lunch
-
సామాన్యుడి ఇంట్లో సన్న బియ్యం అన్నం తిన్న సీఎం
-
యమ్మీ... యమ్మీ...
జనరల్‌గా డిన్నర్ లైట్‌గా తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. హీరోయిన్ ఇమాన్వీ కూడా ఇంచు మించు ఇదే టైప్. అయితే గురువారం డిన్నర్‌ని మాత్రం లైట్‌గా కాకుండా ఓ పట్టు పట్టారు. మరి... కళ్ల ముందు పదికి పైగా నోరూరించే వంటకాలు కనిపిస్తే లాగించకుండా ఉంటారా! అది కూడా హీరో ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలాయె. ఆ విషయంలోకి వస్తే... ప్రభాస్ సరసన ఓ కథానాయికగా ఇమాన్వీ నటిస్తున్న ‘ఫౌజీ’ (పరిశీలనలో ఉన్న టైటిల్ అని సమాచారం) చిత్రం తాజా షెడ్యూల్ రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆరంభమైంది.ముందు ఇమాన్వీ ΄పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రభాస్ కూడా ΄పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీకి గురువారం డిన్నర్‌కి తన ఇంటి నుంచి భోజనం తెప్పించారు. అవి ఆరగించి, ఆ వంటకాల వీడియో షేర్ చేసి, ‘‘ఈ యమ్మీ యమ్మీ... మంచితనానికి థ్యాంక్యూ ప్రభాస్’’ అని పేర్కొన్నారు ఇమాన్వీ. ఇక హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోందని సమాచారం. -
భోజనం ఎలా ఉందమ్మా?
బీబీనగర్:బోజనం ఎలా ఉందమ్మా? కొత్త మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా? సదుపాయాలు బాగున్నాయా?..’అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులను ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ వెళుతూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. తొలుత బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. కొత్త మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. భోజనం, కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, కిరాణా సరుకులు, బియ్యం తదితర వంట సామాన్లను పరిశీలించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. హెల్త్చెకప్ కార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని ఆయన చెప్పడంతో, హెల్త్ చెకప్ కార్డులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్లో డిప్యూటీ సీఎం గంటన్నర పాటు ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక భారం ఉన్నా డైట్ చార్జీలు పెంచాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.పెంచిన చార్జీలు, మెనూ ప్రకారం హాస్టళ్లలో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గంధాధర్, వీరారెడ్డి ఆయన వెంట ఉన్నారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భట్టి గీసుకొండ: భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కీర్తినగర్, మొగిలిచర్ల, విశ్వనాథపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన నిర్వాకానికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ వేసిన కేటీఆర్ న్యాయవాదులు
-
బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్ తన నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మోదీకి అందించిన లంచ్ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్ సూప్ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పీస్ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్ చేశారు. Quiche, Truffle at the Istana Nurual Iman 🙏🌸🙏 pic.twitter.com/noCRlMJKCn— India in Brunei (@HCIBrunei) September 4, 2024అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్ కలర్, గోల్డ్ డిజైన్‌తో ఉన్న ప్లేట్లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.Official Luncheon by His Majesty in honour of Prime Minister Shri Narendra Modi Ji in Brunei Darussalam 🇮🇳 🇧🇳 🙏@narendramodi @PMOIndia @borneo_bulletin @MediaPermata pic.twitter.com/A0o6UwX5zf— India in Brunei (@HCIBrunei) September 4, 2024 (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!
మలేషియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అన్వర్బిన్కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ భారతీయ మలయ్ వంటకాల తోపాటు మిల్లెట్లను హైలెట్ చేసేలా గ్రాండ్ లంచ్‌ను ఏర్పాటు చేశారు. మెనూలో ఏం ఉన్నాయంటే..మెనూలో భారతీయ, ఆగ్నేయాసియా రుచులను అందంగా మిళితం చేసేలా విభిన్న వంటకాలను అందించింది. ఇందులో నూడుల్స్, కూరగాయలు, స్పైసి వంటకాలు, కొబ్బరితో చేసినవి ఉన్నాయి. ఇక తీపి, కారంతో మిళితం చేసే పెర్ల్ మఖానీ వొంటన్, పెర్ల్ మిల్లెట్, కాటేజ్ చీజ్ తదితరాలు ఉన్నాయి. అలాగే మిక్స్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌తో తయారు చేసినన సలాడ్, రుచికరమైన కబాబ్‌లకు రిఫ్రెష్ బ్యాలెన్స్‌లో ఉల్లిపాయలు, బెంగాలీ పంచ్ ఫోరాన్ మసాలాలు, జీలకర్రతో వండిన బ్రెజ్డ్, బటన్ మష్రూమ్‌లు ఉన్నాయి. ఇవికాక మిల్లెట్కి సంబంధించి రాగి, బచ్చలి, జీడిపప్పతో చేసిన కుడుములు, బంగాళదుంప జీడిపప్పుతో చేసిన మిల్లెట్ కుడుము విత్ బచ్చలి కూర గ్రేవీ, గుజరాతీ ఖట్టి మీథీ దాల్, పులిహోర తదితరాలతో మలేషియా ప్రధానికి గొప్ప విందును ఏర్పాటు చేశారు మోదీ. కాగా, 2023 అధికారికంగా మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినప్పటి నుంచి అంతర్జాతీయ ఆదరణ లభించేలా మెల్లెట్స్తో ఎలాంటి వైవిధ్యమైన వంటకాలు చేయొచ్చు తెలిపేలా భారతీయ వంటకాలతో చాటి చెబుతోంది. (చదవండి: బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!) -
'గోరుముద్ద'కు తాజ్ రుచులు
సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ మరింత రుచిగా మారనుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషకాలతో అందించాలన్న లక్ష్యంతో వంటల తయారీలో మరిన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల (జూన్) 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టింది. ప్రస్తుతం అందిస్తున్న మెనూనే మరింత రుచితో పాటు పోషకాలతో అందించేందుకు తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌ల సహకారం తీసుకుంది. రోజుకో మెనూ అందిస్తున్నందున అదే భోజనాన్ని ఇక ప్రత్యేకంగా ఎలా తయారుచెయ్యొచ్చో తెలిపేలా ఆరు వీడియోలను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. వీటిని మధ్యాహ్న భోజనం వండుతున్న సుమారు 85 వేల మంది సిబ్బందికి చూపించి అవగాహన కల్పి0చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా వీడియోల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట ఎలా చేయాలో తాజ్ చెఫ్‌లు వివరించడమే కాకుండా వాటి ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేస్తారు. గోరుముద్ద యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలను మధ్యాహ్న భోజనం అందించే రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 85 వేల మంది వంటవారు వారి స్మార్ట్ఫోన్లలో చూస్తారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఉన్నత పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)పైన, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల్లోను పాఠశాల సమయం ముగిశాక సిబ్బందికి చూపిస్తారు. పిల్లల ఆరోగ్యం కోసం మెనూ రూపకల్పన.. నిజానికి.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో బాధ్యతలు చేపట్టాక పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అప్పటికే నిర్విర్యమైపోయిన ప్రభుత్వ పాఠశాల విద్యపై పలు సంస్కరణలు అమలుచేశారు. అప్పటివరకు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నీళ్ల సాంబారు, ముద్దయిపోయిన అన్నం పెడుతుండడంతో 40 శాతం మంది పిల్లలు కూడా ఆ భోజనాన్ని తినకపోవడాన్ని గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రే స్వయంగా రోజుకో మెనూ చొప్పున ‘జగనన్న గోరుముద్ద’ను రూపొందించారు. వంటపై మూడంచెల పర్యవేక్షణ ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేశారు. రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రోజు ఏ మెనూ ఎలా ఉందో పరిశీలించేందుకు.. వంటలో నాణ్యతను చూసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీ యాప్‌ను రూపొందించి, మండల స్థాయి నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, ముఖ్య కార్యదర్శి వరకు ఆ వివరాలు తెలిసేలా చర్యలు తీసుకున్నారు.దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 90 శాతానికి పెరిగింది. మిగిలిన 10 శాతం మంది (ముఖ్యంగా బాలికలు) ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి బాక్సులను తెచ్చుకుంటున్నారు. జగనన్న ‘గోరుముద్ద’తో పరిపూర్ణత.. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫో ర్టి ఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం పెడుతున్నారు. రోజుకో మెనూ చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు 16 రకాల పదార్థాలను గోరుముద్దలో చేర్చారు. ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడ్రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి చేశారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల లేదా విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించేందుకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. మధ్యాహ్న భోజనం 100 శాతం తినేలా మార్పులు.. ప్రస్తుతం రాష్ట్రంలోని 36,612 పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. మరో 5,012 పాఠశాలల్లో 95–99 శాతం మంది తింటుండగా, 885 పాఠశాలల్లో 90–95 శాతం మధ్య, 439 పాఠశాలల్లో 85–90 శాతం మధ్య, 353 పాఠశాలల్లో 80–85 శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు. 522 పాఠశాలల్లో 50–80 శాతం, 60 పాఠశాలల్లో 30–50 శాతం మధ్య ఉండగా, 236 పాఠశాలల్లో మాత్రమే 30 శాతంలోపు తీసుకుంటున్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోను 100 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడికి వచ్చిన ప్రతి విద్యార్థీ బడిలో అందించే మధ్యాహ్న భోజనం తినేలా రుచిగా, వంటలో పిల్లల ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌లతో వంటలపై రూపొందించిన వీడియోల ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. గోరుముద్ద మెనూ ఇదీ.. » సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ » మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు » బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ » గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు » శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ » శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
లంచ్ విత్ మోదీ!
న్యూఢిల్లీ: సమయం మధ్యాహ్నం 2.30 గంటలు. పార్లమెంట్లో వాడీవేడి చర్చలతో అలసి మధ్యాహ్నం భోజనానికి సిద్ధమవుతున్న పలువురు విపక్ష ఎంపీలకు హఠాత్తుగా పిలుపు వచి్చంది. ప్రధాని మోదీ కలవాలనుకుంటున్నారని దాని సారాంశం. అంతా లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా పార్లమెంట్ క్యాంటిన్ వద్ద దిగి విజిటర్స్ లాంజ్‌లో వేచి చూస్తున్నారు. ‘‘పదండి. మీకో శిక్ష విధిస్తాను’ అని చమత్కరిస్తూ వారందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు. 45 నిమిషాలపాటు కబుర్లు చెప్పుకున్నారు. వారిలో బీజేపీ ఎంపీలతో పాటు విపక్ష సభ్యులు కె.రామ్మోహన్ నాయుడు (టీడీపీ), సస్మిత్ పాత్రా (బీజేడీ), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), రితేశ్ పాండే (బీఎస్పీ) ఉన్నారు. నిద్ర ఎప్పుడు లేస్తారు? ఆహార అలవాట్లు మొదలుకుని అంతర్జాతీయ వ్యవహారాలదాకా అన్ని అంశాలు అక్కడ చర్చకొచ్చాయి. రోజూ ఎన్నింటికి నిద్ర లేస్తారు బిజీ షెడ్యూల్‌ను ఎలా అలసిపోకుండా నిర్వహిస్తారు వంటి ఎంపీల ప్రశ్నలకు మోదీ సరదాగా సమాధానాలిచ్చారు. ‘‘నేనెప్పుడూ ప్రధానిని అన్న మూడ్‌లో ఉండను. మంచి ఆహారం తినాలనే మూడ్‌లోనూ ఉంటాను’’ అని చమత్కరించారు. కిచిడీ తన ఫేవరెట్ ఫుడ్ అని చెప్పారు. ఒకే రోజులో వేర్వేరు రాష్ట్రాల పర్యటనలు, విదేశీ ప్రయాణాలు, గుజరాత్ గురించి పట్టింపుల వంటివెన్నో విషయాలు చర్చకొచ్చాయని ఒక ఎంపీ వెల్లడించారు. ప్రాణహాని ఉందంటూ ఎస్పీజీ హెచ్చరించినా 2015లో పాకిస్థాన్‌కు వెళ్లి నాటి పీఎం నవాజ్ షరీఫ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో మోదీ వివరించారు. అందరూ అన్నం, పప్పు, కిచిడీ తిన్నాక రాగి లడ్డూ రుచిచూశారు. తామంతా కూర్చున్నది మోదీతోనేనా అనే అనుమానం ఒక్కసారిగా కల్గిందని ఒక ఎంపీ చెప్పారు. ‘‘ ప్రధానితో కలిసి భోజనం చేయడం అరుదైన అనుభవం. మేం చకచక ప్రశ్నలు అడుగుతుంటే ఆయన టకటక సమాధానాలిస్తున్నారు’’ అని మరో ఎంపీ చెప్పారు. ఇదీ చదవండి.. తాతకు భారతరత్న.. మనవడు ఎన్డీఏ కూటమిలో చేరిక -
తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం
నాడు నీళ్ల సాంబారు, ముద్ద అన్నం పప్పుకు, రసానికి తేడానే ఉండదు పేరుకే ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ సరుకులకు డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం సరుకులు ఎవరెవరో ఇళ్లకు ఎత్తుకుపోయే పరిస్థితి వంట వాళ్లనూ పట్టించుకోని వైనం ఎవరికీ పట్టని భోజనం నాణ్యత వంటశాల లేక స్కూలంతా పొగ సగటున 50 శాతం మంది విద్యార్థులకే భోజనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం కోసం ఎండలో క్యూలైన్లో వేచిఉన్న విద్యార్థులు నేడు రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం సగటున 90% మంది విద్యార్థులకు భోజనం భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్లైన్లో పక్కాగా రికార్డు 43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ 2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్ ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు విద్యార్థులకు తరగతి గది పక్కన వరండాల్లో భోజనం పెడుతున్న దృశ్యం -
KTR : కొత్త ఏడాదిలో జీహెచ్ఎంసీ కార్మికులతో భోజనం చేసిన కేటీఆర్ (ఫొటోలు)
-
తోడొకరుండిన అదే భాగ్యము!
తోడుండటమే పండు జీవితం. ఏడడుగులతో పడే బంధం. ఏడు జన్మలు కొనసాగాలనుకునే బంధం వైవాహిక బంధం. భార్యకు భర్త.. భర్తకు భార్య.. సంసారాన్ని ఈదాక ఏడు పదుల వయసు దాటాక ఒకరికి ఒకరై మరీ మెలగాలి. తమిళనాడులోని ఒక వృద్ధ జంట మధ్యాహ్న భోజనం తయారు చేసుకునే వీడియో పది లక్షల వ్యూస్ పొందింది. రోజులు కొందరికి కలిసి వస్తాయి. పెళ్లయిన నాటి నుంచే భార్య మనసు భర్తకు అర్థమయ్యి, భర్త స్వభావాలు భార్య అకళింపు చేసుకుని కాపురాన్ని కాపాడుకుంటూ వస్తారు. పిల్లల్ని కని, పెద్ద చేసి ఒక దారికి చేరుస్తారు. ఆ తర్వాత? తామిద్దరూ జీవించాలి. ఏం భయం? ఇప్పటికే ఎంతో జీవితం గడిపారు. కష్టసుఖాలు పంచుకున్నారు. అనుబంధాన్ని దృఢం చేసుకున్నారు. పిల్లలు దూరంగా ఉన్నా హాయిగా జీవిస్తారు. అతను కూరగాయలు తెస్తాడు. ఆమె వంట చేస్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్లి వస్తారు. గుళ్లకు తిరుగుతారు. ఓపికుంటే పర్యటనలు చేస్తారు. నేనున్నానని.. నీకై నిలిచే.. తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము అని రాశాడు శ్రీశ్రీ. తమిళనాడులో ఒక జంట అలాంటిదే. మధ్యతరగతికి చెందిన ఈ జంట ముదిమి వయసులో కలిసి మధ్యాహ్న వంట చేసుకుంటున్న వీడియోను అభిషేక్ చందరమరక్షణ్ అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశాడు. తన భార్యతో కలిసి వీడియోలు చేసే అభిషేక్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ ‘భవిష్యత్తులో నువ్వూ నేనూ’ అనే క్యాప్షన్ పెట్టాడు. నిజమే.. ఈ వీడియో చూసిన యువ జంటలు ఆ వయసులో తాము అలా ఉంటే ఎంత బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. జీవితం పండాలి... అని పెద్దలు అంటారు. పండు వయసులో భార్యకు భర్త; భర్తకు భార్య. (చదవండి: అయ్బాబోయ్... ఇదేం డాన్సండీ!) -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
టిఫినీలు చేసి.. చదివేసి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు అవసరమైన పౌష్టికాహారం అందించడం, బడిపై పిల్లల్లో ఆసక్తి పెంచడం లక్ష్యంగా శుక్రవారం నుంచి ప్రారంభమైన ‘ముఖ్యమంత్రి ఉపాహార పథకం’పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా.. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ ఉపాహార పథకం మ రింత దోహదపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. బడి మానేసే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే పిల్లలకు కావాల్సిన ఆహారం విషయమై తామిక ఎలాంటి హడావుడి పడాల్సిన అవసరం ఉండదని తల్లిదండ్రులు అంటున్నారు. రోజుకో రకం అల్పాహారం అందిస్తుండటంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, క్రమం తప్పకుండా బడికి రావడం వల్ల చదువుల్లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యం, ప్రమాణాల పెంపే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి ఉపాహారం పథకం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజవర్గాల్లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో 1–10 తరగతులు చదివే విద్యార్థులు 23,05,801 మంది ఉన్నారు. వీళ్ళంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే. రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళూ ఎక్కువ మందే ఉన్నారు. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో సైతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే హడావుడిగా తమ పనులకు వెళ్ళడం వల్ల స్కూలుకెళ్లే పిల్లలను పట్టించుకోవడం కష్టంగానే ఉంటోంది. చాలామంది పిల్లలు ఉదయం పూట ఆహారం తీసుకోకుండానే స్కూలుకు వెళ్ళాల్సి వస్తోంది. మధ్యాహ్నం భోజనం అందిస్తున్నా ఈలోగా తరగతి గదిలో నీరసపడిపోతున్న ఘటనలూ ఉంటున్నాయి. మరోవైపు సరైన పౌష్టికాహార లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్ర విద్యా, ఆరోగ్యశాఖలు జరిపిన సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో ఎక్కువ మందిని పౌష్టికాహార లోపం వెంటాడుతోందని తేలింది. దీనివల్ల రక్తహీనత, దృష్టి లోపం ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఉపాహారం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పదో తరగతికి చేరే నాటికే బడి మానేస్తున్న వారి శాతం 13.9గా ఉంటోంది. పేదరికం, సరైన ఆహారం అందే పరిస్థితి లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఉపాహారం అందుబాటులోకి తేవడం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం సార్.. బ్రేక్‌ఫాస్ట్ సూపర్ ఈ రోజు మా స్కూల్లో ఇచ్చిన ఇడ్లీ, పూరీ, కిచిడీ, చట్నీ, సాంబార్ చాలా బాగున్నాయి. ఆరు రోజుల పాటు రకరకాల బ్రేక్ ఫాస్ట్ ఇస్తారట. మా కోసం మంచి పథకం తీసుకొచ్చి న సీఎం సార్‌కు కృతజ్ఞతలు. – హైమావతి, ఏడో తరగతి, రావిర్యాల ప్రభుత్వ పాఠశాల (రంగారెడ్డి జిల్లా) ఇంట్లో సమస్య తీరిపోతుంది ఉదయం పిల్లలు తినీతినకుండానే హడావుడిగా బడికి వెళ్తారు. ఇప్పుడు ప్రభు త్వం ఉపాహారం అందిస్తుండటంతో ఆ సమస్య తీరిపోతుంది. ఇంట్లో తినకుండా మారం చేసేవాళ్లు కూడా అక్కడే బుద్ధిగా తింటారు. మధ్యాహ్న భోజన పథకం మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నిరంతరం కొనసాగించాలి. – గుడిమల్ల రాజేష్, విద్యార్థి తండ్రి, భూపాలపల్లి ఈ పథకం ఎంతో ఉపయోగకరం మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులు అధిక శాతం పని చేసుకుంటూ జీవించేవారే. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థినులు అందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందుతుంది. ఇకపై ఎవరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా క్లాసులకు హాజరయ్యే పరిస్థితి ఉండదు. – మోహనాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మారేడుపల్లి -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
మొబైల్ ఘుమఘుమలు
ఇప్పుడు ప్రతి విషయాన్ని కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బుకు అత్యంత విలువ ఇస్తున్నారు. అంతేకాదు.. నాణ్యమైన భోజనంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇరుకు సందుల్లో, జనం గుమికూడిన ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. నగర శివారులోకి వెళితే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన అల్పాహారం తక్కువ ధరలోనే లభిస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చెట్ల నీడన.. అప్పటికప్పుడు తయారు చేస్తున్న అల్పాహారం తినేందుకు ఇష్టపడుతున్నారు. – సాక్షి, కర్నూలు డెస్క్ డబ్బుంటే పెద్ద హోటళ్లకు వెళ్లి తింటారనుకోవడం పొరపాటు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఇప్పుడు మంచి హోటల్ ఎక్కడుందని వెతుక్కోవడం మాని శివారు ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారు. ఉదయాన్నే గుత్తి పెట్రోల్ బంకు, నంద్యాల చెక్‌పోస్టు, రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మొబైల్ క్యాంటీన్ల చుట్టూ గుమికూడిన కార్లు, ఇతర వాహనాలే కనిపిస్తాయి. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వాళ్లు నగరంలోకి వెళ్లే ముందే టిఫిన్ కానిచ్చేస్తే ఆ తర్వాత వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అక్కడే ఆగిపోతున్నారు. ఏదైనా పని మీద వచ్చినా, లేదా కుటుంబంతో వచ్చినా సుమారు ఐదారుగురు వెంట ఉంటుండటంతో మొబైల్ క్యాంటీన్ ఎంచక్కా వీరి ఆకలి తీరుస్తోంది. నగరంలోని ఏ హోటల్‌కు వెళ్లినా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం టిఫిన్ చేయాలంటే సుమారు రూ.500 పైమాటే అవుతుంది. ఇక కూర్చొని తినే హోటళ్లు అయితే.. ఆర్డర్ ఇచ్చిన ఏ అరగంటకో కానీ టిఫిన్ టేబుల్ మీదకు రాని పరిస్థితి. చివరగా టిప్ ఇవ్వకపోతే వెయిటర్ అదో రకంగా చూడటం షరామామూలే. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద టిఫిన్ చేస్తే అప్పటికప్పుడు రుచికరమైన అల్పాహారం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అందునా ఏ టిఫిన్ చేసినా రూ.30 మాత్రమే తీసుకుంటున్నారు. శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్ల వద్ద రద్దీ కూడా అధికంగానే ఉంటోంది. రోజుకు రూ.5లక్షల పైనే వ్యాపారం నగరంలోని ప్రధాన కూడళ్లలో దుకాణం అద్దెకు తీసుకోవాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. డిపాజిట్ లక్షల్లో చెల్లించడం సరేసరి. ఈ నేపథ్యంలో మొబైల్ క్యాంటీన్లు సరికొత్త ఆలోచనతో రోడ్డెక్కుతున్నాయి. కావాల్సిన విధంగా మార్పులు చేసుకొని సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక కూడలిలో వ్యాపారం జరగకపోతే కొంతకాలానికి మరోచోటుకు మార్చుకునే అవకాశం ఉండటం కూడా మొబైల్ క్యాంటీన్లపై ఆసక్తి పెంచుతోంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలో వీటి సంఖ్య 80కి పైగానే ఉండటం విశేషం. ప్రతిరోజూ వీరి వ్యాపారం రూ.5లక్షలకు పైగానే ఉంటోందంటే భోజన ప్రియులను ఏస్థాయిలో ఆకట్టుకుంటున్నారో అర్థమవుతుంది. వంట మాస్టర్లకు గిరాకీ హోటల్ వ్యాపారంలో వంట మాస్టర్లు కీలకం. వీళ్లు ఒక్కరోజు సెలవు పెట్టినా యజమాని ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. అందువల్లే మరొకరిని కూడా అందుబాటులో ఉంచుకుంటారు. అయితే మొబైల్ క్యాంటీన్లను ఉదయం మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఆ మేరకు కూలీ ఇస్తున్నారు. చేస్తున్న టిఫిన్ల ఆధారంగా కూడా కూలీ నిర్ణయిస్తున్నారు. నైపుణ్యం ఆధారంగా రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మొబైల్ క్యాంటీన్లు సాయంత్రం కూడా నిర్వహిస్తుండటంతో మాస్టర్లు నెల వారీ జీతం తీసుకుంటున్నారు. వ్యాపారానికి అనువుగా వాహనాలు మొబైల్ క్యాంటీన్ నిర్వాహకులు తమ స్థోమతకు అనువుగా వాహనాలను తీర్చిదిద్దుకుంటున్నారు. సాధారణంగా వాహనాల ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఉంటుంది. వీటిని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలంటే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు సెకండ్ హ్యాండ్ వాహనాలను రూ.3లక్షల్లోపు కొనుగోలు చేసి మొబైల్ క్యాంటీన్‌గా అదనపు డబ్బుతో తీర్చిద్దుకుంటున్నారు. ఇతని పేరు ఆంజనేయులు. చిన్న తనంలోనే పారుమంచాల గ్రామం నుంచి కర్నూలు నగరంలో స్థిరపడ్డారు. చెక్‌పోస్టు వద్ద ఒకటి, జి.పుల్లారెడ్డి కళాశాల సమీపంలో మరో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. వీటితో ఇతను ఉపాధి పొందడంతో పాటు మరో పది మంది కూలీలను ఏర్పాటు చేసుకొని వారికీ ఉపాధి కలి్పస్తున్నారు. ఇద్దరు పిల్లలు సంతానం కాగా.. ఒకరు తొమ్మిదో తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతను హుస్సేన్‌రెడ్డి. దూరదర్శన్ కేంద్రం సమీపంలో వెంకటసాయి మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఒక వంట మాస్టర్, మరో ముగ్గురు కూలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారం చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి వెళ్లే వాళ్లు ఇక్కడే ఆగి టిఫిన్లు చేసి వెళ్తున్నారని చెబుతున్నాడు. ఈ కారణంగా వాళ్లకు తక్కువ ధరలో టిఫిన్ లభించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నాడు. తక్కువ ధరలో అల్పాహారం నగరంలోని హోటళ్లతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో టిఫిన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల కింద ఆహ్లాదకరంగా తినే వీలుంటుంది. కళ్లెదుటే చేస్తుండటంతో నాణ్యత విషయంలోనూ అనుమానం అక్కర్లేదు. రుచికరమైన అల్పాహారం చాలా తక్కువ ధరతో అందిస్తున్నారు. – వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్, కర్నూలు కళ్లెదుటే వేడివేడిగా.. మేము కర్నూలులో ఓ పెళ్లికి వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత కాలేజీలో కాస్త పని చూసుకోవాలి. నగరంలోని హోటళ్లకు వెళితే అక్కడ ఆర్డరు చెప్పడం, తీసుకొచ్చే లోపు చాలా సమయం పడుతుంది. అదే మొబైల్ క్యాంటీన్ల వద్ద కళ్లెదుటే వేడివేడి టిఫిన్లు హాయిగా తినొచ్చు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యాపారాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. – హుస్సేన్‌వలి, నంద్యాల చాలా రుచిగా ఉంటాయి నేను హమాలీ పని చేస్తుంటా. ఉదయాన్నే పని మీద బయటకు వస్తాం. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే మాకు వచ్చే కూలీ సరిపోదు. అందుకే మొబైల్ క్యాంటీన్లలో తింటాం. ఇక్కడ ఎంతో రుచికరంగా, పరిశుభ్రత పాటించి వివిధ రకాల టిఫిన్లను అప్పటికప్పుడు అందిస్తారు. ధరలు కూడా చాలా తక్కువ. – రాజశేఖర్, దూపాడు, కర్నూలు -
