
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లకు లభిస్తున్న ఆదరణతో తాజాగా దేశ రాజధానిలో బీజేపీ పాలిత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు పది రూపాయాలకే లంచ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సోమవారం సబ్సిడీ లంచ్ పథకానికి శ్రీకారం చుట్టాయి.
ఓఖ్లా మండి, మటియలా చౌక్, గ్రీన్‌పార్క్, రఘువీర్ నగర్, కక్రౌలా మోర్, నజఫ్‌గర్, షాలిమార్ బాగ్‌లో ఆరు కేంద్రాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రతి వార్డులోనూ ఒక సబ్సిడీ లంచ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లు ప్రకటించాయి. మధ్యాహ్న భోజన కిచెన్‌లు నిర్వహిస్తున్న ఎన్‌జీవోలు ఈ కియోస్క్‌ల బాధ్యతను చేపట్టాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచివుంచే ఈ కేందాల్రో నాలుగు పూరీలు, 150 గ్రాముల కూర, పప్పుతో 250 గ్రాముల రైస్ అందిస్తారు.
రోజూ 500 నుంచి 700 ప్లేట్లు అందుబాటులో ఉంచుతామని గ్రీన్‌పార్క్ వద్ద ఏర్పాటైన అటల్ కేంద్రంను నిర్వహిస్తున్న ఓ సెల్ఫ్‌హెల్ప్ సంస్థ ప్రతినిధి గాడ్‌ఫ్రే పెరిరా చెప్పారు. మరోవైపు అటల్ ఆహార్ కేంద్ర ప్రారంభం కావడంతో ఎన్నికల హామీల్లో ముఖ్యమైన వాగ్ధానం నెరవేరడం పట్ల సంతోషంగా ఉందని సౌత్ ఢిల్లీ మేయర్ కమల్జీత్ షెరావత్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment