padmavathi ghat
-
పద్మావతి... ఏమిటీ దుర్గతి !
కృష్ణా పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పద్మావతి ఘాట్‌ను అద్భుతంగా తయారు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే, పది నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. పద్మావతి ఘాట్ ఇప్పుడు డ్రెయినేజీ కన్నా అధ్వానంగా తయారైంది. భక్తులు స్నానమాచరించాల్సిన ప్రాంతం మురికికూపంగా మారింది. మెట్ల పైన, దిగువన ప్లాట్‌ఫాం మీద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి దుర్భరంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతి పెద్దదైన ఈ ఘాట్‌ను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. – ఫొటోలు : విజయకృష్ణ, సాక్షి, విజయవాడ -
లోక కల్యాణార్థం హనుమాన్ చాలీసా మహాయజ్ఞం
విజయవాడ (ఆటోనగర్): నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వరంలో జనవరి 21వ తేదీన హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నట్లు పటమట దత్తపీఠం ఆశ్రమ ట్రస్ట్ తెలిపింది. దత్తపీఠం చీఫ్ కొల్లి గోపాలకృష్ణ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం రాజధాని కోసం, దేశ ప్రపంచశాంతి సౌభాగ్యాల కోసం దత్తపీఠ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశారని తెలిపారు. ఇప్పటికే గతేడాది తెనాలిలో సుమారు 3 లక్షల మందితో, అమెరికాలో 10వేల మందితో 24 గంటల పాటు చాలీసా మహాయజ్ఞాల్ని నిర్వహించారని అన్నారు. అనంత ఫలప్రదాయిని: సచ్చిదానంద స్వామీజీ అనంతరం కార్యక్రమంలో అంతర్జాలంలో స్కైప్ ద్వారా మైసూరు దత్తపీఠం నుంచి అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ విలేకరులను, భక్తులనుద్దేశించి సందేశాన్నందించారు. సామూహిక ప్రార్థన అనంత ఫలమని, నూతన రాష్ట్ర ప్రజల సంక్షేమం, లోక కళ్యాణార్థం ఈ హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని సంకల్పించామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణానదీ తీరంలోని పద్మావతి ఘాట్‌లో నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని హనుమాన్ ఆశీస్సులు పొందాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్ట్ పెందుర్తి రాధాకృష్ణ, సత్యనారాయణ, తుమ్మల శ్రీమన్నారాయణ, లీగల్ అడ్వైజర్ కెపి రమణ, నిర్మలా చౌదరి పాల్గొన్నారు. -
పద్మావతి ఘాట్‌లో పురోహితుల వివాదం
-
బాబోయ్ దొంగలు..
విజయవాడ (గుణదల) : నిరంతర నిఘా కెమెరాల సాక్షిగా పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాయమాటలు చెప్పి వారి వస్తువులు, నగలు, నగదు తీసుకుని ఉడాయిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు భక్తులు దొంగల బారిన పడ్డారు. బందరుకు చెందిన దివ్య తన చెవికమ్మెలు, ముక్కుపుడక బంగారు బిళ్లలను బ్యాగులో ఉంచి స్నానానికి వెళ్లి వచ్చేసరికి కనిపించలేదని కృష్ణలంక పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తూర్పుగోదావరికి తునికి చెందిన వెలగబాబ్జి తన బ్యాగులో పద్రపరచుకున్న మూడు తులాల బంగారు చైను, పర్సులో ఉన్న రూ.5000 కనిపించలేదని ఫిర్యాదు చేశారు. హైదాబాదుకు చెందిన గోపాలరావు ఘాట్ వద్ద పర్సు పోగొట్టుకున్నారు. అందులో రూ.5600 ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీజీ ఎన్వీ సురేంద్రబాబు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే ఘాట్ పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్చల్
విజయవాడ : కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్‌లో శనివారం దొంగలు హల్చల్ చేశారు. నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల దృష్టి మరల్చి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అలా వచ్చిన భక్తులకు చెందిన రూ. 4500, మూడు తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్ అపహరించుకుని పోయారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.