హోటళ్లలో తిండి ధరలకు రెక్కలు
బనశంకరి: హోటల్స్‌లో ఆహారాల ధరలకు రెక్కలు రానున్నాయి. పాలు, నిత్యావసరవస్తువులు, కూరగాయలు, గ్యాస్ ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో బెంగళూరులోని అన్ని హోటల్స్‌లో కాపీ, టీ, అల్పాహారం, భోజనం, చాట్స్‌తో పాటు అన్ని ఆహారపదార్థాలపై 10 శాతం ధర పెంచాలని హోటల్స్ యజమానులు సంఘం తీర్మానించింది. పెంచిన ధరలు ఆగస్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. కాఫీ, టీ ధర రూ.2 నుంచి రూ.3 వరకు, దోసె, ఇడ్లీ, వడ, రైస్‌బాత్, బిసిబెళేబాత్, చౌచౌబాత్ తదితర ఆహారపదార్థాలు ఇప్పడున్న ధరలకు అదనంగా రూ.5 మేర పెరిగే అవకాశం ఉంది. భోజనంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటల్స్ యజమానుల సంఘం తీర్మానించింది. వినియోగదారులకు భారం లేకుండా ధరలు నిత్యావసరవస్తువులు, నెయ్యి, నూనె, పన్నీర్, వంట గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. హోటల్స్ కార్మికులకు వేతనాలు పెంచాల్సి వస్తోంది. దీనికితోడు అద్దెలు పెరిగాయి. వినియోగదారులపై ఎక్కువ భారం మోపకుండా ధరలు పెంచాలని తీర్మానించాం – పీసీ.రావ్, హోటళ్ల సంఘం అధ్యక్షుడు కోవిడ్ నుంచి సమస్య తీవ్రం కోవిడ్ సమయంలో అనేకమంది కార్మికులు పనులు వదిలిపెట్టి వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. అధిక వేతనం ఇస్తున్నప్పటికీ కార్మికులు లబించడంలేదు. తోపుడు బండ్లపై భోజనం, టిఫిన్లు పెట్టి అమ్ముతున్నారు. దీంతో హోటల్స్ వ్యాపారాలు పడిపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది. – హోటళ్ల యజమానులు -
పప్పుచారులో పాముపిల్ల
కుషాయిగూడ(హైదరాబాద్): ప్రతిరోజూ వేలాదిమంది ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే ఓ ప్రసిద్ధ కంపెనీ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పాముపిల్ల బయటపడింది. ఈ ఘటనతో ఉద్యోగులు ఒక్కసారిగా హడలిపోయారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సెంట్రల్ క్యాంటీన్లో వండిన ఆహారపదార్థాలను చర్లపల్లిలోని ఈవీఎం సంస్థకు మధ్యాహ్న భోజనం నిమిత్తం ప్రతిరోజూ తరలిస్తుంటారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఈవీఎం క్యాంటీన్లో సిబ్బంది ఆహార పదార్థాలను ఉద్యోగులకు అందించే సమయంలో పప్పుచారులో నుంచి ఓ పాముపిల్ల బయటపడింది. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం, సిబ్బంది జాగ్రత్త పడ్డారు. భోజనాల అనంతరం విషయం తెలుసుకుని ఉద్యోగులు భయకంపితులయ్యారు. కొంతమంది ఉద్యోగులు సంబంధిత క్యాంటీన్ సిబ్బందిపై మండిపడ్డారు. గతంలో కూడా ఈ క్యాంటీన్ ఆహారపదార్థాల్లో పలుమార్లు ఎలుకలు, బీడీలు, సిగరెట్లు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మందికి భోజనం అందించే ఈసీఐఎల్ క్యాంటీన్ నిర్లక్ష్యంపై స్పందించి, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. -
మాకు పెట్టే భోజనం పశువులు కూడా తినడం లేదు
ధర్మసాగర్: ‘నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం.. మాకు పెట్టే భోజనం కనీసం పశువులు కూడా తినడం లేదు.అంతకన్నా హీనమయ్యామా’అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, కళాశాలలో భోజనం మంచిగా లేదని, నీళ్ల కూరలు, చారు, ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని ఆ పాఠశాల, కళాశాల విద్యార్థులు గురువారం హైదరాబాద్–వరంగల్ రహదారిపై బైఠాయించారు. విద్యార్థులు మాట్లాడుతూ మెనూతో సంబంధం లేకుండా కుళ్లిన కూరగాయలు వండుతున్నారని, సాంబారు పేరుతో చింతపండు పులుసుతో వేడి నీళ్లు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పస్తులతో కడుపు మాడ్చుకొని పడుకుంటున్నామని విలపించారు. బాత్ రూం పైపుల లీకేజీ వల్ల వచ్చే వాసన భరించలేకపోతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వేడుకున్నారు. -
రోజంతా తిట్టుకున్నారు.. ఆపై సరదాగా ఇలా..!
న్యూఢిల్లీ: భారత్ సూచనల మేరకు 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రభుత్వం ఎంపీలందరికీ పార్లమెంట్ ఆవరణలో మంగళవారం మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఒకే డైనింగ్ టేబుల్‌పై మిల్లెట్ లంచ్ చేశారు. ప్రఖ్యాత చెఫ్‌లతో తయారు చేసిన చిరుధాన్యాల ప్రత్యేక వంటకాలను నెతలంతా ఇష్టంగా తిన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్ లంచ్‌పై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.‘ 2023 ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా నిర్వహించబోతున్న తరుణంలో పార్లమెంట్లో నిర్వహించిన మిల్లెట్ లంచ్‌కు హాజరయ్యాము. పార్టీలకతీతంగా నేతలు హాజరవటం చాలా సంతోషంగా ఉంది.’అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ లంచ్‌లో బజ్రే కా రబ్డీ సూప్, రాగి దోస, యుచెల్ చట్నీ, కలుహులి, లేహ్‌సన్ చట్నీ, చట్నీ పౌడర్, జోల్దా రోటీ, గ్రీన్ సలడాా వంటివి ప్రత్యేకంగా నిలిచినట్లు నేతలు పేర్కొన్నారు. As we prepare to mark 2023 as the International Year of Millets, attended a sumptuous lunch in Parliament where millet dishes were served. Good to see participation from across party lines. pic.twitter.com/PjU1mQh0F3 — Narendra Modi (@narendramodi) December 20, 2022 ఆసక్తికరం.. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన నెలకొంది. రాజస్థాన్ అల్వార్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు శునకం, ఎలుకలు అంటూ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభ అట్టుడుకింది. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అధికార బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఛైర్మన్ ధన్‌ఖడ్ ఎంత చెప్పినా వినకుండా ఆందోళనకు దిగడంతో కొద్ది సమయంలో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న తర్వాత సాయంత్రం ఈ మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతా సంతోషంతో కలిసి లంచ్‌లో పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. A millet special lunch was organised today for all the MPs in Parliament by union government. Enjoyed this healthy & delicious meal with my colleagues. @narendramodi @nstomar @nitin_gadkari @PiyushGoyal @kharge @supriya_sule @adhirrcinc @SaugataRoyMP #IMY2023 #MilletsLunch pic.twitter.com/Qk88m5Mxpj — Praful Patel (@praful_patel) December 20, 2022 ఇదీ చదవండి: ‘శునకం’ వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. క్షమాపణలకు ఖర్గే ససేమిరా -
మస్క్ సెటైర్లు : ట్విటర్ ఉద్యోగి లంచ్ ఖరీదు రూ.32వేలా..తిన్నారా? చేశారా?
ఎలాన్ మస్క్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల వ్యవధిలో ట్విటర్లో అనే నాటకీయ పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ పెయిడ్ వెరిఫికేషన్ అంటూ ఇలా ప్రతి రోజు ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎలాన్ మస్క్ ట్విటర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ట్రేసీ హాకిన్స్‌తో ఉద్యోగులకు అందించే మధ్యాహ్న భోజనంపై విమర్శలు చేశారు. హాకిన్స్ ఒక వారం క్రితం వరకు ట్విటర్లో ఉద్యోగులకు మధ్యాహ్నం ఫుడ్ అందించారు. గత 12 నెలల్లో ఉద్యోగులు ఎవరూ ఆఫీస్‌కు రాలేదు. కానీ ప్రతి రోజు ఒక్కో భోజనానికి $400 (రూ. 32,471.30) కంటే ఎక్కువ ఖర్చు చేశారు’. ఇలా ట్విటర్ లంచ్ కింద ఏడాదికి 13 మిలియన్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. మస్క్ విమర్శలపై హాకిన్స్ స్పందించారు. అబద్ధం..ఎలాన్ మస్క్‌తో పనిచేయడం ఇష్టం లేకనే ట్విటర్‌కు రాజీనామా చేశా. రాజీనామా ముందు వారం వరకు టిఫిన్ & భోజనం కోసం రోజుకు ఒక్కో ఉద్యోగికి $20-$25 డాలర్లు ఖర్చు చేశాను. ఆఫీస్‌కు వచ్చే ఉద్యోగల సంఖ్య 20-50% వరకు ఉందని చెప్పారు. కానీ సంస్థ రికార్డ్స్‌లో అలా లేదే అంటూ హాకిన్స్ ట్వీట్‌కు మస్క్ రిప్లయి ఇచ్చారు. లంచ్ అవర్‌లో పీక్ ఆక్యుపెన్సీ 25%, యావరేజ్ ఆక్యుపెన్సీ 10% కంటే తక్కువగా ఉంది. ఓహో..! ఇక్కడ తినే వాళ్ల కంటే..చేసేవాళ్లు ఎక్కువ మంది ఉన్నారే అంటూ మస్క్ ఘాటుగా రిప్లయి ఇచ్చారు. False. Twitter spends $13M/year on food service for SF HQ. Badge in records show peak occupancy was 25%, average occupancy below 10%. There are more people preparing breakfast than eating breakfast. They don’t even bother serving dinner, because there is no one in the building. — Elon Musk (@elonmusk) November 13, 2022 False. Twitter spends $13M/year on food service for SF HQ. Badge in records show peak occupancy was 25%, average occupancy below 10%. There are more people preparing breakfast than eating breakfast. They don’t even bother serving dinner, because there is no one in the building. — Elon Musk (@elonmusk) November 13, 2022 -
ప్రధాని మోదీతో లంచ్ లో పాల్గొన్న సీఎం జగన్
-
Warren Buffett: బఫెట్‌తో భోజనం @ రూ.148 కోట్లు
న్యూయార్క్: పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్‌తో లంచ్ వేలంలో ఏకంగా 1.9 కోట్ల డాలర్లు (రూ.148 కోట్లు) పలికింది. శాన్ఫ్రాన్సిస్కోలోని చారిటీ గ్లైడ్ కోసం నిర్వహించిన ఈ వేలం పాట గత ఆదివారం 25 వేల డాలర్లతో మొదలైంది. రోజురోజుకూ పెరిగి చివరికి అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది. చదవండి: (లోక్‌సభ టాప్ గేర్) -
బాలీవుడ్ స్టార్ హీరో భార్యతో నమ్రత అనుకోని లంచ్ డేట్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబం సహా పలు విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో ఓ ఫోటోను నమ్రత షేర్ చేసింది. అనుకోని లంచ్ డేట్ ఇది. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలిశాం. ఎన్నోఫ్లాష్బ్యాక్లు, గొప్ప జ్ఞాపకాలు, చాలా నవ్వులు మిగిల్చాయి అంటూ నమ్రత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో తళుక్కుమన్నారు. కాగా మహేశ్, షారుక్ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. గతంలో 'బ్రహ్మోత్సవం' సెట్స్‌లో కూడా మహేష్ దంపతులను షారుక్ కలిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
హైదరాబాద్ రెస్టారెంట్లో తమిళ స్టార్ హీరో సందడి
Tamil Hero Sivakarthikeyan Dined In Hyderabad Restaurant With Friends: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో విందు చేశారు. తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఫేమస్ రెస్టారెంట్ 1980 మిలటరీ హోటల్ని సందర్శించారు.తంలో తనకు హైదరబాదీ వంటకాలంటే చాలా ఇష్టమని చెప్పిన శివ కార్తికేయన్ తాజాగా హైదరాబాదీ ఫేమస్ వంటకాల్ని రుచి చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గతేడాది వరుణ్ డాక్టర్ చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్ త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయనున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. -
పేదోడి ఇంట్లో గవర్నర్ భోజనం.. ఆపై రూ.14 వేలు బిల్లు చేతిలో పెట్టారు!
Madhya Pradesh Man Gets Rs 14 000 Bill : మధ్యప్రదేశ్‌లోన విదిషా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివాసీ బుధ్రామ్ ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే అతనికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికారులు పక్కా ఇల్లు కట్టించారు. ఈ మేరకు గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటి తాళం చెవిని అందజేశారు. అంతేకాదు బుధ్రామ్‌తో కలిసి భోంచేశారు. గవర్నర్ తన ఇంట్లో భోజనం చేయడంతో బుధ్రామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఒకటైతే.. గవర్నర్ వెళ్లిపోయాక కొంతమంది అధికారులు సదరు ఆదివాసీ చేతిలో రూ. 14వేల బిల్లు చేతిలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) వివరాల్లోకి వెళితే.. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్, ఫ్యాన్లను అమర్చారు. అయితే బుధ్రామ్ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు. బుద్రామ్కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. దీనిపై అర్బన్ డెవలప్మెంట్ మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సదరు ఆదివాసీ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి చూసిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
ఏపీ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
రామచంద్రపురం: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రామచంద్రపురం పురపాలక పరిధిలోని చాకలిపేట మున్సిపల్ హైస్కూల్‌ను మంత్రి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నాడు–నేడు పనులను పరిశీలించారు. విద్యాకానుక కిట్ల పంపిణీపై ఆరా తీశారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు తెలుసుకునేందుకు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నాణ్యతైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రోడ్ల దుస్థితికి నాటి టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల నిర్మాణాలు మూడేళ్లు తిరగకుండా ధ్వంసమయ్యాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.5 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్పర్సన్ గాధంÔð ట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్లు కోలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిల్ విప్ వాడ్రేవు సాయిప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు గుబ్బల గణ, పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్ తదితరులున్నారు. ఇవీ చదవండి: బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు ! అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
సిస్టర్స్‌కు ట్రీట్ ఇచ్చిన హీరో రామ్‌చరణ్
హీరో రామ్ చరణ్ తన సిస్టర్స్ సుస్మితా కొణిదెల, నిహారిక, శ్రీజ కల్యాణ్‌లకు ఆదివారం లంచ్ ట్రీట్ ఇచ్చారు. రాఖీ పండగ సమయంలో రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌తో బిజీగా ఉండటం వల్ల తన సిస్టర్స్‌కు ట్రీట్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు టైమ్ దొరకడంతో వారిని లంచ్‌కి తీసుకెళ్లారట. పై ఫోటోలను సుస్మిత, నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి :కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ Chiranjeevi: కపిల్ దేవ్‌ను కలిసిన చిరు A lovely afternoon with the favs @AlwaysRamCharan @sushkonidela #Sreeja 💜 pic.twitter.com/1OR7jrcvOc — Niharika Konidela (@IamNiharikaK) August 29, 2021 -
అన్నమయ్య భవన్లో టీటీడీ సంప్రదాయ భోజనం
-
లార్డ్స్ టెస్టు విజయం.. అనుష్కతో కోహ్లి లంచ్
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మ్యాచ్ గెలిచినప్పటి నుంచి కొనసాగిస్తున్న సంబరాలు.. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా భార్య అనుష్క శర్మతో కలిసి డేట్‌కు వెళ్లిన విరాట్ ఫోటోలు వైరల్ అయ్యాయి. లండన్‌లోని టెండ్రిల్ రెస్టారెంట్‌కు వెళ్లిన విరుష్కలు అక్కడ తమకు ఇష్టమైన ఆహారాన్ని లాగించారు. అనంతం తాము నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు కృతజ్ఞతగా చెఫ్‌తో కలిసి ఒక ఫోటో దిగారు. ఈ విషయాన్ని టెండ్రిల్ రెస్టారెంట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈరోజు మా రెస్టారెంట్‌కు కోహ్లి, అనుష్కలు లంచ్‌కు వచ్చారు. వారికి నచ్చే విధంగా మీల్స్ తయారు చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. మేం చాలా ఎంజాయ్ చేశాం అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక కోహ్లి తొలి రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాడు. రెండు టెస్టులు కలిపి కోహ్లి 0, 42, 20 పరుగులు చేశాడు. మూడో టెస్టుకు టీమిండియాకు వారం రోజులు గ్యాప్ ఉండడంతో క్రికెటర్లు ఉన్న సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. View this post on Instagram A post shared by A (mostly) vegan kitchen (@tendril_kitchen) 🇮🇳's wagging tail, 10 English wickets and the special running celebrations sealed the deal for India at Lord's 🙌🏽 Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #ENGvIND #ENGvsIND pic.twitter.com/ECZY9OVRyu — Sony Sports (@SonySportsIndia) August 16, 2021 -
వైరల్ ట్వీట్: భోజనానికి వెళ్తున్నా.. భోజనం చేసేశా
సోషల్ మీడియాలో పలు ఆసక్తికర సంఘటనలు వైరల్‌గా మారుతుంటాయి. ఆ క్రమంలోనే ఒకరి ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ‘భోజనానికి వెళ్తున్నా’, ‘భోజనం చేసి వచ్చా’ అని చేసిన పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే అతడు భోజనానికి వెళ్తున్నా అని పోస్టు చేసిన 14 ఏళ్ల తర్వాత ‘భోజనం చేసి వచ్చా’ అని ట్వీట్ చేశాడు. అంటే పదాల్నుగేళ్ల పాటు భోజనం చేశాడు అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ట్వీట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. @deleted అనే ట్విటర్ ఖాతాదారుడు 2007 మార్చి 15వ తేదీన మొదట ‘భోజనం కోసం వేచి చూస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. ఆ కొద్దిసేపటికి ‘భోజనం కోసం బయటకు వెళ్తున్నా (Going Out For Lunch)’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన అనంతరం అతడి ఖాతా నుంచి కొన్నేళ్లుగా ఒక్క పోస్టు కూడా చేయలేదు. అయితే తాజాగా జూలై 25, 2021న అంటే 14 సంవత్సరాల అనంతరం ‘భోజనం నుంచి తిరిగొచ్చా’ అని ట్వీట్ చేశాడు. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతడి ట్వీట్ చూసిన ఫాలోవర్లు ఆశ్చర్యంగా చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏం నాయనా పద్నాలుగేళ్ల పాటు భోజనానికి వెళ్లావా అని ప్రశ్నించారు. వనవాసం పద్నాలుగేళ్లు ఉంటుంది... నువ్వు భోజనం కోసం అన్ని సంవత్సరాలు వెళ్లావా? అని కామెంట్లు చేశారు. నువ్వు భోజనం చేసేచ్చేలోపు సమాజంలో ఎన్నో మార్పులు జరిగాయి అని ఓ నెటిజన్ రిప్లయ్ ఇచ్చాడు. ఆ రెస్టారెంట్ ఏదో చెప్పవా? అంటూ స్కాండినవియాన్ అడిగాడు. అయితే ఆయన 14 ఏళ్ల పాటు భోజనం వెళ్లాడా? అన్ని సంవత్సరాలు ఏం చేశాడు? ఎందుకు ట్వీట్లు చేయలేదు? అనే సందేహాలు నెటిజన్లలో మొదలైంది. వాటిని అతడిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. Tell me the restaurant you have been too I shall never go there pic.twitter.com/pGq4tX6FwV — ll SᴄᴀɴᴅɪɴᴀᴠɪᴀN llᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ 💞 (@Odinsonleftus) July 26, 2021 -
విందుకు అందని పిలుపు.. వివాదానికి ఆజ్యం పోసిన ప్రమోషన్
చండీగఢ్: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందని భావిస్తున్న సమయంలో ఓ ‘విందు’ ఆ సంక్షోభాన్ని మరింత పెంచేలా ఆజ్యం పోస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒక వర్గంగా, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించి పదోన్నతి కల్పించింది. దీంతో వివాదం సమసిపోయిందని అనుకుంటుండగా తాజాగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేయబోతున్న ఓ విందు విబేధాలు ఇంకా తొలగిపోలేదని స్పష్టం చేస్తోంది. జూలై 21వ తేదీన పంచకులలో సీఎం అమరీందర్ సింగ్ విందు ఏర్పాటుచేశారు. భోజనానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూకు మాత్రం ఆహ్వానం పంపలేదు. సిద్ధూను అధ్యక్షుడిగా ప్రకటించిన మరుసటి రోజే సీఎం అమరీందర్ ఈ విందు ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా పార్టీ నియమించిన పీసీసీ కార్యవర్గంలో సీఎం అమరీందర్ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా ఇంకా సిద్దూపై కోపంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం తన బలం ప్రదర్శించేందుకు ఈ విందు ఏర్పాటు చేశారని పంజాబ్‌లో చర్చ సాగుతోంది. తనకు క్షమాపణలు చెప్పేంత వరకు సిద్ధూను కలిసే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సీఎం అమరీందర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య విబేధాలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నా కాంగ్రెస్‌లో విబేధాలు సద్దుమణగకపోవడంతో పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని రెండో స్థాయి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ
-
కడియం శ్రీహరి మస్తున్నయ్ మీ కూరలు
హన్మకొండ: సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా మటన్, తలకాయ కూర, చికెన్‌తోపాటు చేపలు, రొయ్యల ఫ్రై, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ చేయించారు. శాకాహారంగా పెసరపప్పు టమాటా, బీరకాయ కూర, బెండకాయ ఫ్రై, టమాటా– పుదీనా పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి, రైతా, పెరుగు, ఫ్రూట్ సలాడ్, మరో స్వీట్ సిద్ధం చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భోజనానికి హాజరైన సీఎం కేసీఆర్.. అందులో పలు వంటలు రుచిచూసి చివరగా దానిమ్మ జ్యూస్ తాగారు. అన్ని వంటలు బాగున్నా యని, ఎప్పుడు వరంగల్ వచ్చినా భోజనానికి శ్రీహరి ఇంటికే రావాలని ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మనవరాలు అన్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా.. చిన్నారిని కేసీఆర్ ఆశీర్వదించారు. -
మేమొస్తే బెంగాల్లో పారిశ్రామికీకరణ
సింగూరు/హౌరా/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సింగూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలో తీవ్రస్థాయిలో పోరాటం జరిగిన ఇదే ప్రాంతంలో అమిత్ షా పారిశ్రామికీకరణ హామీ ఇవ్వడం విశేషం. తాము అధికారంలోకి రాగానే సింగూరులో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, బంగాళదుంప రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని నెలకొల్పుతామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తుచేశారు. రోడ్ షో సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తాము ద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు చేస్తామన్నారు. దీదీ చాలా ఆలస్యం చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను పూజించడం, చండీ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని అమిత్ షా స్వగతించారు. అయితే, ఆమె ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు. సింగూరులో బీజేపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ భట్టాచార్య(89) పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. మొదటి 3 దశల్లో 63–68 సీట్లు గెలుస్తాం బెంగాల్లో ఇప్పటివరకు మూడు దశల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 63 నుంచి 68 స్థానాలను తాము దక్కించుకోవడం తథ్యమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై భారీ ఆధిక్యత సాధిస్తామని అన్నారు. మిగిలిన ఐదు దశల ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 200కు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ఛేదిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన హౌరా జిల్లాలోని దోంజూర్ నియోజకవర్గంలో ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రిక్షావాలా ఇంట్లో అమిత్ షా కింద కూర్చొని పప్పు కూరతో అన్నం తిన్నారు. అంతకుముందు దోంజూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. మల్లిఖ్ ఫటాక్‌లోనూ రోడ్ షో నిర్వహించారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలని, పెద్ద సీట్ల తేడాతోనే ఆమె ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను కఠినంగా అణచి వేస్తామని, సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..
దుబాయ్: బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యతో బాధపడ్డారు. కాగా లాక్డౌన్ సమయంలో సంజయ్ దత్ భార్య మాన్యతా దత్, ఆయన పిల్లలు దుబాయ్‌లోనే ఉండిపోయారు. అయితే సంజయ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తెలిసి మాన్యతా దత్ ముంబైకి వచ్చారు. తాజాగా ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో సంజయ్ దత్, ఆయన భార్య తమ పిల్లలను చూడడానికి దుబాయ్ వెళ్లారు. కాగా సంజయ్ దత్ కుటుంబం దుబాయ్‌లో లంచ్ చేస్తున్న ఫోటోను మాన్యతా దత్ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. సంజయ్ దత్ తన భార్య పిల్లలతో కలిసి ఉత్సాహంగా లంచ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలయింది. ప్రస్తుతం సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సంజయ్ సినిమా షూటింగ్‌కు కొంత విరామం ప్రకటించారు. 2020లో కేజీఎఫ్ సినిమా విడుదలవనుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. (చదవండి: క్యాన్సర్ శాపం) -
కడుపు చల్లగా అన్న'మ్మ'
అవ్వ కావాలా.. బువ్వ కావాలా అంటుంటారు.. ఏదో ఒకటే.. అనే అర్థంలో. కర్నూలు పాతబస్తీలోని ఓ హోటల్లో మాత్రం అవ్వే స్వయంగా బువ్వ వడ్డిస్తుంది. నాణ్యమైన బియ్యంతో చేసిన అన్నం, పప్పు, సాంబారు, కూర, పచ్చడి, మజ్జిగ మధ్యాహ్న భోజనంగా అందిస్తోన్న ఆ అవ్వ పేరు లక్ష్మీదేవి. కడుపు మాడ్చుకునే నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈమె పదిహేనేళ్లుగా చవగ్గా అన్నం పెడుతోంది. అలాగని ధనవంతురాలేమీ కాదు.. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఆమె అనుభవాలే ఆమెను ‘అన్న’మ్మగా మార్చాయి. అవ్వ భర్త తిప్పన్న. రైతుల పొలాలకు పేడను సరఫరా చేసేవారు. యాభై ఐదు ఏళ్ల క్రితం వీళ్ల వివాహం అయింది. ఐదేళ్లకు కొడుకు పుట్టాడు. పెళ్లయ్యాక పదేళ్లు ఆ కుటుంబం సుఖంగానే ఉంది. అప్పటివరకు ఆకలి బాధేంటో అవ్వకు తెలీదు. ఆ సమయంలో భర్త హటాత్తుగా మరణించడంతో అవ్వ జీవితం అంధకారం అయింది. అవ్వ ఓ గచ్చు గానుగలో పనికి కుదిరింది. రాత్రింబవళ్లు కష్టపడినా కూలీడబ్బులు వారానికి యాభై రూపాయలు మాత్రమే. పెద్ద పడఖానాలో వాళ్లుండే ఆ ఇరుకింటిలోనే జీవనం. వర్షానికి కారుతున్నా మరమ్మతులకు డబ్బులుండేవి కావు. కనీసం టీ తాగడానికి డబ్బులు ఉండేవి కావు. ఇంతటి ఆర్థిక కష్టాన్ని సైతం ఆమె ఎదురీదుతూ కుమారుడిని ఏడో తరగతి దాకా చదివించుకుంది. కొన్నాళ్లకు గానుగలకు డిమాండ్ పడిపోయింది. అవ్వ ఉపాధి కోల్పోయింది. జైన మందిరంలో నెలకు తొమ్మిది వందల రూపాయలకు పనిలో చేరింది. అక్కడ పదిహేనేళ్లు పనిచేస్తే జీతం ఐదొందలు పెరిగింది. 1994లో తన కొడుకు మద్దయ్య కు కర్నూలుకే చెందిన సుభద్రతో పెళ్లి చేసింది. ఆకలిని చూడలేక ఇద్దరికి ముగ్గురయ్యారు కాబట్టి సొంతంగా ఏదైనా చెయ్యాలనుకుంది అవ్వ. మండీబజార్‌లో ఆరొందల రూపాయలకు ఓ చిన్నగదిని అద్దెకు తీసుకుంది. కొడుకు సాయంతో మొదట ఉగ్గాణి, బజ్జి వంటి టిఫిన్ పదార్థాలను చేసి అమ్మింది. మండీబజార్‌కు దూర ప్రాంతాల నుంచి సరుకుల లారీలు వస్తుంటాయి. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన హమాలీలు లారీల్లోంచి సరుకుల బస్తాలు దింపుతుంటారు. మధ్యాహ్న సమయంలో భోంచేయడానికి ఇళ్ల వద్ద నుంచి చద్దిమూట తెచ్చుకునే వారు. తెల్లవారు జామునే వారు తెచ్చుకున్న అన్నం పాచిపోయేది. పప్పు వాసన కొట్టేది. చేతిలో డబ్బులేక వారు బజ్జీ తిని కాలం వెళ్లబోసుకునే వారు. అలా వారి ఆకలి నకనకలను అవ్వ అతి సమీపం నుంచి చూసింది. ఏదో ఒక రీతిలో వారికి సాయం చేయాలనే సంకల్పానికి వచ్చింది. తను బజ్జీలమ్మే గదిలోనే నాణ్యమైన బియ్యంతో అన్నం తయారు చేసి పది రూపాయలకే విక్రయించింది. ధర చౌకగా ఉండటం వల్ల హమాలీలు రావడం మొదలు పెట్టారు. ఆ పది రూపాయలకే అన్నంతో పాటు పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగలను వడ్డించేది. వడ్డనలో అవ్వ కోడలు సుభద్ర వరదల్లో నష్టం 2009లో కర్నూలుకు వరదలు వచ్చాయి. నిల్వ ఉంచుకున్న కొన్ని బియ్యం బస్తాలు, ఇతర ఆహార దినుసులు పాడైపోయాయి. పుంజుకోవడానికి సమయం పట్టింది. అయినా అవ్వ అధైర్య పడలేదు. అన్నం వడ్డింపునకు అంతరాయం కలిగించలేదు. భోజన ధరను పదిహేను రూపాయలు చేసింది. స్థలం చాలడం లేదని 2014లో ఎదురుగా ఉండే షాపులోకి తన హోటల్‌ను మార్చింది. కొడుకు, కోడలు అవ్వకు తోడుగా నిలిచారు. హమాలీలతో పాటు షాపుల్లో పనిచేసే గుమస్తాలు, పనిమీద నగరానికి వచ్చిన వారు, రైతు బజార్ రైతులు, నిరుపేదలు వస్తుండటంతో అవ్వ అన్నానికి క్రమేపీ గిరాకీ పెరిగింది. భోజనం పెట్టే వేళలను కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించింది. బియ్యం ధర కేజీ యాభై రూపాయలు ఉన్న ప్రస్తుత రోజుల్లోనూ అవ్వ ఇరవై ఐదు రూపాయలకే భోజనం వడ్డిస్తుండటం విశేషం – ఎస్. సర్దార్‌బాషా ఖాద్రి, సాక్షి, కర్నూలు ఫొటోలు : డి.హుసేన్ సేవతో సంతృప్తి హోటల్ని మేమే స్వయంగా నిర్వహించుకుంటాం కాబట్టి మాకు పనివాళ్ల అవసరం ఉండదు. వేతనాల చెల్లింపుల ఖర్చు అసలే ఉండదు. బియ్యం లూజుగా కొంటే ధర ఎక్కువ. మేం ఒకేసారి ఐదారు బస్తాలు కొనేస్తాం. చౌకధరకు లభిస్తాయి. లాభం కోసం హోటల్ని నడపడం లేదు. పేదలకు సైతం కడుపు నింపుకునే అవకాశం కల్పించడం నాకు, మా కుటుంబానికి ఎంతగానో సంతృప్తినిస్తోంది. ఇటీవలే కంటి ఆపరేషన్ చేసుకున్నా. అయినా ఇంట్లో ఉండలేకపోయా. నా పేరుతోనే హోటల్ నడుస్తుంది కాబట్టి పనిలోకి వెంటనే వచ్చేశా. – అవ్వ (కురువ లక్ష్మీదేవి) -
చికెన్ వంటకం..వాంతులతో కలకలం
చిత్తూరు, గుడిపాల: బోరాన్తో వంటకాలు వండి తమను ఆస్పత్రి పాల్జేశాడా వంటమాస్టర్ అంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. ఇది గమనించిన మరికొందరు భోజనం చేస్తే తమకీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని అప్రమత్తమై ఆ భోజనానికో నమస్కారం పెట్టారు. ఆదివారం ఈ సంఘటన మండలంలోని చిత్తపారలో చోటుచేసుకుంది. హడలెత్తించిన ఆ స్పెషల్ వంటకం కథాకమామీషులోకి వెళితే..గ్రామంలో ఎర్రోడు అనే వ్యక్తి తన కుమారులకు ఆదివారం మధ్యాహ్నం మునీశ్వరుడు పొంగళ్లు పెట్టారు. ఇందుకుగాను వారి బంధువులందరితో పాటు గ్రామస్తులను భోజనానికి ఆహ్వానించాడు. దాదాపు 200మంది వచ్చారు. పసందైన చికెన్ వంటకం సిద్ధం చేయడంతో తొలుత కొందరు భోజనానికి కూర్చుని తినసాగారు. భోజనం ఏదోలా ఉందని కొందరు.. ఉప్పులేదని మరికొందరు..ఏదో తేడాగా ఉందని ఇంకొందరు..చెప్పడం పూర్తయ్యిందో లేదో భోజనం చేసిన 20 మంది భళ్లున వాంతి చేసుకున్నారు. దీంతో తక్కిన వారు భోజనం చేయడానికి సాహసించలేదు. వాంతులతో అస్వస్థతకు గురైన వారు గుడిపాల ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశారు. అక్కడ కూడా మరోసారి బాధితులకు వాంతులయ్యాయి. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని తమిళనాడు ఆస్పత్రికి వెళ్లారు. ఇంతగడబిడకు కారణమేమిటంటే బోరాన్..!! పంటల సాగు సమయంలో సూక్ష్మపోషకాల లోపాల నివారణకు దీనిని వినియోగిస్తారు. ఇది ఉప్పును పోలి ఉంటుంది. వంట చేస్తున్న ప్రదేశంలో ఈ ప్యాకెట్లు ఉండడంతో వంటమాస్టర్ ఇది ఉప్పుగా భ్రమించి వంటకాల తయారీకి వినియోగించాడు. దీనివల్ల రుచిమారి, భోజనం చేసిన వారి కడుపులో గడబిడ సృష్టించింది. వాంతులకు కారణమైంది. ఎక్కువ మోతాదులో వంటకు వినియోగించే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, అస్వస్థతకు గురైన వారికి ప్రాణహాని ఏమీ లేదని గుడిపాల వైద్యులు చెప్పారు. మొత్తానికి మరో 180 మంది అదృష్టవంతులే! వినాయకా..పండగ పూట పెద్ద విఘ్నం తప్పించావయ్యా..స్వామీ అని దండం పెట్టి, ఇళ్లకు వెళ్లిపోయారా గ్రామస్తులు విందు ఆరగించకుండా!! -
1000 కిలోల మేకమాంసంతో విందు
చెన్నై, టీ.నగర్: పుదుక్కోటై జిల్లా కీరమంగళం, వడకాడు పరిసర గ్రామాలు, తంజావూరు జిల్లా పేరావూరణి నియోజకవర్గాల్లో గల గ్రామాల్లో గత 25 ఏళ్లుగా చదివింపు విందులు జరుగుతున్నాయి. వివాహం, ఇతర శుభకార్యాలకు డబ్బు అవసరం ఉన్నవారు ఈ చదివింపు విందులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గురువారం వడకాడులో కృష్ణమూర్తి అనే రైతు భారీ స్థాయిలో చదివింపు విందు నిర్వహించారు. ఇందుకోసం పెద్ద పందిరి ఏర్పాటుచేసి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 50 వేల ఆహ్వానపత్రికలు ముద్రించి పంచిపెట్టారు. ఒక టన్ను మేకమాంసాన్ని వండి మాంసాహార భోజనం వడ్డించారు. విందుకు వచ్చిన వారు చదివింపుగా ఇచ్చే నగదును లెక్కించేందుకు ప్రైవేటు బ్యాంకు సిబ్బందితో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సుమారు 20 చోట్ల చదివింపులు రాశారు. సాయుధ భద్రతా సిబ్బంది భద్రతా విధులు చేపట్టారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వసూలయిన నగదును లెక్కించగా రూ.4 కోట్లు లెక్క తేలింది. ఈ ఏడాది ఇదే అత్యదిక మొత్తంలో వసూలయిన చదివింపుల సొమ్ముగా సమాచారం. -
కలిసి భోంచేశారు
ఇరవై మూడేళ్ల అమెరికన్ మోడల్, టెలివిజన్ స్టార్ కెండెల్ జెన్నెర్, ఆమెకన్నా పదేళ్లు పెద్దదైన మన దీపికా పడుకోన్ ఇద్దరూ కలిసి మంగళవారం న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో లంచ్ చేశారు. హాస్పిటల్లో లంచ్ ఏమిటి?! హాస్పిటల్లో లంచ్ కాదు. హాస్పిటల్ వాళ్లు ఏర్పాటు చేసిన లంచ్ అది. న్యూయార్క్‌లోనే ఉన్న ‘యూత్ యాంగ్జెయిటీ సెంటర్’ కోసం నిధులను సమీకరించే ఒక కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతర దీపిక, కెండెల్‌తో మరికొందరు ప్రముఖులు కలిసి విందును ఆరగించారు. అంతకన్నా ముందు దీపిక తన ప్రసంగంలో తనెలా డిప్రెషన్ నుంచి బయటపడిందీ అక్కడివారితో షేర్ చేసుకున్నారు. యువతలో కనిపించే ఆదుర్దా, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు యాత్ యాంగ్జెయిటీ సెంటర్ చికిత్సను అందించడంతో పాటు సంబంధిత వైద్యపరిశోధనలు, అధ్యయనాలు జరుపుతుంటుంది. దీపిక అంటే ఒకే, మరి కెండెల్ అక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఆమెరికన్ల యూత్ ఐకన్ ఇప్పుడు ఆవిడ. -
టైగర్‌తో లంచ్..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ హాట్ జోడీ దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు డేటింగ్లో ఉన్నారని, వీరి మధ్య సంబంధాలు ఇటీవల బెడిసికొట్టాయని వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్ వేసింది. వీరిద్దరు కలిసి ఇటీవల ముంబైలోని ఓ రికార్డింగ్ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. అప్పటినుంచి పలు సందర్భాల్లో వీరు సన్నిహితంగా ఉంటూ కెమెరాల కంట పడ్డారు. తాజాగా దిషా, టైగర్లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ రెస్టారెంట్ బాస్టిన్‌లో బ్రంచ్ చేశారు. అయితే ఇప్పటివరకూ తమ మధ్య ఉన్న సంబంధం గురించి వీరు నోరుమెదపకపోవడం గమనార్హం. ఇక వృత్తిపరంగా దిశా పటానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో మెరవనున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్, టబు, సునీల్ గ్రోవర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్ ష్రాఫ్ కరణ్ జోహార్ నిర్మించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది. -
విద్యార్థుల భోజనంలో ఎలుక చర్మం
సాక్షి, అమరావతి/ వైఎస్ఆర్ : ప్రభుత్వ పాఠశాలలో భోజన తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. జిల్లాలోని సరోజిని నగర్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వడ్డించే పప్పులో సోమవారం ఎలుక చర్మం, పేగులు వచ్చాయి. పిల్లలకు వడ్డించే భోజనంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది దీన్ని బట్టిచూస్తే అర్థమవుతోంది. భోజన తయారిని ఏపీ ప్రభుత్వం ప్రయివేటీకరించడంతో ఇస్కాన్ సంస్థ భోజనాన్ని తయారు చేస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో ఇస్కాన్ చెలగాటం ఆడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 100 పాఠశాలలకు ఇదే సంస్థ భోజనాన్ని పంపిణీ చేస్తోంది. కాగా భోజన తయారిని ప్రభుత్వం ప్రయివేటీకరించడం ప్రజలు తీవ్రంగ తప్పుపడుతున్న విషయం తెలిసిందే. -
విద్యార్థుల మిడ్ డే మీల్స్‌లో ఎలుక చర్మం పేగులు
-
మనసు దోచుకున్న కలెక్టర్
తిరువనంతపురం : కేరళలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ సుహాస్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. నీర్‌కుణ్ణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సందర్శించిన ఆయన తనిఖీలు నిర్వహించారు. స్వయంగా విద్యార్థులతో కలసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు జిల్లా కలెక్టర్ అలప్పుజా పేజిలో పోస్టు చేశారు. కొద్ది గంటల్లోనే ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించి స్వయంగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సుహాస్‌ను నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏ మేరకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు సర్ప్రైజ్ విజిట్ చేసినట్లు సుహాస్ ఫేస్బుక్ పోస్టులో వెల్లడించారు. -
ఆహా ఏమి రుచి !
ఆత్మీయ కరచాలనాలు, చిరునవ్వులతో పలకరింపులు, బొటన వేలెత్తి చూపిస్తూ విక్టరీ సంకేతాలు, పక్కపక్కన నిల్చొని ఫోటోగ్రాఫర్లకు పోజులు, ఇలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సమావేశం ఇరువురు నేతలు కలిసి భోజనం చేయడంతో ముగిసింది. ట్రంప్, కిమ్ ఇద్దరూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ డైనింగ్‌రూమ్‌లోకి కలిసి వెళ్లారు. అలా వెళుతూ వెళుతూ ట్రంప్ ఫోటోగ్రాఫర్లని ఉద్దేశించి ‘అందరూ మంచి పిక్ తీసుకున్నారా ? మేమిద్దరం అందంగా, సన్నగా ఉన్నాం కదా‘ అంటూ చమత్కరించారు. ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందన్న సంతృప్తితో ఉన్న నేతలిద్దరూ తమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వంటకాలను తృప్తిగా తిన్నారు. పశ్చిమ దేశాలు, ఆసియా దేశాల్లో పేరెన్నిక గన్న రుచుల్ని మెనూలో ఉండేలా చూసుకున్నారు. ట్రంప్, కిమ్ వర్కింగ్ లంచ్‌లో నోరూరించే వంటకాలు ఏమున్నాయంటే .. రొయ్యల కాక్టైల్, అవకాడో సలాడ్, తేనె, నిమ్మకాయ కలిపిన మామిడికాయ కెరబు, దోసకాయని స్టఫ్ చేసి తయారు చేసే ఓయిసన్ అనే కొరియన్ వంటకాన్ని స్టార్టర్లుగా ఉంచారు. ఇక మెయిన్ కోర్సులో బీఫ్, పంది మాంసంతో చేసిన ప్రత్యేక వంటకాలు, ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ సాస్, ఆవిరిపై ఉడికించిన బంగాళ దుంపలు, గ్రీన్ గోబీ, కాడ్ అనే చేప, సోయా, ముల్లంగి, ఇతర కాయగూరలతో చేసిన ప్రత్యేక వంటకాలు మెనూలో హైలైట్‌గా నిలిచాయి. వీటితో పాటు రెడ్ వైన్ కూడా ఉంది. ఇక భోజనానంతరం తినే డెజర్ట్స్ విషయానికొస్తే డార్క్ చాక్లెట్, చెర్రీ పళ్లతో డెకరేట్ చేసిన హాజెండాజ్ వెనిలా ఐస్‌క్రీమ్, ట్రోప్‌జెన్నీ అనే కేకులాంటి పదార్థం వడ్డించారు. ట్రంప్‌కి వెనీలా ఐస్‌క్రిమ్ అంటే పిచ్చి. ప్రతీ రోజూ రెండు స్కూప్‌ల ఐస్ క్రీమ్ ఆయన లాగిస్తూ ఉంటారు. ఇక కిమ్ ఆహార అలవాట్ల గురించి బయట ప్రపంచానికి అంతగా తెలీవు. అయితే అతను భోజన ప్రియుడని ముఖ్యంగా చీజ్ ఉన్న విదేశీ వంటకాల్ని ఇష్టంగా తింటారని అంటారు. మొత్తమ్మీద ఈ లంచ్ తక్కువ ఐటమ్లతోనైనా ఆహా ఏమి రుచి అనిపించేలా ఉందని అంటున్నారు. ఇక ఈ చారిత్రక సమావేశం కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులకు ప్రత్యేకంగా కొరియా స్పెషల్ కిమ్చి ఐస్ క్రీమ్ ఇచ్చారు. కిమ్-ట్రంప్ : నాలుగు నిర్ణయాలు -
తుర్రో... తుర్రు..
సాక్షి, తెలంగాణ డెస్క్: అనగనగనగా టాంజానియా అనే దేశం.. మన దేశానికి చాలా దూరం లెండి.. అక్కడ సెరెన్గెటీలో ఓ సఫారీ పార్కు.. ఈ పార్కులో బోలెడన్ని పులులు, చిరుతలు.. సింహాలు.. ఏనుగులు.. పాములు.. ఆ.. మర్చిపోయాను.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కొంగ బావ కూడా ఇక్కడే ఉంటోంది. ఈ మధ్య.. ఓ మిట్టమధ్యాహ్నం వేళ.. సరిగ్గా లంచ్ టైము అన్నమాట. ఈ చిరుత పులి కడుపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయి. అసలే దీనికి ఆకలి ఎక్కువ.. టైముకి తిండి ఠంచనుగా పడిపోవాల్సిందే.. మరి ఇదేమో జూ కాదాయే.. టైముకి ఫుడ్ పెట్టడానికి.. సఫారీ పార్కు.. దాంతో వేటకు బయల్దేరింది.. ఎంత వెతికినా.. ఒక్క జంతువూ కనపడలేదు.. ఇంక నీరసం వచ్చి పడిపోతుంది అనుకునే లోపు.. అక్కడికి దగ్గర్లో అప్పుడే లంచ్ కానిచ్చి.. అరగడానికి వాకింగ్ చేస్తున్న కొంగ బావ కనిపించింది.. అంతే.. గడ్డిలో చటుక్కున దాక్కుంది.. యుద్ధరంగంలోని సైనికుడిలాగ బరబరమని.. పాక్కుంటూ.. దాని దగ్గరికి వెళ్లింది.. ఈ కొంగ పని ఇక అయిపోయింది నా సామి రంగా అని అనుకుంటూ ఒక్కసారిగా దబీమని దూకింది.. అయితే.. కొంగబావకి మామూలుగానే తెలివితేటలు ఎక్కువ.. దీనికి కాస్త సిక్త్స్ సెన్స్ కూడా ఉన్నట్లుంది.. వెంటనే ప్రమాదాన్ని గ్రహించింది.... ఇంకేముంది.. తుర్రో.. తుర్రు.. -
విందు సమావేశం: హాజరు కాని జస్టిస్ చలమేశ్వర్
-
వికటించిన విందు భోజనం
నూజెండ్ల : విందు భోజనం వికటించి 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని కొత్తనాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలకు చుట్టుపక్కల గ్రామాలైన లింగముక్కపల్లి, తంగిరాల, పాతనాగిరెడ్డిపల్లి, చింతలచెర్వు, యోగిరెడ్డిపాలెం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు. భోజనాల అనంతరం అర్ధరాత్రి ఒక్కొక్కరు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో స్థానిక వైద్యుల దగ్గరకు పరుగులు తీశారు. ఫుడ్ పాయిజన్ కారణమని ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. బాధితుల్లో సగం మంది చిన్నారులు వృద్ధులు ఉండటంతో గ్రామస్తులు తొలుత భయాందోనలకు గురయ్యారు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన వైద్య శిబిరాలు ఏర్పాటు స్థానిక డాక్టర్ కల్యాణ చక్రవర్తి సహకారంతో జిల్లా వైద్య బృందం, నియోజకవర్గం డాక్టర్లు, వైద్యసిబ్బందితో మండలంలోని లింగముక్కపల్లి, తంగిరాల, నాగిరెడ్డిపల్లిల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. నూజెండ్ల ప్రభుత్వ పాఠశాలల్లోనూ శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు నాగిరెడ్డిపల్లిలో 100 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారనే సమాచరం మేరకు జిల్లా అధికారులు గ్రామానికి పరుగులు తీశారు. తొలుత నూజెండ్ల తహసీల్దార్ పద్మాదేవి స్థానిక రెవెన్యూ సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టారు. ఏ గ్రామాల్లో బాధితులు ఎక్కువుగా ఉన్నారో ఆరా తీశారు. అనంతరం డీఎంఅండ్ హెవో యాస్మిన్, డెప్యూటీ డీఎం అండ్ హెవో శ్యామల, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ భానుప్రసాద్, ఆర్డీవో రవీంద్ర, డీఎల్పీవో కృష్ణమోహన్‌తోపాటు పలువురు అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం లేదు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స చేస్తున్నాం. ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ పెద్ద ప్రమాదం లేదు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాధితుల రక్త నమూనాలు సేకరించాం. పరీక్షల అనంతరం వివరాలు తెలియజేస్తాం. – యాస్మిన్, డీఎం అండ్ హెవో -
అక్కడ రూ.10కే లంచ్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లకు లభిస్తున్న ఆదరణతో తాజాగా దేశ రాజధానిలో బీజేపీ పాలిత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు పది రూపాయాలకే లంచ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మాజీ ప్రదాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సోమవారం సబ్సిడీ లంచ్ పథకానికి శ్రీకారం చుట్టాయి. ఓఖ్లా మండి, మటియలా చౌక్, గ్రీన్‌పార్క్, రఘువీర్ నగర్, కక్రౌలా మోర్, నజఫ్‌గర్, షాలిమార్ బాగ్‌లో ఆరు కేంద్రాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రతి వార్డులోనూ ఒక సబ్సిడీ లంచ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లు ప్రకటించాయి. మధ్యాహ్న భోజన కిచెన్లు నిర్వహిస్తున్న ఎన్జీవోలు ఈ కియోస్క్‌ల బాధ్యతను చేపట్టాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచివుంచే ఈ కేందాల్రో నాలుగు పూరీలు, 150 గ్రాముల కూర, పప్పుతో 250 గ్రాముల రైస్ అందిస్తారు. రోజూ 500 నుంచి 700 ప్లేట్లు అందుబాటులో ఉంచుతామని గ్రీన్‌పార్క్ వద్ద ఏర్పాటైన అటల్ కేంద్రంను నిర్వహిస్తున్న ఓ సెల్ఫ్‌హెల్ప్ సంస్థ ప్రతినిధి గాడ్ఫ్రే పెరిరా చెప్పారు. మరోవైపు అటల్ ఆహార్ కేంద్ర ప్రారంభం కావడంతో ఎన్నికల హామీల్లో ముఖ్యమైన వాగ్ధానం నెరవేరడం పట్ల సంతోషంగా ఉందని సౌత్ ఢిల్లీ మేయర్ కమల్జీత్ షెరావత్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
రాహుల్ విందు రాజకీయాలు
-
తేజస్వీ యాదవ్‌తో రాహుల్ లంచ్
-
మధ్యాహ్న భోజనంలో బల్లి
♦ విద్యార్థులకు స్వల్ప అస్వస్థత ♦ వెంటనే ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు ♦ ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంకటాచలం : మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన రసం తాగి విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కంటేపల్లి దళితవాడ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. కంటేపల్లి దళితవాడ పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థులు ఉన్నారు. రోజూలాగే అక్షయ పాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన భోజనాన్ని మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించారు. భోజనం చివరలో రసం హాట్‌బాక్సు అడుగున బల్లి చనిపోయి ఉండడాన్ని విద్యార్థులు గుర్తించారు. అప్పటికే రసంతో 8 మంది విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు రాంమోహన్, ఉపాధ్యాయిని మస్తానమ్మ భోజనం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఆందోళనకు గురై మండలాధికారులకు, వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే 108 వాహనం కంటేపల్లికి చేరుకుని రసం తాగిన ఉపాధ్యాయులతో పాటు స్వల్ప అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థులను క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్యలు క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అక్షయపాత్ర ఏజెన్సీ సరఫరా చేసిన రసంలో చనిపోయిన బల్లి కనిపించడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. తహసీల్దార్ సోమ్లానాయక్, ఎంఈఓ కొండయ్య కాకుటూరు పంచాయతీ పరిధిలోని అక్షయపాత్ర ఏజెన్సీ వంటశాలను పరిశీలించి అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులకు పంపే భోజనం విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. -
ఆరుబయట వంట .. వానోస్తే తంటా!
వంట గదుల్లేక విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం ► క్లాస్రూంలు, వరండాలు, చెట్ల కిందే వంటావార్పు ► వర్షమొస్తే చాలా పాఠశాలల్లో భోజనం బంద్ సర్కారీ బడుల్లో మధ్యాహ్న భోజనం పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షమొస్తే చాలు వేల పాఠశాలల్లో పిల్లలకు భోజనం వండి పెట్టలేని దుస్థితి నెలకొంది. కిచెన్ షెడ్లు లేకపోవడంతో ఆ స్కూళ్లలోని పిల్లలకు అర్ధాకలి తప్పడం లేదు. రాష్ట్రంలోని 25,531 పాఠశాలల్లో దాదాపు 8 వేల స్కూళ్లలో ఇప్పటికీ కిచెన్ షెడ్లు లేవు. వానొస్తే చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. మరికొన్ని చోట్ల పాలిథిన్ కవర్లు అడ్డుపెట్టి వంటలు చేస్తున్నారు. షెడ్లు లేని కారణంగా ఈ ఒక్క నెలలోనే 585 స్కూళ్లలో ఐదు రోజులపాటు పొయ్యి వెలగలేదు. ఈ లెక్కలు ఏదో ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో తేలినవి కావు. సాక్షాత్తూ విద్యాశాఖ సేకరించిన సమాచారం. ఇవే వివరాలను కేంద్రానికి సైతం తెలియజేసింది! – సాక్షి, హైదరాబాద్ కిచెన్ లేదు.. మెనూ లేదు.. మధ్యాహ్న భోజనం.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పగటి పూట భోజనం అందించడం ద్వారా వారు రెగ్యులర్‌గా బడికి వచ్చేలా చూడడం, డ్రాపౌట్స్‌ను తగ్గించే ఉద్దేశంతో తెచ్చిన పథకమిది. క్షేత్రస్థాయిలో ఈ పథకానికి కిచెన్ షెడ్ల సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. షెడ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తోంది. అంతేకాదు షెడ్లు లేకపోవడంతో ఆహార పదార్థాల్లో చెత్తా చెదారం పడుతుండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న సందర్భాలూ ఉన్నాయి. వర్షాల కారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వండి పెట్టని స్కూళ్లు అనేకం ఉన్నాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఆగస్టులో ఇప్పటివరకు ఐదు రోజుల పాటు విద్యార్థులకు భోజనం పెట్టని స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా 585 ఉంటే అందులో నల్లగొండకు చెందినవి 91 పాఠశాలలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 67, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53 ఉన్నాయి. ఇక రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన మెనూ అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించినా అమలుకు నోచుకోవడం లేదు. చాలా స్కూళ్లలో సాంబారు, అన్నం మాత్రమే ఇస్తున్నారు. షెడ్లు లేక తిప్పలెన్నో.. 362 స్కూళ్లకు వంట గదుల్లేవు. వీటిలో 55,790 మంది విద్యార్థులు చదువుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం ఉప్పర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో వంట గదిలేదు. వర్షమొస్తే అంతే సంగతులు. మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 635 మంది విద్యార్థులున్నా మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు వంటగది లేదు. ఆరు బయటే వండుతున్నారు. వానొస్తే ఫ్లెక్సీలు, గాలికి రేకులు అడ్డుగా పెడుతున్నారు. మిర్యాలగూడలోని బకల్వాడ ఉన్నత పాఠశాలలో 984 మంది విద్యార్థులు ఉన్నారు. వంటగది లేక ఆరుబయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే వరండాలో వండుతున్నారు. దాంతో తరగతి గదుల్లోకి పొగ వస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కవర్లు, ఫ్లెక్సీలు అడ్డు పెట్టి వంట చేస్తున్నాం... 12 ఏళ్లుగా ఆరు వందల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్నాం. కిచెన్ షెడ్ లేకుండా వంట చేయాలంటే మా గోస కాదు. ఎండకు ఎండుతూ, వాన కు తడుస్తూ వంట చేస్తున్నాం. గాలికి కవర్లు, ఫ్లెక్సీలు అడ్డుగా పెడుతున్నాం. వర్షానికి వంట సామగ్రి తడిసిపోతోంది. – నిమ్మల మాధవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మహబూబాబాద్ అన్నంలో పురుగులు వస్తున్నాయి... వంటలను చెట్ల కింద వండుతున్నారు. వర్షాలు వచ్చిన సమయంలో అన్నంలో చెట్ల పైనుంచి పురుగులు పడుతున్నాయి. అన్నం తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నాం. చారు కూడా నీళ్లలాగా ఉంటోంది. – నాగలక్ష్మి, 10వ తరగతి, బకల్‌వాడీ స్కూల్, మిర్యాలగూడ -
పొగడ్తలే !
జిల్లాలోని 80 శాతం స్కూళ్లలో కట్టెల పొయ్యి పైనే వంట ► కృష్ణాను పొగరహిత జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం ► అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌపై చేయాలని ఆదేశం ► అయినా అమలుకు నోచుకోని వైనం కృష్ణాను పొగరహిత జిల్లాగా పాలకులు ప్రకటించారు. అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లోని గదులే పొగచూరిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు గ్యాస్ ధర భారం కావడం... సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో 80 శాతం పాఠశాలల్లో స్టౌలు అటకెక్కాయి. కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. ఫలితంగా ‘పొగరహిత జిల్లా’ ప్రకటనలకే పరిమితమైంది. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని 80 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం... సకాలంలో సిలిండర్ల దొరక్కపోవడం... గ్యాస్ కన్నా కట్టెలు తక్కువ ధరకు లభించడమే ఇందుకు కారణమని నిర్వాహకులు చెబుతున్నారు. దీనివల్ల పొరగహిత జిల్లా లక్ష్యం అమలులో అపహస్యం పాలవుతోంది. జిల్లాలో 4,442 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక పాఠశాల మూతపడింది. అన్ ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించగా, 3,157 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దాదాపు 300 వంట ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రోజూ 5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఈ ఏజెన్సీల్లో సుమారు 10 వేల మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు. పొగ రహితమని ప్రకటించినా... కృష్ణాను పొగరహిత జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ పైనే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల నిధులు నుంచి గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లు పొందారు. మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలవుతున్న 3,157 పాఠశాలల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.2,237 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే, గ్యాస్ కొనలేక, సకాలంలో అదుబాటులో లేక ఎక్కువ పాఠశాలల్లో స్టౌలు అటకెక్కాయి. దాదుపు 80 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. గుడ్డు పేరుతో కోత... ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం కోసం బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, కూర, చారు, స్వీట్లు తయారు చేయడానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కుకింగ్ చార్జీలుగా విద్యార్థికి రూ.6.48, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.8.53 చొప్పున చెల్లిస్తోంది. గతంలో కుకింగ్ చార్జీలతో భోజన పథకానికి కావాల్సిన కూరగాయలు, నూనె, పప్పుదినుసులు, గుడ్లు, స్వీట్లు మార్కెట్లో కొనుగోలు చేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వమే గుడ్లు పంపిణీ చేస్తోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గుడ్డుకు రూ.2.35 చొప్పున కుకింగ్ చార్జీల నుంచి మినహాయించాలి. అయితే, గుడ్డుతోపాటు భోజనం పెట్టిన రోజు కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు కుకింగ్ చార్జీల నుంచి గుడ్డు డబ్బులను కట్ చేస్తున్నారు. దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 500 నుంచి 1,000 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో వంట చేసేందుకు వారానికి 6 నుంచి 7 సిలిండర్లు అవసరమని, కొనుగోలు చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నామంటున్నారు. గిట్టుబాటు కావడంలేదని ఆవేదన... ప్రభుత్వ నిబంధనల ప్రకారం... 25 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 100 మంది కన్నా ఎక్కువ ఉంటే ముగ్గురు, 200 మందికి పైగా ఉంటే నలుగురు వంట నిర్వాహకులు ఉండాలి. ఈ లెక్క ప్రకారం 25 మంది ఉన్న పాథమిక పాఠశాలలో మధ్యాహ్నం వంటలకు పప్పు, ఉప్పు, నూనె, కాయగూరల కోసం ప్రభుత్వం రోజుకు రూ.165 చెల్లిస్తోంది. ఇప్పుడు అదనంగా రోజూ రూ.2.35 పైసల చొప్పున 25 మంది విద్యార్థులకు రూ.58.75 పైసలు గుడ్డు పేరుతో కుకింగ్ చార్జీల్లో కోత విధిస్తోంది. దీంతో తమకు మిగిలేది రూ.103.25 మాత్రమేనని, ఇద్దరు పని చేసేయగా ఒక్కొక్కరికీ ఖర్చులతో కలిపి రూ.51.50 మాత్రమే లభిస్తుందని చెబుతున్నారు. అందువల్ల గ్యాస్‌ను ప్రభుత్వమే ఉచింతంగా అందిస్తే తమకు గిట్టుబాటు అవుతుందని, పొగరహిత జిల్లా లక్ష్యం కూడా నెరవేరుతుందని పలు ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. పెడనలోని భట్టా జ్ఞానకోటయ్య ఉన్నత పాఠశాలలో 1,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ స్టౌపై వంట చేయాలంటే రోజుకు ఒక సిలిండర్ కావాలి. అంటే గ్యాస్‌కు రోజుకు రూ.600 నుంచి రూ.800 అవససం. కట్టెల పోయ్యిపై ఖర్చులో కాస్త వెసలుబాటు ఉంటుంది. రూ.3,000 వెచ్చించి ఓ ట్రాక్టర్ కట్టెలు కొనుగోలు చేస్తే వారం వంట చేయవచ్చు. దీంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. పెడనలోని బంగళా ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. గ్యాస్ స్టౌ పై వండితే తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు సిలిండర్ అయిపోతే సకాలంలో అందడం లేదని, కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీలో కోత విధించడంతో రోజు వారి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
‘సోనియాతో ఎప్పుడో మాట్లాడా.. మీ ఊహ ఉత్తిదే’
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన విందుకు తాను గైర్హాజరవడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ తరుపున జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ హాజరయ్యారని అందుకే తాను వెళ్లలేదని చెప్పారు. కానీ, ఈ విషయాన్ని మీడియా తప్పుగా అర్థం చేసుకొని ప్రచారం చేసిందని అన్నారు. మీడియా చెప్పిన అంశంలో వాస్తవం లేదని, అవన్నీ ఊహాగానాలేనని తేల్చేశారు. ‘నేను ఇప్పటికే ఏప్రిల్‌లో సోనియాగారిని కలిశాను. ఇప్పుడు ఏం అంశంమీద చర్చిస్తున్నారో అదే అంశంపై అప్పుడే చర్చించాను. ఇప్పుడు మాత్రం ఆమె అన్ని విపక్ష పార్టీలను ఆహ్వానించారు. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ జేడీయూ తరుపున వెళ్లారు కూడా. అంతేగానీ, నేను విందుకు హాజరవకపోవడంలో ప్రత్యేక ఉద్దేశం లేదు. మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగ్నౌత్ కు ప్రధాని మోదీ ఇస్తున్న గౌరవ విందులో పాల్గొంటున్నాను. అయితే, నేను మోదీతో భేటీ అయ్యేది బిహార్ అభివృద్ధిపైనే.. అందులో భాగంగానే అక్కడ జరిగే విందులో పాల్గొంటాను’ అని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిత్వంపై జరుగుతున్న కసరత్తులో భాగంగా సోనియా గాంధీ ఏర్పాటుచేసిన విందుకు నితీశ్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శనివారం సమావేశం కానున్నారు. బీహార్ అభివృద్ధికి సంబంధించి ఆయన ప్రధానితో చర్చించనున్నారు. -
బ్యూటిఫుల్ లేడీతో అఖిల్ లంచ్
హైదరాబాద్: అక్కినేని నటవారసుడు, యువ హీరో అఖిల్ ఓ అసక్తికరమైన ట్వీట్ చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో కింగ్ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం సెట్ లో అమ్మతో కలిసి భోంచేసిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. బ్యూటీఫుల్ లేడీతో లంచ్ చేశా.. ఆమెనవ్వు చాలా ఇష్టం. థాంక్యూ మై డీయర్ అమ్మా అంటూ అఖిల్ ట్వీట్ చేశారు. దీంతో పాటు, సీనియర్ నటి , తన తల్లి అమలతో సెల్ఫీని కూడా అభిమానులతో పంచుకున్నారు. కాగా అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున ఓ కమర్షియల్ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ఏప్రిల్ 2 న ప్రారంభం అయింది. 'మనం' టెక్నికల్ టీం వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందనీ ఏప్రిల్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. Had Lunch with this beautiful lady on sets today. Her smile is what I love most. -
బాధ్యులపై చర్యలు
► కలెక్టర్ కృష్ణభాస్కర్ ► బాధిత విద్యార్థులకు పరామర్శ ఎల్లారెడ్డిపేట : వీర్నపల్లిలోని మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డి.కృష్టభాస్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది విద్యార్థులను కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పాఠశాలలో తయారు చేసిన మధ్యాహ్న భోజ నానికి సంబంధించిన వివరాల నివేదికను తనకు వెంటనే అందించాలని ఎంఈవో రాజయ్యను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశా రు. మధ్యాహ్న భోజన నిర్వాహకు లు ఉడకని గుడ్లు, అన్నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు కుదుట పడే వరకూ అయ్యే వైద్యఖర్చులను ప్ర భుత్వమే భరిస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రమేశ్, ఉప వైద్యాధికారి చంద్రశేఖర్, డీఈవో రాధాకిషన్, ఎంఈవో రాజయ్య, జెడ్పీటీసీ తోట ఆగ య్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, సింగి ల్విండో వైస్‌చైర్మన్ చాంద్‌పాషా, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఎస్సై ఉపేం దర్, వైద్యాధికారి శీరిష పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వీర్నపల్లి మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్సీసీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము పరామర్శించారు. వంట నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ సంఘటన జరిగిందని, ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్ , మధ్యాహ్న భోజన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాము డిమాండ్ చేశారు. ఇలాంటి సం ఘటనలు పునరావృతం కాకుండా అధి కారులు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒగ్గు మహేశ్‌చంద్ర, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం, నా యకులు సిరిసిల్ల కిషన్, పెరుమాండ్ల ప రశురాం, సంఘ సతీశ్, సురేశ్, నరేశ్, సు రేందర్, స్వామి ఉన్నారు. ఇది దురదృష్టకర సంఘటన అని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య ఉన్నారు. -
వారానికి మూడు సార్లు కోడిగుడ్లు
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇక నుంచి వారానికి మూడుసార్లు కోడిగుడ్లు అందజేయనున్నారు. గతంలో వారానికి రెండు సార్లు కోడిగుడ్లు అందజేస్తుండగా ఇక నుంచి మూడు గుడ్లు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు 2016–17 సంవత్సరానికి చెల్లించాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. డీఈఓ మండలాల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 3,444 ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 5వ తరగతి వరకు 1,24,507మంది విద్యార్థులు, 6నుంచి 8వరకు 71,964మంది విద్యార్థులు, 9నుంచి 10వ తరగతి వరకు 51,380మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. ఈ మేరకు వంట ఏజెన్సీలకు చెల్లించాల్సి నగదుతో పాటు కోడిగుడ్లకు కలిపి ప్రాథమిక పాఠశాలలకు రూ.5,46,97,000, యూపీఎస్‌లకు రూ. 4,93,96,000, 9, 10వ తరగతి విద్యార్థుల కోసం 20,34,600 మంజూరయ్యాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి కుకింగ్ కాస్ట్ కింద రూ.3.86, ఒక గుడ్డు ధర రూ.2 కలిపి రూ.5.86, యూపీఎస్‌ల్లో ఒక్కో విద్యార్థికి కుకింగ్ కాస్ట్ రూ.5,78, గుడ్డుకు రూ.2 కలిపి రూ.7.78, 9, 10వ తరగతి విద్యార్థులకు కుకింగ్ కాస్ట్ రూ.5,78, గుడ్డుకు రూ.2 కలిపి రూ.7.78చొప్పున ఏజెన్సీలకు చెల్లిస్తారు. -
బువ్వ కరువు
ఇంటర్ విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం ప్రతిపాదనల వద్ద ఆగిన నిర్ణయం.. పట్టించుకోని ప్రభుత్వం సంగారెడ్డి మున్సిపాలిటీ:మధ్యాహ్న భోజనం పథకం ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చలేకపోతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 50 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16 వేల మంది పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు హైస్కూల్ తరహాలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పథకం నేటికీ అమలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి తగిన భోజన ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు డివిజనల్ విద్యాధికారి కాశీనాథ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ, పైనుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన స్వయంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకం సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఫైన్రైస్కు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో పాటే ఇంటర్ బోర్డు అధికారులకు సైతం కళాశాలల వారీగా విద్యార్థుల వివరాలతో పాటు కిచెన్, వంట సామగ్రికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 50 ఇంటర్ కాలేజీలు ఉన్నాయని, 12 చోట్ల తాత్కాలిక కిచెన్ షెడ్లు, వంట సామగ్రి అవసరం ఉన్నట్టు తెలిసింది. కాగా, విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా మధ్యాహ్న భోజన పథకం ఎక్కడా ప్రారంభం కాలేదు. ప్రతిపాదనలు పంపించాం: కాశీనాథ్, డీవీఈఓ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా 50 జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరంలో(ఆగస్టు 1 నాటికి) 7,800, సెకండ్ ఇయర్లో 8,200 మంది విద్యార్థులు ఉన్నారు. 12 కాలేజీలకు సొంత భవనాలు లేక అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. అక్కడ తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. సమాచారం లేదు: అనిల్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వం వద్ద లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి. నీరసంగా ఉంటుంది: శిరీష, విద్యార్థిని, కొండాపూర్ ప్రభుత్వ కళాశాల ఉదయం 9 గంటలకు అలియాబాద్ నుంచి కాలేజీకి వస్తాం. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్లాం. అప్పటి వరకు ఉదయం తిన్న భోజనమే. దీంతో నీరసంగా ఉంటోంది. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వ మధ్యాహ్న భోజనం త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. -
ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు
నిధులివ్వలేక చేతులెత్తేసిన సర్కారు తాజాగా పీఎంఏవై-జీ పథకం తెరపైకి 13 నిబంధనలతో లబ్ధిదారుల కుదింపు గ్రామసభల్లో మరింత వడపోత ల్యాండ్‌లైన్ ఫోనుందా.. అయితే మీరు ఎంతటి పేదలైనా ప్రభుత్వ గృహం పొందేందుకు అర్హతలేనట్టే. ఇది సాక్షాత్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు. డబుల్ బెడ్రూం గృహాలంటూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి నియోజకవర్గానికి 1,250 గృహలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఏడాదైనా నిర్మాణాలకు దిక్కులేదు. ఒక్క పైసా కూడా విదల్చలేదు. గత ఏప్రిల్14న ఈ పథకానికి నియోజకవర్గాల్లో శిలాఫలకాలు వేయించి చేతులు దులుపుకుంది. కేంద్రం ఇచ్చే పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాజ్‌యోజన (గ్రామీణ) పథకం) నిధులు, గృహాలపైనే ఆధారపడింది. ఫలితంగా పేదలకు గృహాలు దక్కే పరిస్థితులు లేకుండాపోతోంది. బి.కొత్తకోట: ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకానికి అడుగడుగునా అవాంతరాలే. నిర్మిస్తారో లేదో తెలియని ఇళ్లకు సవాలక్ష నిబంధనలను ప్రభుత్వం విధించింది. జిల్లాలో ఈ పథకం కింద మంజూరుచేసిన గృహాలకు 50శాతం స్థలాలున్న, 50 శాతం స్థలాలులేని లబ్ధిదారులను గుర్తించాలి. ఇందులో ఇళ్లస్థలాలు కలి గిన 8,575 మంది జాబితాకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోద ముద్రవేశారు. నిర్మాణాలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కఇంటి నిర్మాణమైనా ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో పీఎంఏవై పథ కం ద్వారా కేంద్రం నుంచి నిధులు పొం దేందుకు సిద్ధపడింది. లబ్ధిదారుల జాబితాను నిబంధనల పేరిట వడపోసి కొందర్నే అర్హులుగా చేయాలని సిద్ధమైంది. పీఎంఏవై పథకమే దిక్కు.. ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ.2.75లక్షలతో ఇంటినిచేపట్టేందుకు నిర్ణయించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రూ.1.75లక్షలు, ఇతరులకు రూ.1.25లక్షలు సబ్సిడీగా, మిగిలి నది రుణంగా ప్రకటించిం ది. ఈ నిధుల కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రగృహ పథకం నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంఏవై పథకం కింద లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి నివేదిస్తే ఎన్టీఆర్ ఇళ్లపై నిబంధనల పిడుగు ఒక్కోఇంటికి రూ.1.20లక్షలు ఇస్తుంది. దీనికి రాష్ట్రం వాటా కలిపితే ప్రకటించిన యూనిట్ విలువతో గృహాలు నిర్మించేందుకు నిర్ణయించింది. భారం తగ్గించుకునేందుకే దీనికి పూనుకొన్నట్టు స్పష్టం అవుతోంది. ప్రస్తుత జాబితాలతో గ్రామసభలు జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకంలో స్థలాలు కలిగిన 50శాతం లబ్దిదారుల జాబితాలతో గ్రామసభలు నిర్వహించనున్నారు. దీనికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలు, ఎంపీడీఓలు ఈనెల 30లోగా గ్రామసభలు నిర్వహించి లబ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభలో 13 అంశాల్లో లేనివారిని లబ్దిదారులుగా ఎంపిక చే సినట్లు పంచాయతీ తీర్మానం చేసి పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు సంతకాలు చేశాక నివేదికలు జిల్లా కేంద్రానికి పంపాలి. ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధం కాగా కేంద్రనిధుల కోసం ఎంపికచేయగా మిగిలినవారి పరిస్థితి ప్రశ్నార్థకమే. ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ పథకం ఇప్పట్లో అమలుచేసే పరిస్థితి లేకపోవడంతో లబ్దిదారులకు ఎదురుచూపులు తప్పవు. 13లో ఒక్కటున్నా ఇల్లు పుటుక్కే పీఎంఏవై లబ్దిదారులను ఎంపిక చేసేందుకు విధానం ఉంది. సాంఘిక, సామాజిక, ఆర్థిక, కుల గణంకాల సర్వే-2011 ఆధారంగా ఇళ్ల కేటాయింపులకు అర్హులను గుర్తించాలి. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. 13 అంశాలకు సంబంధించి కింది ఏ ఒక్క అంశానికి లబ్దిదారులు కలిగివున్నా అనర్హులుగా నిర్ణయిస్తారు. -
నాటుకోడి పులుసు... బెల్లం జిలేబీ
- ప్లీనరీలో నోరూరించే 50 రకాల వంటకాలతో విందు - తెలంగాణతోపాటు ఆంధ్రా రుచులు కూడా.. - 120 మంది ఏపీ, తెలంగాణ నిపుణుల నేతృత్వంలో వంటలు - 10 వేల మందికి సరిపోయేలా ఏర్పాట్లు ఖమ్మం: టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రతినిధులను 50 రకాల వంటకాలతో పసందైన విందు భోజనం అలరించనుంది. అతిథులందరినీ ఆకట్టుకునేలా నోరూరించే విభిన్నమైన వంటకాలు నోరూరించనున్నాయి. తెలంగాణ వంటకాలతో పాటు ఆంధ్రా రుచులనూ వడ్డించనున్నారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు చేయడంతోపాటు అందుకు తగినట్లుగా వంటకాలూ సిద్ధం చేస్తున్నారు. 120 మందికి పైగా ఆంధ్రా, తెలంగాణ వంట నిపుణులు మంగళవారం నుంచే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్లీనరీకి 4 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముండగా... వారితో వచ్చే సహచరులు, అనుచరులను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా సుమారు 10,000 మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పాహరం ఉదయం 7 గంటల నుంచి ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు అల్పాహారం అందించనున్నారు. ఇడ్లీ, పూర్ణం, వడ, ఉప్మా, పెసరట్టు, పొంగలి, కొబ్బరి చట్నీ, కారంపొడి, సాంబార్, నెయ్యి, టీ, కాఫీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం భోజనంలోకి.. భోజనంలో తవ్వా స్వీట్, బెల్లం జిలేబీ, కట్లెట్, గారె, కొత్తిమీర, టమాటా చట్నీ, వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, పెరుగు చట్నీ, అన్నం, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, వంకాయ పూర్ణం, గుమ్మడికాయ ఇగురు, ముంజల కర్రీ, మద్రాస్ ఉల్లిచెట్నీ, మెంతి మజ్జిగ, పప్పుచారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, మిరియాల రసం, నల్లకారం, నెయ్యి, ఉలవచారు, గుడ్డు, నాటుకోడి పులుసు, మటన్ ధమ్కీ బిర్యానీ, పుంటికూర మటన్, చింతచిగురు రొయ్యలు, కొర్రమీను పులుసు, మటన్ కర్రీ, మెంతి చికెన్, గుత్తి వంకాయ, క్యాప్సికం పకోడీ, బీరకాయ, దొండకాయ, రోటి పచ్చడి, పెసరపప్పు టమాట, చీమ చింతకాయ ఫ్రై, చామదుంప పులుసు, ముద్దపప్పు, అప్పడం, పెరుగు, బ్రెడ్ హల్వా, ఐస్ క్రీం, పెజ్రోల్ తదితర 50 రకాల వంటకాలు వడ్డించనున్నారు. చెరుకూరి తోటలో ప్లీనరీ జరిగే ప్రాంతంలో భోజనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదికపై ఉన్నవారికి.. ప్లీనరీ వేదికపై ఉన్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ ప్రారంభం కాగానే ఉదయం 10 గంటలకు మజ్జిగ అందిస్తారు. 11 గంటలకు రాగి, జొన్నల జావ, మధ్యాహ్నం 2 గంటలకు స్నాక్స్, బొప్పాయి, ద్రాక్షపండ్లు, 4 గంటలకు టీ, హట్ బాదం, 5 గంటలకు బాసుంది అందిస్తారు. ప్రతినిధులకు.. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 11 గంటలకు మజ్జిగ, సాయంత్రం 3 గంటలకు మైసూర్ పాక్, ఉల్లి పకోడీ, సాయంత్రం 4 గంటలకు మజ్జిగ సరఫరా ఉంటుంది. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
హెచ్ఎంలకు బాధ్యతల అప్పగింత ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో టిఫిన్, రెండుపూటలా భోజనం విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఎస్సీ, ఎస్టీ గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయూ పాఠశాలల హెచ్ఎంలకు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. హైస్కూళ్లలో ఎక్కువమంది విద్యార్థులున్నచోట హెచ్‌ఎంతోపాటు మరో టీచర్ కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు విద్యార్థులు పాఠశాలకు వచ్చి కాసేపు ఆడుకున్నాక 10 గంటలకు భోజనం పెట్టాలి. ఈ నెల 21 నుంచి ఆదివారాలతో కలిపి మొత్తం 53 రోజులపాటు ఈ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్‌తో సహా మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉంచాలి. వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఏ మండలంలో ఉంటే అక్కడి రెసిడెన్షియల్ స్కూల్‌కు కూడా వెళ్లి భోజనం చేయవచ్చు. జిల్లాలో 25 చోట్ల బాలురకు, 25చోట్ల బాలికలకు రెసిడెన్షియల్‌గా కూడా మధ్యాహ్న భోజనం అందించబోతున్నారు. ఈనెల 25 నుంచి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో దీన్ని అమలుచేయబోతున్నారు. కాగా, విధులు నిర్వహించే హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు పీపీఎల్ లీవ్స్ ఇచ్చే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. భోజనం అమలుపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అందనున్నారుు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అదనపు జేసీ తిరుపతిరావు, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య, డీఈవో పి రాజీవ్, ఐటీడీఏ పీవో ఆమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 2,46, 811 మంది.. జిల్లాలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కలిపి 2,46, 811 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది మధ్యాహ్న భోజనానికి వస్తారని అంచనా. కాగా, అన్ని పాఠశాలలకు 53 రోజులకు సరిపడా సుమారు 999.457 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేయబోతున్నారు. అలాగే వంట ఖర్చుల కింద రూ 3.55 కోట్లు అవసరమని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. -
కాకా హోటల్లో హరీశ్ రావు
నారాయణ్‌ఖేడ్: ఆయనో మంత్రి. కోరుకుంటే ఫైవ్ స్టార్ హోటల్లో, ఖరీదైన భోజనం చేయగలరు. ఎక్కడి నుంచి అయినా కావాల్సిన వంటకాలు తెప్పించుకుని తినగలరు...మరి అలాంటి వ్యక్తిని ఓ రోడ్డు సైడ్ హోటల్లో తింటూ ఊహించగలమా....అందులోనూ పులిహోర, కారా, పొంగల్ లాంటి మామూలు వంటలు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారంలో... సరిగ్గా ఇదే జరిగింది. ఓటర్లను ఆకట్టుకునేందుకో....లేదంటే ప్రచారంలో తిరిగి తిరిగి అలసిపోయి ఆకలేసిందో తెలియదు కానీ....తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఓ కాకా హోటల్లో సందడి చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి.... సదా సీదా వంటలు భుజించి ఆకలి తీర్చుకున్నారు. అంతేకాదు...చుట్టుపక్కలున్న తన అనుచరులకు కూడా కొసరి కొసరి వడ్డించారు. ఓ రాష్ట్రమంత్రి ఓ సాదాసీదా హోటల్లో సామాన్యుడిల్లా తింటుండడంతో....దీన్ని చూసేందుకు స్థానికులు పోటీపడ్డారు. మంత్రి హరీష్‌రావే కాదు... డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి కూడా సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ సామాన్యుడి వంటకాలను ఆరగించేశారు. -
హోలాండ్ తో ఐశ్వర్యరాయ్ లంచ్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ గౌరవార్ధం భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి రిచియర్ మంగళవారం ఇచ్చిన మధ్యాహ్న విందులో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపురంగు బెనారస్ పట్టుచీరలో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఐశ్వర్య కనిపించారు. ఒకే టేబుల్ వద్ద కూర్చుని హోలాండ్, ఐశ్వర్యలు కాసేపు సినిమాల గురించి, కేన్స్ ఫెస్టివల్ గురించి ముచ్చటించారు. ఐశ్వర్యకు ఫ్రాన్స్‌తో అనుబంధం ఉంది. అక్కడ జరిగే కేన్స్ ఫెస్టివల్లో ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటారు. అదీకాక, తమ దేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్’తో ఫ్రాన్స్ ఐశ్వర్యను గౌరవించింది. -
క్లిక్ చేస్తే లంచ్ బాక్స్!
కొందరు బరువు తగ్గాలి. మరికొందరు కాస్త పుష్టిగా మారాలి. వీటికోసం జిమ్, యోగా సెంటర్లలో గడిపేవారు ఎక్కువమందే. అయితే వ్యాయామంతో పాటు సరైన ఆహారం ఉంటేనే ఇదంతా సాధ్యమని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి ఏం తింటే బెటర్? చక్కని ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ తమ ‘డైట్ ఆన్ క్లిక్’తో సమాధానం చెబుతున్నారు ఈ యువకులు. బరువు తగ్గటానికైనా, పెరగటానికైనా రహస్యం సరైన సమయానికి సరైన పౌష్టికాహారం తీసుకోవటమేనంటున్నారు వీళ్లు. దీనికోసం తమ ‘డైట్ ఆన్ క్లిక్.కామ్‌లో’ ఆర్డరిస్తే చాలు. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్ రెండూ ఒకేసారి అందించడమే వీరి ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకులు, ఆనంద్, స్వరూప్‌ల మాటల్లోనే... ♦ పౌష్టికాహారానికి ‘డైట్ ఆన్ క్లిక్’ ♦ ఒకే సమయంలో లంచ్, స్నాక్స్ కూడా.. ♦ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సేవలు ♦ నిధుల సమీకరణ తరవాత విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో .ఈ రోజుల్లో ప్రతిదానికీ ఆన్లైనే వేదికైంది. అయితే ఆన్లైన్లో ఫుడ్ అందిస్తున్న సంస్థల మెనూ చూస్తే... బిర్యానీలు.. కేలరీలు ఎక్కువుండే నాన్‌వెజ్ ఐటమ్స్, స్నాక్స్ విషయానికొస్తే పిజ్జాలు.. సమోసాలు.. ఇవే కనిపిస్తుంటాయి. అమ్మేవారి సంగతి పక్కన పెడితే.. తినేవారి ఆరోగ్యం మాటేంటి? ఆకలితో కొందరు.. వేరే అవకాశం లేక ఇంకొందరు మొత్తం మీద అందరూ అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. మేం ఐటీ ఉద్యోగులం కావటంతో మాకూ ఈ బాధలు తప్పలేదు. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని... అదీ సమయానికి అందించే సంస్థలేవైనా ఉన్నాయా! అని వెతికితే ఒక్కటీ కనిపించలేదు. అప్పుడే అనిపించింది... వేరే ఎవరో చేయడమెందుకు మనమే రంగంలోకి దిగితే బాగుంటుంది కదా... అని. ఇంకేముంది! ఇంటర్మీడియెట్ నుంచి స్నేహితులమైన మేం... శరత్ అనే మరో స్నేహితుడితో కలసి రూ.9 లక్షల పెట్టుబడి పెట్టి కూకట్‌పల్లిలోని ఫోర్త్ ఫేజ్‌లో డైట్ ఆన్ క్లిక్ పేరిట కిచెన్‌ను ఏర్పాటు చేశాం. లంచ్, స్నాక్స్ రెండూ ఒకేసారి... డబ్బా బుక్ చేసుకోవాలనుకుంటే ఉదయం 11 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12-2 గంటల మధ్య సరఫరా చేస్తాం. ఇందులోనే సాయంత్రానికి కావాల్సిన స్నాక్స్ కూడా ఉంటాయి. ప్రతీ రోజూ మెనూ మారుతుంటుంది. ప్రస్తుతం రోజుకు 160కి పైగా ఆర్డర్లొస్తున్నాయి. నేరుగా కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఒక్క రోజుకైతే డబ్బా ధర రూ.90. వారం, నెల వారీ ప్యాకేజీలకైతే ఇంకా తక్కువే పడుతుంది. వారం ప్యాకేజీ డబ్బా ధర రూ.85, నెల ప్యాకేజీలో డబ్బా ధర రూ.79. సర్వీస్ చార్జీలుండవు. శని, ఆదివారాలు సెలవు. ఇంకో ప్రత్యేకతేమిటంటే మా రెగ్యులర్ కస్టమర్లకు మేం న్యూట్రికేర్ వంటి ప్రముఖ సంస్థల చేత ఆహారం విషయంలో కౌన్సిలింగ్ కూడా ఉచితంగానే ఇప్పిస్తున్నాం. నిధుల సమీకరణపై దృష్టి.. ప్రస్తుతం కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఆ తరవాత హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తాం. గత నెలలో రూ.2.70 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. ప్రస్తుతం 8 మంది డెలివరీ బాయ్స్, వివిధ రెస్టారెంట్లలో 18 ఏళ్ల అనుభవమున్న ఓ చెఫ్‌తో పాటు ముగ్గురు సహాయకులను నియమించుకున్నాం. డైట్ ఆన్ క్లిక్ మెనూ ఇదే.. సోమవారం: బీట్ రూట్ రోటీ, పాలకూర పప్పు, చిక్కుడు కాయ కర్రీ, పుదీనా రైస్, బ్రౌన్/వైట్ రైస్, పెరుగు. స్నాక్స్: మొలకెత్తిన పెసలు, పళ్లు. మంగళవారం: క్యారెట్ రోటీ, మెంతికూర పప్పు, రాజ్మ కర్రీ, పెరుగు, సోయా రైస్, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: రావి బిస్కెట్లు, ఫైబర్ రిచ్ స్వీట్ పొటాటో. బుధవారం: మేతి రోటీ, టమాటా పప్పు, టోఫూ ఆలు మిక్స్డ్ కర్రీ, పెరుగు, బీట్ రూట్ రైస్, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: ఉలవల లడ్డూ, స్వీట్ కార్న్. గురువారం: మల్టీ గ్రెయిన్ రోటీ, దోసకాయ పప్పు, క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, పెరుగు, కొబ్బరన్నం, బ్రౌన్/వైట్ రైస్. స్నాక్స్: మిక్స్డ్ నట్స్, పీనట్ సలాడ్. శుక్రవారం: సొరకాయ రోటీ, ఉలవచారు, వంకాయ కర్రీ విత్ ఉలవల పౌడర్, పెరుగు, రాగి జావ, బ్రౌన్/వైట్ రైస్ స్నాక్స్: మిక్స్డ్ ఫ్రూట్స్, నల్ల శనగల సలాడ్. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
వివాదాస్పదంగా మారిన రాజధాని విరాళాలు
-
మంచు లంచ్
మంచి లంచ్ గురించి వినే ఉంటారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి జమ్ము-కశ్మీర్ నుంచి మంచు లంచ్ తెచ్చాం! ఈ చలికాలం కశ్మీర్‌ని తలచుకుంటూ... వేడి వేడిగా స్టార్టర్స్‌కి టీ అండ్ స్నాక్.. మెయిన్ కోర్స్‌కి నోరూరించే పలావ్.. డెజర్ట్‌లో డ్రైఫ్రూట్ షుఫ్తా.. ఈ త్రీ-కోర్స్ లంచ్ లాగించండి. కెహ్వా (కాశ్మీర్ టీ) దీనిని ముగిలీ ఛాయ్ అని కూడా అంటారు. ఇది కాశ్మీరీయుల తేనీరు. అతిథులకు ముందు, సూప్ బదులుగా వేడి వేడి తేనేటిని అందిస్తారు. కావల్సినవి: 4 కప్పుల నీళ్లు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ తాజా తేయాకు (పొడి చేయాలి), 2 ఏలకులు, 3 బాదంపప్పులు (పొడి చేయాలి), పంచదార - రుచికి తగినంత. (ఈ టీ లో పంచదారకు బదులుగా తేనెను కూడా కలుపుకోవచ్చు.) తయారీ: పాత్ర లేదా టీ కెటిల్లో నీళ్లు పోసి, అందులో తేయాకులను వేసి మరిగించాలి. దీంట్లో తగినంత పంచదార, బాదాం, దాల్చిన చెక్క, ఏలకుల పొడులను వేసి కలిపి పైన మూత పెట్టి మరిగించి కప్పులో పోయాలి. టీ తాగేటప్పుడు తేయాకు రావడం ఇష్టపడని వారు ముందుగా తేయాకును వడకట్టుకొని తర్వాత మిగతా పొడులను వేసి మరిగించాలి. దీనిని వేడి వేడిగా సర్వ్ చేయాలి. యాజి ఇది కాశ్మీర్ గ్రామీణ ప్రాంత స్నాక్.కావల్సినవి: కేజీ బియ్యప్పిండి, టేబుల్‌స్పూన్ ఉప్పు, పావు కేజీ వాల్నట్స్, టేబుల్‌స్పూన్ జీలకర్ర, వాము పొడి, పావు కప్పు ఆవనూనె లేదా రిఫైండ్ ఆయిల్.తయారి: వాల్‌నట్స్‌ను నీళ్లలో వేసి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, రెండు కప్పుల నీళ్లు, జీలకర్ర, వాము, బియ్యప్పిండి వేసుకుంటూ బాగా కలపాలి. ఈ మిశ్రమం మృదువుగా అవడానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు. కలిపిన పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ‘కప్పు’ షేప్(దీనిని యాజి అంటారు) లో చేతులతోనే మౌల్డ్ చేయాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. వేడిగానూ, చల్లగానూ, టీ తోనూ వీటిని సర్వ్ చేయవచ్చు. కాశ్మీర్లో కొన్ని చోట్ల వీటిని ఆవిరిమీద అరగంటపాటు ఉడికిస్తారు. రిస్తా కావల్సినవి: కేజీ గొర్రె మాంసం, అరకప్పుడు ఆవ నూనె, అర టీ స్పూన్ చొప్పున సోంపు, అల్లంపొడి, పసుపు, కారం, గరం మసాలా, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి. 2 టేబుల్స్పూన్ల తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, చిటికెడు కుంకుమపువ్వు. తయారి: పాత్రలో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, జీలకర్ర వేగాక, కారం, పసుపు వేసి దీంట్లో లీటర్ నీళ్లు పోసి అల్లంపొడి వేయాలి. బాగా మరిగాక దీంట్లో విడిగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతుండగా మెత్తటి మటన్ బాల్స్ వేసి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి. మాంసం ఉడికి, గ్రేవీ చిక్కగా అయ్యాక అందులో ఏలకులు, దాల్చిన చెక్క పొడి, గరంమసాలా, కుంకుమపువ్వు వేసి స్టౌ సిమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా ఈ రిస్తాను భోజనంలోకి వడ్డించాలి. కాశ్మీరీ పులావ్ కావల్సినవి: 3 కప్పుల బాస్మతీ బియ్యం, ఐదున్నర కప్పుల నీళ్లు, అర కప్పుడు వెన్నతీయని పాలు(హోల్‌మిల్క్), టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్స్పూన్ల నెయ్యి లేదా బటర్, 3 ఏలకులు, 3 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అర కప్పుడు సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు, అరకప్పుడు పచ్చి బఠాణీలు, పావుకప్పు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు దానిమ్మ గింజలు, 8 పిస్తాపప్పు, పావుకప్పు కిస్మిస్, ఒక కట్ట ఉల్లికాడలు తయారి: బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. వెడల్పాటి పెద్ద పాత్ర లేదా నాన్‌స్టిక్ పాన్‌ను మీడియమ్ హీట్‌లో ఉంచి అందులో బటర్ వేసి వేడి చేయాలి. దీంట్లో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. దీంట్లో వడకట్టిన బియ్యం వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత నీళ్లు, పాలు పోసి కలపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి. పైన నిమ్మరసం వేసి కలపకుండానే బియ్యాన్ని ఉడికించాలి. పైన మూతపెట్టి మీడియమ్ హీట్ ఉంచి ఉడికించాలి. పూర్తిగా ఉడికిందా లేదా సరిచూసుకొని, మంట తీసేయాలి. క్యారట్ ముక్కలు, పచ్చబఠాణీ, పైనాపిల్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉడికిన అన్నంలో వేసి కలపాలి. వేడి వేడిగా వడ్డించే ముందు దానిమ్మ గింజలు, సన్నగాతరిగిన ఉల్లికాడలతో పైన గార్నిష్ చేయాలి. కావాలనుకుంటే వాల్నట్స్, బాదంపప్పులు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లు గార్నిష్‌గా వాడుకోవచ్చు. శుఫ్తా డిజర్ట్ కాశ్మీరీ సంప్రదాయ వంటకాలలో చివరలో తప్పక ఉండే స్వీట్ ఇది. రకరకాల డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా పంచదార పాకంతో కలిపి తయారుచేస్తారు.కావల్సినవి: ఎండు ఖర్జూరం, ఎండుకొబ్బరి, బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు వాల్నట్స్... ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అరకప్పు చొప్పున, అరకప్పు నెయ్యి, 2 కప్పుల పంచదార, టీస్పూన్ మిరియాల పొడి, అల్లం తరుము, ఏలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఎండు గులాబీ రేకలు. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నీ తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. వడకట్టి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఖర్జూరాలను సన్నగా తరిగి గింజలు తీసేయాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి కొబ్బరిని ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలను ప్లేట్లోకి తీసుకొని, అదే నెయ్యిలో పనీర్ ముక్కలు వేసి వేయించాలి. దాంట్లో నీళ్లన్నీ ఆరిపోయాక డ్రై ఫ్రూట్స్ వేయాలి. తర్వాత కొబ్బరి ముక్కలు, పంచదార, మిరియాలపొడి, ఏలకుల పొడి, అల్లంపొడి, దాల్చిచెక్క పొడి, కుంకుమపువ్వు, గులాబీ రేకలు వేసి పంచదార అంతా కరిగేవరకు వేడి మీద ఉంచాలి. వెంటనే దించి సర్వ్ చేయాలి. డా.బి.స్వజన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్ (ఐఐటిటిఎమ్) భువనేశ్వర్ -
ఆకు పచ్చ బతుకు పచ్చ
అరటి ఆకులో భోజనం... ఆరోగ్యానికి తొలిమెట్టు.మరి భోజనం ముగిశాక తమలపాకుల సేవనం?... అదీ ఆరోగ్యానికి మరో మెట్టే... ఆకుపచ్చలోనే ఆరోగ్యం ఉంది. ఆకు కూరలో అది మరీ దాగి ఉంది. ప్రకృతి మనిషి కోసం ఎన్ని ఆకుకూరలను ప్రసాదించలేదు కనుక.... బచ్చలికూర... పాలకూర... చుక్కకూర... తోటకూర.... మెంతికూర... వంటివి మరోవైపు... ఒంటికే కాదు... కంటికి కూడా ఆరోగ్యమే...చల్లగాలిలో... తెల్లని వెన్నెలలో... ఆకుపచ్చటి వంటలు చేసుకుని... కడుపు నిండా తిని... నోరారా త్రేన్చి... పచ్చనాకు సాక్షిగా... అయినవారికి ఆకుల్లోనే పెట్టాలి అనుకుందాం.... తోటకూర ఉండలు కావలసినవి: తోటకూర తరుగు - 3 కప్పులు, సెనగ పిండి - అర కప్పు, పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నీళ్లు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చి కొబ్బరి తురుము - టేబుల్ స్పూను పోపు కోసం: నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఎండు మిర్చి ముక్కలు - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, నూనె - 2 టీ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో సన్నగా తరిగిన తోటకూర, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర, సెనగ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ గట్టిగా పకోడీల పిండిలా కలపాలి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి బాణలిలో నూనె పోసి కాగాక, మంట తగ్గించి, తోటకూర ఉండలను ఒక్కొక్కటిగా వేస్తూ బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి నువ్వులు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ వేయించాలి వేయించి ఉంచుకున్న తోటకూర ఉండలు జత చేసి, బాగా కలిపి దింపేయాలి పచ్చి కొబ్బరి తురుము పైన చల్లి, టీతో అందించాలి. మెంతికూర/కొత్తిమీర పచ్చడి కావలసినవి: మెంతికూర - 10 కట్టలు, చింతపండు - నిమ్మకాయంత, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి - 15, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - కొద్దిగా, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను. తయారీ: ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగి త డి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మెంతి కూర వేసి వేయించాలి చింతపండు, ఉప్పు జత చేసి బాగా కలిపి ఆరేడు నిమిషాలు మగ్గించాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మెంతులు వేసి వేయించి దింపేసి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మెంతి కూర జత చేసి, మరోమారు మిక్సీ తిప్పాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ వేసి, ఒక్క పొంగు రానిచ్చి దింపేసి, మెంతికూర పచ్చడిలో వేయాలి ఇది సుమారు నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది (ఇలాగే కొత్తిమీర పచ్చడి కూడా చేసుకోవచ్చు) పొన్నగంటి ఆకు వేపుడు వలసినవి: పొన్నగంటి ఆకు - 2 కప్పులు, పచ్చిసెనగ పప్పు - అర కప్పు, కొబ్బరి కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, పోపు కోసం, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, సెనగ పప్పు - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను తయారీ: పచ్చి సెనగపప్పును శుభ్రంగా కడిగి సుమారు గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె వేసి వేడయ్యాక, పోపు సామాను వేసి వేయించాలి నానబెట్టిన సెనగపప్పు జత చేసి, బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక దీనికి పొన్నగంటి ఆకును జత చేసి బాగా కలపాలి ఉప్పు, పసుపు వేసి మరోమారు కలిపి మూత ఉంచాలి పొన్నగంటి ఆకు, సెనగ పప్పు బాగా కలిసి ఉడికిన తరవాత, కొబ్బరి కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి, దింపేయాలి వేడి వేడి చపాతీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. బచ్చలికూర మజ్జిగ పులుసు కావలసినవి: బచ్చలి కూర - 3 కట్టలు (శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి), చిక్కటి మజ్జిగ - 3 కప్పులు (కొద్దిగా పుల్లగా ఉండాలి), ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ధనియాల పొడి - టీ స్పూను, పచ్చి మిర్చి - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారీ: ఒక పాత్రలో బచ్చలి కూర, ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి చిక్కగా చిలకరించిన పెరుగులో పసుపు వేసి బాగా కలిపాక, ఉడికించిన బచ్చలికూర వేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, జీలకర్ర వేసి వేయించి పెరుగు పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి కలిపి, వేడి వేడి అన్నంలో వడ్డించాలి. పాలకూర సూప్ కావలసినవి: పాలకూర - 3 కట్టలు (సన్నగా తరగాలి), దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 3, బిర్యానీ ఆకు - 1, కరివేపాకు - 2 రెమ్మలు, ఉల్లి తరుగు - అర కప్పు (సన్నగా తరగాలి), వెల్లుల్లి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చి మిర్చి - 1, బటర్ - టేబుల్ స్పూను, బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు (2టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి), మీగడ లేదా తాజా క్రీమ్ - ఒకటిన్నర టీ స్పూన్లు, మిరియాల పొడి - కొద్దిగా తయారీ: ఒక పాత్రలో బటర్ వేసి కరిగించాక, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము జత చేసి సుమారు 4 నిమిషాల సేపు వేయించాలి పాలకూర తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరో రెండు నిమిషాలు కలపాలి నాలుగు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలిపి మంట ఆర్పేయాలి. బాగా చల్లారిన తర్వాత వడకట్టాలి లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలను తీసేయాలి పాలకూర ముద్ద, ఉల్లి తరుగు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి వడ కట్టిన నీటిని పాలకూర ముద్దకు జత చేసి, సన్నటి మంట మీద సుమారు ఆరేడు నిమిషాలు ఉంచాలి ఉప్పు, మిరియాల పొడి జత చేయాలి నీళ్లలో కలిపి ఉంచిన బియ్యప్పిండిని జత చేసి బాగా క లుపుతుండాలి తాజా క్రీమ్ జత చేసి దింపేయాలి వేడివేడిగా అందించాలి. చుక్కకూర చట్నీ కావలసినవి: చుక్కకూర - 5 కట్టలు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీ స్పూను, నూనె - 3 టీ స్పూన్లు, నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఎండు మిర్చి - 5, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, ఎండు మిర్చి - 4 (ముక్కలు చేయాలి), ఆవాలు - టీ స్పూను తయారీ: ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి చుక్కకూరను కడిగి సన్నగా తరగాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి చుక్క కూర, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. సుమారు పది నిమిషాలయ్యేసరికి చుక్క కూర గుజ్జులా అవుతుంది నువ్వుల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి బాగా చల్లారాక, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చడి బాగా కలిపి, వేడి వేడి అన్నంతో తీసుకోవాలి. -
రానాతో లంచ్ చేస్తారా.. సెల్ఫీ కూడా కావాలా?
రానాతో కలిసి లంచ్ చేయాలనుకుంటున్నారా.. అలాగే ఓ సెల్ఫీ కూడా దిగాలనుకుంటున్నారా? అయితే జస్ట్ ఓ 200 రూపాయలు, లేదా అంతకంటే ఎక్కువ డొనేట్ చేస్తే చాలు!! దాంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ మాట స్వయంగా రానానే చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉందా.. భల్లాలదేవతో లంచ్ అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండటం సహజం. అసలు విషయానికొస్తే.. రానా దగ్గుపాటి VynVyn.com అనే వెబ్‌సైట్‌తో కలిసి ఓ మంచి పనికి పూనుకున్నారు. ఆర్థిక పరిస్థతుల వల్ల చాలామంది చిన్నారులు సరైన పోషణకు దూరమౌతున్నారని.. మనందరం కలిసి ఆరోగ్యంగా ఉండాల్సిన వారి హక్కును వారికిద్దామని అంటున్నారు. అయితే దీనికి మనం చేయాల్సిందల్లా.. రెండు వందల రూపాయలు మొదలుకుని మనకు తోచినంత సాయం చేయడమే. అలా మనం చేసే సాయం నేరుగా వారికి చేరేలా ఏర్పాటు చేశారు. చిన్నారులకు సాయం చేసినవారిలో ఒకరిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి రానాతో లంచ్ చేసే అవకాశం కల్పిస్తారు. అంతేనా.. ఇండియాలోని ఏ ప్రాంతంలోనైనా లంచ్‌కి రెడీ అంటున్నారు రానా. మన కబుర్లన్నీ వింటారట, మనతో సెల్ఫీలకు కూడా రెడీ అట. 'ఇదంతా డబుల్ ఓకే.. కానీ ఆ లక్కీ విన్నర్ మేం కాకపోతే?..' అనేదేగా మీ డౌట్. ఆ విషయం కూడా చెప్పారు రానా.. డొనేట్ చేసిన అందరికీ తప్పక బహుమతులుంటాయట. బంపర్ ఆఫర్.. ఫ్యాన్స్.. ఇంకెందుకు, ముందుకు దూకండి! -
వికటించిన మధ్యాహ్న భోజనం
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం వండిన భోజనం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే పాఠశాలలో జూన్ 24వ తేదీన కూడా ఇలాగే జరిగి దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మోడల్ స్కూల్లో 364 మంది విద్యార్థులకు శుక్రవారం 360 మందికి సరిపడ భోజనం వండారు. భోజన సమయంలో ముందుగా 8,9,10వ తరగతి విద్యార్థులు మొదటగా భోజనం చేశారు. కాసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో మిగతావారు భోజనం వదిలేశారు. గమనించిన ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన విద్యార్థి సంఘాల సహకారంతో 108 అంబులెన్స్, ఆటోలో ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యమందించారు. వారిలో తీవ్రంగా అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని మండల వైద్యాధికారి కె.రామకృష్ణ తెలిపారు. ఇదిలావుండగా పాఠశాలలో వండిన సోరకాయ చెడిపోయిందని, కూరలో కారం అధికంగా వేయడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. గతంలో గతంలో అస్వస్థతకు లోనైనప్పుడు కూడా సోరకాయ కూరనే వడ్డించడంతో నాసిరకమైన కూరగాయలు వాడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. -
నమోతో విందుకు పెద్ద ఎత్తున ఆసక్తి
దుబాయి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం దుబాయిలో పర్యటించనున్న సందర్భంగా ఆయనతో కలిసి బహిరంగ విందులో పాల్గొనేందుకు భారతీయులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయి స్పోర్ట్స్ సిటీలోని దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ విందుకు ఏకంగా 50 వేల మంది భారతీయులు పేర్లు నమోదు చేసుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. మోదీతో విందుకు హాజరయ్యే అతిథులకు ఉచిత ఆహారం, నీరు అందజేయనున్నారని, ఓపెన్ ఎయిర్ స్టేడియాన్ని సైతం ఎయిర్ కండీషన్‌గా మారుస్తున్నారని 'గల్ఫ్ న్యూస్' పత్రిక పేర్కొంది. బుధవారం సాయంత్రానికే 48 వేలకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 'నమోఇన్దుబాయి.ఏఈ' వెబ్సైట్ తెలిపింది. దుబాయిలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకూ ఉంటున్నందున ఒకరోజు ముందు నుంచే స్టేడియాన్ని చల్లబర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ విందుకు మొత్తం 50 వేలకు పైగా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, చివరగా కనీసం 40 వేల మంది హాజరు కావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా మోదీ ప్రధాని హోదాలో తొలిసారి యూఏఈ పర్యటిస్తున్నారు. -
జయతో ప్రధాని భేటీ
తమిళనాడు సీఎం నివాసంలో గంట సమావేశం అక్కడే లంచ్ చేసిన మోదీ చెన్నై: పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కీలక బిల్లుల ఆమోదం అగమ్యగోచరమైన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన నేరుగా జయ నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. తొలిసారి తన ఇంటికి వచ్చిన మోదీకి గుమ్మం వద్దకు ఎదురెళ్లి జయ సాదర స్వాగతం పలికారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన మోదీ.. దాదాపు 50 నిమిషాల పాటు జయతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే పలు డిమాండ్లను జయలలిత ప్రధాని ముందుంచారు. ఒక వినతిపత్రాన్ని సైతం అందించారు. బీజేపీలోని కీలక నేతల రాజీనామాలపై కాంగ్రెస్, లెఫ్ట్ సహా పలు విపక్షాలు పట్టువీడని వైఖరి అవలంబిస్తున్న పరిస్థితుల్లో జీఎస్టీ సహా పలు కీలక సంస్కరణాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో జయతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జయ పార్టీ అన్నాడీఎంకేకు లోక్‌సభలో 37 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లుకు లోక్‌సభలో అన్నాడీఎంకే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నా.. ఇరువురు నేతల మధ్య మాత్రం సౌహార్ద సంబంధాలే నెలకొని ఉన్నాయి. 2011లో సీఎంగా జయ ప్రమాణ స్వీకారానికి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ హాజరుకాగా, ఆ తరువాత 2012లో గుజరాత్ సీఎంగా మోదీ ప్రమాణానికి జయలలిత హాజరయ్యారు. సహకరించండి! ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జయలలిత మోదీ సాయం కోరారు. కర్నాటక, కేరళలతో అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యను పరిష్కరించాలని, శ్రీలంక తమిళుల సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని ప్రధానికందించిన వినతితో కోరారు. కావేరీ నదీ జలాలపై మేనేజ్మెంట్ బోర్డ్‌ను, కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, కేరళలోని అసాంఘిక శక్తుల నుంచి ముళ్లపెరియార్ డ్యామ్ భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే తమిళనాడు ఏటా రూ. 9270 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు రాష్ట్రాలకు 100% పరిహారం ఇచ్చేందుకు రాజ్యాంగబద్ధ పరిహార విధానం కావాలని, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదని అన్నారు. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనపర్చుకోవాలని కోరారు. చో రామస్వామికి మోదీ పరామర్శ జయలలిత నివాసం నుంచి ప్రధాని మోదీ సీనియర్ జర్నలిస్ట్, ‘తుగ్లక్’ పత్రిక ప్రధాన సంపాదకుడు చో రామస్వామి ఇంటికి వెళ్లారు. కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న తన చిరకాల మిత్రుడు రామస్వామిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడ మోదీ దాదాపు 10 నిమిషాలు గడిపారు. -
మా పొట్ట కొట్టారు!
- మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల ఆవేదన - కలెక్టర్‌కు విన్నవించుకున్నా ఫలితం శూన్యం సాంబమూర్తినగర్ (కాకినాడ) : సుమారు 15 ఏళ్లుగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన తమను నట్టేట ముంచారంటూ పథక నిర్వాహకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు గురువారం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2002లో అప్పటి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించే బాధ్యతను తమకు అప్పగించిందన్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా ఎన్నో కష్టనష్టాలు పడి విద్యార్థులకు భోజనం అందించామన్నారు. అయితే అక్షయ పాత్ర పేరుతో తమ పొట్టకొట్టే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉందని ఆరోపించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్షయ పాత్ర వారే విద్యార్థులకు భోజనం అందిస్తారని, తమను విరమించుకోవాలని సూచించారని వాపోయారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబును ఆశ్రయించగా ఆయన తమను నాలుగు రోజులు తన ఇంటి చుట్టూ తిప్పించుకుని తానేమీ చేయలేనని, కలెక్టర్‌ను కలవాల్సిందిగా సూచించారన్నారు. కాకినాడ నగరంలో సుమారు 200 మంది నిర్వాహకులు, కార్మికులు మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరంతా రోడ్డున పడే ప్రమాదముందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విషయాన్ని కలెక్టర్ అరుణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కంచం కడగలేదని చితకబాదిన వార్డెన్
బనగానపల్లె (కర్నూలు జిల్లా) : భోజనం చేసిన తర్వాత కంచం సరిగా కడగలేదని ఒక విద్యార్ధిని హాస్టల్ వార్డెన్ కర్రతో చితకబాదాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..7వ తరగతి విద్యార్థి జనార్థన్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కంచం సరిగా కడగలేదని వార్డెన్ గమనించాడు. దీంతో బాలుడిని కర్రతో చితకబాదాడు. వార్డెన్ తీవ్రంగా కొట్టడంతో బాలుడు ఈ విషయాన్ని తండ్రి రాములు నాయక్‌కు చెప్పాడు. దీంతో రాములు నాయక్ స్థానిక పోలీసు స్టేషన్లో వార్డెన్‌పై ఫిర్యాదు చేశాడు. రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన కుల సంఘాలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ధర్నాకు దిగాయి. -
కడుపులో మడుగు!
మధ్యాహ్న సమయం. అప్పుడే భోజనం పూర్తయింది. భుక్తాయాసంతో వరండాలోని వాలుకుర్చీలో చారబడ్డాడు ఆ పెద్దాయన. తాపీగా తాంబూలాన్ని ఆస్వాదిస్తున్నాడు. మాగన్నుగా నిద్ర ముంచుకొస్తోంది. వాలుకుర్చీలోనే కాసేపు కునుకు తీసేవాడేమో! ఉన్నట్లుండి కడుపులో ఏదో భారంగా అనిపించసాగింది. భోజనం ఏమైనా ఎక్కువైందా అనే ఆలోచనలో పడ్డాడు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ కడుపులో భారం నెమ్మదిగా పెరగసాగింది. కడుపులో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. చెప్పలేని అలజడి. మరికాసేపటికి కడుపులో ఏదో నిండిపోతున్నట్లు ఇబ్బంది. కడుపులో మడుగు కదులుతున్న అనుభూతి. ఇదేదో మామూలుగా తీసిపారేయాల్సిన సంగతి కాదని అర్థమైంది ఆయనకు. భోజనం ఎక్కువ కావడం వల్ల తలెత్తిన సమస్య కాదని మనసుకు తెలుస్తోంది. మరేమై ఉంటుంది..? ఆలోచించసాగాడు ఆయన.. ఆలోచనలను కట్టిపెట్టి నెమ్మదిగా ధ్యానంలోకి జారుకున్నాడు. ధ్యానావస్థలో ఆయనకు అసలు సంగతి అర్థమైంది. తనపై ఏదో ప్రయోగం జరిగింది. ఎవరో తన కడుపును నీటితో నింపేస్తున్నారు. తన కడుపులో భారం పెరుగుతున్న కొద్దీ ఎక్కడో ఉన్న మడుగులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ధ్యానావస్థలో ఆయనకు దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కూడా ఆషామాషీ మనిషి కాదు. నిష్టాగరిష్ఠుడైన శ్రీవైష్ణవుడు. తనపై జరుగుతున్న ప్రయోగానికి తక్షణమే విరుగుడు కనిపెట్టాలి. లేకుంటే, ప్రాణానికే ముప్పు. ఇది కచ్చితంగా మారణ ప్రయోగమే! అర్థమైపోయింది ఆయనకు. అప్పటికే వాలుకుర్చీ నుంచి ఏమాత్రం కదలలేని స్థితికి చేరుకున్నాడు. మెల్లగా మంత్రజపం ప్రారంభించాడు. విరుగుడు ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటికి నెమ్మదిగా బలం కూడదీసుకుని ఇంట్లో ఉన్న పాలేరును కేకేశాడు. పెరట్లోని పశువులశాల పైకప్పులో ఉన్న వెదురుబొంగుల్లో ‘మధ్యనున్న బొంగును చీల్చేయ్’ అని చెప్పాడు. పశువులశాల అంతా బాగానే ఉంది కదా.. ఈయనేంటి బొంగును నరికేయమంటాడనుకొని బిత్తరపోయి చూశాడు పాలేరు.. ‘వెంటనే నరికేయ్రా..’ ఈసారి కాస్త గొంతుపెంచి గద్దించాడు ఆయన. బెదిరిపోయిన పాలేరు పరుగున పెరట్లోకి వెళ్లాడు. చేతికందిన గొడ్డలి పుచ్చుకుని పశువుల శాలలోకి దూసుకుపోయాడు. పైకప్పు మధ్యగా ఉన్న బొంగును ఒకే ఒక్క వేటుతో నరికి పారేశాడు. అంతే! ఒక్కసారిగా మొదలైంది ప్రవాహం. నరికేసిన బొంగులోంచి ఉధృతమైన నీటి ధార. పెరట్లోంచి ఆ ధార వెనుకనే ఉన్న పొలంలోకి ప్రవహించింది. చూస్తుండగానే పొలంలో చిన్నసైజు మడుగు కట్టింది. వాలుకుర్చీలోని పెద్దాయన కడుపు తేలిక పడింది. ప్రాణం తెరిపిన పడింది. మర్నాటి మధ్యాహ్నం కూడా ఆ పెద్దాయన యథాప్రకారం భోజనానంతరం తాంబూలం సేవిస్తూ వాలుకుర్చీలో మేనువాల్చాడు. ఒక ఆగంతకుడు పరుగు పరుగున వచ్చి ‘అయ్యా..! తప్పయిపోయింది నన్ను క్షమించండి’ అంటూ ఆయన కాళ్లు చుట్టేసుకున్నాడు. నెమ్మదిగా లేవదీశాడాయన. వచ్చిన ఆగంతకుడే పెద్దాయనపై ప్రయోగం చేసిన తాంత్రికుడు. ‘ఇంకెవరిపైనా ఇలాంటి అఘాయిత్యాలు తలపెట్టకు’ అని హెచ్చరించాడు పెద్దాయన. ‘సరే’నంటూ భయభక్తులతో తలపంకించాడతను. నెమ్మదిగా అక్కడి నుంచి నిష్ర్కమించాడు. దాదాపు ఎనభయ్యేళ్ల కిందటి సంఘటన ఇది. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఒక పట్టణంలో జరిగింది. ఇప్పుడా ప్రాంతం ఒడిశాలో ఉంది. - పన్యాల జగన్నాథ దాసు -
అన్నం ఇంత ముద్దగా ఉంటే ఎలా తింటారు?
రామేశ్వరం హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పీఓ ప్రొద్దుటూరు టౌన్ : ఇంత ముద్దగా అన్నం వండితే పిల్లలు తింటారా అని రాజీవ్ విద్యామిషన్ పీఓ, మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. గురువారం పట్టణం, మండలంలో ఆయన పలు స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తయారు చేస్తున్న షెడ్ వద్దకు వెళ్లి బిల్లులు వస్తున్నాయా అని వారిని ప్రశ్నించారు. అన్నం ముద్ద ముద్దగా ఉండటాన్ని పరిశీలించిన ఆయన ఇలా ఉంటే పిల్లలు ఎలా తింటారన్నారు. బియ్యం కొత్తవి కావడంతో అన్నం అలా అవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు పీఓ దృష్టికి తీసుకెళ్లారు. మండల పరిధిలోని ఎర్రగుంట్లపల్లి, బొజ్జవారిపల్లెల్లో ఉన్న పాఠశాలలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని, ఇందులో 1800 వరకు పూర్తి కావస్తున్నాయని, మి గిలిన 800 కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. -
కరువు మంట
కర్నూలు(జిల్లా పరిషత్ ) : రాయలసీమ జిల్లాలను మొదటి నుంచి కరువు పీడిస్తోంది. ఈ కారణంగా అధిక శాతం ప్రజలు సమతుల ఆహారం తీసుకోలేకపోతున్నారు. ఇక్కడి పేదలు ఉదయం పూట దాదాపుగా టిఫిన్ చేయరు. అధిక శాతం మందికి ఒకేసారి మధ్యాహ్న భోజనం చేయడం అలవాటు. అంటే రాత్రి 9 గంటల నుంచి మరునాడు రెండు గంటల వరకు భోజనం తినకపోవడం.. మధ్యలో టీ, కాఫీలతో సరిపెట్టడం వల్ల గ్యాస్ట్రబుల్ బారిన పడుతున్నారు. ఆదోని డివిజన్, కర్నూలు డివిజన్లోని దాదాపుగా అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు పనుల్లేక వలస వెళ్తున్నారు. పనులకు వెళ్లే వారు ఉదయం టీలో బన్ను అద్దుకుని తినడం, మధ్యాహ్నానికి చద్ది కట్టుకుని వెళ్తుంటారు. అది కూడా అన్నం, అందులోకి పప్పుచారు, వెల్లుల్లితో చేసిన కారం పొడి కట్టుకెళ్తారు. గ్రామీణ ప్రాంతాలే కాదు.. నగరం, పట్టణాల్లోని మురికివాడల్లోని పేదలు సైతం ఇదే రీతిన ఆకలితో అలమటిస్తున్నారు. సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం, కారాన్ని అతిగా తినడం, మజ్జిగ, పెరుగు తీసుకోకపోవడం వల్ల జీర్ణాశయంలోని గోడ లు దెబ్బతింటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న గ్యాస్ట్రిక్ రోగుల సంఖ్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి వారంలో రెండు ఓపీలు ఉండగా.. ప్రతి ఓపీకి కనీసం 100 నుంచి 120 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 70 నుంచి 80 శాతం గ్యాస్ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారే. దీంతో పాటు సర్జికల్, మెడికల్ విభాగాలకు సైతం ప్రతి రోజూ సగటున 150 మంది రోగుల్లో 30 శాతం మంది గ్యాస్ట్రబుల్ సమస్యతోనే వస్తున్నారు. ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగంలో వారానికి రెండుసార్లు చొప్పున 80 మందికి ఎండోస్కోపి నిర్వహిస్తారు. అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజికి నెలకు సగటున 300 మంది.. మెడికల్, సర్జికల్ విభాగాలకు 2,500 మంది గ్యాస్ట్రబుల్ సమస్యతో వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో, క్లినిక్‌ల్లోనూ ఇదే లెక్కన రోగులు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారు. జనాభాలో పావు వంతు భాగం ప్రజలు జీర్ణకోశ వ్యాధుల భారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు. చేటు తెస్తున్న చిన్న, పెద్ద మాత్రలు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో విరివిగా లభించే చిన్న, పెద్ద మాత్రలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతిరోజూ కాయకష్టం చేసి ఇంటికి వచ్చే పేదలు ఒళ్లు నొప్పులు తగ్గడానికి ఈ మాత్రలను సమీప మెడికల్ షాపులు, కిరాణ దుకాణాల్లో కొని వాడుతున్నారు. బెట్నసోల్ అనే స్టెరాయిడ్, డైక్లోఫెనాక్ అనే నొప్పి మాత్రలను వాడటం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ట్రబుల్, అల్సర్ సమస్యలు వస్తాయని.. భవిష్యత్‌లో అది కిడ్నీ సమస్యలకు, క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ అనుమతి లేకుండా ఈ మాత్రలను విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేగంగా గ్యాస్ట్రబుల్ తెచ్చే ఫాస్ట్‌ఫుడ్ ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ అంతే వేగంగా గ్యాస్ట్రబుల్ను మోసుకొస్తోంది. శీతల ప్రాంతాలైన ఉత్తరాది వారి ఆహార అలవాట్లను ఉష్ణప్రాంతమైన దక్షిణాదిలో ఆచరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, గోబీ, కట్లెట్లు, కచోరి తదితరాలను విపరీతంగా తింటున్నారు. వీటిని వండే తీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడం, నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడటం వల్ల కూడా జీర్ణాశయ సమస్యలకు కారణమవుతోంది. వేళకు భోజనం చేయకపోవడమే కారణం గాస్ట్రబుల్కు జీర్ణాశయంలోని హెచ్ పైలోరి అనే సూక్ష్మజీవి ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం. కొన్ని ప్రమాదకర జన్యువులు కలిగిన ఈ సూక్ష్మక్రిములు అల్సర్, క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. అధికంగా కారం, మసాలాలు, వేపుడు పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకోవడం, ధూమ, మద్యపానాలు సేవించడం, నొప్పి మాత్రలు అధికంగా వాడటం వల్ల జీర్ణాశయంలో సమస్యలు ఏర్పడతాయి. క్రిమిసంహారక మందులు.. ఎరువులతో పండిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమవుతున్నాయి. మానసిక, సామాజిక ఒత్తిడి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం. ర్యాంటాక్, రానిటిడిన్, ఫామోటిన్, జెలిసిల్, ఒమెప్రొజోల్, రాబిప్రొజోల్, పాంటాప్రొజోల్ వంటి మందులు కొన్నిరోజుల పాటు వాడాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే డాక్టర్లను సంప్రదించాలి. - డాక్టర్ బి.శంకరశర్మ, పెద్దాసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి జీవనశైలి మార్చుకుంటేనే పరిష్కారం మా క్లినిక్‌కు ప్రతిరోజూ 30 నుంచి 40 మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో వస్తున్నారు. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలే ఉంటున్నారు. వేళకు భోజనం చేయకపోవడం, అధికంగా కారం, మసాలాలు ఆహారంలో వాడటం.. బీడీ, సిగరెట్లు, ఆల్కహాలు తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రమాదకరమైన లక్షణాలు(బరువు,, ఆకలి తగ్గడం, రక్తపు వాంతులు, రక్తహీనత, కడుపులో నీరు చేరడం) కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జీవనశైలి మార్చుకుంటేనే గ్యాస్ట్రిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. - డాక్టర్ మోహన్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు -
‘పేట’లో ఆగిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం భద్రాచలం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణంలో ఆగారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నివాసంలో మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం నాయకులు, అధికారులతో మంతనాలు జరిపారు. సూర్యాపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం భద్రాచలం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణంలో ఆగారు. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నివాసంలో మంత్రులతో కలిసి భోజనం చేశారు. గంటపాటు గడిపారు. అనంతరం నా యకులు, అధికారులతో మంతనాలు జరిపారు. సీఎం రాక కంటే ముందే ఆ యన కుటుంబ సభ్యులు కూడా సూర్యాపేటలోని మంత్రి నివాసానికి చేరుకొని భోజనం చేసి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పేటలో ఆగుతున్న సందర్భంగా కొత్తబస్టాండ్ నుంచి మంత్రి నివాసం వరకు, మంత్రి నివాస సమీపంలో దుకాణాలను బంద్ చేయించి ట్రాఫిక్ నిబంధనలు పెట్టడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎస్పీ ప్రభాకర్‌రా వు ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగునా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి ని వాసం వద్ద పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట మం త్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఉప్పల ఆనంద్, వై.వెంకటేశ్వర్లు, బద్దం అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నిద్రే ఆరోగ్యం
రోజంతా ఎంత కష్టపడినా రాత్రుళ్లు శరీరానికి మాత్రం విశ్రాంతినివ్వండి.నిద్ర పోవడానికి రెండు గంటల ముందే భోజనం చేయండి.బరువు తగ్గడంలో నిద్ర ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. రాత్రుళ్లు ఎక్కువ సమయం మేల్కొని ఉంటే ఆకలి వేస్తుంది. దాంతో వేళ కాని వేళలో తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. -
మధ్యాహ్న భోజనం వికటించి 30మందికి అస్వస్థత
కడప: మధ్యాహ్న భోజనం వికటించి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల రమణప్ప సత్రం స్కూల్లో గురువారం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బువ్వ పెట్టేదెలా?
పది నెలలుగా అందని మధ్యాహ్న భోజనం బిల్లులు ఏజెన్సీలకు రూ.25 కోట్ల బకాయిలు అప్పుల ఊబిలో నిర్వాహకులు చిత్తూరు(ఎడ్యుకేషన్): ‘గంగమ్మ (పేరు మార్చాం) ఒకప్పుడు ఒంటినిండా బంగారు ఆభరణాలు.. పుస్తకాలతో మండల కార్యాలయం వద్ద అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేసేది. తమ ఊరిలో ఉన్న హైస్కూల్లో మధ్యాహ్న భోజన బాధ్యతను నెత్తికెత్తుకుంది. స్కూల్లో 500 మందికి మించి పిల్లలు ఉన్నారు. వీరందరికీ రోజూ భోజనం వండి పెట్టాలి. కూరల్లోకి కావాల్సిన అన్ని వస్తువులను కొనుక్కుని పెడితే నెలాఖరులో ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ బిల్లుల చెల్లింపు విషయంలో కాసింత వెనుకబాటుతనం ఉన్నప్పటికీ కొన్ని నెలల ఆలస్యంతోనైనా చేతికి అందేది. నిర్వహణ ఖర్చుల కోసం ఒంటిమీదున్న నగలు ఒలిచి మార్వాడికి కుదువపెట్టి మళ్లీ విడిపించుకునేది. ఇప్పుడు తొమ్మిది నెలలుగా విద్యాశాఖ బిల్లులు చెల్లించకపోవడంతో ఒంటిమీదున్న నగలు షేట్ అంగట్లో బందీ అయ్యాయి. పిల్లలను పస్తులు పెట్టలేక పరపతి ఉన్న ప్రతి ఒక్కరి వద్దా వడ్డీకి అప్పులు చేసి పెట్టింది. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటిమీదకు వచ్చి గొడవ చేస్తుంటే యజమాని చేత చావుదెబ్బలు తింటూ నరకయాతన అనుభవిస్తోంది.’ ఈ సమస్య ఈమె ఒక్కరిదే కాదు. జిల్లాలో ఉన్న వేలాదిమంది వంట నిర్వాహకులదీ దాదాపు ఇదే పరి స్థితి. సుమారు పది నెలల నుంచి ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిల చెల్లించకపోవడంతో భోజన నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో రూపాయి లేకుంటే ఓ చిన్నకుటుంబంలోనే పూటగడవటం కష్టతరం. అలాంటిది వందల సంఖ్యలో పిల్లలుండే ప్రభుత్వ పాఠశాలల్లో నెలల తరబడి అప్పులుచేసి వండి వార్చాలంటే ఎంత భారం.. నాణ్యతను ప్రశ్నించే అధికారులు పెండింగ్ బిల్లులను పరిష్కరించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకం అంపశయ్యపై చేరింది. నిర్వాహకులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదపిల్లలను పస్తులు పెట్టేందుకు మనసొప్పక నిర్వాహకులు సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉన్న 5,098 ప్రభుత్వ పాఠశాలకు రూ.25 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. జిల్లాలోని 3,999 ప్రాథమిక, 491 ప్రాథమికోన్నత పాఠశాలకు రెండు నెలలుకు సంబంధించి రూ.13.5 కోట్లు, గత ఏడాది జూలై నుంచి 608 ఉన్నత పాఠశాలలకు రూ.6.5 కోట్లు బిల్లులు, ఏజెన్సీ నిర్వాహకులకు అందించే గౌరవ వేతనాలు రూ.4.9 కోట్లు మొత్తంగా రూ.25 కోట్లు బకాయిలున్నాయి. డ్వాకా మహిళా సంఘాలకు చెందిన సభ్యులు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన తయారీ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆంక్షల కారణంగా మంజూరైన నిధులూ ఖజానా నుంచి విడుదల కావడంలేదు. సైతం విడుదల కావడంలేదు. గౌరవ వేతనాలకు దిక్కులేదు మధ్యాహ్నభోజన నిర్వాహకులకు నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఈ మొత్తం కూడా ఇవ్వకపోవడంతో అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రాథమిక స్థాయి వి ద్యార్థికి భోజనం ఖర్చు రూ.4.60, ఉన్నతపాఠశాల విద్యార్థికి రూ.6.38 ఎలా సరిపోతుందో అధికారులే తేల్చాల ని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తంలోనే కూరగాయలు, పప్పు దినుసులు, అరటిపండ్లు, గుడ్లు కొనాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ బకాయిల చెల్లింపు విషయంలో అధికారులు చొరవ చూపాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. అప్పులపాలయ్యాం నెలల తరబడి భోజనం బిల్లులు రాకపోవడంతో స్కూల్ పిల్లలను పస్తులు పెట్టడం ఇష్టం లేక వేలాది రూపాయలు అప్పులపాలయ్యాం. అధికారులు చొరవ తీసుకుని మధ్యాహ్నభోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి. -శశికళ,మధ్యాహ్నభోజన నిర్వాహకురాలు, బీఎన్నార్పేట, చిత్తూరు మండలం అధికారులు పట్టించుకోవాలి నెలల తరబడి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్నభోజనం బిల్లులు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేకుంటే జిల్లాలో చాలా పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది. -రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ఫెడరేషన్ రాష్ట్రనాయకులు -
‘మధ్యాహ్న భోజనాన్ని’ ఇస్కాన్‌కు ఇవ్వొద్దు
కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి హెచ్చరించారు. ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్న బోజన పథకం బాధ్యతను అప్పగించొద్దంటూ ఆ పథకం వర్కర్స్ యూనియన్( ఏఐటీయుసి) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వంట ఏజెన్సీలు, వంట చేసే మహిళలు పెద్ద ఎత్తున కర్నూలు తరలివచ్చారు. అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షులు పి. మురళీధర్ మాట్లాడుతూ ఒకవైపు బిల్లులు రాకున్నా, అప్పులు చేసి పథకాన్ని కొనసాగిస్తుంటే మరోవైపు ఇస్కాన్‌కు పథకాన్ని అప్పగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఆ సంస్థకు ఇస్తే విద్యార్థులకు గుడ్డు ఇవ్వరని, మత విశ్వాసాలను విద్యార్థులకు నూరిపోస్తారని ఆరోపించారు. ఈ సంస్థకు వ్యతిరేకంగా కమిషన్ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం వారికే పథకం బాధ్యతలు ఇవ్వాలని చూడటం దారుణమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్. మనోహర్‌మాణిక్యం, జిల్లా అధ్యక్షులు సుంకయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ ప్రొఫెసర్ ఉమాదేవి నివేదిక ప్రకారం మధ్యాహ్న బోజన పథకంలో ఇస్కాన్ సంస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసిందన్నారు. ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నా పథకాన్ని కొనసాగిస్తున్న వారిని కాదని ఇస్కాన్‌కు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ధర్నాకు బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోజెస్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శేషఫణి, డీటీఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి కాంతారావు, ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు విక్టర్ ఇమ్మానియేల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. రంగన్న, మహిళా సమాఖ్య నాయకులు గిడ్డమ్మ, కోటమ్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, శివ, నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి, వెంకటేష్, ఈశ్వర్, పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు బాలకృష్ణ, రమేష్, విజయలక్ష్మి, రాజేశ్వరి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురికి అస్వస్థత
ఏలూరు(టి.నర్సాపురం): మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని టి.నర్సాపురం మండలం జెగ్గవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు, విరోచనాలు వికారం వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మధ్యాహ్న భోజనం వికటించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
విందు భోజనం తిని 300మందికి అస్వస్థత
కంకిపాడు(కృష్ణా జిల్లా): వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిన్న దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. కోలవెన్ను గ్రామంలో ఒక ఇంటిలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. శనివారం వ్రతం సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో భోజనం చేసిన దాదాపుగా 300 మంది అస్వస్తతకు గురయ్యారు. కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆర్ఎమ్పీ వైద్యుని వద్ద ప్రాథమిక చికిత్స పొందారు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని రప్పించి చికిత్స చేయించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా కోలవెన్నులో ఫుడ్ పాయిజన్ పై ఆ జిల్లా మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఈ విషయమై ఆయన కృష్ణాజిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కామినేని ఉన్నతాధికారులను ఆదేశించారు. -
మధ్యాహ్న భోజన పతనం
ఓ వైపు మధ్యాహ్న భోజనానికి అధికారులు తమ సమీక్షా సమావేశాల్లో పక్కా ప్రణాళికలతో లెక్కలు కడుతుంటే ఇంకోవైపు క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఆకలికేకలు వేస్తున్నా పట్టించుకోని వైనం. ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా పతనావస్థకు చేరుకుంటోంది. ఎక్కడో...ఏ మూలనో ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జిల్లా అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పక్కా ప్రణాళికల రచనలు ఆచరణలో వెక్కిరిస్తూనే ఉన్నాయి. మాటల్లోనే ప్రణాళిక జిల్లాలో 2015-16 విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను పక్కాగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ మండల విద్యాధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం వార్షిక ప్రణాళికపై శుక్రవారం స్థానిక సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి సమావేశం హాలులో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో డీఈఓ మాట్లాడారు. వంట గదులు కూడా సత్వరమే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఆకలికేకలు మార్టూరు మండలం పున్నూరు లోని జెడ్పీ హైస్కూల్లో గత రెండు నెలలుగా మధ్యాహ్న భోజనం బంద్ అయినా సంబంధితాధికారులు పట్టించుకోనేలేదు. ఈ పాఠశాలలో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 190 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కావడం గమనార్హం. వంట ఏజెన్సీలు లేరనే సాకుతో పస్తులు పెడుతున్నారు. పూనూరు (మార్టూరు) ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెన్సీ లేక రెండు నెలలుగా నిలిచిపోయింది. మండలంలోని పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 190 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారు కాగా..30 మంది ఓసీ విద్యార్థులున్నారు. పాఠశాలలో గతంలో వంట చేస్తున్న ఏజెన్సీ మానేసి రెండు నెలల పైనే అయింది. నూతన ఏజెన్సీని నియమించడమో లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. నవంబర్ నుంచి ఇప్పటి వరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మానేశారు. పాఠశాలలో చదివేది ఎక్కువ మంది పేద విద్యార్థులే. వారు ఇంటికి వెళ్లి తిని పాఠశాలకు వస్తున్నారు. రెండు నెలలుగా తమ పిల్లలకు బడిలో మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకుని వెంటనే పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. -
ప్రతిభలో గుడ్డు మాయం..!
కుళ్లిన అరటిపండ్లే పోషకాహారం చాలీచాలని కూరలతో భోజనం భద్రాచలం : ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు సరైన పౌష్టికాహారం కూడా అందటం లేదు. విలీన మండలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భద్రాచలం సమీపంలోని ప్రతిభ పాఠశాలను మంగళవారం ‘సాక్షి’ పరిశీలించగా, ఇది తేటతెల్లమైంది. 6 నుంచి ఇంటర్ వరకూ ఉన్న ఇక్కడ 420 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు అనుబంధంగానే వసతి గృహం కూడా ఉంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టలేదు. పప్పు, వంకాయ కూర వండినప్పటకీ అవి సరిపోలేదు. పలువురు విద్యార్థులు భోజనం చేయకుండానే కూరలు అయిపోయాయి. చివరకు ఉపాధ్యాయల కోసం దాచిన వంకాయ కూరను అప్పటికప్పుడు తీసుకొచ్చి వడ్డించా రు. చాలా మందికి పప్పు కూడా సరిపోలేదు. పప్పు కావాలని అడిగిన వారిపై వడ్డించే సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక పిల్లలు మంచినీరు తాగడానికి గ్లాసులు కూడా లేకపోవటంతో భోజనం చేసిన ప్లేట్లే శుభ్రం చేసుకుని వాటితోనే నీటి కోసం పరుగులు తీయడం కనిపించింది. పెరుగులో కలుపుకునే ఉప్పును అక్కడున్న ఓ కుర్చీలో పోయగా, దుమ్ము దూళి పడుతున్నప్పటకీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కుళ్లిన అరటిపండ్లు పంపిణీ... గుడ్లు అయిపోయినందునే ఇవ్వలేకపోయామని పాఠశాల డిప్యూటీ వార్డెన్ సలీంఖాన్ తెలిపారు. కాగా, విద్యార్థులకు కుళ్లిన అరిటపండ్లనే పెట్టారు. పిల్లలు భోజనం చేసే డార్మిటరీ హాల్లో ఒక ట్రేలో అరిటిపండ్లును కుప్పగా వేశారు. అయితే అవన్నీ కుళ్లి నీళ్లు కారుతున్నాయి. అయినా వాటినే విద్యార్థులు తినాల్సి వచ్చింది. ఇవి తింటే రోగాలు వస్తాయని తెలిసీ కూడా పాఠశాల నిర్వాహకులు ఇలా వ్యవహరించటం విమర్శలకు తావిస్తోంది. అడిగేవారు లేరని... ఆంధ్రలో విలీనమైన ప్రాంతంలో ఈ పాఠశాల ఉండటంతో భద్రాచలం ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించడం లేదు. ఆంధ్ర అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో విలీన మండలాల్లో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో కోత పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల వారు కోరుతున్నారు. -
పరిశోధనల్లో కెరీర్‌కు పట్టంకట్టే జెస్ట్!
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్).. దేశంలోని 20కిపైగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సులను అభ్యసించడానికి మార్గం సుగమం చేసే పరీక్ష. జెస్ట్-2015 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు.. జెస్ట్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులోని స్కోర్ ఆధారంగా వివిధ ఇన్స్టిట్యూట్లు తాము నిర్దేశించిన అర్హతలున్న విద్యార్థులను తుది ఎంపిక కోసం పిలుస్తాయి. ఈ క్రమంలో జెస్ట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. రాత పరీక్ష: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్: రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 40 శాతం ప్రశ్నలు బీఎస్సీ సిలబస్ నుంచి, 60 శాతం ఎంఎస్సీ సిలబస్ నుంచి వస్తాయి. సిలబస్: మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, ప్రాబబిలిటీ థియరీ. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్: ఇందులో రెండు రకాలు ప్రశ్నలు ఉంటాయి. కొన్నిటికి స్వల్ప సమాధానాలు సరిపోతే, మరికొన్నిటికి దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలపై ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలను సాధించడానికి మ్యాథమెటికల్ నైపుణ్యం కూడా అవసరం. సిలబస్: అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, కాంబినోట్రిక్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిస్రిక్ట్ మ్యాథమెటిక్స్, గ్రూప్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరో సైన్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై: పీహెచ్డీ ఇన్థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఈ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగం)/ఎంసీఏ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌బీఆర్‌సీ)- గుర్గావ్ పీహెచ్డీ ఇన్ న్యూరోసైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్/ఎంసీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్ పీహెచ్డీ: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్). ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్డీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా పోస్ట్ బీఎస్సీ (ఆనర్స్ ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ (సంబంధిత సబ్జెక్ట్లతో). ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- ఫిజిక్స్ (ఐఐఎస్ఈఆర్)-తిరువనంతపురం: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ (ఫిజిక్స్/ టెక్నాలజీ/ ఇంజనీరింగ్). ప్రతి ఇన్స్టిట్యూట్ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు సంబంధిత వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. పీహెచ్డీ-ఫిజిక్స్‌కు అర్హత ఎంఎస్సీ (ఫిజిక్స్) లేదా ఎంఎస్సీ/ఎంటెక్ (సంబంధిత విభాగాల్లో) లేదా ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ప్రతిభావంతులైన బీఎస్సీ మొదటి సంవత్సరం లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రానమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఐయూసీఏఏలో రీసెర్చ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం దరఖాస్తు: ఆన్లైన్లో. దరఖాస్తు రుసుం: రూ. 300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150) దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2014. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.jest.org.in -
ఎప్పటికప్పుడు... వేడివేడిగా..!
ఇంట్లో ఉండేవాళ్లు రెండు పూటలా పొగలు కక్కే వేడి వేడి భోజనం లాగిస్తారు. కానీ ఉద్యోగాలను చేసుకునేవాళ్లకి ఆ అదృష్టం ఒక్కపూటే. పొద్దున్నే లేచి, భోజనాన్ని బాక్సులో సర్దుకుని ఆఫీసుకు పరుగులు పెడతారు. తీరా తినే సమయానికి అది కాస్తా చల్లబడిపోయి, చప్పబడిపోయి నోటికి రుచించదు. అదే ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా చక్కగా వేడి వేడి భోజనం లాగించవచ్చు. అన్నం, కూర పెట్టుకోవడానికి వీలుగా రెండు అరలతో ఉండే ఈ లంచ్‌బాక్సు కరెం టుతో పని చేస్తుంది. దీనికున్న వైరును కరెంటుకు కనెక్ట్ చేస్తే... ఐదు నిమిషాల్లో బాక్సులో ఉన్న ఆహారం వేడెక్కిపోతుంది. కాబట్టి తినే సమయానికి భోజనం చల్లారిపోయినా బెంగపడక్కర్లేదు. చద్ది తిండీ తినక్కర్లేదు. వచ్చింది చలికాలం కాబట్టి ఇది చాలా అవసరం కూడాను. ప్రయాణాలప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. వెల పెద్ద ఎక్కువేం కాదు.1600 రూపాయల వరకూ ఉంది. ఆన్లైన్లో ప్రయత్నిస్తే రూ.1300 లోపే కొనుక్కోవచ్చు! -
మాంసాహారం తీసుకువచ్చాడని..
నాగోలు: మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం తీసుకువచ్చాడని విద్యార్థిని టీచర్ చితకబాదిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటు చేసుకుంది. సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని కాకతీయ టెక్నో స్కూల్లో అదే ప్రాంతానికి చెందిన వర్థమాన్(5) ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ బాక్సులో మాంసాహారం తీసుకువచ్చినట్లు గమనించిన టీచర్ మాధవి విద్యార్థిని చితకబాదింది. విషయం కుటుంబసభ్యులకు తెలపగా వారు బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. -
‘మధ్యాహ్న భోజనం’పై నిఘా.. విద్యార్థి కమిటీలు
మధ్యాహ్న భోజనం.. పేద విద్యార్థుల పాలిట వరం. చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అరుుతే, ఇటీవలకాలంలో మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పలు విమర్శలు వచ్చారుు. అటువంటి ఇబ్బందులను తొలగించి.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గరిమెళ్ల అన్నాజీరావు. సోమవారం గుడివాడ వచ్చిన సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరు, సౌకర్యాలపై పలు విషయాలు ‘సాక్షి’కి తెలిపారు. ప్రశ్న : జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలు తీరుపై మీరు తీసుకుంటున్న చర్యలేమిటీ? జవాబు : జిల్లాలో 376 పాఠశాలల్లో 1.40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. గత ఏడాది కేవలం 90వేల మంది మాత్రమే పాఠశాలల్లో భోజనం చేసేవారు. నేను బాధ్యతలు చేపట్టాక ఆ సంఖ్య పెంచాను. ప్రశ్న : ‘విద్యార్థుల భాగ్వస్వామ్యం’ అంటే.. జ : ప్రతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను రెడ్‌హౌస్, గ్రీన్హౌస్, బ్లూహౌస్, ఎల్లోహౌస్ కమిటీలుగా విభజిస్తాం. రోజుకొక టీమ్ మధ్యాహ్న భోజన విధులు నిర్వర్తిస్తుంది. ఏరోజు ఏకమిటీ ఏ పని చేయాలో ముందుగానే నిర్ణయిస్తాం. ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. పప్పు, కూరగాయల పరిమాణం, బియ్యం నాణ్యత, వాసన వస్తుందా, లేదా వంటి విషయూలను పరిశీలిస్తారు. వంట రుచిగా లేకపోరునా ఈ కమిటీ ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి విద్యార్థికీ రోజుకు 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయూలు ఇవ్వాలి. ఇందుకోసమే వంటల్లో ఏది ఎంత మోతాదులో వేయాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రశ్న : పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటీ? జ : పాఠశాలలకు కావాల్సిన ఫినాయిల్, క్లీనింగ్ పౌడర్, హెండ్ వాష్ లిక్విడ్ వంటి వాటి తయూరీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల పరిశుభ్రమైన వాతావరణంతో పాటు తయూరీపై పిల్లలకూ అవగాహన కలుగుతుంది. ప్రశ్న : మధ్యాహ్న భోజనంపై సమస్యలను ఎవరికి తెలియజేయాలి? జ : పాఠశాలల్లో కమిటీలు వేశాక మంచి ఫలితాలే వస్తున్నారు. ఎక్కడైనా మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే వెంటనే నా ఫోన్‌కు విద్యార్థులు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల మాటేమిటీ? జ : ప్రతి పాఠశాలకు రూ.75వేలు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా నిధులు మంజూరుచేశారు. జిల్లాలోని 376 పాఠశాలలకు రూ.2.82కోట్లు మంజూరయ్యాయి. సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాల కోసం రూ.10వేలు, కరెంట్ రిపేర్లకు రూ.15వేలు, మైనర్ రిపేర్లకు రూ.25వేలు ఖర్చుచేయూలి. ప్రశ్న : వంట ఏజెన్సీలకు మీరిచ్చే సూచనలు? జ : ప్రతి వంట ఏజెన్సీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూరగాయలు, పప్పు వంటి సరుకులు తెచ్చుకోవాలి. ఈ ఏడాది ప్రతి పాఠశాలలో నూరుశాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయూలనేదే నా లక్ష్యం. వంట బాగా చేసిన ఏజెన్సీలకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి సన్మానిస్తాం. ‘మధ్యాహ్న భోజనం’పై మీరు ఫిర్యాదు చేయూలంటే.. మధ్యాహ్న భోజనంలో లోపాలు ఉన్నా.. రుచిగా లేకపోయినా.. ఏమైనా తప్పులు జరుగుతున్నా.. అవినీతి జరిగినా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా నాకు నేరుగా ఫోన్ చేయవచ్చు. నా నంబరు 9440395869. -
‘సుభోజనం’.. సుదూరం
నిజామాబాద్ వ్యవసాయం : మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు చౌకగా అల్పాహారం, భోజనం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘సుభోజనం’ పథకం జిల్లాలో ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్లో మంత్రి హరీష్‌రావు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయాలని జిల్లాకేంద్రాల్లోని అన్ని మార్కెట్‌యార్డు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రైతుల కోసం మార్కెట్‌యార్డ్‌లో అతి తక్కువ ధరలకు అంటే 2 రూపాయలకు అల్పాహారం, 5 రూపాయలకు భోజనం అందించేందుకు ‘సుభోజనం’ పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు వాటికి సంబంధించిన గైడ్‌లైన్స్ రాలేవు. పథకం నిర్వహించే విధానం, దానిని ఎలా అమలు చేయాలి, ఎవరు నిర్వహించాలి అన్న అంశాలను ఇంతవరకు సంబంధిత మార్కెట్ యార్డు అధికారులకు గాని, సిబ్బందికి గాని ఆదేశాలు రాలేదు. దీంతో ఈ పథకం ఈనెల 24నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, దానిని ఇంతవరకు జిల్లా అధికార యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ఈ పథకం ఎప్పుడు ప్రారంభం కానున్నదో ఎవరికి అర్థం కావడం లేదు. అమలు ప్రక్రియ ఎలా ఉంటుందో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘సుభోజనం’ పథకం ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అమలు ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు మార్కెట్‌యార్డ్ సిబ్బందికి ఆదేశాలు అందలేదు. దానికి సంబంధించిన నివేదికను సైతం మార్కెట్‌యార్డ్ అధికారుల నుంచి తెప్పించలేదని తెలిసింది. సాధ్యమయ్యేనా.. ధరలు ఆకాశాన్ని అంటిన ఈ రోజుల్లో ఈ పథకం అమలు సాధ్యమవుతుందా అనే సంశయం నెలకొంది. దీని నష్టం ఎవరు భరించాల్సి ఉంటుందో యార్డ్ సి బ్బందికి సైతం తెలియకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఒకవేళ ప్రారంభిస్తే నడపడం సాధ్యమవుతుం దా అని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఎవరు నిర్వహిస్తారు.. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్ర ణాళికలు రూపొందుతున్న సుభోజనం పథకాన్ని ఎవ రు నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. దాని నిర్వహ ణ బాధ్యత మార్కెట్‌యార్డ్ సిబ్బందికి అప్పగిస్తారా లే కా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలుస్తారా అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
రుచించని మధ్యాహ్న భోజనం
పథకంపై పర్యవేక్షణ లోపం చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ డీఈవోపై విద్యాశాఖ డెరైక్టర్ ఫైర్ విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో ఎక్కువుగా డ్రాప్ఔట్స్ ఎందుకు ఉంటున్నారు? మధ్యాహ్న భోజన పథకంపై ఎందుకు పర్యవేక్షణ చేపట్టడం లేదు? పాఠశాలల తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు? చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఎక్కువుగా ఈ జిల్లా నుంచే ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయంటూ రాష్ట్ర విద్యాశాఖ డెరైక్టర్, ఎస్ఎస్ఏ పి.డి.ఉషారాణి విశాఖ డీఈఓ వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. మధ్యాహ్నభోజన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, భోజనంలో నాణ్యత లేదని వచ్చిన ఫిర్యాదులపై ఆమె డీఈఓను ప్రశ్నించారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు ఎక్కువగా జరుగుతున్నాయని చైల్డ్‌రైట్స్ సెల్‌కు ఆయా జిల్లాల విద్యార్థులే ఫిర్యాదులు చేశారని ఆమె తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉత్తరాంధ్ర విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అవకతవకలకు పాల్పడిన మండల విద్యాశాఖాధికారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు త్వరలోనే షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు ఉషారాణి వెల్లడించారు. మధ్యాహ్నభోజన పథకంలో సమస్యలున్న వారు చైల్డ్‌రైట్స్ సెల్ 18004253525 నెంబరుకు సంప్రదించాలన్నారు. విద్యారంగంలో విశాఖ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అన్ని మండలాల ఎంఈఓలకు నెట్ సదుపాయం కల్పించామన్నారు. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతిపాఠశాలలోనూ మరుగుదొడ్లు నిర్వహణ సరిగా జరగడంలేదని మరుగుదొడ్ల నిర్వహణపై మూడు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాలన్నారు. సమస్యలు ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు, మౌలిక వసతులు లేకపోవడంపై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో డొనేషన్లు నియంత్రించాలన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనిత ప్రసంగిస్తూ మధ్యాహ్న భోజన పథకం వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గాజువాకలో ఉన్న జెడ్పీ హైస్కూళ్లను మున్సిపల్ పరిధిలోకి తేవాలన్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా పాఠశాలల్లో మంచినీటి సదుపాయం లేదన్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావిధానాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీతో పాటు మూడు జిల్లాల విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలు పాల్గొన్నారు. ఏజెన్సీలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు విశాఖ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను స్థానికంగా ఉంటున్న బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్లు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరి నియామానికి సంబంధించిన నిధులను ఐటీడీఏ పీవోకు ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీపై గంటా గరంగరం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శేషగిరిబాబుపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల విద్యాశాఖా అధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయింది. పదినిమిషాలు పవర్ రాకపోవడంతో మంత్రి గంటాతో పాటు నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు కొంత ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి గంటా విద్యుత్ సంస్థ సీఎండీకి ఫోన్ చేసి వేళాపాళా లేకుండా కరెంట్ ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ రోజు జిల్లా పరిషత్‌లో సమీక్షా సమావేశం జరుగుతోందని తెలియదా.. రోజూ పత్రికలు చదవరా ..అంటూ శేషగిరిబాబుపై మండిపడ్డారు. -
పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త
- బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో భోజనం, టిఫిన్ - వెల్లడించిన మంత్రి హరీష్‌రావు - ఉన్నతాధికారులతో కలిసి మార్కెట్ పరిశీలన - సమస్యల పరిష్కారంపై అక్కడికక్కడే సమీక్ష కంటోన్మెంట్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అయితే ఇది నగరం మొత్తం కాదండోయ్..నగరం చుట్టుపక్కల ఆయా ప్రాంతాల నుంచి ఎంతో శ్రమించి కూరగాయలు తీసుకొచ్చే రైతులు,హమాలీల కోసం బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో టిఫిన్ ,భోజనం అందించనున్నారు. ఈమేరకు త్వరలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మరోమంత్రి పద్మారావు,మార్కెటింగ్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం మార్కెట్‌ను సందర్శించిన ఆయన సుమారు 3గంటలపాటు కలియతిరిగారు. ప్రతీ సమస్యను నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరుగా షాపుల వద్దకు చేరుకుని మార్కెట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు,రిటైల్ విక్రేతలతో మాట్లాడారు. ధరల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా హామాలీలు ప్రధానంగా క్యాంటీన్ సమస్యను మంత్రి ద ృష్టికి తీసుకొచ్చి సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, క్యాంటీన్, నిరుపయోగంగా ఉన్న రైతుల రెస్ట్‌రూమ్‌లను పరిశీలించారు. అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతులు, హమాలీలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో త్వరలో రూ.3 అల్పాహారం, రూ.5కే భోజనాన్ని అందిస్తామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇలాంటి విధానంపై అధ్యయనం చేసి అతిత్వరలో మార్కెట్‌యార్డులోనూ సబ్సిడీతో కూడి న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బినామీ పేర్ల మీద నడుస్తున్న దుకాణాలు, కేటాయింపు జరిగినా రోడ్డుపైనే క్రయ,విక్రయాలు సాగిస్తున్న 39 దుకాణాల అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధరల నియంత్రణపై దృష్టి : కూరగాయ ల ధరల నియంత్రణకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పలురకాల కూరగాయలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున..వాటి ధరల్ని రాష్ట్రస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆయాశాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీభాయి తదితరులున్నారు. -
మెనూ చూడ కడుపు నిండు.. భోజనం చూడ గుండె మండు!
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సంక్షేమాధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మెనూ చార్టులో భోజనం వివరాలు పరిశీలిస్తే కడుపు నిండిపోతుంది. వాస్తవంలోకి వెళితే మెనూ ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వారంలో ఆరు రోజులు(సెలవు రోజులు మినహా) ఆయా పాఠశాలల్లోనే హాస్టల్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇక మిగిలింది ఆదివారం మాత్రమే. ఆ రోజు మూడు పూటలా మెనూ అమలు చేయాల్సి ఉండగా.. పెట్టింది తినాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మెనూ ప్రకారం ఉదయం పాలు, పంచదారతో కలిపిన రాగి జావ, టిఫెన్‌కు ఇడ్లీ, పల్లీల చెట్నీ, మధ్యాహ్నం గుడ్డుతో బిరియానీ, కుర్మా, పెరుగుపచ్చడి.. సాయంత్రం ఉడికించిన శనగలు.. రాత్రి అన్నం, కూర, రసం వడ్డించాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పెద్దపాడు బీసీ బాలుర వసతిగృహాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆదివారం ఉదయం ఉగ్గాని.. మధ్యాహ్నం తెల్లన్నం, ఉడికించిన గుడ్డు, రసంతో సరిపెట్టారు. 250 మంది విద్యార్థులున్న ఈ వసతిగృహంలో సగానికి పైగా విద్యార్థులకు గ్లాసులు కూడా లేకపోవడం గమనార్హం. తిన్న ప్లేట్‌ను శుభ్రం చేసుకున్న తర్వాత అందులోనే నీళ్లు పట్టుకుని తాగాల్సిన దుస్థితి. అదేవిధంగా ఏడు గదుల్లోనే వీరంతా సర్దుకుపోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో 30 మందికి పైగా విద్యార్థులు ఉండాల్సి రావడం ఇక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని సగానికి పైగా వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి. ఉడికీ ఉడకని.. లావు బియ్యంతో చేసిన ఆహారం తినలేక అధిక శాతం విద్యార్థులు చెత్తకుండీల్లో పారబోస్తున్నారు. నీళ్ల చారు తినలేక వెక్కిళ్లతో నీటి కోసం విద్యార్థులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించరనే భావన సంక్షేమ హాస్టళ్లలో ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. అధిక శాతం హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో పశువులు, కుక్కలు, పందులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ కారణంగా వ్యాధులు ప్రబలుతుండటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. అదేవిధంగా చాలీచీలని గదులు.. తాగునీటి ఇక్కట్లు.. మరుగుదొడ్ల కొరతతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కొరవడిన పర్యవేక్షణ సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలకు చుట్టపుచూపుగా మాత్రమే వెళ్తున్నారు. వీరంతా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి సహాయ సంక్షేమాధికారుల పోస్టులు దాదాపు ఐదు ఖాళీగా ఉంటే.. వీటికి గ్రేడ్-1 వసతి గృహ సంక్షేమాధికారులు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా 21 హెచ్డబ్ల్యుఓ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాచ్మెన్, కమాటీ పోస్టులు దాదాపు 40 వరకు ఖాళీగా ఉన్నా భర్తీకి చర్య చూపని పరిస్థితి నెలకొంది. నాల్గో తరగతి సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న వసతి గృహాల్లో ఆయా పనులన్నీ విద్యార్థులే చేయాల్సి వస్తుండటం గమనార్హం. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
పీలేరు, న్యూస్‌లైన్: కేవీపల్లె మండలం రాగులవారిపల్లె పాఠశాలలో బుధవారం మధ్యా హ్న భోజనంలో బల్లిపడింది. ఇది తిన్న 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. రాగులవారిపల్లె యూపీ స్కూల్లో 84 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 62 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రసం అడుగున బల్లి పడి ఉండడాన్ని గమనించారు. కొద్దిసేపటికే మూడో తరగతి చదువుతున్న జీ.నందినికి వాంతులు మొదలయ్యాయి. ఈ విషయూన్ని ఇన్చార్జి హెచ్ఎం సయ్యద్‌బాషా ఎంఈవో శ్రీనివాసులకు తెలియజేశారు. ఆయన ఎర్రావారిపాళెం మండలం యల్లమంద ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌కు సమాచారం ఇచ్చి పాఠశాల వద్దకు చేరుకున్నారు. యల్లమంద నుంచి డాక్టర్లు, సిబ్బంది హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినికి పాఠశాల ఆవరణలోనే ప్రథమ చికిత్స నిర్వహించారు. ఇంతలో మరికొంత మంది విద్యార్థులకు వాంతులు మొదలయ్యూయి. వెంటనే 108 వాహనంలో నందినితో పాటు పి.గీత, టీ.రేణుక, నాలుగో తరగతి చదువుతున్న జి.అంజి, ఐదో తరగతి చదువుతున్న ఎం.శివకుమారి, ఎం.శ్రీమణి, ఎల్.గణేష్, ఆరో తరగతి చదువుతున్న జీ.రాజేశ్వరి, ఏడో తరగతి చదువుతున్న ఎం.లావణ్యను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు. -
అధ్వాన ‘భోజనం’
=ముద్దకడుతున్న అన్నం, నీళ్ల సాంబారు =70 శాతం పాఠశాలల్లో ఆరుబయటే వంట =నీళ్లులేక శాంతిపురంలో ఆగిన మధ్యాహ్న భోజనం =మంజూరు కాని బకాయి సొమ్ము =ఇస్కాన్ భోజనంలోనూ నాణ్యత అంతంతమాత్రం జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీర్చడం లేదు. చాలాచోట్ల ముద్దకడుతున్న అన్నం, నీళ్ల సాంబారు వడ్డిస్తున్నారు. కోడిగుడ్డు మాటేలేదు. సుమారు 70 శాతం పాఠశాలల్లో ఆరుబయటే వంట చేస్తున్నారు. నీళ్లు లేక శాంతిపురంలో భోజన పథకం అమలు కావడం లేదు. మరోవైపు ఇస్కాన్ వారు అందిస్తున్న భోజనంలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. సాక్షి, చిత్తూరు: జిల్లాలో 5096 పాఠశాలల్లో 3.72 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ పథకం అమలవుతున్న తీరు పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆరుబయటే వంట చేస్తున్నారు. దీంతో దుమ్ముధూళి వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి నుంచి వంట చేసుకొచ్చి పెడుతున్నారు. పుత్తూరు లాంటి చోట్ల ఇస్కాన్ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. ముద్ద అన్నం, నీళ్లు సాంబార్ వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక పాఠశాలల్లో భోజనం రుచికరంగా ఉండడం లేదనేది సాక్షి పరిశీలనలో వెల్లడైంది. తంబళ్లపల్లెలో మధ్యాహ్న భోజన పథకానికి 8,03,627 రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. 1 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రం 2014 వరకు ఎంఈవోల ఖాతాల్లో జమ అయింది. నెలకు 465 క్వింటాళ్ల బియ్యం అందాల్సి ఉంది. ఆరు మండలాల్లో బియ్యం సరఫరా చేయలేదు. ఏజెన్సీల నిర్వాహకులు బియ్యం అప్పు తీసుకొచ్చి పిల్లలకు వంట చేసి పెడుతున్నారు. చిత్తూరులో ఐదారు పాఠశాలలకు బయట వండి భోజనం తీసుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సమక్షంలో మధ్యాహ్నా భోజనం వండాలి. కాని అలా జరగడం లేదు. కొన్ని చోట్ల పిల్లలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 497 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 44 వేల మంది చదువుతున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోంది. తమకు నిధులు చాలడం లేదని నిర్వాహకులు అంటున్నారు. బెరైడ్డిపల్లె మండలంలో బియ్యంలో రాళ్లు ఉంటున్నాయి. పలమనేరు మండలంలో సాంబారు రుచికరంగా లేదని, అన్నం ముద్ద కడుతోందని ఫిర్యాదులు అందాయి. దీనివల్ల పిల్లలు అన్నం తినకుండా పడేస్తున్నారు. పెద్దపంజాణి మండలంలో వంట గదులు లేవు. నేలపల్లె ఉన్నత పాఠశాలలో ఆరుబయటే భోజనం వండుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో 453 పాఠశాలలు ఉన్నాయి. ఉడికీ ఉడకని అన్నం, రుచిలేని సాంబారు నీళ్ల నీళ్లగా వడ్డిస్తున్నారు. నీళ్లు లేకపోవడంతో శాంతిపురంలో తుంసీరోడ్డు హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదు. నగరి నియోజకవర్గంలో 310 పాఠశాలలు ఉన్నాయి. సుమారు 23 వేల మంది చదువుతున్నారు. నగరి రూరల్ మండలానికి సరఫరా అవుతున్న బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. వంట గదులు లేకపోవడంతో ఆరుబయటే వంట తయారీ తప్పడం లేదు. వడమాలపేట, పుత్తూరు పట్టణంలో కొన్ని పాఠశాలల్లో ఇస్కాన్ భోజనం అందిస్తున్నారు. హస్తి నియోజకవర్గంలో 410 పాఠశాలలు ఉన్నాయి. బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో కట్టెలపొయ్యతోనే వంట చేస్తున్నారు. బుధవారం, ఆదివారం గుడ్డు పెట్టడం లేదు. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పథకం అమలు తూతూమంత్రంగా సాగుతోంది. పీలేరు నియోజకవర్గంలో ముతక అన్నం పెడుతున్నారు. ఇస్కాన్ భోజనం ఇంకా ఘోరంగా ఉంటోంది. సగం మంది విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు. మదనపల్లెలో మండలంలో 140 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 60 పాఠశాలలకు వంట గదులు లేవు. కొందరు నిర్వాహకులు ఇంటి నుంచే భోజనం చేసుకుని వస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో నేడోరేపో కూలిపోనున్న గదుల్లో వంట చేస్తున్నారు. -
‘భోజనం’పై రాజకీయం
=టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తోపులాట =విద్యార్థులకు ఆలస్యంగా వడ్డన దిబ్బిడి (బుచ్చెయ్యపేట), న్యూస్‌లైన్ : మండలంలో దిబ్బిడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు భోజన తయారీ విషయంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం తోపులాటకు దిగారు. ఇరుపార్టీల నాయకులు పంతాలకు పోవడంతో విద్యార్థులకు మధ్యా హ్న భోజనం ఆలస్యంగా అందిం ది. పాఠశాలలోని 710 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన బి.మాణిక్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో భోజనం వండి పెడుతోంది. ఇటీవల సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం, కొందరు గ్రామస్తులు విద్యార్థులకు సక్రమంగా భోజనాలు పెట్టడం లేదంటూ ఎంఈవో బి.త్రినాథరావుకు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ విచారణలో వాస్తవమేనని తేలింది. దీంతో సోమవారం మరొ క డ్వాక్రా గ్రూపు సభ్యులతో భోజ నం వండించేందుకు ప్రయత్నిం చారు. అయితే గతంలో వండిన వారినే కొనసాగించాలని టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ సేనాపతి అప్పలనాయుడు వర్గం డిమాండ్ చేసింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ జెర్రి పోతుల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు సేనాపతి అప్పలనాయుడు, గొంప అప్పారావు, సర్పం చ్ పెదిరెడ్ల మాణిక్యంల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దిగా రు. దీంతో ఎస్ఐ ఎస్.ఎ.మునాఫ్ సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఎంఈఓ బి.త్రినాథరావు, హెచ్ఎం సుందరరావుపై ఇరువర్గాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాం టి వివాదాలు తలెత్తుతున్నాయని ధ్వజమెత్తారు. పాఠశాలలో ఎవరు వంటలు చేస్తారన్న దానిపై బుధవారం ఫుడ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఎంఈఓ గ్రామస్తులకు, నాయకులకు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో బీసీ వసతిగృహం సిబ్బం దితో వంటలు చేయించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు విద్యార్థులకు భోజనాలు పెట్టారు.