ఎన్నికల బరిలో రెజ్లింగ్‌ సూపర్‌స్టార్‌ | Kane Aka Glenn Jacobs in Knox County Mayor Race | Sakshi
Sakshi News home page

May 3 2018 2:01 PM | Updated on May 3 2018 2:04 PM

Kane Aka Glenn Jacobs in Knox County Mayor Race - Sakshi

గ్లెన్‌ జాకోబ్స్‌ .. కేన్‌(రింగ్‌ నేమ్‌)

వాషింగ్టన్‌: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ సూపర్‌ స్టార్‌ కేన్‌ త్వరలో ఎన్నికల బరిలో దిగబోతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరపున టెన్నెస్సె రాష్ట్రంలోని నాక్స్‌ కౌంటీ పట్టణ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మంగళవారం రిపబ్లికన్‌ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో 51 ఏళ్ల కేన్‌ గెలుపొందారు. కేన్‌ అసలు పేరు గ్లెన్‌ జాకోబ్స్‌. ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి యాజమాని అయిన జాకోబ్స్‌.. రెజ్లింగ్‌  స్టార్‌గా విపరీతమైన ఆదరణ పొందారు. ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రాథమిక పోటీల్లో కేవలం 17 ఓట్ల తేడాతో జాకోబ్స్‌ గెలుపొందారు. ‘బహుశా రెజ్లింగ్‌ స్టార్‌ అయినందుకే నాకు ఓట్లేసి ఉంటారేమో’ అని ఫలితాల అనంతరం కేన్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ పాలనపై జాకోబ్స్‌ ప్రశంసలు కురిపించాడు. ఆగష్టులో జరగబోయే మేయర్‌ ఎన్నికల్లో డెమొక్రట్‌ అభ్యర్థి లిండా హనే పై ఆయన పోటీ చేయబోతున్నారు. కేన్‌ తరపున మరో స్టార్‌ రెజ్లర్‌ అండర్‌ టేకర్‌ కూడా ప్రచారంలో పాల్గొనటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement