
పద్మావతి... ఏమిటీ దుర్గతి !
కృష్ణా పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పద్మావతి ఘాట్‌ను అద్భుతంగా తయారు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే, పది నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. పద్మావతి ఘాట్ ఇప్పుడు డ్రెయినేజీ కన్నా అధ్వానంగా తయారైంది.
భక్తులు స్నానమాచరించాల్సిన ప్రాంతం మురికికూపంగా మారింది. మెట్ల పైన, దిగువన ప్లాట్‌ఫాం మీద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి పెద్దదైన ఈ ఘాట్‌ను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది.
– ఫొటోలు : విజయకృష్ణ, సాక్షి, విజయవాడ