పీలేరు, న్యూస్‌లైన్: కేవీపల్లె మండలం రాగులవారిపల్లె పాఠశాలలో బుధవారం మధ్యా హ్న భోజనంలో బల్లిపడింది. ఇది తిన్న 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. రాగులవారిపల్లె యూపీ స్కూల్లో 84 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 62 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రసం అడుగున బల్లి పడి ఉండడాన్ని గమనించారు. కొద్దిసేపటికే మూడో తరగతి చదువుతున్న జీ.నందినికి వాంతులు మొదలయ్యాయి.
ఈ విషయూన్ని ఇన్‌చార్జి హెచ్‌ఎం సయ్యద్‌బాషా ఎంఈవో శ్రీనివాసులకు తెలియజేశారు. ఆయన ఎర్రావారిపాళెం మండలం యల్లమంద ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌కు సమాచారం ఇచ్చి పాఠశాల వద్దకు చేరుకున్నారు. యల్లమంద నుంచి డాక్టర్లు, సిబ్బంది హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినికి పాఠశాల ఆవరణలోనే ప్రథమ చికిత్స నిర్వహించారు.
ఇంతలో మరికొంత మంది విద్యార్థులకు వాంతులు మొదలయ్యూయి. వెంటనే 108 వాహనంలో నందినితో పాటు పి.గీత, టీ.రేణుక, నాలుగో తరగతి చదువుతున్న జి.అంజి, ఐదో తరగతి చదువుతున్న ఎం.శివకుమారి, ఎం.శ్రీమణి, ఎల్.గణేష్, ఆరో తరగతి చదువుతున్న జీ.రాజేశ్వరి, ఏడో తరగతి చదువుతున్న ఎం.లావణ్యను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు.
మధ్యాహ్న భోజనంలో బల్లి
Published Thu, Jan 30 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement