బనగానపల్లె (కర్నూలు జిల్లా) : భోజనం చేసిన తర్వాత కంచం సరిగా కడగలేదని ఒక విద్యార్ధిని హాస్టల్ వార్డెన్ కర్రతో చితకబాదాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్‌లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..7వ తరగతి విద్యార్థి జనార్థన్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కంచం సరిగా కడగలేదని వార్డెన్ గమనించాడు. దీంతో బాలుడిని కర్రతో చితకబాదాడు.
వార్డెన్ తీవ్రంగా కొట్టడంతో బాలుడు ఈ విషయాన్ని తండ్రి రాములు నాయక్‌కు చెప్పాడు. దీంతో రాములు నాయక్ స్థానిక పోలీసు స్టేషన్‌లో వార్డెన్‌పై ఫిర్యాదు చేశాడు. రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన కుల సంఘాలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ధర్నాకు దిగాయి.
కంచం కడగలేదని చితకబాదిన వార్డెన్
Published Tue, Jul 28 2015 6:18 PM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM
Advertisement
Advertisement