బాధ్యులపై చర్యలు
► కలెక్టర్ కృష్ణభాస్కర్
► బాధిత విద్యార్థులకు పరామర్శ
ఎల్లారెడ్డిపేట : వీర్నపల్లిలోని మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డి.కృష్టభాస్కర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది విద్యార్థులను కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పాఠశాలలో తయారు చేసిన మధ్యాహ్న భోజ నానికి సంబంధించిన వివరాల నివేదికను తనకు వెంటనే అందించాలని ఎంఈవో రాజయ్యను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశా రు. మధ్యాహ్న భోజన నిర్వాహకు లు ఉడకని గుడ్లు, అన్నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు కుదుట పడే వరకూ అయ్యే వైద్యఖర్చులను ప్ర భుత్వమే భరిస్తుందని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రమేశ్, ఉప వైద్యాధికారి చంద్రశేఖర్, డీఈవో రాధాకిషన్, ఎంఈవో రాజయ్య, జెడ్పీటీసీ తోట ఆగ య్య, ఎంపీపీ ఎలుసాని సుజాత, సింగి ల్‌విండో వైస్‌చైర్మన్ చాంద్‌పాషా, సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, ఎస్సై ఉపేం దర్, వైద్యాధికారి శీరిష పాల్గొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
వీర్నపల్లి మోడల్ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్‌సీసీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము పరామర్శించారు. వంట నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ సంఘటన జరిగిందని, ఇందుకు బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్ , మధ్యాహ్న భోజన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాము డిమాండ్ చేశారు. ఇలాంటి సం ఘటనలు పునరావృతం కాకుండా అధి కారులు పర్యవేక్షించాలన్నారు.
ఆయన వెంట విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఒగ్గు మహేశ్‌చంద్ర, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం, నా యకులు సిరిసిల్ల కిషన్, పెరుమాండ్ల ప రశురాం, సంఘ సతీశ్, సురేశ్, నరేశ్, సు రేందర్, స్వామి ఉన్నారు. ఇది దురదృష్టకర సంఘటన అని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య ఉన్నారు.