టాస్ పద్ధతిలో ఎంపీపీ ఎంపిక కృష్ణాజిల్లా ►కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా ►కేశినేని నాని కోర్డును మభ్యపెట్టి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు ►కోర్టుకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ►డివిజన్ బెంచ్ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం ►చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులను కోరాం ►మా విజ్ఞప్తి మేరకు అధికారులు ఎన్నికను వాయిదా వేశారు -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చిత్తూరు ►కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డాక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం ►వైస్ చైర్మన్‌గా అఫీస్, మునిస్వామిలు ప్రమాణం సాక్షి, అమరావతి: ఇటీవల ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ, 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. అకివీడు (పశ్చిమ గోదావరి జిల్లా), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం), బుచ్చిరెడ్డిపాలెం (నెల్లూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (వైఎస్సార్), పెనుకొండ (అనంతపురం), కుప్పం (చిత్తూరు జిల్లా) మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికైన సభ్యులు ఎక్కడికక్కడ ఉదయం 11 గంటలకు సమావేశమై చైర్మన్, ఇద్దరు వంతున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. -
మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు గురువారం కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అదేవిధంగా 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. అందుకోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఇలా.. ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మునిసిపల్ కౌన్సిలర్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 50 శాతం సభ్యుల హాజరును కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క పోస్టుకే నేడు ఎన్నికలు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఈ లోగా ఒక్కొక్క మేయర్, ఒక్కొక్క వైస్ చైర్పర్సన్ నియామకానికి గురువారం ఎన్నిక నిర్వహిస్తారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభించింన తరువాత మరో డిప్యూటీ మేయర్, మరో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరమే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
సర్వత్రా ఉత్కంఠ.. సీల్డ్ కవర్లో సీక్రెట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎంపికపై అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అఫీషియో సభ్యుల సాయంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పార్టీ ఖాతాలో చేరనుండటంతో మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తి నెలకొంది. మేయర్ అభ్యర్థి పేరును సీల్డ్ కవర్లో పంపిస్తామని స్వయంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. సుమారు అరడజను కార్పొరేటర్ల పేర్లు మేయర్ పదవికి తెరమీదకు వస్తున్నా గ్రేటర్ పరిధిలోని మంత్రులకు కూడా ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని వారి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తెరమీదకు వస్తున్న పేర్లు ఇవే.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్), మోతె శ్రీలత (తార్నాక), సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్) పేర్లు ప్రధానంగా తెరమీదకు వస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. వీరితో పాటు చింతల విజయశాంతికి ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ మేయర్ అభ్యర్థిని బుధవారం రాత్రి ఖరారు చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీ మహిళలకు ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి అల్లాపూర్ డివిజన్ నుంచి ఎన్నికైన రెహనా బేగంకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి గురువారం ఉదయం తెలంగాణ భవన్లో అల్పా హారం తర్వాత కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని మంత్రులు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో తరలి వెళ్తారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాతే పార్టీ అధినేత కేసీఆర్ సీల్డ్ కవర్లో సూచించిన మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశ ముందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు కీలకం కావడంతో మేయర్ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి అసంతృప్తి బయట పడకుండా ఉండేందుకు నాయ కత్వం చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఆశావహుల ఇళ్ల వద్ద హడావుడి సీల్డ్ కవర్ ద్వారా మేయర్ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ఔత్సాహిక అభ్యర్థుల ఇళ్ల వద్ద బుధవారం సాయంత్రం నుంచే హడావుడి నెలకొంది. మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, విజయారెడ్డి, మన్నె కవిత అనుచరులు కూడా తమ కార్పొరేటర్లకు అవకాశముందంటూ హడావుడి చేస్తుండ టంతో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే పార్టీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను గురువారం ఉదయం 8.30కు పార్టీ రాష్ట్ర కార్యా లయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉదయం 9 గంట లకు జరిగే ప్రత్యేక భేటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుతో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొంటారు. చదవండి: (గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్) -
గ్రేటర్ పీఠం: డిప్యూటీ కూడా మహిళకే?
సాక్షి, హైదరాబాద్ : మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సమయం ముంచుకొస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీనుంచే ఇద్దరూ గెలిచే అవకాశం సుస్పష్టంగానే ఉంది. కానీ, ఎంఐఎం వైఖరి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ వీటిపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎప్పటిలాగే టీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందం పాటిస్తుందా..? అంటే అవుననే వినిపిస్తోంది. లేకపోతే ఎన్నికలకు సంబంధించిన స్పెషల్ మీటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది. 11వ తేదీన ఉదయం కొత్త కార్పొరేటర్ల ప్రమాణం ముగిశాక, 12.30 గంటలకు ఎన్నికల కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఎన్నిక కోసం నిర్వహించే స్పెషల్ మీటింగ్‌కు కోరం తప్పనిసరి. జీహెచ్ఎంసీలో అన్ని పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు 193 మంది ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది అంటే 97 మంది ఉంటేనే ఎన్నికల స్పెషల్మీటింగ్ జరుగుతుంది. ఏ పార్టీతో సంబంధం లేకుండా కేవలం టీఆర్ఎస్ సభ్యులే హాజరైతే మీటింగ్ జరిగే అవకాశం లేదు. టీఆర్ఎస్ బలం 88 మంది. అంటే ఇతర పార్టీల నుంచి కనీసం 9 మంది సభ్యులైనా హాజరు కావాలి. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు హాజరైనా సరిపోరు. కాబట్టి కచ్చితంగా ఎంఐఎం నుంచో, బీజేపీ నుంచో కొందరు సభ్యులైనా హాజరు కావాల్సిందే. పోటీలో ఆ పార్టీల అభ్యర్థులున్నా, లేకున్నా ఎంఐఎం లేదా బీజేపీల నుంచి హాజరు ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. లేకుంటే మలిరోజుకు వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరగాలంటే ఎంఐఎం హాజరవుతుంది. ఓటింగ్ బహిరంగంగా చేతులెత్తడం ద్వారా జరగనున్నందున టీఆర్ఎస్కు మద్దతిస్తున్నారనుకోకుండా ఉండేందుకు ఎంఐఎం సభ్యులు పోటీలోని అభ్యర్థులెవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ గెలవలేమని తెలిసినా..టీఆర్ఎస్ను గెలిపించాలి..తమ మద్దతు ఉన్నట్లు ప్రచారానికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటే, తమ నుంచి కూడా మేయర్, డిప్యూటీ మేయర్లకు అభ్యర్థులను నిలిపి తమ వారికి ఓట్లు వేసుకోవచ్చు. అలా జరిగినా అది టీఆర్ఎస్కే లాభిస్తుంది. ఎంఐఎం హాజరైనా, కాకున్నా బీజేపీ తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి. తమ పార్టీ తరపున పోటీలో అభ్యర్థులను ఉంచితే తమవారికి ఓట్లు వేసుకుంటారు. లేని పక్షంలో బీజేపీ హాజరు కాకపోయినా కోరం ఉంటుంది. ఎన్నిక జరుగుతుంది. ఏం జరిగినా రచ్చ చేసేందుకు బీజేపీకి అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎటొచ్చీ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఉన్నా ఏం జరగనుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి ఈసారి డిప్యూటీ మేయర్‌గా మహిళకు అవకాశం దక్కవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోమారు బాబాఫసియుద్దీన్‌కు అవకాశమున్నప్పటికీ, ఈసారి మహిళకు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకనుగుణంగా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ..అల్లాపూర్ నుంచి గెలిచిన సబీహా బేగంకు అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్‌కు రిజర్వేషన్ లేనప్పటికీ, మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే తలంపుతో సబీహా బేగంకు అవకాశం లభించవచ్చునని చెబుతున్నారు. -
గ్రేటర్ మేయర్: వాకౌటా.. గైర్హాజరా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజర్ కావడమా అనే అంశాలపై చర్చించనుంది. మజ్లిస్ సంఖ్యాబలం 54.. బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్ఎస్ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. దూరం పాటించడమే.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మేయర్ పదవికి ఎవరి బలం ఎంత?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కార్పొరేటర్లు, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు రాష్ట్రంలోని ఇతర స్థానిక సంస్థల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి, వివిధ కోటాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఓటర్లే. అలాంటి వారిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఫరీదుద్దీన్, గోరటి వెంకన్న తదితరులెందరో ఉన్నారు. వారంతా ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా, ఎక్కడి ప్రజలకు సేవలందిస్తున్నా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు జాబితాలో పేరుండటంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హులేనని అధికారులు పేర్కొన్నారు. ఇదే తరుణంలో గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కొందరు మాత్రం ప్రస్తుత మేయర్ ఎన్నికకు ఓటర్లుగా లేరు. ఎందుకంటే వారు ఇప్పటికే ఇతర మునిసిపాలిటీ/కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడ అర్హత లేకుండా పోయింది. పదవీకాలంలో ఎక్కడైనా ఒక్కచోట మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు అవకాశముంటుంది. అలా గ్రేటర్ పరిధిలోనే ఉన్నప్పటికీ, ఓటు వేసే అవకాశం లేని వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులున్నారు. ఇలా ఎవరెవరికి ఇక్కడ ఓటు హక్కు ఉంది? ఉన్నవారిలో ఇతర ప్రాంతాల్లో వినియోగించుకున్నదెవరు..? వంటి వివరాలు, తాజా సమాచారంతో కసరత్తు పూర్తిచేసిన సంబంధిత అధికారులు ఉన్నతస్థాయిలోని అధికారులకు వివరాలు అందజేశారు. తాజా సమాచారం మేరకు, అధికార టీఆర్ఎస్ పార్టీకి నామినేటెడ్లతో సహా 32 మంది సభ్యుల ఎక్స్‌అఫీషియోల బలం ఉంది. రెండు రోజుల ముందు ఇది 33గా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం, ఇతరత్రా కారణాలు పరిశీలించాక 32గా ఉన్నట్లు తెలిసింది. ఎటొచ్చీ.. మేయర్ ఎన్నిక జరపాలంటే నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశానికి అవసరమైన కోరం మాత్రం 97గానే ఉంది. తీరా ఎన్నిక తేదీ నాటికి ఏవైనా మార్పుచేర్పులు జరిగితే తప్ప ఇదే కోరం ఖరారు కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ఓటర్లయిన కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల్లో సగం మంది హాజరు తప్పనిసరి. జీహెచ్ఎంసీలోని 150 కార్పొరేటర్లలో లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మరణించడంతో 149 మంది ఉన్నారు. వీరు, ఎక్స్అఫీషియో సభ్యులు 44 మంది కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 193. ఇందులో కనీసం సగం మంది అంటే 97 మంది ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచే గెలిచినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి వేరే చోట ఓటు వినియోగించుకోవడంతో ఇక్కడి మేయర్ ఎన్నికలో ఓటు లేదు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గతంలో శివారు మునిసిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు వినియోగించుకున్నప్పటికీ, తిరిగి ఎన్నికయ్యాక వినియోగించుకోకపోవడంతో ఆయనకు ఇక్కడ ఓటు హక్కు ఉందని అధికారులు తెలిపారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇతర మునిసిపాలిటీలో ఓటు వినియోగించుకున్నందున ఇక్కడ ఓటు వేయడం కుదరదు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఇప్పటి వరకు ఎక్కడా ఎక్స్అఫీషియో ఓటు వేయలేదని, గ్రేటర్లో ఓటరుగా ఉన్నందున అర్హురాలేనని సమాచారం. ఇలా.. ఎవరెవరు ఓటర్లుగా ఉన్నారో తేల్చుకోవడమే అధికారులకు పెద్దపనిగా మారింది. ఎట్టకేలకు ఈ కసరత్తు పూర్తిచేసి మొత్తం ఓటుహక్కున్న ఎక్స్‌అఫీషియోలు 44 మంది ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎక్స్అఫీషియోల్లో భూపాల్‌రెడ్డి, సతీష్‌కుమార్, మహమూద్‌అలీ, ఎంఎస్ ప్రభాకర్‌రావు, లక్ష్మీనారాయణ, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, నవీన్‌కుమార్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, టి.పద్మారావు, జి.సాయన్న, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆరెకపూడి గాంధీ తదితరులున్నట్లు సమాచారం. -
క్యాంపులు నిర్వహించొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి, ఎన్నికైన ప్రతినిధులతో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి క్యాంపులు(శిబిరాలు) నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) స్పష్టం చేసింది. లంచం లేదా ప్రలోభాలకు గురిచేయొద్దని, రాజకీయ పార్టీలు, మేయర్ / డిప్యూటీ మేయర్ వంటి పదవులను ఆశిస్తున్న వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమపద్ధతులు పాటించడం, ప్రోత్సహించడం చేయొద్దని పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం, భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లలోని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ ప్రారంభసమయానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం లేదా ప్రచార కార్యకలాపాలు చేపట్టవద్దని, ఈ నిషేధం ఈ ఎన్నికలు పూర్తయ్యేవరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని ఎస్ఈసీ జారీ చేసింది. ప్రభావితం చేయొద్దు..: రాజకీయపార్టీలు జారీ చేసిన విప్‌లకు వ్యతిరేకంగా ఓటు చేసే విధంగా ఎన్నికైన సభ్యులను ప్రభావితం చేయవద్దని ఎస్ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థుల్లో ఎవరైనాగానీ పరోక్ష ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటుహక్కులను వినియోగించే సందర్భంలో వారిని ప్రలోభపరచడానికి ప్రయత్నించొద్దని తెలిపింది. ఏదైనా రాజకీయపార్టీ, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ పడుతున్నవారు ఓటర్లు, వారి ఓటింగ్ హక్కులను వినియోగించుకునే సందర్భంలో పార్టీ విప్‌ను ధిక్కరించేందుకుగాను ప్రోత్సాహకంగా వారికి ఎలాంటి పదవిని ఇవ్వజూపొద్దని పేర్కొంది. అధికార పార్టీ లేదా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు సర్టిఫికెట్లు, లైసె న్సులు, కాంట్రాక్టు పనులు, పెండింగ్ కేసులను ఎత్తివేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, కాంట్రాక్టుల పునరుద్ధరణ, ఇతర ప్రోత్సాహకాలు, ఇతర పద్ధతుల్లో దుర్వినియోగానికి ప్రయత్నిం చొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులపై విచారణ సం స్థల ద్వారా కేసుల నమోదు లేదా చార్జి షీట్ల దాఖలు/రూపకల్పన, అరెస్టులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వంటి వాటి అమలులో పక్షపాతానికి పాల్పడవద్దని పేర్కొంది. -
వరంగల్ మేయర్.. ఎవరికివారే!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీలో కొత్త రాజకీయానికి తెరతీస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంలో కీలక పదవి విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మెజారిటీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయులకు కాకుండా, కొత్తగా వచ్చినవారికి ఈ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నివేదించాలని వారు భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్‌గా ఉన్న నన్నపునేని నరేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నన్నపునేని నరేందర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 27వ తేదీన మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ దగ్గరపడుతుండటంతో ఎవరికి వారు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమావేశం వరంగల్ మేయర్ ఎంపిక కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 2016 మార్చిలో ఎన్నికలు జరిగాయి. బీజేపీ 1, సీపీఎం 1, కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 44 డివిజన్లలో విజయం సాధించాయి. స్వతంత్రులు ఎనిమిది మంది గెలిచారు. స్వతంత్రులందరూ టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ మేయర్ పదవిని జనరల్ కేటగిరికి కేటాయించినా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్‌కు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ టీఆర్ఎస్లో, టీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్ ఎంబాడి రవీందర్ కాంగ్రెస్‌లో చేరగా ప్రస్తుతం టీఆర్ఎస్కు 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ పదవి అధికార పార్టీకి దక్కడం లాంఛనమే. ప్రస్తుతం మేయర్ పదవిని ఓసీ వర్గానికి ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. గుండా ప్రకాశ్‌రావు, బోయినపల్లి రంజిత్‌రావు, వద్దిరాజు గణేశ్, గుండు ఆశ్రితారెడ్డి, నాగమళ్ల ఝాన్సీలలో ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందో మరి. ముగ్గురి అభిప్రాయాలు కీలకం గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా, వర్ధన్నపేట సగం సెగ్మెంట్ ఉంటాయి. మేయర్ ఎన్నిక విషయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఈ ముగ్గురితో పాటు మరో కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎక్కువమంది కార్పొరేట ర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరం గల్ ఎన్నికలు 2016లో జరిగాయి. ఝాన్సీ టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అప్పట్లో మేయర్ ఎన్నిక ముగిసిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి కాకుండా టీఆర్ఎస్ తరఫున గెలిచినవారిలోనే ఒకరికి మేయర్‌గా అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ కార్పొరేటర్లు అధిష్టానాన్ని కోరుతున్నారు. -
ఎన్నికల బరిలో రెజ్లింగ్ సూపర్‌స్టార్
వాషింగ్టన్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ సూపర్ స్టార్ కేన్ త్వరలో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున టెన్నెస్సె రాష్ట్రంలోని నాక్స్ కౌంటీ పట్టణ మేయర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మంగళవారం రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో 51 ఏళ్ల కేన్ గెలుపొందారు. కేన్ అసలు పేరు గ్లెన్ జాకోబ్స్. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి యాజమాని అయిన జాకోబ్స్.. రెజ్లింగ్ స్టార్‌గా విపరీతమైన ఆదరణ పొందారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రాథమిక పోటీల్లో కేవలం 17 ఓట్ల తేడాతో జాకోబ్స్ గెలుపొందారు. ‘బహుశా రెజ్లింగ్ స్టార్ అయినందుకే నాకు ఓట్లేసి ఉంటారేమో’ అని ఫలితాల అనంతరం కేన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ పాలనపై జాకోబ్స్ ప్రశంసలు కురిపించాడు. ఆగష్టులో జరగబోయే మేయర్ ఎన్నికల్లో డెమొక్రట్ అభ్యర్థి లిండా హనే పై ఆయన పోటీ చేయబోతున్నారు. కేన్ తరపున మరో స్టార్ రెజ్లర్ అండర్ టేకర్ కూడా ప్రచారంలో పాల్గొనటం విశేషం. Thanks to everyone who helped win this historic victory!! The people who cast a ballot for me, my great team, my wonderful volunteers. Looking forward to VICTORY in the general election! — Glenn Jacobs (@GlennJacobsTN) 2 May 2018 -
నేడే చిత్తూరు మేయర్ ఎన్నిక
⇒మేయర్ స్థానానికి కటారి హేమలత నామినేషన్ ⇒కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన టీడీపీ ⇒పరోక్ష పద్ధతిలో మేయర్ ఎంపిక చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ స్థానానికి శనివారం ఎన్నిక జరగనుంది. దివంగత మేయర్ అనురాధ చనిపోయినప్పటి నుంచి మేయర్ స్థానం ఖాళీగా ఉంది. ఇన్చార్జ్ మేయర్‌గా సుబ్రమణ్యం కొనసాగుతున్నారు. దీంతో అనురాధ కోడలు కటారి హేమలత పేరును మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు కటారి హేమలతను మేయర్‌గా ఎన్నుకోవాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక, మేయర్‌గా హేమలత ఎన్నిక లాంఛనీయమే! కోర్టు తీర్పుతో... చిత్తూరు నగర తొలి మహిళా మేయర్ అఅయిన కటారి అనురాధ 2015 నవంబరు 17న తన భర్త మోహన్‌తో పాటు మున్సిపల్ కార్యాలయంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డెప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రమణ్యం ఇన్చార్జ్ మేయర్‌గా కొనసాగుతున్నారు. అయితే బీసీ–మహిళకు రిజర్వు చేసిన మేయర్ సీటులో పురుషుడు పాలన సాగించడంపై పలువురు కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏప్రిల్ 15లోపు బీసీ–మహిళను మేయర్‌గా ఎన్నుకోవా లని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా అనురాధ కుటుంబానికే మేయర్ పదవిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కటారి హేమలత 33వ డివిజన్ కార్పొరేటర్‌గా నామినేషన్ దాఖలు చేశా రు. మామూలుగా ఎవరైనా ప్రజాప్రతి నిధి చనిపోతే ఆ స్థానంలో వారి కుటుంబసభ్యులు బరిలో నిలిస్తే పోటీకి నిలపరాదనే నియమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాటించింది. అభ్యర్థిని బరిలో దింపకుండా ఏకగ్రీవం అయ్యేలా హుందాగా వ్యవహరించింది. దీంతో హేమలత గంగనపల్లె నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ స్థానానికి బీసీ–మహిళా విభాగం నుంచి పోటీ చేస్తున్నట్లు హేమలత నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందచేశారు. కోరం తప్పనిసరి.. మేయర్‌ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవా ల్సి ఉంది. చిత్తూరు నగరంలోని 50 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 34 మం ది ఉన్నారు. మేయర్ ఎన్నికలో పార్టీ కార్పొరేటర్లంతా హాజరు కావాలని, హేమలతను మేయర్‌ను ఎన్నుకోవాలని టీడీపీ విప్ జారీ చేసింది. 26 మంది కార్పొరేటర్లు తప్పనిసరిగా హాజరైతేనే కోరం ఏర్పడుతుంది. లేకపోతే మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజూ కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే కార్పొరేటర్లందరికీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. కాగా ఈ ఎన్నిక మొత్తం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. మేయర్ ఎన్నిక కార్యక్రమంపై కమిషనర్ బాలసుబ్రమణ్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మేయర్ పీఠం ఏ వర్గానికి?
కర్నూలు కార్పొరేషన్‌పై ఆసక్తికర చర్చ బీసీలకు దక్కకుండా చేసేందుకు కుట్ర ఉమ్మడి రాష్ట్రంలోని నిర్ణయంపై పునః సమీక్ష జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ మార్పునకు కసరత్తు బీసీలను ఊరించిన కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం అందని ద్రాక్షగా మారుతోందా? రాజకీయ విశ్లేషకుల నుంచి ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తవచ్చని.. పైగా కార్పొరేషన్ జనాభా పెరగడం, మూడు మండలాల విలీనం దృష్ట్యా మేయర్ పీఠం రిజర్వేషన్ విషయంపై ప్రభుత్వం పునః సమీక్షించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు : కర్నూలు మున్సిపాలిటీ 1994లో 38 వార్డులతో కార్పొరేషన్‌గా ఏర్పాటయింది. 2002లో మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరును కార్పొరేషన్లో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 50కి చేరుకుంది. 2014లో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను కర్నూలు కార్పొరేషన్లో కలపడంతో అదనంగా ఒక వార్డు వచ్చి చేరింది. 2001, 2005 సంవత్సరాల్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించినా.. 2010 సెప్టెంబర్ పాలక వర్గం గడువు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు సుమారు ఆరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలలు నిర్వహించగా.. కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక మాత్రం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత అడ్డంకులు తొలగిపోయినా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. ఈ విషయమై ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ పెడచెవిన పెట్టడంతో తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని.. లేదంటే తామే తేదీలను ప్రకటిస్తామని అక్షింతలు వేయడంతో దిగొచ్చిన ప్రభుత్వం సెప్టెంబర్ వరకు గడువు కోరింది. ఫలితంగా కార్పొరేషన్లో ఎన్నికల హడావుడి మొదలయింది. మారుతున్న సమీకరణాలు కార్పొరేషన్లో మొత్తం 51 వార్డులు ఉండగా.. రానున్న ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ దృష్ట్యా 26 మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. 2014లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీ జనరల్ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత విలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడం.. తదనంతర పరిణామాలతో తాజాగా మళ్లీ కార్పొరేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా గణన, రిజర్వేషన్ల ప్రక్రియ జరగాల్సి ఉంది. అలాగే జిల్లాలో తాజాగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇది వరకు మేయర్ గిరికి కేటాయించిన రిజర్వేషన్లలోనూ మార్పులు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పవర్ సెంటర్ ఉండకూడదనే.. వాస్తవానికి గతంలో 1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఈ విడత మేయర్ పదవిని బీసీ మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారయింది. అయితే బీసీలకు పీఠం దక్కితే ఇప్పటికే పవర్ సెంటర్‌గా ఉన్న ఆ వర్గం నేత ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే ఆలోచన తెరపైకి వచ్చినట్లు సమాచారం. తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు.. మేయర్ పదవి రిజర్వేషన్లలో మార్పులు తీసుకురావడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా మేయర్ పదవి ఓసీ జనరల్‌కు దక్కేలా పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. -
‘మేయర్’ ఎన్నిక ఏర్పాట్లు చకచకా..
కౌన్సిల్ హాలు ముస్తాబు తొలుత కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఎక్స్‌అఫీషియోలకు విప్ లేదు... సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం, మేయర్ ఎన్నిక గురువారం జరుగనుండటంతో ఆ కార్యక్రమాల వేదిక అయిన జీహెచ్ఎంసీలోని కౌన్సిల్ హాల్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గత పాలకమండలి సర్వసభ్యసమావేశాలన్నీ ఈ కౌన్సిల్హాల్లోనే జరిగాయి. గతంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు జూబ్లీహాల్లో జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆ ఎన్నికలు సైతం జీహెచ్ఎంసీ కౌన్సిల్హాల్లోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలో పాల్గొనే 217 మంది ఓటర్లకు సరిపడా కుర్చీలు అందుబాటులో ఉంచడంతోపాటు వాటికి నగిషీలు చెక్కుతున్నారు. అవసరమైన చోట రంగులు వేస్తున్నారు. కౌన్సిల్ సభ్యులందరికీ ప్రిసైడింగ్ అధికారి, తదితరుల మాటలు స్పష్టంగా వినపడేందుకు, కార్పొరేటర్ల ప్రమాణ కార్యక్రం.. ఎన్నికయ్యాక మేయర్, డిప్యూటీమేయర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సవ్యంగా సాగేందుకు మైకులు, లైట్లు, ఏసీలు తదితరమైనవి సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. సభాధ్యక్షస్థానంలో మేయర్ కుర్చీని ఘనంగా తీర్చిదిద్దారు. పైఅంతస్తులోని విలేకరుల గ్యాలరీ, తదితర ప్రదేశాల్లోనూ లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీవీల ద్వారా ప్రత్యక్షప్రసారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం పన్వర్‌హాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్ అఫీషియోలకు విప్ లేదు.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తూ గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అధికారం ఉన్నా అది ఎక్స్అఫీషియో సభ్యులకు వర్తించదు. కేవలం ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) కె.సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటర్లయిన కార్పొరేటర్లతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం వారి పార్టీలు జారీ చేసే విప్‌లు వర్తిస్తాయని ఇప్పటి వరకు భావించారు. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పటికీ, జీహెచ్ఎంసీ రికార్డుల మేరకు వారు టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విప్ అంశం ప్రస్తావనకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలచే ఎన్నికైన కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న టీఆర్ఎస్ బలం సోమవారం వరకు ఎక్స్‌అఫీషియోలతో కలుపుకొని మేయర్‌ను ఎన్నుకునేందుకు టీఆర్ఎస్కున్న బలం 133 కాగా, తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో ఆ బలం 134కు పెరిగింది. ఆమేరకు టీడీపీ బలం తగ్గింది. టీఆర్ఎస్కు తమ అభ్యర్థిని మేయర్‌గా గెలిపించుకునేందుకు స్పష్టమైన మెజారిటీ బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ, ఆపార్టీలో చేరుతున్నవారితో ఇది మరింత పెరుగుతోంది. -
సెటిలర్కు డిప్యూటీ మేయర్?
11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణం ♦ అదేరోజు గ్రేటర్ మేయర్, డిప్యూటీల ఎన్నిక ♦ ఎక్స్‌అఫీషియోలతో సహా ఓటర్లు 217 మంది ♦ కోరం సంఖ్య 109 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్పొరేటర్లలో నుంచి ఒకరిని మేయర్‌గా ఎన్నుకోనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. కొత్త మేయర్ ఎవరు కానున్నారనే చర్చలు ఓవైపు సాగుతుండగానే, డిప్యూటీ మేయర్ ఎవరవుతారన్నది సైతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో రెండు పదవులూ వారికే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని సెటిలర్స్‌కు ఇవ్వాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్నవారంతా తమ బిడ్డలేనని సీఎం కేసీఆర్ ప్రకటించడమే కాక, తెలంగాణేతరులకు సైతం కార్పొరేటర్లుగా టిక్కెట్లివ్వగా, గెలిచిన వారు కూడా గణనీయంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ పదవిని వారికివ్వాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్‌హాల్‌కు మరమ్మతులు చేస్తున్నారు. మేయర్, కార్పొరేటర్లకు కొత్త కుర్చీలను సిద్ధం చేస్తున్నారు. గత పాలకమండలిలో మేయర్ ఎన్నికను జూబ్లీహాల్లో నిర్వహించగా, ఈసారి కౌన్సిల్హాల్లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ ఎన్నికకు ఓటర్లయిన 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులకు ఇప్పటికే సమాచారం పంపారు. మేయర్ ఎన్నిక సందర్భంగా ఎక్స్అఫీషియో సభ్యులకు మొదటి వరుసలో, కార్పొరేటర్లకు పార్టీల బలాలను బట్టి ముందు వరుసల్లో బారికేడ్లతో సహా కుర్చీలు ఏర్పాటు చేస్తారు. ఈ ఎన్నికకు విప్ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) కె.సురేంద్రమోహన్ తెలిపారు. మేయర్ పదవికి ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను వీడియో తీయడంతోపాటు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కోరం సంఖ్య 109..: కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యు లకు ( మొత్తం 217 మందికి) మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటుహక్కు ఉంది. ఇందులో కనీసం 50%.. అంటే 109 మంది హాజరు ఉంటే కోరం ఉన్నట్లు లెక్క. కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే గంటసేపు వేచిచూసి, మర్నాటికి వాయిదా వేస్తారు. మర్నాడూ ఇదే ప్రక్రియ ఉంటుంది. ఆ రోజూ కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదించి, దాని ఆదేశాల మేరకు చర్యలు చేపడతారు.