న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఫిబ్రవరి 16న జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం ఈ సెషన్ నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు.
బీజేపీ, ఆప్ కార్పొరేటర్ల మధ్య రసాబాస జరగవడం వల్ల మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఫిబ్రవరి 16న(గురువారం) అయినా ఈ ఎన్నిక జరుగుతుందో లేదో చూడాలి.
మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని డిస్పెన్సేషన్ ద్వారా ఢిల్లీలోని పవర్ డిస్కమ్‌ల బోర్డులకు నియమించిన ఆప్ నేత జాస్మిన్ షాతో సహా ప్రభుత్వ నామినీలను సీనియర్ అధికారులతో భర్తీ చేశారు ఎల్‌జీ వీకే సక్సెనా. శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
గవర్నర్ చర్యను ఆప్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసేందుకు ఎల్‌జీకి ఎలాంటి అధికారాలు లేవని పేర్కొంది.
చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment