Plastic Material
-
రీ సస్టేనబిలిటీ రీసైకిల్డ్ పాలిమర్స్
పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న రీ సస్టేనబిలిటీ అధిక నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిమర్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మ్యారికో వ్యవస్థాపక కుటుంబమైన హర్ష మారివాలా ఫ్యామిలీ యాజమాన్య మూలధనాన్ని నిర్వహిస్తున్న షార్ప్ వెంచర్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది.ఈ సంయుక్త భాగస్వామ్యంలో రీ సస్టేనబిలిటీకి 85 శాతం, షార్ప్ వెంచర్స్ మిగిలిన వాటాను కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు హైదరాబాద్‌తోపాటు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వద్ద ఏఐ సాంకేతికతతో కూడిన అత్యాధునిక ప్రాసెసింగ్ కేంద్రాలను నెలకొల్పుతామని రీ సస్టేనబిలిటీ ఎండీ, సీఈవో మసూద్ మాలిక్ తెలిపారు. మ్యారికో ఫౌండర్, చైర్మన్ హర్ష మారివాలాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వచ్చే ఏడాది రెండు ప్లాంట్లు కార్యరూపంలోకి వస్తాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటా 32,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తాం’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ దాదాపు అన్ని దేశాలకు సవాలుగా మారుతోంది. ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలతో పాటు ఇతర చాలా రంగాల్లో అనివార్యంగా ఇంకా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఆయా రంగాల్లో దాని స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవి పూర్తయి ప్రాచుర్యం పొంది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అయితే అప్పటివరకు విడుదలయ్యే ప్లాస్టిక్‌తో మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. దాని నిర్వహణ కోసం కంపెనీలు కొత్త టెక్నాలజీలను వాడుతున్నాయి. అందులో భాగంగానే రీ సస్టేనబిలిటీ, షార్ప్ వెంచర్స్ కంపెనీలు సంయుక్తంగా ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్లాస్టిక్‌ను రిసైకిల్ చేసి పాలిమర్స్‌ను తయారు చేసేందుకు సిద్ధం అయ్యాయి.ఇదీ చదవండి: ఈవీ సబ్సిడీపై కీలక వ్యాఖ్యలు.. మంత్రి స్పష్టతఇప్పటికే ప్లాస్టిక్ అంతటా వ్యాపించింది. నేల, చెరువులు, నదులు, సముద్రాలన్నింటినీ ఆక్రమిస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ప్రతి ఏడాది 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2040కల్లా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో వెలువడే ఉద్గారాలు తీవ్ర వాయు కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి ఈ విభాగంలో సేవలందిస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలు పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్‌లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్‌ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
సముద్ర గర్భంలో ప్లాస్టిక్ పాగా!
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలకు కూపాలుగా మారాయా? సముద్ర గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి అవే కారణమా? రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తూ ఎల్‌నినో (పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం), లానినో(పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం)ల సయ్యాటకు అవే దోహదం చేస్తున్నాయా? ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే భారీ ఉత్పాతాలు తప్పవా? అంటే అవుననే అంటోంది ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక. పర్యావరణ స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అధ్యయనం చేస్తూ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇవీ.. ప్లాస్టిక్ వ్యర్థాల డస్ట్‌బిన్‌గా మహాసముద్రాలు.. వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆసియా ఖండంలోని ఫిలిప్పీన్స్, భారత్, మలేసియా, చైనా, ఇండోనేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా కడలిలోకి చేరుతున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పటికే కడలిలో 6.75 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయి రాష్ట్రాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఫ్రాన్స్ దేశం విస్తీర్ణం కంటే మూడింతలు అధికం కావడం గమనార్హం. నియంత్రించకుంటే ఉత్పాతాలే.. సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా చేరడం వల్ల.. సముద్ర ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. కడలి గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులకు ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. ఇదే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లానినో ప్రభావాలు ఏర్పడటానికి దారితీస్తోంది. లానినో ప్రభావం ఉంటే.. రుతుపవనాల గమనం సక్రమంగా ఉంటుంది. అప్పుడు ప్రధానంగా భారత్ సహా ఆసియా దేశాల్లో సక్రమంగా వర్షాలు కురుస్తాయి. అదే ఎల్‌నినో ప్రభావం ఏర్పడితే.. రుతుపవనాల గమనం అస్తవ్యస్తంగా ఉంటుంది. భారత్ సహా ఆసియా దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. సాగు, తాగునీటికి ఇబ్బంలు తప్పవు. ఇది అంతిమంగా ఆహార సంక్షోభానికి.. తద్వారా ఆకలి చావులకు దారితీస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం వల్ల సముద్రంలో ఉష్ణప్రవాహాలు పెరగడంతో మత్స్యసంపద నానాటికీ తగ్గిపోతోంది. మత్స్యకారుల ఉపాధినే కాదు.. ఇది పర్యావరణాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. కారణాలు ఇవే.. ఆయా దేశాల్లో పేదరికం, తీర ప్రాంతం, వర్షపాతం అధికంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఉదాహరణకు ఫిలిప్పీన్స్ ఏడు వేల ద్వీపాల సముదాయం. 36,289 కి.మీ.ల తీర ప్రాంతం ఆ దేశం సొంతం. ఆ దేశంలో 4,820 నదులు కడలిలో కలుస్తున్నాయి. అక్కడ పేదరికం అధికంగా ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడే పడేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షపు నీటితో కలిసి వాగుల్లోకి.. అక్కడి నుంచి నదుల్లోకి.. వాటి మీదుగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఏటా సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 35 శాతం ఫిలిప్పీన్స్‌కు చెందినవి కావడానికి ఇదే కారణం. అలాగే బ్రెజిల్ నుంచి అమెజాన్‌తోపాటు 1,240 నదులు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ దేశం నుంచి ఏటా 37,779 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కడలిలోకి చేరుతున్నాయి. -
ఆరు లేయర్లతో ప్లాస్టో వాటర్ ట్యాంకులు
హైదరాబాద్: నీటి ట్యాంకుల తయారీ సంస్థ ప్లాస్టో ఆరు లేయర్లతో కూడిన ట్యాంక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాణ్యమైన ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేసిన ఈ ట్యాంకు సూర్యరశ్మిని లోపలికి ప్రవేశించనీయకుండా చేసి అధిక ఉష్ణోగ్రతల్లోనూ నీటిని చల్లగా ఉంచుతుంది. ప్రమాదకర యూవీ కిరణాల నుంచి రక్షణనిస్తుంది. సులభంగా శుభ్రం చేసుకునేలా వీటిని రూపొందించారు. ‘‘ప్రతి ఒక్కరికి ఏడాది పాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగునీటికి అందించాలనే లక్ష్యంతో వీటిని తయారు చేసాము. ప్లాస్టో డీలర్ స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి’’ అని కంపెనీ ప్రకటన ద్వారా తెలిపింది. -
ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం జనవరి 26 నుంచి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలు జనవరి 26కి వాయిదా పడింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధాన్ని జనవరి 26 నుంచి అమల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈలోగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ తయారీదారులకు చేదోడుగా నిలవాలని, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఫ్లెక్సీ తయారీదారులు సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించాలని ఆదేశించారు. పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, వినియోగంపై ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్రం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఆరంభించనుంది. దేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నం ముమ్మరంచేసింది. ఆ ప్లాస్టిక్ వాడకాన్ని ఈ నెలాఖరుకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్టణ, స్థానిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు అడ్వైజరీని పంపింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాల మేరకు 2,591 నగర మున్సిపాలిటీలు ఆ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేశాయి. మరో 2,100 నగర మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 30లోగా నిషేధం క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్న ‘హాట్ స్పాట్’లను గుర్తించి, వాటిని తొలగించాల్సిన బాధ్యత పట్టణప్రాంత స్థానిక సంస్థలదే అని కేంద్రం స్పష్టంచేసింది. ఆ ప్లాస్టిక్ వినియోగం నిషేధాలను అమలు చేయడం కోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల సాయం తీసుకోవాలంది. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ల ఏర్పాటు, ఆకస్మిక తనిఖీలు, ఉల్లంఘనులపై భారీ జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. దేశంలో 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం/ వాడి పడేసిన ప్లాస్టిక్‌తో తయారైన క్యారీ బ్యాగ్‌ల తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమల్లో ఉంది. -
ప్లాస్టిక్ భూతానికి చెక్..
సాక్షి, అమరావతి: ఉదయం పాలు, కూరలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్లు.. టీ తాగాలంటే ప్లాస్టిక్ కప్పు.. వాటర్ బాటిల్ ప్లాస్టిక్.. కూల్‌డ్రింక్ బాటిల్ ప్లాస్టిక్.. టిఫిన్ లేదా ఏదైనా పార్సిల్ తేవాలంటే ప్లాస్టిక్.. దుస్తులు కొన్నా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తాయి.. నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనే వరకు అనేక ప్లాస్టిక్ వస్తువులు వాడుతుంటాం. కానీ, రసాయనాలతో కూడిన ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు మానవుడితో సహా సమస్త జీవజాలానికి, పర్యావరణానికి అత్యంత హాని కలుగజేస్తున్నాయి. వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలు చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి (డీకంపోజ్) ఏకంగా 400 ఏళ్లు పడుతుంది.ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నివారించాలని ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, సాధ్యమవడంలేదు. పైగా, వీటి వినియోగం ఏటికేడాది పెరుగుతూనే ఉందని కేంద్ర పర్యావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగేళ్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రెట్టింపైందని, ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. 2015–16 సంవత్సరంలో దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం 15.89 లక్షల టన్నులు కాగా, 2019–20 నాటికి 35 లక్షలకు చేరింది. రోజుకు 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో సుమారు 10,376 టన్నుల వ్యర్థాలను సేకరించకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. 2050 నాటికి 12 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ దేశ భూ భాగంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్లాస్టిక్ వినియోగం తక్కువే. అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వినియోగం 109 కేజీలు , చైనాలో 38 కేజీలుంటే ఇండియాలో 11 కేజీలే. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ డెలివరీ విస్తరిస్తుండటంతో ప్లాస్టిక్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. కేవలం జుమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రతి నెలా అదనంగా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నట్లు అంచనా. ప్రభుత్వం తక్షణం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ఆ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ 2016లో కేంద్రం నిబంధనలు విధించగా, తాజాగా వాటిని సవరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఒకసారి మాత్రమే వినియోగించే (సింగిల్ యూసేజ్) ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. దీని ప్రకారం కూల్డ్రింక్ల్లో వినియోగించే స్ట్రాలు, ఐస్‌క్రీం స్టిక్‌లు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, చెంచాలు, బెలూన్స్, క్యాండీ స్టిక్స్ వంటి వాటిలో సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్లాస్టిక్ కట్టడిలో ఏపీ చొరవ ప్లాస్టిక్ వినియోగం, నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. పట్టణాల నుంచి సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ నిర్వహణ పద్ధతులను పాటిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలో ఏటా 46,222 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ తయారీలో, రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ప్లాస్టిక్ సంబంధ యూనిట్లు ఉండగా అందులో 117 ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి. 14 ప్లాస్టిక్ రీ–సైక్లింగ్ యూనిట్లు. తాడిపత్రి, బొబ్బిలి, తిరుపతి, విజయవాడ వంటి మునిసిపాలిటీల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల వినియోగంపై పాక్షిక నిషేధం అమలవుతోంది. కేంద్ర నిబంధనలను అతిక్రమించిన వారిపై దాడులు చేయడం ద్వారా రాష్ట్ర అధికారులు 235 టన్నల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేశారు. రూ.1.64 కోట్లు జరిమానాగా విధించారు. తాజాగా ప్లాసిŠట్క్ వ్యర్థాల నుంచి సముద్ర తీరప్రాంతాన్ని రక్షించేలా అమెరికాకు చెందిన పార్లే ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతంలో ఏటా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయనున్నట్లు పార్లే ఫర్ ది ఓషన్స్ ఫౌండర్ సైరిల్ గట్చ్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 పార్లే ఎయిర్ స్టేషన్లు, 10 ఎకో ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుతోపాటు 20 వేల మంది సముద్రపు వారియర్స్‌ను నియమిస్తామని వివరించారు. ఆయన ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఉత్పత్తులను వివరించి, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. -
ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి!
ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. చివరికి ఇది మన శరీరంలోనూ పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. పీల్చేగాలి నుంచి తినే ఆహారం ద్వారా అనేక రకాలుగా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తోందని ప్రకటించారు. మరి మన శరీరంలోకి ఏయే మార్గాల ద్వారా.. ఎంతెంత ప్లాస్టిక్ చేరుతోందో చెప్పే లెక్కలివీ.. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేగజైన్ విడుదల చేసిన ‘హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ నివేదిక ప్రకారం.. సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. – సాక్షి సెంట్రల్‌డెస్క్ చదవండి 👉🏼Russia Ukraine War: తస్మాత్ జాగ్రత్త! 👉🏼గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
Mahabubabad: ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం?
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి. దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. (చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... ) -
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
Plastic ban: ప్లాస్టిక్ అమ్మకాలపై ‘మహా’ కొరడా! రూ.75 వేల అపరాధ రుసుం..
Plastic use can lead to fines గాజువాక : ప్లాస్టిక్ అమ్మకాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసి భారీ ఎత్తున పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుల నుంచి అపరాధ రుసుం కూడా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు గాజువాకలో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో ఆయన స్పందించారు. ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని జోనల్ అధికారులను ఆదేశించడంతో పాటు గాజువాక జోనల్ కమిషనర్ డి.శ్రీధర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య విభాగం అధికారులు గాజువాక మార్కెట్లో ప్లాస్టిక్ సంచులను విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై దాడి చేసి 500 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులనుంచి రూ.75వేల అపరాధ రుసుం వసూలు చేశారు. ప్లాస్టిక్ ఎవరు విక్రయించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో భాగంగా స్వచ్ఛ నగరాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జోనల్ కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: Omicron: జనవరి మూడో వారం నాటికి 2 లక్షల యాక్టివ్ కేసులు! -
బయటి కన్నా ఇంట్లోని కాలుష్యంతోనే అధిక ముప్పు
కర్నూలు(సెంట్రల్) : బయట వాహనాల పొగ, దుమ్ము, ధూళితో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. దాన్నుంచి బయట పడడానికి ముఖానికి మాస్క్‌లు, చున్నీలు, రుమాళ్లు కట్టుకుంటాం. ఆయా కారకాల నుంచి అవి కాస్తంత ఉపశమనం కలిగిస్తాయి. ఇంట్లో కాలుష్యం ఉంటే ఎలా? మనం వాడే కొన్ని వస్తువుల వల్ల గృహాల్లోని గాలి కలుషితమవుతోంది మరి... ఇంట్లోని కాలుష్యం బయటి దానికన్నా ప్రమాదకరం.రోజు వాడే పదార్ధాలు, వస్తువులు, నిత్య అలవాట్లు వల్ల కాలుష్య కారకాలు విడదలవుతున్నాయి. రంగులు, వంటగ్యాస్, పెంపుడు జంతవుల వచ్చే అలర్జీలు, ఇంట్లోని కార్పెట్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదక ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మనదేశానికి చెందినవి 14 ఉన్నాయి. ఈ నగరాల్లో పీఎం2 కాలుష్య కారకంఎక్కుగా విడుదలవుతోంది. అంతర్గత వాతావరణ కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాదీ లక్షలాదిమంది మృతి చెందుతున్నారు. కాలుష్యం వల్ల శరీరంలోని చాలా భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా, వంట రుగ్మతలు వస్తాయి. వాతావరణ కాలుష్య కారకాలలను నియంత్రించచడం ఒక్కరి వల్ల అయ్యేపనికాదు. అయితే ఇంట్లో ఉన్న కాలుష్య కారకాలను నియంత్రించుకోవడం మనకు సాధ్యమే. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు. కొత్తగా చేసుకున్న అలవాట్లతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. గతంలో ప్లాస్టిక్ వాడకంలేదు. ఇప్పుడు అది లేనిదే రోజు గడవదు. రంగులు, కార్పెట్లు ఇలా కొన్ని వస్తువులు ఇటీవలి జీవన పద్ధతులు ఇంట్లోకి చేరాయి. వీటిని దూరంగా ఉంచితే కాలుష్య నుంచి దూరంగా ఉన్నట్లే అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా... పచ్చదనానికి అలవాటు పడాలి.. వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొక్కలు. స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. అవి ఇంట్లో ఉంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కుండీల్లో పెంచే చిన్నచిన్న మొక్కలు , డ్వార్ఫ్ మొక్కలను ఇంటి లోపల పెంచుకోవాలి. దీనివల్ల ఇంటికి పచ్చదనం, ఆరోగ్యం రెండూ సమకూరతాయి. వెంటిలేషన్ ముఖ్యం... ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూడడం వల్ల చాలా ఇబ్బందులు తగ్గుతాయి. దీని వల్ల నివాసాల్లోని చెడువాసన చక్కగా బయటకు వెళుతుంది. లోపల ఉన్న దుమ్ము, అలర్జీని కలిగించే కారకాలు గాలి లోపలికి బాగా వీయడంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలు సూక్ష్మ జీవులను సంహరిస్తాయి. వెంటిలేషన్ వల్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కార్పెట్లతో మరింత కాలుష్యం... ఇంట్లో వాడే కార్పెట్లు కాలుష్యకారకాలను పట్టి ఉంచుతాయి. కార్పెట్లలో పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్మ, ధూళి కణాలు చేరతాయి. వాటిని వ్యాక్యూమ్ క్లీనర్లతో శుభ్రం చేసేటప్పుడూఅయా కారకాలు ఇంట్లోని వాతావరణంలో చేరి వ్యాధులను కలగిస్తాయి. చిన్నపిల్లలు వీటిపై తిరిగితే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్లాస్టిక్‌కి దూరంగా... ఆధునిక జీవన శైలితో ప్లాస్టిక్ ఇంట్లో భాగమైపోయింది. వీటి నుంచి వెలువడే ఉప ఉత్పన్నాలు కాలుష్యాన్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్ నుంచి వెలువడే మైక్రోప్లాస్టిక్స్ 0.1 ఎంఎం ఉంటాయి. సింథటిక్ కార్పొట్లు, ప్లాస్టిక్ డబ్బాలు తదితరలతో ఇవి ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ధూమపానం నిషిద్ధం.. ఇంట్లో పొగ తాగడం, వారికే కాకుండా మిగిలిన వారందరికీ హానికరం. ఈ విషయం అందరికీ తెలిసినా కొందరు పట్టించుకోరు. బయట తాగడం కన్నా ఇంట్లో ధూమపానం వల్ల ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. పొగ లోపలే ఉండిపోవడంతోమళ్లీ మళ్లీ పీల్చాల్సి వస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి వద్దే వద్దు... ఇంట్లో మంచి సువాసన రావడానికి వెలిగించే సుగంధ పుల్లలు(ధూప్‌స్టిక్స్) వల్ల కాలుష కారకాలు విడుదలవుతాయి. అవి వెదజల్లే పొగలో వివిద రసాయనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల శ్వాస, చర్మ సమస్యలు వస్తాయి. ఇంట్లోని కాలుష్యం ప్రమాదకరం – అచ్యుతరామయ్య, పర్యావరణ శాస్త్రవేత్త ఇంటిలోపలి కాలుష్యం ప్రమాదకరంమైంది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు, జలుబు, దగ్గు, న్యుమోమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇంట్లోనే ఉంటుండడంతో వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేవిధంగా చూసుకోవాలి. ఆధునిక పోకడలను తగ్గించుకుంటే అంతర కాలుష్యాన్ని తగ్గించవచ్చు. -
నో మోర్ ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఈనెల 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను వచ్చే ఏడాది జూలై నుంచి నిషేధించింది. ‘ప్లాస్టిక్ ఇయర్‌బడ్స్’పై నిషేధం: వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్ స్టిక్స్‌తో చేసిన ఇయర్ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీస్‌కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్సులకు వాడే ప్యాకింగ్ పేపర్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది. 120 మైక్రాన్లకు పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 నుంచి 75 మైక్రాన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది. రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరింది. -
వ్యర్థాలతో విలువైన అల్లికలు!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ముఖ్యమైన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఒకటి. పచ్చదనంతో కళకళలాడే పర్యాటక ప్రాంతాలకు సైతం ఈ ప్లాస్టిక్ భూతం పెనుసమస్యగా పరిణమిస్తోంది. ఆయా పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు.. వివిధ రకాల పనులకోసం ఉపయోగించే వస్తువుల్లో ఎక్కువగా ప్లాస్టిక్‌తో తయారైనవే. రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యం పై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. దీనిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సమస్య కు అత్యంత సులభమైన పరిష్కారం చూపడంతోపాటూ, నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు అసోంకు చెందిన రూప్‌జ్యోతి సైకియా గొగోయ్. అసోంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ ఉద్యానవనం కూడా ప్లాస్టిక్ కాలుష్య ముప్పునకు గురవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కజిరంగా పార్క్‌ను సందర్శించే పర్యాటకులు వదిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇది గమనించిన 47 ఏళ్ల రూప్‌జ్యోతి సైకియా గోగోయ్ వీటికి చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. కజిరంగా పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటితో çహ్యాండ్ బ్యాగ్‌లు, డోర్ మ్యాట్లు, టేబుల్ మ్యాట్లు, ఇతర రకాల ఫర్నీషింగ్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అంతేగాక పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి పనికొచ్చే వస్తువులు ఎలా తయారు చేయాలి– అనే అంశంపై స్థానిక నిరుపేద మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కజిరంగా హట్.. రూప్‌జ్యోతి మరికొంతమంది మహిళలç సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. వాటిని శుభ్రం చేసి, కత్తిరించి దారాల సాయంతో వస్తువులుగా రూపొందిస్తారు. ఇవి చూడడానికి ఆకర్షణీయంగానే గాక, మన్నికగా కూడా ఉంటాయి. కొందరు మహిళలు వీటిని రూపొందించే పనిలో ఉంటే.. మరికొందరు ఈ వస్తువులను పర్యాటకులకు విక్రయిస్తారు. ఈ క్రమంలోనే 2012లో రూప్‌జ్యోతి ‘కజిరంగా హట్’ పేరిట ఒక అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరంతా తయారు చేసిన వస్తువులను హట్ లో ప్రదర్శించి విక్రయిస్తుంటారు. నాలుగువేల మందికి పైగా మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటిదాకా అసోంలోని 35 గ్రామాల్లోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు దేశ విదేశీ పర్యాటకులకు వస్తువులు విక్రయించి నెలకు 25 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ.. ముంబైకి చెందిన ఎన్జీవో ద కార్బెట్ ఫౌండేషన్.. 2013–2017 మధ్యకాలంలో కజిరంగా పరిసర ప్రాంతాల్లోని మహిళ అభివృద్ధికి వివిధ రకాల పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమంలో రూప్‌జ్యోతి పాల్గొని దాదాపు రెండువందల మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. అంతేగాక అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిబెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గోని ఇప్పటిదాక 2,300 మంది మహిళలకు రూప్‌జ్యోతి శిక్షణ ఇచ్చారు. వెదురు పుల్లల్ని అల్లినట్లుగా... ‘‘అది 2004.. మా ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ వ్యర్థాలను ఎలా రూపుమాపాలి? వీటితో పనికొచ్చేవి ఏమైనా తయారు చేయవచ్చా అని బాగా ఆలోచించాను. ఈ క్రమంలోనే కొందరు వెదురు పుల్లల అల్లికల ద్వారా రకరకాల వస్తువులు రూపొందించడం నా మదిలో మెదిలింది. వెంటనే వెదురు లాగా ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అల్లవచ్చు కదా! అనుకున్నాను. వెంటనే చిన్న చిన్న టెక్నిక్‌లతో ప్లాస్టిక్ వ్యర్థాలను కాటన్ దారంతో కలిపి రకరకాల వస్తువులు రూపొందించడం మొదలుపెట్టాను. వీటిని రూపొందించడానికి నేను ఎటువంటి శి„ý ణా తీసుకోలేదు. అలా ముందు నేను నేర్చుకుని తర్వాత స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చాను. మేమందరం తయారు చేసే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తులు ఎంతో మన్నికగా ఉంటాయి’’ అని రూప్‌జ్యోతి వివరించారు. కజిరంగా హట్ వద్ద సందర్శకులు -
జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ
వెంకటాపురం(కె): కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో పోలీసులు మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో కూడా జరిమానా రశీదును అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల కేంద్రంలో అధికారులు బుధవారం తనిఖీ చేస్తుండగా, మాస్క్ లేకుండా బయటకు ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. పోలీసులు తనీఖీలు చేస్తున్నారని గమనించి జరిమానా తప్పించుకునేందుకు దుకాణంలోని ప్లాస్టిక్ కవర్ తీసుకుని మాస్క్‌లా కట్టుకున్నాడు. ( చదవండి: వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి? ) -
కేజీ ప్లాస్టిక్ ఇవ్వండి.. నచ్చింది తినండి!
కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని ఒక కుదుపు కుదిపేసింది. దీనివల్ల ఆర్థిక నష్టంతోపాటు, ప్రాణ నష్టం భారీగానే జరిగిందని.. నెనోరు కొట్టుకుని మరీ చెబుతున్నాం. కానీ మనం నిత్యం ప్లాస్టిక్ వస్తువులను వాడుతూ.. ప్రకృతిని ప్రమాదం లో పడేస్తున్నామన్న బాధ ఏమాత్రం కనిపించడం లేదు. ప్లాస్టిక్ వాడొద్దని, ఒకవేళ వాడితే జరిమానాలు విధిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాడకం మాత్రం ఆపడంలేదు. పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ముప్పుగా పరిణమిస్తోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ‘ప్లాస్టిక్ లావో ఖానా ఖిలావో’ అనే వినూత్న కార్యక్రమాన్ని జనవరి 23న ప్రారంభించారు. నజాఫ్‌గర్ జోన్లో తొలి ‘గార్బేజ్ కేఫ్’ను ప్రారంభించారు. అయితే.. తాజాగా మరో 23 గార్బేజ్ కేఫ్‌లను మున్సిపల్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోడ్లమీద తినడానికి తిండిలేక ఎంతోమంది చెత్తా చెదారం ఏరుకుని అది అమ్మి పొట్టనింపుకుంటుంటారు. ఇటువంటివారు ఈ గార్బేజ్ కేఫ్స్‌కు ఒక కేజీ ప్లాస్టిక్ ఇస్తే వారికి ఇష్టమైన భోజనాన్ని ఆరగించవచ్చు. ఎవరైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ క్యాన్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్ వంటివి ఏవైనా ఒక కేజీ తీసుకు వచ్చి గార్బేజ్ కేఫ్స్ వద్ద ఇస్తే.. మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంలోని ఏ రెస్టారెంట్‌లోనైనా వారికి ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని తినవచ్చు. ప్లాస్టిక్ ఇచ్చి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో ఏదైనా ఒక దానికోసం కూపన్లను తీసుకుని నచ్చిన ఆహారాన్ని ఆరగించవచ్చు. ఒకవేళ కేజీ ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి ఫుడ్ తీసుకోవడం ఇష్టం లేకపోతే అరకేజీ స్వీట్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఈ తరహా కేఫ్‌లు 23 ప్రారంభించారు. సౌత్‌జోన్–12,సెంట్రల్ జోన్–10,వెస్ట్‌జోన్–1 చొప్పున ఉన్నాయని మేయర్ అనామిక వెల్లడించారు. కాగా 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దేశంలోనే తొలి గార్బేజ్ కేఫ్ ప్రారంభమైంది. అక్కడ చెత్త సేకరించి అందిస్తే మీల్స్‌తోపాటు పేదలకు షెల్టర్కూడా ఇస్తారు. ఇలా సేకరించిన 8 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్స్‌తో ఒక రోడ్డు కూడా వేశారు. ఈ రోడ్లు సాధారణ రోడ్లకంటే కూడా మన్నిక కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. -
ప్లాస్టిక్..ఏదీ ‘లాక్’?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగం ఒక్కసారి గా పెరిగింది. ముఖ్యంగా ఒక్కసారి వాడి పారేసే క్యారీబాగులు (సింగిల్‌యూజ్ ప్లాస్టిక్), యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్ల వినియోగం.. ఈ 2 నెలల లాక్డౌన్ కాలంలో బాగా పెరగడంపై పర్యావరణవేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసరా లు, పండ్లు, కూరగాయలు, మందులు, ఇతర వస్తువుల్ని సులభంగా తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ కవర్లు, ప్రధానంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్ల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం, ఉత్పత్తిని నియంత్రించడం, నిఘా ఉంచడం వంటివన్నీ జీహెచ్ఎంసీ చేయాల్సి ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. 50 మైక్రాన్ల కం టే తక్కువ పలుచగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ఇతర రూపాల్లోని వస్తువుల వినియోగంపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. రాష్ట్రంలో వీటిని ఉత్పత్తి చేసే యూనిట్లను గుర్తించాలని మున్సిపల్ శాఖను కొంతకాలం క్రితం ప్రభు త్వం ఆదేశించింది. మున్సిపల్ అధికారులు మాత్రం తమ వద్ద తగిన మౌలిక సదుపాయాలు లేవని అంటున్నారు. కమిటీ అధ్యయనం ఏమైంది? రాష్ట్రంలో ఒక్కసారి ఉపయోగించి పారేసే వస్తువులపై నిషేధం విధింపుపై అధ్యయనానికి వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఈ నిషేధం ఎలా అమలవుతోంది?, ఈ ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామాయంగా ఏ రకమైన వస్తువులు రూపొందించాలి?, వాటి తయారీకి ఎలాంటి ముడిసరుకు వాడాలి?, వాటిని ఉత్పత్తిచేసే పరిశ్రమల ప్రోత్సాహానికి చేపట్టాల్సిన చర్యలేమిటి? అనేది ఈ కమిటీ పరిశీలించి సూచనలు చేయాల్సి ఉంది. అయితే, కమిటీ ఏర్పాటై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశాలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టలేదు. -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
ఈ ఫొటో.. మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట!
ఎడిన్బర్గ్: ప్లాస్టిక్ రక్కసికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలాన్ని తరలించే వీల్లేక అక్కడే పాతిపెట్టారు. ఈ క్రమంలో తిమింగలం శరీరం నుంచి దాదాపు 100 కిలోల ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్లో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక హారిస్ బీచ్ ఒడ్డుకు దాదాపు 20 టన్నుల మగ తిమింగలం కొట్టుకువచ్చింది. దీనిని గమనించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు బీచ్ వద్దకు చేరుకున్నారు. అయితే దానిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. శరీరం నుంచి తాళ్లు, కప్పులు, బ్యాగులు, గ్లోవ్స్, చేపలు పట్టే వలలు, బాల్స్ వంటి దాదాపు క్వింటాళ్ ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. దీంతో తిమింగలాన్ని అక్కడే పాతిపెట్టారు. కాగా ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. తిమింగలం కడుపులో కిలోల కొద్దీ చెత్త పేరుకుపోవడం చూస్తుంటే మనుషులు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం’ లేదు అంటూ మండిపడుతున్నారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్పందించిన స్కాటిష్ సముద్ర జీవుల సంరక్షణ సంస్థ... ‘ సముద్ర కాలుష్యం వల్ల ఎన్నో జీవులు మృత్యువాత పడుతున్నాయి. భయంకరమైన ప్లాస్టిక్ వస్తువులు అరగించుకోలేక ప్రాణాలు విడుస్తున్నాయి. చెత్త వేయడం జంతుజాలాలకు ప్రమాదకరమని చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఇది ప్రపంచ పర్యావరణ సమస్యగా పరిణమించినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా తిమింగలానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... పర్యావరణ ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘మనిషి కార్యకలాపాల వల్లే ఇదంతా జరుగుతుంది. పంచ భూతాలను కలుషితం చేసి ప్రాణకోటిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. మనిషి మూర్ఖత్వానికి ఇలాంటి ఫొటోలు పరాకాష్ట’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యునైటెడ్ కింగ్డంలోని డోనా నూక్ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్ పప్(సముద్ర జీవి సీల్ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నేచర్ ఫొటోగ్రాఫర్ డాన్ థర్లింగ్ రెండు వారాల క్రితం ఫేస్బుక్లో షేర్ చేసిన సీల్ పప్ ఫొటో జంతుప్రేమికుల మనసును కలచి వేసింది.(చదవండి : ఈ ఫొటో మమ్మల్ని కలచివేసింది!) -
ప్లాస్టిక్‌ను ఇలా కూడా వాడొచ్చు..
సాక్షి, అమరావతి : మానవాళి మనుగడకే పెను సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో వాటితో ఇటుకలు తయారు చేసి, నిర్మాణాల్లో ఉపయోగించ వచ్చనే విషయం పర్యావరణ పరిరక్షణ పరంగా ఊరట కలిగిస్తోంది. మట్టి, బూడిద (ఫ్లైయాష్).. సిమెంట్, ఇసుక మిశ్రమంతో తయారైన ఇటుకలతో నిర్మించే కట్టడాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలే పది కాలాలపాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటాయంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు. ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించే కట్టడాలకు నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని.. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ ఇటుకల ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. ఈ దృష్ట్యా కొంత కాలంగా పలు దేశాల్లో ప్లాస్టిక్‌తోనూ ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం, ఆ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి, ఉపరితల, భూగర్భ జలాలు, భూమి, ఆకాశం కలుషితం అవుతున్నాయి. దీని వల్ల ఏటా కోట్లాది పక్షులు, జంతువులు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉభయతారకంగా వ్యర్థాల నిర్మూలన ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగంలో యూరోపియన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, అమెరికా, భారతదేశం ఉన్నాయి. ఏడాదికి సగటున ఒక యూరోపియన్ పౌరుడు 36 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పడేస్తున్నాడు. తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం చైనాలో 28 కేజీలు, అమెరికాలో 24 కేజీలు, మన దేశంలో 11 కేజీల వరకు ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దేశంలో పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గాలి, నీరు, భూ కాలుష్యానికి దారితీస్తోంది. వీటి నిర్మూలనకు తొలుత అర్జెంటీనా విస్తృత పరిశోధనలు చేసింది. ఇటుకల తయారీలో ప్లాస్టిక్‌ను వినియోగించి.. మట్టి, ఫ్లైయాష్, సిమెంట్ ఇటుకల కంటే ఐదు శాతం పటిష్టంగా ఉంటాయని తేల్చింది. నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత, శబ్ద తరంగాలను నిరోధించే స్వభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించిన కట్టడాల మన్నిక అధికంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ. దీంతో అర్జెంటీనాలో తొలిసారిగా భారీగా ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగం మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్.. అమెరికా, చైనా తదితర దేశాల్లోనూ ప్లాస్టిక్ ఇటుకల వినియోగం పెరిగింది. ఇటుకల తయారీ ఇలా.. ప్లాస్టిక్ వ్యర్థాలైన బాటిళ్లు, కవర్లను ఒక పెద్ద బాయిలర్‌లో వేసి 105 నుంచి 110 డిగ్రీల వరకు వేడి చేసి, ద్రవరూపంలోకి మారుస్తారు. ఈ ద్రావకాన్ని గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీలకు వచ్చేలా చల్చార్చుతారు. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు, నాలుగు లేదా ఐదు శాతం మట్టి లేదా ఫ్లైయాష్ (బూడిద) లేదా సిమెంట్‌ను చేర్చి మిశ్రమంగా మారుస్తారు. ఇటుక కావాల్సిన పరిమాణంలో రూపొందించిన దిమ్మల్లో ఆ మిశ్రమాన్ని పోసి ఇటుకలు తయారు చేస్తారు. వారం రోజులపాటు ఈ ఇటుకలపై నీటిని చల్లాక (క్యూరింగ్) నిర్మాణాల్లో వినియోగిస్తారు. దేశంలో కొచ్చిలో శ్రీకారం కేరళలోని కొచ్చిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ఇంజనీరింగ్ విద్యార్థులు నడుంబిగించారు. 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి.. 2,500 టన్నుల పరిమాణంలో ఇటుకలను తయారు చేసి, భవన నిర్మాణాల్లో వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 800 కేజీల ప్లాస్టిక్ ద్రావకం వస్తుంది. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుక కంటే.. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి నాలుగు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుకలు బలంగా ఉంటాయని తేలింది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోయి, పర్యావరణానికి పెను సవాల్ విసురుతున్న తరుణంలో ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీ పర్యావరణహితమైనది. భారీగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సరైనరీతిలో రీసైక్లింగ్ చేసి, ప్రత్యామ్నాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ వ్యయం, బరువు తక్కువ. నాణ్యత ఎక్కువ. మట్టి, ఫ్లైయాష్ ఇటుకల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలు నిర్మాణ రంగంలో మరింత అనువుగా ఉంటాయి. వీటిని భిన్న ఆకృతుల్లో తయారు చేసి అలంకృతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ ఇటుకల తయారీతో పాటు నిర్మాణ రంగంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఎస్పీ అంచూరి, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్, హైదరాబాద్ -
ఇక రైళ్లలో ఇవి నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ మెటీరియల్ వాడకాన్ని నిషేధించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 2 నుంచి నిషేధ ఉత్తర్వులను అమలుచేయాలని పలు రైల్వే విభాగాలను రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. దేశంలో అక్టోబర్ 2 నుంచి ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా రైల్వేలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వాడకాన్ని నిలిపివేయాలని రైల్వే సరఫరాదారులు, విక్రేతలను రైల్వే అధికారులు కోరనున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూలమైన తిరిగి వాడదగిన బ్యాగుల వినియోగాన్ని రైల్వేలు ప్రోత్సహించనున్నాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్ మంచినీటి బాటిళ్లను తిప్పిపంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ బాటిళ్లను నిర్వీర్యం చేసేందుకు క్రషింగ్ యంత్రాలను తెప్పిస్తున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో ప్లాస్టిక్ రహిత రైల్వేలను ఆవిష్కరించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ అడుగులువేస్తోంది. -
పాలిథిన్ ప్రళయం ముంచుకొస్తుంది
సాక్షి,విజయనగరం : మీకు తెలియకుండానే పర్యావరణానికి ఎంత చేటు చేస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. సరకుల కోసమో లేదా ఇంటి నుంచి బయటికెళ్లి తిరిగొచ్చినప్పుడు ఓసారి మీ చేతిలో ఎన్ని పాలిథిన్ సంచులు ఉన్నాయో లెక్కించండి. చాలామంది ఒట్టి చేతులతో వెళ్తారు. వచ్చేటప్పుడు పర్యావరణ పాలిట శాపంగా మారిన ప్లాస్టిక్ కవర్లను తీసుకొస్తున్నారు. రోజూ ఒక్క విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే లక్షల్లో ప్లాస్టిక్ కవర్లు మున్సిపల్ వ్యర్థాల్లో కలుస్తున్నాయి. అందుకే.. ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కార్పొరేషన్ నిర్ణయించింది. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు.. మరో వారం పాటు దాడులు నిర్వహించనుంది. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలకు పరిచయం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఎన్నో ఏళ్లుగా విజయనగరాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని నియంత్రించేందుకు కార్పొరేషన్ నడుం బిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 మైక్రాన్ల కన్న తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని నిర్ణయించింది. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించటంతో, వాటిని విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశాల మేరకు కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ ప్రణీతలు ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా నార, గుడ్డ, పేపర్‌తో చేసిన పర్యావరణ హిత ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేశారు. జూలై 3న ప్లాస్టిక్ ఫ్రీ డే పాటిస్తున్నా.. పునర్వినియోగానికి (సింగిల్ యూసేజ్) పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం పెరుగుతోంది. నేలలో కరిగిపోయేందుకు కనీసం 500 ఏళ్లు పట్టే పాలిథి¯Œ సంచుల వినియోగం భారీగా పెరిగింది. ఇలాంటి తరుణంలోనే ప్రజల్లో అవగాహన కల్పించి వినియోగాన్ని తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థలు కొన్నేళ్ల కిందట జూలై 3న ‘ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే’కు శ్రీకారం చుట్టాయి. విదేశాల్లో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఎందుకు వాడొద్దంటే.. ప్లాస్టిక్ వ్యర్థాల్లో పాలిథిన్ కవర్లు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తాయి. మట్టిలో కలిసి పోయేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. నీరు భూమిలో ఇంకకుండా అడ్డు పడతాయి. పాలిథిన్ కణాలు భూసారం పీల్చేస్తాయి. కొన్నేళ్ల తర్వాత ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతుంది. ఆ ధూళి ఒంట్లోకి వెళ్లి క్యాన్సర్, మూత్రపిండ, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. నగరంలో కర్రీ పాయింట్లు అధికంగా విస్తరిస్తుండగా వారంతా నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల్లోనే వేడి వేడి ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తున్నారు. అలాంటి ఆహారం తీసుకుంటే ప్రమాదకరం. కవర్ తయారీలో ఉపయోగించే పోలి ఇథలీన్ లేయర్ వేడికి కరిగిపోతుంది. అలా కలుషితమైన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ కారకంగా మారుతోంది. ఈ నేపధ్యంలో సిల్వర్ కాయిల్‌తో తయారు చేసిన ఉత్పత్తుల్లో ప్యాకింగ్‌పై మొగ్గు చూపాలి. మహిళల్లో అ«ధికంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇదే కారణం. చికెన్, మటన్ దుకాణాల్లో వినియోగించే నలుపు, ఎరుపు, పింక్ రంగుల్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వాటిలో తెచ్చే ఆహారం వేగంగా కలుషితమయ్యే అవకాశాలు ఉండటంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపి చిన్న పిల్లల్లో వేగంగా మందబుద్ధి వ్యాపిస్తుంది. విచ్చలవిడిగా వాడి పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, పశువులు, పందులు తిని మృత్యువాత పడుతున్నాయి. శుభ కార్యక్రమాలు, పెళ్లిళ్లలో హెచ్చు సంఖ్యలో ప్లాస్టిక్ వినియోగం ప్రమాదకరంగా పరిణమించింది. ఈ నేపధ్యంలో పాత పద్ధతులను పాటించాల్సిన తరుణం మళ్లీ ఆసన్నమైంది. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ సంచులు, నార సంచులు, పేపర్ బ్యాగ్‌లను ఉపయోగించాలి. 50 మైక్రాన్ల కంటే తక్కువుంటే నిషేధం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లతో ప్రమాదం అంతా ఇంతా కాదు. పునర్వినియోగానికి పనికి రావు. ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవచ్చు. జిల్లా కేంద్రంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లలో 50 శాతం నుంచి 70 శాతం ఇవే. వీటి వినియోగాన్ని కార్పొరేషన్ నిషేధించినా.. అడ్డుకట్ట పడలేదు. తక్కువ ధరకు వస్తుండటంతో పండ్లు, కూరగాయలు, కిరాణా స్టోర్ సామాన్లను ప్యాక్ చేసేందుకు వినియోగిస్తున్నారు. మంటల్లో కాలిపోయి ప్రమాదకర రసాయనాలు గాల్లోకి వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్టు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ప్రకటించారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే రోజుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేయనున్నారు. దీనిపై ఈనెల 15 నుంచి 22 వరకు వ్యాపారులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన అనంతరం 23వ తేదీ నుంచి ఆకస్మిక దాడులు నిర్వహించనున్నారు. ఇలా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, తర్వాతి వారం రోజులు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కాలువల్లో 40 శాతం.. కాలువల్లో 40 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నట్టు కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. కాలువల్లో నుంచి క్వింటాల్ వ్యర్థాలను పరిశీలించగా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెక్క ముక్కలు, భవన నిర్మాణ వ్యర్థాలు కనిపించాయి. ఇందులో 20 శాతం నీరు.. 40 శాతం పూడిక మన్ను.. 40 శాతం తేలియాడే ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్టు గుర్తించారు. ఇటీవల కలెక్టర్ హరిజవహర్‌లాల్ ప్రత్యేక శ్రద్ధతో పెద్ద చెరువు శుద్ధి సేవ కార్యక్రమం తలపెట్టిన సందర్భంలో 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీశారు. ఇవే కాకుండా రోజూ కార్పొరేషన్ నుంచి సేకరిస్తున్న చెత్తను తరలించే గుణుపూరుపేట డంపింగ్ యార్డు వద్ద 4 లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయంటే అతిశయోక్తి కాదు. జిల్లా కేంద్రంలో 48 దుకాణాల గుర్తింపు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణలో భాగంగా విజయనగరం కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నగరంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న 48 దుకాణాలను గుర్తించి యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మూడు నెలల కాలంలో 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై దాడులు చేయగా.. 292 కేజీల సరుకు సీజ్ చేశారు. రూ.2.66 లక్షల మొత్తాన్ని అపరాధ రుసుం కింద మున్సిపల్ ఖజానాకు జమ చేశారు. ఇప్పటికే లైసెన్స్ పొందిన వారితో పాటు కొత్త వారు 50 మైక్రాన్ల కన్న ఎక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రతి నెల రూ.4వేలు మున్సిపల్ ఖజానాకు జమ చేయాలని నిర్ణయించారు. విక్రయించే ఉత్పత్తులపై తప్పనిసరిగా సంస్థ పేరు, బార్కోడ్, చిరునామా ముద్రించి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్న చిన్న దుకాణాల్లో వీటి విక్రయాలు పూర్తిగా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయాలంటే.. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించేందుకు ఎవరికీ వారే స్వచ్ఛందంగా అడుగు ముందుకేయాలి. బయటికి వెళ్లేటప్పుడు చేతి సంచిని తప్పకుండా తీసుకెళ్లాలి. చికెన్, మటన్, చేపలు తదితరాల కోసం వెళ్లినప్పుడు టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. చెత్తను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి చెత్త కుండీల్లో వేయకూడదు. ఆహార పదార్థాలను వాటిలో పారేయకూడదు. -
ప్లాస్టిక్ వ్యర్థానికి ఇంకో కొత్త అర్థం...
ప్లాస్టిక్ వ్యర్థాల గురించి, అవి పర్యావరణానికి చేసే కీడు గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పర్డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. దీని సాయంతో దాదాపు అన్నిరకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థమైన ఇంధనంగా మార్చేయవచ్చు అంటున్నారు. 2015 నాటి లెక్కల ప్రకారం భూమి మీద ఏటా కనీసం 50 లక్షల నుంచి కోటీ 27 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థంగా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇందులో రీసైక్లింగ్ అయ్యేది చాలా తక్కువని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పర్డ్యూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పదార్థాల్లోని పాలీ ఓలిఫిన్ అనే పదార్థంపై కొన్ని పరిశోధనలు చేశారు. వ్యర్థాలను వేడి చేయడం.. అత్యధిక పీడనం ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్‌లోని 91 శాతం పాలిఓలిఫిన్లను ఇంధనంగా మార్చవచ్చునని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త లిండా వాంగ్ తెలిపారు. ఇలా తయారైన ద్రవ ఇంధనంలో పారఫిన్లతో పాటు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, ఒలిఫిన్లు, వాసన ఇచ్చే రసాయనాలు కూడా వెలికి తీయవచ్చునని లిండా అంటున్నారు. ముడిచమురు నుంచి వేరు చేసినట్లే ఈ ఇంధనం నుంచి కూడా కొన్ని విలువైన రసాయనాలను రాబట్టుకోవచ్చునని, పెట్రోలు, డీజిల్ వంటివి కూడా తయారు చేయవచ్చునని, ఈ పద్ధతిని వాణిజ్యస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. -
సముద్రాన్ని కాపాడతా!
పుణె: మహారాష్ట్రలోని పుణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సముద్ర జీవజాలంపై వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటోందో పలు డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకున్న ఖాజీ.. ఎలాగైనా సముద్ర జీవులను కాపాడాలని, అందుకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ ప్రధాన కారణంగా గుర్తించి.. సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కారకాల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ అని తెలుసుకున్న ఖాజీ.. ఆ ప్లాస్టిక్‌ను నిర్మూలించేలా ఓ నౌకను డిజైన్ చేశాడు. దానికి ఎర్విస్ అని పేరు పెట్టాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరుచేసి, శుద్ధ జలాలను సముద్రంలోకి తిరిగి పంపుతుంది. మేధావుల నుంచి ప్రశంసలు.. టెడ్ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక గురించి ఖాజీ వివరించడంతో శాస్త్రవేత్తలు, మెరైన్ నిపుణులు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. వారంతా ఖాజీ ప్రతిభకు అబ్బురపడ్డారు. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి, దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది. హాట్సాఫ్ ఖాజీ.. సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలురంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీ చేస్తున్న ప్రయత్నానికి అంతా హాట్సాఫ్ అంటున్నారు. -
ప్లాస్టిక్ రైస్ వాస్తవమేనా?.. ఉచాంగ్ రైస్ అంటే?
ప్లాస్టిక్ రైస్ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టిందన్న కలకలం ఇప్పుడు కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ. ఈ రైస్ తింటే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరికొందరేమో ఇదంతా ఫేక్ (అసత్యం) అని కొట్టి పడేస్తున్నారు. మరి నిజానికి ప్లాస్టిక్ రైస్ ఉందా? ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలుసుకుందాం... – తిరుపతి అన్నమయ్యసర్కిల్ చైనా తయారీ ప్లాస్టిక్ రైస్‌పై తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ అమీర్ పేటలో ఓ స్థానికుడు 2017 జూన్‌మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా... పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం దాడి చేసి ప్లాస్టిక్ బియ్యం నమూనాలను సేకరించింది. వీటిని పరీక్షల కోసమని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు పంపించింది. ఈ పరీక్షల్లో ప్లాస్టిక్ రైస్ కాదని తేలినట్టు సమాచారం. అటు ఆంధప్రదేశ్ లోనూ ప్లాస్టిక్ బియ్యంపై వదంతులు పెద్ద ఎత్తున వ్యాప్తిలో రాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్లాస్టిక్ బియ్యం లేనట్టు వెల్లడైంది. ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే ప్లాస్టిక్ రైస్ పై ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలై ఉంది. ఎప్పటి నుంచో... ప్లాస్టిక్ రైస్‌పై వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు, గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. చైనా, వియత్నాంలో ప్లాస్టిక్ రైస్ తయారై భారత్, శ్రీలంక మరికొన్ని దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్న ప్రచారం ఉంది. యంత్రాల సాయంతో పాలిథీన్ సంచుల నుంచి బియ్యం తయారు చేస్తున్న వీడియోలు సామాజిక మధ్యమాల్లో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. 2016 డిసెంబర్ లో నైజీరియాలోని లాగోస్ లో చైనా మేడ్ ప్లాస్టిక్ రైస్ అన్న సందేహంతో 2.5 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పరీక్షల్లో ఇవి పాడైపోయిన బియ్యమని తేలింది. ప్లాస్టిక్ లేదు కానీ అనుమతించిన మేర కంటే అధికంగా సూక్ష్మ జీవులున్నట్టు గుర్తించారు. ఇలా పాడైపోయిన బియ్యాన్ని పలు దేశాలకు ఎగమతి చేస్తున్నట్టు సందేహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ రైస్ కృత్రిమ బియ్యం అన్నది బియ్యం పలుకులతో (పొలాల్లో, ఆరబెట్టినప్పుడు, రవాణాలో, మిల్లింగ్‌లో ముక్కలైన బియ్యం)ను, ఇతర ధాన్యాలతోనూ కలిపి చేస్తుంటారు. ప్లాస్టిక్ రైస్ ఉడికి మెత్తగా అవడం జరగదు. తింటున్న సమయంలోనూ అది పంటి కింద నలగదు. పైగా దానికి ఎటువంటి రుచీ ఉండదు. తింటుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. అయినప్పటికీ ప్లాస్టిక్ బియ్యమా, నిజమైన బియ్యమా అన్నది నిర్ధారించుకునేందుకు కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఉచాంగ్ రైస్ చైనాలో లభించే ఈ వెరైటీ రైస్ చాలా ఫేమస్. మంచి పరిమళంతో ఉంటాయి. సాధారణ రైస్ కంటే ఈ వెరైటీ ధర రెట్టింపు. ఇది చాలా తక్కువ స్థాయిలో పండే రకం. దీనికున్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకు నకిలీ ఉచాంగ్ రైస్ తయారు చేస్తున్నట్టు 2010లో వార్తలు వెలుగు చూశాయి. ఆలుగడ్డ, చిలగడదుంప, కొంత మేర ప్లాస్టిక్ ఈ మూడింటిని ఉపయోగించి నకిలీ ఉంచాంగ్ బియ్యాన్ని తయారు చేస్తున్నారని ఆయా కథనాల సారాంశం. అసలైన ఉచాంగ్ రైస్ లో ఈ రైస్ కొంత మేర కలిపి విక్రయిస్తున్నట్టు వార్తలున్నాయి. ఈ తరహా వార్తలు తరచూ వస్తూనే ఉన్నప్పటికీ ప్లాస్టిక్ రైస్ నిజమేనని ఇంత వరకు నిర్ధారణ కాలేదు. కనుక ఈ విషయంలో ఆందోళన చెందకుండా రైస్ బ్యాగ్ తీసుకునే ముందు విడిగా ఒక కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో పరీక్షించుకోవడం సురక్షితం. అలాగే, ప్రతీ సారి ఒక్కో షాపులో కొనుగోలు చేయకుండా నమ్మకం అనిపించిన చోటే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినప్పుడు బిల్లు తీసుకోవాలి. వీడియోల్లో ఏముంది? పాలిథీన్ కవర్లను ఓ యంత్రంలో వేసిన తర్వాత అవి కరిగి పొడవైన సన్నటి దారాలుగా మారడం... చల్లటి నీటిలోంచి కదులుతూ మరో మెషిన్ లోకి వెళ్లిన తర్వాత బియ్యంగా మారిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది. ఈ వీడియోల్లో కనిపిస్తున్నట్టు అవి బియ్యం కాదని, పారిశ్రామిక అవసరాల కోసం అలా తయారవుతున్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి ప్లాస్టిక్ బియ్యం తయారు చేయడం అన్నది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, సాధారణ బియ్యం స్థానంలో ప్లాస్టిక్ బియ్యం అమ్మడం వల్ల మిగిలేదేమీ ఉండదంటున్నారు. ప్లాస్టిక్ ఖరీదు బియ్యం కంటే ఎక్కువేనన్న వాదన ఉంది. వీడియోల్లో పాలిథీన్ సంచులను యంత్రాల్లో వేయడం, దారాలుగా మారడం అంతా ఓకే గానీ, చివర్లో అది బియ్యం ఆకారంలోకి మారిపోవడం నిజం కాదని, అది కల్పితమన్న వాదన ఉంది. వదంతులు నమ్మొద్దు నేడు సమాజంలో ప్లాస్టిక్ రైస్ వచ్చిందని పొక్కుతున్న వదంతులు అవాస్తం, వాటిని నమ్మద్దు. జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా లేవు. ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం పుకార్లే తప్ప వాస్తం కాదన్న విషయాన్ని గుర్తించాలి. ప్లాస్టిక్రైజ్ తయారు చేస్తున్నట్లు కానీ, మార్కెట్లోకి వచ్చినట్లు కానీ వస్తున్న వదంతులను ఎవరూ విశ్వసించొద్దు. – రాజు, ఏఎస్ఓ, తిరుపతి నిర్ధారణ ఇలా... చిన్న పాత్రలో నీరు పోసి అందులో చెంచాడు బియ్యం గింజల్ని వేసి కదిలించాలి. నకిలీ బియ్యం అయితే అవి నీటిపైకి తేలతాయి. నిజమైన బియ్యం అడుగుకు చేరుతుంది. పైగా ఇలా నీటిలో అసలైన బియ్యం వేసి కదిపితే నీటి రంగు మారిపోవడం గమనించవచ్చు. ప్లాస్టిక్ రైస్ అలా ఉండదు. బియ్యాన్ని వండుతున్నప్పుడు పొంగు వచ్చి గంజి కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ బియ్యం అయితే ఇలా ఉండదు. బియ్యాన్ని ఉడికించిన తర్వాత దాన్ని తీసుకువెళ్లి ఓ డబ్బాలో వేసి ఉంచండి. రెండు మూడు రోజులు ఆగి చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఉడికిన బియ్యం రెండో పూటకే పాడవడం మొదలవుతుంది. రెండు మూడు రోజులంటే ఫంగస్ వచ్చేస్తుంది. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే దానికి ఎటువంటి ఫంగస్ పట్టదు. అది ఎన్ని రోజులు అయినా అలానే ఉంటుంది. కొన్ని బియ్యం గింజలను కాల్చి చూడండి. ప్లాస్టిక్ అయితే కరిగి ముద్దలా అవుతుంది. పైగా ప్లాస్టిక్ కరుగుతున్నప్పుడు గాఢమైన వాసన వస్తుందన్న విషయం తెలుసు కదా. అదే అసలైన బియ్యం అయితే మసి అయిపోతాయి. ప్లాస్టిక్ వాసన కూడా రాదు. చెంచాడు బియ్యాన్ని గుండ్రాయి తీసుకుని నూరి చూడండి. మెత్తటి పొడిగా మారుతుంది. ప్లాస్టిక్ బియ్యం ఇలా అవదు. ప్లాస్టిక్ బియ్యం, సాధారణ బియ్యం రెండూ కూడా ఒకటే ఉష్ణోగ్రత వద్ద ఉడకవు. నిజమైన బియ్యంపై అయోడిన్ టింక్చర్ చుక్కలు వేస్తే నీలి రంగులోకి మారతాయి. ప్లాస్టిక్ బియ్యం రంగు మారడం జరగదు. -
ప్లేట్లెట్స్ ఎవరికి, ఎప్పుడు ఎక్కించాలి?
ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్లెట్స్ ఎక్కించేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి. శరీరంలో ప్లేట్లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కించకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్‌లెట్స్‌ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. సరైన వ్యాధి నిర్ధారణ అవసరం శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానేయాల్సి ఉంటుంది. ముందు ప్లేట్లెట్లు పడిపోవడానికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి. అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు శరీరంలో ఏ కారణంతో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలామందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ), రాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ (ఆర్డీపీ) అనే రెండు పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్డీపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్లెట్లను సేకరిస్తారు. ఆర్డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది. -
ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? ఎందుకు తగ్గుతాయి?
మా అబ్బాయి వయసు తొమ్మిదేళ్లు. ఈమధ్య వైరల్ ఫీవర్‌తో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్లేట్లెట్స్ తగ్గాయన్నారు. హైదరాబాద్ తీసుకుపోయి ప్లేట్లెట్స్ ఎక్కించి వైద్యం చేసిన నాలుగైదు రోజులకు ఆరోగ్యం మెరుగుపడింది. అసలీ ప్లేట్లెట్స్ అంటే ఏమిటి? అవెందుకు తగ్గుతాయి? ప్లేట్లెట్స్ తగ్గినట్లు ఎలా తెలుస్తుంది? దయచేసి వివరంగా తెలియజేయండి. రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ అని ప్రధానంగా మూడు రకాల కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్‌మారో) నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ, శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్లెట్స్. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి అవి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. పైగా ఇవి ఒక్కోరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్లెట్ కణం జీవిత కాలం ఏడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి. ప్లేట్లెట్స్ విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనపుపడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనక రక్తనాళం, ప్లేట్లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల పాత్ర చాలా కీలకమైనది. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ప్లేట్లెట్స్. శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తదితర కారణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. దాంతోపాటు కొంతమందిలో ప్లేట్లెట్ల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం వారిలో పుట్టుకతో ఉండే లోపాలే. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది. గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు రక్తం పలుచబడటానికి వాడే మందుల వల్ల కొందరిలో ప్లేట్లెట్ల సంఖ్య, నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. శరీరంలో ప్లేట్లెట్స్ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్లెట్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గితే కనిపించే లక్షణాలు సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య పదివేలకు తగ్గేవరకు ఏలాంటి లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుర్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిన ప్రతిఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. ముఖ్యంగా డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్ర జ్వరం ఉంటుంది. వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉందో పరీక్షించి, వైద్యపరంగా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారు. -
కొరియా.. ఇదేం పిచ్చయా..
వెర్రి వెయ్యి విధాలు అంటారు.. ఆ మాటను పెద్దలు ఊరికే అనలేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే ఈ విషయం అర్థం అవుతుంటుంది. ఇదిగో ఆ కోవలోకే చెందుతాడు.. ఈ ఫొటోలోని వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన 25 ఏళ్ల రచడపాంగ్ ప్రసిత్కు కొరియాకు చెందిన వ్యక్తిలాగా కనిపించడం అంటే ఇష్టం. అతడేమో థాయ్‌లాండ్‌కు చెందినవాడు. అందుకోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 వరకు సర్జరీలు చేయించుకుని అసలు ముందున్న ముఖానికి, ప్రస్తుతం ఉన్న ముఖానికి కొంచెం కూడా సంబంధం లేకుండా తయారయ్యాడు. ఓ రకంగా కొత్త ముఖం పెట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. దీంతో ఆసియా మొత్తం ప్రసిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే కొరియాకు చెందిన సింగర్, నటుడు మిన్హోను స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు దగ్గరి పోలికలు ఉండేలా ముఖాన్ని మార్చుకున్నాడు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. తాను డ్యాన్సర్‌ను అని, ఎన్ని టీవీ షోలకు ఆడిషన్స్ ఇచ్చినా ఎంపిక కాలేదని ప్రసిత్ చెప్పాడు. తన ముఖం వల్ల వ్యక్తిగతంగా గానీ, వృత్తి పరంగా కానీ తాను విజయవంతం కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తన ముఖాన్ని మార్చుకోవడమేననే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు. తన ముఖం మొత్తం ఇలా మార్పు చెందేందుకు రెండేళ్లు పట్టిందట. ముఖం మారిన తర్వాత లక్కు కలిసొచ్చిందని, డ్యాన్సర్‌గా చాలా టీవీ షోలు చేస్తున్నానని, జీవితం ఇప్పుడు సెట్ అయిందని సంతోషపడుతున్నాడు. మొత్తానికి కొరియా వాళ్ల ముఖం అంటే పిచ్చో.. లేదా కెరీర్ మీద దృష్టో కానీ ప్రసిత్ జీవితం అలా ప్రశాంతంగా గడిచిపోతోంది. -
మనిషి మూర్ఖత్వానికి పరాకాష్ట.. ఈ ఫొటోలు!
జకార్తా : ప్లాస్టిక్ భూతానికి మరో సముద్ర జీవి బలైంది. ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ తిమింగలాన్ని.. తరలించేందుకు ప్రయత్నించగా దాని శరీరం చెల్లాచెదురైపోయింది. ఈ హృదయ విదారక ఘటన ఇండోనేషియాలోని కపోటా ఐలాండ్‌లో చోటుచేసుకుంది. పర్యావరణాన్ని మనిషి ఎంతలా నాశనం చేస్తున్నాడు అనే దానికి తార్కాణంగా నిలిచింది. వివరాలు... ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కులోని ఓ తిమింగలం సోమవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. విగత జీవిగా పడి ఉన్న ఆ తిమింగలాన్ని పార్కు అధికారులు అక్కడి నుంచి తొలగించే క్రమంలో దాని పొట్టలో నుంచి సుమారు వెయ్యి రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు(6 కిలోల ప్లాస్టిక్) బయటపడ్డాయి. కాగా ప్లాస్టిక్‌ను మింగడం వల్లే ఆ తిమింగలం మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ తిమింగలానికి సంబంధించిన ఫొటోలు పర్యావరణ హితులనే కాక యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్‌పై పోరాడాల్సిన ఆవశ్యకతను మరోమారు గుర్తుచేస్తున్నాయి. తిమింగలం శరీరం నుంచి బయటపడ్డ కప్పులు, చెప్పులు, స్ప్రింగులు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కావాలా!? ఇండోనేషియాలోని వకాటోబి జాతీయ పార్కు వైవిధ్యమైన జీవజంతుజాలాలకు ఆనవాలం. బందా, ఫ్లోర్స్ సముద్రాల మధ్య కేంద్రీకృతమైన ఈ మెరైన్ పార్కు సుమారు 942 రకాల చేప జాతులు, 750 రకాల పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఈ క్రమంలోనే 2005 నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపుతోంది. అయితే ప్రస్తుతం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ తిమింగలం శరీరంలో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన పర్యావరణ ప్రేమికులు ఇండోనేషియా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం తర్వాత విషయం.. ముందు ప్లాస్టిక్ రక్కసిని కట్టడి చేసి జీవజాతులకు రక్షణ కల్పిస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్నారు. చైనా తర్వాత ఇండోనేషియానే! ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయని మెక్‌నెసీ సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ 2015లో నివేదిక వెల్లడించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో చైనా తర్వాత ఇండోనేషియా అత్యంత దుర్భర స్థితిలో ఉందని పేర్కొంది. తీర ప్రాంత అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను అక్కడ పడేయడం వల్లే సముద్ర జీవులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని తెలిపింది. (మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది) కాగా ఇండోనేషియా సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన తిమింగలం శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లభించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్లాస్టిక్ వినియోగం అనే జాఢ్యం కేవలం ఒక్క ఇండోనేషియాకే పరిమితం కాలేదని.. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ప్రమాణాలు చేయిస్తోన్న అనేక దేశాలు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలని ఓ వైపు ఉపన్యాసాలు దంచుతున్న మానవాళి.. తన మూర్ఖత్వంతో భూమిపై నివసిస్తున్న మిగిలిన జీవజాతులను ఇబ్బంది గురి చేయడంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. -
మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. శబరిమలలో మాదిరిగా ఇక్కడి దేవస్థానాల్లో కూడా ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనికిగాను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఉపయోగించాలని సూచించింది. ఉల్లంఘనలను ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటి చర్యలకు ఉపక్రమించాలని తేల్చి చెప్పింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. నిబంధనలు సరళంగా, సూటిగా ఉండాలని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ నిషేధంపై స్థానికసంస్థలకు, దేవాదాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంది. మనిషి వంటి క్రూర జంతువు నిస్సందేహంగా ఈ భూగ్రహం మీదే లేదని, మనిషన్న ఓ జంతువు తాను అడుగుపెట్టిన ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో స్పష్టంగా వివరించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల ఇబ్బందులను, నిర్వహణ లోటుపాట్లను సరిదిద్దే దిశగా సుప్రీం తీర్పు అమలులో భాగంగా నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయాధికారులు స్థానిక దేవస్థానాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా మలచిన వాటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ధర్మాసనం స్పందిస్తూ ఢిల్లీలో ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో ఉందని తెలిపింది. శబరిమలలో 100% ప్లాస్టిక్ నిషేధం... శబరిమలలో ప్లాస్టిక్‌పై 100 శాతం నిషేధం అమల్లో ఉందని ధర్మాసనం తెలిపింది. న్యాయస్థానాలు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే అక్కడ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తుండటం విశేషమని పేర్కొంది. కర్పూరం, పసుపు, మిరియాలు వంటివి కూడా ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లడం లేదంది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే రావాలని పేర్కొంది. 90 శాతం నాలాలు ప్లాస్టిక్ కారణంగా మూసుకుపోతున్నాయని తెలిపింది. జంతువులు కూడా ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువాత పడుతున్నాయంది. మనిషి వంటి క్రూరమృగం ఈ భూగ్రహంపైనే లేదన్న ధర్మాసనం, అభివృద్ధి పేరుతో జంతు ఆవాసాలను కూడా మనిషి ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల అడవుల్లో అనేక జంతువులు ఆకస్మికంగా మృతి చెందుతున్నాయని, వీటిని మనుషులే చంపుతున్నారా? అవే చనిపోతున్నాయా? అన్నది మిస్టరీగా మారిందని పేర్కొంది. ప్లాస్టిక్ కాగితాలు, కవర్లు తిని జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమంది. జీవ మనుగడకు ప్లాస్టిక్ నిషేధమవసరం.. ఈ భూమి మీద మనిషితోపాటు ఇతర జంతుజాలాలు బతికి బట్టకట్టాలంటే, ప్లాస్టిక్ నిషేధం జరిగి తీరాలని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షణ చట్టం కింద ఉన్న అధికారాలను ఎందుకు ఉపయోగించడం లేదని ప్రభుత్వాలను ప్రశ్నించింది. నిబంధనల అమలులో చూపాల్సింది చిత్తశుద్ధేనని గుర్తు చేసింది. దేవస్థానాల్లో ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక సంస్థలకు, దేవాలయాలకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారిని ప్రాసిక్యూట్ చేయడం, భారీ జరిమానాలు విధించడం వంటివి చేపట్టాలంది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ఉభయ రాష ్ట్రప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
చిరిగిన విస్తరి..
ఆదిలాబాద్‌రూరల్: ఒకప్పుడు పెళ్లిళ్లు, పేరంటాల్లో, పండుగల్లో విస్తరాకుల్లో భోజనం వడ్డిస్తే ఓ గొప్ప మర్యాద. నాలుగు ఆకులు బయటపడితే శుభకార్యం జరిగినట్లు. విస్తరాకుల్లో నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తే గొప్ప శుభకార్యం జరిగినట్లు భావించేవారు. కాని మారిన పరిస్థితులతో విస్తర్ల మనుగడ కష్టమవుతుంది. ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు రావడంతో విస్తరి ఆకులు కనిపించకుండా పోయాయి. దీంతో అనివార్యంగా తయారీదారులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆకుల తయారీపైనే ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. విస్తర్ల తయారీదారులు గిరాకీ లేక, కుటుంబ పోషణ భారమై దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ పట్టణాలతో పాటు మండలాల్లో ఈ వృత్తిపై ఆధారపడి సుమారు 200 నుంచి 300 కుటుంబాలకు పైగా జీవనోపాధి పొందుతున్నారు. గ్రామాల్లో కుట్టిన విస్తరాకులను రకరకాల నమునాల్లో కత్తిరించి నగరా ప్రాంతాలకు సరఫరా చేసి జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం రోజంతా కష్టపడుతున్నా కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. మోదుకు ఆకుల కోసం అటవీ ప్రాంతాలకు వెళ్లినపుడు కొంత మంది మృత్యువాత పడిన సంఘటనలు సైతం అనేకంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కబళించిన రియల్ ఎస్టేట్.. విస్తరాకుల తయారీ వృత్తిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కబళిస్తోంది. కొన్ని చోట్ల వ్యవసాయ పొలాలు ఇళ్ల స్థలాలుగా, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములను చదును చేసి వ్యవసాయం సాగు చేస్తున్నారు. అటవీ భూములను చదును చేయడంతో మోదుగ చెట్లు మాయమయ్యాయి. మరికొన్ని చోట్లా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొని చుట్టూ ఫెన్సింగ్ చేయడంతో అందులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తయారీదారులు రోజుల కొద్దీ ఆకుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో వారికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కనీసం కూలీ డబ్బులు కూడా రాలేని దుస్థితి నెలకొందని తయారీదారులు పేర్కొంటున్నారు. ఇలాగైతే వృత్తి కనుమరుగు అయ్యే ప్రమాదం నెలకొంటుందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి పరిస్థితి ఏంటన్నది అగమ్యగోచరంగా మారింది. కనీసం తమ కుటుంబాల్లో ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగావకాశాలను కల్పించాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వాలు రుణాలను అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఆలయాల్లోనూ ప్లాస్టిక్కా...?
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రాణం పోయాల్సిందిపోయి దాని ఊపిరి తీసి పాతరేస్తారా? దేవుడిచ్చిన ప్రకృతి ప్రకోపించేలా చేస్తారా?.. ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమే కాకుండా ప్రకృతిపై ప్రతికూల పరిణామాలు ఉంటాయని తెలియదా? దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడూ పర్యావరణానికి ముప్పు తెచ్చే మహాపాపానికి ఒడిగడతారా? ఆలయా ల్లోనైనా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అడ్డుకోలే రా? అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. భూ గ్రహానికి అతి హీనమైన జాతిగా మానవుడు అడుగుపెట్టాడంటూ వ్యాఖ్యానించింది. దేవుడి పూజ సామగ్రిని ప్లాస్టిక్‌కవర్లో తీసుకువెళ్లే కొందరు భక్తుల కారణంగా ఆలయాల్లో అపరిశుభ్రతే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఆలయాల్లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేసేందుకు ఏం చేస్తున్నారో తెలియచేయాలని 2 ప్రభుత్వాలను ఆదేశించింది. వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మొత్తం వ్యవహారంలో కోర్టుకు సహకరించాలని ఇరు రాష్ట్రాల ఏజీలను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మత సంస్థల నిర్వహణ, సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఆయా జిల్లాల ఆలయాల్లోని పరిస్థితులపై హైకోర్టుకు నివేదికలు అందజేశారు. వీటిని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాలుగా పరిగణించి మంగళవారం విచారణ చేపట్టింది. పుణ్యం కోసం ఆలయాలు, మత సంస్థలకు ప్లాస్టిక్ కవర్లతో వెళ్లి ప్రకృతికే ముప్పు వాటిల్లే పాపానికి ఒడిగడతారా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాల్లో ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని అమలు చేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వాల వైఖరిని తెలియజేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలుపై 2 ప్రభుత్వాలతోపాటు కాలుష్య నియంత్రణ మండళ్లు తమ వైఖరిని కూడా చెప్పాలని కోరింది. ప్రభుత్వాల తరఫున అడ్వొకేట్ జనరల్స్ వాదనల నిమిత్తం విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
వేడి తగ్గించే వినూత్న పదార్థం!
నాటింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. తనంతట తానే ఉష్ణోగ్రతను తగ్గించుకునే ఓ పదార్థాన్ని తయారు చేయగలిగారు. అంతేకాదు.. ఈ పదార్థంతో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స కల్పించవచ్చు... అంతరిక్షంలో రేడియోధార్మికత తదితర శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు కూడా. కృత్రిమ ప్లాస్టిక్... అతిసూక్ష్మస్థాయి చానెళ్లు.. కొన్ని ద్రవాలతో రూపొందిన ఈ కొత్త పదార్థం ధర్మాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మొక్కలు, మానవ శరీరాల మాదిరిగా పనిచేసే ఈ పదార్థం కాలిన గాయాల నుంచి వేడిని తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుందని.. తద్వారా గాయం తొందరగా మానేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మార్క్ ఆల్ట్సన్. అంతేకాకుండా.. అంతరిక్ష ప్రయాణాల్లో సౌర రేడియోధార్మికత కారణంగా వేడి విపరీతంగా పెరిగిపోతూంటుందని.. ఈ వేడిని క్రమ పద్ధతిలో తగ్గించడం.. ఒక దగ్గర కేంద్రీకృతమయ్యేలా చేయడం.. ఆ తరువాత ఆ వేడిని విద్యుత్తుగా మార్చగలగడం ఈ పదార్థం ప్రత్యేక లక్షణమని వివరించారు. ప్రస్తుతం తాము ఈ పదార్థాన్ని పరిశోధనశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశామని.. తగినన్ని నిధులు సమకూర్చుకున్న తరువాత వాణిజ్య స్థాయిలో పరిశోధనలు చేస్తామని వివరించారు. మూర్ఛను ముందుగా గుర్తించే పరికరం... మూర్ఛ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయో చెప్పడం కష్టం. ఏమాత్రం ముందు తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన గాయాలు, ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చు. ఐండోహోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పుడు అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశారు. చేతి కంకణం మాదిరిగా తొడుక్కునే ఈ యంత్రాన్ని తాము 28 మంది రోగులపై పరీక్షించి సత్ఫలితాలు సాధించామని... మూర్ఛ వచ్చే ముందు ఈ యంత్రం ఓ అలారం మోగిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జొహాన్ అరెండ్స్ తెలిపారు. గుండె కొట్టుకునే వేగం, కదలికలను గుర్తించే సెన్సర్ల ద్వారా ఈ యంత్రం పనిచేస్తుందని చెప్పారు. పరీక్షల సమయంలో ఈ యంత్రం 96 శాతం సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. మూర్ఛ రోగం ఉన్నవారిలో ఆకస్మిక దాడుల కారణంగా 20 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. ఈ యంత్రాన్ని వాడటం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. శబ్దాలు, వీడియోల ద్వారా కూడా అలారం పని చేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాయు, ధ్వని కాలుష్యంతో గుండెజబ్బులు! వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఒక్కటే గుండెకు సమస్య కాదు.. వీధుల్లోని రణగొణ ధ్వనులు కూడా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్ అండ్ పబ్లిక్‌హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్‌లో 2000 నుంచి 2008 వరకూ గుండెపోటుతో మరణించిన వారి వివరాలను పరిశీలించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్ రిసీ తెలిపారు. ఉపగ్రహ చిత్రాల సాయంతో గాల్లోని కాలుష్యకారక కణాల మోతాదులు, స్విట్జర్లాండ్‌లోని మొత్తం 1834 కేంద్రాల నుంచి సేకరించిన నైట్రోజన్ డయాక్సైడ్ వివరాలను... ఎనిమిదేళ్ల మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన 19,261 మంది వివరాలతో జోడించి చూసినప్పుడు ఈ ఫలితాలు వచ్చినట్లు రిసీ తెలిపారు. కాలుష్య కారక కణాలు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎక్కువైన కొద్దీ మరణాల రేటు కూడా ఎక్కువవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అలాగే ప్రతి ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మోతాదు పది డెసిబెల్స్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం రెండు శాతం వరకూ పెరిగిందని చెప్పారు. -
సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం పేర్కొంది. మచిలీపట్నం-సికింద్రాబాద్(07049/07050) రైలు ఈ నెల 21న మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.05కు బయలు దేరి రాత్రి 10.45కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు రాత్రి 11.55కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు మచిలీపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్- నర్సాపూర్(07260) రైలు ఈ నెల 19న రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 7కు నర్సాపూర్ చేరుకుంటుంది. విజయవాడ-సికింద్రాబాద్ రైలు(07207) 18న రాత్రి 10కి విజయవాడలో బయలుదేరుతుంది. పలు రైళ్లు రద్దు: విజయవాడ-తిరుపతి (07047) ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీన, తిరుపతి-అనకాపల్లి(07145) ప్రత్యేక రైలు ఈ నెల 19న రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘పెరిగిన ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు’ సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. సాధారణ రోజుల్లో టిక్కెట్ ధర రూ.10 ఉండగా, ప్రస్తుతం రూ.20 కి పెంచారు. పెరిగిన చార్జీలు ఈ నెల 21వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ వంటి ప్రధాన రైల్వేస్టేషన్లలో మాత్రమే చార్జీలు పెంచినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో సాధారణంగా ప్రతి రోజు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా దసరా రద్దీ దృష్ట్యా ప్రతిరోజు మరో 30 వేల మంది అదనంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ప్లాట్ఫారాలపైన ఒత్తిడి పెరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు తాత్కాలికంగా చార్జీలను పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మిగతా స్టేషన్లలోనూ రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి :దక్షిణ మధ్య రైల్వే జీఎం సూచన సాక్షి, హైదరాబాద్: సరుకు లోడింగ్ విషయా ల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ అధికారు లకు సూచించారు. ఈ మేరకు సోమవారం రైల్ నిలయంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ రైల్వే డివిజన్ల డీఆర్ఎంలతో సమీక్ష నిర్వహించారు. భద్రతా పరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని, బొగ్గు, సిమెంట్, లైమ్ స్టోన్ తదితర సరుకు లోడింగ్‌లపై ప్రణాళికతో పని చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్, కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద పనుల వేగం పెంచాలన్నారు. సమావేశంలో ఏజీఎం థామస్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఘోరం : కార్మికుడు మెషీన్లో ఉండగానే..
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు కత్తుల చట్రంలో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. వివరాలు.. రోజూలాగే ఫ్యాక్టరీలో పనికి వెళ్లిన వాజిద్ (25) ఒక బేడ్లతో కూడిన ఒక మెషీన్‌లోకి దూరి శుభ్రం చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో కార్మికుడు వాజిద్ మెషీన్‌లోకి వెళ్లింది గమనించకుండా స్విచాన్ చేశాడు. అంతే.. క్షణాల్లో వాజిద్ శరీరాన్ని మెషీన్లో ఉన్న పదునైన బ్లేడ్లు తునాతునకలు చేశాయి. బాధితుడి ఆర్తనాదాలు విన్న ఆ ఉద్యోగి మెషీన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. వాజిద్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన నొయిడా సెజ్ (ఆర్థిక మండలి)లోని ఓ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయనీ, నిందితున్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మృతుని కుంటుంబం బిహార్‌లోని ఛప్రా జిల్లా నుంచి నొయిడాకు వలస వచ్చిందని వెల్లడించారు. -
ప్రజలు ఎందుకు మారడం లేదు ?
సాక్షి, ముంబై : ముంబై వీధుల్లో ప్రతి ఏటలాగా ఈసారి కూడా దాదాపు రెండు లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో కేవలం 18 శాతం విగ్రహాలు మాత్రమే మట్టి విగ్రహాలు. మిగతా వన్నీ కూడా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ’ తో చేసినవే. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి పీవోపీ విగ్రహాలకు స్వస్తి చెప్పాలనీ, పర్యావరణానికి మేలు కలిగించే మట్టి లేదా కాగితపు గుజ్జు విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆ విఘ్నేశ్వరుడి సాక్షిగా చెబుతున్నా ప్రజల్లో ఆశించిన చైతన్యం ఎందుకు రావడం లేదు? కారణాలు ఏమిటీ? ఇదే విషయమై మట్టి విగ్రహాలను మాత్రమే తయారు చేసి అమ్ముతున్న 46 ఏళ్ల వినోద్ విజయ్ నెవ్సేను ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను తయారు చేయడానికి చాలా సమయం పట్టడమే కాకుండా డబ్బు ఖర్చు కూడా ఎక్కువవుతుందని, లాభాలు తక్కువ వస్తాయని చెప్పారు. రెండు అడుగుల మట్టి విగ్రహాన్ని విక్రయించడం ద్వారా తనకు 300 నుంచి 400 రూపాయల వరకు లాభం వస్తుందని, అదే రెండు అడుగుల పీవోపీ విగ్రహాన్ని అమ్మితే 1200 రూపాయల లాభం వస్తుందని ఆయన చెప్పారు. పైగా మట్టి విగ్రహాలు ఎక్కువగా అమ్ముడు పోవని, ఈ సీజన్లో తాను కేవలం 175 విగ్రహాలను మాత్రమే అమ్మగలిగానని చెప్పారు. అదే ఇతరులు పీవోపీ విగ్రహాలను వెయ్యి వరకు విక్రయించారని చెప్పారు. మరో వృత్తితో కొనసాగుతున్నందున తనకు ఈ మట్టి విగ్రహాల తయారీ పెద్ద భారం అనిపించడం లేదని ఆయన తెలిపారు. వినోద్ విజయ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచే స్తున్నారు. ఈ సీజన్లో మాత్రమే మట్టి విగ్రహాలను తయారు చేసి అమ్ముతుంటారు. వినోద్ విజయ్‌కి సమీపంలోనే చేతన్ వరాస్కర్ ప్రతీకార్త్ వినాయక విగ్రహాల పరిశ్రమ ఉంది. ఈ సీజన్లో ఆయన దాదాపు వెయ్యి విగ్రహాలను విక్రయించారట. అందులో 20 శాతం మాత్రమే మట్టి విగ్రహాలు ఉన్నాయట. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నప్పటికీ ఎందుకు పీవోపీ విగ్రహాల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించగా, మట్టి విగ్రహాలను పరిమిత సైజులోనే తయారు చేయ గలమని, పెద్ద విగ్రహాలను తయారు చేయలేమని చెప్పారు. వీధుల్లో ప్రతిష్టించే విగ్రహాలు పెద్దవిగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తారుకనుక తాము పీవోపీనే ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాకుండా మట్టి విగ్రహాలకు పగుళ్లు వస్తాయని, రంగును కూడా ఎక్కువ పీల్చుకుంటాయని, అవే పీవోపీ విగ్రహాలకు పగుళ్లు రావని, రంగు తక్కువ పడుతుందని, పైగా ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన చెప్పారు. అన్నింటికన్నా లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని విగ్రహాల తయారీలో మూడో తరానికి చెందిన చేతన్ వరాస్కర్ వివరించారు. ఈ కారణాల వల్లనే తాను కూడా పీవోపీ విగ్రహాలనే ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు. కేవలం వృత్తిగురించి ఆలోచించే చేతన్ వరాస్కర్ లాంటి వాళ్లకు పీవోపీ విగ్రహాల వల్ల కలిగే నష్టం గురించి పెద్దగా తెలియదు. తెలిసినా పట్టించుకోరు. వినాయక విగ్రహాలన్నింటిని తీసుకెళ్లి నిమజ్జనం రోజున నీటిలో వేస్తారన్న విషయం తెల్సిందే. మట్టి విగ్రహాలయితే 45 నిమిషాల్లోనే నీటిలో కరిగి పోతాయి. పీవోపీ విగ్రహాలు నీటిలో కరగాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అది కరగడం వల్ల నీటిలో క్లోరిన్, లవణాలు, మురికి పెరుగుతాయి. పర్యవసానంగా నీటి సాంద్రత పెరిగి ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా చేపలు, కప్పల లాంటి జలచరాలు చనిపోతాయి. పీవోపీ విగ్రహాలకు ఉపయోగించే రసాయనిక రంగుల వల్ల నీరు విషతుల్యమై జల చరాలు చనిపోతాయి. విషతుల్యమైన నీటి ప్రభావం మానవులపై కూడా పడుతుంది. మట్టి విగ్రహాల వల్ల నీటిలో మట్టి పెరగడం తప్ప మరో ముప్పు లేదు. ఇప్పుడు మట్టి విగ్రహాలను కూడా నీటిలో నిమజ్జనం చేయకుండా నేలలో నిమజ్జనం చేయడం కోసం వివిధ రకాల చెట్ట గింజలు కలిగిన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తద్వారా చెట్ల పెరుగుదలకు దోహదపడవచ్చని స్వచ్ఛంద సంస్థల ఆలోచన. కాగితపు విగ్రహాలను ప్రోత్సహించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయిగానీ కాగితపు గుజ్జుతో తయారుచేసే ఆ విగ్రహాలు మట్టివాటికన్నా ఖరైదనవి. పాలల్లో ముంచి పేదలకు పంచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాక్లెట్ విగ్రహాలను తయారు చేస్తుండగా, మరికొన్ని సంస్థలు చేపలు తినడానికి వీలుగా చెరకు గడలు, కొబ్బరి చిప్పలతో విగ్రహాలను తయారు చేయించి ప్రోత్సహిస్తున్నాయి. ఇలా ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నా ప్రజల్లో ఆశించిన మార్పు రాకపోవడానికి కారణం కాసులపైనున్న మమకారమే. కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించినట్లుగా పీవోపీ వాడకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తే తప్పా మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఓట్ల రాజకీయాలను ఆశ్రయించే ప్రభుత్వాలు అంత పెద్ద నిర్ణయం తీసుకంటాయని ఆశించలేం! -
అన్న చెబితేనే...
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు భోజనం చేసే ప్లేట్ల సరఫరాలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత తన పట్టు వీడలేదు. దీంతో ఎంఈఓలు కూడా ‘‘అన్న చెబితేనే’’ అని తెబుతుండడంతో ధర్మవరం, బత్తలపల్లి మండలాలకు ప్లేట్ల సరఫరా పెండింగ్‌లో పడింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. మార్చి నుంచే సరఫరా చేసినా... జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న మొత్తం 3,29,145 మంది విద్యార్థులకు ప్లేట్లు సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీ సంస్థ టెండరు దక్కించుకుంది. జిల్లాలో రవాణా బాధ్యతలను విజయ్‌కుమార్ అనే వ్యక్తికి అప్పగించారు. మార్చి నెల నుంచే జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయగా.. జూన్‌లోపు ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మినహా తక్కిన అన్ని మండలాలకు సరఫరా చేసేశారు. వివరణ ఇచ్చినా... ఫలితం లేదు ఏడు మండలాలకు సరఫరా చేయని విషయమై సంబంధిత ట్రాన్స్పోర్ట్ ప్రతినిధి విజయ్‌కుమార్‌కు విద్యాశాఖ నోటీసు జారీ చేసింది. దీనికి ఆయన వివరణ ఇస్తూ ‘‘56 మండలాలకు సరఫరా చేశాం. తక్కిన ఏడు మండలాలకు గాను ఐదు మండలాల ఎంఈఓలు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ధర్మవరం, బత్తలపల్లి ఎంఈఓలు ససేమిరా అంటున్నారు..మేమైతే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వివరణలో పేర్కొన్నాడు. ఇప్పటికి 15 రోజులవుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. నేటి నుంచి ఐదు మండలాలకు సరఫరా మిగిలిపోయిన ఏడు మండలాల్లో ధర్మవరం, బత్తలపల్లి మినహా తక్కిన ఐదు మండలాలకు గురువారం నుంచి ప్లేట్లు సరఫరా చేయనున్నారు. దీనిపై ట్రాన్స్‌ఫోర్ట్ ప్రతినిధి విజయ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, ధర్మవరం, బత్తలపల్లి మండలాలకు సరఫరా చేసే విషయమై విద్యాశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. సరఫరా చేసి తీరాల్సిందే ఏడు మండలాలకు కచ్చితంగా సరఫరా చేయాల్సిందే. ఎంఈఓలతో పనిలేదు. నేరుగా స్కూల్ కాంప్లెక్స్‌లో అందజేసి అక్కడి హెచ్ఎంలతో సంతకాలు చేయించుకోవాలని చెప్పాం. ఆ హెచ్ఎంలు తీసుకునేందుకు నిరాకరిస్తే మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాని ఎంఈఓలు వద్దన్నారంటే కుదరదు.–దేవరాజు, విద్యాశాఖ ఏడీ -
‘మిస్డ్ కాల్’తో ఇంట్లో స్వచ్ఛత
‘ఒక టన్ను పేపర్ రీస్లైకింగ్ చేయడం వల్ల 17 చెట్లను రక్షించినట్టవుతుంది.ఒక ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ నెలకు60 వాట్ల విద్యుత్‌ను ఆదా చేస్తుంది.ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను విసిరిస్తే అది కనుమరుగు కావడానికి 500 ఏళ్లు పడుతుంది.ఇలా ఇంట్లో ఉండే చెత్తకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూనే ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తామంటున్నారు నగరానికి చెందిన బిందు, లత, రీతూలు. స్వచ్ఛభారత్ తరహాలోనే ఈ ముగ్గురు కార్పొరేట్ ఉద్యోగులు ‘స్క్రాప్‌క్యూ’స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో ఓ మూలన పడేసే పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కొనుగోలు చేసి ఇంటి స్వచ్ఛతతో పాటు ఆర్థికంగానూ బాసటగా ఉంటున్నారు వీరు. ఈ చెత్త రీసైక్లింగ్ కోసం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. హ్యాపీ స్మైల్ ఫౌండేషన్‌కు విరాళాలిస్తూ వారి సేవలో పరోక్షంగా భాగస్వామ్యులవుతున్నారు. చెత్తతో మేలంటూ ప్రచారం.. ఇంట్లో చెత్త ఉండడం వల్ల కలిగే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలంలో అయితే ఈ తిప్పలు చెప్పనక్కర్లేదు. ఇంట్లో శుభ్రతకు ఈ చెత్త ఎప్పుడూ అడ్డే. నగరంలో ఎక్కువ మంది అద్దెదారులే. దీంతో ఆ చెత్తను ఉన్న ఇంట్లోనే ఓ మూలాన పెడుతుంటారు. చెత్త కొనేవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారు. ఇంకొందరు వీలు చూసుకుని స్క్రాప్ దుకాణం ఎక్కడో వెదుక్కొని మరీ ఈ చెత్తను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నగరంలో చెత్తను ఎక్కడిపడితే అక్కడ పడేయడం వల్ల కలిగే అనర్థాలను, రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను బిందు, లత, రీతూ ప్రజలకు వివరిస్తున్నారు. ‘తొలుత సామాజిక మాధ్యమాలను ప్రచారం కోసం ఎంచుకున్నాం. ఆ తర్వాత కాలనీలు, వీధుల్లో ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చివరకు ఇంటి ఇంటికీ వెళ్లి చెత్త విశిష్టతను తెలియజేస్తూ వాటిని పడేయవద్దని చెబుతున్నా’మంటున్నారు వీరు. మిస్డ్ కాల్‌తో మీ ఇంటికి.. ‘మీ ఇంట్లో పేపర్, ప్లాస్టిక్, అట్టపెట్టెలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటే 040–30707070 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మా సిబ్బంది మీరు ఏ సమయం ఇస్తే ఆ సమయంలో వచ్చి డబ్బులు చెల్లించి చెత్త కొంటారు’ అని చెబుతున్నారు ఈ యువతులు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్క్రాప్‌క్యూ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేయాలని వివరిస్తున్నారు. -
110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ (ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎక్స్పొజిషన్ ) –2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాప్మా (తెలంగాణ అండ్ ఏపీ ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్)తో కలసి రంగారెడ్డి జిల్లాలోని తుమ్మలూరులో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ పరిశ్రమల ఏర్పాటు కోసం రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పెట్టుబడులు రాబట్టేందుకు 14 ప్రాధాన్యతా రంగాలను రాష్ట్రం గుర్తించిందని.. అందులో పాలిమర్స్, ప్లాస్టిక్స్ కీలకంగా ఉన్నాయన్నారు. 1957లోనే భారత్‌లో ప్లాస్టిక్ పరిశ్రమకు పునాదులు పడ్డాయని చెప్పారు. తెలంగాణలో ఆరు వేల ప్లాస్టిక్స్ పరిశ్రమల ద్వారా ఏటా ఆరు వేల కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ లు ప్రతి సంవత్సరం 9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదన సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు. సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్‌ను చాలా రాష్ట్రాల్లో నిషేధించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వాటిపై మార్గదర్శకాలు రూపొందిస్తోందని తెలిపారు. పర్యావరణానికి హాని చేయని పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. రీయూజబుల్ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు దోహదం చేసే రీసైక్లింగ్ పరిశ్రమలకు అదనపు రాయితీలు కల్పిస్తామని అన్నారు. 350 స్టాళ్లు.. 50 వేల మంది వీక్షకులు.. ఐప్లెక్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అనిల్‌రెడ్డి వెన్నం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఐప్లెక్స్ ఎగ్జిబిషన్లో 350 స్టాల్స్ ఏర్పాటు చేశారని, 50 వేల మంది సందర్శకులు వీక్షించనున్నారని చెప్పారు. వంద మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యాపా రం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐపీఈటీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఎస్.కె.నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీఐపీఈటీ ద్వారా ప్లాస్టిక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందన్నారు. 3, 4 శాతం ఉత్పత్తులే ప్లాస్టిక్‌కు చెడ్డపేరు తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్స్ భవన్ కోసం రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు టాప్మా అధ్యక్షుడు వేణుగోపాల్ జాస్తి విన్నవించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్రో కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ వర్మ, ఆలిండియా ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హిటెన్ బెడా, వివిధ కంపెనీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
ప్లేటు ఫిరాయించారు
ప్రభుత్వ పాఠశాలలు.. అందరూ బడుగు..బలహీన వర్గాల వారే. మధ్యాహ్న భోజనం ప్రభుత్వమే అందిస్తున్నా...తినేందుకు ప్లేట్లు కూడా లేని దుస్థితి. ఒకే ప్లేటులో ఇద్దరు తినడం..లేదా ఒకరు తిన్న తర్వాత మరొకరు తినాల్సిన పరిస్థితి. అందుకే ప్రతి విద్యార్థికీ భోజనం ప్లేటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ప్లేట్లు సరఫరా చేయడంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు అడ్డుకుంటూ రాజకీయం చేయడంతీవ్ర విమర్శలకు తావిస్తోంది. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొత్తం 3,29,145 మంది 1–10 తరగతుల విద్యార్థులకు ప్లేట్లు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనే సంస్థ ప్లేట్లు సరఫరా చేసే టెండరు దక్కించుకుంది. జిల్లాలో రవాణా బాధ్యతలను విజయ్‌కుమార్ అనే వ్యక్తికి అప్పగించారు. జనవరి నుంచి మార్చి నాటికి జిల్లా కేంద్రానికి అన్ని ప్లేట్లు వచ్చాయి. ఇక్కడి నుంచిమార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వివిధ మండలాలకు 2,93,368 ప్లేట్లు పంపిణీ చేశారు. ఇంకా ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలు మాత్రం మిగిలిపోయాయి. ఆ ఇద్దరు ఎంఈఓలు ససేమిరా బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలు భోజనం ప్లేట్లు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారని రవాణా ఏజెన్సీ ప్రతినిధి విజయకుమార్ వాపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కలవమని చెప్పారని, టెండరు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, తాము కేవలం జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ పాయింట్లకు రవాణా చేసేవరకే చూస్తున్నామని చెప్పినా... వినకుండా వెనక్కు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. సరఫరా చేసిన తర్వాత రిసీవింగ్ సంతకం చేయకపోతే తాము ఇబ్బందులు పడతామంటున్నాడు. ఈ రెండు మండలాలు కాకుండా పుట్టపర్తి, నార్పల, కొత్తచెరువు, గోరంట్ల మండలాలకు సరఫరా చేద్దామంటే ఏడు మండలాలకు సరఫరా చేసి వారితో సంతకాలు చేయించుకుని వస్తేనే బిల్లులు చేస్తామంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారనీ, అలా వారికి సరఫరా చేశాక వారు సంతకం పెట్టక పోతే రవాణా చార్జీలు నెత్తిన పడతాయన్న ఉద్దేశంతో పెండింగ్ పెట్టామంటున్నాడు. కాగా..ప్లేట్ల సరఫరాలో నెలకొన్న రాజకీయం గురించి విద్యాశాఖ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఈఓలకు ఫోన్లు చేసి గట్టిగా చెప్పడం లేదు. ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి ఏడు మండలాలకు సరఫరా చేసేందుకు భోజనం ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలకు రోజూ ఫోన్లు చేస్తున్నాం. వారు స్పందించడం లేదు. విద్యాశాఖ అధికారులేమో అన్ని మండలాలకు సరఫరా చేసిన తర్వాతే సంతకాలు పెడతామంటున్నారు. మేము సరఫరా చేసిన తర్వాత వారు సంతకాలు చేయకపోతే నష్టపోతాం. ఎవరైనా తీసుకోకపోతే విజయవాడకు వెనక్కు పంపాలని టెండరుదారు చెప్పారు. కొద్దిరోజులు చూసి వెనక్కు పంపిస్తాం. – విజయ్‌కుమార్, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధి ఫిర్యాదు చేస్తే చర్యలు ఏడు మండలాలకు భోజనం ప్లేట్లు సరఫరా చేయలేదు. టెండరుదారుతో మాట్లాడాం. రెండుమూడు రోజుల్లో అన్ని మండలాలకు సరఫరా చేస్తాం. ప్లేట్లు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా ప్లేట్లు తీసుకోలేదన్న విషయం ఓరల్‌గా చెబితే కుదరదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సరఫరా ఏజెన్సీకి చెప్పాం.– దేవరాజు, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
తండ్రి తిట్టాడని 2 కేజీల సిమెంట్ మింగాడు!
కోల్‌కతా: కంటిచూపు మందగించడం, మరోవైపు తండ్రి మందలింపుతో మనస్తాపం చెందిన ఓ యువకుడు(20) సిమెంట్ మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. పాకుర్ జిల్లాకు చెందిన బిమల్ పాల్ సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న బిమల్ను అతని స్నేహితులు వెక్కిరించేవారు. తనకు విగ్రహాల తయారీలో సాయం చేయకుండా సోషల్‌మీడియాలో సమయం వృథా చేయడంపై బిమల్ను బుధవారం తండ్రి బిరేన్ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిమల్ తండ్రి పనికోసం వాడుతున్న 2 కేజీల సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో బాధితుడ్ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ వైద్య కళాశాలలో చేర్చారు. వైద్యుల బృందం ఆపరేషన్ చేసి బిమల్ కడుపులోని సిమెంట్, ప్లాస్టర్‌ను వెలికితీశారు. -
పెళ్లికొచ్చి...ప్లేట్ల కోసం తన్నుకున్నారు
బల్లియా, ఉత్తరప్రదేశ్ : పెళ్లికి వచ్చిన అతిథిలు మధ్య భోజన ప్లేట్ల కోసం జరిగిన గొడవలో ఒకరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం..నాన్హు యాదవ్ అనే వ్యక్తి వివాహం విక్రమ్‌పుర్ ప్రాంతంలో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు హాజరయ్చారు. అంత సేపు సంతోషంగా ఉన్న పెళ్లి మంటప పరిస్థితులు ఉన్నట్టుండి ఒక్కసారి ఉద్రిక్తంగా మారాయి. భోజన ప్లేట్లు సరిపడా లేకపోవడంతో పలువురు అతిథులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఇది గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వంట సామగ్రితో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా...విశాల్ అనే 20 ఏళ్ల యువకుడు మార్గమధ్యలోనే మృతి చెందాడు. సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ప్లాస్టిక్ డేంజర్!
సాక్షి, సిటీబ్యూరో : ప్లాస్టిక్.. ప్లాస్టిక్..అంతటా.. అన్ని వేళలా ప్లాస్టిక్ వినియోగం. ఉదయాన్నే పాల ప్యాకెట్ నుంచి పండ్లు.. మాంసం..హోటళ్లు, కర్రీపాయింట్ల పార్సిళ్లకూ ప్లాస్టిక్ కవర్లే. ఆహార పదార్థాల నుంచి తాగే నీటిబాటిళ్ల దాకా ప్లాస్టిక్కే. ఒక్క క్యారీ బ్యాగ్‌లే కాదు స్వచ్ఛమైన కొబ్బరి బొండాల్లోనూ ప్లాస్టిక్ స్ట్రాలే. తీసుకువెళ్లడానికి సదుపాయంగా ఉంటుందని వినియోగదారులు, చవకగా వస్తాయని వ్యాపారులు క్యారీబ్యాగ్‌లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వందలు, వేల ఏళ్లయినా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో పలు అనర్థాలు పొంచి ఉన్నాయి. వాటిని తిని జీర్ణించుకోలేక జంతువులు, జలచరాలు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆహారపదార్థాలతోపాటు మనిషి శరీరంలోకి చేరిన ప్లాస్టిక్ రేణువుల వల్ల మనుషుల ఆరోగ్యానికీ హాని కలుగుతోంది. అంతేకాదు..ఆఖరుకు నగరంలో వర్షం వస్తే రోడ్లు, కాలనీలు చెరువులుగా మారి నగరం మునగడానికీ ప్లాస్టికే కారణమవుతోంది. వివిధ వ్యర్థాలతోపాటు నగర ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల్నీ నాలాల్లో వేస్తుండటంతో అవి నీటి ప్రవాహానికి అడ్డుపడి నీరు పారే దారి లేక నాలాలు పొంగిపొర్లుతూ నగరాన్ని ముంచుతున్నాయి. నాలాల్లోని వ్యర్థాల్లో దాదాపు 45 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. మన దేశంలో 86 శాతం నల్లా నీటిలో ప్లాస్టిక్ అణువులున్నట్లు గుర్తించారు. ఇళ్లనుంచి డంపింగ్‌యార్డుకు వెళ్లేలోగా చెత్తలోని ప్లాస్టిక్వ్యర్థాలు గాలికి చెల్లాచెదురై అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. వాటివల్ల పరిసరాలు కలుషితమవుతూ ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ప్లాస్టిక్ వాడకం పెరిగి దాదాపు 40 సంవత్సరాలు కాగా వాటి వ్యర్థాలు 80 శాతం ఇంకా మిగిలే ఉన్నాయి. దేశంలో ఏటా 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండగా, 2030 నాటికి ఇవి 165 మిలియన్ టన్నులకు చేరుతాయని అంచనా. ప్రాణాలు తీసే బాంబులా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించాల్సి ఉందని సుప్రీం కోర్టు సైతం హెచ్చరించిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్‌లో.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలువడుతున్న వ్యర్థాలు దాదాపు 4800 మెట్రిక్‌టన్నులు కాగా, అందులో దాదాపు 450 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. ఇవి ఏటా దాదాపు 8 శాతం పెరుగుతున్నాయి. వీటిల్లో సింగిల్యూజ్వే దాదాపు 66 శాతం ఉంటున్నాయి. గ్రేటర్లో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ కవర్లు వాడుతుండగా, వీటిల్లో 50 మైక్రాన్లలోపువే అధికం. వీటిని డంపింగ్ కేంద్రానికి తరలించేందుకు జీహెచ్ఎంసీ ఏటా దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు చే స్తోంది. స్వచ్ఛందంగానే ఆచరించాలి.. చట్టాలు, కఠిన చర్యలవల్ల కాకుండా ఎవరికి వారుగా ప్రతినబూని ప్లాస్టిక్‌ను వాడకపోవడం వల్ల మాత్రమే ఈ అనర్థాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్లాస్టిక్ నీళ్లసీసాల బదులు రాగి, స్టీలు సీసాలు వాడటం మేలు. మాంసం, తదితర మైనవి తెచ్చుకునేందుకూ ప్లాస్టిక్ వాడవద్దని విందుల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులూ వాడవద్దని జీహెచ్ంఎసీ చేపట్టిన ప్రచారం విజయవంతం కావాలంటే ఎవరికి వారుగా ఆచరించాలి. కూరగాయలు, ఇతరత్రా సరుకుల కోసం జనపనార లేదా వస్త్రంతో చేసిన సంచుల్ని వాడాలి. పర్యావరణదినోత్సవం రోజున ప్రతిన.. 1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పర్యావరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం ఏర్పాటైన యూఎన్ఈపీ పర్యావరణానికి సంబంధించి ప్రజలకు అవగాహన, చైతన్యపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించే పర్యావరణ దినోత్సవానికి ఈసారి మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ ‘బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్’ దీన్ని ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని జీహెచ్ఎంసీ కోరుతోంది. దశలవారీగా అమలుచేస్తాం: బొంతు రామ్మోహన్, నగర మేయర్ బయో డిగ్రేడబుల్ వ్యర్థాలు 240 రోజుల్లో భూమిలో కలుస్తాయి. ప్లాస్టిక్ వందల నుంచి వేల సంవత్సరాల వరకు భూమిలో కలవదు. ప్లాస్టిక్ నిషేధంపై తొలుత ప్రజలకు తగిన అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇండోర్‌లో మాంసం దుకాణాలకు వెళ్లేవారు టిఫిన్ బాక్సులు తీసుకువెళ్తే మాంసం కొనుగోలు ధరలో రాయితీ ఇస్తున్నారు. అలాంటి విధానాలు అమలు చేస్తాం. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను వాడితే దుకాణం సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. 2022 నాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తాం. సంపూర్ణనిషేధం సాధ్యం ఎప్పటికో..? దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించి, నిషేధం విధించినప్పటికీ అమలు అంతంత మాత్రమే. హైదరాబాద్‌లో 2022 నాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జీహెచ్ఎంసీ పాలకమండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ అనుమతి కోసం నివేదించారు. 2011లో సైతం 40 మైక్రాన్లలోపు నిషేధాన్ని ప్రకటించినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగా మార్చారు. పదేళ్లక్రితమే ప్లాస్టిక్ అనర్థాలను గుర్తించి, పకడ్బందీగా నిషేధాన్ని అమలు చేస్తున్న దేశాల్లో రువాండాది ప్రథమ స్థానం. ఆస్ట్రేలియా, చైనా, జింబాబ్వే, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకంపై భారీ పన్నులు విధించాయి. మన దేశంలోని సిక్కిం రెండు దశాబ్దాల క్రితం ప్లాస్టిక్ క్యారీబ్యాగుల్ని, రెండేళ్ల క్రితం ప్లాస్టిక్ ప్లేట్లు, నీటి సీసాల్ని నిషేధించింది. ఇండియాలో ప్లాస్టిక్ వ్యాపారం 1,10,000 కోట్లు కంపెనీలు 35000 వినియోగం :ఏటా 13 మిలియన్ టన్నులు వెలువడుతున్న వ్యర్థాలు :9 మిలియన్‌టన్నులు చెత్త, ప్లాస్టిక్ నుంచి విద్యుత్ తయారీపై వివిధ దేశాలు శ్రద్ధ చూపుతుండగా, మనదేశంలో ఇప్పుడిప్పుడే ఈప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చెత్తనుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు దాదాపు 2200 ఉన్నాయి. మన దేశంలో కేవలం ఎనిమిదే ఉన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు – 2015 నివేదిక మేరకు రోజుకు వెలువడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆయా నగరాల్లో.. మెట్రిక్ టన్నుల్లో ఢిల్లీ 690 చెన్నయ్ 429 కోల్కత్తా 426 ముంబై 408 బెంగళూర్ 314 హైదరాబాద్ 200 -
నా ఉప్పు తిన్నారు
సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే మన ఈ జీవితాన్ని ఇలాగే ఊహించుకోను కూడా లేం. మనకు ఇన్ని ఇచ్చి, ఇంతా చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం. ఇప్పటికీ ఓ అవకాశం ఉంది, ఎప్పటికీ ఉండదు అది.. సేవ్ ఓషన్... సేవ్ లైఫ్... కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నామని కొందరు మనుషులు వాపోతుంటారు గాని, కడలి కష్టాల గురించి ఎవరైనా ఏనాడైనా పట్టించుకున్నారా? సముద్రాల లోతు ఎరిగిన కొద్దిమంది శాస్త్రవేత్తలు మాత్రమే వాటి కష్టనష్టాల గురించి నిష్ఠుర సత్యాలను ఎప్పటికప్పుడు లోకానికి వెల్లడిస్తున్నారు. జీవరాశుల మనుగడకు కీలకమైన సముద్రాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లేనని శాస్త్రవేత్తలు ఎంతగా గొంతు చించుకుంటున్నా, వారి గోడును ఆలకించే వారే కరువవుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సైతం కడలి కష్టాలను కడతేర్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడొంతులు సముద్రాలే నిండి ఉన్నాయి. మిగిలిన ఒక వంతు స్థలభాగంలో మైదానాలు, పీఠభూములు, అరణ్యాలు, ఎడారులు, నదులు, సరస్సులు వంటివి ఉన్నాయి. ఒకవంతు స్థలభాగంలో జీవిస్తున్న మనుషులు సహా మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాలను క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ, మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. నానా చెత్తను సముద్రాల్లో పారవేయకుండా నియంత్రణ పాటిస్తేనే వాటిని కాపాడుకోగలుగుతాం. కష్టాలనేవి మనబోటి మనుషులకు ఉంటాయే తప్ప కడలికి కష్టాలేముంటాయని విసుక్కోకండి. కష్టాలు కడలికి కూడా ఉంటాయి. వాటిలో చాలా వరకు కష్టాలు మనబోటి మనుషుల వల్ల వచ్చిపడేవే. మనుషుల నిర్లక్ష్యం సముద్రాలను సమస్యల్లోకి నెట్టేస్తోంది. వాటిని కాలుష్య కాసారాలుగా మార్చేస్తోంది. తీరాల వెంబడి సంచరించే జనం ఎడాపెడా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలను ముంచెత్తుతున్నాయి. ఎందులోనూ నాశనం కాని ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మితిమీరిన చేపల వేట సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తోంది. కాలాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం కొనసాగించే వేట వల్ల సముద్రాల్లోని అరుదైన జీవరాశులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. భూమ్మీద మితిమీరిన వాయు కాలుష్యం సముద్రాలనూ వదలడం లేదు. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి సముద్రాల్లోకి చేరుతుండటంతో సముద్ర జలాల్లో ఆమ్లగాఢత పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోకుంటే, సముద్రంలోని అరుదైన జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలుషిత వాయువుల వల్ల భూతాపం పెరుగుతున్నందున సముద్రంలోని విలువైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి. బొగ్గు విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే పాదరసం వ్యర్థాలు కూడా సముద్రంలోనికి మోతాదుకు మించి చేరుతున్నాయి. సముద్రంలోకి చేరే పాదరసం చేపలు తదితర జలచరాల్లోకి చేరుతోంది. చేపలను తినే మనుషులకు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సముద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటివల్ల సముద్రగర్భంలోని జీవరాశితో పాటు, నేల మీద నివసించే మనుషులకు వాటిల్లే ముప్పు గురించి శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచే మొత్తుకుంటున్నా, ఇరవయ్యో శతాబ్ది చివరి రోజుల్లో మాత్రమే ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చింది. తొలిసారిగా 1992 జూన్ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం వరల్డ్ ఓషన్స్ డేను 2008లో అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు, సముద్ర పరిశోధనలు సాగించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రోజున సాగరాల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కార్బన్ కాలుష్యంతో చేటు భూమ్మీద మనుగడ సాగించే మనుషులు సహా సమస్త జీవరాశులకు అవసరమయ్యే ప్రాణవాయువును అందించడంలో సముద్రాల పాత్ర చాలా కీలకం. ప్రపంచంలోని జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్‌లో దాదాపు సగానికి సగం సముద్రాల ద్వారానే అందుతోంది. అంతేకాదు, భూమిపై వాతావరణంలో వ్యాపించి ఉన్న దానికి యాభై రెట్ల పరిమాణంలోని కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు పీల్చుకుంటున్నాయి. సముద్రాలకు కార్బన్ డయాక్సైడ్ను ఇముడ్చుకునే శక్తి ఉన్నా, వాటి సామర్థ్యానికి మించిన పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పరిమితిని మించితే, సముద్ర జలాలు ఆమ్లతత్వాన్ని సంతరించుకుంటాయి. గడచిన రెండువందల సంవత్సరాల్లో సముద్రాల్లో ఆమ్లతత్వం 30 శాతం మేరకు పెరిగినట్లు ‘గ్లోబల్ బయో డైవర్సిటీ’ నివేదిక వెల్లడించింది. సముద్ర జలాల్లో ఆమ్లతత్వం పెరుగుతున్న ప్రాంతాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన నాచు నశిస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో జలచరాల సంఖ్య కూడా తగ్గుతోంది. విలువైన పగడపు దీవులు సైతం 30 శాతం మేరకు క్షీణించాయి. సముద్రాల్లోకి కార్బన్ డయాక్సైడ్ మితిమీరి చేరుతున్న కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితలంపై ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘డెడ్ జోన్లు’గా తయారవుతున్నాయి. ఇలాంటి డెడ్‌జోన్ల సంఖ్య 1910 సంవత్సరం నాటికి పట్టుమని పదికి లోపే ఉంటే, 2010 నాటికి వీటి సంఖ్య 500 వరకు చేరుకుంది. ఈ డెడ్‌జోన్ల విస్తీర్ణం దాదాపు 2.50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. గడచిన మూడు దశాబ్దాలుగా డెడ్‌జోన్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రతీరాల వెంబడి ఉండే మడ అడవులు కార్బన్ కాలుష్యాన్ని హరించడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళనకర పరిణామం. గడచిన అరవయ్యేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మేరకు మడ అడవులు అంతరించాయి. ఫలితంగా సముద్రాల్లో కార్బన్ కాలుష్యం పెరుగుతోంది. కేవలం మడ అడవుల్లో మాత్రమే కనిపించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇకనైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి, విస్తారంగా మడ అడవుల పెంపకం చేపట్టకపోతే పసిఫిక్, అట్లాంటిక్ తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లో మాత్రమే కనిపించే 40 రకాల అరుదైన జీవజాతులు త్వరలోనే అంతరించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. సాధారణ అడవులతో పోలిస్తే, అదే విస్తీర్ణంలో సముద్ర తీరాల వెంబడి ఉండే మడ అడవులు, సముద్రపు గడ్డి, నాచు, ఉప్పుమేటలు దాదాపు యాభై రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయని, వీటి విస్తీర్ణం తగ్గుతూ పోతే భూతాపం గణనీయంగా పెరిగి, భూమ్మీద చాలా అనర్థాలు వాటిల్లుతాయని యూనెస్కో ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్‌తోనే పెనుముప్పు మనుషుల వల్ల సముద్రాలకు చాలా రకాల సమస్యలే ఎదురవుతున్నా, వాటిలో ప్లాస్టిక్ కారణంగానే పెను ముప్పు కలుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటి లెక్కలకు అందుతున్న అంచనాల ప్రకారం సముద్రాల్లో వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువుల సంఖ్య 5.25 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని, వాటి బరువు 28 కోట్ల టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2025 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం మరో మూడు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా సముద్ర జీవుల సంఖ్య గణనీయంగా నశించిందని, 1970 నుంచి 2012 మధ్య కాలంలో సముద్రంలో సంచరించే వెన్నెముక గల జీవులు 49 శాతం మేరకు నశించాయని, మిగిలిన రకాల జీవరాశులను కూడా కలుపుకొని చూస్తే ఇదే కాలంలో 39 శాతం మేరకు సముద్రాల్లోని జీవ వైవిధ్యం నాశనమైందని యూకే ప్రభుత్వ నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. ప్లాస్టిక్ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గిస్తే తప్ప సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడుక నియంత్రణను ఈ ఏడాది ‘వరల్డ్ ఓషన్స్ డే’ థీమ్‌గా పాటిస్తున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిన తర్వాత 120 దేశాలు సముద్రాల పరిరక్షణపై అవగాహన, చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్లాస్టిక్ వాడకంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సముద్రాలకు మరిన్ని అనర్థాలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వాడే రసాయనాలు, చమురు, సహజవాయువుల కోసం సముద్రగర్భంలో జరిపే తవ్వకాలు, ‘డీప్ సీ మైనింగ్’, చేపల కోసం మితిమీరి సాగిస్తున్న వేట, సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణాలు, తీర ప్రాంతాలకు చేరువలో వస్తూత్పత్తి కేంద్రాలు, ఔషధ తయారీ, ఎరువుల తయారీ కేంద్రాల పెరుగుదల, ఓడరేవులు, తీర ప్రాంత పర్యాటకం వంటి కార్యకలాపాలు సముద్రాల్లోకి నానా రకాల కాలుష్యాలను చేరవేస్తున్నాయి. సముద్రాల్లోకి దాదాపు లక్షకు పైగా రసాయన వ్యర్థాలు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే విషపూరితమైన లోహాలు, చమురు కూడా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ అరుదైన జలచరాలను, సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. సముద్రం నుంచి లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల్లోకి చేరుతున్నాయి. వీటిని తినే మనుషుల ఆరోగ్యాలపై కూడా దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి. సముద్రం ఎగువ భాగంలో కాకుండా, అట్టడుగున సంచరించే అరుదైన జలచరాలు సైతం రసాయనిక కాలుష్యం బారిన పడుతున్నాయి. సముద్రాలు మనకేమిస్తున్నాయంటే..! మనం రోజూ ఆహారంలో వాడే ఉప్పు, మాంసాహారులు తినే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాలు సముద్రాల నుంచే లభిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మనుషులు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే జంతు సంబంధిత ప్రొటీన్లలో 15 శాతం ప్రొటీన్లు చేపలు వంటి జలచరాలకు చెందినవే. ఉప్పు, చేపలు వంటి జలచరాలే కాకుండా, ఆహారంలో వినియోగించే మరికొన్ని పదార్థాలు కూడా మనకు సముద్రం నుంచే దొరుకుతున్నాయి. సముద్రపు పాచి, నాచు నుంచి సేకరించే అగర్, కరాజీనాన్ ఆల్గిన్ వంటి పదార్థాలు ఐస్‌క్రీమ్‌లు, పెరుగు, సలాడ్లు, కేక్ మిక్స్‌ల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో దొరికే స్పాంజ్, ‘సీ విప్ కోరల్స్’ అనే ఒక రకమైన పగడాల నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్ కిల్లర్స్, యాంటీ అలెర్జిక్ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్ర తీరాల్లో విస్తారంగా లభించే ఇసుక భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది. సముద్రంలో లభించే శంఖాలు, నత్త గుల్లలు వంటివి అలంకరణల కోసం, ఇతర ప్రయోగాల కోసం చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. సముద్రాల గురించి అవీ ఇవీ.. సముద్రాల సగటు లోతు 12,400 అడుగులు. సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలు సముద్రాల్లో 330 అడుగుల లోతును దాటి ముందుకు సాగలేవు. అందువల్ల సముద్రాల్లో 330 అడుగులు దాటిన తర్వాత దిగువన ఉండే ప్రాంతమంతా నిరంతరం చీకట్లోనే ఉంటుంది.ప్రపంచంలోనే అతి పొడవాటి పర్వతపంక్తులు ఉన్నది నేల మీద ఎక్కడో కాదు, ఆ పర్వత పంక్తులు సముద్రం అట్టడుగున ఉన్నాయి. ‘మిడ్–ఓషియానిక్ రేంజ్’ అనే ఈ పర్వత పంక్తులు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల అడుగున 56 వేల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. సముద్రాల గురించి మనుషులు తెలుసుకున్నది చాలా తక్కువ. ఇప్పటి వరకు సముద్రాల్లోని కేవలం 5 శాతం మేరకు మాత్రమే మనుషులు అన్వేషణలు కొనసాగించగలిగారు. మిగిలిన 95 శాతం ఏమేమి వింతలు ఉంటాయో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం సముద్ర గర్భమే. పెద్దపెద్ద మ్యూజియంలలో కనిపించే వాటి కంటే సముద్రం అట్టడుగున పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు, కళాఖండాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు ఉంటాయి. సముద్రగర్భంలోని అగ్నిపర్వతాలు లావాను కాకుండా, వేడి బురదను, మిథేన్ వాయువును వెదజల్లుతూ ఉంటాయి. సముద్రం అడుగున కొన్నిచోట్ల ఉండే వేడి నీటి బుగ్గలు ఏకంగా 3600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడినీటిని పైకి ఎగజిమ్ముతుంటాయి. వాటి నుంచి వెలువడే నీటి వేడికి సీసం లాంటి లోహాలు కరిగిపోతాయి. ఆస్ట్రేలియా తీరానికి ఆవల పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉండే ‘గ్రేట్ బ్యారీర్ రీఫ్’ పగడపు దీవి విస్తీర్ణం దాదాపు 2575 చదరపు కిలోమీటర్లు. భూ గ్రహంలోని అతిపెద్ద సజీవ నిర్మాణం ఇదే కావడం విశేషం.సముద్రంలో జీవించే భారీ జలచరాల్లో భయంకరమైన షార్క్‌ల గురించి అందరికీ తెలిసిందే. షార్క్ జాతుల్లో దాదాపు 99 శాతం రకాలు ఇప్పటికే అంతరించాయి. కేవలం ఒక్క శాతం జాతులకు చెందిన షార్క్‌లు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి. సముద్రం అట్టడుగున దాదాపు 2 కోట్ల టన్నుల బంగారం నిక్షిప్తమై ఉన్నట్లు నిపుణుల అంచనా. నేల మీద మనకు అందుబాటులో ఉన్న బంగారం కంటే ఇది చాలా ఎక్కువ. భూమ్మీద ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వగలిగిన బంగారం 1,87,200 టన్నులు మాత్రమే.సముద్రపు నీటిలో కంటికి కనిపించని చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక మిల్లీలీటరు సముద్రపు నీటిలో దాదాపు పది లక్షల బ్యాక్టీరియా కణాలు, కోటి వరకు వైరస్ కణాలు ఉంటాయి. అయితే, వీటిలో చాలా వరకు హానికరమైనవి కావు. సాహిత్యంలో సముద్రం అనాదిగా సముద్రాలు మనుషులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. వాటి ఆటుపోట్లు, అప్పుడప్పుడు తెచ్చిపెట్టే తుపానులు, ఉప్పెనలు వంటి భయపెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నా, సముద్రాలపై మనుషుల్లో తీరని కుతూహలం ఇంకా మిగిలే ఉంది. ప్రకృతిని పరిపరి విధాలుగా వర్ణించిన ప్రాచీన కవులు, సాహితీవేత్తలు తమ తమ రచనల్లో సముద్రాల గురించి కూడా విశేషంగా ప్రస్తావించారు. సముద్రాల చుట్టూ బోలెడన్ని కల్పనలను జోడించి కథలల్లారు. రామాయణంలో సముద్రం ప్రస్తావన తెలిసిందే. సీతమ్మవారిని చూడటానికి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుంటాడు. రామాయణంలో ఇదొక కీలక ఘట్టం. ఆ తర్వాత వానరసేన సముద్రాన్ని దాటడానికి వారధి నిర్మించడం మరో కీలక ఘట్టం. మన జానపద గాథల్లో సప్త సముద్రాలను దాటి రావడం రాకుమారుల శౌర్యానికి నిదర్శనం. అరేబియన్ జానపద గాథల్లో సముద్రంలో నౌకాయానానికి సంబంధించిన సాహస గాథలు అనేకంగా ఉన్నాయి. గ్రీకు మహాకవి హోమర్ రాసిన ‘ఒడెస్సీ’ కావ్యంలో పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన సముద్రయానం గురించి వర్ణన ఉంటుంది. ‘నోబెల్’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘ఓల్డ్‌మేన్ అండ్ సీ’ ఇంగ్లిష్ సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన సైనికుల సాధక బాధకాలను వివరిస్తూ నికోలస్ మోన్సారట్ రాసిన ‘ది క్రూయెల్ సీ’ నవల కూడా ప్రసిద్ధి పొందింది. సినిమాల్లో సముద్రం సముద్రం చుట్టూ అల్లుకున్న కథలతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని అమిత ప్రజాదరణ పొందాయి. అలాంటి వాటిలో ‘జాస్’, ‘టైటానిక్’ ‘ఫైండింగ్ నెమో’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘20,000 లీగ్స్ అండర్ ది సీ’, ‘పైరేట్స్ ఆఫ్ కరీబియన్: ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్’, ‘ది పెర్ఫెక్ట్ స్టోర్మ్’, ‘అట్లాంటిస్: ది లాస్ట్ ఎంపైర్’, ‘ది లైఫ్ ఆక్వాటిక్’ వంటివి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. – పన్యాల జగన్నాథదాసు -
మనిషి పాపం.. వాటికి శాపం..
వాషింగ్టన్ : మనిషి సృష్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం జనావాసంలోని వారినే కాకుండా.. మనిషికి దూరంగా బతుకుతున్న మూగ జీవాల ప్రాణాలను కూడా తీస్తోంది. గత కొద్ది నెలలుగా పసిఫిక్ సముద్ర తీరంలోని మిడ్వే ఐలాండ్‌లో కొన్ని వేల పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రాణాలు విడిచాయి. ఈ ఐలాండ్‌లో ఎక్కువగా ఆల్బట్రాస్ జాతి పక్షులు జీవిస్తుంటాయి. తీరాల వెంట చేపలను వేటాడి తింటూ బతికేస్తుంటాయి. కానీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ప్లాస్లిక్ వ్యర్థాలను పోల్చుకోలేక వాటిని చేపలుగా భావించి అవి తినటమే కాకుండా వాటి పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి. దీంతో తిన్న వ్యర్థాలను అరాయించుకోలేక భారీ సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అమెరికా ఫోటోగ్రాఫర్ క్రిస్ జార్డన్ హోప్స్ తీసిన ఫోటోలు ప్రజల్ని కదిలించాయి. చనిపోయిన పక్షి కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న ఆ చిత్రంతో అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఫొటో గ్రాఫర్ జార్డన్ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ వస్తువులను మనం ఒకసారి వాడేసిన తర్వాత పడేస్తున్నాం. అవి భూమిలో కలిసిపోవడం చాలా కష్టం. ప్లాస్టిక్‌ను నివారించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మార్పు తీసుకురావాలంటే అందరిలోనూ చైతన్యం రావాలి’ అని అన్నారు. ప్రతి మనిషి ఒక రోజులో 130 అతిచిన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శ్వాసిస్తున్నాడని ఓ పరిశోధనలో తేలింది. -
తెలంగాణలో ప్లాస్టిక్ పార్క్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోతోంది. రెండేళ్లుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ప్లాస్టిక్ పార్క్ దస్త్రానికి ఈ ఏడాది మోక్షం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ పి.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ‘‘త్వరలోనే తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ప్లాస్టిక్ పార్క్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుత అడ్డంకులను తొలగించి పార్క్ ఏర్పాటుపై కేంద్రం నుంచి సహాయం అందేలా చేస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని మంఖాల్‌లో తొలిదశలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం 120 ఎకరాలను కేటాయించామని.. తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) సీఈఓ వీ మధుసూదన్ చెప్పారు. తెలంగాణలో 1.25 లక్షల ఎకరాల పారిశ్రామిక స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో 5–6 వేల స్థలం పలు పరిశ్రమలకు కేటాయించేశామన్నారు. ఆర్అండ్డీ చేయట్లేదు.. కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల మంత్రిత్వ శాఖ, ఫిక్కీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 4–6 తేదీల్లో ముంబైలో ఇండియా కెమ్–2018 జరగనుంది. ఆ వివరాలు తెలిపేందుకు సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ... విదేశాలతో పోలిస్తే మన దేశంలో రసాయనాల పరిశ్రమలో పరిశోధన – అభివృద్ధి (ఆర్అండ్డీ) చాలా తక్కువగా ఉందని చెప్పారు. కొత్త రసాయనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వంటివి రావాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం దేశంలో రసాయన పరిశ్రమ 155 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో రసాయన డిమాండ్ కారణంగా 2020 నాటికిది 226 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం దేశీయ రసాయన పరిశ్రమలో 20 లక్షల మంది పనిచేస్తుండగా... ప్రపంచ రసాయన పరిశ్రమ 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్లాస్టిక్ వినియోగంలో తెలంగాణది రెండో స్థానం.. ఈ సమావేశంలో పాల్గొన్న సౌత్ ఏపీఎంఏ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత రెండో స్థానం తెలంగాణదేనన్నారు. ఏటా పరిశ్రమ 8–10 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని తెలిపారు. ఇంట్లో వినియోగించుకునే ప్లాస్టిక్ ఉత్పత్తులు అంటే కుర్చీలు, బకెట్లు, ఇతరత్రా హోమ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీ ఉందని.. ఇది తయారీ రంగం, కొనుగోలుదారులకు భారంగా మారుతోందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఫిక్కీ తెలంగాణ చైర్మన్ దేవేంద్ర సురానా, కేంద్ర కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ జాయింట్ సెక్రటరీ సమీర్ కుమార్ బిస్వాస్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
సెల్ఫీ కోసం ముక్కు కోసుకుంటున్నారు!
వాషింగ్టన్: ఇప్పుడు చాలా మందికి సెల్ఫీలు తీసుకోవడమంటే మహా సరదా. ఈ సెల్ఫీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఫొటోల్లో తమ ముక్కు పెద్దదిగా కనిపిస్తోందనీ, శస్త్రచికిత్స ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించాలంటూ ప్లాస్టిక్ సర్జన్ల దగ్గరకు అనేకమంది వరుసలు కడుతున్నారు. సెల్ఫీ ఫొటో తీసుకునేటప్పుడు ఫోన్‌ను ముఖానికి దగ్గరగా పెట్టాల్సి రావడం వల్లనే ముక్కు అలా కనిపిస్తోంది తప్ప వాస్తవానికి సమస్యేమీ లేదని వైద్యులు చెబుతున్నా వారు వినడం లేదు. దీంతో ప్లాస్టిక్ సర్జన్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ప్లాస్టిక్ సర్జన్ల పత్రిక ‘జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ’ ఇటీవల ప్రచురించింది. 30 శాతం పెద్దదిగా కనిపిస్తుంది.. ముఖానికి కెమెరా లెన్స్ 12 అంగుళాల కంటే తక్కువ దూరంలో ఉంటే సెల్ఫీల్లో ముక్కులు అసలు సైజు కన్నా 30 శాతం పెద్దగా కనిపిస్తాయి. ఇది గమనించకుండా అనేక మంది ఆపరేషన్ చేసి తమ ముక్కును అందంగా తీర్చిదిద్దాలంటూ తన క్లినిక్ వచ్చి అడుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్ యూనివర్సిటీలో పనిచేసే ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్ బోరిస్ పాష్కోవర్ తెలిపారు. ఈయన తన సహచరులతో కలసి రాసిన వ్యాసాన్నే జామా ఫేషల్ ప్లాస్టిక్ సర్జరీ ప్రచురించింది. అమెరికన్ ఫేషల్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జన్ల అకాడమీ ప్రజల్లో కనిపిస్తున్న ఈ వేలం వెర్రిని గమనించింది. సెల్ఫీల్లో అందంగా కనిపించేలా చేయాలంటూ అనేక మంది తమను కలుస్తున్నారని 2017లో జరిపిన ఓ సర్వేలో 55 శాతం ఫేషల్ ప్లాస్టిక్ సర్జన్లు చెప్పారు. ‘సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తోందంటూ అనేకులు నా దగ్గరకు వస్తున్నారు. వారి ముక్కు పెద్దగా ఏమీ లేదనీ, కెమెరాను దగ్గరగా ఉంచి సెల్ఫీ తీయడం వల్లే పరిమాణంలో పెద్దగా కనిపిస్తోందని చెబుతున్నాను’ అని తెలిపారు. కెమెరాను దూరంగా పెడితే ముక్కు సైజు తగ్గుతుందని ఆయన వెల్లడించారు. -
ప్లాస్టిక్ బీచ్...
పణజీ: ఇవేవో కొత్త తరహా బీచులు...వెంటనే వెళ్లి చూసొద్దామని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే..! గోవా బీచులు మొత్తం దేశంలోనే అధిక మోతాదులో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయి. ఈ బీచుల్లోనే అత్యధికస్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలు, చెత్త కేంద్రీకృతమైనట్లు కొచ్చిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) తాజా అధ్యయనం తేల్చింది. గోవా బీచుల్లోని ప్రతీ మీటర్ ఇసుకలో 25.47 గ్రాముల ప్లాస్టిక్ అవశేషాలున్నట్లు కనుగొన్నారు. దీనితో పాటు భారత్‌లోనే అత్యధికంగా ఇక్కడి బీచుల్లోనే ప్రతీ మీటర్‌కు 205.75 గ్రాములు/ఎం2– చొప్పున నైలాన్ చేపల వలలు, గాజు, ఈ–వ్యర్థాలు, స్టయిరోఫోమ్, థర్మోకోల్లతో కూడిన చెత్తా చెదారం ఉన్నట్టు వెల్లడించింది. గోవా తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్ దేశవ్యాప్తంగా 7,516 కి.మీ మేర ఉన్న తీరప్రాంతంలోని బీచుల్లో 12 మంది సభ్యుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. గోవాలోని 12 బీచులతో సహా, 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 254 బీచుల్లో పరిశీలన జరిపారు. ఇందులోని చెత్తా చెదారాన్ని ఆరు కేటగిరిల కింద వర్గీకరించారు. గోవా తర్వాత కర్ణాటకలోని 33 బీచుల్లో ప్లాస్టిక్, నైలాన్ వలలు, ఇతర వ్యర్థాలు ఎక్కువ మోతాదులో ఉన్నట్టు వెల్లడైంది. అక్కడి బీచుల్లో ప్రతీ మీటర్‌కు 21.91 గ్రాములు/ఎం2 చొప్పున చెత్త, ప్లాస్టిక్ అవశేషాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో గుజరాత్‌లోని 12 బీచులున్నాయి. ఇక్కడ సగటున 12.62 గ్రాములు/ఎం2 వ్యర్థాలున్నట్లు స్పష్టమైంది. అండమాన్ నికోబార్, లక్షదీవులలోని బీచుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒడిశాలోని బీచుల్లోనే తక్కువస్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలున్నట్టు బయటపడింది. ఏయే రూపాల్లో... ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రధానంగా ప్లాస్టిక్ కవర్లు, క్యారీబ్యాగులు, డిటర్జెంట్ సబ్బుల సాచె ట్లు, పాల ప్యాకెట్లు, టూత్‌పేస్ట్, నూనె, ఇతర సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్ వాటర్‌బాటిళ్ల రూపంలో ఉంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, అవశేషాలతో బీచులకే కాకుండా సముద్ర జీవజాతులకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్ర పక్షులు, తాబేళ్లు, వేల్ చేపలు ,పగడపు దిబ్బలపై ప్రభావం చూపుతాయన్నారు. ‘నిత్యావసర సరుకులు మొదలుకు ని మిగతా వస్తువుల వరకు అన్నింటికీ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. వాడేసిన తర్వాత బయట పడేసిన ఈ ప్లాస్టిక్ అంతా నదుల మీదుగా సముద్రాలను చేరుతోంది. వేడితో పాటు తేమ వాతావరణం కారణంగా బీచుల్లో విసిరేసిన ప్లాస్టిక్ చెత్త కాస్తా మైక్రో ప్లాస్టిక్‌ల కింద మారి సముద్రంలోకి చేరుతోంది’ అని సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన పరిశోధకుడు పి.కళాధరన్ తెలిపారు. సముద్రం లోని ప్లాస్టిక్ అవశేషాల ప్రభావం మొత్తం ఏడు రకాల తాబేళ్లపై పడుతున్నట్లు, ఏడువందలకు పైగా సముద్ర జీవుజాతులు అంతరించేపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్టు మరో పరిశీలనలో వెల్లడైంది. -
ప్లాస్టిక్ నోట్లతో రిజిస్ట్రేషన్
శంకర్పల్లి : రిజిస్ట్రేషన్ చేసుకొని చిన్నపిల్లలు ఆడుకొనే నోట్లు ఇచ్చి పారిపోయిన సంఘటన శంకర్‌పల్లిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు కడుచర్ల అంజిలయ్య తండ్రి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అంజిలయ్య తనకు శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురం గ్రామంలో మూడు వందల గజాల ప్లాటు ఉంది. ఆ ప్లాటును హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి బంటారం మండలం నూర్లంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి మధ్యవర్తిగా ఉండి విక్రయించారు. బుధవారం రోజు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్లాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బయటకొచ్చిన తరువాత రూ1.50 లక్షల డబ్బులు ఇవ్వగా ఆ నోట్లను లెక్కిస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్నపిల్లలు ఆడుకొనే ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయని గుర్తించారు. వెంటనే శ్రీనివాస్‌ను నిలదీయగా ఇచ్చిన లక్షన్నరలో లక్ష రూపాయల రెండు వేల నోట్లు లాక్కొని కారులో పారిపోయాడు. మిగతా రూ. 50 వేలకు ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయి. డబ్బులను లాక్కొని పారిపోతుండగా వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే బాధితుడు చుట్టుపక్కల వారిని పిలిచి జరిగిన విషయాన్ని వివరించాడు. శ్రీనివాస్ ఇచ్చిన నోట్లపై రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియాకు బదులు భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని దాని పక్కనే పాంచ్ సౌ కూపన్ అని నోట్ల కింది భాగంలో పుల్ ఆఫ్ ఫన్ అని ముద్రించారు. బాధితుడు జరిగిన విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం
జూబ్లీహిల్స్: విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా జూహీచావ్లా అన్నారు. ఫిక్కీ యంగ్‌లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్పర్సన్ సంద్యారాజు, మోడల్ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
దుర్గగుడిలో మళ్లీ ప్లేట్ కలెక్షన్లు
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో తిరిగి ప్లేట్ కలెక్షన్లు మొదలయ్యాయి. సూర్యకుమారి కార్యనిర్వహణాధికారిగా ఉండగా అర్చకులు ప్లేట్లు ఉంచి భక్తుల నుంచి కానుకలు తీసుకోవడాన్ని నియంత్రించారు. అర్చకుడు శఠగోపం పెట్టిన తరువాత భక్తులు హుండీలోనే కానుకలు ఇవ్వాలని స్పష్టంచేశారు. ఎవరైనా అర్చకులు పేట్లు పెట్టి దక్షిణలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ప్లేట్ కలెక్షన్లకు అర్చకులు స్వస్తి పలికారు. అయితే క్షుద్రపూజల నేపథ్యంలో ఈఓ సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీచేసింది. దీంతో ఆలయంలో మళ్లీ ప్లేట్ కలెక్షన్లు ప్రారంభమయ్యాయి. ఆలయ ఆదాయానికి గండి సాధారణంగా దుర్గగుడికి నెలకు రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అర్చకులకు పేట్లలో దక్షిణ రూ పంలో రూ.75 లక్షల వరకు వస్తుందని అంచనా. ఈ ఓ సూర్యకుమారి పేట్ కలెక్షన్ నిలుపుదల చేసిన తరువాత ఆ స్థాయిలో కాకున్నా ఆలయ ఆదాయం కొంతమేరకు పెరిగింది. ప్రస్తుతం అర్చకులు తిరిగి ప్లేట్ కలెక్షన్లు ప్రారంభించడంతో తిరిగి దేవస్థానం ఆదాయం తగ్గే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. ప్లేట్ కలెక్షన్లో అందరికీ వాటాలు అర్చకుల వద్ద ఉండే ప్లేట్లలో భక్తులు వేసే దక్షిణ కేవలం అర్చకులకు మాత్రమే తీసుకుంటారనుకుంటే పొరపాటే. ఆ విధంగా తీసుకుంటే అర్చకులు ఆలయ అధికారులు ఆగ్రహానికి గురికాక తప్పదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్ కలెక్షన్ ద్వారా వచ్చే ఆదాయంలో ఆలయ అధికారుల నుంచి సెక్యురిటీ సిబ్బంది వరకు వాటాలు పంచుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అర్చకులకు రూ.లక్ష వస్తే అందులో వాటాల కింద సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేలు చెల్లిస్తారని సమాచారం. దేవస్థానంలో పరిధిలోని కీలక ఆలయాల్లో పోస్టింగ్‌లు పొందడానికి అర్చకులు అధికారులకు, సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు మామూళ్లు దక్కుతున్నందునే అధికారులు కూడా ప్లేట్ కలెక్షన్‌ను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లేట్లలో భక్తులు సమర్పించే కానుకలను అర్చకులు ఎప్పటికప్పుడు తీసేసి ఎవరికీ అనుమానం రాకుండా చూస్తారని సమాచారం. చూసీ చూడకుండా ఉండేందుకే.. దేవస్థానంలో పనిచేసే కొంతమంది సీనియర్ అర్చకులు విధులకు హాజరుకాకుండా తమ అసిస్టెంట్లను పంపుతారు. డ్యూటీలో ఎవరూ ఉన్నారనే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండేందుకు మామూళ్లు ముట్టచెబుతారు. బయటి అర్చకులు దేవస్థానంలోకి రావడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే తాంత్రిక పూజలు జరిగాయని చెబుతున్న రోజు కూడా బయట వ్యక్తులు అంతరాయలయంలోకి వచ్చినా ఎస్పీఎఫ్ సిబ్బంది, డ్యూటీలో ఉన్న సిబ్బంది పట్టించుకోలేదు. అదే చివరకు వివాదానికి దారితీసింది. కొత్త కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె కూడా గత ఈఓ తరహాలో ప్లేట్ కలెక్షన్ నిలుపుదల చేసి, ఆలయ ఆదాయాన్ని పెంచాలని భక్తులు కోరుతున్నారు. -
సంక్రాంతి ‘కానుక’.. ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర పెంపు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు కాని వారిని నియంత్రించేందుకు కాచిగూడ స్టేషన్లో తాత్కాలికంగా ప్లాట్ఫారం టికెట్ ధర పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయించింది. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని కాచిగూడ స్టేషన్లో పెరగనున్న ప్రయాణీకుల రద్దీతోపాటు వారి వెంట వచ్చే ప్రయాణం చేయని జన సంఖ్యను కూడా అధికారులు ముందుగా అంచనా వేశారు. దీంతో ప్రయాణికులు కానివారిని ప్లాట్‌ఫాంలపైకి ప్రవేశించకుండా క్రమబద్ధీకరించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు కాచిగూడ స్టేషన్లో ప్రస్తుతం రూ.10లుగా ఉన్న ప్లాట్ఫారం టికెట్టు ధరను జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు రూ.20 లకు పెంచారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి రైల్వే శాఖతో సహకరించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో కోరారు. -
ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు
ప్లాస్టిక్ మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చింది, దాని పర్యవసానాలు పట్టించు కోండి, ప్రకృతే దాని సంగతి చూసుకుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. పర్యావరణ స్పృహగల ముంబై పౌరులు కేవలం వంద వారాంతపు రోజుల లోనే అక్కడి ఒక బీచ్ నుంచి 90 లక్షల కేజీల ప్లాస్టిక్‌ను సేకరించారు. పోటు మీదున్నప్పుడు సముద్రం లోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ చెత్త ఇది. మునిసిపాలిటీ దాన్ని అక్కడి నుంచి తరలించి ఏ గోతుల్లోనో కప్పెట్టెయ్యలేనంత భారీ పరిమాణం ఇది. దీంతో నిరుత్సాహానికి గురైన పౌరులు ఇక మనం చేయగలిగేదేమీ లేదని ఆ పని ఆపేశారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకో వాల్సి వచ్చింది. ఇది ముంబైలోని ఒక బీచ్ కథ మాత్రమే కాదు. నిరాటంకంగా సముద్రంలోకి గుమ్మరించిన ప్లాస్టిక్ దాదాపు ప్రతి బీచ్లోనూ ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూనే ఉంటుంది. మందం ఎంతో ఇంకా కచ్చి తంగా లెక్కగట్టని ప్లాస్టిక్ ద్వీపాలు ప్రధాన సముద్రా లలో ఉన్నట్టు వివిధ కథనాలు తెలిపాయి. అవి ఒడ్డుకు కొట్టుకు రాని ప్లాస్టిక్ దీవులు. మానవ శరీ రాల్లోకి సైతం చొర బడగల స్థాయికి ఇప్పుడు ప్లాస్టిక్ శిథిలమ వుతోందని కనుగొన్నారు. 1950ల నుంచి ప్రపంచం 9 లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసింది. ఇందులో 9 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేశారు. అంటే ఇంత భారీగా ఉత్ప త్తయిన ప్లాస్టిక్ ఉపయోగంలో ఉన్నది లేక కాస్త ముందు వెనుకలుగా చెత్తగా పారేయాల్సినది, లేక కప్పేసిన గోతుల్లో ఉన్నది. లేదంటే కాలువలు, నదులు, సముద్రాలలో లేదా ముళ్ల పొదలకు గుచ్చు కునో ఉంటుంది. ఇది, స్వీయ పరాజయంలో మాన వులు సాధించిన ఘనత. భూగోళపు జీవితంలోని ఆంత్రోప్రోసిన్ (ప్రకృతిని మానవులు ప్రభావితం చేసే) శకంలో మానవులు చేజేతులా ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రధాన దశ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తయారైన 9 లక్షల కోట్ల టన్నుల భారీ ప్లాస్టిక్లోంచి దాదాపు 100 వారాల్లో ఒకే ఒక్క చిన్న బీచ్‌లోనే తొంబై లక్షల కేజీల ప్లాస్టిక్ బయటపడింది. ఆట వస్తువుల నుంచి పారి శ్రామిక వస్తువులు, పాల సంచుల వరకు అన్నిటికీ ప్లాస్టిక్‌నే వాడేలా యుద్ధానంతర కాలంలో మన ప్రవర్తన మారిపోయింది. చిన్న కొత్తిమీర కట్టకు కూడా ప్లాస్టిక్ సంచిని స్వీకరిస్తున్నాం. దీని పర్యవ సానాలేమిటో ప్రపంచం అర్థం చేసుకోవడం ఇప్పుడే మొదలై ఉండవచ్చు. బయటపడటం సులువేమీ కాని పరిస్థితిలో మనంతట మనమే ఇరుక్కున్నట్టున్నాం. ఈ నేపథ్యం నుంచి చూస్తే, 2018 మధ్యకల్లా ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం పథకం ఆహ్వానించదగినది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టం కావచ్చు. ప్లాస్టిక్ సంచుల తయారీ, పంపిణీలోనే పెను మార్పు రావడం అందుకు అవసరం. సార్వత్రికంగా అంతా ప్లాస్టిక్‌కు బాగా అలవాటుపడిపోయిన మనుషులు తమ అల వాట్లను మార్చుకోవాలని ఆశించడం కష్టమే. పాకె ట్లకు బదులుగా పాలను సీసాల్లో పంపిణీ చేయవచ్చా వంటి సమంజసమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. తాగడానికి, సాగుకే నీరు అవసరంగా ఉంది. కొత్త ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండాలంటే మన జీవితాలనే పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది. గుడ్డ బ్యాగులు పట్టుకుని మార్కెట్‌కు వెళ్లడం, ప్లాస్టిక్ సీసాల్లోని నీటిని తాగడానికి నిరాక రించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ బాటిల్ నీరే పరిశుభ్రమైనదని విశ్వసించే స్థితికి మనం చేరాం. పౌర సంస్థ సరఫరా చేసే నీటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అది మరింత విద్యుత్ వినియోగంతో కూడినది, మన కర్బన వినియోగాన్ని పెంచేది. మనం కొనే ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌తో చుట్టి నదే, రోడ్డు పక్క చాయ్ వాలా ఇచ్చే టీ కూడా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులోనే. పునర్వినియోగానికి పనికిరాని, లేదా రీసైకిల్ చేయడం కష్టమయ్యే ప్లాస్టిక్ సంచులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉంది. చెత్త ఏరుకునే వారు సైతం వాటిని పనికిరానివిగానే చూస్తారు. నిషేధం విధిస్తే పౌరులు తమంతట తామే దాన్ని పాటిస్తారని అధికారులు విశ్వసించారు. అదేసమయంలో కారణాలేవైనా వాటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. మురికివాడల్లోని కార్ఖానాల్లో సైతం అవి తయారవుతున్నాయి. మనం అంతా పెరగనిచ్చిన విపత్తు ఇది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక సంపా దకీయంలో ‘‘అసలు సమస్య ప్లాస్టిక్ కాదు, మనమే. ఆ అద్భుతమైన పదార్థాన్ని మనం తిరస్కరించలేం. దాన్ని చెత్తగా చూడటానికి బదులు అపురూపమైనదిగా వ్యవహరిస్తుంటాం’’ అని పేర్కొంది. అంటే, ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చిందనే దానితో సహా పట్టించుకుని, ప్రకృతే దాని సంగతి చూసు కుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
కంచానికీ.. కరువాయె...!
జనాభాలో అధిక శాతం కలిగిన బీసీ విద్యార్థుల సంక్షేమం అటకెక్కింది. బీసీ హాస్టళ్లలో ఉంటున్న వారికి ప్లేట్లు, గ్లాసులు, ట్రంకుపెట్టెలను కూడా పాలకులు అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప రూరల్: జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల హాస్టళ్లు మొత్తం 57 ఉన్నాయి. అందులో 6 వేల మంది బాల బాలికలు ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి నాలుగు జతల దుస్తులు, ఒక విద్యార్థికి ఒక ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. పౌష్టికాహరాన్ని అందించాలి. విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహకారం లభించడంలేదు. ఏడాది దాటినా ... విద్యార్థులకు అందించే ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది.గడువు దాటగానే కొత్తవి అందించాలి. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించలేదు. ప్రభుత్వం నిధులను కేటాయిస్తేనే ఆ శాఖ అధికారులు టెండర్ల ద్వారా వాటిని తీసుకొని విద్యార్ధులకు అందజేస్తారు. అయితే అలా జరగడంలేదు. కాలం చెల్లిన వాటితోనే... సాధారణంగా హాస్టళ్లకు సరఫరా చేసే వస్తువులు నాసిరకంతో ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో సరఫరా చేసిన ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు కూడా దాదాపు నాసిరకానివి అనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్టలకు ఉన్న చిలుకులు ఊడిపోయాయి. దీంతో చాలా మంది విద్యార్థులు తమ ఇంటి నుంచే వస్తువులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది పాత వాటితోనే సర్దుకుపోతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా బీసీ విద్యార్ధుల సంక్షేమం ఇలా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బడ్జెట్ రాగానే చర్చలు చేపడుతాం.. నేను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా గడిచిన ఏప్రెల్‌లో బాధ్యతులు చేపట్టాను. అప్పుడే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాగానే చర్యలు చేపడుతా.– లక్ష్మీకాంతమ్మ,జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి. -
ఆ బిడ్డ... ఆ దంపతులకు పుట్టిందే!
♦ డీఎన్ఏ టెస్టుతో నిర్ధారణ హైదరాబాద్: పేట్లబురుజు ఆస్పత్రిలో ఇటీవల జన్మించిన సరోగసి శిశువు కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సదరు పసికందు సరోగసీ ద్వారా జన్మించింది కాదని స్పష్టమైంది. ఆ బిడ్డ బాధితురాలు సుధారాణి అలియాస్ వెంకటమ్మ దంపతులకు జన్మించిన బిడ్డగా నిర్ధారణైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్ష్మణ్ భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆమెను భర్త లక్ష్మణ్ హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించాడు. కేస్ షీట్లో పేరు నమోదు చేసే సమయంలో భర్త ఒక పేరు..భార్య మరో పేరు చెప్పడంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆరా తీయగా తన కడుపులో ఉన్నది సరోగసీ బిడ్డ అని, ఆడబిడ్డ అని తెలిసి సరోగసికి కారణమైన గుంటూరు దంపతులు ముఖం చాటేశారని తెలిపింది. దీంతో వైద్యులు జిల్లా వైద్యాధికారిణి పద్మజ సహా చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగి బాధిత దంపతుల నుంచే కాకుండా గుంటూరు దంపతుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపారు. బిడ్డ బాధితురాలు వెంకటమ్మ దంపతుల జన్యువుతో పోలికలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సరోగసీ కేసులో విచారణ కొనసాగుతోందని, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం చట్టపరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. -
ప్లేట్లెట్స్ తగ్గినా... వెంటనే రికవరీ
జ్వరం వస్తే .. మలేరియానా, టైఫాయిడా, డెంగీనా అని నిర్ధారించే పరీక్షల కన్నా ప్లేట్లెట్స్ కౌంట్‌ను తెలుసుకునేందుకే ప్రస్తుతం ఎక్కువగా ప్రాధానత్య ఇస్తున్నారు. అయితే, జ్వరం కారణంగానే ప్లేట్లెట్స్ తగ్గవని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గినా ఒక్కరోజులోనే రికవరీ అవుతాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. మనిషి శరీరంలోని రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్ ఉంటాయి. బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కణాల్లో ఎర్ర రక్తకణాలు 120 రోజులు జీవించి ఉంటాయి. తెల్లరక్తకణాలు నెల రోజులు, ప్లేట్లెట్స్ 8 నుంచి 12 రోజులు పాటు జీవించి ఉంటాయి. ఏదైనా వ్యాధి కారణంగా కానీ, వైరస్ కారణంగా గానీ ఎముకలోని మూలిగపై ప్రభావం చూపినప్పుడు ఆయా కణాల ఉత్పత్తి తగ్గుతుంది. ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయంటే... ∙శరీరంలోని రక్తంలో ఒక క్యుబిక్ మిల్లీ లీటరుకు లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి రోజుకు 60 వేల వరకు ఉత్పత్తి అవుతుంటాయి. ♦ డెంగీ జ్వరం వచ్చిన వారిలో వైరస్ కారణంగా, రక్తంలో కాంప్లిమెంట్ అనే పదార్థం యాక్టివేట్ అవడం వల్ల ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. ♦ యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ బాడీస్ వృద్ధి చెందడం వల్ల ఉత్పత్తి అయిన ప్లేట్లెట్లు క్షీణించిపోతాయి. దీంతో ఉత్పత్తి తగ్గడం, ఉన్న ప్లేట్లెట్స్ క్షీణించడంతో రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గి దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. ♦ కొన్ని రకాల యాంటిబయోటిక్స్ వినియోగం వల్ల కూడా బోన్మ్యారోపై ప్రభావం చూపి ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల దుష్పరిణామాలు ♦ రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల విపరీతమైన వెన్నునొప్పి, తలనొప్పి, చర్మం లోపల దద్దుర్లు, కాలేయం, ప్లీహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ♦ రక్తంలో అతి చిన్న గడ్డలు ఏర్పడతాయి. ఈ దశలో ఒక్కసారిగా ప్లాస్మా బయట ఉన్న కనెక్టివిటీస్లోకి లీక్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి కణానికి రక్తం అందుబాటులో ఉండదు. అందువల్ల మనుషులు మరణిస్తారు. డెంగీ వచ్చిన అందరిలో ప్లేట్లెట్స్ తగ్గవు డెంగీ వచ్చిన అందరిలో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశాలు లేవు. 95 శాతం మందిలో సాధారణంగానే డెంగీ తగ్గిపోతుంది. ఎవరిలో ప్లేట్లెట్స్ తగ్గుతాయనేది చెప్పలేం. కొందరిలో జ్వరం వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మరికొందరిలో వారం రోజులకు తగ్గుతాయి. కొందరిలో ఒకటి, రెండు రోజులు తగ్గి, మళ్లీ అవే రికవరీ అయిపోతాయి. అందువల్ల ఎవరికీ ప్రమాదంగా మారుతుందో చెప్పలేము. ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండేందుకు మందులు లేవు. తగ్గినప్పుడు కృత్రిమంగా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడమే పరిష్కారం. – డాక్టర్ ఎన్.భరత్రావు, పెథాలజీ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల -
తిమింగలాన్ని చంపిన ప్లాస్టిక్ స్పూన్..
చెన్నై: పాంబన్ సముద్రతీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం మృతదేహాన్ని కోసి చూసిన జాలర్లు దాని పొట్టలో కనిపించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయారు. రామేశ్వరం సమీపంలోని సముద్ర తీరంలో గురువారం సాయంత్రం 18 అడుగుల నాలుగు టన్నుల బరువు గల భారీ తిమింగలం మృతి చెంది ఒడ్డుకు చేరింది. దానిని కోసి అటవీ శాఖ, వెటర్నటీ వైద్యులు పరీక్షలు జరిపారు. పొట్టలో పేగుల మధ్య ప్లాస్టిక్ స్పూన్ ఇరుక్కుంది. ఈ కారణంగానే తిమింగలం మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అనంతరం దాన్ని జేసీబీతో సముద్ర తీరంలో పెద్ద గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ముఖ్యంగా సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లే భోజన పదార్థాలు తిని, అనంతరం వాటిని సముద్రంలోకి విసిరి వేస్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు వంటివి విసిరివేయడం చేస్తున్నారు. వాటిని ఆహారంగా తీసుకున్న సముద్ర చరాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు, వాటిని తినే ప్రజలకు పలు రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను సముద్రంలోకి విసర వద్దని జాలర్లకు వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆర్ట్స్ కళాశాలలో ప్లాస్టిక్ బియ్యం కలకలం
కళాశాల వద్ద విద్యార్థుల ధర్నా భోజనంలో నాణ్యత లోపించిందంటూ ఆరోపణ ప్రిన్సిపల్, వార్డన్‌ను సస్పెన్షన్‌కు డిమాండ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు గురువారం ఆకలికేకలు పెట్టారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారంటూ కళాశాల, హాస్టల్‌తో పాటు టవర్‌క్లాక్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. వందలాది మంది విద్యార్థులు భోజనం తినకుండా ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు. భోజనం నాణ్యతపై ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మరుగుదొడ్లు చాలడం లేదని, ఉన్న మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్, వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. విద్యార్థులతో డీఎస్పీ చర్చలు జరిపారు. స్వయంగా హాస్టల్‌కు వెళ్లి భోజనం రుచి చూశారు. అన్నం చేయడానికి వాడుతున్న బియ్యంపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వచ్చి భోజనాన్ని పరిశీలించారు. శాంపిల్ తీసుకుని పరిశీలనకు ల్యాబ్‌కు పంపుతామని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని యాజమాన్యానికి డీఎస్పీ సూచించారు. -
కొండంత పెరిగిపోయిన ప్లాస్టిక్...
ప్లాస్టిక్.. మనిషికి ప్రియమైన శత్రువు అని దీనికి పేరు. పర్యావరణ కష్టాలున్నాయని తెలిసినా వాడకుండా ఉండలేకపోవడం దీనికి కారణం. 1950లలో తొలిసారి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి మొదలైనప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. 1950లలో కేవలం 20 లక్షల టన్నుల ప్లాస్టిక్ మాత్రమే ఉండగా.. 2017 వచ్చేసరికి ఇది 40 కోట్ల టన్నులకు చేరింది. 2017 వరకూ మనిషి తయారు చేసిన మొత్తం ప్లాస్టిక్ బరువు 830 కోట్ల టన్నులు. ఇది వంద కోట్ల ఏనుగుల (ఒక్కొక్కటీ 7.6 టన్నుల బరువు అనుకుంటే) ఉమ్మడి బరువుతో సమానం. ఈఫిల్ టవర్‌లో వాడిన ఇనుము బరువుకు 8,22,000 రెట్లు ఎక్కువ. జార్జియా యూనివర్సిటీ జరిపిన ఒక అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకం, రీసైక్లింగ్లపై సమగ్ర అంచనాను ఇచ్చింది. ఆ వివరాలు.. వాడకం ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ... 3400 కోట్ల టన్నులు 2017 వరకూ.. మొత్తం ఉత్పత్తి 830 కోట్ల టన్నులు చెత్తగా మిగిలింది 630 కోట్ల టన్నులు రీసైకిల్ చేసింది 9 శాతం మాత్రమే తగులబెట్టింది 12 శాతం చెత్తకుప్పల్లోకి చేరి కాలుష్యం కలిగిస్తున్నది 79 శాతం! 2010 నాటి లెక్కల ప్రకారం.. సముద్రాల్లోకి చేరి జలచరాల ప్రాణాలు తీసేస్తున్న ప్లాస్టిక్ చెత్త ఎంతో తెలుసా...? 80 లక్షల టన్నులు! -
జనగామలో ప్లాíస్టిక్ బియ్యం కలకలం
ఎగిరి పడుతున్న అన్నం ఉండలు భోజనం చేసిన కుటుంబ సభ్యులకు అస్వస్థత జనగామ: జనగామలో ప్లాస్టిక్ బియ్యం గురువారం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలో అమ్మకాలు వెలుగులోకి రావడం సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు సమీపంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకు ఎదురుగా నివాసముంటున్న కంతి శివశంకర్ రెండు రోజుల క్రితం ఎల్జీ కంపెనీకి చెందిన 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి ఆయన భార్య చందన అన్నం వండగా కొత్త రకమైన వాసన రావడంతో అనుమానం కలిగింది. భర్తతో పాటు ఎల్కేజీ చదువుకుంటున్న కుమారుడికి వడ్డించింది. అదే రోజు రాత్రి కుమారుడు వాంతులు చేసుకోగా ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అనుమానం వచ్చిన శివశంకర్ పరిశీలి ంచగా ప్లాస్టిక్ బియ్యంగా అనుమానించాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపడంతో భోజనాన్ని ముద్దలుగా తయరు చేసి నేలకు కొట్టడంతో బంతుల్లాగా పైకి ఎగిరి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టపక్కల కాలనీవాసులు తమ ఇంట్లో నిల్వ ఉన్న బియ్యాన్ని అనుమానంగా పరిశీలించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శివశంకర్ తెలిపాడు. కాగా జనగామలో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక రైస్ లేక పాలిషింగ్ చేసిన బియ్యమా నిజానిజాలు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్లాస్టో బ్రాండ్ అంబాసిడర్‌గా హృతిక్ రోషన్
హైదరాబాద్: దేశీ ప్రముఖ వాటర్ ట్యాంకులు, పైపుల తయారీ కంపెనీ ‘ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్’ తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇక నాగ్‌పూర్‌లోని ప్లాస్టో ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ట్యాంక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అవతరించిందని కంపెనీ పేర్కొంది. ఈ యూనిట్లో 2016–17లో మొత్తంగా 60 కోట్లకు పైగా లీటర్ల వాటర్ ట్యాంక్‌లను తయారు చేసినట్లు తెలిపింది. కాగా ప్లాస్టో కంపెనీ 225 లీటర్లు నుంచి 10,000 లీటర్ల సామర్థ్యంలో 3, 4 లేయర్ ట్యాంక్‌లను, పైపులను తయారు చేస్తుంది. హృతిక్ రోషన్‌ను ప్లాస్టో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ఆనందంగా ఉందని కంపెనీ డైరెక్టర్లు నీలేశ్ అగర్వాల్, విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
పద్మావతి... ఏమిటీ దుర్గతి !
కృష్ణా పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పద్మావతి ఘాట్‌ను అద్భుతంగా తయారు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే, పది నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. పద్మావతి ఘాట్ ఇప్పుడు డ్రెయినేజీ కన్నా అధ్వానంగా తయారైంది. భక్తులు స్నానమాచరించాల్సిన ప్రాంతం మురికికూపంగా మారింది. మెట్ల పైన, దిగువన ప్లాట్‌ఫాం మీద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి పెద్దదైన ఈ ఘాట్‌ను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. – ఫొటోలు : విజయకృష్ణ, సాక్షి, విజయవాడ -
ప్లాస్టిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం
జగిత్యాల: ప్లాస్టిక్ గోడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగిత్యాల శ్రీరాంనగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
వ్యర్థం.. అనర్థం
ఒక ప్లాస్టిక్ బాటిల్ నలిపి పారేస్తాం.. ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడి పారేస్తాం..కానీ మనం అనుకుంటున్న ఆ ఒక్క ప్లాస్టిక్ బాటిల్.. ఆ ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్.. ఒకట్లు పదులవుతున్నాయి.. వందలు వేలవుతున్నాయి.. లక్షలు కోట్లవుతున్నాయి.. అటు వాటిని రీసైక్లింగ్ చేసే యూనిట్ల పరిస్థితీ అంతంత మాత్రంగా ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. సాక్షి, అమరావతి: గత నాలుగైదేళ్లలో తెలంగాణ, ఏపీలో ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల పెరిగిపోతోంది. దీంతో వేలాది మంది జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్లాస్టిక్ చెత్త విడుదల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ వ్యర్థాన్ని నిర్వీర్యం లేదా రీసైక్లింగ్ చేసేందుకు తగిన వ్యవస్థలు లేకపోవడం, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారింది. గతంలో ప్లాస్టిక్ వాడొద్దు.. పేపర్ బ్యాగ్‌లు వాడాలని ప్రచారం చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నియంత్రణకు చర్యలేవీ? 2011లో 1.40 లక్షల టన్నులున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు 2.43 లక్షల టన్నులకు చేరాయి. చెత్త సేకరణ చేసి సకాలం లో నిర్వీర్యం చేసే పరిస్థితి లేదు. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో వివిధ ఆస్పత్రుల నుంచి వెలువడే బయోమెట్రిక్ వ్యర్థాల నిర్వీర్యం కూడా సరిగా జరగడం లేదని తేలింది. అమలుకాని నిబంధనలు.. ప్లాస్టిక్ వినియోగంపై నిబంధనలు అమలు కావడంలేదు. 50 మైక్రాన్ల బ్యాగుల కంటే తక్కువ మందం ఉన్న బ్యాగుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో నిబంధనలు విధించింది. ఆస్పత్రుల్లో విడుదలవుతున్న బయో వ్యర్థాలపైన కూడా ఆంక్షలు విధించింది. ఎక్కడైతే బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయో వాటి నిర్వీర్యంలో కూడా ఆ సంస్థలే ప్రధానంగా బాధ్యత వహించాలని సూచించారు. కానీ ఈ నిబంధనలు తెలుగు రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వచ్చే భయానక జబ్బులు - ఆడవాళ్లలో పునరుత్పత్తి ప్రక్రియ(సంతానోత్పత్తి)కు విఘాతం.. వ్యాధి నిరోధకత భారీగా తగ్గుతుంది - కేన్సర్ వ్యాధికారకాలు పెరిగి వ్యాధి బారిన పడే అవకాశం - సెక్స్ హార్మోన్లు క్రమంగా తగ్గుతాయి - గుండె జబ్బులు రావడానికి కూడా దోహదం కేరళను చూసి నేర్చుకోవాల్సిందే ప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తి, వాటి నిర్వీర్యం,రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి వాటిలో దేశంలోనే కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. కేరళలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 50 వేల టన్నులు వీటిని నిర్వీర్యం,రీసైక్లింగ్ చేయడానికి ఉన్న యూనిట్లు 807 2.43(లక్షల టన్నులు) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యేటా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 67 రెండు రాష్ట్రాల్లో కలిపి రీసైక్లింగ్ యూనిట్లు.వీటిలో కొన్ని పనిచేయడంలేదు -
ప్లాస్టిక్ లంచ్ బాక్సులతో అనర్థాలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు: 3,295 ప్రాథమికోన్నత పాఠశాలలు: 500 ఉన్నత పాఠశాలలు: 610 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు: 3.45 లక్షలు (వివరాలు 2016–17 నాటివి) నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇదే తరుణంలో బడికి వెళ్లే పిల్లల ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకెళ్లే లంచ్ బాక్సులతో మొదలు.. బయట కొనిపెట్టే ఇతర తిండి పదార్థాల వరకూ అన్నింటా ఎన్నో సమస్యలు అంటిపెట్టుకుని ఉన్నాయి. లంచ్ బాక్సులను సరిగ్గా శుభ్రం చేయకుండా ఆహార పదార్ధాలు ఉంచితే, ఆహారం విషతుల్యమై వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. - గుమ్మఘట్ట ప్యాకింగ్ పదార్థాలు వద్దు బడికి వెళ్లే పిల్లలకు సాధ్యమైనంత వరకూ ఇంటిలో తయారు చేసిన పదార్థాలనే ఇస్తే బాగుంటుంది. హోటళ్ల నుంచి తెప్పించి లంచ్ బాక్స్‌లో సర్ది ఇవ్వడం మంచిది కాదు. పిల్లలు తినే సమయానికి అవి పాడైపోతుంటాయి. దీని ఫుడ్‌పాయిజన్ అవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల అందులో ధూళి చేరి పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. ప్లాస్టిక్ బాక్స్‌ల్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్‌లకు రసాయనిక రంగులు వాడుతుంటారు. అంతేకాదు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటే సూక్ష్మజీవులు చేరేందుకు అవకాశం ఉంది. ఫలితంగా ఆహారం విషతుల్యమవుతుంది. హాట్‌బాక్స్‌లు లేదా స్టీల్ బాక్స్‌ల్లో ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లంచ్ బాక్స్‌లు ఇలా.. పిల్లలకు ఆహారాన్ని అందించే లంచ్ బాక్స్‌లు నాణ్యమైనవిగా ఉండాలి. రసాయనిక రంగులు వాడిన బాక్స్‌లు వద్దు. పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించండి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా చైతన్య పరచండి. తొలివిడతగా పది లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. మరో పది లక్షల పుస్తకాలు ఒకటిరెండ్రోజుల్లో రానున్నాయి. – లక్ష్మినారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం శుభ్రం అవసరం వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నిర్లక్ష్యం చేయకూడదు ఈగలు, దోమలు పెరిగి ఇళ్లలో ఉండే ఆహార పదార్ధాలపై చేరుతాయి. వీటిని పిల్లలకు అందించడం వల్ల పలు రకాల జబ్బుల బారిన పడతారు. పిల్లల పట్ల ప్రత్యే శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యుడు, రాయదుర్గం -
విజ్ఞానం పేరుతో విధ్వంసం
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని, ప్లాస్టిక్ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో కాకతీయ వర్సిటీ పరిశోధనా విద్యార్థులు రూపొందించిన ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘సమూలంగా ఒక జాతిని ఏ జీవీ చంపదని.. ప్లాస్టిక్ బియ్యం తింటే మానవ జాతి మనుగడ ఉంటుందా? సమాజం ఎటు పోతోందని ప్రశ్నించారు. నా జీవితంలో ఇద్దరు కాల జ్ఞానులను చూశానని, ఒకరు జయశంకర్ కాగా, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలొనే అనుకున్నాం. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఒక వైవిధ్యమైన ఉద్యమం’అని స్పీకర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని తెచ్చిన ప్రొ.భాస్కర్‌ను ఆయన అభినందించారు. -
రేషన్ షాపులో ప్లాస్టిక్ బియ్యం
శ్రీరామనగర్: కొప్పళ జిల్లాలోని ఒక చౌక దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం ఇచ్చారని లబ్ధిదారులు గొడవకు దిగారు. గంగావతి తాలూకా శ్రీరామనగర్ గ్రామంలోని 6వ వార్డులో ఉన్న చౌకడిపోలో గురువారం అన్నభాగ్య పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం బస్తాలలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు కలకలం రేగింది. చౌకడిపోలో బియ్యం తీసుకెళ్లిన కొందరు ఇంట్లో యథావిధిగా వండి చూశారు. అన్నంలో ఏదో తేడా రావడంతో ఇది ప్లాస్టిక్ బియ్యమే అయి ఉంటుందని చెప్పారు. అలాగే మరో గ్రామస్తుడు కూడా ఈ బియ్యం వండి చూడగా ప్లాస్టిక్ వాసన వస్తోందని తెలిపాడు. దీంతో ప్రజలు బియ్యం తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షలకు బియ్యం నమూనాలు ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులను ప్రజలు, మీడియా ప్రశ్నించగా, బియ్యం నాణ్యతను పరిశీలించడానికి శ్యాంపిల్‌ను సేకరించి జిల్లా కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ప్లాస్టిక్ బియ్యంను సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్లాస్టిక్ బియ్యం లేవు
విజయవాడ : బియ్యంపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రద్దు చేయాలని ఏపీ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బియ్యంపై 5 శాతం పన్ను విధించడం సరికాదన్నారు. ఆహార ధాన్యాలపై జీఎస్టీ విధించబోమని చెబుతూనే దొడ్డిదారిన బియ్యంపై పన్ను విధించారని మండిపడ్డారు. బ్రాండెడ్ వెరైటీలకు మాత్రమే పన్ను విధిస్తున్నట్లు చెబుతున్నారని, దీనివల్ల ప్రజలు బ్రాండెడ్ వెరైటీలు ఏవో తెలుసుకోలేక అయోమయానికి గురవుతారన్నారు. సాధారణ రకాలను బ్రాండెడ్ వెరైటీలుగా చూపించి ప్రజలను మోసగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రైస్ ఓ అభూతకల్పనని కొట్టిపారేశారు. ప్లాస్టిక్ రైస్ తయారీ సాధ్యం కాదన్నారు. ఇంతవరకు ప్లాస్టిక్ రైస్ తయారు చేసే మెషినరీ ఏదీ అందుబాటులో లేదని స్పష్టం చేశారు. దేశమంతటా. «వరి ధాన్యం ఉత్పత్పి సరిపడినంత ఉండగా ప్లాస్టిక్ రైస్ తేవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ రైస్ ఉన్నాయని నిరూపిస్తే ఒక్కో క్వింటాల్‌కు రూ. 50వేల చొప్పున అసోసియేషన్ తరపున పారితోషం అందజేస్తామని ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు వీరయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, కో ఆర్డినేటర్ షేక్ బాజీ పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ వస్తువా..?
⇒ 28 శాతం స్లాబ్‌లోకి ఎలా చేరుస్తారు ⇒ చిన్న కంపెనీలు మూతపడతాయి ⇒ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదార్ల సంఘం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ వస్తువుల జాబితాలోకి ప్లాస్టిక్ కుర్చీలను చేర్చడాన్ని ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీదారుల సంఘం తప్పుపట్టింది. జీఎస్టీ కౌన్సిల్ ప్లాస్టిక్ కుర్చీలపై 28 శాతం పన్ను రేటు నిర్ణయించింది. వీటిని హౌస్‌హోల్డ్ వస్తువుల జాబితాలోకి చేర్చడం ద్వారా 18 శాతం పన్ను స్లాబులోకి తేవాలని సంఘం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ కంపెనీలు 5 శాతం వ్యాట్, 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాయి. దేశంలో 60 శాతం చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయి. ప్లాస్టిక్ కుర్చీలపై పన్ను 28 శాతముంటే పరిశ్రమలో ఈ తయారీ కంపెనీలు మనలేవని సంఘం ప్రెసిడెంట్ కె.పి.రవీంద్రన్ తెలిపారు. ‘పెద్ద బ్రాండ్లు ఎంత ధర పెట్టినా కస్టమర్లు కొంటారు. చిన్న కంపెనీలు స్వల్పంగా ధర సవరించినా కొనేవారుండరు. రీసైక్లింగ్ ప్లాస్టిక్ తయారీలో ఉన్న యూనిట్లకు ఇప్పటి వరకూ పన్ను మినహాయింపు ఉంది. ఎస్ఎస్ఐ యూనిట్లకు ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇది భారత పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుంది’ అని తెలిపారు. చైనా దిగుమతుల వెల్లువ..: ప్రభుత్వం పన్ను సవరించకపోతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని సంఘం కార్యదర్శి సుశీల్ అగర్వాల్ అన్నారు. సామాన్యులు వాడే ప్లాస్టిక్ కుర్చీ లగ్జరీ ఎలా అయిందో అర్థం కావడం లేదన్నారు. ‘భారత కంపెనీ ఒక ఉత్పాదనను రూ.100కు విక్రయిస్తే, అదే ఉత్పాదనను చైనా కంపెనీ రూ.60కే ఇక్కడ ప్రవేశపెడుతుంది. దీంతో చైనా ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడతాయి. ఇక్కడి కంపెనీలు మూతపడక తప్పదు. మౌల్డెడ్ ప్లాస్టిక్ తయారీ రంగంలో 200 కంపెనీలున్నాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 40 దాకా ఉంటాయి. 20,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. పరిశ్రమ పరిమాణం రూ.300 కోట్లు. ఇందులో ప్లాస్టిక్ చైర్ల విక్రయాలు 80%. అందుకే జీఎస్టీ ప్రభావం ఎక్కువ’ అని చెప్పారు. ముడి ప్లాస్టిక్‌పై 18% జీఎస్టీ ఉందని సంఘం హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉపేందర్ గుప్తా తెలిపారు. -
జోరుగా ప్లాస్టిక్ బియ్యం దందా!
మీర్పేట్లో వెలుగుచూసిన ఘటన.. రంగంలోకి అధికారులు హైదరాబాద్: ప్రజారోగ్యం వీధిన పడింది. వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. నగరంలోని ఓ దుకా ణాదారు ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బియ్యాన్ని విక్రయిస్తున్న వైనం మంగళవారం వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్మన్ ఘాట్ డివిజన్లోని నందనవనంలో రాకేశ్ చౌదరి అనే వ్యక్తి దుర్గా జనరల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాడు. అక్కడే నివాసముంటున్న అశోక్.. రాకేశ్ చౌదరి దుకాణంలో నెల క్రితం బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యాన్ని వినియోగిస్తున్నప్పటినుంచీ అనారోగ్యం బారిన పడుతుండటంతో అశోక్‌కు బియ్యంపై అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం ఆ బియ్యంతో వండిన అన్నాన్ని ముద్దగా చేసి గోడకు కొట్టడంతో అది బంతిలా తిరిగొచ్చింది. దీంతో ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యమేనని నిర్ధారించు కున్న అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు కూడా సమాచారమివ్వగా దుర్గా జనరల్ స్టోర్స్‌తో పాటు ఆ ప్రాంతంలోని మిగతా కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి బియ్యం నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. అశోక్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీశైలంలో ప్లాస్టిక్ బియ్యం ?·
- అనుమానంతో కిరాణం షాపుల్లో పోలీసుల తనిఖీలు శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యాన్ని అమ్ముతున్నారని కొందరు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ ఎస్ఐ వరప్రసాద్ తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం తనిఖీలు చేశారు. స్థానిక మల్లికార్జునసదన్లోని ఒక దుకాణంలో కొన్న బియ్యం తినడం వల్ల అనారోగ్యం కలిగిందని స్థానిక వినియోగదారుడు ఒకరు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారని ఎస్ఐ తెలిపారు. దీంతో ఆ దుకాణంలో తనిఖీలు చేశామని, అయితే అప్పటికే వారి వద్ద ఉన్న బియ్యం బస్తాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నిర్ణారణ కోసం బియ్యాన్ని కాల్చి చూశామని తెలిపారు. ఫిర్యాదు దారుడు తెచ్చిన వండిన అన్నాన్ని కూడా పరిశీలించామని, అవి పంపిణీ చేసిన డీలర్‌ను సోమవారం పిలిపించి విచారణ చేస్తామని అన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ వేస్టేజ్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. -
ఆమ్లెట్ వేస్తే....ప్లాస్టిక్ బయటకు వచ్చింది..
-
ఆమ్లెట్ వేస్తే....ప్లాస్టిక్ బయటకు వచ్చింది..
కోల్‌కతా: ప్లాస్టిక్ రైసే కాదు...ప్లాస్టిక్ ఎగ్స్ కూడా మార్కెట్లో వచ్చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ప్లాస్టిక్ కోడిగుడ్ల విక్రయం కలకలం రేపుతోంది. ఓ మహిళకు ప్లాస్టిక్ కోడిగుడ్లు విక్రయించిన ఓ దుకాణదారుడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. కోల్‌కతాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో దుకాణదారుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పార్క్ సర్కస్ మార్కెట్ వద్ద షమీమ్ అన్సారీ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద గురువారం సాయంత్రం అనిత కుమార్ అనే మహిళ కోడిగుడ్లు కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లాక వాటితో ఆమ్లెట్ వేసేందుకు గుడ్డును పెనం మీద వేయగానే, ప్లాస్టిక్‌లాగే గట్టిపడింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె ... అగ్గిపుల్లతో ఆ గుడ్డును వెలిగించగా, మంటలు వచ్చాయి. గుడ్డు పై పెంకు కూడా ప్లాస్టిట్‌లా ఉండటంతో, అది సహజమైన కోడిగుడ్డు కాదని నిర్థారణకు వచ్చిన ఆమె కరయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుకాణదారుడిని అదుపులోకి తీసుకుని, దుకాణంలోని కోడిగుడ్లను సీజ్ చేశారు. కాగా అన్సారీ ఆ గుడ్లను రూ.1.15 లక్షలకు హోల్‌సేల్ గా కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపాడు. అలాగే ఈ గుడ్లు సరఫరా చేస్తున్న హోల్ సేల్ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. -
రూ.10 ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 ప్లాస్టిక్ నోట్ల ప్రింట్కు తన అనుమతిని ఆర్బీఐకి చేరవేసింది. ఆర్బీఐ దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్ల వాడకంపై ట్రయల్స్ నిర్వహించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మనం ఉపయోగించే నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. -
వేస్ట్‌తో బెస్ట్ రోడ్లు
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అనే సామెతకు సూపర్ ఉదాహరణ ఈ వినూత్న టెక్నాలజీ. ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతోందని... ఫలితంగా అనేక పర్యావరణ నష్టాలు జరుగుతున్నాయని ఒకవైపున మనం ఎంతో బాధపడుతున్నామా?... రోడ్డు ఎక్కితే చాలు.. గతుకులు కనిపిస్తూ వాహనం నడుపుతూ వెన్ను విరగ్గొట్టుకుంటున్నామా? నెదర్లాండ్స్‌లోని ఓ కంపెనీ ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని ఆవిష్కరించింది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఈ కంపెనీ ప్లాస్టిక్ రోడ్లను అభివృద్ధి చేసింది. ఆ... ఇందులో ఏముంది గొప్ప... ఆ మధ్య బెంగళూరులో... ఆ తరువాత హైదరాబాద్‌లోనూ ఇలాంటివి వేస్తున్నామన్న వార్తలు వచ్చాయి కదా... అనకండి. వోల్కర్ వెస్సెల్స్ కంపెనీ ప్లాస్టిక్ రోడ్లు చాలా డిఫరెంట్! ముందుగా చెప్పుకోవాల్సింది... ఈ రోడ్లను అక్కడికక్కడ వేసేయరు. ఫ్యాక్టరీలో తయారు చేసిన ముక్కలను కావాల్సిన చోట్ల అతితక్కువ సమయంలో పేర్చి, అతుకు పెడతారు అంతే. గతుకులు పడితే రోడ్డు మొత్తం తవ్వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ భాగాన్ని మాత్రమే తీసివేసి కొత్తది వేయవచ్చు. ఇక రెండో ప్రత్యేకత... ఈ రోడ్ల లోపలి భాగం డొల్లగా ఉంటుంది. ఫలితంగా చిన్న చిన్న వానలు వచ్చినా నీళ్లు రోడ్లపై కాకుండా ఈ డొల్ల భాగంలో నిలిచి... ఆ తరువాత నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతాయన్నమాట. లోపల డొల్లగా ఉంటే వాహనాల బరువును తట్టుకోగలదా? అని అనుకోవద్దు. సాధారణ రోడ్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ దృఢంగా ఉంటుందని పరీక్షలు నిరూపిస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో ఉన్న పరిస్థితులకు సరిపోతుందేమో అనేది కూడా అపోహే అంటోంది వోల్కర్ వెస్సెల్స్. ఈ రోడ్లు 80 డిగ్రీ సెల్సియస్ వేడిని కూడా తట్టుకోగలవు. వీటితోపాటు... రోడ్డు లోపలి డొల్ల ప్రాంతాన్ని వాడుకుంటూ కేబుల్స్, నీటిపైపులు సులువగా బిగించుకోవచ్చు, అవసరమైనప్పుడు మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రహదారులను నెదర్లాండ్స్‌లో పరీక్షిస్తున్నారు. ఇలాంటివి మనదగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? నిజమే... చాలా బాగుంటుంది. చూద్దాం మరి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సముద్రాల కాలుష్యం వీటి వల్లే..
జెనీవా: టైర్లు, కృత్రిమ (సింథటిక్) వస్త్రాల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే సముద్రాల్లో అధిక భాగం కలుషితం అవుతుందని తాజా నివేదికలో వెల్లడైంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. గృహాలు, పరిశ్రమల నుంచి విడుదలయ్యే మైక్రోప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో 30 శాతం మేర నీరు కలుషితం అవుతుందని పేర్కొంది. ఇది భవిష్యత్‌లో పెను ముప్పుగా మారనుందని హెచ్చరించింది. ప్రతి ఏటా 9.5 మిలియన్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి విడుదలవుతుండగా, వీటిలో రెండింట మూడొంతులు టైర్లు, కృత్రిమ బట్టల నుంచి వచ్చే వ్యర్థాలే ఉన్నాయని తెలిపింది. -
ఈ ప్లాస్టిక్‌ను ఇలా తాగొచ్చు
బాలి: ఇండోనేషియా ద్వీపకల్పానికి మణిహారం బాలి దీవి. సుందరమైన బీచ్‌లతో కళకళలాడుతూ ఉండే ఇక్కడి బీచ్‌లు ప్యాస్టిక్ బాటిళ్లు, బ్యాగులతో కంపుకొడుతున్నాయి. ప్రపంచంలోనే చైనా తర్వాత, ఇండోనేషియానే ఎక్కువ ప్లాస్టిక్‌ను తీసుకొచ్చి నేరుగా సముద్రంలో పారేస్తోంది. అది ఎక్కువగా బాలి బీచ్‌లకే కొట్టుకొస్తోంది. ప్లాస్టిక్ గాలిలో కలిసిపోదు, మట్టిలో కుళ్లిపోదు. వాటిని తిన్న జంతువులు, జలచరాలు మత్యువాతన పడుతున్నాయి. మరి ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం ఏమిటీ? ప్రపంచంలో ముందుగా కోలుకున్న పలు దేశాలు ప్లాస్టిక్ ఉపయోగాన్ని ఇప్పటికే నిషేధించాయి. ‘బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు అమ్మాయిల విస్తృత ప్రచారం కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం 2018 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. నిషేధంకన్నా ప్రత్యామ్నాయమార్గం ముఖ్యమని భావించిన బాలికి చెందిన కెవిన్ కుమాల్ అనే యువకుడు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించారు. స్వతహాగా బయోకెమిస్ట్రీ చదివిన కుమాల్ ఇండేనేసియాలో దొరికే కసావా లాంటి కూరగాయ దుంపలతో, కూరగాయల నూనె, సేంద్రీయ పదార్థాలను కలిపి బయో ప్లాస్టిక్‌ను తయారు చేశారు. దాన్ని ద్రావకంగా తాగడం ద్వారా అందులో ఎలాంటి విషపదార్థాలు లేవని నిరూపించారు. ఆ ద్రావకంతో బ్యాగులను తయారు చేసి అవి మట్టిలో కలసిపోగలవని ధ్రువీకరించారు. ఓ మిత్రుడితో కలసి ‘అవాని ఎకో’ బయోప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తిని ప్రారంభించారు. వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఆర్థిక వనరులు అవసరమయ్యాయి. అందుకు ‘బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్’ సంస్థ ఎంతో సహకరించింది. విరాళాలను సేకరించి అందజేసింది. అంతేకాకుండా సంస్థ తరఫున పెద్ద ఎత్తున ఈ బ్యాగులను కొనుగోలు చేస్తోంది. ఇండోనేసియా ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చింది. మామూలు ప్లాస్టిక్ బ్యాగులకన్నా రెట్టింపు ధర ఉండడంవల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వీటిని కొనేందుకు ముందుకు రావడం లేదని, ఈ విషయంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేయాలని కుమాల్ కోరుతున్నారు. బయోప్లాస్టిక్‌ను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని కుమాల్ భావిస్తున్నారు.