=టీడీపీ, కాంగ్రెస్ నాయకుల తోపులాట
=విద్యార్థులకు ఆలస్యంగా వడ్డన
దిబ్బిడి (బుచ్చెయ్యపేట), న్యూస్‌లైన్ : మండలంలో దిబ్బిడి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులకు భోజన తయారీ విషయంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం తోపులాటకు దిగారు. ఇరుపార్టీల నాయకులు పంతాలకు పోవడంతో విద్యార్థులకు మధ్యా హ్న భోజనం ఆలస్యంగా అందిం ది. పాఠశాలలోని 710 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన బి.మాణిక్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో భోజనం వండి పెడుతోంది. ఇటీవల సర్పంచ్ పెదిరెడ్ల మాణిక్యం, కొందరు గ్రామస్తులు విద్యార్థులకు సక్రమంగా భోజనాలు పెట్టడం లేదంటూ ఎంఈవో బి.త్రినాథరావుకు ఫిర్యాదు చేశారు.
ఎంఈఓ విచారణలో వాస్తవమేనని తేలింది. దీంతో సోమవారం మరొ క డ్వాక్రా గ్రూపు సభ్యులతో భోజ నం వండించేందుకు ప్రయత్నిం చారు. అయితే గతంలో వండిన వారినే కొనసాగించాలని టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ సేనాపతి అప్పలనాయుడు వర్గం డిమాండ్ చేసింది. దీంతో కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ జెర్రి పోతుల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు సేనాపతి అప్పలనాయుడు, గొంప అప్పారావు, సర్పం చ్ పెదిరెడ్ల మాణిక్యంల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దిగా రు. దీంతో ఎస్‌ఐ ఎస్.ఎ.మునాఫ్ సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఎంఈఓ బి.త్రినాథరావు, హెచ్‌ఎం సుందరరావుపై ఇరువర్గాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాం టి వివాదాలు తలెత్తుతున్నాయని ధ్వజమెత్తారు. పాఠశాలలో ఎవరు వంటలు చేస్తారన్న దానిపై బుధవారం ఫుడ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఎంఈఓ గ్రామస్తులకు, నాయకులకు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో బీసీ వసతిగృహం సిబ్బం దితో వంటలు చేయించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు విద్యార్థులకు భోజనాలు పెట్టారు.
‘భోజనం’పై రాజకీయం
Published Tue, Dec 17 2013 1:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement