తేలికైన ప్లాస్టిక్ కార్లు వస్తున్నాయ్!
బెర్లిన్: త్వరలో బరువు తక్కువగా ఉండే తేలికైనా ప్లాస్టిక్ కార్లు రానున్నాయి. ఇందుకోసం జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రొటోటైప్ ఇంజిన్ రూపొందించారు. ఇంజిన్లో కావాల్సిన ఇతర విడిభాగాలన్నింటిని ప్లాస్టిక్ తో తయారుచేశారు. దీంతో కారు బరువు అమాంతం తగ్గిపోనుంది. అంతేకాదు, వీటిద్వారా ఇంధన వినియోగం కూడా తగ్గనుందని వారు చెప్తున్నారు. జర్మనీలోని ప్రానోఫర్ ప్రాజెక్టు గ్రూప్ న్యూ డ్రైవ్ సిస్టమ్కు చెందిన అధ్యయనకారులు ఈ కొత్త పరికరాన్ని రూపొందించారు.
ఈ రోజుల్లో కార్లను తయారు చేస్తున్నవారంతా వీలయినంత మేరకు కారువు బరువు తగ్గించేందుకు అల్యూమినియాన్ని ఉపయోగిస్తున్నారని, ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఉండే చాంబర్లో వీటి వినియోగం ఎక్కువ అని చెప్పారు. ఇప్పుడు వాటి స్థానంలోనే అంతే సామర్థ్యంతో పనిచేసేలా కొత్త గా ధృఢపరిచిన ఫైబర్ ప్లాస్టిక్ను తాము రూపొందించినట్లు తెలిపారు. ఇది సాధరణంగా ఉండే బరువులో 20శాతం మాత్రమే పేర్కొన్నారు.