delhi muncipal corporation
-
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవ్నర్పై సుప్రీం ఆగ్రహం.. ‘అంత తొందరెందుకు?’
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలోని చివరి స్థానానికి(18వ ) కోసం ఎన్నిక జరిపించేందుకు ఎందుకు అంత తొందర అని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే.. దీనికి సంబంధించిన ఛైర్మన్ ఎన్నికునే ప్రక్రియపై కూడా స్టే విధించింది. నియమావళిని స్పష్టంగా ఉల్లంఘిస్తూ ఎన్నికలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం వెనుక న్యాయపరమైన ఆధారం ఏంటని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది."నామినేషన్ సమస్య కూడా ఉంది... మేయర్ (అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్) అధ్యక్షత వహించారు. మీకు (ఎల్జీ) అధికారం ఎక్కడ లభిస్తుంది?" అని కోర్టు ప్రశ్నించింది. ‘నామినేషన్ అంశం కూడా ఉంది. దానిని పర్యవేక్షించేందుకు అక్కడ మేయర్(ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్) ఉన్నారు. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా జోక్యం చేసుకొంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. దీనిలో కూడా రాజకీయాలా?’ అని న్యాయమూర్తులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నిలదీశారు. అయితే ఇతర రాష్ట్రాల గవర్నర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు విచారిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.అనంతరం బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్‌ను కమిటీలోకి ఎన్నుకోవడంపై మేయర్ షెల్లీ ఓబ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎల్జీని సుప్రీంకోర్టు ఆదేశించింది.మరోవైపు ఆప్ తరపున అభిషేక్ సింఘ్వీ మను దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ స్పందిస్తూ..ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని.. రెండు వారాల తర్వాత చూడాలని సూచించింది, -
స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
న్యూఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా డిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో జరిగిన దాడి, మున్సిపల్ కార్పొరేషన్‌కు దళిత మేయర్‌ను నియమించాలనే డిమాండ్లతో ఆందోళనకు దిగారు. దీంతో సమావేశాలను మరుసటి రోజుకు మేయర్ వాయిదా వేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పందించారు. ‘బీజేపీ కార్పొరేటర్లు సమావేశాలను జరగనివ్వలేదు. బీజేపీ కార్పొరేటర్లు సభలో గందరగోళం సృష్టించారు. సంవత్సరంన్నర నుంచి స్టాండింగ్ కమిటీ వేయకుండా అడ్డుకున్నది బీజేపీ కార్పొరేటర్లే’అని మేయర్ తెలిపారు. -
ఇక్కడి ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి! ముందే చేయించుకుంటే ఆఫర్..
దేశ రాజధాని నగరం ఢిల్లీ దేశంలోని అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటి. స్థానికులకే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మందికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ముందే చేయించుకుంటే రాయితీ ఎంసీడీ పరిధిలోని ఆస్తులకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఆస్తి పన్నుల పూర్తి, కచ్చితమైన సమాచారం లభిస్తుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. మేరకు అన్ని ప్రాపర్టీలకు జియోట్యాగింగ్ తప్పినిసరి అని వాటి యజమానులకు స్పష్టం చేసింది. అంతేకాకుండా 2024 జనవరి 31 లోపు జియోట్యాగింగ్ చేయించుకున్న వారికి ఆస్తిపన్నుపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రాపర్టీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఇంత పెద్ద ప్రకటన చేసే ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరినీ సంప్రదించుకుండా, యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్‌ను వీడుతున్నట్లు చెప్పారు. Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV — ANI (@ANI) February 24, 2023 స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్‌కు మొబెైల్ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
ఫిబ్రవరి 16న ఢిల్లీ మేయర్ ఎన్నిక.. ఈసారైనా జరిగేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఫిబ్రవరి 16న జరగనుంది. మేయర్ ఎన్నిక కోసం ఈ సెషన్ నిర్వహించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. బీజేపీ, ఆప్ కార్పొరేటర్ల మధ్య రసాబాస జరగవడం వల్ల మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఫిబ్రవరి 16న(గురువారం) అయినా ఈ ఎన్నిక జరుగుతుందో లేదో చూడాలి. మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని డిస్పెన్సేషన్ ద్వారా ఢిల్లీలోని పవర్ డిస్కమ్‌ల బోర్డులకు నియమించిన ఆప్ నేత జాస్మిన్ షాతో సహా ప్రభుత్వ నామినీలను సీనియర్ అధికారులతో భర్తీ చేశారు ఎల్జీ వీకే సక్సెనా. శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ చర్యను ఆప్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసేందుకు ఎల్జీకి ఎలాంటి అధికారాలు లేవని పేర్కొంది. చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
బీజేపీ యూటర్న్.. ఎన్నికలో ఏదైనా జరగొచ్చు!
ఢిల్లీ: బీజేపీ యూటర్న్‌తో ఢిల్లీ మున్సిపల్ మేయర్ పదవికి పోటీ తప్పడం లేదు. ఓటమిని అంగీకరిస్తూనే.. విజయం దక్కించుకున్న ఆప్ అభ్యర్థే మేయర్ పదవి దక్కించుకోబోతున్నారని, తాము పోటీలో నిలవబోమని బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా ప్రకటించిన కొద్దిరోజులకే కమలం పార్టీ గేర్ మార్చింది. ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది బీజేపీ. షాలిమార్ బాగ్ బీజేపీ కౌన్సిలర్ రేఖా గుప్తాను మేయర్ అభ్యర్థిగా, రామ్ నగర్ కౌన్సిలర్ కమల్ బాగ్ది లను డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు ప్రకటించింది బీజేపీ. అలాగే ఎంసీడీలో కీలకంగా భావించే స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ప్రకటించింది. 250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఆప్ 134, బీజేపీ 104 సీట్లు దక్కించుకున్నాయి. పదిహేనేళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీకి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం దక్కింది. దీంతో ఎన్నికల హామీ ప్రకారం మహిళా కౌన్సిలర్ షెల్లీ ఒబేరాయ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది ఆప్. అలాగే.. ఆలె మొహమ్మద్ ఇక్బాల్‌ను డిప్యూటీ మేయర్‌గా నిలబెడుతున్నట్లు తెలిపింది. మెజార్టీ స్థానాల ఆధారంగా ఆప్ అభ్యర్థుల గెలుపు దాదాపుగా ఖాయమైనప్పటికీ.. స్టాండింగ్ కమిటీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్, ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ ఎన్నికకు వర్తించకపోవడంతో ఏదైనా జరగవచ్చని ఆశిస్తోంది. ఇంతకు ముందు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని బీజేపీ ప్రకటించుకుంది. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మీడియాకు తెలిపారు కూడా. ఈ నేపథ్యంలో.. ఆప్ అభ్యర్థుల గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుని అభ్యర్థులను బరిలోకి దింపింది బీజేపీ. మేయర్ పోస్ట్ నామినేషన్లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. ఢిల్లీ మేయర్‌ను మొత్తం 250 గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు(13 ఆప్, 1 బీజేపీ) మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేయర్ ఎన్నికలో మొత్తం 274 ఓట్లు ఉంటాయి. ఇప్పటికే ఆప్‌కు 150, బీజేపీకి 113 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ 9, ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది. -
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసిన ఆప్
-
రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్ సస్పెండ్
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) పరిధిలోని వసంత కుంజ్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్ మనోజ్ మెహ్లవత్ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడటంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. మనోజ్ మెహ్లవత్ను సస్పెండ్ చేసిన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేష్ గుప్తా ఆయన్ను సస్పెండ్ చేసిన విషయాన్ని శంకర్ కపూర్ వెల్లడించారు. ఇది తమ పార్టీ పారదర్శకతకు నిదర్శమని ఆయన తెలిపారు. కాగా, ఇంటి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతివ్వడానికి కౌన్సిలర్ మనోజ్ లంచం తీసుకున్నట్లు సీబీఐ విచారణలో తేలింది. దాంతో మనోజ్‌ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. -
అక్కడ రూ.10కే లంచ్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లకు లభిస్తున్న ఆదరణతో తాజాగా దేశ రాజధానిలో బీజేపీ పాలిత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు పది రూపాయాలకే లంచ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సోమవారం సబ్సిడీ లంచ్ పథకానికి శ్రీకారం చుట్టాయి. ఓఖ్లా మండి, మటియలా చౌక్, గ్రీన్‌పార్క్, రఘువీర్ నగర్, కక్రౌలా మోర్, నజఫ్‌గర్, షాలిమార్ బాగ్‌లో ఆరు కేంద్రాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రతి వార్డులోనూ ఒక సబ్సిడీ లంచ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లు ప్రకటించాయి. మధ్యాహ్న భోజన కిచెన్లు నిర్వహిస్తున్న ఎన్జీవోలు ఈ కియోస్క్‌ల బాధ్యతను చేపట్టాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచివుంచే ఈ కేందాల్రో నాలుగు పూరీలు, 150 గ్రాముల కూర, పప్పుతో 250 గ్రాముల రైస్ అందిస్తారు. రోజూ 500 నుంచి 700 ప్లేట్లు అందుబాటులో ఉంచుతామని గ్రీన్‌పార్క్ వద్ద ఏర్పాటైన అటల్ కేంద్రంను నిర్వహిస్తున్న ఓ సెల్ఫ్‌హెల్ప్ సంస్థ ప్రతినిధి గాడ్ఫ్రే పెరిరా చెప్పారు. మరోవైపు అటల్ ఆహార్ కేంద్ర ప్రారంభం కావడంతో ఎన్నికల హామీల్లో ముఖ్యమైన వాగ్ధానం నెరవేరడం పట్ల సంతోషంగా ఉందని సౌత్ ఢిల్లీ మేయర్ కమల్జీత్ షెరావత్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
70 ఏళ్ల నాటి భవనం కూల్చివేత కేసును కొట్టేసిన కోర్టు
న్యూఢిల్లీ : 70 ఏళ్ల నాటి తన ఆస్తిని ధ్వంసం చేసినందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నష్టపరిహారం కోరుతూ ఢిల్లీకి చెందిన రఘుబిర్ సరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేశారు. అతిపురాతనమైవి, ప్రమాదపు అంచుల్లో ఉన్న కట్టడాలను చట్టపరంగా కూల్చివేసి రక్షణ కల్పించడం ఎమ్సీడీ బాధత్యని అడిషినల్ జిల్లా జడ్జి జస్టిస్ కమినీ లౌ చెప్పారు. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఉత్తర ఢిల్లీకి చెందిన రఘుబీర్ సరన్‌కు చెందిన 1947 సంవత్సరం నాటి పాత భవనంలో కొంత భాగాన్ని 2007లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చి వేసింది. దీంతో భవనం యజమాని తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గోడ కూలకముందే ఎమ్సీడీ కూల్చేసిందని పిటిషనర్ వ్యాఖ్యానించారు. దీనికి కోర్టు స్పందిస్తూ గోడ కూలిపోయి ప్రమాదం జరిగేంత వరకు ఎవరూ వేచి ఉండరని.. ఎమ్సీడీ తన చట్టబద్ధమైన బాధ్యతను నిర్వర్తించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ గోడ దానంతట అదే కూలిపోతే అప్పుడు ఎవరికీ హాని జరగదన్న భరోసా ఏంటని ప్రశ్నించింది. -
త్వరలో సెంట్రల్ ఢిల్లీ అంతా వైఫై ప్రాంతం
-
దత్తతకు ప్రభుత్వ పాఠశాలలు
న్యూఢిల్లీ: కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) ఓ బృహత్తర పథకానికి రూపకల్పన చేస్తోంది. కార్పొరేషన్ పాఠశాలలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు పాఠశాలలకు దత్తత ఇవ్వాలని యోచిస్తోంది. ప్రతిపాదన దశలో ఉన్న పథకానికి ఇప్పటికే మంచి స్పందన కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కొన్ని సంస్థలు ఈ విషయమై తమను సంప్రదించాయని, కార్పొరేషన్ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబర్చాయన్నారు. ‘ఈ పథకం ద్వారా కార్పొరేషన్ పాఠశాలల్లో విద్యానాణ్యత పెరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వహించడం వీలుపడుతుంది. దత్తత తీసుకున్న సంస్థలు పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతను తీసుకుంటాయి. కార్పొరేషన్ తరఫు నుంచి పుస్తకాలు, భోజనం వంటి కనీస వసతులు సమకూరుస్తాం. అయితే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా రూపొందించలేద’ని ఎస్‌డీఎంసీలో బీజేపీ కౌన్సిలర్, ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ తెలిపారు. నగరంలోని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఈ విషయంలో తమవంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం పంపాయని సతీశ్ తెలిపారు. ముంబైలోని పలు సంస్థలు ఇప్పటికే ఇటువంటి పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకొని, నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే ఢిల్లీలో మాత్రం తొలిసారిగా ఈ పథకాన్ని ఎస్డీఎంసీ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇదిలా ఉండగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 588 పాఠశాలలు ఉండగా అందులో యాభై శాతం పాఠశాలలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండి, విద్యానాణ్యత తక్కువగా ఉన్న పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో వెయ్యిమంది విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు ఉండగా అందులో కేవలం 100-150 మంది విద్యార్థులే ఉంటున్నారని, దీంతో వెచ్చించిన సొమ్ము వృథా అవుతోందని, వందశాతం వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దత్తత పథకానికి రూపకల్పన చేశామన్నారు. కార్పొరేషన్‌కు చెందిన పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్న పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, అటువంటి పాఠశాలలు దత్తత పథకానికి ఎంపికైతే ఆ టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేస్తామని, తద్వారా మిగతా పాఠశాలల్లో కూడా విద్యానాణ్యత పెరిగే అవకాశముంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.