జనరల్‌గా డిన్నర్ లైట్‌గా తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. హీరోయిన్ ఇమాన్వీ కూడా ఇంచు మించు ఇదే టైప్. అయితే గురువారం డిన్నర్‌ని మాత్రం లైట్‌గా కాకుండా ఓ పట్టు పట్టారు. మరి... కళ్ల ముందు పదికి పైగా నోరూరించే వంటకాలు కనిపిస్తే లాగించకుండా ఉంటారా! అది కూడా హీరో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలాయె. ఆ విషయంలోకి వస్తే... ప్రభాస్ సరసన ఓ కథానాయికగా ఇమాన్వీ నటిస్తున్న ‘ఫౌజీ’ (పరిశీలనలో ఉన్న టైటిల్ అని సమాచారం) చిత్రం తాజా షెడ్యూల్ రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆరంభమైంది.
ముందు ఇమాన్వీ ΄పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రభాస్ కూడా ΄పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి గురువారం డిన్నర్‌కి తన ఇంటి నుంచి భోజనం తెప్పించారు. అవి ఆరగించి, ఆ వంటకాల వీడియో షేర్ చేసి, ‘‘ఈ యమ్మీ యమ్మీ... మంచితనానికి థ్యాంక్యూ ప్రభాస్’’ అని పేర్కొన్నారు ఇమాన్వీ. ఇక హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment